బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

4 - పుణ్యక వ్రత విధానము

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదమునితో ఇట్లనెను-

 శ్రుత్వా వ్రతవిధానం చ దుర్గా సహృష్ట మానసా

సర్వమ్ వ్రతవిధానం చ సంప్రష్టు ముపచక్రమే

శంకరుడు పుణ్యకవ్రతమును చేయుమని చెప్పగా పార్వతీదేవి విని సంతోషముతో ఆవ్రతవిధానమును చెప్పుమని ఆడిగెను.

పార్వత్యువాచ- పార్వతీ ఇట్లు ఆనెను-

 సర్వం వ్రతవిధానం మాం వద వేదవిదార  వర

హే నాథ! కరుణాసింధో, దీనబంధో, పరాత్పర

కాని ప్రలో పయుక్తాని ద్రవ్యాణి చ ఫలాని చ

ననియమం సభక్ష్యం చ విధానం తత్సలం ప్రభో

దేహి మహ్యం వినీతాయై నియుక్తం సత్పురోహితం

పుప్పోపహారాన్ వీప్రాంశ్చ ద్రవ్యాహరణ కింకరాన్

అన్యాని చోపయుక్తాని మయాజ్జాతాని యానిచ

సన్నియోజయ తత్సర్వం ప్రీణాం స్వామీ చ సర్వదః

పితా కౌమారకాలేచ సదా పాలనకారకః

భర్తా మధ్యే సుతః శేషే త్రిధావస్థా సుయోషితాం

 తతో శోకః ప్రాణతుల్యాం దత్వా సత్స్వామినే సుతాం

 స్వామీ నిర్వతిమాప్నోతి సన్యస్య స్వసుతే ప్రియాం

బంధు త్రయయుతా యా స్త్రీ సా చ భాగ్యవతి పరా

కించిద్విహీనా మధ్యా చ సర్వహీనాధీమా భువీ

ఓమహాదేవా ఈపుణ్యకవ్రతమును ఎట్లు చేయవలెనో దయాసముద్రుడవు దీనబంధువు పరాత్పరుడవైన నీవు నాకు తెలుపుము, ఈవ్రతమున ఏద్రవ్యములు కావలెను, ఏఫలములు కావలెను, ఎట్టి భక్ష్యములు కావలెను. ఈవ్రతమును ఎట్లు చేయవలెను, దీని ఫలితమెట్లుండును, అను విషయములను నాకు చెప్పుము ఇంకను దీనికి ఫలితమెట్లుండును. అను విషయములను గురించి. బ్రాహ్మణుల గురించీ ఈవ్రతమున ఉపయోగించు వస్తువులు అన్నీటిని నాకు వివరించి తెలుపుము.

స్త్రీలకు భర్త అన్ని కోరికలను తీర్చును. ఆమెను చిన్నతనమున తండ్రి, పెళ్ళి అయిన తర్వాత భర్త, ఆతరువాత పుత్రుడు ఆమెను రక్షింతురు. మంచి స్త్రీలకు ఇట్టి రక్షణ ఉండును. తండ్రి తన ప్రాణముతో సమానమైన తన కూతురిని దుఃఖపడక మంచిభర్తకు ఇచ్చి సంతోషపడును. అట్లే ఆమెభర్త తన భార్యను తనపుత్రునకు అప్పగించి నిర్వృతి పొందుచున్నాడు. ఇట్లు తండ్రి, భర్త, పుత్రుడు అను ముగ్గురు బంధువులు గల స్త్రీ పరమభాగ్యవతీ. ఈముగ్గురిలో ఒకరు, ఇద్దరు లేకపోయినచో ఆమె మధ్యస్థురాలు. ముగ్గురూ లేనిచో, ఆస్త్రీ ఆధమగా చెప్పబడుచున్నది.

