నారద ఉవాచ- నారదుడు ఈ విధముగా పలికెను-
కవచం కథితం బ్రహ్మన్పద్మాయాశ్చ మనోహరం।
పరం దుర్గతి నాశీన్యా కవచం కథయ ప్రభో ॥
పద్మాక్షి ప్రాణ తుల్యం చ జీవనం బలకారణం ।
కవచానాం చ యత్సారం దుర్గాసేవన కారణం॥
ఓ నారాయణమునీ! మహాలక్ష్మీ కవచమును ఇంతవరకు చెప్పిరి. ఇక దుర్గతినాశని యగు దుర్గాదేవి కవచమును నాకు చెప్పగలరు. ఇది పద్మాక్షునకు ప్రాణము వంటిది. బలమునకు కారణమైనది, కావున నాకు వివరింపుడని కోరెను.
నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-
శ్రుణు నారద వక్ష్యామి దుర్గాయాః కవచం శుభం।
శ్రీ కృష్ణనేవ యద్దత్తం గోలోకే బ్రహ్మణే పురా ॥
బ్రహ్మా త్రిపుర సంగ్రామే శంకరాయ దదౌ పురా ।
బమాన త్రిపురం రుద్రో యద్ధృత్వా భక్తిపూర్వకం ॥
హరో దదౌ గౌతమాయ పద్మాక్షాయ చ గౌతమః ।
యతో బభూవ పద్మాక్షః సప్తద్వీపేశ్వరో జయి॥
యద్ధృత్వా పఠనాద్రహ్మా జ్ఞానవాణ్ఛక్తిమాన్ భువి ।
శివో బభూవ సర్వజ్ఞో యోగినాం చ గురు ర్యతః॥
శివతుల్యో గౌతమశ్చ బభూవ మునిసత్తమః ॥
నారద! నీకిపుడు దుర్గాకవచమును చెప్పెదను, ఈ కవచమును. పూర్వకాలమున శ్రీకృష్ణుడు గోలోకమున బ్రహ్మదేవునకుపదేశించెను. త్రిపురాసుర సంహార సమయమున బ్రహ్మదేవుడు ఈ కవచమును శంకరునకీయగా శంకరుడీ కవచమును ధరించి త్రిపురాసురులను జయించెను. అటు పిమ్మట శంకరుడు దీనిని గౌతమ మహర్షికి ఉపదేశింపగా, గౌతమ మహర్షి పద్మాక్షుడను రాజునకుపదేశించెను. ఈ కవచము వలననే పద్మాక్షుడు సప్తద్వీపాధిపతి కాగలిగెను. అట్లే ఈ కవచము వలననే బ్రహ్మదేవుడు జ్ఞానమును, శక్తిని సంపాదించుకొనెను. ఆదేవిధముగా శంకరుడు సర్వజ్ఞుడై సమస్తయోగులకు గురువు కాగలిగెను. అట్లే ఈ కవచము వలన గౌతమ మహర్షి శంకరునితో సమానుడయ్యెను అని పలికెను.
