3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

7 - పార్వతీదేవి యొనర్చిన శ్రీకృష్ణ స్తోత్రము

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదునిలోనిట్లనెను-

 శంకరుడు శ్రీహరియొక్క ఆజ్ఞను గైకొనీ సంతోషముతో పార్వతిని పుణ్యకవ్రతము చేయమని చెప్పెను.

పార్వతీదేవి తనభర్తయగు పరమేశ్వరుని ఆజ్ఞను గైకొని మంగళకరమైన పుణ్యకవ్రతమును మంగళవాద్యములతో ప్రారంభించెను. ఆ దేవి చక్కగా స్నానముచేసి ఉతికిన వస్త్రములు ధరించి బియ్యముపైన రత్నకలశమును స్థాపించెను. ఆ రత్నకలశమున మామిడియాకులు, ఫలములు, అక్షతలు, చందనము, ఆగురు, కస్తూరీ, కుంకుమలను వేసి అలంకరించెను.

అటుపిమ్మట ఆ దేవి రత్నాసింహాసనముపై కూర్చుండి మునులను రత్నసింహాసనములపై కూర్చుండబెట్టి గౌరవించెను. అట్లే పురోహితుని రత్నసింహాసనముపై కూర్చుండబెట్టి వారికి చందనము, అగరు, కస్తూరి, కుంకుమలనిచ్చినది. రత్నభూషణభూషితులైన దిక్పాలకులను తనముందు అష్టదిక్కులలో కూర్చుండబెట్టి వారితోపాటు ఇతరదేవతలను, నరులను, నాగులను విధిపూర్వకముగా ఆర్చించినది. అటుపిమ్మట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను చందనము, ఆగరు, కస్తూరి, కుంకుమలతో, పరిశుద్ధమైన నూతనవస్త్రములతో, రత్నభూషణములతో అనేకవిధములైన పూజాద్రవ్యములచే భక్తిపూర్వకముగా అర్చనచేసి పుణ్యకవ్రతమును స్వస్తివాచనపూర్వకముగా ఆ దేవి ప్రారంభించినది.

పార్వతీదేవి తనముందు తండులముల సైనున్న మంగళకలశమున తనకు ఆభీష్టదేవతయగు శ్రీకృష్ణ పరమాత్మను ఆవాహనచేసి క్రమముగా షోడశోపచారములనన్నిటిని భక్తితో నొసగినది. అట్లే ఆ పుణ్యకవ్రతమున చేయదగు కార్యములను దానములను అన్నిటిని విడివిడిగా చేసినది. నియమపూర్వకముగా పుణ్యకవ్రతము చేయుచున్న ఆ. సతి పుణ్యకవ్రతమున చెప్పబడిన ఉపహారమునంతయు భక్తితో నొసగినది.

ఆ పుణ్యకవ్రతమున దానముచేయదగిన వాటినన్నిటిని వేదమంత్రపూర్వకముగా దానముచేసి లీలలు, నేయితో మూడులక్షల పర్యాయములు హోమము చేసినది. అటుపిమ్మట అతిథులనందరను గౌరవించి బ్రాహ్మణులకందరకు, భోజనము పెట్టెను.

ఇట్లు ప్రతిదినము విధిపూర్వకముగా భోజనము పెట్టుచు సంవత్సరము "గడిపినది. సంవత్సరకాలము పూర్ణమైన పిదప వ్రతసమాప్తిదినమున పురోహితుడా పార్వతితో నాకు పతీదక్షిణమిమ్మని కోరెను.

మహామాయయగు పార్వతి పురోహితుని మాటలు విని మాయవలన మోహముచెందిన మనస్సుగలదై ఎక్కువగా ఏడ్చి మూర్చపడిపోయెను. మూర్ఛవడియున్న పార్వతిని జూచి మునిపుంగవులు నవ్వుచుండగా అచ్చటమన్న సభాసదులు ప్రార్థింపగా బ్రహ్మవిష్ణువులు. పార్వతిని ఓదార్చుటకు శివుని పంపిరి. అప్పుడు మాటకారియగు శివుడు పార్వతిని ఓదార్చుటకై ఇట్లు మాట్లాడసాగెను.

శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడిట్లు పార్వతితోననెను-

ఓపర్వమంగళా! నీకు తప్పకశుభము చేకూరును. ఇప్పుడు, అవధానములో నామాట వినుమని ఎండిపోయిన వాలుకు గొంతుకల పార్వతిని తన ఎదపై నుంచుకొని హితమైనవి, సత్యమైనవి కీర్తిని కలిగించునవి సత్సలీతమునొసగునవీ ఆగు మాటలను ఇట్లు చెప్పసాగెను.

ఓదేవి! వేదమునందు పేర్కొనబడినది, అందరకు సమ్మతము, ఇష్టమైనది. ఆగు. నామాటను ధర్మపరిపాలకులు కల ఈసభలో వినుము.

దేవసంబంధము, పితృసంబంధమైనను, నిత్యమైనను, నైమిత్తకమైనను ధర్మకార్యములన్నిటిలో "దక్షిణ" తప్పక ఈయవలెను. దక్షిణ ఈయనిచో ఆ కర్మయంతయు నిష్ఫలమగును. పైగా దక్షిణ లేక ధర్మకార్యములు చేయువాడు చివరకు కాలసూత్రమను నరకమునకు పోవును.

ధర్మకార్యములనాచరింపుచున్న సమయమున దక్షిణ ఈయవలసిన సమయమున దానినీయనిచో శత్రుబాధలనంది దీను డగును. దక్షిణ ఈయవలసిన సమయము తప్పి ముహూర్తకాలము గడచినచో రెట్టింపు దక్షిణనీయవలెను. ఒక దినము దాటినచో ఈయవలసిన దక్షిణకంటే నాల్గురెట్లెక్కువ దక్షిణనీయవలెను. పక్షము గడచినచో నూరురెట్లెక్కువగా దక్షిణనొసగవలెను.

దక్షిణ ఈయవలసిన సమయము నెలదాటినచో ఐదువందల రెట్లెక్కువ దక్షిణనీయవలెను, ఆరుమాసములు దాటినచో ఇంకను నాలుగురెట్లెక్కువ దక్షిణనీయవలెను. సంవత్సరము దాటినచో చేసిన ధర్మకార్యమంతయు నిష్పలమై పోవును. ఆతడు చేసిన ధర్మమంతయు నశించిపోవును. చివరకళడు వేలసంవత్సరములు నరకముననుండి బాధలననుభవించును అని పలికెను.

శ్రీ విష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను.

ధర్మములన్ని తెలిసి ధర్మకార్యములవాచరించు ఓ పార్వతీ! నీవు ఈ ధర్మకార్యమున నీధర్మమును పరిపాలింపుము, స్వధర్మపరిపాలన చేసినచో ఇతరులకు కూడ రక్షణ జరుగును.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లు పలికెను-

మానవుడు ఏదేని ఒక కారణమువలన తాననుష్ఠింపవలసిన ధర్మమును రక్షింపనీచో ధర్మనాశనము జరిగినందువలన ఆ ధర్మకర్మను అనుష్ఠించువాడుకూడ చెడిపోవును.

ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను-

ఓ సాధ్వీమణి! ఈవ్రతమున ఈయవలసిన పతీ దక్షణనిచ్చి ధర్మరూపుడనగు నన్ను రక్షింపుము. నేను చక్కగానున్నప్పుడు మాత్రమే సమస్తశుభములు జరుగును.

దేవా ఊచుః – దేవతలీట్లనిరి-

ఓ మహాసాధ్వి ధర్మమును చక్కగా పరిపాలించి నీవు చేయుచున్న పుణ్యకవ్రతమును పూర్తిచేయుము, నీవు వ్రతమును సక్రమముగా పూర్తిచేసినచో మేమందరము నీ కోరికను తీర్చెదము.

మునయ ఊచుః – మునులిట్లనిరి-

ఓపతివ్రతాశిరోమణి! ఈపుణ్యకవ్రతమున నీవు పూర్ణహోమమును చేసి బ్రాహ్మణునకు పతిదక్షిణనీమ్ము. మేమందరముండగా నీకెట్టి చెడు జరుగదు.

సనత్కుమార ఉవాచ-సనత్కుమారు డిట్లనెను-

ఓ పార్వతీదేవి! పాకు వుని పతిదక్షిణగానిమ్ము లేనిచో నీవుచేసిన కర్మయొక్క ఫలితమునైవము వదలి పెట్టుము. అట్లే నీవు చాలాకాలమునుండి తపస్సు చేసి పంపాదించిన ఫలితమును కూడ వదిలిపెట్టుము.