ఏతేషాం చ పమీపస్థా ప్రశంస్యాసా జగత్రయే

నిందితాన్యేషు సంన్యస్తా సర్వమతచ్ఛృతౌశ్రుతం

సర్వాత్మా భగవాంస్త్యంచ సర్వసాక్షీ చ సర్వవిత్

దేహి మహ్యం పుత్రవరం స్వాత్మనిర్వృతిహేతుకం

స్వాత్మబోధానుమాన మహాత్మని వివేదితం

సర్వాంతరాభిప్రాయజ్ఞం బోధజ్ఞం బోధయామి కిం

 ఇత్యుక్త్యా పార్వతీ ప్రీత్యా పపాత స్వామినః పదే

కృపా సింధుశ్చ భగవాన్ ప్రవక్తుముపచక్రమే

పైన పేర్కొన్న ముగ్గురు బంధువుల సమీపమునున్న స్త్రీని ముల్లోకములలో ప్రశంసింతురు. ఆవిధముగా. కాక ఇతరుల దగ్గరఉన్న స్త్రీని ఆందరు నిందింతురని వేదమున చెప్పబడినది.

నీవు సర్వాత్ముడవు, సర్వసాక్షివి, సమస్తము తెలిసినవాడవు. నాకు సంతోషము కలుగునట్లు మంచిపుత్రుని ప్రసాదింపుము. పెద్దవారికి నా మనసు తెలుసునని ఈవిషయము చెప్పితిని, అయినను వీవు సమస్త ప్రాణులయొక్క మనోభావములమ తెలిసినవాడవు. చెప్పనేర్చినవాడవు. అట్టి నీకు నేనేమి చెప్పుదును. ఇట్లు పార్వతి పరమేశ్వరునితో అని అతని కాళ్ళపై పడినది. ఆప్పుడు దయాసముద్రుడైన ఆ శంకరుడు పార్వతికి ఇట్లు చెప్పసాగెను.

శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడు ఇట్లు పలికెను.

శ్రృణు దేవీ ప్రవక్ష్యామి విధానం నియమం ఫలం

ఫలానీ చైవ ద్రవ్యాణి ప్రయోగాని యానిచ

విప్రాణాం శతకం శుద్దం ఫల పుష్పాపహారకం

కింకరాణాం చ శతకం ద్రవ్యాహరణ కారకం

దాసీనాం శతకం లక్షం నియుక్తంచ పురోహితం

 సర్వవ్రత విధానజ్ఞం వేదవేదాంతపారగం

ప్రవరం హరిభక్తానాం సర్వజ్ఞం జ్ఞానినాం వరం

సనతకుమారం మత్తుల్యం గృహాణ వ్రతహేతవే

ఓపార్వతీ ఈ పుణ్యకవ్రతం ఎట్లు చేయువలెనో ఆ వ్రత నియమములెట్లుండునో, దాని ఫలమెట్లుండునో ఆవ్రతమునకు కావలసిన వస్తువులేమిటో చెప్పెదను.

ఈ వ్రతమునకు వందమంది బ్రాహ్మణులు కావలెను. పరిశుద్ధమైన ఫలములు, పుప్పుములు కావలెను. పూజాద్రవ్యములు తెచ్చుటకై వందమంది సేవకులు, కోటిమంది దాసీజనము కావలెను. ఈవ్రతము చేయు పురోహితుడు సమస్త వ్రతములు చేయించువాడై ఉండవలెను. వేద, వేదాంతములు చక్కగా తెలిసినవాడు కావలెను. అందువలన శ్రీహరి భక్తులలో శ్రేష్టుడును, సర్వజ్ఞడు, జ్ఞానవంతులలో శ్రేష్టుడు, నాతో సమానమైనవాడగు సనత్ కుమారుని ఈవ్రతము చేయించుటకు పురోహితునిగా, ఎన్నుకొనుము.

