3 - పుణ్యక వ్రత మహిమ

శ్రీమహాదేవ ఉవాచ -మహాదేవుడిట్లు పార్వతితోననెను-

శ్రుణు పార్వతి వక్ష్యామీ తవ భద్రం భవిష్యతి ।

ఉపాయతః కార్యసిద్ధిర్భవత్యేవ జగత్రయే ॥

సర్వవాంఛితసిద్దేస్తు బీజరూపం సుమంగళం ।

మనసః ప్రీతిజనకముపాయం కథయామి తే ॥

హరేరారాధనం కృత్వా వ్రతం కురు వరాననే ।

 వ్రతం చ పుణ్యకం నామ వర్షమేకం కరిష్యసి ॥

మహాకఠోరబీజం చ వాంఛకల్పతరుం పరం ।

సుఖదం పుణ్యదం సారం పుత్రదం సర్వసౌఖ్యదం ॥

ఓపార్వతి నీకు శుభము కలుగును. నేను చెప్పు ఉపాయము వలన నీకు తప్పక కార్యసిద్ధి జరుగును. సమస్తమైన కోరికలు సిద్ధించుటకు హేతువైనది, మంగళమైనది, నీకు సంతోషమును కలిగించు ఉపాయము చెప్పెదను.

నీవు తొలుత శ్రీమన్నారాయణుని ఆరాధించి పుణ్యకవ్రతమును ఒకసంవత్సరకాలము ఆచరింపుము. ఇవీ అన్ని కోరికలను తీర్చును. సర్వసౌఖ్యములను, పుత్రులను, పుణ్యమును కలిగించును.