ఈ పుణ్యకవ్రతమున దక్షిణనీయవీచో ఈయాగఫలితమును యజమానియొక్క పమస్తమైన సుకృతమున నేను కొందును.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! ఈపుణ్యవతమున భర్తన దక్షిణగా ఈయవలసిపి ఈవ్రతమెందులకు? ఈపుత్రుడెందుకు? అధర్మమెందుకు వీటివలన వారు ప్రయోజనమేమి లేదు. ఆ భూమిని పూజింపక, వృత్తమును పూజించినచో ఫలితమేమి కారణములేనిచో కార్యముండదుగదా.

భర్త పతివ్రతలకు అనేక పుత్రులతో సమానమైనవాడు, ఆ భర్తన ఈవ్రతమువ దానము చేసినచో ఈవ్రతము ఈ వ్రతఫలమైన పుత్రులుపును ప్రయోజనముండదుకదా. పుత్రుడు. భర్తకు చెందినవాడు. భర్శమూలమైనవాడు. వర్తకములో అసలుకే మోసము కలిగిన ఆ వాణిజ్య వ్యర్థమైపోవునుకదా. అందువలన నాభర్తలేని ఈవ్రతము వ్యర్థమైనదని పార్వతి పలికెను.

శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువు ఇట్లనెను-

ఓపార్వతీదేవికి భర్త పుత్రునికంటే గొప్పవాడే అట్లే ధర్మము భర్తకంటే ప్రమైనది. అట్టి ధర్మము నశించినచో భర్త పుత్రులున్నమ ప్రయోజనమేముండుపనేను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లనెను-

ఓ దేవీ! భర్తకంటే ధర్మము గొప్పది. ధర్మమువకంటే సత్యము పరమమైనది. సత్యపంకల్పితమైన కర్మ ఇంకను భ్రష్టము కాలేదు. కావున వ్రతమున నీవు ఆచరింపుము . ఆనీ పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

సమస్తవేదములు తెలిపిన బ్రహ్మదేవుడా! వేదములందు "స్వ" శబ్దమునకు ధనమను అర్థముకలదు. ఆ ధనము ఎవరివద్ద నుండునో అతనిని ప్వామియని పిలుతురు. ఆధవముమ దానము చేయువానిని స్వామీయని యందురు. కాని ధవ మెప్పుడు స్వామి: కాజాలదు. అట్లే పరమశివుని ధనమగు నేను అతనిని ఎట్లు దానమిత్తును? ఇది చాలా విపరీతమైనదని పలికమ.

ధర్మఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను-

భార్యతప్ప ఇతరులెవ్వరు భర్తదానము చేయలేరు. ఎందుకంటే దంపతులిద్దరు ఏకాంగరూపులు, ఒకరినొకరు దానము చేయుటలో ఇద్దరకు సమానమైన ఆధికారము కలదనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికమ-

వేదవేదాంగములన్నియు తెలిపిన ధర్మాదిదేవతలారా! వేదములందు తండ్రి తన కూతురుమ అల్లుపకు దానము  చేయునట్లు, అల్లుడు ఆమెను స్వీకరించునట్లు కలదు కాని మీరన్నట్లు భర్త భార్యను, భార్య భర్తను దానము చేయుచున్నట్లు ఎక్కడ కనిపించదు. మీమాట. వేదవిరుద్ధముగా నున్నదనెమ.

దేవా ఊచుః – దేవతలిట్లనిరి-

వేదమర్మములన్ని తెలిపిన ఓ దుర్గాదేవి నీవు బుద్ధిపరూపురాలను అనుగ్రహము వలన మేమందరము బుద్ధిమంతులమైతిమి. అందువలన వీతో వేదవిషయముల గురించి చర్చించుటకు పూకు పామరము లేదు. కాని వేదములందు పుణ్యకవ్రతమున భర్తమ దక్షిణగా ఈయవలెననీ చెప్పబడినది. పేదదితమైపదే ధర్మము. తద్విరుద్ధమైనది అధర్మమే యగునవి అనిరి.

పార్వత్యువాచ -పార్వతీదేవీ ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! వేదమున మాత్రమమపరించి ధర్మనిర్ణయము చేయుట సరియైన పద్ధతకాదు. లౌకికమైన ఆచారము వేదముకంటే బలమైనది కావున రావిపవ్వరు కొదవలేరు. వేదములలో సైతము ప్రకృతికంటే పురుషుడు చాలా గొప్పవాడని చెప్పబడినది. అందువలన ప్రకృతిరూపిణియగు శ్రీ తవ పురుషుని ఎట్లు దానముచేయగలదు? మీరందరు మిక్కిలి జ్ఞానవంతులు. నేనో బాలను. మీకు నేనేమి చెప్పగలననెను.

