బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

35 - శంకర కవచ కథనం

నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు నారదునితో పలికెను-

మనోరమా ప్రాణనాథం క్షణం కృత్వా స్వపక్షసి

భవిష్యం మనసా చక్రే యద్యత్ స్వామి ముఖాత్ శ్రుతం

పుత్రాంశ్చ పురతః కృత్వా బాంధవాంశ్చ స్వకింకరాన్

సస్మార సా హరిపదం మేనే సత్యం భనేన్మునే

యోగేన ఛిత్వా షట్చక్రం వాయుం సంస్థాప్య మూర్ధని

బ్రహ్మరంధ్రస్థకమలే సహస్ర దళసంయుతే

స్వాంతమకృష్య విషయాజ్జలబుద్బుద సన్నిభాత్

సంస్ధాప్య బధ్వాజ్ఞానేన లోలం బ్రహ్మణి నిష్కులే

ద్వివిధం కర్మ సన్యస్య నిర్మూలమపునర్భవం

తత్ర ప్రాణాంశ్చ తత్యాజ న చ ప్రాణాధికం ప్రియం

మనోరమాదేవి తన ప్రాణనాథుని క్షణకాలము తన రొమ్ముపై నుంచుకొని తన భర్త చెప్పిన భవిష్యద్విషయములను మనస్సులో నుంచుకొని తన పుత్రులను కింకరులను, బంధువులనందరను పిలిపించుకొని శ్రీహరి పాదములను మనస్సులోనుంచుకొని తన భర్త చెప్పిన మాటలు సత్యమగునవి విశ్వసించెను.

తరువాత ఆ దేవి యోగమార్గమున మూలాధారాది షట్చక్రములనతిక్రమించి, తన శిరస్సున వాయువునుంచుకొని. బ్రహ్మరంధ్రముననున్న సహస్ర దళకమలమున నీటి బుడగలవంటి విషయముల నుండి తన మనస్సును తప్పించి నిష్కళంకమైన పరబ్రహ్మయందు దానిని సుస్థిరము చేసెను. నిర్మూలము, సంసార రహితమగు ద్వివిధ కర్మలను వదలి పెట్టుచు తన ప్రాణములను కూడ విడిచినది. కాని ఆమె తన మనస్సులో తన ప్రాణముల కన్న గొప్పనైన తన భర్తను మాత్రము వదిలి పెట్టలేదు.

స రాజా తాo మృతాం దృష్ట్యా విలలాప రురోదన

సన్నాహం సంపరిత్యజ్య కృత్వా వక్షస్యువాచ తాం

రాజగు కార్తవీర్యార్జునుడు తన భార్య చనిపోయిన విషయమును తెలిసికొని ఏడ్వసాగెను. అట్లే అతడు యుద్ధ సన్నాహములను వదలి పెట్టి ఆమెను కౌగిలించుకొని ఇట్లు మాట్లాడెను.

రాజోవాచ- రాజగు కార్తవీర్యుడిట్లు పలికెను-

మనోరమే సముత్తిష్ఠ న యాస్యామి రణాంగణం

సచేతనా మాం పశ్యతి వీలవంతం ముహుర్ముహుః

మనోరమే సముత్తిష్ఠ మయాసార్థం గృహం ప్రజ

వ కరిష్యామి సమరం భృగుణా సహ భామీని

 మనోరమే సముత్తిష్ఠ శ్రీశైలం ప్రజ సుందరి

తత్రక్రీడాం కరిష్యామీ త్వయాసార్థం యథా పురా

మనోరమే సముత్తిష్ఠ ప్రజ గోదావరీం ప్రియే

జలక్రీడాం కరిష్యామి త్వయా సార్థం యథాపురా

మనోరమే సముత్తిష్ఠ నందనం ప్రజ సుందరీ

పుష్పభద్రానదీతీరే విహరిష్యామి నిర్జనే

మనోరమే సముత్తిష్ఠ మలయం వ్రజ సుందరీ

త్వయాసార్థం రమిష్యేఽహం తత్ర చందన కాననే

శ్రీతేన గంధయుక్తేన వాయునా సురభీకృతే

భ్రమర ధ్వని సంయుక్త పుంస్కోకిలరుతశ్రుతే

చందనాగురు కస్తూరీ కుంకుమలేపనం కురు

 చందనోక్షిత సర్వాంగం పశ్య మాం సస్మితే సతి

సుధాతుల్యం సుమధురం వచనం రచయ ప్రియే

కుటిల భ్రూవికారం చ కథం న కురు షేఽధునా

ఓ మనోరమా! నీవు లేచినచో నేను యుద్ధమునకు పోను.నన్ను చక్కగా చూడుమని రాజు మాటి మాటికి విలపించుచుండెను. అతడుతన గడచిన స్మృతులను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచు ఓ మనోరమా! నీవు లేచి శ్రీశైల పర్వతమునకు పోయినచో అచ్చట పూర్వము వీహరించినట్లే విహరింతుము. ఆట్లే ప్రియురాలా! నీవు లేచి గోదావరీనదికి పోయినచో ఆనదిలో పూర్వమాచరించినట్లే జలక్రీడలుచేయుదము. ఇంకను నీవు లేచి నందనవనమునకు పోయినచో పుష్పభద్రానదీతీరమునున్న నిర్జన ప్రాంతమున విహరించుదము. అట్లే నీవు లేచి మలయ పర్వతమునకు వెళ్ళినచో, అచ్చటి చందనవనమున నీతోరమింతును, అచ్చటివాయువు చల్లగాను. పరిమళభరితముగాను ఉండును. ఆ ప్రదేశము గండుతుమ్మెదల ధ్వనితో, గండుకోయిలల కుహూ సాదముతో నిండియుండును. ఆచ్చట నీవు నన్ను చందనము, ఆగురు, కస్తూరి, కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములపై పూతను పూయుము. చందనముతో నిండిన సర్వావయవములు కల నన్ను చూడుము. అమృతోపమానములగు సమధురవచనములలో సన్ను పలుకరింపుము. నీవీప్పుడు కోపముతో ఎందుకు పలుకరింపవని దుఃఖించుచు రాజూ. పలికెను.

నృపస్య రోదనం శ్రుత్వా వాగ్భభూవాశరీరిణీ

స్థిరీభవ మహారాజ కురుషే రోదనం కథం

 త్వం మహాజ్ఞానినాం శ్రేష్ఠో దత్తాత్రేయ ప్రసాదతః

 జలబుద్బుదవత్సరం సంసారం పశ్య శోభనం

 కమలాం చ సా సాద్వీ జగామ కమలాలయం

త్వమేవ గచ్ఛ వైకుంఠం రణం కృత్వా రణాజిరే

కార్తవీర్యుడు దుఃఖముతో పలుకుచున్న మాటలు విని ఆశరీరవాణి ఆ మహారాజుతో ఇట్లు పలికెను. ఓమహారాజా! నీవు ఓపిక పట్టుకొనుము. దత్తాత్రేయస్వామియొక్క ఆనగ్రహమువలన నీవు మిక్కిలి జ్ఞానమును సంపాదించుకొంటివి. మహాజ్ఞానివగు నీవే ఏడ్చుచున్నావు, ఈ సంసారమంతయును నీటి బుడగవలె చాల అందముగా కన్పించుచున్నను ఆది . క్షణికమైనది. దానికై నీవు బాధపడుట తగదు.

