నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ । ।
శ్రీమన్నారాయణునకు మానవులలో ఉత్తముడైన నరుడను మహర్షికి, సరస్వతీదేవికి వ్యాసునకు నమస్కరించి జయజయధ్వానముచేయవలెను. ఇది ప్రార్థనాశ్లోకం.
నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునితో ఇట్లనెను-
శ్రుతం ప్రకృతిఖండం తదమృతార్ణవముత్తమం ।
సర్వోత్కృష్ణమభీష్టం చ మూడానాం జ్ఞానవర్థనం ॥
ఆధునా శ్రీగణేశస్య ఖండం శ్రోతుమిహాగతః ।
తజ్జన్మచరితం సృణాం సర్వమంగళమంగళం॥
కథం జజ్ఞే సురశ్రేష్ఠ పార్వత్యా ఉదరే శుభే ।
దేవీ కేన ప్రకారేణ చాలభక్తాదృశం సుతం॥
సచాంశః కస్య దేవస్య కథం జన్మ లలాభ సః ।
అయోనిసంభవః కిం వా కీరవాసౌ యోనిసంభవః ॥
కిం వా తద్రహ్మా తేజోనా కిం తస్య చ పరాక్రమః ।
కా తపస్యాచ కిర జ్ఞానం కిం వా తన్నిర్మలం యశః ॥
కథం తస్య పుర: పూజా విశ్వేషు నిఖిలేషు చ ।
స్థితే నారాయణే శంభో జగదీశ్ చ ధాతరి ॥
పురాణేషు నిగూఢం చ తజ్జన్మ పరికీర్తితం ।
కథం వా గజవ క్త్రోయమేకదంతో మహోదరః ॥
ఏతత్సర్వం సమాచక్షు శ్రోతుం కౌతూహలం మమ।
సువిస్తీర్ణం మహాభాగ తదతీవ మనోహరం ॥
ఓనారాయణమునీ! నీఅనుగ్రహమువలన అమృతసముద్రమని పేరొందినది, అజ్ఞానులకు జ్ఞానమును కలిగించునది, అందరకు ఇష్టమైనది, సర్వోత్కృష్టమైనది యగు ప్రకృతిఖండమును వింటీని.
ఇప్పుడు అందరకు మంగళప్రదమైన శ్రీగణేశఖండమును వివవలెనను కోరిక నాకు కల్గినది. ఆతని జన్మ, ఆతని చరిత్ర శుభములకే శుభమైనది. కావున దానిని వినవలెనని అనుకొనుచున్నాను.
దేవతా శ్రేష్టుడగు ఆ గణపతి పార్వతీదేవిపుత్రుడుగా ఎట్లు ఉద్భవించెను? పార్వతీదేవి సహితము గజముఖుడగు ఆ బాలకుని “ఏవిధముగా కన్నది? ఆ గణపతి ఏదేవునియొక్క అంశో? ఎవరివలన జన్మించెను? అతనిజన్మప్రకారమెట్టిది? అతడు యోనిజుడా అయోనిజుడా? ఆ బ్రహ్మతేజస్సు ఎటువంటిది? అతని పరాక్రమవిశేషములెట్టివి? ఆతడెట్టి తపస్సు చేసెను? ఆతనికి లభించిన జ్ఞానమెట్టిది ఆతని కీర్తి వివరములేమి? ఈసమస్తవిశ్వములందు బ్రహ్మ, నారాయణుడు, శంకరుడు వంటి దేవతలుండగా ఈతనికి ప్రథమపూజను ఆందరెందులకు చేయుచున్నారు?
ఆతని జన్మవృత్తాంతము పురాణములలో చాలా రహస్యముగా నున్నదని వింటిని, ఆ గణేశుడు గజముఖుడుగా, ఏకదంతుడుగా ఎట్లయ్యెను మొదలగు విషయములనన్నిటిని వినవలెనని కోరికకలదు.
మిక్కిలి సుందరమైన ఆ గణేశుని చరిత్రను నాకు సంపూర్ణముగా వివరింపుడని ప్రార్థించుచున్నాను అని పలికెను.
