బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

16 -  కార్తికేయాగమనం

నారాయణ ఉవాచ – నారాయణ ముని నారదునితో నిట్లనెను –

ఇత్యేవముక్త్యా తం శీఘ్రం బోధయిత్వా చ కృత్తికాః

ఉవాచ కించిద్యుక్తం చ వచనం శంకరాత్మజః

కార్తికేయుడు నందికేశ్వరువీతో ఫైవిధముగానని, తన తల్లులగు కృత్తికలను ఊరడించి యోగ్యమైన మాటలను ఇంకను ఇట్లు పలికెను.

యాస్యామి శంకరస్థానం ద్రక్ష్యామి సరసంచయం

మాతరం బంధువర్గాశ్చాప్యాజ్ఞాం మే దత్త మాతరః

దైవాధీనం జగత్సర్వం జన్మ కర్మ శుభావహం

సంయోగశ్చ వియోగశ్చ న చ దైవాత్సరం బలం

కృష్ణాయత్తం చ తద్దైవం స చ దైవాత్పరస్తతః

భజంతి సతతం సంతః పరమాత్మానమీశ్వరం

దైవం వర్ధయితుం శక్తః క్షయం కర్తుం స్వలీలయా

న దైవబద్ధస్తద్భక్తశ్చావినాళీతి నిర్ణయః

తస్మాద్భజత గోవిందం మోహం త్యజత దుఃఖదం

సుఖదం మోక్షదం సారం జన్మమృత్యుభయాపహం

పరమానందజననం మోహజాలనీకృంతనం

శశ్వద్భజంతి యత్సర్వే బ్రహ్మవిష్ణుశివాదయః

కోఽహం భవాబ్దౌ యుష్మాకం కా వా యూయం మమాత్మికాః

తత్కర్మసోతపాం సర్వం పుంజీభూతం చ ఫేనవత్

సంశ్లేషం వా వియోగం వా సర్వమీశ్వరచింతయా

బ్రహ్మాండమీశ్వరాధీనం న స్వతంత్రం విదుర్బుధాః

జలబుద్బుద్వత్పర్వమనిత్యం చ జగత్త్రయం

మాయామనిత్యే కుర్వంతి మాయయా మూఢచేతసః

సంతప్తత్ర నలిప్యంతే వాయుపత్కృష్ణచేతసః

తస్మాన్మోహం పరిత్యజ్య చాజ్ఞప్తిం దత్త మాతరః

ఓ తల్లులారా! నేను కైలాసమునకు పోయి అచ్చట దేవతా గణమును తల్లియగు పార్వతిని ఇతర బంధువులను చూచెదను. కావున వారిని చూచుటకు నాకు అనుమతినిండు.

ప్రాణులయొక్క జన్మ, వారు చేయు కర్మ, సంయోగ వియోగములన్నియు దైవాధీనమైయుండును. దైవమునకంటే గొప్పనైనది ఈ లోకమున కన్పింపదు. కానీ ఆ దైవము శ్రీకృష్ణపరమాత్మకధీనమై ఉండును. ఆ పరమాత్మ దైవమునకతీతుడు. అందువలననే సజ్జనులు పరమాత్మ, ఈశ్వరుడునగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు సేవింపుచుందురు. ఆ పరమాత్మ దైవమును పెంచుటకుగాని నాశనము చేయుటకుగాని సమర్థుడు. అందువలన శ్రీకృష్ణుని భక్తుడు దైవముచే బంధింపబడడు. అట్లే అతడు నాశనమును పొందడు.

అందువలన మీరు దుఃఖమును కలిగించు పుత్ర వ్యామోహమును వదలిపెట్టి గోవిందుని సేవింపుచుండుడు. సుఖమును మోక్షమును కలిగించునది, జన్మ మృత్యు భయములను తొలగించునది, పరమానందమును కలిగించునది, మోహమను వలను ఛేదించునది అగు ఆ పరబ్రహ్మమును బ్రహ్మవిష్ణుశివాదులు ఎల్లప్పుడు సేవింపుచుందురు. ఈ సంసారసాగరమున నేనెవరు? మీరెవరు? ఈ ఆత్మీయత ఎట్టిది? ఈ ఆత్మీయతాభావము కర్మయను నదులయొక్క పుంజీభూతమైన నురగవంటిది. ఒకరినొకరు కలిసికొనుట, విడిపోవుట ఇవన్నియు ఆ శ్రీకృష్ణపరమాత్మకు అధీనమైయుండును. ఇదీ స్వతంత్రమైనది కాదని పండితులు వక్కాణింతురు. ఈ ముల్లోకములన్నియు నీటిబుడగలవలె అశాశ్వతమైనవి. మాయవలన జ్ఞానము పోగొట్టుకొనినవారు అశాశ్వతమైన ఈ ప్రపంచమున మాయాబుద్ధికలిగియుందురు. కాని శ్రీకృష్ణపరమాత్మను ఎల్లప్పుడు ధ్యానించు సజ్జనులు మాయామోహితులు కారు.