నీభార్యయగు మనోరమ పరమ పతివ్రత. లక్ష్మీదేవియొక్క ఆంశవలన జన్మించినది కావుననే లక్ష్మీదేవి నివసించుచున్న వైకుంఠమునకు పోయినది. అందువలన నీవు కూడ రణరంగమున ప్రాణములను వదలి వైకుంఠమునకు పొమ్మని పలికెను.

ఇత్యేవం వచనం శ్రుత్వా జహౌ శోకం నరాధిపః

తతశ్చందన కాష్ఠేన చితాం దీవ్యాం చకార సః

సంస్కారాన్ని కారయిత్వా పుత్రద్వారా దదాహ తాం

నానావిధాని రత్నాని బ్రాహ్మణేభ్యో దదౌ ముదా

నానావిధానీ దానాని వస్త్రాణి విధిధానీ చ

మనోరమాయాః పుణ్యేన బ్రాహ్మణేభ్యో దదౌ ముదా

భుజ్యతాం భుజ్యతాం శశ్వద్దీయతాం దీయతా మీతి

శబ్ధో బభూవ సర్వత్ర కార్తవీర్యాశ్రమే మునే

కోషేషు స్వాధికారేషు స్థితం యద్యద్ధనం తదా

మనోరమాయ: పుణ్యేన బ్రాహ్మణేభ్యో దదౌముదా

ఆకాశవాణి యొక్క మాటలను విని కార్తవీర్యుడు భార్యాశోకమును వదలి చందనపు కట్టెలతో దివ్యమైన చితిని చేయించెను. తరువాత పుత్రునీ ద్వారా సంస్కారములనన్నిటిని చేయించి చితికి నిప్పు పెట్టించెను. అటుపిమ్మట బ్రాహ్మణులకు దానముగా అనేక విధములైన రత్నములను, వస్త్రములను తనకు చెందిన కోశాగారమున నున్న ధనమంతయు ఇచ్చెను. ఇదియంతయు మనోరమ యొక్క పుణ్యము వలననే జరిగినది. ఆసమయమున కార్తవీర్యునియొక్క ఇంటిలో ఎచ్చట చూచినను తినుడు తినుడని, దానములనిండు, ఇండు అనుశబ్దములు మాత్రమే వినవచ్చినవి.

రాజా జగామ సమరం హృదయేన విదూయతా

సార్థం సైన్యసమూహైశ్చ వాద్యభాండైరసంఖ్యకై:

దదర్శామంగళం రాజా పురోవర్త్మని వర్త్మని

యయౌ తథాఽపి సమరం నాజగామ గృహం పునః

రాజు బాధపడుచున్న మనస్సులోనే, తన సైన్యసమూహమును, వాద్యములను, భాండాగారమును వెంట పెట్టుకొని-- యుద్దమునకు బయలు దేరిను. అతడు యుద్ధమునకు పోవు సమయమున త్రోవలో అనేకాశుభ శకునములు కనిపించినను వెనుదిరుగక యుద్దమునకు పోయిన మహారాజు మరల ఇంటికి తిరిగి రాలేదు.

ముక్తకేశిం చిన్ననాసాం రుదతీం చ దిగంబరాం

కృష్ణవస్త్ర పరీధావామపరాం వీధవామపి

ముఖదుష్టాం వ్యాధియుక్తాంచ కుట్టినీం

పతిపుత్ర విహీనాం చ డాకినీం పుంశ్చలీం తథా

కుంభకారం తైలకారం వ్యాధం సర్పోపజీవినం

కుచేలమతిరూక్షాంగం నగ్నం కాషాయవాసినం

 వసా విక్రయిణం చైవ కన్యావిక్రయిణం తథా

 చితా దగ్ధం శవం భస్మ నిర్వాణాంగారమేవచ

సర్పక్షతం నరం సర్పం గోధార చ శశకం విషం

శ్రాద్ధపాకం చ పిండం చ మోటకం చ తిలాంస్తథా

 దేవలం వృషవాహం చ శూద్రశ్రాద్ధాన్న భోజనం

శూద్రన్న పాచకం శూద్రయాజకం గ్రామయాజకం

 కుశపుత్తలీకాం చైవ శవదహన కారిణం

శూన్యకుంభం భగ్నకుంభం తైలం లవణమస్థి చ

కార్పాసం కచ్ఛపం చూర్ణం కుక్కురం శబ్దకారిణం

దక్షిణే చ సుగాలం చ కుర్వంతం భైరవం రవం

కపర్థకం చ క్షౌరం చ ఛిన్నకేశం నఖం మలం

కలహాం చ విలాపం చ తథా తత్కారీణం జనం

 ఆమంగళం రుదంతం చ రుదంతం శోకకారిణం

మిథ్యాసాక్ష్య ప్రదాతారం చౌరం చ నరమాతనం

పుంశ్చలీపతి పుత్రా చ పుంశ్చల్యోదన భోజనం

దేవతా గురు విప్రాణాం వస్తు విత్తాపహారిణం

దత్తాపహరిణం దస్యుం హింసకం సూచకం ఖలం

 పితృమాతృవిరక్తం చ ద్విజాశ్వత్థ విఘాతీనం

సత్యఘ్నం చ కృతఘ్నం చ స్థాప్యస్యాప్యపహారిణం

 వీప్ర మిత్ర ద్రోహమేవం క్షతం విశ్వాస ఘాతకం

గురుదేవ ద్విజానాం చ నీoదకం స్వాంగ ఘాతకం

జీవానాం ఘాతకం చైవ స్వాంగహీనం చ నిర్దయం

ప్రజోపవాసదీనం చ దీక్షాహీసం నపుంసకం

గలిత వ్యాధిగాత్రం చ కాణం బధిరమేవ చ

పుల్కసం ఛిన్నలింగం చ సురాపత్తం సురాం తథా

క్షిప్తం మమంతం రుధిరం మహిషం గర్దభం తథా

మూత్రం పురీషం శ్లేష్మాణం రూక్షిణం నృకపాలకం

చండవాతం రక్తవృష్టిం వాద్యం వై వృక్షపాతనం

వృకం చ సూకరం గృధ్రం శ్యేనం కంకం చ భల్లుకం

 పాశం చ శుష్కకాష్టం చ పాయసం గంధకం తథా

ప్రతిగ్రాహి బ్రాహ్మణం చ తంత్రమంత్రోప జీవినం

వైద్యం చ రక్తపుష్పం చాప్యౌషధం తుషమేవ చ

కువార్తాం మృతవార్తాంచ విప్రశాపం చ దారుణం

దుర్గంధివాతం దుశ్శబ్దం రాజాఽపశ్యత్స వర్మని

మనశ్చ కుత్సితం ప్రాణాః క్షుభితాశ్చ నీరంతరం

వామాంగ స్పందనం దేహజాడ్యం రాజ్జో బభూవ హ

కార్తవీర్యుడు రణరంగమునకు పోవుచున్నప్పుడు మార్గమధ్యలో తల విరియబోసికొని ముక్కు తెగిపోగా దిగంబరగా ఏడ్చుచు నల్లని వస్త్రములు ధరించిన స్త్రీని, విధవా స్త్రీని, చెడు మాటలు మాట్లాడునది, రోగముతోనున్న కుట్టీనిని (తార్చెడుస్తీని) భర్త, పుత్రులులేని స్త్రీని, వ్యభిచారము చేయు స్త్రీని, కుమ్మరివానిని, గానుగవానిని, వ్యాధుని, పాములనాడించుచు బ్రతుకు పురుషుని, మలిన వస్త్రములు ధరించినవానిని, చాలా భయంకరమైన అవయవములు కలవానిని, నగ్నముగా నున్నవానిని, కాషాయ వస్త్రములు కలవానిని, వసను అమ్ముకొని బ్రతుకువానిని, తన కన్యను అమ్ముకొనువానిని, చితిపై మండుచున్న శవమును, శవము యొక్క బూడిదను, ఆరిపోవుచున్న నిప్పును చూచుచు రణరంగమునకు పోయెను.

