బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

15 - కార్తికేయ, నందికేశ్వరుల సంవాదము

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను-

 పుత్రస్య వార్తా సంప్రాప్య పార్వత్యా సహ శంకరః

ప్రేరితో విష్ణునా దేవైర్మునిఖి: పర్వతైర్మునే

దూతాన్ ప్రస్థాపయామాస మహాబలపరాక్రమాన్

 వీరభద్రం విశాలాక్షం శంకుకర్ణం కబంధకం

 నందీశ్వరం మహాకాళం వజ్రదంతం భగందరం

గోధాముఖం దధీముఖం జ్వలదగ్నిశిఖోపమం

లక్షం చ క్షేత్రపాలానాం భూతానాం చ త్రిలక్షకం

వేతాళానాం చతుర్లక్షం యక్షాణాం పంచలక్షకం

కూష్మాండానాం చతుర్లక్షం త్రిలక్షం బ్రహ్మరక్షసాం

 డాకినీనాం చతుర్లక్షం యోగినీనాం త్రిలక్షకం

రుద్రాంశ్చ భైరవాంశ్చైవ శివతుల్యపరాక్రమాన్

అన్యాంశ్చ వికృతాకారాన్ అసంఖ్యానపి నారద

 తే సర్వే ఓవదూతాశ్చ నానాశస్త్రాస్త్రపాణయ:

కృత్తికానాం చ భవనం వేష్టయామాసురుజ్వలం

 దృష్ట్యా తాన్ కృత్తికాసర్వాః భయవిహ్వలమానసా:

కార్తికేయం చ జగృహు: జ్వలంతం బ్రహ్మతేజసా

తన పుత్రుని విషయము తెలిసిన పార్వతీప రమేశ్వరులు విష్ణుమూర్తి, దేవతలు, మునులు మొదలగువారు ప్రేరేపింపగా మహాబలపరాక్రమవంతులైన దూతలను కృత్తికల దగ్గరకు పంపించిరి. ఆ దూతలలో వీరభద్రుడు, విశాలాక్షుడు, శంఖుకర్ణుడు, కబంధకుడు, నందీశ్వరుడు, మహాకాళుడు, వజ్రదంతుడు, భగంధరుడు, గోధాముఖుడు, దధీముఖుడు, మొదలగువారున్నారు. ఇంకను లక్ష క్షేత్రపాలురు, మూడులక్షల భూతములు, నాలుగు లక్షల భేతాళురు, ఐదులక్షలు యక్షులు, నాలుగులక్షల కూష్మాండులు, మూడు లక్షల బ్రహ్మరాక్షసులు, నాలుగు లక్షల డాకీనులు, మూడులక్షల యోగీనులు, వికృతాకారము కలవారు, శివునితో సమానమైన పరాక్రమము కలవారు అగు ఆంతులేని రుద్రులు, భైరవులు మొదలగువారు కలరు.

ఆ శివదూతలందరు శస్త్రాస్త్రములను ధరించి కృత్తికలయొక్క భవనమును చుట్టుముట్టిరి. అప్పుడు శివదూతలను చూచి కృత్తికలు అమితమైన భయముతో బ్రహ్మతేజో విరాజితుడగు కార్తికేయుని ఆశ్రయించిరి.

కృత్తికా ఊచుః –

కృత్తికలు ఈవిధముగా పలికిరి.

వత్స సైన్యాన్యసంఖ్యాని వేష్టయామాసురాలయం

న జానీమో వయం కస్య కరాళానీ చ బాలక

నాయనా! ఈ అసంఖ్యాకమైన సైన్యములు మన ఇంటిని చుట్టుముట్టుకొన్నవి. భయంకరమైన ఈ సైన్యములెవ్వరివో మాకు తెలియదని పలికిరి.

కార్తికేయ ఉవాచ - కార్తికేయుడు కృత్తికలతో నిట్లనెను-

 భయం త్యజత కల్యాణ్యో భయం కిం నో మయి స్థితే

దుర్నివార్యః కర్మపాకో మాతరః: కేన వార్యతే

అమ్మలారా! మీరు భయపడకుడు. నేనుండగా మీరు భయపడవలసిన అవసరములేదు. ఐనను కర్మఫలితమును ఎవ్వరు వారించలేరని పలికెను.

