నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-
శివం ప్రణమ్య సభృగుద్ధుర్గాం కాళీం ముదాన్వీతః ।
గత్వా పుష్కర తీర్థంచ మంత్రసిద్ధిం చకారపః ॥
ప బభూవ నిరాహారో మాపం భక్తి సమన్వితః ।
ధ్యాయన్ కృష్ణ పదాంభోజం వాయురోధం చకార పః ॥
దదర్శ చక్షురున్మీల్య గగనం తేజసాఽవృతం ।
దిశోదశ ద్యోతయంతం సమాచ్చన్న దివాకరం ॥
తేజోమండల మధ్యస్థం రత్నయానం దదర్శ హ ।
దదర్శ తత్ర పురుషమత్యంత సుందరం వరం ॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం ।
ప్రణమ్య దండవన్మూర్ద్నా వరం వవ్రే తమీశ్వరం॥
త్రిస్సప్తకుత్వ నిర్భూపాం కరిష్యామీ మహీమీతి ।
పాదారవిందే సుదృణాం ఛాం భక్తిమనపాయినీం॥
దాస్యం సుదుర్లభం శశ్వత్త్యత్పాదాబే చ దేహి మే।
కృష్ణస్తస్మై వరం దత్వా తత్రైవాంతరధీయత ॥
భార్గవ రాముడు శివునకు నమస్కరించి, అట్లే దుర్గకు కాళికి కూడ నమస్కరించి శివుని అనుమతితో పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మంత్ర సిద్దికొరకు శ్రీకృష్ణుని మనస్సులో ధ్యానించుకొనుచు ఒక మాస పర్యంతం నిరాహారుడై ప్రాణాయామము చేయుచు తపమా చరించుచుండెను. ఆ పరశురాముడు తపస్సు ముగించి కండ్లు తెరుచునప్పుడు ఆకాశమునంతయు తన దివ్య తేజస్సుతో ఆవరించి, సూర్యునకన్న గొప్ప కొంతితో దశ దిశలు వెలుగుచున్న ఒక దివ్యరథమును చూచెను. ఆ రథమున ఒక సుందర పురుషుడు చిరునవ్వుతో భక్తుల ననుగ్రహించుటకై వచ్చినట్లు కనిపించెను. ఆ దివ్య పురుషుని చూచి, తాను ఈ భూమిపై నున్న రాజాలను ఇరువది యొక్క మార్లు జయించి ఇచ్చట రాజులు లేకుండ చేయునట్లు, శ్రీ కృష్ణుని పాదారవిందములపై దృడమైనది, అపాయరహితమైన దగు భక్తి కలిగియుండునట్లు, శ్రీకృష్ణ దాసుడై యుండునట్లు వరమును వేడగా ఆ పరమాత్మ అట్లే యని భార్గవరాముని అనుగ్రహించి అంతర్ధానమయ్యెను.
భృగుః ప్రణమ్య భవనం తజ్జగామ పరాత్పరం ।
పస్పంద దక్షిణాంగం చ పరం మంగళ సూచకం॥
వాంఛా ప్రతీతి జననం సుస్వప్పం చ దదర్శ హ ।
మనః ప్రసన్నం స్పీతం చ తద్బభూవ దివానిశం॥
సంభాష్య స్వజనం సర్వం గృహే తస్థౌ ముహాన్వీతః॥
స్వశిష్యాచ్ పితృశిష్యాంశ్చ భ్రాతృవర్గాంశ్చ బాంధావాన్ ।
ఆసియావీయ వివిధాన్మంత్రాంశ్చ స చక్రహ ॥
పౌర్వాపర్యం స్వవృత్తాంతం తానేవోక్త్యా శుభక్షణే ।
తైరేవ సార్థం బలవాన్ బభూవ గమనోన్ముఖః ॥
దదర్శ మంగళం రామః శుశ్రావ జయసూచకం ।
బుబుధే మనసా పర్వం స్వజయం వైరి సంక్షయం ॥
యాత్రాకాలే చ పురతః శుశ్రావ సహసా మునిః ।
హరిశబ్దం సింహశబ్దం ఘంటాదుందుభివాదనం ॥
