32 – శ్రీ కృష్ణ స్తోత్రము

భృగురువాచ- భార్గవరాముడిట్లనెను-

సంప్రాప్తం కవచం నాథ శశ్వత్సర్వాంగ రక్షణం ।

 సుఖదం మోక్షదం సారం శత్రు సంహార కారణం॥

అధునా భగవన్మంత్రం స్తోత్రం పూజావిధిం ప్రభో ।

దేహి మహ్యమనాథాయ శరణాగత పాలక ॥

ఓ పరమేశ్వరా! నీదయవలన సమస్తావయములను రక్షించు కవచమును నాకుపదేశించితివి, ఇది సుఖమును, మోక్షమును కలిగించును. సమస్త శత్రువులను సంహరించును. ఇక ఇప్పుడు శ్రీకృష్ణమంత్రమును, అతని సోత్రమును, పూజించు విధానమును అనాథనగు నాకు ఉపదేశింపుము అని అనెను.

మహాదేవ ఉవాచ- శంకరుడిట్లు పరశురామునితో ననెను-

ఓం శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా ।

 మంత్రేషు మంత్ర రాజోఽయం మహాన్ సప్తదశాక్షరః ॥

సిద్దోఽయం పంచలక్షేణ జపేన మునిపుంగవ ।

తద్దశాంశం చ హవనం తద్దశాంశాభి షేచనం ॥

 తర్పణం తర్దశాంశం చ తద్దశాంశం చ మార్జనం ।

 సువర్ణానాం చ శతకం పురశ్చరణ దక్షిణా ॥

మంత్రసిద్ధస్య పుంసశ్చ విశ్వం కరతలే మునే ।

శక్తః పాతుం సముద్రాంశ్చ విశ్వం సంహర్తుమీశ్వరః ॥

పాంచభౌతిక దేహేన వైకుంఠం గంతుమీశ్వరః ।

 తస్య సంస్పర్శ మాత్రేణ పాదపంకజరేణునా ॥

ఫూతాని సర్వతీర్థానీ సద్యః పూతా వసుంధరా ॥

“ఓం శ్రీం నమః శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా” అను పదునేడు అక్షరముల మంత్రము సమస్త మంత్రములందు శ్రేష్టమైనది. ఈ మంత్రమున ఐదులక్షలమార్లు జపించినచో అది సిద్ధించును. ఆ తరువాత జపమున పదియవ వంతు హోమము చేయవలెను. హోమములో పదియవ భాగముతో అభిషేకము చేయవలెను. ఆభిషేక సంఖ్యలో పదియవ భాగముతో తర్పణము చేయవలెను. దానిలో పదియవ భాగముతో మార్జనము సేయవలెను. నూరు సువర్ణములను పురశ్చరణ దక్షిణగా నీయవలెను.

ఈ విధముగా మంత్రసిద్ధి కలిగినచో ఆతనికి ప్రపంచమే హస్తగతమై యుండును. ఆతడు సప్త సముద్రములను త్రాగుటకు గాని నమస్త ప్రపంచమును సంహరించుటకు గాని సమర్థుడగును. అతడీ పాంచభౌతికమైన దేహముతోనే వైకుంఠమునకు వెళ్ళగలుగును. ఆతని యొక్క స్పర్శవలన పాదరేణువుల వలన సమస్త పుణ్యతీర్థములు, సమస్త భూభాగము పవిత్రమగుచున్నది.