బ్రహ్మాండ విజయస్యాఽస్య కవచస్య ప్రజాపతిః ।
ఋషిశ్చందశ్చ గాయత్రీ దేవి దుర్గతి నాశినీ ॥
బ్రహ్మాండ విజయే చైవ వినియోగః ప్రకీర్తితః ।
పుణ్యతీర్థం చ మహతా కవచం పరమాద్భుతం ॥
ఓం హ్రీం దుర్గతి నాశిన్యై స్వాహా మే పాతు మస్తకం।
ఓం హ్రీం మే పాతు కపోలం చాప్యోం హ్రీం శ్రీం పాతు లోచనే॥
పాతు మే కర్ణయుగ్మం చాప్యోం దుర్గాయై నమః సదా ।
ఓం హ్రీం శ్రీమితి నాసాం మే సదాపాతు చ సర్వతః ॥
హ్రీం శ్రీం హ్రమిత దంతాంశ్చపాతు క్లీ మోష్ఠయుగ్మకం ।
క్లీం క్లీం క్లీం పాతు కంఠంచ దుర్గే రక్షతు గండకీ ॥
స్కంధం మహాకాళి దుర్గే స్వాహా పాతునీరంతరం।
వక్షోవిపద్వినాశిన్యై స్వాహా మే పాతు సర్వతః ॥
దుర్గే దుర్గే రక్ష పార్యౌ స్వాహా నాభిం సదాభము ।
దుర్గా దుర్గే దేహి రక్షాం పృష్ఠం మే పాతు సర్వతః॥
ఓం హ్రీం దుర్గాయై స్వాహా చ హర్తా పాదౌ సదాఽవతు ।
ఓం హ్రీం దుర్గాయై స్వాహా చ సర్వాంగం మే సదాఽవతు ॥
ప్రాచ్యాం పాతు మహామాయా చాగ్నేయ్యాం పాతు కాళీకా ।
దక్షిణే దక్షికన్యా చ నైఋత్యాం శివసుందరీ॥
పశ్చిమే పార్వతి పాతు వారాహీ వాయవ్యాం సదా ।
కుబేరమాతా కౌబేర్యామైశాన్యాంమీశ్వరీ సదా ॥
ఊర్ధ్వం నారాయణీ పాతు త్వంబీకాఽధః సదాఽవతు।
జ్ఞానం జ్ఞానప్రదా పాతు స్వప్నం నీద్రా సదాఽవతు ॥
బ్రహ్మాండ విజయమను పేరుగల ఈ దుర్గాదేవి కవచమునకు ప్రజాపతి ఋషి గాయత్రి ఛందము ఛందస్సు దుఃఖములను పోగొట్టు దుర్గాదేవియే దేవత. లోకములందు విజయము సిద్ధించుటకై దీనిని ఉపయోగింపవలెను. అత్యద్భుతమైన మహాత్మ్యముగల ఈ కవచము మహిమలకు నిలయమైనది.
ఓం హ్రీం దుర్గతి నాశిన్యై స్వాహా అను మంత్రము నా శిరస్సును కాపాడుగాక. ఓం హ్రీం అను మంత్రము నా చెక్కిళ్లను, ఓం హ్రీం శ్రీం అనునది నా కండ్లను రక్షించుగాక!
ఓం దుర్గాయైనమః అను మంత్రము నా కర్ణములనెల్లప్పుడు రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం అను మంత్రము నా నాసికనెల్లప్పుడు రక్షించుగాక!
హ్రీం శ్రీం హ్రూం అను మంత్రము నా దంతములను, క్లీం అనునది నా పెదవులను రక్షించుగాక! క్లీం శ్రీం క్లీం అను మంత్రము నా కంఠమును దుర్గాదేవి సాగండభాగమును రక్షించుగాక!
మహాకాళీ దుర్గే స్వాహా అను మంత్రము నా స్కంధమును రక్షించుగాక! విపద్వినాశిన్యై స్వాహా అను మంత్రము నా వక్ష స్థలమును కాపాడుగాక!
దుర్గే దుర్గో రక్ష అను మంత్రము - పార్శ్వ భాగములను, దుర్గే దుర్గే స్వాహా అను మంత్రము నా నాభిని ఎల్లప్పుడు రక్షించుగాక!
దుర్గే దుర్గే రక్షాం దేహి అను మంత్రము నా పృష్టభాగమును రక్షించుగాక! ఓం హ్రీం దుర్గాయై స్వాహా అను మంత్రము నా చేతులను పాదముల రక్షించుగాక! ఓం హ్రీం దుర్గాయై స్వాహా అను మంత్రము నా సమస్తా వయవములను రక్షించుగాక!
