వామన మహా పురాణము
అధ్యాయము 23
అలా బ్రహ్మ పలికిన మాటలు విని ఋషులందరు యిప్పుడు జగత్తుకు శ్రేయస్సు ఎలా కలుగుతుందని మరల ప్రశ్నించారు.
మనమందరం వెళ్లి ఆ దయామయుడు త్రిలోచనుడు శూలపాణి శరణుకోరుదము. ఆయన అనుగ్రహం వల్ల యథాపూర్వస్థితి ఏర్పడుతుంది. అంతట బ్రహ్మతో కలిసి ఆ మునులందరు కైలాసానికి వెళ్లి ఉమాసహితుడైన శంకరుని దర్శించారు. అప్పుడు లోకపితామహుడగు బ్రహ్మ వరదాయకుడు దేవాది దేవుడునైన ముల్లోకేశ్వరుడు శివుని యిలా స్త్రోత్రం చేశాడు. ఓ అనంతా నీకు నమస్కారం! పినాకదారీ, వరదా, మహాదేవా, స్థాణూ! పరమాత్మా నీకు ప్రణామాలు! భువనేశా! తారకా! సకలజ్ఞానప్రదాయకా! నీకు నమస్సులు! దేవా! నీవొక్కడవే పురుషోత్తముడవు. పద్మగర్భా! పద్మేశా! నీకు ప్రణామములు. ఘోరరూపా, శాంతిరూపా, చందకోననా! విశ్వేశా! నీకు నమస్కారములు. సురనాయకా! శూలపాణీ! విశ్వభావానా! ప్రభూ! నీ కనేక ప్రణామాలు! బ్రహ్మ ఋషులు చేసిన స్తోత్రం విని మహాదేవుడిలా అన్నాడు. భయపడకండి, వెళ్ళండి. లింగం పునః ప్రతిష్టిత మౌతుంది. నాకు ప్రీతికరంగా నేను చెప్పినట్లు చేయండి. చేయండి. నిస్సందేహంగా లింగ ప్రతిష్ట జరుగుతుంది. నాలింగాన్ని ఎవరు భక్తితో పూజిస్తారో వారలకు అసాధ్యమంటూ ఉండదు. పాపాలు తెలిసి చేసినప్పటికీ, ఎలాంటివైనా లింగార్చన చేసినంతటనే పటాపంచలౌతాయి. సందేహింపకుడు. మీరలు పడగొట్టిన లింగాన్ని వెంటనే తీసుకవెళ్లి సన్నిహిత్యమనే మహత్సరోవరంలో ప్రతిష్టించండి. అందువల్ల మీ మనోవాంచితాలన్నీ నెరవేరతాయి. స్థాణువనే పేర దానిని దేవతలంతా పూజిస్తారు.
స్థాణ్వీశ్వరంలో ఉన్నందున నన్నచట స్థాణ్వీశ్వరుడని పిలుస్తారు. స్థాణువును సదా స్మరిస్తే సర్వకిల్బిషాలు తొలగిపోతాయి. ఆ దేవుని దర్శన మాత్రాననే పరిశుద్ద దేహులై మోక్షగాములౌతారు. పరమేశ్వరుని మాటలు విని బ్రహ్మాది దేవతలతో కూడి ఆ ఋషులు దారువనం నుంచి లింగాన్ని కదలించి తీసికొని వెళ్ళుటకుపక్రమించారు. అయితే వారందరు కలిసి ప్రయత్నించినా ఆ లింగాన్ని కదలించలేకపోయారు. ఇక దారి ఏమని బ్రహ్మను ప్రశ్నించగా ఆయన మీరెంతగా శ్రమించినా దేవదేవుని ఇచ్చానుసారంభూపతితమైన లింగాన్ని తీసి కొనిపోలేరు. కనుక ఆయననే మరల శరణు వెడితే ఆయనే దయతో దానిని తీసికొనిరాగలడు. అంత అందరూ మరల కైలాసానికి వెళ్ళారు. అయితే అక్కడ వారలకు రుద్రుడగుపించలేదు. అప్పుడు బ్రహ్మద్యానస్తుడై ఆలోచించగా శంకరుడు ఏనుగు రూపంలో, ఆయనను స్త్రోత్రం చేస్తున్న ఆ దేవతలు, ఋషుల మనస్సులలోనే ఉన్నట్టు కనుగొన్నాడు. అంతట బ్రహ్మను ముందుంచుకొని ఆ దేవతలు ఋషులంతా, ఆ దేవుడు స్వయంగా విరాజిల్లే ఆ మహాత్సరోవరానికి వెళ్ళారు. అక్కడ కూడ ఆ శివుని కానక వారంతా అన్వేషణ సాగించారు.చింతాకులమైన హృదయాలతో ఉండిపోయారు. అప్పుడచట పార్వతీదేవి కమందలదారిణియై ప్రసన్న వదనంతో కనిపించగా ఆమె నందరు స్తోత్రం చేశారు. ప్రీతురాలైన ఆ ఉమామహేశ్వరుని వెదకి వెదకి బాగా అలసి పోయారు. కాబట్టి మీరంతా ముందీ అమృతాన్ని త్రాగండి. అనంతరం శంకరుని జాడ తెలిసి కోగలరు. అన్నది. ఆ భవాని మాటలకు సంతుష్టులై వారందరచట కూర్చొని ఆ పవిత్రమైన అమృతపానం చేశారు. అనంతరం సుఖాసీనులై వారామెను హస్తిరూపంలో అచ్చటికి వచ్చిన ఈశ్వరుడెచటనున్నాడని అడిగారు. అప్పుడామె ఆ సరోవర మధ్యంలో హస్తిరూపాన ఉన్న శివుని చూపించింది. నీటిలో మునిగి యున్న నామహాదేవుని చూచి బ్రహ్మను ముందుంచుమని ఆ దేవర్షులిలా అన్నారు.
