9 - దేవతలు బాల గణపతిని సందర్శించుకొనుట

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను-

 హరౌ తిరోహిత్ శర్వాణీ దుర్గా శంకరస్తదా ।

బ్రాహ్మణాన్వేషణం కృత్వా బభ్రామ పరితో మునే ॥

వృద్ధబ్రాహ్మణవేషముననున్న శ్రీమహావిష్ణువు అంతర్ధానము చెందగా పార్వతీపరమేశ్వరులు ఆతురతతో ఆ బ్రాహ్మణునికై చుట్టూ వెదకసాగిరి.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

ఆయో విప్రేంద్రతివృద్ధ క్వ గతోసి క్షుధాతురః ।

హే తాత దర్శనం దేహి ప్రాణాన్యై రక్ష మే విభో ॥

శివ శిఘ్రం సముత్తిష్ఠ బ్రాహ్మణాన్వేషణం  కురు ।

క్షణమున్మవరోరేష గతః ప్రత్యక్షమావయోః ॥

అగృహీత్వా గృహాత్పూజాం గృహిణోతిథిరీశ్వర ।

యది యాతిక్షుధార్తశ్చ తస్య కిం జీవనం వీనా ॥

పితరస్తన్న గృహ్ణంతి పిండదానం చ తర్పణం ।

తస్యాహుతిం న గృహ్ణతి వహ్నిః పుప్పం జలం సురాః॥

హవ్యం పుష్పం జలం ద్రవ్యమశుచేశ్చ మురాసనం ।

ఆమేధ్యసదృశః పిండః స్పర్శనం పుణ్యనాశనం ॥

ఓ వృద్ధ బ్రాహ్మణుడా! ఆకలిగొన్న నీవు ఎచ్చటికిపోతివి. ఓతండ్రీ! నీవొక్కసారి కనిపించి నా ప్రాణములను నిలుపుము.

ఓ శంకరా! త్వరగా లేచి ఆ బ్రాహ్మణుడెచ్చటనున్నాడో వెదుకుము. ఒక్కక్షణము మనము పరాకుననుండగా ఆతడు మాయమయ్యెను.  మన ఇంటికి వచ్చిన అతిథి నేనిచ్చు అతిథిపూజను గైకొనకపోయెను. అతిథి ఆకలితో వెళ్ళిపోయినచో ఆ ఇంటి యజమాని చేసిన తర్పణమును, పిండ ప్రదానమును పితృదేవతలు స్వీకరింపరు. ఆట్లే ఆ యజమాని ఇచ్చు ఆహుతులను, పుష్పములను, జలమును దేవతలు పరిగ్రహింపరు. అవి సురతో సమానముగా దేవతలకు కన్పించును, ఆ యజమాని పితృదేవతలకు పెట్టు పిండము అమేధ్యముతో సమానమగును. ఆతనివి స్పృశించినచో పాపము కలుగును అని పలికేను.

ఏతప్మిన్నంత తత్ర వాగ్బభూవాశరీరిణీ ।

కైవల్యయుక్తాసా దుర్గా తాం శుశ్రావ శుచాతురా ॥

 శాంతా భవ జగన్మాతస్వసుతం పశ్య మందిరే ।

కృష్ణం గోలోకనాథం తం పరిపూర్ణతమం పరం ॥

సుపుణ్యకవ్రతశరోః పలరూపం సనాతనం ।

యత్తేబోయోగినః శశ్వత్ ధ్యాయంతి సతతం ముదా ॥

ధ్యాయంతి వైష్ణవా దేవా బ్రహ్మవిష్ణుశీవాదయః ।

 యస్య పూజ్యస్య సర్వాగ్రే కల్పే కల్పే చ పూజనం ॥

యస్య స్మరణమాత్రేణ సర్వవిఘ్న వినశ్యతి ।

 పుణ్యరాశి స్వరూపం చ స్వసుతం పశ్య మందిరే ॥

కల్పే కల్పే ధ్యాయసి యం జ్యోతిరూపం సనాతవం ।

 పశ్య త్వం ముక్తిదం పుత్రం భక్తానుగ్రహ విగ్రహం ॥

 తవ వాంఛపూర్ణబీజం తపః కల్పతరోః ఫలం ।

సుందరం స్వసుతం పశ్య కోటికందర్పవిందకం ॥

నాయం విప్రః క్షుధార్తశ్చ విప్రరూపీ జనార్ధవః ।

 కిం వా విలాపం కురుషే క్వ వా వృద్ధః క్వ చాతిథిః ।

సరస్వతీత్యవముక్త్యా వీరరామ చ నారద ॥

ఈవిధముగా పార్వతీదేవి బాధపడుచున్న సమయమున పార్వతీదేవికి ఒక అశరీరవాణి ఇట్లు వినిపించినది.

