వామన మహా పురాణము
అధ్యాయము 7
అదితికావించిన స్తోత్రం విని భగవంతుడగు వాసుదేవుడితరులెవ్వరికి కనబడకుండా ఆమెకు మాత్రమే గోచరించి యిలా అన్నాడు.
ఓ ధర్మజ్ఞురాలవగునదితీ! నా అనుగ్రహంచేత నీ మనోరథాలన్నీ నెరవేరగలవు. నా దర్శనం విఫలం కాజాలదు. అందువల్ల ణీ మనస్సులోని వరం (కోరిక) తప్పక సిద్ధిస్తుంది. ఈ అదితి వనం (కురుక్షేత్రం ) లో మూడు నిద్రలు చేసి సాధన చేయునో అతని మనోవాంచలన్నీ సిద్ధించగలవు. దూరాన్నుంచి ఈ అదితివనాన్ని స్మరించైనా వారలకే పరమపదం ప్రాప్తించగలిగియుండగా, అక్కడ ఆవాసం చేయువారి విషయం చెప్పవలెనా? ఈ ప్రదేశాన భక్తి శ్రద్ధలతో ఐదుగురకో, ముగ్గురకో, ఇద్దరికో లేక ఒకరికైనా సరే భోజనం పెట్టి తృప్తి పరచు వారల కక్షయలోక ప్రాప్తి కలుగును.
భక్తవత్సలా! దేవా! ణా భక్తికి సంతసించినచో నాపుత్రుడగు ఇంద్రుడు త్రిలోకాధిపతి అగుగాక. అతడు కోలుపోయిన రాజ్యం యజ్ఞభోగాలు ణీ అనుగ్రహం వల్ల మరల నా పుత్రునకు లభించుగాక. రాజ్యం పోయినందుకు నా కుమారునకు చింతలేదు. శరణాగతులకు దాయభాగ విభ్రంశం కలగడమే నన్ను వేధించుచున్నది.
దేవీ! నీ మనోభీష్టముననుగ్రహించితిని. ఇంకా ణా అంశతో కశ్యపుని ద్వారా నీ కడుపున పుట్టి శత్రులోకాన్నంతటినీ సంహరింతును. నీవు ఆనందంతో తిరిగి వెళ్ళుము.
ఓ దేవదేవ! విశ్వభావన! నన్ననుగ్రహించుము. సమస్తలోకాలను బోజ్జలోనుంచుకొన్న సర్వేశ్వరుడవగు విశ్వగర్భునిని మోయలేను తండ్రీ!
భయపడకు దేవీ! నేను నిన్నూ నన్నూ కూడా మోయగలను. నీకెలాంటి బాధయు కలుగనివ్వను. నీకు మేలగుగాక. నేను వెళ్లి వస్తాను. అలా అభయమిచ్చి వాసుదేవుడంతర్హితుడు కాగా అదితి గర్భంధరించినది. కృష్ణుడామె గర్భస్తుడగుటతో భూమి అంతయూ కంపించినది. మహాపర్వతాలు కదలిపోయినవి. మహాసాగరాలు సంక్షుభితాలయినవి. ఓ బ్రహ్మణోత్తములారా! ఆ మహాదేవి అదితి అడుగుపెట్టిన ప్రతిచోట భూమి బాధతో క్రుంగిపోయేది. మరొక వైపు, మధుసూదనుడు గర్భస్థుడు కావడంతో, పరమేష్టివచనానుసారం దైత్యులు తమతేజస్సు క్రమంగా కోలుకోసాగారు.
అధ్యాయము 7 complete
Summary of chapter 80 of the Vāmana Mahā Purana is as follows:
The text recounts the historical episode of King Vena, whose unrighteous deeds during his earthly reign resulted in severe karmic afflictions and a degraded post-mortal state. His noble and righteous son, King Prithu, carried the ancestral remains to the holy waters of Prithūdaka, where he performed devout ancestral libations and charity in honor of Bhagavān Nārāyaṇa. Through the pristine spiritual potency of Prithūdaka and the filial devotion of King Prithu, the soul of Vena was completely cleansed of all past sins and elevated to the celestial realms of the devas.