ఆకాశవాణి పంగీతం జయస్తే భవితేతి చ ।
నవేంగితం చ కల్యాణం మేఘశబ్దం జయావహం॥
చకార యాత్రాం భగవాన్ శ్రుత్రైవం వీవీధం శుభం ।
దదర్శ పురతో విప్రనంది దైవజ్ఞభిక్షుకాన్ ॥
జ్వలత్ప్రదీపం దధతీం పతిపుత్రవతీం సతీం ।
పురో దదర్శ స్మేరాస్యాం సావా భూషణ భూషిభాం ॥
శివం శివాం పూర్ణకుంభం చోషం చ నకులం తథా।
గచ్చన్ దదర్శ రామశ్చ యాత్రామంగళ సూచకం ॥
కంసారం గజం పిరహం తురగం గండకం ద్వీపం ।
చమరిo రాజహంసం చ చక్రవాకం శుకం పికం॥
మయూరం ఖంజనం చైవ శంఖచిల్లం చ కోరకం ।
హీరోపతం బలాకేం చ కారంగం చాతకం చటం॥
సౌదామనీం శక్రచాపం పర్యం సూర్య ప్రభాం శుభాం।
సద్యోమాంసం సజీవం చ మత్స్యం శంఖం సువర్ణకం ॥
మాణిక్యం రజతం ముక్తాం మణీంద్రం చ ప్రవాళకం ।
దధీ లాజాన్ శుక్లధాన్యం శుక్లపుష్పం చ కుంకుమం॥
పర్ణం పతాకం చత్రం చ దర్పణం శ్వేతచామరం ।
ధేనుం వత్స ప్రయుక్తాం చ రథస్థం భూమీపం తథా ॥
దుగ్ధమాజ్యం తథా పూగమమృతం పాయసం తథా ।
శాలగ్రామం వక్వఫలం స్వస్తికం శర్కరా మధు ॥
మార్జారం చ వృషేంద్రం చ మేషం పర్వతమూషికం ।
మేఘచ్చన్నస్య చ రవేరుదయం చంద్రమండలం ॥
కస్తూరిం వ్యంజసం తోయం హరిద్రాం తీర్థమృత్తికాం।
సిద్ధార్థం పర్షపం దూర్వాం విప్రబలం చ బాలికాం ॥
మృగం వేశ్యాo షట్పదం చ కర్పూరం పీత వాససం ।
గోమూత్రం గోపురీషం చ గోధూళిం గోపదాంకితం ॥
గోష్ఠం గవాం వర్త్మ రమ్యాం గోశాలాం గోగతిం శుభాం ।
భూషణం దేవమూర్తిం చ జ్వలదగ్నిం మహోత్సవం॥
తామ్రం చ స్పటికం వంద్యం సిందూరం మాల్యచందనం ।
గంధం చ హీరకం రత్నం దదర్శ దక్షిణే శుభం॥
సుగంధివాయోరాఘ్రాణం ప్రాప విప్రాశిషం శుభాం ॥
భార్గవ రాముడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి తన ఇంటికి బయలుదేరెను. అప్పుడతనికి శుభ శకునముగా కుడియయములు అదరెను. తన కోరిక కనుగుణముగా మంచి కల (సుస్వప్నము) పడెను. అతని మనస్సు ఉద్విగ్నము కాక ప్రసన్నముగా నుండెను. రాత్రింబగళ్ళు వృద్ది చెందినవి.
ఆ సమయమున భార్గవరాముడు తనవారినీ, తన శిష్యులను, తనతండ్రి శిష్యులను, సోదరులను, బంధువులను అందరిని పిలిపించుకొని తన ఇంటిలో సమావిష్టుడై ముందు చేయు కార్యక్రమమునకై వారి ఆలోచనలను అడిగి తెలిసికొనను. వాటి పూర్వాపరములను తన వృత్తాంతమునంతయు వారికి తెలియపరచి వారి యొక్క ఆమోదమువలన తాను బలవంతుడై కార్తవీర్యునితో యుద్ధమునకై బయలుదేరెను.
భార్గవ రాముడు యుద్ధమునకు పోవు సమయమున ఆతనికి శుభశకునము లెదురైనవి. వాటి వలన ఆతడు తన శత్రువులు మరణింతురని, తనకు విజయము లభించునని తలచెను.