ఓ జగన్మాతా! నీవు బాధపడవద్దు. నీ ఇంటిలోనున్న నీపుత్రుని చూడుము. ఆతడు సమస్తపరిపూర్ణుడు. గోలోకమునకు అధిపతియగు శ్రీకృష్ణుడు. ఆతడు నీవు చేసిన పుణ్యకవ్రతమను వృక్షముయొక్క ఫలితముగా నీకు లభించెను. అతడు సనాతనుడు. పరమయోగీంద్రులు తేజోరూపియగు ఆ పరమాత్మను ఎల్లప్పుడు ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు శివాది దేవతలు, వైష్ణవులు ఆ పరమాత్మను ఎల్లప్పుడు ధ్యానించుచుందురు. అట్టి పరమాత్మ నీకు పుత్రుడయ్యెను.

నీ పుత్రుడు ప్రతికల్పమునందు దేవతలందరికంటే ముందుగా పూజలనందుకొనును. ఆతనిని స్మరించినంత మాత్రమున సమస్త విఘ్నములు నశించును. ఆతడు పుణ్యములన్నిటికి రాశి. సనాతనుడు. జ్యోతిస్వరూపుడైన ఆతనిని ప్రతికల్పములోనూ నీవు ధ్యానము చేయుదువు.  అతడు భక్తులనెల్లప్పుడు అనుగ్రహించును. ముక్తినిచ్చును. నీ తపస్సను కల్పవృక్షమునకు ఫలమువంటివాడు, ఆతడు కోటి మన్మథుల కంటె సుందరమైనవాడు. అటువంటి నీ పుత్రుని ఒకసారి చూడుము.

ఇంతకుముందు అదృశ్యమైన బ్రాహ్మణుడు ఆకలిగొన్న వాడుకాదు. ఆతడు బ్రాహ్మణవేషమున ఉన్న జనార్దనుడు. అందువలన పార్వతీదేవి! నీవు అనవసరముగా బాధపడుచున్నావు. అతడు వృద్ధుడుకాదు. అతిథి కూడ కాదు అని ఆకాశవాణి పలికెను.

త్రస్తా శ్రుత్వాకాశవాణీం బగామ స్వాలయం సతీ ।

దదర్శ బాలం పర్యంకే శయావం సస్మితం ముదా ॥

 పశ్యంతం గేహశిఖరం శతచంద్రసమప్రభం ।

స్వప్రభాసటలేనైవ ద్యోతయంతం మహీతలం ॥

 కుర్వంతం భ్రమణం తల్పే పశ్యంతం స్వేచ్ఛయముదా ।

ఉమేతీ శబ్దం కుర్వంతం రుదంతం తం స్తవార్థివం ॥

దృష్ట్యా తదద్భుతం రూపం త్రస్తా శంకరపన్నిధిం ।

గత్వా పోవాచ గిరిశం సర్వమంగళమంగళా ।

పార్వతీదేవి ఆకాశవాణి పల్కులను వినీ ఆశ్చర్యముతో తన ఇంటిలోనికి వెళ్ళి తన శయ్యపై చిరునవ్వుతోనున్న బాలుని చూచెను. ఆ బాలుడు శతచంద్రులతో సమానమైన కాంతికలవాడు. తన శరీరకాంతి భూమికి స్ఫురింపచేయుచున్నవాడు, అతడు శయ్యపై సంతోషముతో ఇటువటు పొర్లుచుండెను. ఆ శిశువు పాలకై ఏడ్చుచు ఉమా అని శబ్దము చేయుచుండెను. ఆద్భుతమైన రూపముగల ఆ శిశువును చూచి పార్వతీదేవి వెఱగుపడి తన భర్తయగు శంకరుని సన్నిధికి పోయి ఆ దేవునితో ఈవిధముగా పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లనెను-

