వామన మహా పురాణము
అధ్యాయము 69
బ్రహ్మర్షీ నారదా ! పుణ్య తమ మైన ఈ వామన పురాణాన్ని నీకు సాకల్యంగా వినిపించాను. దీనిని శ్రద్ధా భక్తుల తో వినినా పఠించినా కీర్తించినా విష్ణు పద ప్రాప్తి కలుగుతుంది. గంగా నదీ జలాల్లో మునిగి నందున పాపాలు తొలగు నట్లుగానే ఈ పురాణ శ్రవణం వల్ల సకల దురితాలు నశిస్తాయి ఈ వామన పురాణాన్ని చదివించు కుని విన్నందు వల్ల, అటు వంటి వారికి, వ్యాధులు కలుగవు. విష ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు బాధించవు. వారలకే కాక వారి వంశంలో నున్న వారెవ్వరికీ ఎలాంటి బాధలు కలుగవు. ప్రతి దినం విష్ణు దేవుని పూజించి, నమస్కరించి, భక్తి పూర్వకంగా దీనిని విన్నచో సమస్త పాపాలు నశించి దక్షిణలతో సహా అశ్వమేధ యాగం చేసినంత సంపూర్ణ ఫలం లభిస్తుంది. గో భూ సువర్ణ, రధ, గజ, తురగాలు దానం చేసిన ఫలం దక్కుతుంది. పురుషులుగాని, స్త్రీలుగానీ కనీసం ఒక శ్లోకంలో ఒక పాదాన్నైనా భక్తితో వింటే పృథివిలో పవిత్రులు, పుణ్యాత్ములు అవుతారు. నైమిషారణ్య పుష్కర క్షేత్రాల్లో స్నానం చేస్తే, ప్రయాగలో మాఘస్నానాలు, చేస్తే భాగీరథిలో కోకాముఖక్షేత్రంలో స్నానం చేస్తే, కలిగే పుణ్య ఫలం అనన్యచిత్తంతో వామన పురాణం వింటే కలుగు తుందని విప్రులు వక్కాణిస్తారు. నారదా! ఇక నా దృడ విశ్వాసం వినుము. ఈ మహా పురాణ శ్రవణం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలం వస్తుంది. భూలోకంలో దీనిని విన్న వారలకు దేవ లోకంలో సౌత్రామణి క్రతువు చేస్తే ఏ మహ త్సుఖం కలుగుతుందో అది సంపూర్ణంగా లభిస్తుందనడంలో సంశయం ఏ మాత్రం లేదు. సూర్య చంద్ర గహణ పవిత్ర పర్వాల్లో రత్న రాసులు దానం చేస్తే వచ్చే ఫలం అగ్ని పూజా నిరతుడగు విప్ర వరునకు ఆకలి గొన్న వేళ భోజనం పెడితే వచ్చే పుణ్యం కరువు కాటకాల్లో ఆకలితో బాధ పడే పుత్ర కళత్ర సహితుడైన వానికి అన్నం పెట్టిన పుణ్యం, స్త్రీలకు తోడు గానిలచే వారలకు, దేవ అగ్ని ఋషి బ్రాహ్మణ పితృదేవతల నర్చించే వారలకు, తల్లి దండ్రులకు, జేష్ఠ సోదరులకు, శుశ్రూష చేసి, సహాయ పడితే కలిగే సత్ఫలాలన్నీ ఈ పవిత్ర పురాణ పఠనం వల్ల తప్పక లభిస్తాయి. పదు నాల్గవ దైన వామన పురాణాన్ని ప్రముఖమైన (అగ్య్ర) పురాణంగా కీర్తిస్తారు. దీనిని విన్నందున సాధారణ పాపాలే కాక మహా పాతకాలు సర్వమూ నశిస్తాయి. నారదా! ఇది మమ్మాటికీ నిజం. దీనిని పఠించినా విన్నా యితరులకు వినిపించినా సర్వ పాపాలు తొలగుతాయి. ఇది చాలా రహస్యమైన పురాణం. దీనిని హరి భక్తులకు తప్ప యితరు లెవరకు చెప్ప రాదు. సుమా! పర నింద చేసే వారికీ బ్రాహ్మణ ద్వేషులకు కుతర్కాలతో తాము చేసే దురాచారా లను సమర్ధించు కొనే నాస్తికులకు, హేతు వాదులకు చెప్ప రాదు. వారలు దీనిని వినుటకు అధికారులు కారు! నమో నమః కారణ వామనాయ! దేవకార్య సిద్దికై వామన రూపం ధరించిన విభో నీకు నమస్కారం ! అంటూ నియమంతో ప్రభువు నామాభివదనం చేయు ధన్యులకు దేవ పూజితుడైన విష్ణుడు మోక్షపదం ప్రదానం చేస్తాడు ఈ పురాణాన్ని చదివి వినిపించిన సజ్జనులను గో భూ హిరణ్య వస్త్ర ఆభరణాలతో భక్తితో సత్కరించాలి. ధన లోభం చూప రాదు. అలా చేస్తే శ్రవణ ఫలం నశిస్తుంది. త్రిసంధ్యలలోను చదివినా వినినా సర్వ పాపాలు తొలగి పోతాయి ఈర్ష్యా అసూయలు లేని విప్రుల కిది సర్వ సంపదలు ప్రసాదిస్తుంది !
అధ్యాయము 69 Complete
Summary of chapter 73 of the Vāmana Mahā Purana is as follows:
As Trivikrama Prabhu expands across the cosmic spheres, His foot reaches the topmost Satyaloka, where Pitāmaha Brahmā reverently washes the lotus foot with holy water, giving origin to the celestial river Gaṅgā. Overwhelmed with transcendent joy, Pitāmaha Brahmā sings a magnificent hymn praising Trivikrama Vishṇu as the infinite, unborn Supreme Divine whose single step encompasses all space, time, and creation. The celestial hosts and Maharshis join in the chorus, glorifying the divine play of the Supreme Preserver who reclaims the universe while uplifting the soul of King Bali.