అతడు యుద్ధయాత్రకి బయలు దేరుచున్నప్పుడు మయూరము, సింహము, గంట దుందుభిధ్వాసము వినిపించెను, ఆకాశవాణి కూడ అతనికి జయము కలుగున్నట్లు పలికినది. అట్లే మంగళమును సూచించు నవేంగీతము జయమున సూచించు మేఘ శబ్దము వినబడినది.
అదే విధముగా అతనికి ఎదురుగా బ్రాహ్మణులు వందిమాగధులు, జ్యోతిష్కులు. భిక్షుకులు కనిపించిరి. వెలిగించిన దీపమమ పట్టుకొని, అనేక భూషణములు ధరించి చిరునవ్వుతోనున్న ముత్తైదువ ఎదురు వచ్చినది. ఆతని యొక్క మార్గమున నక్క పూర్ణకుంభము, నెమలీ, ముంగీస మొదలైన మంగళసూచకములైన జంతువులు పక్షులు కనిపించినవి. అట్లే కృష్ణ సారము, ఏనుగు, సింహము, గుఱ్ఱము, గండకము, చమరీమృగము, రాజహాంస, చక్రవాకము, చిలుక, కోకిల, నెమలి, కాటుకపిట్ట, చకోర పక్షి, పాపురము, కొంగ, చాతకము, చటము, మెరుపు, ఇంద్రధనుస్సు, సూర్యుడు, సూర్యకాంతి, అప్పుడే తీసిన మాంసము, ప్రాణము చేపలు, శంఖము, బంగారము, పెరుగు, పేలాలు, తెల్లని దాస్యము, తెల్లని పుష్పములు, కుంకుమ, పతాకము, ఛత్రము, ఆప్తము, తెల్లని చామరము, దూడతోనున్న ఆవు, రథముపై మవ్న రాజు, పాలు, నెయ్యి, అమృతమను తిను పదార్థము, పాయసము, సాలగ్రామము, దోరమాగిన పండ్లు, స్వస్తికమను ఆహార పదార్థము, చక్కర, తేనె, పిల్లి, ఎద్దు, మేక, ఆడవి ఎలుక, మబ్బుల నుండి విడిపోయిన చంద్రుడు, సూర్యుడు, కస్తూరి, నీరు, పసుపు, పుణ్యతీర్థముల మన్ను, తెల్లనూవులు, గరకి, బ్రాహ్మణ బాలకుడు, బాలిక, జింక, వేశ్య, తుమ్మెద, కర్పూరము, పట్టుబట్ట, గోమూత్రము, గోమయము, గోధూళి, కొట్టము, పశువులు నడచు త్రోవ, గోశాల, గోమార్గము, భూషణములు, దేవతామూర్తి, మండుచున్న నిప్పు మహోత్సవము, రాగి, స్ఫటికము, సింధూరము, గంధము, రత్నము మొదలగువాటిని తన కుడి ప్రక్క చూచెను.
అదేవిధముగా సువాసనగల వాయువు నాఘ్రాణించుచు బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులను పొందెను.
ఇత్యేవం మంగళం జ్ఞాత్వా ప్రయయౌ ఏ ముదాన్వితః ।
ఆస్తంగతే దినకరే నర్మదా తీర సన్నిధౌ॥
తత్రాక్షయవటం దివ్యం దదర్శ సుమనోహరం।
ఆత్యూర్ద్వం వీస్త్రుతమతీ పుణ్యాశ్రమ పదం పరం ॥
పౌలస్త్య తపసః స్థానం సుగంధిమరుద్వతం ।
కార్తవీర్యార్జునాభ్యాశే తత్ర తస్థౌ గణైః సహ ॥
సుష్వాప పుష్పశయ్యాయాం కింకరైః పరిసేవితః ।
నిద్రాం యయౌ పరిశ్రాంతః పరమానంద సంగతః ॥
నిశాతీతే చ సభృగుశ్చారుస్వప్నం దదర్శహ ।
ఈవిధముగా మంగళ శకునములను చూచుచు భార్గవరాముడు సంతోషములో యుద్ధ ప్రయాణము చేయసాగెమ. సూర్యాస్తమన సమయమున అతడు నర్మదానదీతీరమున అక్షయ వట వృక్షమును చూచెను. దాని తరువాత మిక్కిలి విశాలమైన పౌలస్త్యముని ఆశ్రమ స్థానమునకు చేరుకొనెను. ఆ స్థలము కార్తవీర్యార్జునుని పట్టణమునకు సమీపమునున్నది, అచ్చట తనవారితో కలపి పూలశయ్యపై పరుండెను. ఆతడు తెల్లవారు సమయమున ఒక సందర స్వప్నమున చూచెను.