బృహస్పతిరువాచ -బృహస్పతి ఇట్లు చెప్పను-

అట్లే ఓ పతివ్రతాకి, పురుషుడు లేకుండ సృష్టి ఎట్లు జరుగదో ప్రకృతిస్వరూపిణియగు ప్రీ లేకుండ. సృష్టి జరుగదు. శ్రీకృష్ణపరమాత్మ సృష్టికార్యమునకై ప్రకృతి పురుషులనిద్దరను సృష్టించెను. కావున ప్రకృతి పురుషులిద్దరు సమానులేయని యనెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

ఆసమయమున ఆసభలోనున్న దేవతలు మునులు ఆకాశమున రత్ననిర్మితమైన ఆద్బుత రథమును చూచిరి. ఆ రథము చుట్టు వనమాల, రత్నభూషణములచే అలంకరించబడినవారు నాలుభుజములు నల్లనివర్ణముకల అనుచరులుండిరి. ఆ రథమునుండి చతుర్భుజుడు, శంఖచక్ర గదాపద్మముల ధరించినవాడు, వైకుంఠలోకవాసి, లక్ష్మీసరస్వతులకు ప్రియుడు, శాంతుడు, అందమైనవాడు, భక్తులకు తేలికగా కన్నించువాడు భక్తులు నివారికి కోటిజన్మలకైనను దర్శనమొసగనివాడు, కోటిమన్మథుల లావణ్యము కలవాడు,అందమైన రత్నభూషణములచే అలంకృతుడు, ఆగునారాయణుడు బ్రహ్మాదిదేవతలు, మహర్పులు సేవించుచుండగా క్రిందకు దిగి ఆ సభాస్థలికి వచ్చాను, రత్నసింహాసనమున సుఖోపవిష్టుడైన ఆ నారాయణుని బ్రహ్మశక్తి శివాదిదేవతలు నమస్కరించి చేతులు జోడించుకొని పులకితగాత్రులై కన్నీరు కార్చుచు ఆశ్చర్యమున తేలియాడుచుండగా ఆ శ్రీమన్నారాయణుడు వారీ యోగక్షేమములను విచారించి ఇట్లు పలికెను.

శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు పలికెను-

ఓ దేవతలారా! మీరందరు బుద్ధిమంతులు. మీకు చెప్పుట దగనిదైనను చెప్పుచున్నాను.

ఈ ప్రపంచముననున్న జీవులందరు. దుర్గాదేవివలవనే శక్తి కలిగియున్నారు. ఈ ప్రపంచమున బ్రహ్మ మొదలుకొని గడ్డిపరకవరకు సమస్తము ప్రాకృతికము. నేనుమాత్రము దీనికి అతీతుడను. అట్టి నేను శక్తిస్వరూపిణియగు ఈదేవిని సృష్ట్యారంభకాలమున నాశరీరమునుండి సృష్టించితిని. ఈదేవి పృష్ట సంహారము జరిగినప్పుడు శేషునిలో ఆంతర్జానము చెందును. ఈ దేవి ప్రకృతి స్వరూపిణి. సృష్టికి ప్రధాసహేతువు కాపువ సమస్త చరాచర సృష్టికోటికి జననిగా పేరుపడసినది. ఈ మాయ నాతో సమానమైనది కావున ఈమెను . నారాయణియని కూడ పిలుతురు.

శంకరుడు నన్పుగురించి తీవ్రమైన తపస్సు చేయుటవలన అతని తపస్సునకు ఫతీతముగా ఈదేవినతని కొసగితిని.

ఈపార్వతీదేవి తాను స్వయముగా సమస్తవ్రతములు, తపస్సులయొక్క ఫలితములనిచ్చును. ప్రస్తుతము ఆదేవి దీనిని జనులందరు వ్రతమును చేయవలనను సంకల్పముతోనే చేయుచున్నదిగాని తనకేదో ప్రయోజనమున్నది అని ఈ వ్రతము చేయుటలేదు. మీరందరు ఆదేవియొక్క మాయవలన మోహము చెందినారుకాని ఆమె వాస్తవముగా వ్రతము చేయనవసరములేదు. ఈ వ్రతఫలము ప్రతికల్పమున ఆదేవికి లభించును.