గృహమాగచ్ఛ సర్వేశ తపసాం ఫలదాయక ।

 కల్పే కల్పే ధ్యాయసి యం తం పశ్యాగత్య మందిరం ॥

 శీఘ్రం పుత్రముఖం పశ్య పుణ్యబీజం మహోత్సవం ।

పున్నామ నరక త్రాణ కారణం భవతారణం ॥

 స్నానం చ సర్వతీర్ధేషు సర్వయజ్ఞేషు దీక్షణం ।

పుత్రసందర్శనస్యాస్య కలాం నార్హతి షోడశీం ॥

 సర్వదానేన యత్పుణ్యం క్ష్మాప్రదక్షిణతశ్చ యత్ ।

పుత్రదర్శన పుణ్యస్య కలాం నార్హత షోడశీం ॥

 సర్చైస్తపోభిర్యత్పుణ్యం యదేవానశనైర్ర్వతైః ।

 సత్పుత్రోద్భవపుణ్యస్య కళాం నార్హతి షోడశీం ॥

 యద్విప్రభోజనైః పుణ్యం యదేవ సురసేవనైః ।

సత్పుత్రప్రాప్తి పుణ్యస్య కలాం నార్హతి షోడశీం ॥

ఓ మహాదేవా నీవు ఇంటిలోనికి రమ్ము. మన ఇంటిలో మన తపస్సుల ఫలితమగు పుత్రుని ముఖమును చూడుము. నీవు ప్రతికల్పమున ఎవరిని ధ్యానించుచుందువో ఆ కృష్ణుడు పుత్రరూపముననున్నాడు. పుత్రుడు పుణ్యమువలన కలుగును; పుత్ అను నరకమునుండి రక్షించును, సంసారమునుండి తరింపజేయును.

సమస్తపుణ్యతీర్థములందు చేసిన స్నానము, సమస్త యజ్ఞములు చేయుట అనునవి పుత్ర సందర్శనమునకు పదునారవవంతైన కాజాలవు. అట్లే సమస్తదానములు చేసినందువలన కలుగు పుణ్యము, భూమి ప్రదక్షిణము చేయుటవలన కలుగు ఫుణ్యము, సమస్త తపస్సులు, ఉపవాసములు, వ్రతములు, బ్రాహ్మణ భోజనములు, దేవతార్చనములు చేసినందువలన కలుగు పుణ్యము పుత్రుని ముఖము చూచిన దానికి పదునారవవంశైవ కాజాలవు అనెను.

పార్వత్వా వచనం శ్రుత్వా శివః సంహృష్టమావపః ।

ఆజగామ స్వభవం క్షివ్రం వై కాంతయా సహ

 దదర్శ తల్పే స్వసుతం తప్తకాంచనసన్నిభం ॥

 హృదయస్థం చ. యుద్రూపం తదేవాతిమనోహరం ।

 దుర్గాతల్పోత్సమాదాయ  కృత్వా వక్షసి తత్పుతం

చుచుంబానంద జలధౌ నీమగ్నా పేత్యువాచ తం ॥

పార్వతీదేవియొక్క మాటలను విన్న శంకరుడు సంతోషముతో తన ఇంటికి వెంటనే తనభార్యతో కలసివచ్చెను. అచ్చట తన శయ్యపై బంగారు వంటి కాంతి కలవాడు, తాను ప్రతిదినము ధ్యానించుకొను రూపమువలె చాలా అందమైన శిశువును చూచెను. అప్పుడు పార్వతీదేవి సంతోషముతో శిశువును. ఎదకు హత్తుకొని మాటిమాటికి ముద్దులు పెట్టుకొనుచూ ఇట్లు పలికెను.

