2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

41 - 44 - సర్పదంశ మృతులకు విహిత కర్మ విధానం

ఇతర దుర్మరణాల పాలైన వారికి అపరకర్మ ఎలా చేయాలో ఇదివఱకే విన్నావు కదా! పాము కాటుకి గురియై మృతి చెందిన వారికుత్తమ గతులు కలగాలంటే ప్రతిమాసంలో రెండు పంచమి తిథులలోనూ నాగదేవతను పూజించాలి.

భూమిపై శాలిచూర్ణంతో నాగదేవత ఆకారాన్ని చిత్రించాలి. తెల్లపూలు, సుగంధద్రవ్యములు, ధూపం, దీపం, తెల్లని అక్షతలతో దానిని పూజించి బాగా ముద్దగా వండబడిన అన్నాన్ని పాలతో బాగా ముద్దగా కలిపి నైవేద్యం పెట్టాలి. తరువాత అక్కడ ద్రవ్యాలనూ వస్త్రాలనూ ఉంచి లేస్తూ ‘నాగరాజు ప్రసన్నుడు కావాలి గాక’ అని అనాలి.

అదేరోజు శ్రాద్ధాన్ని శాస్త్రోక్తంగా పెట్టి మధురమైన భోజనాన్ని చేయాలి. తరువాత, యథాశక్తి బ్రాహ్మణులకు బంగారు నాగ ప్రతిమలను దానం చేయాలి. గురుదేవునికి గోదానం కూడా చేసి నాగరాజు ప్రీయతాం అని చెప్పాలి. అపుడు ఇతర శ్రాద్ధకర్మలను చేయాలి.