అందువలన ఓ తల్లులారా! మీరుకూడ మాయామోహితులు కాక నేను కైలాసమునకు పోవుటకై నాకు ఆజ్ఞనిండని వేడుకొనెను.

ఇత్యేవముక్త్యా తా నత్వా సార్థం శంకరపార్షదైః

యాత్రాం చకార భగవాన్మనసా శ్రీపొరీం స్మరన్

ఏతస్మిన్నంతరే తత్ర దదర్శ రథముత్తమం

విశ్వకర్మకృతం రమ్యం హీరకేణ విరాజితం

సుద్రత్నసారరచితం మాణిక్యేన విరాజితం

పారిజాతప్రసూనానాం మాలాజాలైశ్చ శోభితం

మణీంద్ర దర్పణశ్వేతచామరైరతిదీపితం

క్రీడార్హమందిరై రమ్యైశ్చిత్రితైశ్చిత్రితం వరం

శతచక్రం సువిస్తీర్ణం మనోయాయి మనోహరం

ప్రస్థాపితం చ పార్వత్య వేష్టితం పార్షదైర్వరైః

కార్తికేయుడావిధముగా తన తల్లులగు కృత్తికలతో పలికి, మనస్సులో శ్రీహరిని స్మరింపుచు శంకరుని అనుచరులతో కలపి కైలాసమునకు బయలుదేరెను.

అప్పుడు విశ్వకర్మ నిర్మించినది, అందమైనది, రత్నములు, వజ్రములు, మాణిక్యములచే అలంకరింపబడినది, పారిజాత పుష్పముల మాలలు గలది, మణుల అద్దములు, తెల్లని చామరములతో ప్రకాశించునది, అనేక మందిరములతో, చిత్రములతో శోభిల్లునది, నూరు చక్రములు కలిగి మిక్కిలి విశాలమైనది, పార్వతీదేవి యొక్క అనుచరగణముతో నున్నది అగు రథమును పార్వతీదేవి అచ్చటకు పంపించెను.

సమారుహంతం యానం తా హృదయేన విదూయతా

సహసా చేతనాం ప్రాప్య ముక్తకేశ్యః శుచాతురాః

దృష్ట్యా చ స్వపురః స్కందం స్తంభిలాశ్చాతిశోకతః

ఉన్మత్తా ఇవ తత్రైవ వక్తుమారభిరే భియా

కార్తికేయుడు పార్వతీదేవి పంపిన రథమునెక్కుచున్నప్పుడు అచ్చటనున్న కృత్తికాగణము మిక్కిలి దుఃఖముతో వెంట్రుకలు విరబోసికొని మూర్ఛపడి తిరిగి తెలివికి వచ్చి ఏడ్చుచు పిచ్చిపట్టినట్లు అతనితో నిట్లనిరి.

కృత్తికా ఊచుః - కృత్తికలిట్లనిరి.

కిం కుర్మః క్వ యాసి త్వం నాయం ధర్మస్తవాధునా

స్నేహేన వర్ధితోఽస్మాభిః పుత్రోఽస్మాకం స్వధర్మతః

నాయం ధర్మో మాతృవర్గాననురక్తస్సుతః త్యజేత్

ఇత్యుక్త్యా కృత్తికాః సర్వా కృత్వా వక్షసి తం సుతం

పుసర్మూర్ఛామవాపుస్తాః సుతనిచ్ఛేదదారుణః

కుమారో బోధయిత్వా తా అధ్యాత్మవచన్న వై

తాభిశ్చ పార్షదైస్సార్థమారురోహ రథం మునే

ఇప్పుడు మేమేమి చేయవలెను? ఎచ్చటకు పోవలెను? మేము సదా నిన్నాశ్రయించియున్నాము కదా! మమ్ములను వదలిపోవుట నీకు ధర్మముకాదు. మేము నిన్ను ప్రేమతో పెంచితిమి కావున నీవు మాకు ధర్మముననుసరించి పుత్రుడవు. ప్రేమగల పుత్రుడు మాతృగణమును వదలిపోవుట ధర్మముకాదు. అనుచు కృత్తికలు తమ రొమ్ముపై అతనినుంచుకొని మరల మూర్ఛచెందిరి. పుత్ర వియోగమతి దారుణమైనది కదా!