శ్రీనారాయణ ఉవాచ – శ్రీమన్నారాయణుడిట్లనెను-
శ్రుణు నారద వక్ష్యామి రహస్యం పరమాద్భుతం ।
పాపసంతాపహరణం సర్వవిఘ్నవినాశనం ॥
సర్వమంగళదం సారం సర్వశ్రుతీమనోహరం ।
సుఖదం మోక్షబిజం చ పాపమూలనీకృంతనం ॥
దైత్యార్థితానాం దేవానాం తేజోరాశిసముద్భవో ।
దేవీ సంహృత్య దైత్యాసూన్ దక్షకన్యా బభూవ హా ॥
సా చ నామ్నా సతీ దేవీ స్వామివో నిందయా పురా ।
దేహం సంత్యజ్య యోగేన జాతా శైలప్రియోడరే॥
శంకరాయ దదౌ తాం చ పార్వతీం పర్వతో ముదా ।
తాం గృహీత్వా మహాదేవో జమ ఏజనం వనం ॥
శయ్యాం రతికరీం కృత్యా పుష్పచందన చర్చితాం ।
స రేమే నర్మదాతిరే పుష్పోద్యానే తయా సహ॥
సహసవర్షపర్యంతం దైవమానేన నారద।
తయోర్బభూవ శృంగారో విపరీతాదికో మహాన్॥
దుర్గాంగస్పర్శమాత్రేణ మదనాన్మూర్భీతః శివః ।
మూర్ఛితా సా శివస్పర్శాల్ బుబుధ్ న దివానీశం॥
హంసకారండవాకీర్ణే పుంస్కోకిల రుణాకులే।
నానా పుష్టువికాసాఢ్య భ్రమరధ్వనీ గుంజితే ॥
సుగంధీకుసుమాశ్లేషి వాయునా సురభీకృతే ।
ఆతీవ సుఖదే తత్ర సర్వజంతు వివర్జితే ॥
దృష్ట్యాతయోః శృంగారం చింతాంప్రాపుః సురాః పరాం ।
బ్రహ్మాణం చ పురస్కృత యయుర్నారాయణాంతకం॥
తం నత్వా కథయామాస బ్రహ్మా వృత్తాంతమీప్సితం ।
సంతస్థుర్దేవతాః సర్వాశ్చితా పుత్తాలికా యథా ॥
ఓనారదమహర్షి శ్రీగణపతియొక్క చరిత్ర చాలా రహస్యమైనది. మిక్కిలి ఆశ్చర్యమును కలిగించునది, సమస్తపాపములను, శోకములను హరించునది. సమస్తవిఘ్నములను తొలగించునది.
ఈతని చరిత్ర సమస్తశుభములను కలిగించును, సుఖమును మోక్షమును కలిగించును. సమస్తపాపములకు కారణమైన దుష్కర్మలను పోగొట్టును,
పూర్వకాలమున రాక్షసులు దేవతలను మిక్కిలి బాధించెడివారు. దానవపీడితులైన దేవతల ప్రార్థన ననుసరించి తేజోరాశినుండీ పుట్టిన దుర్గాదేవి రాక్షసులనందరను సంహరించినది. ఆ దుర్గాదేవియే సతీదేవి యను పేర దక్షునకు పుత్రికగా జన్మించినది. ఆ సతీదేవి దక్షయజ్ఞమున తండ్రియగు దక్షుడు తన భర్తను నిందింపగా విని సహింపలేక యోగబలము వలన తన శరీరమును వదలిపెట్టి హిమవంతునకు అతని భార్యయగు మేనాదేవికి పుత్రికగా జన్మించినది. యుక్తవయస్కురాలగు తన పుత్రికను హిమవంతుడు శంకరునకిచ్చి వివాహము చేసెను.
ఆప్పుడు శంకరుడు పార్వతీదేవిని తీసికొని నిర్జనమైన నర్మదానదీతీరమునకు తీసికొనిపోయెను. ఆక్కడనున్న పుష్పద్యానవనమున పుష్పములు, చందనములతో రతికి అనుకూలమైన శయ్యను ఏర్పరచి అచ్చట అనేకనేక దేవతావర్షములు ఆమెతో సంభోగించెను.