సంప్రాప్యామూల్యరత్నం త్వం పూర్ణమేవ సనాతనం ।

యథా మనో దరిద్రవ్య సహపా ప్రాప్య సద్ధవం ।

కాంతే ముచిరమాయతే ప్రోషితే యోషతోయథా ।

మావపం పరిపూర్ణం చ బభూవ చ తథా మమ ॥

సుచిరం గతమాయాతమెకపుత్రా కథంసుతం ।

 దృష్ట్యా తుష్టా య వత్స తథా హమపి సాంప్రతం ॥

సద్రత్నం సుచిరం భ్రష్టం ప్రాప్య హృష్ణో యథాజనః ।

ఆనావృష్టౌ సునృష్టిం చ పంప్రాప్యార తథా మతం ॥

యథా పచిరమంథావం స్థితానాంచ నిరాశ్రయే ॥

చక్షుస్సునిర్మలం ప్రాప్య మనఃపూర్ణం తథైవ మే ॥

 దుస్తరే సాగరే ఘోరే పతితస్య చ సంకటే ।

 అనౌకస్య ప్రాప్య నౌకాం మనఃపూర్ణం తథా మమ । ।

తృష్ణయా శుష్కకంఠానాం సుచిరాచ్చ సుశీతలం ।

సువాసితం జంప్రాప్య మనఃపూర్ణం తథ మమ ॥

 దావాగ్ని పతితానాం చ ఫిలిం చ నిరాశ్రయే ।

 నిరగ్నిమాశ్రయం ప్రాప్య మనపూర్ణం తథామమ ॥

 చిరం బుభుక్తిభావాం చ వ్రతపోషిణకారిణం ॥

 సదన్నం పురూతోదృష్ట్యా మనఃపూర్ణం తథామమ ।

ఇత్యుక్త్యా పార్వతి తత్ర క్రోడే కృత్వ స్వబాలకం ॥

 ప్రీత్యా దదౌ స్తవం తస్మై పరమానందమానసా ।

క్రోడే చకార భగవాన్ బాలకం హృష్టమావహః ॥

 చుచుంబ గండే వేదోక్తం యుయుజే చాశిషం ముదా ॥

ఓబాలకా! నీవు సర్వతః - పరిపూర్ణుడవు. సనాతనుడవు. అమూల్యరత్నమువంటి నిన్ను పొందినందువలన నా మనస్సు పూర్తిగా సంతోషముతో నిండిపోయింది. అంతులేని ధనము దొరికిన దరిద్రునివలె, సుదూరప్రాంతములకు పోయి చాలకాలముండి తిరిగివచ్చిన భర్తను చూచిన భార్యవలె, గొప్పవిలువ కల రత్నమును పోగొట్టుకొని పొదలో చాలాకాలము వెదకగా హఠాత్తుగా అది కనపడిన సమయము సంతోషించువాని వలె, అనావృష్టి తో బాధపడుచున్నవాడు మంచి వర్షము కురిసిన సమయమునన్నట్లు, ఆశ్రయములేక గుడ్డితనముతో అల్లాడిపోవుచున్నవాడు దైవయోగమున దృష్టి కలిగిన సమయమున సంతోషపడినట్లు నా మనస్సంతయు సంతోషముతో నిండిపోయినది. అదేవిధముగా అంతులేని సముద్రమున నౌకాయానము చేయుచుండగా ఆ నౌక మునిగిపోయినప్పుడు తల్లడిల్లిపోవుచున్నవానికి వేరొక నొక దొరికినప్పుడు కల్గు సంతోషమువలె నా మనస్సు సంతోషముతోనున్నది. అట్లే విపరీతమైన దప్పి బాధపడుచున్నవానికి చల్లని, సువాసనగలుగు జలము లభించివప్పుడు కలుగు సంతోషమువలె. దావాగ్నిమధ్యలో పడి కొట్టుమిట్టాడుచున్నవానికి ఆ అగ్నిలోనుండీ తప్పించుకొను ఆధారము దొరికినప్పుడు కలుగు సంతోషమువలె, వ్రతమును చేయుచు చాలాకాలము తిండిలేకుండ ఉన్నవారికి ఎదురుగా పంచభక్ష్య పరమాన్నములు లభించినప్పుడు కలుగు

సంతోషమువలె సంతానములేక బాధపడుచున్న నాకు ఈ శిశువును చూచుటచే సంతోషము కలిగినదని పలుకుచూ పార్వతీదేవి తన కుమారుని ఒడిలోనికి తీసికొని అతనికి స్తన్యమునిచ్చి సంతోషముతో అతనిని ముద్దుపెట్టుకొనుచూ ఆశీస్సులనొసగెను. పరమేశ్వరుడు కూడా సంతోషముతో ఆ శిశువును ఒడిలోనికి తీసుకొని ముద్దులు పెట్టుకొని ఆశీస్సుల నోసగెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయ గణపతిఖండే నారద నారాయణసంవాదే బాలగణేశదర్శనంనామ నవమోధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదైన గణపతిఖండమున నారద నారాయణ మహర్షుల సంవాద సమయమున చెప్పబడిన బాలగణపతి దర్శనమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.