వామన మహా పురాణము
అధ్యాయము 19
వశిష్టుని సరస్వతీనదికొనిపోవుట ఎలా జరిగినది? ఆ సర్వోత్తమమైన నది ఆ మహర్షిని ఎందుకు తన జలాల్లో లాగికొనిపోయినది.
తమతమ తపోబలాలను పురస్కరించుకొని రాజర్షియైన విశ్వామిత్రునకు, బ్రహ్మర్షియగు వసిష్టునకు మధ్య చిరకాలంగా శత్రుత్వం ఉంది. వసిష్టుని ఆశ్రమం ఉండేది. అక్కడ భగవంతుడగు స్థాన్వీశ్వరుడు యజ్ఞం చేసిన సరస్వతీ నదిని పూజించి ఆమెనొక లింగాకారంలో ప్రతిష్టించాడు. వసిష్టుడచట ఘోరమైన తపోనిష్టలో ఉండిపోగా పిలిచి మునిశ్రేష్టుడగు వసిష్టుని గొనిరమ్మనియూ తానాయనను తప్పకచంపి వైతుననీ ఆజ్ఞాపించాడు. ఆ మాటవిని ఆ మహానది మహావ్యథతో నిలచిపోయినది. అందుకు మరింతకుపితుడై విశ్వామిత్రుడు వసిష్టుని వెంటనేపోయి కొనిరమ్ము పొమ్మని గర్జించెను. అంతట నా ఉత్తమనదీమతల్లి వసిష్టుని సమీపించి విలపిస్తూ విశ్వామిత్రుని వాక్యములు వినిపించింది. తపంవల్ల కృశించి, శోకంతో విలవిలలాడుతున్న చూచి వసిష్టుడు విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు తననాతని వద్దకు తీసికొనిపొమ్మనెను,
ఆ కరుణామయుని వచనానుసారం ఆ నది ఆయనను తన ప్రవాహజలాల్లో కొనిపోసాగెను. అలా నదీప్రవాహంలో కొట్టుకొనిపోతూ ఆ వసిష్ఠముని సరస్వతీ నదిని యీ విధంగా స్తుతించాడు. “బ్రహ్మ సరస్సు నుంచి ఉద్భవించిన పావనసరస్వతీ! నీ పవిత్ర జలాలతో జగత్తునంతను ముంచితివి. నీవే ఆకాశాన ప్రవహించి మేఘాలకు నీరు ప్రసాదిస్తున్నావు. జలములన్నియు నీ రూపమే. పుష్టి, కీర్తి, సిద్దులు, కాంతి, క్షమాగుణం, స్వాహా, స్వధా, వాణి యిత్యాదులతో కూడిన ఈ జగత్తంతటికీ నీవే ఆధారము. అన్ని జీవరాసుల్లోనూ వాణిరూపంలో నీవే నెలకొని ఉన్నావు. నీకు నమస్సులు.” ‘వసిష్ఠుని స్తోత్రానికి సంతసించి సరస్వతీనది ఆయనను సుఖంగా తన ప్రవాహంతో విశ్వామిత్రుని కడకు కొనిపోయి ఖిన్నురాలై ఆ విషయం విశ్వామిత్రున కెరిగించినది. అలా వచ్చిన వసిష్టుని చూచి కోపంతో, ఆయనను సంహరించుటకు విశ్వామిత్రుడు ఆయుధము తీసికొనిరాగా తన ప్రవాహం మధ్య భాగాన ముంచివేసింది. ఆ విధంగా యిద్దరి ఆదేశాలను గౌరవించింది. ప్రవాహమధ్యంలో ముంచబడిన వసిష్ఠుని కానక విశ్వామిత్రుడు సరస్వతి చేసిన మోసానికి కోపించి, ఓ ఉత్తమ స్రోతస్వినీ! కల్యాణీ! నన్నీవిదంగా వంచించి నందుకు ప్రతిఫలంగా నీవు నీళ్ళకుబదులుగా రక్తం ప్రవహిస్తూ రాక్షసులకు నిలయమైయుండగలవని శపించెను. ఆ శాప ఫలంగా ఆ సరస్వతీ నది ఒక సంవత్సరకాలం రక్తం ప్రవహింపజేస్తూ ఉండినది.