మహామాయ నా తూర్పు దిగ్భాగమును, కాళిక ఆగ్నేయ దిగ్భాగమును, దక్షకన్య దక్షిణ దిగ్భాగమును, శివ సుందరి నా యొక్క నైఋతి దిగ్భాగమును, పార్వతి పశ్చిమ దిగ్భాగమును, వారాహి వాయవ్య దిగ్భాగమును, కుబేర మాత నా ఉత్తర దిగ్భాగమును, ఈశ్వరీ నా ఈశాన్య దిగ్భాగమును, నారాయణి నా ఊర్ధ్వ భాగమును, అంబిక నాయొక్క ఆధో భాగమును, ఎల్లప్పుడు కాపాడుగాక అట్లే జ్ఞాన ప్రదయగునాదేవి నాయొక్క జ్ఞానమును, నిద్రా స్వరూపిణి యగు నా జగన్మాత నా స్వప్నమును ఎల్లప్పుడు రక్షించుచుండుగాక.
ఇతి తే కథితం వత్స సర్వమంత్రాసు విగ్రహం ।
బ్రహ్మాండ విజయం నామ కవచం పరమాద్భుతం ॥
సుప్పాతః సర్వ తీర్దేషు సర్వయజ్ఞేషు యత్ఫలం ।
సర్వవ్రతోపవాసే చ తత్ఫలం లభతే నరః ॥
గురుమభ్యర్చ విధివద్వస్తాలంకార చందనైః ।
కండే వా దక్షిణే బాహా కవచం ధారయేత్తు యః॥
స చ త్రైలోక్య విజయీ సర్వ శత్రు సమర్ధకః ॥
నారదా! సమస్త మంత్ర స్వరూపమగు బ్రహ్మాండ విజయమను ఈ దుర్గా కవచమును నీకు చెప్పితిని. ఇది చాల మహిమ గలది.
గురువును శాస్త్ర పద్ధతి ననుసరించి వస్త్రము, అలంకారము, చందనము మొదలగు వానితో పూజించి ఈ కవచమును కంఠమున లేక దక్షిణ బాహువునందైన ధరించినచో సమస్త పుణ్యతీర్థములందు స్నానము చేసిన ఫలితము, సమస్త యజ్జములు చేసినందువలన కలుగు ఫలితము, సమస్త వ్రతములందు ఉపవాసము చేసినచో లభించు ఫలితము లభించును. ఈ కవచమును ధరించువాడు సమస్త శత్రువులను జయించి ముల్లోకముల జయించినవాడగును.
ఇదం కవచ మ జ్ఞాత్వా భజేద్దుర్గతి నాశినీం ।
శతలక్షం ప్రజ స్తోఽపి న మంత్రః సిద్ధి దాయకః॥
కవచం కాణ్వ శాఖోక్తముక్తం నారద సిద్ధిదం ।
యస్మై కస్మై న దాతవ్యం గోపవీయం సుదుర్లభం ॥
దుఃఖములను నాశనము చేయు ఈ దుర్గా కవచమును వదలి పెట్టి దుర్గా మంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము సిద్ధింపదు.
కాణ్వ శాఖయందు చెప్పబడిన ఈ కవచమును సమస్త సిద్దులనిచ్చును. అత్యంత రహస్యమైన ఈ కవచమును ఆర్హతలేనివాని కెట్టి పరిస్థితిలో చెప్పరాదు, అని నారాయణుడు నారదునకు చెప్పెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపశీఖండే నారద నారాయణ సంవాదే దుర్గతి వావి కవచం నామైకోన చత్వారింశత్తమోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదైన గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన దుర్గతి నాశినీ కవచమను ముప్పయి తొమ్మిదవ యధ్యాయము సమాప్తము.
Summary of chapter 39 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
With peace restored on Mount Kailāsa, Lord Śrī Kṛshṇa brought Parashurāma forward and instructed him to offer prostrate obeisances at the lotus feet of Goddess Pārvatī and Lord Gaṇeśa. Parashurāma fell to the ground in deep repentance, shedding tears of humility and seeking forgiveness for his impulsive wrath. Moved by his sincere surrender, Goddess Pārvatī forgave the warrior sage, while Lord Gaṇeśa affectionately embraced Parashurāma as a brother. Lord Śrī Kṛshṇa and Lord Gaṇeśa bestowed upon Parashurāma the boon of eternal fame, spiritual perfection, and final liberation, cementing a permanent bond of divine love among them.