ధ్యానం చ సామవేదోక్తం శ్రుణు మన్ముఖతో మునే ।

సర్వేశ్వరస్య కృష్ణస్య భక్తి ముక్తి ప్రదాయి చ ॥

 నవీన జలద శ్యామం నీలేందీవర లోచనం ।

శరత్పార్వణ చంద్రాస్యమీషద్ధాస్యం మనోహరం ॥

కోటి కందర్పలావణ్య లీలా ధామ మనోహరం ।

 రత్న సింహాసనస్థం తం రత్నభూషణ భూషితం ॥

 చందనోక్షితసర్వాంగం పీతాంబరధరం వరం ।

వీక్ష్యమాణం చ గోపీభిః సస్మితాభిశ్చ సంతతం ॥

 ప్రపుల్లమాలతీమాలా వనమాలా విభూషితం ।

 దధతం కుందపుష్పాడ్యాం చూడాం చంద్రకచర్చితాం ॥

ప్రభార క్షిపంతం నభసశ్చంద్ర తారాన్వితస్య చ ।

 రత్న భూషిత సర్వాంగం రాధా వక్షఃస్థల స్థితం ॥

సిద్ధేంద్రైశ్చ మునీంద్రైశ్చ దేవేంద్రైః పరిషేవితం ।

బ్రహ్మ విష్ణు మహేశైశ్చ శ్రుతిభిశ్చ స్తుతం భజే ॥

శ్రీకృష్ణ ధ్యానము సామవేదమున చెప్పబడినది. భక్తిని, ముక్తిని కలిగించు ఆ సర్వేశ్వరుని ధ్యానశ్లోకములను నీకుచెప్పుచున్నాను.

నూతనమేఘమువలె నల్లనివాడు, నీలోత్పలములవంటి కన్నులు గలవాడు, శరత్కాలపు పూర్ణిమా చంద్రునివలె గుండ్రని ముఖము కలవాడు, చిరునవ్వు కలవాడు, కోటి మన్మథుల యొక్క ఆందము కలవాడు, రత్న భూషణములు కలవాడు, రత్న సింహాసనమున నుండువాడు, చందనమును శరీరము నందదంతయు పూసికొన్నవాడు, పచ్చని పట్టు వస్త్రములు ధరించువాడు. చిరునవ్వుతో నున్న గోపికలచే పరివేష్టితుడు, వికసించిన మాలతీమాల, వనమాలలచే అలంకృతుడు, చందనము కల మల్లెపూల మాలచే చుట్టబడిన కొప్పుగలవాడు. రాధాదేవి యొక్క వక్షస్థలమున నున్నవాడు, సిద్ధులు, దేవతలు, మునులు, త్రిమూర్తులు వేదములు మున్నగు వాటిచే ఎల్లప్పుడు స్తుతులనందుకొనువాడగు శ్రీకృష్ణుని నేను సేవింతును.

ద్యానేనానేన తం ధ్యాత్వా చోపచారాoస్తు షోడశ ।

దత్వా భక్త్యా చ సంపూజ్య సర్వజ్ఞత్వం లభేత్సుమాన్ ॥

ఆర్ఘ్యం పాద్యం చాసనం చ వనం భూషణం తథా ।

గామర్ఘ్యం మధుపర్కంచ యజ్ఞ సూత్రమనుత్తమం ॥

ధూపదీపా చ నైవేద్యం పునరాచమనీయకం ।

నానా ప్రకార పుష్పాణి తాంబూలం చ సువాసితం ॥

మనోహరం దివ్యతల్పం కస్తూర్యగరు చందనైః ।

 భక్త్యా భగవతే దేయం మాల్యం పుష్పాంజలి త్రయం॥

పైధ్యానశ్లోకములచే శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించి, అతనికి షోడశోపచారముల నిర్వర్తించి భక్తితో పూజించిన వానికి సర్వజ్ఞత్వము తప్పక లభించును.

అర్ఘ్యము, పాద్యము, ఆసనము, వస్త్రము, భూషణములు, గోవు, మధుపర్కము, యజ్ఞోపవీతము, ధూపదీపములు, నైవేద్యము, పునరాగమనము, అనేక విధములగు పుష్పములు, చక్కని వాసనగల తాంబూలము. కస్తూరీ, అగరు, చందనము వాసన కల దివ్య తల్పము, మాలలు, ముమ్మారు పుష్పాంజలి యనునవి షోడశోపచారములు ఇది పరమాత్మను పూజించు పద్ధతి.