మహాదేవా ! నీవు వదలిన త్రిలోకవందనీయమైన లింగాన్ని యితరులెవ్వరూకొని తెచ్చుటకు సమర్థులు కాకున్నారు. బ్రహ్మాదుల నివేదనము విని ఈశ్వరుడు వారందరను వెంటబెట్టుకొని దేవదారువనాశ్రమానికి వెళ్లి ఏనుగురూపంతో లింగాన్ని తొండంతో అలవోకగా పట్టుకొని తెచ్చి మహర్షుల స్తోత్రపాటాలమధ్య నామహాసరస్సుకు పశ్చిమదిక్కున నిలిపాడు. అంతనా దేవతలు ఋషులంతా తమజన్మలు ధన్యమైనవని సంతోషించి ఆ పరమశివుని యిలా స్తోత్రం చేశారు. పరమాత్మా అనంతయోనీ లోకసాక్షీ పరమేష్టీ భగవాన్ సర్వజ్ఞా క్షేత్రజ్ఞా నీకు నమస్కారము।
పరావరజ్ఞా జ్ఞానజ్ఞేయా సర్వేశ్వరా మహావిరించీ ।
మహావిభూతీ మహాక్షేత్రజ్ఞా మహాపురుషా సర్వభూతావాసా ।
మనోనివాసా ఆదిదేవా సదాశివా మహాదేవా నీకుప్రణామము. ।
ఈశానా దుర్విజ్ఞేయా దురారాధ్యా మహాభూతేశ్వరా ।
పరమేశ్వరా మహాయోగేశ్వరా త్రినేత్రా మహాయోగీపరబ్రహ్మ పరమజ్యోతీ బ్రహ్మవేత్తలలో ఉత్తముడా ప్రణవస్వరూపా ।
వషట్కారస్వాహాకారస్వదాకారరూపా పరమకారణా ।
సర్వగాతా సర్వదర్శీ సర్వశక్తిరూపా సర్వదేవా ఆభవా ।
సహస్రార్చీ అనేకకిరణా సుదామా హరదామా అనంతదామా ।
మేఘస్వరూపా సంకర్షణా బడవానలా అగ్ని చంద్రమయా నీకునమస్సులు. ।
పవిత్రుడా మహాసవిత్రుడా మహామేఘుడా మహామాయాదారీ ।
మహాకామా కామాంతకా హంసా పరమహంసా పరమాదీశ్వరా ।
మహేశ్వరా మహాకాముకుడా మహాహంసా భవనాశకా సురసిద్దార్చితా ।
హిరణ్యవాహా సువర్ణవీర్యా సువర్ణనాభా హిరణ్యకేశా ముంజకేశా ।
సర్వలోకవరప్రదా సర్వానుగ్రహకరా కమలశయనా దర్భశయనా ।
హృదయనివాసా జ్ఞానసిందూ శంభూ విభూ ।
మహాయజ్ఞా మహాయాజ్ఞికుడా సర్వయజ్ఞమయుడా ।
సర్వయజ్ఞప్రియా సర్వయజ్ఞసంస్తుతా నిరాశ్రయా ।
సముద్రశయనా అత్రిపుత్రా భక్తులయెడదయగలవాడా ।
ఆభగ్నయోగా యోగధరా వాసుకిమహామణికాంతులతో ।
వెలిగేవాడా హరితనేత్రుడా ముక్కంటీ జటాధరా నీకు నమస్సులు. ।
నీలకంటా చంద్రమౌళీ అర్ధనారీశ్వరా కృత్తివాసా ।
దుస్తరమైన సంసారాన్ని హరించేవాడా భక్తవత్సలా మమ్మనుగ్రహింపుము. ।
నీకు వేలాది ప్రణామములు. ఆ విధంగా బ్రహ్మపురోగాములయిన దేవతలు వాలఖిత్యాది ఋషులు భక్తిప్రపత్తులతో చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ మహాదేవుడా ఏనుగురూపాన్ని వదలి ఆ లింగ మధ్యంలో సన్నిహితుడైనాడు.
అధ్యాయము 23 complete
Summary of chapter 95 of the Vāmana Mahā Purana is as follows:
The narrative details how Sage Mankanaka, upon seeing vegetable juice flow from his wounded hand instead of blood, became filled with spiritual pride and began an ecstatic dance that shook the entire cosmos. Parameśvara Śiva manifested before the sage, pierced His own finger to produce divine white ash, and gently revealed the futility of ego, restoring Mankanaka to true humility. Overwhelmed with gratitude, Sage Mankanaka bowed at the feet of Mahādeva Śiva, establishing Saptasārasvata as a place for shedding spiritual pride.