దుర్గాదేవియొక్క శరీరస్పర్శతోనే పరమేశ్వరుడు పులకించి మైమరచిపోగా, శంకరుని అవయవస్పర్శవలన పార్వతీదేవి పులకించి మైమరచిపోయినది. వారిద్దరు హంసలు, బాతులు తీరుగుచున్న ప్రదేశమున గండు కోకిలలు మనోహరముగా శబ్దించుచున్న సమయమున, తుమ్మెదల ఝంకారములతో పువ్వుల పైనుండి వచ్చు సుగంధమందమారుతములతో ఆ ప్రదేశమంతయు పరమారమణీయముగానుండగా నీర్జనమైన స్థలమున సుఖసంభోగమున తేలియాడుచుండిరి.
కాని సమయమునేమాత్రము పట్టించుకొనకుండా వారు సంభోగముననున్నందువలన దేవతలు చాల చింతించి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళిరి. బ్రహ్మదేవుడు సహితము దేవతలను వెంటబెట్టుకొని శ్రీమన్నారాయణుని సన్నిధికి వెళ్ళాను. ఆచ్చట బ్రహ్మదేవుడు పార్వతీపరమేశ్వరుల విషయమును నారాయణునకు చెప్పుచున్నప్పుడు దేవతలందరు చిత్రములోని బొమ్మలవలె అచ్చట నిలుచుండిరి.
బ్రహ్మోవాచ – బ్రహ్మదేవుడిట్లనెను-
సహస్రవర్షపర్యంతం దేవమానేన శంకరః ।
రతౌ రతశ్చ నిశ్చేష్టో న యోగీ వీరరామ హ ॥
మైథునస్య విరామే చ దంపత్యోర్జగదీశ్వర।
కింభూతం భవితాపత్యం తన్నః కథితుమర్హసి ॥
శంకరుడు వేయి దేవమాన సంవత్సరములనుండి రతిలోనిమగ్నుడై రతికార్యమును విరమింపక ఉన్నాడు. అందువలన ఓజగదీశ్వరుడవైన శ్రీమన్నారాయణమూర్తీ! ఈదంపతులకెట్టి సంతానము కలుగునో మాకు తెలుపుడు ఆని బ్రహ్మా శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించెను.
శ్రీభగవానువాచ - భగవంతుడగు నారాయణమూర్తి ఇట్లనెను-
చింతా నా స్తిజగద్ధాతః సర్వం భద్రం భవిష్యతి ।
మయి యే శరణాపన్నాస్తేషాం దుఃఖం కుతో విధే॥
యేనోపాయేన తద్వీర్యం భూమౌ పతతినిశ్చితం ।
తత్కురుష్వ ప్రయత్నేన సార్థం దేవగణేన చ ॥
యదా చ శంభోర్వీర్యం తత్పార్వత్యా ఉదరే పతేత్ ।
తతో పత్యం చ భవితా సురాసుర విమర్ధకం ॥
జగములనన్నిటిని సృష్టించు ఓబ్రహ్మదేవుడా! మీరు భయపడవలసిన అవసరము లేదు. మీకు సమస్తము శుభములే కలుగును. నన్ను శరణుపొందినవారికి దు:ఖము ఎన్నటికిని కలుగదు. ప్రస్తుతము నీవు, ఈదేవతాగణము అందరు కలసి శంకరుని వీర్యము భూమిపై పడునట్లు చేయుడు, శంకరుని వీర్యము పార్వతీదేవి కడుపున పడినచో దేవరాక్షసులనందరును సంహరించు పుత్రుడు పుట్టును కావున నేను చెప్పినట్లు చేయుడు అనీ పలికేను.