తతః షడంగం సంపూజ్య పశ్చాత్సంపూజ యేద్గణం ।

 శ్రీదామానం సుదామానం వసుదామానమేవ చ॥

హరినుం చంద్రభానుం సూర్యభానుర సుభానుకం ।

 పార్షద ప్రవరాన్సప్త పూజయేద్భక్తి భావతః ॥

గోపీశ్వరీం రాధికాo చ మూల ప్రకృతిమీశ్వరీం ।

 కృష్ణశక్తిం కృష్ణపూజ్యాం పూజయేద్భక్తి పూర్వకం ॥

గోపగోపీగణం శాంతం మాం బ్రహ్మాణం చ పార్వతీం।

 శ్రీ లక్ష్మీం సరస్వతీం పృథ్వీం సర్వదేవం సపార్షదం ॥

దేవషట్కం సమభ్యర్చ్య పునః పంచోపచారతః ।

పశ్చాదేవం క్రమేణైవ శ్రీకృష్ణం పూజయేత్సుధీః ॥

గణేశo చ దినేశం చ వప్నాం విష్ణుం శివం శివా ।

దేవషట్కం సమభ్యర్చ్య చేష్టదేవం చ పూజయేత్ ॥

 గణేశం విఘ్ననాశాయ వ్యాధినాశాయ భాస్కరం ।

 ఆత్మనః శుద్ధయే మహ్నం శ్రీవిష్ణుం ముక్తిహత ॥

 జనాయ శంకరం దుర్గాం పరమైశ్వర్యహేతవే ।

 సంపూజనే నెలమిదం విపరీతమపూజనే ॥

తతః కృత్వా పరిహార మిష్టదేవం చ భక్తితః ।

 స్తోత్రం చ సామవేదోక్తం పఠేద్భక్త్యాచ తచ్చృణు ॥

శ్రీకృష్ణుని షోడశోపచారములతో పూజించిన తరువాత షడంగ పూజను చేయవలెను. అటుపి మ్మట శ్రీరాముడు, సుదాముడు, వసుదాముడు, హరిభానుడు, చంద్రభానుడు, సూర్యభానుడు, సుభానుడను శ్రీకృష్ణ పరమాత్మయొక్క అనుచరులను భక్తితో పూజించి, గోపేశ్వరి, మూలప్రకృతిరూపిణ, కుశక్తి స్వరూపియగు రారాదేవిని భక్తితో పూజచేయవలెను. అటుపిమ్మట గోకులను, గోపికాగణమును, బ్రహ్మదేవుని, పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని, భూమిని, అనుచర వర్గసహితమైన సమస్తదేవతలను, గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని అర్చించిన పిదప ఇష్టదేవతను మరల పూజింపవలెను.

గణపతిని విఘ్నములు తొలగిపొవుటకై, ఆరోగ్యమునకై సూర్యుని, ఆత్మశుద్దికై అగ్నిదేవుని, ముక్తి కలుగుటకు శ్రీమహావిష్ణువుమ, జ్ఞానసిద్ధికై శంకరుని, పరమైశ్వర్యము లభించుటకు దుర్గాదేవిని పూజింపవలెను. దైవషట్కమును ఆరాధించినచో పై ఫలితము కలుగును. లేనిచో విపరీతపు ఫలితములు కలుగును. ఇట్లు పూజించి, పరిహారమును నిర్వర్తించి ఇష్టదైవమును భక్తితో పూజించవలెను. తరువాత భక్తితో సామవేదము నందు చెప్పబడిన స్తోత్రమును పఠింపవలెను.