న చింతీతం యన్మనః వాయుపిత్తకఫం వినా ॥
గజాశ్వశైల ప్రాసాద గో వృక్షఫలితేషు చ ।
ఆరుహ్యమాణమాత్మానం రుదంతం కమీభక్షితం ॥
ఆరుహ్యమాణమాల్మానం నౌకాయాం చందనోక్షితం।
ధృతవంతం పుష్పమాలాం శోభితం పీత వాపసా ॥
వీణ్మూత్రోక్షిత సర్వాంగం వహిపూయ సమన్వితం ।
వీణాం వరారి వాదయంతమాత్మానం చ దదర్శ హ ॥
విస్తీర్ణ పద్మ పత్రైశ్చ స్పం దదర్శ సంత్తటే ।
దధ్యాజ్యమరుసంయుక్తం భుక్తవంతం చ పాయసం ॥
భుక్తవంతం చ తాంబూలం లభంతం బ్రహ్మణాశిషం ।
ఫలపుష్పప్రదీపం చ వేశ్యంతం స్వం దదర్శ హ॥
పరిపక్వఫలం క్షీరముష్టాన్నం శర్కరాన్వితం ।
స్వస్తికం భుక్తవంతం స్వం దదర్శ చ పునః పునః ॥
జలౌకయా వృశ్చికేన మీనేన భుజగేన చ ।
భక్షితం భీతమాత్మానం పలాయంతం దదర్శ సః ॥
తతో దదర్శ చాత్మానం మండలం చంద్రసూర్యయోః ।
పతీపుత్రవతీం నారీం పశ్యంతం పప్మితం ద్విజః ॥
సువేషయా కన్యకయా సస్మితేన ద్విజేన చ ।
దదర్శ శ్లిష్టమాత్మానం తుష్టేన పరీశ్లిష్టయా ॥
ఫలితం పుష్పితం వృక్షం దేవతా ప్రతిమాల సృపం ।
గజస్థం చ రథస్థం చ పశ్యంతం స్వం దదర్శ హ ॥
పీత వస్త్రపరీధానాం రత్నాలంకార శోభితాం ।
విశంతిం బ్రాహ్మణీం గేహం పశ్యంతం స్వం దదర్శహ॥
శంఖం చ స్పటికం శతమాలాం ముకాం చ చందనం ।
సువర్ణం రజతం రత్నం పశ్యంతం స్వం దదర్శ హ ॥
గజం వృషం చ సర్పం చ శ్వేతం చ స్వేత చామరం ।
నీలోత్పలం దర్పణం చ భార్గవో వై దదర్శ హ॥
రథస్థం నవరత్నాడ్యం మాలతీమాల్య భూషితం ।
రత్న సింహాసనస్థం స్వం భృగుః స్వప్నే దదర్శ హా॥
భార్గవ రాముని స్వప్నము వాయు పిత్త కఫాది దూషితమైన మనస్సు చింతించినది కాదు.