ఇంకను ఆతడు తన మార్గములో సర్పదష్టుడైన పురుషుని, సర్పమును, తొండను, కుందేలును, విషమును, శ్రాద్ధపాకమును, శ్రాద్ధపిండములను, మోటకమును, నూవులను, అర్చకుని, వృషభమునెక్కి తిరుగువానిని, శూద్రుని యొక్క శ్రాద్దాన్నమును భుజించువానిని, శూద్రులకు వంట వండి బ్రతుకువానిని, శూద్రులచే పూజలు చేయించువానిని. గడిబొమ్మను, శవములను కాల్చువానిని, శూన్యమైన కుంభమును, పగిలిన కుండను, నూనె, ఉప్పు, ఎముకలను, ప్రత్తిని, తాబేలును, కుడిప్రక్క మొరుగుచున్న కుక్కను, భయంకరముగా ఊళవేయునక్కను, క్షౌరము చేయగా పడిన వెండ్రుకలను, గోళ్ళను, మలమును, కలహమును, ఏడ్పును, చనిపోయినందువలన ఏడ్చుచున్న జనమును, కూట సాక్ష్యములు చెప్పువానిని, దొంగను, హంతకుని, చెడిపోయిన స్త్రీయొక్క భర్తను, పుత్రులను, ఆమె వంటను తిను బ్రాహ్మణుని, దేవతలు, గురువు, బ్రాహ్మణుల యొక్క ధనము నపహరించువానిని, ఇతరులకు దానముగా నీయబడిన వస్తువు నపహరించిన వానిని, దుర్మార్గుని, ఇతరుల హింసించువానిని, సూచకుని, తల్లిదండ్రులను పోషించని వానిని, బ్రాహ్మణుని హింసించువానిని, రావిచెట్టును పడగొట్టు వానిని అబద్దములాడు వానిని, కృతఘ్నుని, తన దగ్గర దాచి పెట్టిన వస్తువుల నపహరించువానిని, బ్రాహ్మణులకు, న మిత్రులకు ద్రోహాము చేయు వానిని, విశ్వాసఘాతకుని, గురువులను, దేవతలమ, బ్రాహ్మణులను ఎల్లప్పుడు నిందించువానిని, జీవులను చంపువానిని, ఆవయవములు లేనివానిని, దయలేనివానిని, వ్రతోపపవాసములు చేయనివానిని. వ్రతనియమము లేని వానిని. కల్లును, రక్తమును కక్కుకొనుచున్నవానిని, దున్నపోతును, గాడిదను, మలమూత్రములను, శ్లేష్మమును, భయంకరమైన పుట్టెను, ఈదురుగాలిని, రక్తవర్షమును, చెట్లు పడిపోవుటను, తోడేలును, పంది, గద్దను, డేగను, ఎలుగుబంటినీ, పాశములను. ఎండిపోయిన కట్టెలను, కాకిని, దానమును తీసికొనుచున్న బ్రాహ్మణుని, తంత్రమంత్రమువలన జీవించువానిని, వైద్యుని, ఎట్టిని పుష్పములను, ఔషధమును, ఊకను, చెడువార్తను, మరణవార్తను, బ్రాహ్మణశాపమును. దుర్వాసనగల వాయువును చూచెను. దానిచే అతని మనస్సు వికలమైనది. ఎడమ పార్స్వము ఆదరసాగినది. జాడ్యమేర్పడినది.

ఈవిధముగా కార్తవీర్యునకు మార్గమధ్యములో అపశకునములు కలిగినవి.

తధాఽపి రాజా నిశ్శంకో దదర్శ సమరాంగణం

సర్వ సైన్యసమాయుక్తః ప్రవిదేశ రణాజిరం

 ఆవారుహ్య రథాత్తూర్ణం దృష్ట్యా చ పురతో భుం

ననామ దండవద్భూమౌ రాజేంద్రైఃసహ భక్తితః

ఆయుషం యుయుజే రామః స్వర్గం యాహీతి వాంచితం

 తేషాం సహ్యం తద్భభూపుర్దుర్లంఘ్య బ్రాహ్మణాశీషు

భ్పుగుం ప్రణమ్య రాజేంద్రో రాజేంద్రైస్సహ తక్షణాత్

ఆరుహ్య చ రథం తూర్ణం సోనాయుధ సమన్వితం

సోనాప్రకారవాద్యం చ దుందుభిం మురజాదీకం

పాదయామాస సహారా బ్రాహ్మణేభ్యో దదౌ ధనం

ఉవాచ రామో రాజేంద్రం రాజేంద్రాణాం చ సంసది

హితం సత్యం నీతిసారం వాక్యం వేదవిదాం వరః

కార్తవీర్యార్జునుడు రణరంగమునకు పోవుచుండగా త్రోవలో అపశకునములెదురైనను ఎట్టి శంకలేక తన సైన్యముతో రణరంగమును ప్రవేశించెను. ఆ రణరంగమున తనకెదురుగా ఉన్న పరశురాముని చూచి తన రథము నుండి వెంటనే దిగి తోటి రాజులతో కలసి భక్తితో దండ ప్రణామమాచరించెను. అప్పుడు భార్గవరాముడు కార్తవీర్యునితో నీవు కోరుకున్నట్లు స్వర్గమునకు పోయెదవని ఆశీర్వదించెను. బ్రాహ్మణాశీర్వచనములు అనుల్లంఘనీయములు కదా!

కార్తవీర్యుడు తనతోటి రాజులతో కలసి భార్గవరామునకు నమస్కరించి, అనేకాయుధములతో వెంటనే తన రథము. నధిరోహించెను. యుద్దము చేయుటకు ముందు బ్రాహ్మణులకు దానములు చేసి యుద్ధవాద్యములగు దుందుభి మృదంగము మొదలగు వాద్యములను యుద్ధసూచకముగా మ్రోగించెను.

అప్పుడు భార్గవరాముడు కార్తవీర్యునితో అతని తోడి రోజుల ముందు హితము, సత్యము, నీతియుక్తమగు మాటలిట్లు పలికెను.

పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు పలికెను.