 మహాదేవ ఉవాచ- శంకరుడిట్లు పలికెను-

 పరంబ్రహ్మ పరంధామ పరంజ్యోతిః సనాతనం ।

 నిర్లిప్తం పరమాత్మానం నమామ్యఖిల కారణం ॥

స్థూలాత్ స్థూలతమం దేవం సూక్ష్మాత్ సూక్ష్మతమం పరం ।

 సర్వదృశ్యమదృశ్యం చ స్వేచ్ఛాచారం నమామ్యహం ॥

సాకారం చ నిరాకారం సగుణం నీర్గుణం ప్రభుం ।

సర్వాధారం చ సర్వం చ స్వేచ్ఛారూపం నమామ్యహం ॥

ఆతీవ కమనీయం చ రూపం నిరుపమం విభుం ।

కరాళరూపమశ్యంతం బిభ్రతం ప్రణమామ్యహం ॥

కర్మణ: కర్మరూపం తం సాక్షిణం సర్వకర్మణః ।

 ఫలం చ ఫలదాతారం సర్వరూపం నమామ్యహం॥

స్రస్టా పాతా చ సంహర్తా కళయా మూర్తి భేదతః ।

 నానామూర్తిః కళాంశేన యః పుమాంసం నమామ్యహం॥

స్వయం ప్రకృతి రూపశ్చ మాయయా చ స్వయం పుమాన్ ।

తయోః పరం స్వయం శశ్వత్రం నమామీ పరాత్పరం॥

స్త్రీ పుం నపుసకం రూపం యోబిభర్తి స్వమాయయా ।

 స్వయం మాయా స్వయం మాయీ యో దేవషం నమామ్యహం ॥

 తారకం సర్వ దుఃఖానాం సర్వకారణ కారణం।

 ధారకం సర్వవిశ్వానాం సర్వబీజం నమామ్యహం॥

తేజస్వినాం రవిర్యోరో సర్వఙాతిపు బాడబః ।

నక్షత్రాణాంచ యశ్చంద్రః తం నమామి జగత్ర్పభుం ॥

 రుద్రాణాం వైష్ణవానాం చ జ్ఞానినాం ఊహి శంకరః ।

 నాగానాం యోక్తి శేషశ్చ తం నమామి జగత్పతిం ॥

ప్రజాపతీనాం యో బ్రహ్మా సిద్దాం కపిలః స్వయం ।

సనత్కుమారోమువిషు తం నమామి జగద్గురుం॥

దేవనాం యో విష్ణుశ్చ దేవీవాల ప్రకృతిః స్వయం ।

 స్వాయంభువో మసూనాం యో మానవేషు చ వైష్ణవః॥

వారీణాం శతరూపా చ బహురూపం నమామ్యహం ॥

ఋతూనాం యో వసంతశ్చ మాసానాం మార్గశీర్షకః ।

 ఏకాదశీ తిథినాం చ నమామ్యఖీల రూపిణం ॥

సాగరః సరీతాం యశ్చ పర్వతానాం హిమాలయః ।

వసుంధరా సహిష్ణూనాం తం సర్వం ప్రణమామ్యహం॥

పత్రాణాం తులసీపత్రం దారురూపేషు చందనం ।

వృక్షాణాం కల్పవృక్షో యస్తం నమామి జగత్పతిం॥

 పుష్పాణాం పారిజాతశ్చ సస్యానాం ధాన్యమేవ చ ।

అమృతం భక్ష్యవస్తూనాం నానా రూపం నమామ్యహం॥

ఐరావతో గజేంద్రాణాం వైనతేయశ్చ పక్షిణాం ।

కామధేనుశ్చధీనూనాం సర్వరూపం నమామ్యహం ॥

 తైజసానాం సువర్ణం చ ధాన్యానాం యవ ఏవచ ।

 యః కేసరీ పశూనాం చ వర రూపం నమామ్యహం ॥

యక్షానాం కుబేరో యో గ్రహాణాం చ బృహస్పతిః ।

దిక్పాలానాం మహేంద్రశ్చ తం నమామి పరం వరం ॥

పర బ్రహ్మ స్వరూపుడు, పరంధాముడు, పరంజ్యోతి స్వరూపుడు, సనాతనుడు, నిర్లిప్తుడగు పరమాత్మకు నమస్కారము. స్థూలవస్తువులలో కెల్లను స్థూలరూపుడు, సూక్ష్మములలో కెల్లను సూక్ష్మరూపుడు, అందరకు కనిపించువాడు, ఆదృశ్యరూపుడు,