దేవి శుద్దేచ కాలేచ పరం నియమపూర్వకం

మాఘశుక్ల త్రయోదశ్యాం ప్రచారంభః శుభః ప్రియే

గాత్రం సునిర్మలం కృత్వా శిరస్సంస్కార పూర్వకం

ఉపాస్య పూర్వదివసే వస్త్రం వంశోధ్య యత్నతః

ఆరుణోదయ వేళాయాం తల్పాదుత్థాయ సువ్రతీ

ముఖప్రక్షాళనం కృత్వా స్నాత్వా వై నిర్మలే బలే

 ఆచమ్య యత్నపూలో హి హరిస్మరణ పూర్వకం

దత్వార్జ్యం హరయే భక్యా గృహమాగత్య సత్వరం

ధౌతేచ వాససీ ధృత్వా హ్యుపవిశ్యాసనే శుచౌ

ఆచమ్య తిలకం ధృత్వా సమాప్య పాహ్నికం పునః

ఓ పార్వతీ పరిశుద్ధమైన సమయమున నియమముతో ఈ వ్రతమును పూర్తిచేయవలయును. మాఘశుద్ధ త్రయోదశినాడు ఈ వ్రతము చేయుట మంచిది. దానికి ముందునాడు ఉపవాసముండి వస్త్రములను చక్కగా ఉతుకుకొనవలెను. అరుణోదయ సమయమున శయ్య నుండి లేచి ముఖప్రక్షాళన చేసికొని తలంటుకొని నిర్మలమైన నీటియందు స్నానము చేయవలెను. తర్వాత శ్రీహరిని స్మరించుచు ఆచమనము చేసి శ్రీహరికి ఆర్ఘ్యమును ఇచ్చి ఇంటికి రావలెను. ఇంటికి వచ్చిన తర్వాత ఉలికిన బట్టలు కట్టుకుని పరిశుద్ధమైన ఆసనమున కూర్చుని తిలకమును పెట్టుకుని ఆచమనము చేసి ఆహ్నిక కార్యక్రమములన్ని పూర్తిచేయవలెను.

ఘటం సంస్థాప్య విధివత్స్వస్తి వాచనపూర్వకం

పురోహితస్య వరణం పురఃకల్ప ప్రయత్నతః

సంకల్పం వేదవిహితం తమేతత్సమాచరేత్

 ప్రతే ద్రవ్యాణి నిర్యాని ఉపచారాస్తు షోడశ

 దేయాని నిత్యం దేవేశి కృష్ణాయ పరమాత్మనే

ఆసనం స్వాగతం పాద్యమర్ఘ్యమాచమనీయకం

 స్నానీయం మధుపర్కం చ వస్త్రాణ్యాభరణాని చ

సుగంధపుష్పధూపం చ దీపనైవేద్యచందసం

 యజ్ఞసూత్రం చ తాంబూలం కర్పూరాది సువాసితం

 ద్రవ్యాణ్యేతాని పూజాయాశ్చాంగరూపాణి సుందరి

 దేవి కించిద్వీహిసేన చాంగహానిః ప్రజాయతే

అంగహీనం చ యత్కర్మ చాంగహేనో యథావరః

అంగహేనో చ కార్యే చ ఫలహానిః ప్రజాయతే

స్వస్తివాచనములతో నియమపూర్వకముగా కలశస్థాపన చేసి వేదవిహితమైన రీతిలో సంకల్పము చేసి ఈవ్రతమువారంభింపవలెను. పురోహితవరణమును ఆంతకుపూర్వము చేయవలెను.

ఈవ్రతమునకు ప్రతిదీనము ఉపయోగించు వస్తువులే చాలును. కాని శ్రీకృష్ణునకు షోడశోపచారములను మాత్రము చేయవలెను. అవి ఆర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, ఆసనము, స్వాగతము, స్నానీయము, మధుపర్కము, వస్త్రములు, ఆభరణములు, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, చందనము, యజ్ఞోపవీతము, తాంబూలము అనునవి. ఇవన్నియు పూజకు అంగములుగా ఉన్నవి. ఈ షోడశోపచారములలో ఏఒక్క ఉపచారము తక్కువైనను ఆంగహాని జరుగును. ఆంగహీనమైన పూజ అంగహీనుడగు నరునివలె ఫలితము నీయజాలదు.