బ్రహ్మ, శక్తి, శివుడు, ఇంద్రుడు మొదలగు దేవటాధిపతులు నాయొక్క ఆంశవలన పుట్టినవారు. ఇతరదేవతలు, ప్రాణులు నాయొక్క అంశాంశములవలన జన్మించినారు.

కుమ్మరివాడు మట్టిలేక కుండలెట్లు చేయజాలడో, కంసాలివాడు బంగారములేక కుండలములెట్లు చేయలేడో, అట్లే నేనుకూడ శక్తిస్వరూపిణియగు ఈదేవిలేక సృష్టిని చేయజాలను. సృష్టికార్యమున ఈశక్తియే ప్రధానకారణము. నేను నిర్లిపుడనై, సమస్తజీవులకు ఆత్మరూపుడనై, సాక్షిగా ఉందును.

ప్రకృతికి సంబంధించిన ఈ పాంచభౌతికదేహములన్నియు నశించిపోవునవే అని అనెను.

అట్లే సూర్యునివంటి శరీరకాంతిగల నేను నిల్యుడను. ఈబిగములందన్నిటిలో నేను సమస్త ప్రాణులకు ఆత్మభూతుడను, ప్రకృతిస్వరూపిణియగు ఈదే సమస్త ప్రాణులకు ఆధారభూతమైనది. సమస్తజీవులకు నేను ఆత్మను. బ్రహ్మదేవుడు మనోరూపుడు. మహేశ్వరుడు జ్ఞానరూపుడు. మేధ, నీద్ర మొదలగునవన్నీయు ప్రకృతియొక్క ఆంశలు. ఆ ప్రకృతియే ఈ పార్వతీదేవియని వేదములలో చెప్పబడిది. వైకుంఠలోకాధీపతియగు నేను గోపగోపీపరిపృతుడునైన శ్రీకృష్ణుడు. గోలోకమున నేను ద్విభుజూడ గోలోకముననుండును. వైకుంఠమున చతుర్భుజుడనై లక్ష్మీపతినై నా అనుచరగణముతో కలసియుందును.

ఈవైకుంఠలోకమునకు ఏబదికోట్ల యోజనములపైన గోలోకము కలదు. అచ్చట నేను గోపికాపతినై రెండుభుజములతో, వ్రతములచే ఆరాధింపబడుచు వాటి ఫలితములనోవగుచుందును.

జీవులు వన్నేరూపమున స్మరించిన వారికి ఆధూపములో ఫలితము నొసగుదును, అని నారాయణుడను.

ఓపార్వతీ! శివుని దక్షిణగావోసగి తీవ్రతము పూర్తిచేసికొనుము. తరువాత అతనికి తగిన మూల్యమును చెల్లించి వీభర్తను. తిరిగి తీసికొనుము.

గోవులు విష్ణుమూర్తికి దేహములు. ఆట్లే శిపుడుకూడ విష్ణుమూర్తి దేహమే కావున గోమూల్యమును బ్రాహ్మణునకు చెల్లించి నీభర్తను స్వీకరింపుము.

యజమాని యజ్ఞకర్మయందు యజ్ఞవల్ని నేవిధముగా దానమిచ్చునో అట్లే యజ్ఞపత్నిసైతము అతనిని దానమివ్వవచ్చునని వేదములయందు చెప్పబడినది.

ఇట్లు శ్రీమన్నారాయణుడు ఆసభాస్థలియందు దేవతలమధ్య పార్వతీదేవికి తెలిపి అంతర్ధానము చెందగా దేవతలందరు. పంతోషపడిరి. పార్వతీదేవికూడ ఆతనమాటలవలన సంతృప్తిచెంది భరదానము చేయుటకు సన్నద్దమాయెను.

ఆప్పుడు పార్వతీదేవి తాను చేసిన వ్రతమున పూర్ణహోమము చేసి బ్రహ్మదేవుని పుత్రుడగు ననత్కుమారునకు తన భర్తయగు శివుని దక్షిణగా నొసగెను. అటుపిమ్మట దుర్గాదేవి ఎండిన గొంతుకతో, పెదపులతో హృదయము క్షోభచేందుచుండగా చేతులు జోడించుకొని సనత్కుమారునితో ఇట్లనెను.