స్వేచ్చాచారుడగు దేవుని నేను నమస్కరింతును. సాకారుడు, నిరాకారుడు, సగుణుడు, వరుణుడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు స్వేచ్చా రూపుడగు ఆ కృష్ణ పరమాత్మను నమస్కరింతును, అతని రూపము చాల అందమైనది. సాటిలేనిది, మిక్కిలి భయంకరమైనది. అట్టి దేవుని నమస్కరింతును. కర్మస్వరూపుడు, సమస్త కర్మలకు సాక్షీభూతుడు, సర్వకర్మఫల స్వరూపుడు, సమస్త కర్మలయొక్క ఫలమును ఇచ్చువాడు సర్వరూపుడు తనయొక్క అంశ భేదముచే ఆ పరమాత్మ సృష్టికర్తగా, రక్షకుడుగా, సంహారకర్తగా కనిపించువాడు, అనేక రూపములు కలవాడు తనయొక్క అంశాంశముచే పురుషరూపమును ధరించిన ఆ దేవదేవునికి నమస్కారము. స్వయముగానతడు ప్రకృతి స్వరూపుడు, తన మాయవల్ల పురుషమూర్తిగా నున్న వాడు, ప్రకృతి పురుషులకంటే అతీతుడు, తనమాయవల్ల స్త్రీ, పుం, నపుంసక రూపములను ధరించువాడు, స్వయముగా మాయారూపుడు, మాయావంతుడు అగు ఆ దేవదేవునకు నమస్కరించుచున్నాను. సమస్త దుఃఖములను పోగొట్టువాడు, సమస్త సృష్టికి కారణభూతుడు, సమస్త ప్రపంచములను ధరించువాడు, ఆగు పరమాత్మకు నమస్కారము.

ఆ పరమాత్మ తేజోవంతులలో సూర్యుడుగాను, సమస్తజాతులలో బ్రాహ్మణుడుగాను, నక్షత్రములలో చంద్రుడుగాను, రుద్రులలో, వైష్ణవులలో, జ్ఞానవంతులలో శంకరుడుగాను, సర్పములలో శేషుడుగాను, ప్రజాపతులలో బ్రహ్మదేవుడుగాను, సిద్దులలో కపిల మహర్షిగాను, మునులలో సనత్కుమారుడు గాను దేవతలలో విష్ణువు గాను, దేవతాస్త్రీలలో ప్రకృతిగాను, మనువులలో స్వాయంభువ మనువుగాను, మానవులలో విష్ణుభక్తుడుగసు, స్త్రీలలో శతరూపాదేవిగాను, ఋతువులలో వసంతఋతువుగాను, మాసముల యందు మార్గశిర మాసముగాను, తిథులలో ఏకాదశీ తిథిగాను. నదులకు సముద్రముగాను, పర్వతములలో హిమాలయ పర్వతముగాను, ఓర్పు కలవారి లో భూమిగాను, పత్రములలో తులసీపత్రముగాను, వృక్షములలో కల్పవృక్షముగాను, సస్యములలో ధాన్యముగాను, తిను వస్తువులలో అమృతముగాను, ఏనుగులలో ఐరావతముగాను, పక్షులలో గరుత్మంతుడుగాను, తేజస్సుకల వస్తువులలో బంగారముగాను, ధాన్యములలో యవలుగాను, జంతువులలో సింహముగాను, యక్షులలో కుబేరుడుగను, గ్రహములలో బృహస్పతిగాను, దిక్పాలురలో దేవేంద్రుడుగా నున్నాడు, ఆట్టి పరమాత్మకు నమస్కారము,