శ్రుణు రాజేంద్ర ధర్మిష్ఠ చంద్రవంశసముద్భవ

విష్ణోరంశస్య శిష్యస్త్యం దత్తాత్రేయస్య ధీమతః

స్వయం విద్వాంశ్చ వేదాంశ్చ శ్రుత్వా వేదవిదో ముఖాత్

కథం దుర్భుద్ధిరధునా సజ్జనానాం వీహింసనా

త్వం పూర్వ మహనో లోభాన్నిరీహం బ్రాహ్మణం కథం

బ్రాహ్మణీ శోక సంతస్తా భర్త్రాసార్థం గతా సతీ

కిం భవిష్యతి తే భూ పరత్రైవానయోర్వధాత్

 సర్వం మిథ్యైవ సంసారం పద్మపత్రే యథాజలం

 సత్కీర్తిశ్చాథ దుష్కీర్తిః కథామాత్రావశేషితా

విడంబనా వా కిమతో దుమీరేశ్చ సతామహో

 క్వగతా కపిలా త్వం క్వ క్వ వీవాదో మునిః కుతః

యత్కృతం విదుషా రాజ్ఞా న కృతం హలికేన తత్

 లో త్వాముపోషితమీశం హి దృష్ట్యా తాతో పా ధార్మికః

పారణం కారయామాస దత్తం తస్య ఫలం త్వయా

 ఆధితం విధివద్దత్తం బ్రాహ్మణేభ్యో దినే దినే

జగత్తె యశసా పూర్ణమయశో వార్ధకే కథం

 దాతా వరిష్ఠో ధర్మిష్ఠో యశస్వీ పుణ్యవాన్ సుధీః

కార్తవీర్యార్జునసమో న భూతో న భవిష్యతి

 పురాతనా వదంతీతి నందినో ధరణీతలే

 యో విఖ్యాతః పురాణేషు తస్య దుష్కీర్తిరీధృతీ

దుర్వాక్యం దుస్సహాo రాజంస్తీక్ష్ణాస్త్రాదపి జీవినాం

సంకటేఽపి సతాం వక్త్రా ద్విరుక్తిర్న వినిర్గతా

న దదామి ద్విరుక్తిం తే ప్రాకృతం కథయామ్యహం

ఉత్తరం దేహి రాజేంద్ర మహ్యం రాజేంద్ర సంసది

సూర్య చంద్రమనూనాం చ వంశజాః సంతి సంసది

సత్యం వద సభాయాం చ శ్రుణ్వంతు పితరః సురోః

శ్రుణ్వంతు సర్వే రాజేంద్రాః సదసద్వక్తుమీశ్వరాః

పశ్యంతో హి సమం సంతః పాక్షికం న వదంతి చ

ఓరాజా! నీవు ధర్మతత్పరుడవు. చంద్రవంశమున పుట్టిన వాడవు. ఇంకను విష్ణుమూర్తికి అంశావతారమగు దత్తాత్రేయుని శిష్యుడవు. అతడు మహాజ్ఞాని. నీవు కూడ స్వయముగా విద్వాంసుడవు. వేదములన్నియు తెలిసిన దత్తాత్రేయునినుండి వేదములను చదివిన నీకు సజ్జనులను హింసించుట అను దుర్బుద్ధి ఏవిధముగా నేర్పడినది.

నీవు ఇంతకు ముందు లోభగుణముచే కోరికలు లేని బ్రాహ్మణుని చంపితివి. ఆతని భార్య తన భర్తృశోకము వలన బాధచెంది భర్తతో సహగమనము చేసినది. దానివలన నీకేమి లాభము జరిగినది? ఈసంసారమంతయు తామరాకు పై నున్న నీటిబొట్టువలె ఆశాశ్వతమైనది. సత్కీర్తి లేక దుష్కీర్తి ఈరెంటిలో ఒకటి మాత్రమే లోకమున మిగులును, సత్పురుషులకు అపకీర్తి కలిగెనన్నచో దానికంటే మించినదేమి కలదు? కపిల (కామధేనువు) ఎచటకు పోయెను? నీవెచటకు పోతివి? రాజువగు నీవెక్కడ? ముని ఎక్కడ? మీ ఇరువురి మధ్య వివాదమెక్కడ? వివేకవంతుడగు రాజు చేసిన ఇట్టి దుష్కృత్యమును వివేక మేమాత్రమును లేని అమాయకుడు కూడా చేయడు.

నీవు ఉపోష్యమున్న విషయమును పరమధార్మికుడగు నాతండ్రి గమనించి నీకు భోజనము పెట్టిన దానికి నీవు చక్కని ఫలితము నిచ్చితివి, నీ వేదాధ్యయనము, ప్రతిదినము బ్రాహ్మణులకు విధిపూర్వకముగానిచ్చిన దానముల వలన ఈ ప్రపంచమంతయు నిండిపోయినది. అట్టి నీకు ముసలితనమున అపకీర్తి లభించినది గదా! దానము చేయువాడు, శ్రేష్టుడు, ధర్మకార్యముల నాచరించువాడు, చక్కని పేరున్నవాడు, పుణ్యవంతుడు, విద్వాంసుడు ఆగు కార్తవీర్యుని వంటివాడు పుట్టడు, పుట్టబోడు అని ఈ ప్రపంచమున పెద్దలు, వంది మాగధులు కొనియాడుచున్న నీకు ఇటువంటి చెడు కీర్తి కలిగినది.

ఓరాజా! పరుషమైన వాక్కు సహింపరానిది. అది పదునైన శస్త్రము వంటిది. సత్పురుషుల నోటినుండి కష్టసమయమున కూడ రెండు విధములైన మాటలు రావు. నేను నీపై ఆరోపణలు చేయలేదు. సత్యమైన మాటగనే చెప్పితిని. అందువలన ఈ రాజసమూహమున్న చోట నీవు నాకు ఉత్తరమిమ్ము. ఇచ్చట సూర్య, చంద్ర, మను వంశములకు చెందిన రాజులున్నారు. ఈ సభయందు నీవు సత్యమును పలుకుము. నీ మాటలను పితృదేవతలు, దేవతలు కూడ విందురు. అట్లే మంచి చెడ్డలు చెప్పగలిగిన రాజు శ్రేష్ఠులందరు నీ ప్రత్యుత్తరమును విందురు.

సజ్జనులెల్లప్పుడు పక్షపాతము లేక న్యాయముగా ఉందురని భార్గవ రాముడు పలికెను.

ఇత్యుక్త్యా రైణుకేయుశ్చ విరరామ రణస్థలే

రాజా బృహస్పతి సమః ప్రవక్తుముపచక్రమే

భార్గవ రాముడు రణరంగమున ఈవిధముగా కార్తవీర్యార్జునునితో పలికి యూరకుండెను. అప్పుడు బుద్ధియందు బృహస్పతితో సమానమైన కార్తవీర్యుడు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను.