అతని స్వప్నములో ఆతడు ఏనుగను, గుఱ్ఱమును, గుట్టను, సౌధమును ఎక్కుచున్నట్లు కనపడినది. క్రిములు తన శరీరమును భక్షించుచుండగా చూచి ఏడ్చుచున్నట్లు కనిపించినది. అట్లే చందనమును పూసికొని నౌకను ఎక్కినట్లు, పట్టువస్త్రమును, పుష్పమాలలను ధరించి యున్నట్లు కనిపించినది. మలమూత్రములచే వసచే తన శరీరము పూయబడి ఉన్నట్లు, వీణను మోగించుచున్నట్లు స్వప్నము వచ్చినది. నదీతీరమున వెడల్పైన పద్మముల రేకులపై మన్నట్లు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసము తీనుచున్నట్లు ఆటుపిమ్మట తాంబూలమును వేసికొని బ్రాహ్మణుల ఆశీస్సులు తీసికొనుచున్నట్లు స్వప్నము కలిగినది. ఫలములను, పుష్పములను, దీపమును తాను చూచుచున్నట్లు, పండిన ఫలములను, పొలను, చక్కర కలిపిన వేడి వేడి యన్నమును, స్వస్తికము అనువంటను, తినుచున్నట్లు కల వచ్చినది. మరల అతనిని జలజంతువులు, తేళ్ళు, చేపలు, పాములు తినుటకు లేక కాటు వేయుటకు రాగా భయముచే ఆతడు పరుగెత్తుచున్నట్లు కల వచ్చినది. తరువాత అతడు సూర్యచంద్ర మండలముల చూచుచున్నట్లు, పుత్రులు కల ముత్తైదువ కనిపించినట్లు స్వప్నము వచ్చెను. చక్కని వేషముతో నున్న కన్యక అతనిని కౌగిలించుకొనివట్లు, బ్రాహ్మణుడు. సంతోషముతో ఆలింగనమొనర్చుకొన్నట్లు, ఫలములు, పుష్పములు గల వృక్షమును, దేవతా విగ్రహమును చూచినట్లు, తాను రథము పైనను, ఏనుగుపైనను ఉన్నట్లు, పట్టువస్త్రము, రత్నాలంకారములు ధరించిన బ్రాహ్మణ స్త్రీ తన ఇంటిలోనికి ప్రశేశించుచున్నట్లు, శంఖమును, స్పటికమును, తెల్లని మాలను, ముత్యములను, చందనమును, బంగారును, వెండిని, రత్నమును, ఏనుగను, వృషభమును, తెల్లని సర్పమును శ్వేత చామరములను నీలోత్పలమును, అద్దమును కలలో చూచేను, తాను నవరత్నములుగల రథమును మాలతీ మాల ధరించి ఎక్కినట్లు, ఇంకను రత్న సింహాసనమున ఉన్నట్లు కల గనెను.
పద్మశ్రేణీం పూర్ణకుంభం దధి లాజాన్ ఘృతం మధు ।
వర్ణఛత్రం ఛత్రిణం చ భృగు: స్వప్నే దదర్శహ ॥
బక పంక్తిం హంసపంక్తిం కన్యాపంక్తిం ప్రతాన్వితాం ।
పూజయంతీం ఘటం శుభ్రం భృగు: స్వప్నే దదర్శహ॥
మండపస్థం ద్విజగణం పూజయంతం హరం హరిం ।
జియోఽస్త్విత్యుక్తివంతం తం భృగు: స్వప్నే దదర్శహ॥
సుధావృష్టిం పర్ణవృష్టిం ఫలవృష్టిం చ శాశ్వతీం ।
పుష్పచందన - వృష్టిం చ భృగు: స్వప్నే దదర్శ హ ॥
సద్యోమాంసం జీవమత్స్యం మయూరం శ్వేతఖంజనం ।
సరోవరం చ తీర్థావి భృగు: స్వప్నే దదర్శహ ॥
పారావతం శుకం చాషం శంఖం చిల్లం చ చాతకం।
న్యాఘ్రం సింహం చ సురభిం భృగు: స్వప్నే దదర్శహ ॥
గోరోచనం హరిద్రంచ శుక్ల ధాన్యాచలం వరం ।
జ్వలదగ్నిం తథా దూర్వాం భృగు: స్వప్నే దదర్శహ ॥
దేవాలయ సమూహం చ శివలింగం చ పూజితం ।
అర్చితాo మృణ్మయీం శైవాం భృగుః స్వప్నే దదర్శహ ॥
యమగోధూమ చూర్ణానాం భక్ష్యాణి వివిధాని చ ।
భృగుర్ధదర్శ స్వప్నే చ బుభుజే చ పునః పునః॥
దివ్యవస్త్రపరీధానా రత్నభూషణ భూషితాః ।
అగమ్యాగమనం స్వప్నే చకార భృగునందనః ॥
దదర్శ నర్తకీం వేశ్యాం రుధిరం చ సురాం పపౌ ।
రుధిరోక్షిత సర్వాంగః స్వప్నే చ భృగునందనః ॥
పక్షిణాం పీతవర్ణానాం మానుషాణాం చ నారద ।
మాంసాని బుభుజే రామో హృష్ట: స్వప్నేఽరుణోదయే॥
ఆకస్మాన్నిగడైర్భద్ధం క్షతం శస్తేణ సం పునః ।
దృష్టా చ బుబుదే ప్రాతః సముత్తస్థౌ హరీంస్మరన్॥
భార్గవ రాముడు తన స్వప్నములో పద్మముల వరుసను, పూర్ణకుంభమును, పెరుగును, పేలాలను, నేతిని, తేనెను, తాటియాకులచే చేయబడిన ఛత్రి గల వానిని, కొంగల వరుసను, హంసల వరుసను, పూర్ణఘటమును పూజించు కన్యలను, వ్రతమున నున్న కన్యలను; మండపములోనున్న శంకరుని లేక విష్ణువును పూజించుచున్న బ్రాహ్మణులను, తనకు జయము కలుగునట్లు వారు ఆశీర్వదించుచున్నట్లు చూచెను.