వేద సంఘశ్చ శాస్త్రాణాం పండితానాం సరస్వతీ ।

అక్షరాణామకారోయస్తం ప్రధానం నమామ్యహం ॥

 మంత్రాణాం విష్ణుమంత్రశ్చ తీర్థానాం జాహ్నవీ స్వయం।

 ఇంద్రియాణాం మనో యోహి సర్వశ్రేష్ఠం నమామ్యహాం ॥

సుదర్శనం చ శస్త్రాణాం వ్యాధినాం వైష్ణవోజ్వరః ।

 తేజసాం బ్రహ్మతేజశ్చ వరేణ్యం తం నమామ్యహం ॥

బలం యో వై బలవతాం మనో వై శీఘ్రగామీనాం ।

కాలః కలయతాం యోహి తం నమామి విలక్షణం ॥

జ్ఞానదాతా గురూణాం చ మాతృరూపశ్చ బంధుషు ।

 మీత్రేషు జన్మదాతా యస్తం పారం ప్రణమామ్యహం ॥

శిల్పినాo విశ్వకర్మా యః కామదేవశ్చ రూపిణాం ।

 పతివ్రతా చ పత్నీనాం నమస్యంతం నమామ్యహం ॥

ప్రియేషు పుత్ర రూపో యో నృపరూపో నరేషు చ ।

 శాలగ్రామశ్చ యంత్రాణాం తం విశిష్టం నమామ్యహం ॥

ధర్మః కల్యాణబీజానాం వేదాసాం సామవేదకః ।

ధర్మాణాం సత్యరూపో యో విశిష్టం తం నమామ్యహం॥

జలే శైత్య స్వరూపో యో గంధరూపశ్చ భూమిషు ।

 శబ్ద రూపశ్చ గగనే తం ప్రణమ్యం నమామ్యహం ॥

 క్రతూనాం రాజసూయో యో గాయత్రి చందపాం చ యః ।

గంధర్వానాం చిత్రరథస్తం గరిష్ఠం నమామ్యహం ॥

క్షీరస్వరూపో గవ్యానాం పవిత్రాణాం చ పావకః ।

పుణ్యదానాం చ యః స్తోత్రం తం నమామి శుభప్రదం ॥

 తృణానాం కుశరూపో యో వ్యాధి రూపశ్చ వైరిణాం ।

 గుణానాం శాంతరూపో యశ్చిత్ర రూపం నమామ్యహం ॥

తేజోరూపో జ్ఞానరూపః సర్వరూపశ్చ యో మహాన్ ।

సర్వానీర్వచనీయం చ తం నమామి స్వయం విభుం ॥

సర్వాధారేషు యో వాయుర్యథాఽత్మా నిత్యరూపిణాం ।

 ఆకాశో వ్యాపకానాం యో వ్యాపకం తం నమామ్యహం ॥

శాస్త్రములలో వేదములుగాను, పండితులలో సరస్వతిగాను, అక్షరములలో అకారముగాను, మంత్రములలో విష్ణుమంత్రముగాను, తీర్థములలో గంగానదిగాను, ఇంద్రియములలో మనస్సుగాను, శస్త్రములయందు సుదర్శన చక్రముగను, వ్యాధులలో వైష్ణవజ్వరముగాను, తేజస్సులలో బ్రహ్మ తేజస్సుగను, శీఘ్రముగా పోవు వారిలో మనస్సుగాను, గురువులలో జ్ఞానదాతగాను, బంధువులలో తల్లిగాను, మిత్రులలో తండ్రిగాను, శిల్పాచార్యులలో విశ్వకర్మగాను రూపవంతులలో మన్మథుడుగాను, స్త్రీలలో పతివ్రతగాను, ప్రియమైన వారిలో పుత్రుడుగాను, మానవులలో ధర్మడుగాను, వేదములలో సామవేదము గాను, ధర్మముల యందు సత్యముగాను, ఆ పరమాత్మయున్నాడు.