కార్తవీర్యార్జున ఉవాచ- కార్తవీర్యార్జునుడిట్లనెను-

శ్రుణు రామ హరే రంశో హరిభక్తే జితేంద్రియః

శ్రుతో ధర్మో ముఖాద్యేషాం త్వం చ తేషాం గురోర్గురుః

కర్మణా వాఽస్యసద్బుద్యా కరోతి బ్రహ్మభావనాం

స్వధర్మ నిరతః శుద్ధస్తస్మాద్భ్రాహ్మణ ఉచ్యతే

ఆంతర్బహిశ్చ మననాత్కురుతే కర్మ నిత్యశః

మౌనీ శశ్వద్వదేతాలే యోపై స మునిరుచ్యతే

స్వర్ణేఽలోష్టే గృహేఽరణ్యే పంకే సుస్నిగ్ధ చందనే

సమతా భావనా యస్య సయోగీ పరికీర్తితః

సర్ప జీవేషు యో విష్ణుం భావయేత్సమతా ధియా

హరౌ కరోతి భక్తిం చ హరీ భక్త: స చ స్మృతః

తపో ధనం బ్రాహ్మణానాం తపః కల్పతరుర్యథ

తపస్యా కామధేనుశ్చ సంతతం తపసి స్సృహా

ఐశ్వర్యే క్షత్రియాణాం చ వాణిజ్యే చ తథా విశాం

క్షత్రియాణాంచ తపసి స్సృహాఽతీవాఽప్రశంసితా

బ్రాహ్మణాసోం వివాదే చ స్సృహ్మాఽతీవ వీనిందితా

రాగీ రాజసికం కార్యం కురుతే కర్మ రాగతః

రాగాంధో యో రాజసికస్తేన రాజా ప్రకీర్తితః

రాగతః కామధేనుశ్చ మయాపై యాచీతా మనే

కో దోష ఏకమేజాతః క్షత్రియస్యానురాగిణః

కుతః కస్య మునే రప్తి కామధేనుస్త్వయా వినా

స్సృహా రణేవా భోగే వా యుష్మాకం చ వ్యతిక్రమః

 త్రింశదక్షౌహిణీం సేనాం రాజేంద్రాణాం త్రికోటికాం

నిహత్యాయాం తమేకం హం నహంతుల సహనం మునే

 ఆత్మానం హంతు మాయాంతమపివేదాంగ పారగం

నదోషో హననే తస్య న తేన బ్రహ్మహాఽభవం

ఓ భార్గవరామా! నీవు శ్రీహరియొక్క అంశస్వరూపుడవు. శ్రీహరి భక్తుడవు. ఇంద్రియములనన్నిటినీ జయించిన వాడవు, నీవు నీ గురువుల దగ్గర ధర్మ విషయములను తెలిసికొంటివో వారికే నీవు గురువువంటివాడవు.

తన కర్మననుసరించి లేక సద్బుద్ధితోనైనా బ్రహ్మభావనను తన ధర్మముననుసరించి చేయువాడు బ్రాహ్మణుడని పిలువబడుచున్నాడు. లోపల మననము చేయుచు బయట కర్మలనాచారించువాడు ముని. అతడెల్లప్పుడూ మౌనముగా నుండి అవసరమైన సమయమున మాత్రమే మాటలాడును. బంగారమున, మట్టిపాత్రయందు, ఇంటిపై, ఆడవిపై, బురదపై, చక్కని చందనముపై సమభావము కలవాడే యోగి యనబడును. సమస్తజీవులయందు సమతా భావనచే హరి బుద్దిని కలిగియుండువాడు, శ్రీహరి యందు భక్తి భావన కలవానిని హరి భక్తుడని అందురు. బ్రాహ్మణులకు తపస్సే ధనము. అది కల్పతరువు వంటిది. కామధేనువు వంటిది, కావుననే వారికెల్లప్పుడు తపస్సుపై కోరిక యుండును. క్షత్రియులకు ఐశ్వర్యముపై, వైశ్యులకు వాణిజ్యమున కోరికయుండును కానీ క్షత్రియులు తపస్సు చేయుటను పెద్దలు నిందింతురు. అట్లే బ్రాహ్మణులు వివాదముల జోలికి పోవుట అప్రశస్తమందురు. అనురాగియైనవాడు కర్మపై అనురాగముతో రాజసిక కార్యములు చేయును. రాగాంధుడు రాజసీకుడైన వానిని రాజని పిలుతురు. అందువలన అనురాగముచే నేను జమదగ్ని మహామునిని కామధేనువు కావలెనని జమదగ్ని మహర్షిని యాచించితిని. అనురాగియగు క్షత్రియునకీ విషయమున తప్పేమి కలదు. మీకు తప్ప కామధేనువు ఏమహర్షికి కలదు, మునులకు యుద్ధముపై కోరిక భోగములననుభవింపవలెనని అనుకొనుట తగిన విషయము కాదు. అట్లే ముప్పది యక్షౌహిణుల సైన్యమును, మూడుకోట్ల రాజేంద్రులను చంపి ఒంటరిగా నున్న నన్ను చంపబూనుటను సహింపలేక జమదగ్ని మహర్షిని చంపితిని. తనను చంపుటకు ప్రయత్నించువాడు వేదవేదాంగ పారగుడైనను ఆతనిని చంపినచో బ్రహ్మహత్యాదోషమంటదు అందువలన నా తప్పేమీ లేదని కార్తవీర్యుడనెను.

ప్రాయశ్చిత్తం హింసకానాం నవేదేషు నిరూపితం

వధస్పముచితస్తేషా మిత్యాహ కమలోద్భవః

పిత్రాతే నీహతా భూపా మహాబలపరాక్రమాః

 ఇదానీం రాజపుత్రాశ్చ శిశఽవోత్ర సమాగతాః

త్రిః సప్తకృత్వో నిర్భూపార కృత్నాం కర్తుం మహీమతి

త్వయా కృతా ప్రతిఙ్ఞ యా తస్యాస్త్యం పాలనం కురు

క్షత్రియాణాం రణో ధర్మో రణే మృత్యుర్శ గర్షితః

రణే స్వాహా బ్రాహ్మణానాం లోకే వేదే విడంబనా

తపోధనానాం విప్రాణాం వాగ్భాలానాం యుగే యుగే

శాంతిః స్వస్త్యయనం కర్మ విప్రధర్మో న సంగరః

క్షత్రియాణాం బలం యుద్ధం వ్యాపారశ్చ బలం విశాం

భిక్షాబలం భిక్షుకాణాం శూద్రాణాం విప్ర సేవనం

హరౌ భక్తిర్హరేర్దాస్యం వైష్ణవానాం బలం హరిః ।

హింసా బలం ఖలానాం చ తపస్యా చ తపస్వినాం

బలం వేషశ్చ వేశ్యానాం యోషితాం యావనం బలం

బలం ప్రతాపో భూపానాం బాలానాం రోదనం బలం

సతాం సత్యం బలం మిథ్యా బలమేవాసతం సదా

అనుగానామనుగమః స్వల్పస్వానాం చ సంచయః

విద్యాబలం పండితానాం ధైర్యం సాహసినాం బలం

ధనం బలం చ ధనినాం శుచీనాం చ విశేషతః

బలం వివేకః శాంతానాం గుణినాంబలమేకతా

గుణోబలం చ గుణినాం చౌరాణాం చౌర్యమేవచ

ప్రియవాక్యం చ కాపట్యమధర్మః పుoశ్చలీబలం

హింసా చ హింస్ర జంతూనాం సతీనాం పతిసేవనం

వరశాపౌ సురాణాం చ శిష్యాణాం గురుసేవనం

బలం ధర్మో గృహస్థానాం భృత్యానాం రాజసేవనం

బలం స్తవః స్తావకానాం బ్రహ్మచ బ్రహ్మచారీణాం

యతీనాం చ సదాచారో న్యాసః సన్యాసినాం బలం

పాపం బలం పాతకీ నామశక్తానాం హరిర్బలం

పుణ్యం బలం పుణ్యవతాం ప్రజానాం నృపతిర్బలం

ఫలం బలం చ వృక్షాణాం జలజానాం జలం బలం

జలం బలం చ సస్యానాం మత్స్యానాం చ జలం బలం

శాంతిర్బలం చ భూపానాం విప్రాణాం చ విశేషతః

విప్రః శాంతో రణోద్యోగీనైవ దృష్ఠో న చ శ్రుతః

స్థితే నారాయణే దేవే బభూవాన్యవిపర్యయ:

పరులను హింసించువారు చేసికొనవలసిన ప్రాయశ్చిత్తమును గురించి వేదములందెచ్చట చెప్పబడలేదు. వారిని వధించుటయే తగినదని బ్రహ్మదేవుడు చెప్పెను.

