2 - గరుడ పురాణము - ప్రేత కాండము
28, 29 - ప్రేత ముక్తి - ఉపాయాలు
“హే జగదానందకారకా! ఏ దానం లేదా సత్కర్మ ద్వారా ప్రాణి ప్రేతయోనిలో పడినా విముక్తి చెందగలదు?”
వత్సా! నీ లోక కల్యాణ వాంచ బహు ప్రశంసనీయం. సమస్త అమంగళాలనూ నశింపజేయు దానాన్ని గూర్చి వినిపిస్తాను. విను. ప్రవచించు. ఒక బంగారు కుండను నిర్మింపజేసి దానిని బ్రహ్మ, విష్ణు, శివ, లోకపాలుర ప్రతిమల మధ్య పెట్టి ఆ దేవతలందరినీ యథావిధిగా పూజించి ఈ కుండపై కూడా ఆ పూజాద్రవ్యాలను వేస్తుండాలి. పూజానంతరం ఆ కుండను పాలతో నేతితో నింపి సుపాత్రుడైన బ్రాహ్మణునికి దానమిచ్చిన వ్యక్తి ప్రేతయోనిలో పడడు. దహనానికి ముందు చేయవలసిన పనులన్నీ ప్రేతముక్తికై ప్రయత్నాలే. వాటిని ఇప్పటికే వినియున్నావు కదా!
గరుడా! తిలలు నా (విష్ణు) స్వేదజనితాలు. అవి పరమపవిత్రాలు.
మమస్వేద సముద్భూతా
స్తిరాస్తార్క్ష్య పవిత్ర కాః । ఽ9.15
అలాగే కుశలు నా రోమాల నుండి ఉద్భవించాయి.
దర్భామల్లోమ సంభూతాః ॥ ఽ9.17
కుశలలో బ్రహ్మా, నేనూ, శివుడూ ఉంటాము. బ్రాహ్మణుడు, మంత్రము, కుశ దర్భలు, అగ్ని, తులసి - వీటినెన్ని మార్లు ప్రయోగించినా పాసిపోవడం గాని, వన్నె తగ్గడం గాని జరుగదు.
విప్రమంత్రాః కుశావహ్నిస్తుల సీచ ఖగేశ్వర ।
నైతే నిర్మాల్యతాం యాంతి క్రియమాణాః పునఃపునః ॥ ఽ9.ఽ1
అలాగే విష్ణ్వాది ఆరు పుణ్యదాలు కూడా.
విష్ణురేకాదశీ గీతా తులసీ విప్రధేనవః ।
అపారే దుర్గసంసారే షట్పదీ ముక్తి దాయనీ ॥ ఽ9.ఽ4
పైని చెప్పినవన్నీ ప్రేత ముక్తి దాయకాలే. ఇవే కాక లవణ దానం కూడా ముక్తిదాయకమే. లవణం నా దేహం నుండి పుట్టింది
గమనిక ఇక్కడ సంక్షిప్తంగా చెప్పబడిన విషయాలన్నీ ఇదే కాండలో మొదటి రెండు అధ్యాయాల్లో విస్తృతంగా వర్ణింపబడ్డాయి.