ఏతస్మిన్నంతరే తత్రసేనానీర్నందికేశ్వరః

పురతః కార్తికేయస్యతిష్ఠంస్తా సామువాచ హ

ఆ సమయమున శివుని సేనాధిపతియగు నందికేశ్వరుడు కార్తికేయుడు మరియు కృత్తికలముందు నిలబడి ఇట్లు పలికెను.

నందికేశ్వర ఉవాచ -  నందికేశ్వరు డిట్లు పలికెను-

 భ్రాతః ప్రవృత్తిం శ్రుణు మే మాతుశ్చాపి శుభావహం

ప్రేషితస్య సురేంద్రస్య సంహర్తు: శంకరస్య చ

 కైలాసే సర్వదేవాశ్చ బ్రహ్మవిష్ణుశీవాదయః

సభాయాం తే వసంతశ్చ గణేశోత్సవ మంగళం

శైలేంద్రకన్యా తం విష్ణుం జగతాం పరిపాలకం

 సంబోధ్య కథయామాస తవాన్వేషణకారణం

పప్రచ్ఛ దేవాన్విష్ణుస్తాన్ క్రమేణైవాప్తి హేతవే

ప్రత్యుత్తరం  దదుస్తే తు ప్రత్యేకం చ యథోచితం

తమత్ర కృత్తికాస్థానే కథయామాసురీశ్వరం

సర్వే ధర్మాదయో దేవా ధర్మాధర్మస్య సాక్షిణః

ఓ తమ్ముడా! నన్ను ఇచ్చటకు పంపించిన శ్రీ మహా విష్ణువు యొక్క, జగత్సంహార కారకుడగు శంకరునియొక్క, నీతల్లియగు పార్వతీదేవియొక్క మరియు నాయొక్క మాటలను శ్రద్ధగా విమము.

గణపతియొక్క ఉత్సవముమ జరుపుకొను సమయమున కైలాసపర్వతముపై సభలో బ్రహ్మవిష్ణుశివాది దేవతలుండిరి. అప్పుడు పార్వతీదేవి జగత్పరిపాలకుడగు విష్ణువును నీగురించి అడిగినది. అప్పుడు శ్రీమహావిష్ణువు నీగురించీ దేవతలనందరినడిగెను. ఆసమయమున దేవతలు ఒక్కొక్కరు తమకు తెలిసిన విషయమును చెప్పిరి. చివరకు ధర్మాధర్మకార్యములకెల్ల సాక్షీభూతులైన ధర్మాదిదేవతలు నీవు కృత్తికల ఇంటిలోనున్నట్లు తెలిపిరి.