అష్టోత్తరశతం పుష్పణాం లక్షమక్షతమీప్పితం

ప్రదేయం హరయే భక్త్యా వర్ణసౌందర్యహేతవే

సహస్రపత్రపద్మానామక్షతం లక్షకం తథా

భక్త్యా దేయం చహరయే ముఖసౌందర్య హేతవే

ఆమూల్యరత్నరచితం దర్పణానాం సహస్రకం

దేయం నారాయణాయైవ నేత్రయోద్దీప్తి హేతవే

నీలోత్పలావారి లక్షం చ దేయం కృష్ణాయ భక్తితః

ప్రతాంగభూతం దేవేశి చక్షుషో రూప హేతవే

హిమాలయోద్భవం లక్షం రుచిరం చ్వేతచామరం

ప్రదేయం కేశవాయైప కేశసౌందర్యహేతవే

అమూల్యరత్నరచితం పుటకానాం సహస్రకం

ప్రదేయం గోపికేశాయ నాసాహేందర్యహేతవే

 బంధూక పుష్పలక్షం చ దేయం రాధేశ్వరాయ చ

సౌ మ్యౌష్టాధరయోశ్చైవ న వర్ణసౌందర్య హేతవే

ముక్తాఫలానాం లక్షం చ దంతసౌందర్యహేతవే

దేయం గోలోకనాథాలయ శైలచే భక్తిపూర్వకం

రత్నగండుషలక్షం చ గండసౌందర్య హేతవే

 మహేశ్వరాయ దాతవ్యం ప్రతే శైలేంద్రకన్యకే

 రత్నహశకలక్షం చ దేయం బ్రహ్మేశ్వరాయ చ

ఓష్ఠాధః స్థలరూపాయ ప్రతి ప్రాణేశి భక్తితః

కర్ణభూషణలక్షం చ రత్నసారవినిర్మితం

దేయం సర్వ్వేరాయైప కర్ణసౌందర్య హేతవే

మాధ్వీక కలశానాం చ లక్షం రత్నవినిర్మితం

దేయం విశ్వేశ్వరాయైవ స్వరసౌందర్యహేతవే

సుధాపూర్ణం చ కుంభానాం సహస్రం రత్ననిర్మితం

దేయం కృష్ణాయ దేవేశి! వాక్యసౌందర్య హేతవే

రత్నప్రదీపలక్షం చ గోషవేషధాయినే

దేయం కోరవేషాయ దృష్టి సౌందర్య హేతవే

 ధత్తూరకుసుమాకారం రత్నపాత్రసహస్రకం

దేయం గోరక్షకాయైవ బలసౌందర్య హేతవే

ఓపార్వతి! తనకు అందమైన రూపము కలుగుటకు ప్రతిదినము శ్రీకృష్ణునకు నూట ఎనిమిది పారిజాత పుష్పములతో ఈవ్రతదీక్ష తీసికొన్న సమయమున పూజ చేయవలెను. అట్లే మంచివర్ణము కలుగుటకు తెల్లని చంపక పుష్పములతో, శ్రీకృష్ణుని పూజింపవలెను. అట్లే ముఖసౌందర్యమునకై సహస్రదళములు కల లక్షపద్మములతో, కండ్లకు మంచి శోభ కలుగుటకై వేలకొలది అద్దములలో, కండ్లు అందముగా ఉండుటకు లక్షనీలోత్పలములతో, అందమైన వెండ్రుకలకొరకు లక్ష తెల్లనీ చామరములతో, అందమైన ముక్కు కొరకు ఆమూల్యరత్నములచే నిర్మించిన లక్ష పద్మములతో, అందమైన పెదవులకొరకు లక్ష దీరీసెనపువ్వులతో, అందమైన పలువరుసకై లక్షముత్యాలతో, అందమైన చెక్కిళకొరకు రత్నగండూషములతో, పెదపులకింది భాగము అందముగానుండుటకై రత్నపాశమొలతో, అందమైన చెవులకై రత్నములచే చేయబడిన కర్ణభూషణములతో, చక్కని గొంతుకొరకు (స్వరమునకై) రత్నపాత్రలలో పోసిన పనిలో, చక్కని మాటలకొరకు అమృతముకల రత్నపాత్రలతో, దృష్టి సౌందర్యమునకై రత్నదీపములతో, బలమునకై ఉమ్మెత్త పూవులవంటి రత్నపాత్రలతో శ్రీకృష్ణుని ప్రతిదినము పూజింపవలెను.