తతః శక్రాదయః సర్వే సురా నారాయణాజ్ఞయా ।
ప్రయయుర్నర్మదాతీరం యయా బ్రహ్మా నిజాలయం ॥
తత్రైవ పర్వతద్రోణీబహిర్దేశే సురాః పరాః ।
విషణ్ణవదనాస్సర్వే బభూవుర్బయకాతారాః ॥
శక్రో రాజా కుబేరం చ కుబేరో వరుణం తథా ।
సమీరణం చైవ వరు యమం చైవ సమీరణః ॥
హుతాశనం యమశ్చైవ భాస్కరం చ హుతాశనః ।
చంద్రం తథా భాస్కరశ్చత్వీశానం చంద్ర ఏవ చ ॥
ఏవం దేవాః ప్రేరయంతి దేవాంశ్చ రతిభంజనే ।
హారశృంగారభంగం చ కుర్విత్యుక్త్యా పరస్పరం ॥
ద్వారిష్ఠితో వక్రశిరా శక్రః ప్రాహ మహేశ్వరం॥
శ్రీమన్నారాయణుని అనుజ్ఞనుపొంది దేవతలందరు నర్మదాతీరమునకు వెళ్ళగా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమునకు పోయెను. దేవతలచ్చట పర్వతముల నడుమనున్న స్థలమున భయముతో విషణ్ణవదనులైరి. ఆ భయమువల్లనే ఇంద్రుడు కుబేరుని, కుబేరుడు వరుణుని, వరుణుడు వాయువును, వాయువు యమధర్మరాజును, యముడు అగ్నిని, అగ్నిదేవుడు సూర్యుని, సూర్యుడు చంద్రుని, చంద్రుడు ఈశ్వరుని ఇట్లు దేవతలొకరినొకరు శంకరుని రతిభంగము చేయు మని ప్రేరేపించుచుండిరి.
చివరకు దేవేంద్రుడు పార్వతీపరమేశ్వరులున్న ఇంటిద్వారమువద్ద . ముఖము తిప్పుకొని శంకరునితో ఇట్లనెను.
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడిట్లు పలికెను-
కింకరోషిమహాదేవ యోగీశ్వర నమోఽస్తుతే ।
జగదీశ జగద్బీజ భక్తానాం భయభయంజన॥
హారీర్జగామేత్యుక్త్యా తమాజగామ చ భాస్కరః ।
ఉవాచ భీతో ద్వారస్థః భయాల్తో వక్రచక్షుషా॥
ఓమహాదేవ! నీవేమి చేయుచున్నావు? యోగీశ్వరుడవు, జగదీశుడవు, భక్తులభయములపోగొట్టునీకు నమస్కారము.
ఇంద్రుడిట్లు పలికిపోగానే సూర్యుడచ్చటకు వచ్చి తన తలతిప్పుకొని భయపడుచు ఇట్లనెను.
శ్రీసూర్య ఉవాచ – సూర్యభగవానుడిట్లనెను-
కిం కరోషి మహాదేవ జగతాం పరిపాలక ।
సురశ్రేష్ఠ మహాభాగ పార్వతీశ నమోస్తుతే ॥
ఇత్యేవముక్త్యా శ్రీసూర్య స జగామ భయాత్తతః ।
ఆజగామ తథా చంద్ర అవోచద్వక్ర కంధరః ॥
జగములనన్నిటిని పరిపాలించు ఓమహాదేవా! నీవు ఏమిచేయుచున్నావు. దేవతా శ్రేష్టుడవగు పార్వతీనాథా! నీకు నమస్కారము. అని సూర్యుడు పలికి భయముతో అక్కడినుండి వెళ్ళిపోయెను. అప్పుడాస్థలమునకు చంద్రుడువచ్చి తలప్రక్క కుదిప్పి ఇట్లనెను.
చంద్ర ఉవాచ - చంద్రుడిట్లు పలికెను-
కింకరోషి త్రిలోకేశ త్రిలోచన నమోస్తుతే।
ఆత్మారామస్వయంపూర్ణ పుణ్యశ్రవణకీర్తన ॥
ఇత్యేవముక్త్యాభీతశ్చ విరరామ నిశాపతిః ।
సమీరణోపి ద్వారస్థ స్సంవీక్ష్యోవాచ సాదరం ॥
ముల్లోకములకు ఈశ్వరుడవగు ముక్కంటీ! నీవేమిచేయుచున్నావు. స్వయంపూర్ణుడవు. ఆత్మారాముడవగు నమస్కరింతును అని చంద్రుడు భయముతో పలికి ఊరకుండగా వాయువచ్చటకు వచ్చి ఇట్లనెను.
