2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

45 - నిత్య, దేవ, వృద్ధి శ్రాద్ధాలు

గరుడా ! అన్ని రకాల శ్రాద్ధాలను గూర్చీ నీకు చెప్పడం జరిగింది. అయితే, నిత్య శ్రాద్ధంలో ఆహూతులైన బ్రాహ్మణులకు కూడా పితరులతో బాటు, భక్తిపూర్వకంగా, అర్ఘ్య పాద్య గంధాదులతో పూజ చేయాలి. తరువాత పితరులనుద్దేశించి వారికి భోజనాలు పెట్టాలి. నిత్యకర్మలో చేయకూడని వేవనగా - ఆవాహన, స్వధాకారం, పిండదానం, అగ్నౌకరణం, బ్రహ్మచర్యాది నియమాలు, విశ్వేదేవ కృత్యాలు. నిత్య శ్రాద్ధంలో కూడా బ్రాహ్మణులను భోజనాలచే తృప్తులను చేసి దక్షిణలిచ్చి సాదరంగా వారిని వీడ్కొల్పాలి.

విశ్వేదేవులను, ఇతర దేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు నిత్యశ్రాద్ధ పద్ధతిలోనే భోజనాలను పెట్టిస్తే అది దేవ శ్రాద్ధమనబడుతుంది.’

(వృద్ధి శ్రాద్ధం ఇదివఱకే వచ్చింది)