సద్రత్నసారరచితం పద్మనాభసహస్రకం

దేయం చండకపాలాయ బాహుసౌందర్య హేతవే

 లక్షం చ రక్తపద్మానాం కరసౌందర్య హేతవే

దేయం గోపాంగనేశాయ సారాయణి హరివ్రతే

ఆంగుళీయకలక్షం చ రత్నసార వినిర్మితం

ఆంగుళీనాం చ రూపార్థం దేయం దేవేశ్వరాయ చ

మణీంద్రసారలక్షం చ శ్వేతవర్ణం మనోహరం

దేయం మునీంద్రనాథాయ నఖసౌందర్యహేతవే

సద్రత్నసారహారాణాం లక్షం చాతీమనోహరం

 దేయం మదనమోహాయ వక్షఃసౌందర్యహేతవే

సుపక్వశ్రీఫలానాంచ లక్షం చ సుమనోహరం

దేయం సిద్ధేంద్రసోథాయ స్తనసౌందర్యం

సద్రత్నవర్తులాకారపత్ర లక్షం మనోహరం

దేయం పద్మాలయేశాయ దేహసౌందర్యవాతనే

సద్రత్నసారరచితం నాభీనాం చ సహస్రకం

ప్రదేయం పద్మనాభాయ సాభిసౌందర్యహితమే

 సద్రత్నసారరచితం రథచక్రసహస్రకం

 నితంబసౌందర్యార్థం చ దేయం పై చక్రపాణయే

 సువర్ణరంభస్తంభానాం లక్షం చ సుమనోహరం

ప్రదేయం శ్రీనివాసాయ శ్రోణిసౌందర్య హేతవే

శతపత్రస్థలాబ్దానాం లక్షమమ్లానమక్షతం

 ప్రదేయం పద్మనేత్రాయ పాదసౌందర్యహేతనే

ఓపార్వతి! అట్లే బాహుసౌందర్యముకొరకు మంచీరత్నములచే నిర్మితమైన పద్మనాళములను శ్రీహరికి సమర్పింపవలెను. చేతులు ఆందముగానుండుటకై ఎఱ్ఱని పద్మముల విగోపికాపతికి సమర్పింపవలెను. చేతివేళ్ళు ఆందముగానుండుటకై మంచిరత్నములచే నిర్మింపబడిన ఉంగరములను సమర్పింపవలెను. చేతివేళ్ళగోర్లు ఆందముగానుండుటకై తెల్లని మంచిరత్నములను, వక్షసౌందర్యమునకి మంచిరత్నములుగల హారములను, స్తన సౌందర్యమునకై చక్కగా పండిన బిల్వఫలములను, శరీరసౌందర్యమునకై, గుండ్రముగానుండు మంచీ రత్నపత్రములను, బొడ్డు అందముగానుండుటకై మంచిరత్నములచే నిర్మింపబడిన వాభులను, పిరుదుల ఆందమునకై మంచీరత్నములచే నిర్మితమైన వేలకొలదీ రథచక్రములను, మధ్యభాగమందముగానుండుటకై బంగారు చేయబడిన అరటిస్తంభములను, పాదములయొక్క సౌందర్యమునకై నూరురేకులుగల వాడని మెట్టతామరలను పద్మనేత్రుడగు శ్రీకృష్ణునకు సమర్పింపవలెను.

సువర్ణరచితానాం చ ఖంజనాసాం సహస్రకం

గతిసౌందర్యహేత్వర్థం దేయం లక్ష్మీశ్వరాయ చ

రాజహంస సహస్రం చ గజేంద్రాణాం సహస్రకం

సువర్ణరచితం దేయం హరయే గతి హేతవే

సువర్ణచ్ఛత్రలక్షం చ దేయం నారాయణాయ చ

 విచిత్రం రత్నసారేణ మూర్ధసౌందర్యహేతవే

మాలతీనాం చ కుసుమమక్షతం లక్షమీశ్వరి

దేయం బృందా వేశాయ హాస్యసౌందర్యహేతవే

ఆమూల్యరత్నలక్షం చ దేయం నారాయణాయ వై

సువ్రతే వ్రతపూర్ణార్థం శీలసౌందర్యహేతవే

స్వచ్ఛస్ఫటికసంకాశ మణీంద్రశ్రేష్ఠలక్షకం

దేయం మునీంద్రనాథాయ మనర్సిందర్యహేతవే

 ప్రవాళసారసంకాశం మణిసారసహస్రకం

దేయం కృష్ణాయ భక్త్యా చ ప్రియారాగవివృద్ధయే

 ఓపార్వతీదేవి గమనము అందముగనుండుటకై బంగారముచే చేయబడిన కాటుక పెట్టెలను రాజహంసలను, ఏనుగులను శ్రీకృష్ణునకు పూజాసమయమున సమర్పింపవలెను, శిరసౌందర్యమునకై బంగారము, రత్నములచే చేయబడిన ఛత్రములను, చక్కని హాస్యమునకై దళములు విరిగిపోనీ మాలతీపువ్వులను, శీలసౌందర్యమునకై, వ్రతము సంపూర్ణమగుటకు అమూల్యమైన రత్నములను, మనసౌందర్యమునకై స్వచ్ఛస్ఫటికమువంటి మణులను, భార్యయొక్క అనురాగమునకై మంచివగడములను, మంచిమణులను శ్రీకృష్ణునకు భక్తితో సమర్పించుకొనవలెను.