 యా బభూవ రహః క్రీడా పార్వతీశివయోః పురా

దృష్టస్య చ సురైః శంభోర్వీర్యం భూమౌ పపాత హ

భూమీస్తదక్షిసద్వహ్నౌ వహ్నిశ్చ శరకాననే

తతో లబ్ధః కృత్తికాభీరమూభిర్గచ్ఛ సాంప్రతం

 తవాభిషేకం విష్ణుశ్చ కరిష్యతి సురైస్పహ

శస్త్రం లబ్ధ్వాఖిలం దేవ తారకం సంహనీష్యసి

పుత్రస్త్వం విశ్వసంహర్తుస్యాం గోప్తుం న క్షమా ఇమాః

నాగ్నీం గోప్తుం యథా శక్తః శుష్క వృక్షః స్వకోటరే

దీప్తిమాంస్త్యం చ విశ్వపు తాసాం గేహేషు శోభసే

యథా పతన్మహాకూపే ద్విజరాజో వ రాజతే

 కరోషి జగదాలోకం సాచ్ఛన్నోఽస్యాంగతేజసా

యథా సూర్య: కరాచ్ఛన్నో న భవేత్పూరుషస్య చ

విష్ణస్త్యం చ జగద్వ్యాపీ నాసార వ్యాఽప్యోసి శాంభవ

యథా న కేషాం వ్యాప్యం చ తత్సర్వం వ్యాపకం నభః

యోగీంద్రో నానులిప్తస్త్యం భోగీ చ పరిపోషణే

నైవలిప్తోయథాఽత్మా చ కర్మభోగేషు జీవితాం

విశ్వాధారస్త్యమీశశ్చ నామతే సంభవేత్ స్థితిః

 సాగరస్య యథా సద్యాం పరితామాశ్రయస్య చ

 నహి సర్వేశ్వరావాసః సంభవేత్కృత్తికాలయే

 గరుడస్య యథావాసః క్షుద్రే చ చటకోదరే

 త్వాం చ దేవా న జానంతి భక్తానుగ్రహ విగ్రహం

గుణానాం తేజసాం రాశిం యథా జ్ఞానమయేగినః

త్వామనిర్వచనీయం చ కథం జాసంతి కృత్తికా:

 యథా పరాం హరేర్భక్తిమభక్తా మూఢచేతసః

భ్రాతర్యేయం న జానంతి తే తం కుర్వంత్యనాదరం

 నాద్రీయంతే యథా భేకాస్త్వేకావాసంచ పంకజం

పూర్వము పార్వతీ పరమేశ్వరులు రహస్య క్రీడలాడు కొనుచున్నప్పుడు దేవతలు చూడగా శంకరునియొక్క వీర్యము భూమిపై పడినది. భూదేవి ఆతని వీర్యమును భరింపలేక దానిని వహ్నిలోనుంచగా అగ్నిదేవుడు రెల్లుగడ్డిలో(శరవనములో) దానీని వదలిపెట్టెను. అచ్చట జన్మనెత్తిన నిన్ను కృత్తికలు తీసికొనిపోయిరి. అందువలన నీవిప్పుడు కృత్తికలతో కలసి కైలాసమునకు పోయినచో అచ్చట విష్ణువు నిన్ను సేనాధిపతిగా అభిషేకించును. అప్పుడు దేవతలొసగిన సమస్త శస్త్రములను పొంది నీవు తారకాసురుని సంహరింపగలవు.

నీవు ప్రపంచమునంతయు సంహరింపజాలు మహాదేవునియొక్క పుత్రుడవు. అట్టి నిన్ను ఈ కృత్తికలు కాపాడలేరు. ఎండినచెట్టు తన తొఱ్ఱలో అగ్నిని దాచుకొనజాలనట్లు, దీప్తిమంతుడవైన నీవు ఆ కృత్తికల ఇంటిలో ఉండలేవు. పెద్దబావిలో పడిన గజరాజువలె వీరి ఇంటిలో నీవు ప్రకాశింపలేవు. మానవుడు తన చేతులనడ్డు పెట్టినచో సూర్యుడు, మాయముకానట్లు నీవు ఎవరి తేజస్సు వలన మాయము కావు. నీవు సాక్షాత్ మహా విష్ణువు వలె జగములంతయు వ్యాపించియున్నవాడవు, అందువలన కృత్తికలకు వ్యావ్యుడవుకావు. ఆకాశమేవిధముగా దేనికి వ్యాప్యముకాదో అట్లే స్వతః వ్యాపకమగువో నీవల్లే స్వతః. వ్యాపకుడవు, నీవు విషయములనుండి నిర్లిప్తుడవైన యోగీంద్రుడవు కాన వేరుకాదు. నీవు విశ్వమునకంతయు ఆధారభూతుడవు, ఈశ్వరుడవు.

నదులకన్నిటికి నివాసస్థానమగు సముద్రము ఒక నదిలో ఎట్లు అణగియుండదో అట్లే సర్వాశ్రయుడవైన నీవు కృత్తికల ఇంటిలో ఉండలేవు, గరుత్మంతుడు చిన్న పిట్టగూటిలో ఎట్లుండలేడో నీవుకూడ కృత్తికల ఇంటిలో ఉండలేపు, యోగులు కాని వారు జ్ఞానమునెట్లు తెలియరో ఆట్లే గుణములు, తేజస్సులకు రాశివి, భక్తులననుగ్రహించుటకు జన్మనెత్తిన నిన్ను కృత్తికలు గుర్తింపలేరు. మూడులైన శ్రీహరిభక్తి రహితులు, మిక్కిలి గొప్పనైన శ్రీహరిభక్తిని గుర్తించనట్లు, కప్పలు తమతో కలసియుండు పద్మము గొప్పదనమును గుర్తించనట్లు కృత్తికలు నీయొక్క గొప్పతనమును గుర్తింపలేరు. పైగా నీకు అనాదరణ చేయుదురు. అందువలన మావెంట కైలాసమునకు రమ్మని కోరెను.