పవన ఉవాచ - వాయుదేవు డిట్లు పలికెను-
కిం కరోషి జగన్నాథ జగద్ఛంధో నమోస్తుతే 1
ధర్మార్థకామమోక్షాణాం బీజరూపసనాతన ॥
ఇత్యేవం స్తవనం శ్రుత్వా యోగజ్ఞానవిశారదః ।
త్యక్తుకామో న తత్యాజ శృంగారం పార్వతీభయాత్ ॥
దృష్ట్యా సురాన్ భయార్తశ్చ పునః స్తోతుం సముద్యతాన్ ।
విజహౌ సుఖసంభోగం కంఠలగ్నాం చ పార్వతీం॥
ఉత్తిష్ఠతో మహేశస్య త్రాసలజ్జాయుతస్య చ ।
భూమౌ పపాత తర్వీర్యం తతః స్కందోబ భూవ హ ॥
లోకములకన్నిటికిని బంధువగు ఓజగన్నాథుడా! నీవిప్పుడేమి చేయుచున్నావు? ధర్మార్థకామమోక్షములనే చతుర్వర్గములకు కారణమైన ఓసనాతనుడా! నీకు నమస్కారము.
ఈవిధమైన దేవతలస్తోత్రమును విని యోగనము చక్కగా పెరిగిన పరమశివుడు పార్వతీదేవిని వదలి పెట్టినచో ఆమె ఏమనుకొనునో అని భయపడి రతికార్యమును వదిలి పెట్టలేదు. ఐనను దేవతలు తనను మరల స్తుతింపబోవుచున్న విషయము నెరిగి తననాలింగనము చేసికొన్న పార్వతీదేవిని వదలి సుఖసంభోగమును త్యజించెను.
ఆ సమయమున మహేశ్వరునకు వీర్యస్ఖలనమై అది భూమిపై పడినది. ఆ మహేశ్వరవీర్యమే కుమారస్వామిగా రూపుదాల్చినది.
పశ్చాత్తాం కథయిష్యామి కథామతీమనోహరాం।
స్కందజన్మప్రసంగే చ సాంప్రతం వాంఛితం శ్రుణు॥
నారదా! ఆతీమనోహరమైన తరువాతి కథను కుమారస్వామి జన్మవృత్తాంతమును వివరింపునప్పుడు నీకు చెప్పెదను. ప్రస్తుతము నీవు కోరుకున్న గణపతి వృత్తాంతమును నీవు వినుమని నారాయణు డనెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయే గణపతి ఖండే నారద నారాయణసంవాదే ప్రథమోధ్యాయః॥
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండములో నారద నారాయణుల సంవాదము కల మొదటి అధ్యాయము సమాప్తము.
Summary of chapter 1 of the Brahma Vaivarta Mahā Purana - Gaṇeśa Khaṇḍa is as follows:
Gathered in the holy forest of Naimishāraṇya, the venerable sages led by Maharshi Śaunaka humbly requested Śrī Sūta Gosvāmī to illuminate the transcendent mysteries of the third section of the Brahma Vaivarta Purāṇa. Śrī Sūta Gosvāmī offered his prostrate obeisances unto the Supreme Lord Śrī Kṛshṇa, Goddess Sarasvatī, Lord Śiva, and Maharshi Vyāsa before recalling the sacred dialogue between Maharshi Nārada and his divine father Lord Brahmā. Maharshi Nārada had earnestly inquired about the miraculous birth of Lord Gaṇeśa, the reason for his elephant head, his status as the first among all deities to be worshipped, and his legendary encounter with the martial incarnation Parashurāma. Beholding his son's intense spiritual thirst, Lord Brahmā joyfully prepared to recite the nectar-like pastimes of the elephant-headed Lord who destroys all obstacles and bestows spiritual liberation upon searching souls.