నీతండ్రి మహా బల పరాక్రమ వంతులగు రాజాల నెందరినో సంహరించెను. ఇచ్చటనున్న వారందరు వయస్సులో చిన్న వారైన రాజపుత్రులు, శిశువులు. నీవుకూడ రాజులనందరను ఇరువదియొక్క మార్లు తిరిగి సంహరింతునని ప్రతిజ్ఞ చేసితివి కదా. నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొమ్ము.

క్షత్రియులకు యుద్ధము చేయుట వారి వృత్తి, ఆయుద్దమున చనిపోవుట నిందింపతగినది కాదు. కాని బ్రాహ్మణులు యుద్దము చేయుట వేదములందు, లౌకికి శాస్త్రములందు ఎచ్చటను కనిపించదు.

తపోధనులు, వాక్కులే బలముగా కల బ్రాహ్మణులకు శాంతి, స్వస్తి వాచనము అనునవి ధర్మములు. క్షత్రియులకు యుద్ధము చేయుట వైశ్యులకు వర్తకము చేయుట, భిక్షుకులకు బిచ్చమెత్తుట, శూద్రులకు బ్రాహ్మణసేవ, వైష్ణవులకు శ్రీహరిసేవ, శ్రీహరి దాస్యము ధర్మములు, విష్ణుభక్తులకు శ్రీహరి బలము. దుష్టులకు హింస, తపస్సులకు తపమాచరించుట, వేశ్యలకు ఆలంకరించుకొనుట, స్త్రీలకు యౌవనము, రాజాలకు ప్రతాపము, చిన్నపిల్లలకు ఏడ్చుట, సత్పురుషులకు సత్యము పలుకుట, దుష్టులకు అబద్దములాడుట, తక్కువ ధనము కలవారికి కూడబెట్టుట, పండితులకు విద్య, సాహసవంతులకు ధైర్యము, ధనవంతులకు ధనము, శాంత స్వభావులకు వివేకము కలిగియుండుట, సద్గుణములు కలవారికి ఐక్యముగానుండుట, దొంగలకు దొంగతనము చేయుట, చెడు నడక గల స్త్రీలకు ప్రియముగా పలుకుట, కపటము, ఆధర్మాచరణము స్వభావ సిద్ధమైనది.

అదేవిధముగా దుష్టజంతువులకు హింసించుట, సతులకు భర్తృశుశ్రూష దేవతలకు వరములు, శాపములిచ్చుట, శిష్యులకు గురువును సేవించుట, గృహస్థులకు ధర్మాచరణము సేయుట, భృత్యులకు సేవజేయుట, వందిమాగధులకు స్తోత్రము చేయుట, బ్రహ్మచారులకు పరబ్రహ్మమును గురించి తెలిసికొనుట, యతులకు సదాచారము, సన్యాసులకు ఆత్మభారమును పరమాత్మపై నుంచుట, పాపాత్ములకు పాపములు సేయుట, అశక్తులకు శ్రీహరిని సేవించుట, పుణ్యవంతులకు పుణ్యకార్యములు చేయుట, ప్రజలకు రాజా యొక్క అండలోనుండుట అనునవి స్వభావ సిద్ధమైనవి.

ఆట్లే వృక్షములకు పండ్లు కలిగియుండుట, జలజంతువులకు జలములో నుండుట, సస్యములకు చేపలకు నీరు, రాజులకు శాంతి, ఇంకను బ్రాహ్మణులకు కూడా శాంతి కలిగియుండుట బలముమ కలిగించునవి.

బ్రాహ్మణుడు శాంతముగా నుండ వలయునే కానీ యుద్ధము నాచరించుట యమనది ఎక్కడను కన్పించలేదు, విన్పించలేదు. భగవంతుడగు శ్రీమన్నారాయణమూర్తీ యుండగానే ఇటువంటి విపరీతము కన్నీంచుచున్నదని కార్తవీర్యుడు పలికెను.

ఇత్యేవముక్త్వా రాజేంద్రో విరరామ రణాజిరే

తస్య తద్వచనం శ్రుత్వా సద్యస్తూష్ణీం బభూవ హ

రామస్య భాతరః సర్వే తీక్షణశస్త్రాస్త్ర పాణయః

ఆరేభిరే రణం కర్తుం మహావీరాస్తదాజ్ఞయా

రణోన్ముఖాంశ్చ తాన్ దృష్ట్యా మత్స్యరాజో మహాబలః

సమారభే రణం కర్తుం మంగళ్ మంగళాలయః

 శరజాలేన రాజేంద్రో వారయామాస తానపి

చిచ్ఛిదు: శరజాలం చ జమదగ్ని సుతాస్తదా

రాజా చిక్షేప దివ్యాస్త్రం శతసూర్యప్రభం మునే

మాహేశ్వరేణ మునయశ్చిచ్చిదుశ్చైవ లీలయా

దీవ్యాస్త్రైణేనైవ మునయ: చచ్చిదు: సశరం ధనుః

రథం చ సారథిం చైవ రాజ్ఞు సన్నాహమేవ చ

న్యస్తశస్త్రం నృపం దృష్ట్యా మునయో హర్షవిహ్వలా:

దధార శూలినః శూలం మత్స్యరాజ జిఘాంసయా

కార్తవీర్యుడు ఈవిధముగా ఆని ఊరకొనగా పరశురాముడు సైతము ఊరకుండెను.

అప్పుడు పరశురాముని సోదరులు తమ సోదరుని ఆజ్ఞననుసరించి ఆనేక శస్త్రాస్త్రములను ధరించి యుద్ధము చేయుటకు మొదలిడిరి. భార్గవరాముని సోదరులు యుద్ధ సన్నద్ధులగుటను గమనించిన మహాబలుడగు మత్స్యదేశాధిపతి తాను కూడ యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను.

యుద్ధమునకై వచ్చుచున్న భార్గవరాముని సోదరులను మత్స్య రాజు తన బాణములచే నివారింపగా వారు ఆతని బాణపరంపరను ముక్కలు ముక్కలు చేసిరి. ఆప్పుడు మత్స్యరాజు వారిపై దివ్యాస్త్రమును వేయగా వారు పాశుపతాస్త్రములను వేసి మత్స్యరాజుయొక్క దివ్యాస్త్రమును విరిచి వేసిరి. అట్లే తమ దివ్యాస్త్రములచే ఆ మహారాజుయొక్క ధనుర్బాణములను, రథమును, సారథిని, అతని సైన్యమును అవలీలగా ఖండించిరి. ధనుర్బాణములు లేని ఆ మహారాజును చూచి భార్గవరాముని సోదరులు సంతోషముతో ఆతనిని చంపుటకై శంకరుని శూలమును చేతిలోనికి తీసికొనిరి.