కార్తికేయ ఉవాచ - కార్తికేయుడు ఇట్లు పలికెను-

 భ్రాతః సర్వం విజానామి జ్ఞానం త్రైకాలికం చ యత్

జ్ఞానీ త్వం కా ప్రశంసా తే యతో మృత్యుంజయాశ్రితః

కర్మణా జన్మ యేషాం వా యాసు యాప చ యోనిష

తాసు తే నిర్వృతిం భ్రాతః నాప్నువంతీ చ సంతతం

యే యత్రవసంతి సంతోవా మూడోవా కర్మభోగతః

తేఽపి తం బహుమన్యం తే మోహితా విష్ణుమాయయా

సాంప్రతం జగతాం మాతా విష్ణుమాయా సవాలేవీ

సర్వాద్యా విష్ణుమాయా చ సర్వదా విష్ణుమంగళా

శైలేంద్రపత్నిగర్భే సా చాలభజ్జన్మ భారతే

దారుణం చ తపస్తప్త్వా సంప్రాపచ్ఛంకరం పతిం

బ్రహ్మాదితృణపర్యంతం సర్వం మీథ్యైవ కృత్రిమం

సర్వే కృష్ణోద్భవాః కాలే విలీనాస్తత్ర కేవలం

కల్పే కల్పే జగన్మాతా మాత మే ప్రతిజన్మనీ

యజ్జన్మమాయయా బద్ధో విత్య సృష్టివీధావహం

ప్రకృతేరుద్భవాః సత్యం జగత్యాం సర్వయోషితః

కాశ్చీదంశా: కళాః కాశ్చిత్కలాంశాంశేన కాశ్చన

కృత్తికా జ్ఞానవత్యశ్చ యోగిన్య: ప్రకృతేః కళాః

సనైశ్చ సంవర్ధితోఽహముపహారేణ సంతతం

తాపామహం సోష్యపుత్రో మదంబాః పోషణాదిమాః

 తస్యాశ్చ ప్రకృతేః పుత్రో గతస్యత్వామివీర్యతః

న గర్బజోఽహం శైలేంద్రకన్యాయా నందికేశ్వర

సా చ మే ధర్మతో మాతా తథేమా సర్వసమ్మతాః

 స్తనదాత్రీ గర్భధాత్రీ భక్ష్యదాత్రీ గురుప్రియా

ఆభీష్టదేవపత్నీ చ పితుః పత్నీ చ కన్యకాః

సగర్భకన్యా భగినీ పుత్రపత్ని ప్రియాప్రసూః

మాతుర్మాతా పితుర్మాతా సోదరస్యప్రియా తథా

మాతుః పితుశ్చ భగినీ మాతులాని తథైవ చ

 జనానాం వేదవిహితా మాతరః షోడశ స్మృతాః

ఇమాశ్చ సర్వసిద్ధిజ్జా పరమైశ్వర్యసంయుతాః

 న క్షుద్రా బ్రహ్మణ: కన్యా త్రిషు లోకేషు పూజితాః

సోదరా! నందికేశ్వరా! భూతవర్తమాన భవిష్యత్కాలములకు సంబంధించిన సమస్త జ్ఞానము నాకు కలదు.

అట్లే నీవుకూడ మహాజ్ఞానివి. మృత్యుంజయుని ఆశ్రయించియున్న నిన్ను ప్రత్యేకించి పొగడవలసిన పనిలేదు. తమ తమ కర్మవనుసరించి ఆయా జన్మలనెత్తినవారు ఆయాజన్మలందు మోక్షమును పొందలేరు. కర్మననుసరించి ఆయా జన్మలనెత్తినవారు విద్వాంసులైనా మూర్ఖులైనా వారు విష్ణుమాయవల్ల మోహితులై తమ జన్మ చాలా గొప్పదని భావింతురు. ఆ విష్ణుమాయ జగములకన్నటికి మాతృరూపిణి, సమస్త సృష్టికంటే ఆద్యురాలు. ప్రపంచమునకంతయు మంగళమును కలిగించునది. ఆ విష్ణుమాయయే హిమాలయ పర్వతరాజు భార్యయగు మేనకు పుత్రికగా జన్మించి అమితమైన, తీవ్రమైన తపమాచరించి శంకరునకు భార్య కాగలిగెను,

బ్రహ్మ మొదలుకొని గడ్డివరకున్న సమస్త సృష్టి అశాశ్వతమైనది. మరియు మిధ్యయైనది. ఈ చరాచరసృష్టియంతయు శ్రీకృష్ణునినుండి పుట్టుచున్నది. మరల అతనియందే విలీనమగుచున్నది.