మాణిక్యసారలక్షం చ దేయం కృష్ణాయ యత్నతః

జన్మనః కోటిపర్యంతం స్వామీసాభాగ్యహేతవే

కూష్మాండం నారికేళం చ జంబీరం శ్రీఫలం తధా

ఫలాన్యేతాని దేయానీ హరయే పుత్రవేతవే

రత్నేంద్రసారలక్షం చ దేయం కృష్ణాయ యత్నతః

ఆసంఖ్య జన్మపర్యంతం స్వామినో ధనవృద్ధయే

పాయసం పిష్టకం సర్పి:శర్కరాక్తం మనోహరం

 ప్రదేయం హరయే భక్త్యా స్వామినో భోగవృద్ధయే

 వాద్యం సొసోప్రకారం చ కాంస్యతాళాదీకం పరం

ప్రతేసంపత్తి వృద్ద్యర్థం శ్రీహరి శ్రావయేద్వతీ

సుగంధపుష్పమాలానాం లక్షమక్షతమీప్సితం

ప్రదేయం హరయే భక్త్యా హరిభక్తి ఏవృద్ధయే

అనేక జన్మలవరకు తనభర్తకు సౌభాగ్యము కలుగుటకై మంచిమాణిక్యములను శ్రీకృష్ణునకు భక్తితో సమర్పింపవలెను. ఆట్లే పుత్రులు కలుగుటకై గుమ్మడిపండును కొబ్బరికాయను, నీమ్మపండును. బిల్వఫలమును సమర్పింపవలెను. తనభర్తకు ధనసమృద్ధి కలుగుటకై ఆనేక రత్నములన ఇవ్వవలెను. తనభర్తకు సద్భోగములు కలుగుటకై పాయసమును, నేయి, చక్కర కలిపిన పిండిని భక్తితో నొసగవలెను. తాళములు మొదలగు నానావీధవాద్యములను తనసంపదయొక్క ఆభివృద్ధికై మ్రోగించవలెను. శ్రీహరిపై భక్తి పెరుగుటకు ఆశ్రీహరికి అనేక పుష్పమాలలను సమర్పించుకొనవలెను.

నైవేద్యాని చ దేయాని స్వాధూని మధురాణి చ

శ్రీకృష్ణప్రీతివృధ్యర్థం దుర్గే నానావిధాని చ

నానావిధాని పుష్పాణి తులసీసంయుతాని చ

శ్రీకృష్ణప్రీతయే భక్త్యా ప్రతే దేయాని సుప్రతే

బ్రాహ్మణానాం సహస్రం చ ప్రత్యహం భోజయేద్ర్వతీ

స్వాత్మనః సస్యవృద్ధ్యర్థం ప్రతే జన్మ జన్మని

పుష్పాంజలిశతం దేయం నిత్యం పూర్ణం చ పూజనే

ప్రణామశతకం దేవి కర్తవ్యం భక్తివృద్ధయే

ఈ వ్రతమునాచరించునపుడు ప్రతిదినము శ్రీకృష్ణునకు నానావిధములైన నైవేద్యములను పెట్టవలెను. శ్రీకృష్ణుని సంతోషమునకై ఈపుణ్యకవ్రతమున ఆ భగవంతునకు తులసీదళములతోనున్న అనేకవిధములగు పుష్పములను సమర్పింపవలెను.

అట్లే ప్రతిదినము వేయిమంది బ్రాహ్మణులకు వ్రత సమయమున భోజనమిడవలెను. భక్తి పెరుగవలెనని పూజాసమయమున ప్రతిదినము శ్రీకృష్ణునకు పుష్పాంజలి శతమును, నమస్కారశతముమ సమర్పించవలెను.