శూల నిక్షేప సమయే వాగ్భభూవాఽశరీరిణీ

శూలం త్యజత విప్రేంద్రాః శివస్యాఽవ్యర్థమేవ చ

 శివస్య కవచం దీవ్యం దత్తం దుర్వాససా పురా

మత్స్యరాజు గఽళేస్త్యేతత్సర్వావయవరక్షకం

ప్రాణానాం చ ప్రదాతారం కవచం యాచతం నృపం

 తదా నిక్షిప్తశూలం చ జఘాన నృపతిశ్చిరం

తచ్చూలం తం నృపం ప్రాప్య శతఖండం గతం మునే

 శ్రుత్త్వైవాకాశవాణీంచ శృంగీ సన్యాస వేషకృత్

యయాచే కవచం భూపం జమదగ్నిసుతో మహాన్

రాజా దదౌ చ కవచం బ్రహ్మాండ విజయంపరం

గృహీత్వా కవచం తచ్చ శూలేనైవ జఘాన హ

పపాతమత్స్య రాజశ్చ శతచంద్రసమాననః

మహాబలిష్ఠో గుణవాన్ చంద్రవంశసముద్భవః

భార్గవరాముని సోదరులు మత్స్య రాజు పై శంకరుని శూలమును ప్రయోగించుచున్న సమయమున వారితో ఆకాశవాణి ఇట్లు పలికెను.

ఓ బ్రాహ్మణులారా! మీరు మత్స్యరాజు పై శంకరుని శూలమును ప్రయోగింపకుడు. ఆరాజునకు పూర్వము దుర్వాసముని దివ్యమైన శివకవచము నిచ్చెను. సమస్తావయవములను రక్షించు ఆ దివ్యకవచము ఆమహారాజుయొక్క మెడలో ఇప్పటికిని ఉన్నది. మత్స్యరాజు గొప్ప దాత. ఆడిగిన వానికి కాదనక తన ప్రాణములనైనను సమర్పించును. అట్టి రాజును మీరు శివకచమునిమ్మని తొలుత యాచన సేయుడని పలికినది. ఐనను ఆముని కుమారులు శూలమును ప్రయోగింపగా అది మహారాజు దగ్గరకు వచ్చి నూరు ముక్కలైపోయినది.

ఆ సయమున ఆకాశవాణి మాటలు విన్న శృంగియను జమదగ్ని పుత్రుడు సన్యాసి వేషమును ధరించి యుద్ధరంగమునకు వచ్చి ఆరాజును శివకవచము నిమ్మని ప్రార్థించెను. మత్స్య రాజు బ్రహ్మాండ విజయమను ఆ శివ కవచమును బ్రాహ్మణ కుమారున కిచ్చి వేసెను. శివకవచమును తీసికొన్న బ్రాహ్మణ కుమారుడతనిపై శివుని త్రిశూలమును ప్రయోగింపగా దానివలన గొప్పబలవంతుడు, చంద్రవంశమున పుట్టిన ఆ మత్స్యరాజు భూమిపై పడి ప్రాణములు వదిలెను.

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను

శివస్య కవచం బ్రూహి మత్స్యరాజేన యద్దృతం

నారాయణ మహాభాగ శ్రోతుం కౌతూహలం మమ

ఓ నారాయణమునీ! మత్స్యరాజు ధరించిన శివకవచమును తెలిసికొనవలెనని యున్నది. దయచేసి నాకు దానిని వివరించి చెప్పుడని పల్కెను.

కవచం శ్రుణు విప్రేంద్ర శంకరస్య మహాత్మనః

బ్రహ్మాండ విజయం నామ సర్వావయవ రక్షణం

 పురా దుర్వాససా దత్తం మత్స్య రాజాయ ధీమతే

దత్వా షడక్షరం మంత్రం సర్వపాపప్రణాశనం

స్థితే చ కవచే దేహే నాస్తి మృత్యుశ్చ జీవీనాం

ఆస్త్రే శస్త్రే జలే వహ్నౌ సిద్ధిశ్చేనాస్తి సంశయః

యద్ధృత్వా పఠనాద్భాణః శివత్వం ప్రాప లీలయా

బభూవ శివతుల్యశ్చ యుద్దృత్వా నందికేశ్వరః

వీరశ్రేష్ఠో వీరభద్ర: సాంబోఽభూద్ధారణాద్యతః

త్రైలోక్య విజయీ రాజో హిరణ్య కశిపుః స్వయం

హిరణ్యాక్షశ్చ విజయీ చాభవద్ధారణాద్ధి సః

యద్ధృత్వా పఠనాత్సిద్ధో దుర్వాపా విశ్వపూజితః

జైగీషవ్యో మహాయోగీ పఠానర్ధారణాద్యతః

యద్ధృత్వా వామదేవశ్చ దేవలః పవనః స్వయం

 అగస్త్యశ్చ పులస్త్య శ్చ్యాఽప్య భవద్వి పూజితః

ఓనారదమహర్షీ! సమస్తావయవములను రక్షించు బ్రహ్మాండ విజయమను శంకరుని కవచమును సావధానముగా వినుము.

సమస్త పాపములను హరించు శంకరుని షడక్షర మంత్రమును దుర్వాసమహర్షి మత్స్య రాజునకు ఉపదేశించెను. ఈ షడక్షర మంత్ర సహితమైన శంకరుని కవచమును ధరించినచో వారికి ఆస్త్రములవలనను, శస్త్రములవలనను, నీటియందైనను, అగ్నియందైనను మృత్యువు సంభవింపదు.

ఈ శివ కవచమును ధరించి, చదువుచున్నందువలన బాణాసురుడు శివత్వమును పొందెను. అట్లే నందీశ్వరుడు శివునితో సమానుడయ్యెను. వీరభద్రుడు వీరులలో శ్రేష్ఠుడయ్యెను. హిరణ్యకశిపుడు ముల్లోకముల జయింపగలిగెను. హిరణ్యాక్షుడు సహితము ఈ కవచము వలననే విజయము సాధింపగలెను. ఆట్లే ఈ కవచమును ధరించి పఠించు చున్నందువలననే అతడు విశ్వపూజితుడయ్యెను. అదేవిధముగ జైగీషవ్యుడను ముని, వామదేవుడు, దేవలుడు, పవనుడు, అగస్త్యుడు పులస్త్యుడు వీరందరు లోకమాన్యులైరనీ పలికెను.