నేను ప్రతి కల్పమున మాయకు బద్ధుడనై జన్మించుచున్నాను. ఆయా జన్మలలో సహితము జగన్మాతయగు పార్వతీదేవియే నాకు తల్లి. ఈ ప్రపంచముననున్న స్త్రీలందరు ప్రకృతిరూపిణియగు ఆ శక్తి నుండి ఉద్భవించినవారే. వారిలో కొందరు ఆ శక్తియొక్క ఆంశలుకాగా, మరికొందరు ఆమెయొక్క అంశాంశలు. ఇంకను కొందరు అంశాంశాంశలు.

ప్రకృతియొక్క అంశస్వరూపమైన కృత్తికలు జ్ఞానము కలవారు, యోగినులు కూడ. ఆట్టి కృత్తికల స్తన్యముచే వారిచ్చు ఉపహారములచే నేను పేరిగినాను. వారికి నేను పెంపుడు కొడుకును. వారు నన్ను పెంచి పెద్దచేసినందువలన వారు నాకు తల్లులు. అట్లే నేను, ప్రకృతిరూపిణి యగు పార్వతికి పుత్రుడను. పరమేశ్వరుని వీర్యమువలన జన్మనెత్తినవాడను. ఐనను ఓ నందీశ్వరా! నేను పర్వతరాజపుత్రియగు పార్వతియొక్క గర్భమునుండి జన్మింపలేదు. అందువలన పార్వతీదేవి ధర్మతః మాతయే కానీ జన్మనిచ్చిన తల్లికాదు. అట్లే ఈ కృత్తికలు సహితము ధర్మతః తల్లులే కాని జన్మతః తల్లులు కారు.

స్తన్యము నిచ్చునది, గర్భమున ధరించునది, తిండి పెట్టునది, గురువుయొక్క భార్య, ఇష్టదేవతయొక్క భార్య, సవతితల్లి, తన తోబుట్టువులగు స్త్రీలు, కోడలు, తన భార్య తల్లి(అత్తగారు), అమ్మమ్మ, నాయనమ్మ, సోదరుని భార్య, మేనమామ భార్య, మేనత్త, తల్లియొక్క అక్కాచెల్లెండ్లు, తన సోదరుల పుత్రికలు అను పదునారుగురు తల్లులని వేదమున (ధర్మశాస్త్రమున) చెప్పబడిరి.

నన్ను పెంచి పెద్దచేసిన కృత్తికలు నమస్తసిద్దులను తెలిసినవారు, పరమైశ్వర్యసంపన్నులు, త్రిలోకపూజ్యులు, వీరు బ్రహ్మదేవుని పుత్రికలు కానీ క్షుద్రులుమాత్రము కారని పలికెను.

విష్ణునా ప్రేరితస్త్యంచ శంభో: పుత్రసమో మహాన్

గచ్ఛ యామి త్వయాసార్థం దక్ష్యామి సురసంచయం

శ్రీమహావిష్ణువుచే పంపించబడిన శివానుచరుడవగు నీవుకూడ శంకరునకు పుత్రునితో సమానుడవు. అందువలన నీమాటను త్రోసి వేయకూడదు కావున నేను నీతోవచ్చి దేవతలనందరను చూచెదనని కార్తికేయుడు పలికెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే, తృతీయ గణేశఖండే నారద నారాయణసంవాదే నంది కార్తికేయ సంవాదో నామ పంచదశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణమునుల సంవాద సమయమున పేర్కొనబడిన నందీశ్వర, కార్తికేయుల సంవాదముగల పదునైదవ అధ్యాయము సమాప్తము.