అలా రక్త జలాలతో నిండిన సరస్వతిని చూచి దేవగంధర్వాప్సరసలు ఎంతో దుఃఖించారు. రక్తంతో నిండిన ఆనదీ చుట్టూ భూత పిశాచరాక్షసులు మూగికొని మహాసంతోషంతో ఆ రక్తం త్రాగుతూ తృప్తిగా ఎలాటి విచారం లేకుండా వికటాట్ట హాసాలు చేస్తూ స్వర్గాన్ని జయించినట్లుగా ఆనందించసాగారు. ఆమీద కొన్నాళ్ళకు కొందరు ఋషులూ తపోధనులూ యాత్రార్థంగా బయలుదేరి సరస్వతీనదిని సమీపించారు. రక్తమై రాక్షసులతో నిండిన ఆ పుణ్యనదిని చూచి ఆమెను రక్షించాలని సంకల్పించుకొని ఆ మహానదిని పిలిచి ఆ తపిధనులిలా అన్నారు. ఓ నదీశ్రేష్టమా! యిలా రక్తజలాలతో నిండియుండుటకు కారణమేమి? మాకంతయు చెప్పవలసినది. అందులకు సరస్వతి విశ్వామిత్రుడి ఆగడాన్ని వివరించి చెప్పింది . అంతట నామునులందరు సంతోషించి సమస్త పాపాలను పోగొట్టే అరుణానదీ పవిత్ర జలాలను తెచ్చి సరస్వతిలో కలిపారు. ఆమెను పవిత్రను గావించారు.
ఆ పవిత్రాలైన సరస్వతీ నదీజలాలను చూచి దుఃఖితులై దీనదీనంగా ఆ రాక్షసులు మునులతో యిలా విన్నపం చేసుకున్నారు. “మేము శాశ్వతంగా ధర్మదూరులమై ఆకలితో అల్లాడుతున్నాము. మేము స్వయంగా ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. మేముచేసిన పాపకర్మలూ మీ అనుగ్రహం లభించకపోవడం యీ కారణాలవల్ల మాజాతి పెరిగిపోతూ మేము బ్రహ్మరాక్షసులమయ్యాము. బ్రాహ్మణులను ద్వేషించిన వైశ్య శూద్ర క్షత్రియులందరూ బ్రహ్మరాక్షసులౌతారు. పాపిష్టి స్త్రీలతో సంగమం చేయడం వల్ల మాసంతతి పెరిగిపోతున్నది. ఇది ఎప్పటినుంచో వస్తూన్న కర్మ. తమరో. మహాతపోధనులు! సమస్త లోకాలను తరింపచేయ సమర్థులు! ఆ రాక్షసుల దీనాలాపాలు విని ఆ దయామయులగు మునులు తమలోతాము సంప్రదించు కున్నారు. ఎంగిలి, కీటకాదులు వాలినది, వెండ్రుకలు పడినందున, గాలివల్ల నోటిశ్వాసవల్ల కలిషితమైన భోజనం రాక్షస భోజ్యం. ఆ సంగతి గుర్తించి విజ్ఞులయిన వారలట్టి ఆహారాన్ని వర్జించాలి. అలాటి తిండి తిన్న వాడు రాక్షస భోజనం చేసినట్లే. అలా ఆలోచించుకొని ఆ మహర్షులాతీర్థాన్ని పవిత్రంగావించి రాక్షసులనుద్దరించుటకై అక్కడ అరుణా సరస్వతీనదుల పవిత్ర సంగమాన్ని కన్పించారు. లోకప్రసిద్దమైన ఆ నదీసంగమంవద్ద మూడురాత్రులుపవసించి స్నానం చేస్తే సర్వకిస్బిషాలు తొలగిపోతాయి. ఘోరకలికాలంలో ధర్మం అడుగంటినరుడు అరుణా సంగమంలో స్నానం చేసి మానవులు ముక్తులు కాగలరు. అంతట ఆ రాక్షసులందరు ఆ సంగమతీర్థాల్లో మునిగిపాపముక్తులై దివ్యమాల్యాంబరాలు ధరించి స్వర్గలోకాలకు చేరుకున్నారు.
అధ్యాయము 19 complete
Summary of chapter 92 of the Vāmana Mahā Purana is as follows:
The narrative describes the historical conflict between Sage Viśvāmitra and Sage Vashishṭha, during which Viśvāmitra commanded the river Sarasvatī to sweep Vashishṭha away to his hermitage. To prevent a sinful act while honoring the sage's command, the compassionate river Sarasvatī carried Vashishṭha safely in Her swift current without harming him, creating the sacred stream known as Vasishṭhāpagā. This sacred stream remains a holy sanctuary where pilgrims bathe to overcome anger, pride, and interpersonal discord.