ఓం నమః శివాయేతి మస్తకం మే సదాఽవతు

ఓం నమః శివాయేతీ చ స్వాహా ఫాలం సదాఽవతు

ఓం హ్రీం శ్రీం క్లీం శివాయేతి స్వాహా నేత్రే సదాఽవతు

ఓం హ్రీం శ్రీం హూం శివాయేతి నమో మే పాతునాసికాం

 ఓం నమః శివాయ శాంతాయ స్వాహా కంఠం సదాఽవతు

ఓం హ్రీం శ్రీం హూం సంహార కర్త్రే స్వాహా కర్ణా సదాఽవతు

 ఓం హ్రీం శ్రీం పంచవక్త్రాయ స్వాహా దంతం సదాఽవతు

ఓం హ్రీం మహేశాయ స్వాహా చాధరం పాతుమే సదా

 ఓం హ్రీం శ్రీం క్లీం త్రినేత్రాయ స్వాహా కేశాన్ సదాఽవతు

 ఓం హ్రీం ఐం మహాదేవాయ స్వాహా వక్షః సదావతు

ఓం హ్రీం శ్రీం క్లీం మైం రుద్రాయ స్వాహా నాభిం సదాఽవతు

ఓం హ్రీం మైం శ్రీం ఈశ్వరాయస్వాహా పృష్ఠం సదావతు

ఓం హ్రీం క్లీం మృత్యుంజయాయ స్వాహా భ్రువా బాహూసదాఽవతు

ఓం హ్రీం శ్రీం హీమీశానాయ స్వాహా పార్శ్యం సదాఽవతు

ఓం హ్రీం మీశ్వరాయ స్వాహా చోదరం పాతు మేసదా

ఓం శ్రీం హ్రీం మృత్యుంజయాయ స్వాహా బాపూ సదాఽవతు

ఓం హ్రీం శ్రీం క్లీమీశ్వరాయ స్వాహా పాతు కరౌ మమ

 ఓం మహేశ్వరాయ రుద్రాయ నితంబం పాతుమే సదా

ఓం హ్రీం శ్రీం భూతనాథాయ స్వాహా పాదౌ సదాఽవతు

ఓం సర్వేశ్వరాయ శర్వాయ స్వాహా పాదౌ సదాఽవతు

 ప్రాచ్యాం మాం పాతు భూతేశ ఆగ్నేయ్యాం పాతు శంకరః

 దక్షిణే పాతు మాం రుద్రో నైఋత్యాం స్థాణురేవచ

పశ్చిమే ఖండ పరశుర్వాయవ్యాం చంద్రశేఖరః

ఉత్తరే గిరిశః పాతు చేశాన్యామీశ్వరః స్వయం

ఊర్ద్వే మృడః సదా పాతు చారో మృత్యుంజయ స్వయం

 జలే స్థలే చాంతరిక్షే స్వప్నే జాగరణే సదా

పినాకీ పాతు మాం ప్రీత్యా భక్తం స వై భక్తవత్సలః

ఇతి తే కథితం వత్స కవచం పరమాద్భుతం

ఓం నమః శివాయ అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక!

ఓం నమః శివాయ స్వాహా అను మంత్రము నానోసటిని రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ స్వాహా అను మంత్రము నాకండ్లను రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం హూం శివాయనమః అను మంత్రము నా నాసికను రక్షించుగాక!

 ఓం నమః శివాయ - శాంతాయ స్వాహా అను మంత్రము నా కంఠమును రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం హూం సంహార కర్త్రే స్వాహా అను మంత్రము నా చెవులను రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం పంచవక్త్రాయ స్వాహా అను మంత్రము నా దంతములను రక్షించుగాక!

 ఓం హ్రీం మహేశాయ స్వాహా అను మంత్రము నాపెదవులను రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం క్లీం త్రినేత్రాయ స్వాహా అను మంత్రము నా వెంట్రుకలను రక్షించుగాక

 ఓం హ్రీం ఐం మహా దేవాయ స్వాహా అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక

ఓం హ్రీం శ్రీం క్లీం మైం రుద్రాయస్వాహా అను మంత్రము నాబొడ్డును రక్షించుగాక!

ఓం హ్రీం మైం శ్రీమీశ్వరాయ స్వాహా అను మంత్రము నాపృష్ఠ భాగమును రక్షించుగాక! ఓం హ్రీం క్లీం మృత్యుంజయాయ స్వాహా అనునది నాకనుబొమ్మలను బాహువుల రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం హీమీశానాయ స్వాహా అను మంత్రము నా పార్శ్వభాగముల రక్షించుగాక! ఓం హీమీశ్వరాయ స్వాహా అను మంత్రము నా ఉదర భాగమును రక్షించుగాక!

ఓం శ్రీం హ్రీం మృత్యుంజయాయ స్వాహా అనుమంత్రము నా బాహువుల రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం క్లీమీశ్వరాయ స్వాహా అనుమంత్రము నాచేతులను రక్షించుగాక!

ఓం మహేశ్వరాయ రుద్రాయ అనుమంత్రము నానితంబ భాగమును రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం భూతనాథాయ స్వాహా ఆనుమంత్రము నా పాదములను రక్షించుగాక!

ఓం సర్వేశ్వరాయ శర్వాయ స్వాహా అనుమంత్రము నా పాదముల రక్షించుగాక!

భూతేశుడు నాప్రాగ్భాగమును, శంకరుడు నా ఆగ్నేయ దిగ్భాగమును, రుద్రుడు దక్షిణ దిగ్భాగమును, నైఋతి దిగ్భాగమును స్థాణువు, ఖండ పరశువు పశ్చిమ దిగ్భాగమును, చంద్రశేఖరుడు వాయవ్యదిగ్భాగమును, గిరీశుడు ఉత్తరదిగ్భాగమును, ఈశ్వరుడు ఈశాన్య దిగ్భాగమును, మృడుడు ఊర్ధ్వభాగమును, మృత్యుంజయుడు అధోభాగమును, భక్తవత్సలుడగు పినాకి జలమున, భూభాగమున, ఆకాశమున, స్వప్నావస్థయందు, జాగ్రదవస్థయందు భక్తుడనగు నన్ను ప్రేమతో ఎల్లప్పుడు రక్షించుగాక!

నారదా! ఈవిధముగ పరమాద్భుతమైన శివకవచమును నీకు వివరించితినని నారాయణముని పలికెను.

దశలక్షజపేనైవ సిద్ధిర్భవతి నిశ్చితం

యది స్యాత్సిద్ధ కవచో రుద్రముల్యో భవేద్ద్రువం

తవ స్నేహాన్మయాఽఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్

కవచం కాణ్వ శాఖోక్త మతి గోప్యం సుదుర్లభం

ఆశ్వమేధ సహస్రాణి రాజసూయ శతాని చ

సర్వాణ కవచస్యాఽస్య కళాం నార్హంతి షోడశీం

కవచస్య ప్రసాదేన జీవన్ముకో భవేన్నరః

 సర్వజ్ఞః సర్వసిద్ధీశో మనోయాయీ భవేత్ ధ్రువం

ఇదం కవచమజ్జత్వా భజేద్య: శంకర ప్రభుం

శతలక్ష ప్రజ స్తోఽపి న మంత్రః సిద్ధిదాయకః

ఈ శివకవచమును పదిలక్షల మార్లు జపించినచో అది సిద్ధియగును. కవచము సిద్ధించిన వాడు రుద్రునితో సమానుడగును. ఈ కవచమును నీపై గల ప్రేమచే నీకు తెలిపితిని. దీనిని ఆర్హతలేనివారికి ఉపదేశింపకూడదు.

ఈకవచము శుక్లయజుర్వేమునకు సంబంధించిన కాణ్వశాఖయందు చెప్పబడినది. ఇది మిక్కిలి రహస్యమైనది. దుర్లభమైనది కూడ. వేలకొలది అశ్వమేధయాగములు, వందలకొలది రాజసూయయాగములన్నియు ఈకవచము యొక్క గొప్పతనమున పదునారవ వంతైనను కాజాలవు, ఈ కవచము యొక్క అనుగ్రహము వలన దానిని పఠించినవాడు జీవన్ముక్తుడగును. అట్లే అతడు సర్వజ్ఞుడై సమస్త సిద్ధులను బడసి మనోవేగముచే పోవు శక్తిని పొందును.

ఈ కవచమును వదలి శంకరుని కోట్లకొలది శివమంత్రములచే జపించినను అతనికి మంత్రసిద్ధి కలుగదని నారాయణుని నారదునితో ననెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయ గణపతిఖండే నారద నారాయణ సంవాదే శంకర కవచ ప్రకథనం నామ పంచత్రింశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణమువ మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన శంకర కవచమను ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.