పార్వత్యువాచ -పార్వతీదేవి ఇట్లు పలికెను-

సాభర్త యగు శివునితో ఆపు సమానమైనధవి వేదములందు చెప్పబడినది కావున మీకు-లక్ష ఆవులనిచ్చెదను. నాభర్తను తిరిగి నాకిమ్ము. అటుపిమ్మట బ్రాహ్మణులకు వివిధములైన దానములు చేయుదును. పారెహమిప్పుడు ఆత్మలేకుండనున్నది. అందువలన నేనేమి చేయలేకపోవుచున్నాను కావున గోమూల్యమును తీసికొని నాభర్తను తిరిగి ఇమ్మని పార్వతిదేవి సనత్కుమారుని ప్రార్థించినది.

సనత్కుమార ఉవాచ - సనత్కుమారు డిట్లనెను-

ఓ పార్వతీదేవి! నీవు అమూల్యమైన రత్నమును దానమిచ్చితివి. దానికి బదులుగా వీవు లక్షగోవులిచ్చివను ప్రయోజనమేమున్నది?

ఈలోకములన్నిటిలోను అందరు తనయొక్క ఇచ్చనమసరించి దావాదికార్యములు చేయుదురు. కర్త తన ఇచ్చసమసరించి కర్మచేయుమ కవి ఇతరుల అభీష్టమువనపరించి దానాది కార్యములు చేయడు. అందువలన స్వీకరించిన దానమును నాఇష్టము వచ్చినట్లు చేయుటకు పాకధికారమున్నది. కావున శివువీ దిగంబరునీగా. చేసి బాలురు, బాలికలు నవ్వుచుండగా ముల్లోకములు తిప్పదను అని పలికెను.

సనత్కుమారుడిట్లు పలుకుచు శంకరుని చేతితో పట్టుకొని ఆదేవశాసభలో కూర్చొనబెట్టెను.

ఆసమయమున ఆయువ ఒక గొప్పని వెలుగు కనిపించింది. ఆ తేజస్సు కోటిసూర్యులకాంతకంటే మిన్నయై అన్నీ దిక్కులలో ప్రకాశించుచుండెను. కైలాసపర్వతముముందు కనిపించిన ఆ తేజస్సు వెంట సమస్త దేవతలుండిరి. సమస్త గణములుండినవి. మండలాకారమువనున్న ఆ తేజస్సును పార్వతీదేవి మొదలుగాగల సమస్త దేవతలు చూచి క్రమముగా ఆతనినిట్లు స్తుతించిరి.

విష్ణురువాచ - విష్ణుమూర్తి ఇట్లు పలికెను.

ఈబ్రహ్మాండములన్నియు మహావిరాట్వరూపుని రోమకూపములందు అణగియున్నవి. అట్టి మహావిరాట్పురుషుడు పరమాత్మవగు నీయొక్క పదుపారవ అంశము కదా. అందువలన పర్వాతీతుడవై పరగుచున్నావని అనెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

ఓమహానుభావl వేదములందు పేర్కొనబడినవానిని, ప్రత్యక్షముగానున్నదానిని నేను స్తుతింపగలను. అట్లే చూడగలను. కాని వేదములకంటెను పరుడైన ఆపరమాత్మను నేనెట్లు స్తుతింపగలనని బ్రహ్మదేవుడు పలికెను.

శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవు డిట్లు పలికెను-

ఓపరమేశ్వరా! నీవు సర్వజ్ఞానముల కతీతుడవు. నిన్ను ఎవ్వరును నిర్వచించి చెప్పలేరు. నీవు స్వేచ్చామయుడవు. అట్టి నిన్ను జ్ఞానధిష్టాన దేవతయగు నేను స్తుతింపబొలను. అందువలన ఇతరులు నిన్నే విధముగా స్తుతింపగలుగుదురు?

ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లనెను-

నీవు అదృశ్యుడవైనను అవతారపమయమున నిన్ను సమస్త ప్రాణులు దర్శింపగలుగుదురు. నీవు భక్తులననుగ్రహించుటకై రూపమును ధరించి అందరకు దర్శనమొసగుచున్నావు. అట్టి తేజస్వరూపుడవైన నిన్ను ఎట్లు నేను స్తుతింపగలను.

దేవా ఊచుః - దేవతలు ఇట్లు పలికిరి-

ఓపరమాత్మా! మేమందరము నీయొక్క ఆంశాంశ స్వరూపులము. అట్టి మేము నిన్నెట్లు స్తుతింపగలము. అట్లే వేదములుకాని సరస్వతీదేవిగాని నీ సమస్తగుణములను ప్రతింపసమర్థులు కారని పల్కెను.