అప్పుడు స్కందుడు వారిని అధ్యాత్మప్రబోధముతో ఓదార్చి వారితో, శివుని అనుచరగణముతో కలసి పార్వతీదేవి పంపిన రథమునధిరోహించెను.

పూర్ణకుంభం ద్వీజం వేశ్యాం శుక్లదాన్యాని దర్పణం

దధ్యాజ్యం మధు లాజాంశ్చ పుష్పం దూర్వాక్షతాన్పితాన్

వృషం గజేంద్రం తురగం జ్వలదగ్నిం సువర్ణకం

పూర్ణం చ పరిపక్వానీ ఫలాని వివిధాని చ

పతీపుత్రవతీం నారీం ప్రదీపం మణిముత్తమం

ముక్తాం ప్రసూనమాలాం చ సద్యోమాసం చ చందనం

దదర్శైతాని వస్తూని మంగళాని పురోమునే

శృగాలం నకులం కుంభం శవం వామే శుభావహం

రాజహంసం మయూరం చ ఖంజనం చ శుకం పికం

పారావతం శంఖచిల్లo చక్రవాకం చ మంగళం

కృష్ణసారం చ సురభిం చమరీం శ్వేతచామరం

ధేనుం చ వత్ససంయుక్తం పతాకాం దక్షిణే శుభాం

నానాప్రకారవాద్యం చాప్యశౌషీన్మంగళధ్వనిం

మనోహరం చ సంగీతం ఘంటా శంఖధ్వనిం తథా

దృష్ట్వా శ్రుత్వా మంగళం సహ్యగమత్తాతమందిరం

క్షణేనానందయుక్తశ్చ మనోయాయిరథేన చ

కుమారః ప్రాప్య కైలాసం న్యగ్రోధాక్షయమూలకే

క్షణం తస్థౌ కృత్తికాభిః పార్షదప్రవరైః సహ

కార్తికేయుడు పార్వతీపంపిన రథమునెక్కి కైలాసమునకు వెళ్ళుచున్నప్పుడు అతనికి పూర్ణకుంభము, బ్రాహ్మణుడు, వేశ్య, తెల్లని ధాన్యములు, అద్దము, పెరుగు, నేయి, తేనె, పేలాలు, పూవులు, గరిక, తెల్లని అక్షతలు, వృషభము, ఏనుగు, గుఱ్ఱము, బాగుగా మండుచున్న అగ్ని, బంగారము, మంచిగా పండిన పండ్లు, భర్త, పుత్రులుగలస్త్రీ, దీపము, మణులు, ముత్యాలహారము, పుష్పములమాల, అప్పుడే చంపి ఛేదించిన మాంసము, చందనములను ఎదురుగా చూచేను నక్క, రాజహంస, కుంభము, శవములు ఎడమవైపు పోవుచుండగా చూచెను. ముంగిస, నెమలి, కాటుకపిట్ట, చిలుక, కోకిల, పావురము, శంఖచిల్లము, చక్రవాకపక్షి, కృష్ణసారము, ఆవు, చామరీ మృగము, తెల్లని చామర మృగము, దూడతోనున్న ఆవు, పతాకము మొదలగు మంగళవస్తువులను కుడివైపున చూచెను. అట్లే అనేకవిధములగు మంగళవాద్యములు, ఇం పైన సంగీతము, గంట, శంఖముల చప్పుడును వినెను.

ఇట్లు కార్తికేయుడు తాను వెళ్ళుచున్న త్రోవలో మంగళవస్తువులను, చూచుచు, మంగళవాద్యములను వినుచు మనోవేగమున పోవుచున్న రథమున తండ్రియగు శంకరుని నివాసమును చేరెను. ఆ కైలాసపర్వతమున అక్షయవటవృక్షము క్రింద తన తల్లులగు కృత్తికలతో, శివుని అనుచరగణముతో కొంత సమయముండెను.