అదే విధముగా అమృతవర్షమును, ఆకులు రాలుటను, ఫలములు వర్షముగా పడుటను, పుష్పములు చందనముల వృష్టిని, అప్పుడే కోసిన మాంసమును, జీవించియున్న చేపలను, నెమలిని, తెల్లని కాటుక పిట్టను, సరోవరమును, పుణ్యతీర్థమును, పాపురమును, చీలుకను, పాలపిట్టను, శంఖమును, ఆడ చిన్న గ్రద్ధను, చాతక పక్షిని, పులిని, సింహమును, ఆవును, తన కలలో చూచేను. ఆట్లే గోరోచనమును, పసుపును, తెల్లని ధాన్యములను, మండచున్న అగ్నిని, గరికను, దేవాలయ సమూహమును, పూజలందుకొన్న శివలింగమును, అట్లే పూజింపబడిన మృణ్మయ లింగమును, తన స్వప్నములో భార్గవ రాముడు చూచెను. యవలు, గోధుమల పిండిని, రకరకములైన భక్ష్య పదార్థములను తీసుచున్నట్లు దీవ్యవస్త్రములు, దివ్యాలంకారములు ధరించిన దీవ్యస్త్రీతో సంగమము చేయుచున్నట్లు, నర్తకి, వేశ్య, రక్తము, కల్లును, తనస్వప్నములో చూచెను. అట్లే తన శరీరము నందంతట రక్తమును పూసికొన్నట్లు, పచ్చని రంగుగల పక్షుల మాంసములను తినుచున్నట్లు, ఆకస్మాత్తుగా తనను సంకెళ్ళతో కట్టివేసినట్లు ఆయుధములచే దెబ్బలు తిన్నట్లు ఉదయకాలమందలి తన స్వప్నములో భార్గవరాముడు చూచెను.
ఆతీవ హృష్ట స్వప్నేన ప్రాతః కృత్యం చకారసః।
మనసా బుబుధే సర్వం విజేష్యామి రిపుం ధ్రువం॥
ఉదయ కాలమున వచ్చిన ఈశుభస్వప్నముల వలన భార్గవ రాముడు మిక్కిలి సంతోషించి తన శత్రువును తప్పక చంపగలనని తలచి తన ప్రాతః కృత్యములను సంతోషముతో చేసికొనెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతేయే గణపతి ఖండే నారద నారాయణ సంహాదే త్రయస్త్రింశత్తమోఽధ్యాయః॥
శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన భార్గవ రాముని స్వప్న వృత్తాంతమను ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 33 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
A heated verbal exchange erupted between the intense warrior Parashurāma and the wise, calm Lord Gaṇeśa. Parashurāma argued that as a devoted disciple who had just completed a grand divine mission for Lord Śiva, he possessed the inherent right to see his preceptor without delay. Lord Gaṇeśa countered with profound philosophical reasoning, explaining that devotion to a preceptor requires absolute obedience to the preceptor's rules and respect for the privacy of the divine parents, asserting that martial arrogance has no place at the threshold of Kailāsa. As words turned sharper, Parashurāma's temper flared, leading him to attempt to force his way past the gate.