నదీనాం చ యథాగంగా దేవానాం చహరిర్యథా ।

వైష్ణవానాం యథాలాంచ దేవీనాం త్వం యథాప్రియే॥

వర్ణానాంచయథావిప్రస్తీర్ధానాం పుష్కరం యథా ।

పుష్పాణాం పారిజాతం చ పత్రాణాం తులసీయథా ॥

యథాపుణ్యప్రదానాం చ తిథిరేకాదశీ స్మృతా ।

రవివారశ్చ వారాణాం యథాపుణ్యప్రదః శివే ॥

మాసానాంమార్గశీర్ఘశ్చాప్యుతూనాం మాధవోయథా ॥

సంవత్సరోవత్సరాణాం యుగానాం చ కృతం యథా ।

 విద్యాప్రదశ్చ పూజ్యానాం గురూనాం జననీయథా ॥

సాద్వీపత్నీయథాప్తానాం విశ్వస్తానాం మనోయథా ॥

 యథా ధనానాం రత్నం ప్రియాణాం చ యథాపతీ ।

యథాపుత్రశ్చ బంధూనాం వృక్షాణాం కల్పపాదపః ॥

ఫలానాం పై చూతఫలం వర్షాణాం భారతం యథా।

బృందావనం వనానాం చ శతరూపా చ యోషితాం॥

 యథా కాశీపురీణాం చ సూర్యస్తేజస్వినాం యథా ।

యథేందు సుఖదానాం చ సుందరాణాం చ మన్మథః ॥

 శాస్త్రాణాం చ యథా వేదాః సిద్ధానాం కపిలో యథా ।

హనుమాన్వానరాణాం చ క్షేత్రాణాం బ్రాహ్మణాననం॥

 యశోధానాం యథావిద్యా కవితా చ మనోహరా।

ఆకాశో వ్యాపకానాం చ హ్యంగానాం లోచనం యథా ॥

విభవానాం హరికథా సుఖానాం హరిచింతనం ।

 స్పర్శానాం పుత్రసంస్పర్ళో హింస్తాణాం చ యథాఖలః ॥

పాపానాం చ యథామిథ్యా పాపినాం పుంశ్చలీయథా ।

పుణ్యానాం చ యథా సత్యం తపసాం హరిసేవనం ॥

నదులన్నిటిలో గంగానదివలె, దేవతలలో శ్రీహరివలె, వైష్ణవులలో నా(మహాదేవుడు)వలె, దేవతాస్త్రీలలో నీ(పార్వతీదేవి)వలె, కులములన్నిటిలో బ్రాహ్మణులవలె. పుణ్యక్షేత్రములలో పుష్కరక్షేత్రమువలె, పుష్పములలో పారిజాతపుష్పమువలె, పత్రములలో తులసీపత్రమువలె, పుణ్యప్రదమైన తిథులలో ఏకాదశీ తిథి వలె, వారములన్నిటిలో ఆదివారమువలె, నెలలన్నిటిలో మార్గశిరమాసమువలె, ఋతువులలో గ్రీష్మఋతువువలె, యుగములలో కృతయుగమువలె, పూజ్యులైనవారిలో విద్యనొసగు గురువువలె, పూజ్యులలో తల్లివలె, ఆప్తులైనవారిలో సాధ్వియగు భార్యవలె, విలువైన వస్తువులలో రత్నమువలె. ప్రియులందరిలో భర్తవలె, బంధువులందరిలో పుత్రునివలె, వృక్షములన్నీటిలో కల్పవృక్షమువలె, పండ్లలో మామిడిపండువలె, తోటలన్నిటిలో బృందావనమువలె, స్త్రీలందరిలో శతరూపాదేవివలె, పట్టణములన్నిటిలో కాశీ పట్టణమువలె, తేజస్సుకలవారిలో సూర్యునివలె, సుందరులైనవారిలో మన్మథునివలె, శాస్త్రములన్నిటిలో వేదములవలె, సిద్దులలో కపిలమహర్షివలె, వానరులలో హనుమంతునివలె, కీర్తినొసగువాటిలో అందమైన కవితవలె, అవయవములన్నిటిలో నేత్రమువలె, స్పర్శలలో పుత్రస్పర్శవలి, హింసించువారిలో దుష్టునివలె, పాపులలో పుంశ్చలివలె, తపస్పులన్నిటిలో హరిసేవవలె వ్రతములన్నిటిలో పుణ్యకవ్రతము చాలా శ్రేష్ఠమైనది.