పార్వతీ మంగళం కృత్వా రాజమార్గం మనోహరం

పద్మరాగైరీంద్రనీలైః సంస్కృతం పరితః పురం

రంభస్తంభసమూహైశ్చ పట్టసూత్రాంశుకైస్తథా

శ్రీఖండపల్లవైర్యుక్తం పూర్ణకుంభైన్సుశోభితం

పూర్ణకుంభజలైర్వ్యాప్తం సిక్తం చందనావారిభిః

అసంఖ్య రత్నదీపైశ్చ మణిరాజైర్విరాజితం

నటనర్తక వేశ్యానాముత్సవైః సంకులం సదా

బందిభిర్విప్రవర్గైశ్చ దూర్వాపుష్పకరైర్యుతం

పతీపుత్రవతీభిశ్చ సాధ్వీభిశ్చ సమన్వితం

లక్ష్మీం సరస్వతీం దుర్గాం సావిత్రీం తులసీం రతిర

అరుంధతీమహల్యాం చ దీతీం తారాం మనోరమాం

అదితిం శతరూపాం చ శచీం సంధ్యాం చ రోహిణీం

అనసూయాం తథా స్వాహాం సంజ్ఞాం వరుణకామినీం

ఆకూతిం చ ప్రసూతిం చ దేవహూతిం చ మేనకారి

తామేకపాటలామేకపర్ణాం మైనాక కామినీం

వసుంధరాం చ మనసాం పురస్కృత్య సమాయయౌ

పార్వతీదేవి రాజమార్గమును అందముగా చేయించెను. అట్లే దానిని పద్మరాగమణులలో, ఇంద్రనీలమణులతో చుట్టు అలంకరింపచేసెను. త్రోవపొడువువ అరటిస్తంభములను స్వాగతతోరణములను ఉంచెను. పూర్ణకుంభములలో శ్రీఖండవృక్షముయొక్క చిగురుటాకులనుంచినది. మార్గమునంతయు శ్రీచందనముయొక్క నీటిని చల్లించి అసంఖ్యాకములైన రత్నదీపములను మణులను నిలిపినది. అది నటులు, నర్తకులు, వేశ్యలతో సందడిగానుండెను. ఇంకను వందిమాగధులు, గఱిక, పుష్పములు చేతులలో ధరించిన బ్రాహ్మణులు పతిపుత్రులుగల సాధ్వీమణులచ్చటనుండిరి.

పార్వతీదేవి లక్ష్మి, సరస్వతి, దుర్గ, సావిత్రి, తులసి, రతి, అరుంధతి, అహల్య, దితి, తార, మనోరమ, అదితి, శతరూపి, శచీ, సంధ్య, రోహిణి, అనసూయ, స్వాహా, సంజ్ఞ, వరుణునిభార్య, ఆకూతి, ప్రసూతి, దేవహూతి, మేనక, ఏకపాటల, ఏకపర్ణ, మైనాకుని సతి, భూదేవత, మనసాదేవి మొదలగు దేవతాస్త్రీలను వెంట పెట్టుకొని కుమారస్వామిని ఎదుర్కొనుటకు బయలుదేరినది.

రంభా తిలోత్తమా మేనా ఘృతాచి మోహినీ శుభా

ఊర్వశీ రత్నమాలా చ సుశీలా లలితా కళా

కదంబమాలా సురసా వనమాలా చ సుందరీ

ఏతాశ్చాన్యా శ్చ బహవో విప్రేంద్రాపురపాంగణాః

సంగీతనర్తనపరాః సస్మితా వేషసంయుతా:

కరతాళకరాః సర్వేః జగ్మురానందపూర్వకం

దేవాశ్చ మునయః శైలా గంధర్వాః కింగరాస్తథా

సర్వే యయుః ప్రముదితాః కుమారస్యానుమజ్జనే

నానాప్రకారవాద్యైశ్చ రుద్రైర్వా పార్షదైః సహ

భైరవైః క్షేత్రపాలైశ్చ యయౌసార్థం మహేశ్వరః

పార్వతీదేవి వెంబడి కార్తికేయుని ఎదుర్కొనుటకు రంభ, తిలోత్తమ, మేన, ఘృతాచి, మోహిని. ఊర్వశి, రత్నమాల, సుశీల, లలిత, కళ, కదంబమాల, సురస, వనమాల, మొదలగు అప్సర స్త్రీలు పాటలుపాడుచు, నాట్యములు చేయుచు, అనేక వేషములతో చప్పట్లు కొట్టుచు సంతోషముతో వెళ్ళిరి. ఇంకను బ్రాహ్మణులు, దేవతలు, మునులు, శైలాధిదేవతలు, గంధర్వులు, కిన్నరులు, మొదలగు వారందరు కుమార స్వామి యొక్క పట్టాభిషేకమహోత్సవమునకై సంతోషములో బయలుదేరిరి.