అట్లే అతడు జలములయందు శైత్యస్వరూపుడు, భూమియందు భూగుణమైన గంధస్వరూపుడు, ఆకాశమున ఆకాశగుణమైన శబ్దస్వరూపుడు, ఆతడు యజ్ఞములందు రాజసూయయాగము. ఛంధస్సులలో గాయత్రీ ఛందము. గంధర్వులలో చిత్రరథుడు గవ్యములలో పాలు, పవిత్రమైన వస్తువులలో అగ్నిదేవుడు, తృణములలో దర్భ, శత్రువులందు వ్యాధిరూపుడు, గుణములలో శాంతగుణస్వరూపుడు. అదే విధముగా ఆ పరమాత్మ తేజస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, సమస్త రూపుడు, వాయురూపుడు, ఆత్మస్వరూపుడు, ఆకాశరూపుడు. అట్టి పరమాత్మను నేను నమస్కరించుచున్నాను.

 వేదానిర్వచనీయం యన్నస్తోతుం పండితః క్షమః ।

 యదనిర్వచనీయం చ కోవా తత్ స్తోతుమీశ్వరః ॥

 వేదా న శక్తి యం స్తోతుం జడీభూడా సరస్వతీ ।

 తం చ వాజ్మనసాం పారం కో విద్వాన్ స్తోతుమీశ్వరః ॥

శుద్ధ తేజ స్వరూపం చ భక్తానుగ్రహ విగ్రహం ।

అతివ కమనీయం చ శ్యామరూపం నమామ్యహం ॥

 ద్విభుజం మురళీవక్త్రం కిశోరం పస్మితం ముదా ।

శశ్వద్గోపాంగనాభిశ్చ వీక్ష్యమాణం నమామ్యహం ॥

రాధయా దత్తతాంబూలం భుక్తవంతం మనోహరం ।

 రత్న సింహాసనస్థం చ తమీశం ప్రణమామ్యహం ॥

రత్నభూషణ భూషాడ్యం సేవితం శ్వేత చామరైః ।

పార్షద ప్రవరైర్గోప కుమారైస్తం నమామ్యహం ॥

బృందావసంతరే రమ్యే రాసోల్లాససముత్పుకం ।

 రాస మండల మధ్యస్థం నమామి రసికేశ్వరం॥

శతశృంగే మహాశైలే గోలోకే రత్న పర్వతే ।

వీరబాపులినే రమ్యే ప్రణమామి విహారిణం ॥

 పరిపూర్ణతమం శాంతం రాధాకాంతం మనోహరం ।

విత్యం బ్రహ్మస్వరూపం చ సత్యం కృష్ణం నమామ్యహం ॥

వేదములు కూడా నిర్వచింపలేని ఆ పరాత్పరుని పండితుడు స్తుతింపగలడా? నిర్వచించుటకు వీలులేని ఆ పరబ్రహ్మను ఎవరు స్తుతింపగలరు? ఆ పరమేశ్వరుని స్తుతించుటకు వేదములు అ సమర్థములు. ఆతనిని స్తుతించు విషయములో సరస్వతీదేవి కూడ అసమర్ధురాలు. ఆతడు వాజ్ఞ్మనస్సులచే స్తుతింప వీలులేని వాడు, శుద్ద తేజ స్వరూపుడు. భక్తుల ననుగ్రహించుటకు రూపముమ ధరించినవాడు. మిక్కిలి అందమైనవాడు. నల్లని రూపుకలవాడు. రెండు భుజములు కలవాడు. మురళిని మోగించువాడు. బాలరూపుడు. చిరునవ్వుతోనుండువాడు. గోపకులు, గోపికలచే ఎల్లప్పుడు సేవింపబడుచున్నవాడు. రాధాదేవి ఇచ్చు తాంబూలమును భుజించుచు రత్న సింహాసనమున కూర్చున్నవాడు, రత్నభూషణ భూషితుడు. ఆతని అనుచరులు అతనికి శ్వేతచామరములు వీయుచుండగా గోపకుమారులచే సేవింపబడుచున్నవాడు.

ఆ శ్రీకృష్ణుడు బృందావనమున  రాసక్రీడకై రాస మండలమున నుoడును. అతడు గోలోకమునందలి రత్న పర్వతము యొక్క సమీపమున నున్న విరజా నదీ తీరములో సుఖముగా విహరించుచుండును. ఆతడు మిక్కిలి పరిపూర్ణుడు, రాధాకాంతుడు, మనోహరుడు, బ్రహ్మస్వరూపుడు. సత్యస్వరూపుడు నిత్యమైనవాడు. అట్టి శ్రీకృష్ణుని నేనెల్లప్పుడు నమస్కరింతును.