యథా ఘృతం చ గన్యానాం యథా బ్రహ్మా తపస్వినాం।

అమృతం భక్ష్యవస్తూనాం సస్యానాం ధాన్యకం యథా ॥

పుణ్యదాసాం యథా తోయం శుద్ధానాం చ హుతాశనః ।

సువర్ణం తైజసానాం చ మీస్టానాం ప్రియభాషణం॥

 గరుడ పక్షీణాం చైవ హస్తినామింద్రవాహనం।

యోగినాం చ కుమారశ్చ దేవర్షిణాం చ నారదః ॥

గంధర్వాణాం చిత్రరథో జీవోబుద్ధిమతాం యథా ।

సుకవీనాం యథాశుక్రః కావ్యానాం చ పురాణకం॥

ప్రోతప్పతార సముద్రశ్చ యథాపృద్వీ క్షమావతాం ।

లాభానాం చ యథాముక్తిః హరిభక్తిశ్చ సంపదాం ॥

పవిత్రాణాం వైష్ణవాళ్ళ వర్ణానాం ప్రణవో యథా ।

విష్ణుమంత్రశ్చ మంత్రాణాం బీజానం ప్రకృతిర్యథా॥

విదుషాం చ యథావాణీ గాయత్రీ ఛందసాంయథా ।

యథకుబేరో యక్షాణాం సర్పాణాం వాసుకిర్యథా॥

యథా పితా తే శైలావాం గహం చ సురభిర్యథా ।

వేదాసం సామవేదశ్చ తృణానాం చ యథా కుశ॥

 సుఖదానాం యథా లక్ష్మీర్మనో శీఘ్రగామీవాల ।

అక్షరాణామకారశ్చ యథా తాతో హితైషిణాం ॥

శాలగ్రామశ్చ మూర్తీనాం పశూనాం విష్ణుపంజరః ।

చతుష్పదానాం పంచాస్యో మానవో జీవినాం యథా ॥

యథాస్వాంతం చేంద్రియాణాం మందాగ్నిశ్చ రుజాం యథా ।

బలినాం చ యథాశక్తిరహం శక్తిమతాం తథా॥

మహావ్విరాట్ చ స్థూలానాం సూక్ష్మాణాం పరమాణుకః ।

యథేంద్ర ఆదిలేయానాల దైత్యానాం చ బలీర్యథా ॥

యథా దధీచిఠాతృణాం ప్రహ్లాదశ్చైవ సాధుషు ।

 బ్రహ్మాస్త్రం చ యథాస్త్రాణాం చక్రాణాం చ సుదర్శనం ॥

 నృణాం రాజా రామచంద్రో వీరాణాం లక్ష్మణో యథా ।

సర్వాధారః సర్వసేవ్యః సర్వబీజం చ సర్వదః ॥

సర్వహిరో యథాకృష్ణా వ్రతానాం పుణ్యకం తథా ॥

ఆవుపాలమండి ఏర్పడు వస్తువులలో నెయ్యి తపస్సుచేయువారీలో బ్రహ్మదేవుడు పరిశుద్ధమైన వస్తువులలో ఆగ్ని తైజసమైన వస్తువులలో బంగారము దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, కవులలో శుక్రుడు, కావ్యములందు పురాణము క్షమకలవారిలో భూమీ, లాభములందు ముక్తి సంపదలలో శ్రీహరిభక్తి, పవిత్రమైనవారిలో ప్రస్తులు, అక్షరములలో ఓంకారము, మంత్రములలో విష్ణుమంత్రము, బీజములందు ప్రకృతి, విద్వాంసులలో సరస్వతి, ఛందస్సులలో గాయత్రి, యక్షులలో కుబేరుడు, సర్పములందు నాగరాజగు వాసుకి, పర్వతములందు నీతండ్రియగు హిమాలయపర్వతము, ఆవులలో సురభి, వేదములయందు సామవేదము, గరకలో దర్భ, సుఖముకలిగించువారిలో లక్ష్మీదేవి, శీఘ్రగమనముకలవారీలో మనసు, అక్షరములందు ఆకారము, మేలుకోరువారిలో తండ్రి, భగవంతుని మూర్తులలో సాలగ్రామము, పశువులలో విష్ణుపంజరము, చతుష్పాద జంతువులలో సింహము, ప్రాణులలో మానవుడు, ఇంద్రియములందు మనస్సు, రోగములయందు ఆకలిలేకపోవుట, బలవంతులలో శక్తి, శక్తికలవారీలో నేను (మహాదేవుడు), స్థూలపదార్థములలో మహావిరాట్ స్వరూపము, సూక్ష్మపదార్థములలో పరమాణువు, ఆదిత్యులలో ఇంద్రుడు, దైత్యులందు బలిచక్రవర్తి, దానముచేయువారిలో దధీచిమహర్ష, సాధుపురుషులలో ప్రహ్లాదుడు, అస్త్రములందు బ్రహ్మాస్త్రము, చక్రములలో సుదర్శనచక్రము, మానవులలో శ్రీరామచంద్రుడు, ఎట్లు గొప్పవారో అట్లే వ్రతములందు పుణ్యకవ్రతము చాలా గొప్పది.

వ్రతం కురు మహాభాగే త్రిషులోకేషు దుర్లభం ।

సర్వశ్రేష్ఠశ్చ పుత్రస్తే ప్రతాదేవ భవిష్యతి॥

ప్రతారాధ్య వై కృష్ణ సర్వేషాం వాంచితప్రదః ।

జనో యలేవన్ముక్తః ఏత్ఫలిః కోటిభిఃసహ॥

 హరీమంత్రం గృహీత్వా చ హరిసేవాం కరోతి యః।

భారతే జన్మ సఫలం స్వాత్మనః కరోతిచ ॥

ఉద్ధృత్య కోపురుషానికుంఠం యాతి సునిశ్చితం ।

శ్రీకృష్ణపార్షదో భూత్వా సుఖం తత్రైవ మోదతే ॥

సహోదరాన్ స్వభృత్యాంశ్చ స్వబంధూసహచారిణః ।

స్వస్త్రియశ్చ సముద్ధృత్య భక్తాయాతి హరేః పదం ॥

తప్మాద్గృహాణ గిరిజే హరేర్మంత్రం సుదుర్లభం।

జపమంత్రం వ్రతే తత్ర పితృణాం ముక్తికారణం॥

ఈ పుణ్యకవ్రతమందు ఆరాధింపబడువాడు సమస్తజనులకోరికలను తీర్చు శ్రీకృష్ణుడు, ఆదేవదేవుని సేవించినవారు తమ కోటితరముల పితృగణములో ముక్తుని పొందుదురు.

శ్రీహరిమంత్రమున జపించుచు శ్రీవారి సేవచేయు భక్తునియొక్క జన్మ ఈభారతదేశమున సఫలమగుచున్నది. అట్లే అతడు తనకు ముందున్న కోటితరములవారిని ఉద్ధరించుచు వైకుంఠమునకుపోవును. తరువాత ఆ భక్తుడు శ్రీకృష్ణుని భృత్యుడై వైకుంఠమున సుఖముగానుండును. ఆ భక్తుడు తన శ్రీహరిభజనవలన తనసోదరులను, భృత్యువులను, తనబంధువులను, తనసహచరులను, స్త్రీలను ఉద్ధరించి శ్రీహరియుండు వైకుంఠమును చేరుకొనును.

అందువలన ఓపుణ్యశీలా! పార్వతీ! మిక్కిలి దుర్లభమైన శ్రీహరి మంత్రమును గైకొని, పితృదేవతల ముక్తికి కారణమైన ఆ శ్రీహరిమంత్రమును నీవు స్వీకరింపుము. ఈ వ్రతమున శ్రీహరిమంత్రమును జపించినచో ఆతని పూర్వపురుషులందరు ముక్తిని పొందుదురు అని పల్కెను.

 ఇత్యుక్త్యా శంకరో దేవో గత్వా గిరిజయాసహ ।

శీఘ్రం చ జాహ్నవీతీరం హరేర్మంత్రం మనోహరం॥

తస్యై దదౌ చ సంప్రీత్యా కవచం స్తోత్రసంయుతం।

పూజావిధాననీయమం కథయామాస తార మునే॥

శంకరుడిట్లు పార్వతీదేవికి చెప్పి ఆమెను వెంటబెట్టుకొని గంగాతీరమున ఆ దేవికి శ్రీహరి మంత్రమును, కవచమును, స్తోత్రమును పూజావిధానమునంతయు చెప్పెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే తృతియే గణపతిఖండే నారద నారాయణసంవాదే తృతీయోధ్యాయః॥

 శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదగు గణపతి ఖండమున మూడవ అధ్యాయము సమాప్తము.