శంకరుడు అనేకవిధములైన పాద్యములతో, తన రుద్రగణము, అనుచరులు, భైరవులు, క్షేత్రపాలురు వెంటరాగా కుమారస్వామినెదుర్కొనుటకు బయలుదేరెను.

ఆథ శక్తిధరో హృష్టో దృష్ట్యాఽ రాత్పర్వతీం తదా

ఆవరుహ్య రథాత్తూర్ణం శిరసా ప్రణనామ హా

తం పద్మాప్రముఖం దేవీగణం చ మునకామినీం

శివం చ పరయా భక్త్యా సర్వాశంభాష్య యత్నతః

అప్పుడు కుమారస్వామి పార్వతీదేవిని సమీపమునుండి చూచి సంతోషముతో రథమునుండి దిగి ఆమెకు నమస్కరించెను. ఆ తర్వాత అతడు లక్ష్మీదేవి మొదలగు దేవతాస్త్రీలను, మునిపత్నులను, శివుని పరమభక్తితో నమస్కరించెను.

కార్తీకేయం శివా దృష్ట్యా క్రోడే కృత్వా చుచుంబ చ

శంకరశ్చ సురాః శైలా దేవ్యో వై శైలయోషితః

పార్వతీప్రముఖా దేవ్యస్తథా దేవశ్చ శంకరః

శైలాశ్చ మువయస్సర్వే దదుస్తస్మై శుభాశిషః

కుమారః సగణై: సార్థమాగత్య చ శివాలయం

దదర్శ తం సభామధ్యే వీఘం క్షీరోదశాయినం

రత్నసింహాసనస్థం చ రత్నభూషణ భూషితం

ధర్మబ్రహ్మేంద్ర చంద్రార్క వహ్నివాయ్వాదిభిర్యుతం

ఈషద్దాస్యం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం

స్తుతం మునీంద్రైర్దేవేంద్రైః సేవితం శ్వేతచామరం

తం దృష్ట్వా జగతాం నాథం భక్తినమ్రాత్మకంధరః

పులాకాన్విత సర్వాంగః శిరసా ప్రణనామ హ

విధిం ధర్మం చ దేవాంశ్చ మునీంద్రాంశ్చ ముదాన్వితాన్

ప్రణసోమ పృథక్తత్ర ప్రాప తేభ్యః శుభాశిషః

పృథక్సంభాష్య సర్వాంశ్చాప్యువాస కనకాసనే

దదౌ ధనాని విప్రేభ్యః పార్వత్యా సహ శంకరః

పార్వతీదేవీ కార్తికేయుని ఒడిలోనికి తీసికొని అతని ముఖమును ముద్దుపెట్టుకొనెను. శంకరుడు దేవతలు, పర్వతరాజులు, దేవతాస్త్రీలు, పర్వతరాజుల భార్యలందరు అతనిని దగ్గరకు తీసికొని లాలించిరి.

తరువాత పార్వతీదేవి మొదలగు దేవతా స్త్రీలు, శంకరుడు, పర్వతరాజులు, మునులందరు కుమారస్వామికి ఆశీర్వచనముల నొసగిరి. కుమారస్వామి శివగణముతో అచ్చటకువచ్చి కైలాసమునందలి సభలో శేషశాయియగు శ్రీమహావిష్ణువును దర్శించెను.

అటుపిమ్మట రత్నసింహాసనముపై రత్నభూషణభూషితుడై ధర్మదేవత, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు మొదలగు దేవతలు పరివేష్టించి యుండగా చిరునవ్వుతో భక్తులననుగ్రహించు వాడు, మునిశ్రేష్టులు, దేవతా శిరోమణులచే సేవింపబడినవాడు, అగు శ్రీమహావిష్ణువును కుమారస్వామి చూచి భక్తిచే తలవంచుకొని పులకాంకిత శరీరుడై అతనికి నమస్కరించెను. తరువాత బ్రహ్మదేవుని, ధర్మదేవతను ఇతర దేవతలను, ముని శ్రేష్టులను వేరువేరుగా నమస్కరించి వారి ఆశీస్సులను పొంది వారి అనుమతితో కనకాసనమున కూర్చుండెను.

అప్పుడు పార్వతీపరమేశ్వరులు సంతోషముతో బ్రాహ్మణులకందరకు అపరిమితమైన దానము లు చేసిరి.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయ గణపతిఖండే నారద నారాయణసంవాదే కార్తికేయాగమనంనామషోడశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణముమల పంపద పమయమున చెప్పబడిన కార్తికేయుడు కైలాసపర్వతమునకు వచ్చుటయను విషయముగల పదునారవ అధ్యాయము సమాప్తము.