షణ్మాసాంశ్చ హవిష్యాన్నం మాసాన్ పంచఫలాదికం

హవిఃపక్షం జలంపక్షం ప్రతే భక్షేచ్చ సువ్రతీ

రత్నప్రదీపశతకం వహిం దద్యాద్దివానీశం

రాత్రౌ కుశాసనం కృత్వా నిత్యం జాగరణం ప్రతే

స్మరణం కీర్తనం కేళిః ప్రేక్షణం గుహ్యభాషణం

సంకల్పోధ్యవసాయశ్చ క్రీయానిర్వృతినిత్యపి

 స్వప్నమైథునకం త్యాజ్యం ప్రతినా వ్రతశుద్ధయే

 సంపూర్ణే చ ప్రతీ దేవి ప్రతిష్టి తదనంతరం

త్రిశతం వై షష్ఠ్యధికం రల్లకం వస్త్ర సంయుతం

 సంభోజ్య సోపవీతం చ సోపహారం దదాత్వయం

త్రిశతం వై షష్ఠ్యధికసహస్రం విప్రభోజనం

త్రిశతం వై షష్ఠ్యధికం సహస్రం తిలహామకం

త్రిశతం వై షష్ట్యధికం సహస్రం స్వర్ణమేవ చ

దేయాద్వ్రత సమాప్తా చ దక్షిణావిధిబోధితా

అన్యాం సమాప్తిదివసే కథయిష్యామి దక్షిణాం

ఈవ్రతము నాచరించువారు ఆరుమాసములు హవిష్యానమును ఐదునెలలు పండ్లను మాత్రము భుజింపవలెను. చివరినెలలో పదిహేను దినములు హవిష్యాన్నమును మిగిలిన పదిహేను దినములు నీటిని మాత్రము నీయమముతో స్వీకరింపవలెను. ఈవ్రతము చేయునప్పుడు ప్రతిదినము నూరు దీపములను వెలిగించవలెను. రాత్రిసమయమున దర్భాసనముపై కూర్చుండి జాగరణ చేయవలెను.

ఇతరవిషయముల స్మరించుట, కీర్తించుట, కేళి, చూచుట, రహస్యముగా సంభాషించుట, ఇతర క్రియాసంకల్పము చేయుట, వ్రత క్రియలను అనుష్ఠింపకపోవుట, నిదురించుట, మైథునము అనువాటిని వ్రత శుద్దినిగోరి వ్రతముననుష్ఠించువాడు చేయరాదు.

వ్రతము ముగియుసందర్భమున మూడువందల అరవై కంబళ్ళతో, యజ్ఞోపవీతములతో, మూడుకోట్ల ఆరువైలక్షల బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలెను. వారికందరకు బంగారునాణెములను దక్షిణగా దానమీయవలెను. తిలహోమము మూడుకోట్లఆరవైలక్షల పర్యాయము చేయవలెను.

ఇంకను వ్రతము సమాప్తమగు దినమున చేయవలసిన దక్షిణ గురించి తరువాత నీకు చెప్పుదునని శంకరు డనెను.

ఏతద్వ్రతఫలం దేవి దృఢభక్తిర్హరా భవేత్

హరితుల్యో భవేత్పుతో విఖ్యాతో భువనత్రయే

సౌందర్యం స్వామీసౌభాగ్యమైశ్వర్యం విపులం ధనం

సర్వవాంఛతసిద్ధీనాం బీజం జన్మని జన్మని

ఓపార్వతీదేవికి ఈ వ్రతమునాచరించినందువలన శ్రీహరిపై భక్తి అధికమగును. వారికి పుట్టు పుత్రుడు శ్రీహరితో సమానుడగును. ముల్లోకములలో ప్రఖ్యాతిపొందును. అట్లే సౌందర్యము, భర్తసౌభాగ్యము, ఐశ్వర్యము, ఆంతులేని ధనము, కలుగును. ఆదేవిధముగా ఆవ్రతమునాచరించిన స్త్రీకి ప్రతిజన్మలో ఆమె కోరిన కోరికలన్నీయు సిద్ధించును.

ఇత్యేవం కథితం దేవి ప్రతం కురు మహేశ్వరి

పుత్రస్తే భవితా సాద్వీత్యుక్త్యా సవిరరామ హ

పార్వతీ! నీకు ఇట్లు పుణ్యకత్రమును గురించి చెప్పితిని. అందువలన నీవు ఈ వ్రతమునావరించినచో నీకు తప్పక పుత్రుడు కలుగునని మహాదేవుడు పార్వతితో చెప్పి ఊరకుండెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే పుణ్యకవ్రతవిధానం నామచతుర్దోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణులసంవాదమున తెలుపబడిన పుణ్యకవ్రతవిధానమను నాలుగవ అధ్యాయము సమాప్తము.