మునయ ఊచుః -మునులిట్లు పలికిరి-

మేమందరము వేదములనన్నిటిని చదివి విద్వాంసులమైతిమి కానీ వేదములకు మూలపురుషుడవు, వాక్కు మనస్సులకు ఆతీతముగనున్న నిన్ను మేముకాని చదువులతల్లియగు పరస్వతిగాని స్తుతిచేయసమర్థులముకొమని పలికిరి.

సరస్వత్యువాచ - సరస్వతీదేవి ఇట్లు పలికెను-

వేదవేదార్థపారంగతులైన మహర్పులు వాక్కులకు ఆధిష్టాపదేవతవని నన్ను స్తుతింతురు, కానీ వాక్కుకు మనస్సునకు అతీతుడవగు నిన్ను నేను కాని మహర్షులు కాని సుతింపజాలమని పలికెను.

సావిత్ర్యువాచ - సావిత్రీదేవి ఇట్లు పలికెను-

లక్ష్మీరువాచలక్ష్మీదేవి ఇట్లు పలికినది-జగములనన్నిటిని పోషించుటకు కారణభూతురాలను ఆంశ వలన జన్మించిన శ్రీమహావిష్ణువుయొక్క భార్యనగు నేనుకూడ నీ అనంతగుణగణములను స్తుతింపలేకపోవుచున్నాను అని పలికెను.

హిమాలయ ఉవాచ -హిమాలయ మిట్లనెను-

ఓ పరమేశ్వరా! నీ కల్యాణగుణగణమును వర్ణించుటకు ప్రయత్నించు నన్ను చూచి త్పురుషులు ఇతడు చలనములేని వాడనని చెప్పుచు, అవహేళన చేయుదురు. అట్టి నీచుడనగు నేను నిన్ను స్తుతింపజాలను అని అనెను.

ఈవిధముగా దేవతలందరు ఆ పరమపురుషుని స్తోత్రము చేసిరి. అప్పుడు తెల్లని వస్త్రములను జడలను వ్రతకారణముగా ధరించిన పార్వతి పరమశివునిచే ప్రేరేపింపబడి ఆపరమాత్మను స్తుతింపమొదలిడినది. అప్పుడు పార్వతీ మండుచున్న అగ్నిశిఖవలెనుండినది. సమస్తకర్మల, తపస్సుల ఫలమునొసగు ఆ సతి సమస్త జగత్తునకు మాతృస్వరూపిణి. ఆమె ఇట్లు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

ఓశ్రీకృష్ణా! నీకు నాగురించి తెలియును కానీ నేను నీగురించి ఏమియు నెరుగను. వేదజ్ఞాలైనను, వేదములైనను, వేదకారకులైన వారు సహితము నిన్ను ఎరుగలేరు. నీయొక్క అంశలైన బ్రహ్మాదిదేవతలకే నీ తత్త్వము తెలియనిచో ఆంశాంశరూపలైన మాబోటివారికి నీతత్త్వమెట్లు తెలియును. అట్లే ఈతత్త్వము నీకే తెలియును కాని ఇతరులకెవ్వరికిని తెలియరాదు.