శ్రీకృష్ణస్య స్తోత్ర మిదం త్రి సంధ్యం యః పఠేన్నరః ।

 ధర్మార్థ కామ మోక్షాణాం స దాతా భారతే భవేత్ ॥

హరిదాస్యం హరౌ భక్తిం లభేత్ స్తోత్ర ప్రసాదతః ।

ఇహలోకే జగత్పూజ్యో విష్ణుతుల్యో భవేత్ ధ్రువం॥

 సర్వసిద్దేశ్వరః శాంతోఽప్యంతేయాతి హరేః పదం ।

తేజసా యశసా భారీ యథా సూర్యో మహీతలే ॥

జీవన్ముక్త కృష్ణభక్తః స భవేన్నాత్ర సంశయః ।

ఆరోగీ గుణవాన్విద్వాన్ పుత్రవాన్ ధనవాన్ సదా ॥

 షడభిజ్ఞో దశబలో మనోయాయీ భవేత్ ధ్రువం ।

 సర్వజ్ఞః సర్వదశ్చైవ స దాతా సర్వ సంపదాం ।

 కల్పవృక్షసమ: శశ్వద్భవేత్కృష్ణ ప్రసాదతః ॥

ఈ శ్రీ కృష్ణ స్తోత్రమును మూడు పూటలందు చదివినచో ఆతడు చతుర్వర్గములను కలిగించుటకు సమర్థుడగును, ఈస్తోత్రముయొక్క అనుగ్రహము వలన శ్రీహరి సేవను భక్తిని తప్పక పొందును. ఈలోకమున అతడు జగత్పూజ్యూడై విష్ణువుతో సమానుడగను. అతడు సమస్త సిద్దులను పొంది మరణ సమయమున వైకుంఠమును పొందును. సూర్యుడీ లోకమున తేజస్సుతో ప్రకాశించుచున్నట్లు కీర్తి కలిగి ప్రకాశించును. శ్రీకృష్ణభక్తుడు తప్పక జీవన్ముక్తుడగును. ఆరోగ్యవంతుడై సకల సద్గుణ సంపన్నుడై విద్యావంతుడు, పుత్రవంతుడు, ధనవంతుడగును షడబిజ్ఞుడు, దశబలుడునై మనోవేగము కలవాడగును. సర్వజ్ఞుడై కల్పవృక్షమువలె శ్రీకృష్ణుని అనుగ్రహము వలన సమస్త సంపదలను ఇచ్చువాడగును.

ఇత్యేవం కథితం స్తోత్రం వత్ప త్వం గచ్ఛ పుష్కరం ।

 తత్ర కృత్వా మంత్ర సిద్ధిం పశ్చాత్ప్రాప్స్త్యవాంఛితం॥

త్రిస్సప్తకృత్యో విరూపాం కురు వృథ్వీం యథా సుఖం ।

మమాశీషా ముని శ్రేష్ఠశ్రీకృష్ణస్య ప్రసాదతః ॥

పరశురామా! నీకీ విధముగా శ్రీకృష్ణస్తోత్రమును తెల్పితిని. నీవు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మంత్రమును జపించి మంత్రసిద్ధిని పొంది నీ కోరికను తీర్చుకొవగలవు, నా యొక్క ఆశీర్వచనము వలన శ్రీకృష్ణుని అను గ్రహమువలన ఈ భూమి పై ఇరువది యొక్క మార్లు తిరిగి రాజులు లేకుండునట్లు వారినందరనూ అంత మొందించగలవని శంకరుడు పరశురామునితో పల్కెను

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే స్తవ ప్రదానం నామ ద్వాత్రింశత్ తమోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమువ మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమున తెలుపబడిన శ్రీ కృష్ణుని స్తోత్రము గల ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.