ఓపరమాత్మా! నీవే ప్రపంచమవు, ప్రపంచకరణమవు. విశ్వరూపుడవు, సనాతనుడవు. సూక్ష్మములకెల్ల పరమసూక్ష్మమైన ఆవ్యక్తుడవు. అట్లే స్టూలములకెల్ల అతిస్థూలమైన మహత్స్వరూపుడవు, నీవే కార్యమవు, కారణరూపుడవు, కారణములకెల్ల కారణస్వరూపుడవు, తేజస్వరూపుడవు, భగవంతుడు, నిరాకారరూపుడవు, నిరాశ్రయుడవు, నిర్లీపుడవు, నీరుణుడపు, సాక్షీభూతుడవు. పరాత్పరుడు, స్వాత్మారాముడు, ప్రకృతీశుడు, విరాట్కరణుడు, వీరాడ్రూపుడు అన్ని నీ రూపములే, అట్లే సగుణరూపము. నీదే. సృష్టికొరకు నీ ఆంశాంశతో ప్రాకృతికుడవగుచున్నావు.. నీవే ప్రకృతిని, పురుషుడవు. వేదములు, జీవము, కర్మ, కర్మకారణము, కర్మల ఫలితమునిచ్చువాడు. అన్నియు నీవే. యోగులు నీ తేజఃస్వరూపమునెల్లప్పుడు ధ్యానింతురు. కొందరు విష్ణుభక్తులు నీరూపము సాకారమని నాలుగు భుజములలో శంఖ చక్ర గదా పద్మాయుధములు ధరించుచు పీతాంబరుడవై లక్ష్మీపతీగా ఉన్నట్లు ధ్యానింతురు. మరికొందరు ద్విభుజములతో శ్యామసుందరవిగ్రహముతో కిశోర రూపియైన నిన్ను ధ్యానింతురు. వారు నిన్ను శాంతమూర్తిగా గోపాంగనాకోంతుడుగా రత్నాలంకార సుశోభితుడవుగా భావింతురు. ఈవిధముగా భక్తులు ఎల్లప్పుడు తేజోరూపమైన నిన్ను సేవించుచుందురు. యోగులు ఎల్లప్పుడు తేజఃస్వరూపమైన నీరూపును తప్ప ఇతరమైన దానిని ధ్యానింపరు.

ఓ దేవా! నీతేజస్సును ధరించు దేవతలయొక్క తేజస్సుతో బ్రహ్మదేవుడు నుతింపగా దుర్మార్గులైన రాక్షసుల సంహరించుటకు ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినది.

తేజోరూపమైన ఆమూర్తి నాదే. నేను అందమైన శరీరమును ధరించి వచ్చితివి. నీయొక్క మాయవలన ఆవిర్భవించిన మాయాస్వరూపియగు నేను నా మాయవలన రాక్షసులనందరను మోహింపజేసి వారలను సంహరించి హిమాలయపర్వతమును చేరీతిని, ఆతరువాత దక్షునిభార్యయందు జన్మించి శివుని భర్తగా పొంది ఆతడు దక్షయజ్ఞములో చేసిన శివనిందను సహించుకోలేక ఆచ్చటనే ప్రాణత్యాగము చేసితివి.

ఆతరువాత హిమవత్పర్వతము చేసిన తపఃఫలితముగా ఆతవికి కూతురనై జన్మించితిని. అట్లే అత్యధికమైన తపస్సు చేసి ఈజన్మలో కూడ శివువి భర్తగా పొందగలిగితివి, కొవి దేవతలయొక్క మాయవలన నా భర్భతేజోరూపమైన పుత్రునీ మాత్రము పొందలేకపోతివి. అందువలన పుత్రదుఃఖము వల్ల బోధలనందుచున్న నేను ఈవ్రతమువలన నీవంటి పుత్రుని పొందగలనని అనుకొని వేదమున పేర్కొనబడినట్లు నాభర్తను దక్షిణగా సమర్పించుకొంటివి.

ఓ దయామయుడా! దీనురాలనగు నా విషయమునంతయు వీవి నాపై దయజూపుమనీ పార్వతి శ్రీకృష్ణునితో ఆనేను.

పార్వతీదేవి చేసిన ఈస్తోత్రమును నియమనిష్ఠలతో విన్నవాడు విష్ణువుతో సమాను డగు మంచిపుత్రుని పొందును. అట్లే ఈస్తోత్రమును పఠించుచు లేక వినుచు, భక్తితో శ్రీహరినర్చించుచు సంవత్సరపర్యంతము భగవన్నివేదితాన్నమును భక్షించువీకి సుపుణ్యకవ్రతము చేసిన ఫలము లభించును.

ఓనారదా! శ్రీకృష్ణస్తోత్రము సమస్తసంపత్తులను కలిగించును. సుఖమును మోక్షమును కలిగించును. భర్తసౌభాగ్యమును పెంపొందించును, కీర్తిని పెంచుము. శ్రీహరిభక్తిని కలిగించును. తత్త్వజ్ఞాపమును, బుద్ధిని పరమసౌఖ్యమును ఇచ్చునని నారాయణమహర్షి నారదునితో ననెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదైన గణపతిఖండములో నారద నారాయణసంవాదసమయమున చెప్పబడిన పుణ్యకవ్రతములో తన పతీని దానము చేయు సందర్భమున పార్వతీదేవి చేసిన శ్రీకృష్ణస్తోత్రమనే ఏడవ అధ్యాయము సమాప్తము.