33 - దేవహూతి జ్ఞానమును మోక్షమును పొందుట

మైత్రేయ ఉవాచ

ఏవం నీశమ్య కపిలస్య వచో జనిత్రీ

సా కర్దమస్య దయితా కిల దేవహూతిః

విస్రస్తమోహపటలా తమభిప్రణమ్య

తుష్టావ తత్త్వవిషయాంకితసిద్ధభూమిమ్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కపిలుని తల్లి, కర్దముని ధర్మపత్నియగు ఆ దేవహూతి ఈ విధముగా కపిల భగవానుని బోధను వినినంతనే బుద్ధిని కప్పియుంచిన మోహము అనే ఆవరణము తొలగిపో యెను. ప్రకృతి, పురుషుడు మొదలగు తత్త్వములను బోధించే జ్ఞానము గల సిద్ధులలో కపిలుడు అగ్రేసరుడు. ఆమె అట్టి కపిల భగవానునకు నమ స్కరించి ఇట్లు స్తుతించెను.

దేవహూతిరువాచ

అథాప్యజోऽoతస్సలిలే శయానం

భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే

గుణప్రవాహం సదశేషబీజం

దధ్యౌ స్వయం యజ్జఠరాబ్దజాతః

దేవహూతి ఇట్లు పలికెను --- ఓ కపిలా! నీవు. ప్రళయజలము లలో శయనించియుండగా నీ ఉదరమునందలి పద్మమునుండి బ్రహ్మ ! జన్మించెను. పంచభూతములు ఇంద్రియములు వాటికి విషయములగు " శబ్దాదులు జీవులు అందరు నీ రూపమునందే ఇమిడియున్నారు. సత్వరజ స్తమోగుణముల ప్రవాహరూపమగు ఈ సకలజగత్తునకు సత్స్వరూపమగు నీ సగుణరూపమే బీజమగుచున్నది. ఆ బ్రహ్మ పుట్టిన వెంటనే స్వయముగా నీ రూపమును ధ్యానించెను.

స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్తవీర్యః సర్గాద్యనీహోऽవితథాభిసంధిరాత్మేశ్వరోऽతర్క్యసహస్రశక్తి

నీవు అకర్తవు, సత్యసంకల్పుడవు, జీవులకు ప్రభుడవు. నీ అనంత ములగు శక్తులు ఊహకు అందవు. అట్టి నీవే నీ శక్తిని సత్త్వరజస్తమోగుణ ముల ప్రవాహముచే విభాగము చేసి, ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుచున్నావు.

స త్వం భృతో మే జఠరేణ నాథ

కథం ను యస్యోదర ఏతదాసీత్

విశ్వం యుగాంతే వటపత్ర ఏకః

శేతే స్మ మాయాశిశురంఘ్రిపానః

ఓ ప్రభూ! నీ ఉదరములో ఈ విశ్వము ధరించబడుచున్నది. కల్పాంతమునందు నీవు మాయాబాలకుడవై మర్రి ఆకునందు పరుండి కాలి బొటనవేలును నోట ఉంచుకొనెదవు. అట్టి నీవు నా జఠరములో ఎట్లు ధరించబడితివో గదా!

త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం

నిదేశభాజాం చ విభో విభూతయే

యథావతారాస్తవ సూకరాదయః

తథాయమప్యాత్మపథోపలబ్ధయే

ఓ ప్రభూ! నీవు పాపులను నశింపజేసి, నీ ఆజ్ఞను పాటించే భక్తు లను ఉద్దరించుటకొరకై అవతారములను దాల్చేదవు. నీ వరాహావతారము మొదలగు అవతారములు ఏ విధముగా లోకకల్యాణమును చేకూర్చినవో, అదే విధముగా ఈ అవతారము కూడ ఆత్మజ్ఞానము అనే మార్గమును ముముక్షువులకు అందజేయుట కొరకు ఉద్దేశించబడినది.

యన్నామధ్యశ్రవణానుకీర్తనాత్

యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్

శ్వాదోऽపి సద్యస్సవనాయ కల్పతే

కుతః పునస్తే భగవన్ను దర్శనాత్

ఓ భగవానుడా! పరమకిరాతకుడగు మానవుడు కూడ ఎప్పుడై ననూ నీ నామమును కీర్తించి, విని, నీకు నమస్కరించి, నిన్ను స్మరించి నచో, సోమయాజివలె ఆదరించదగ్గవాడు అగుచున్నాడు. అట్టిచో, నిన్ను దర్శించు వ్యక్తి కృతకృత్యుడగునని వేరుగా చెప్పవలయునా? .

అహో బత శ్వపచోऽతో గరీయాన్

యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్

తేపుస్తపస్తే జుహువుస్సస్నురార్యా

బ్రహ్మానూచుర్నామ గృణంతి యే తే

 ఆశ్చర్యము! నిన్ను కోరి నాలుక చివర నీ నామము గల వ్యక్తి పర మకిరాతకుడే అయిననూ, ఈ నామమహిమచే శ్రేష్ఠుడే యగును. నీ నామ మును కీర్తించువారు తపస్సులను, హోమములను, తీర్థస్నానములను, వేదముల అధ్యయనములను చేసినవారితో సమానము. వారే పూజించదగినవారు.

తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం

ప్రత్యక్ స్రోతస్యాత్మని సంవిభావ్యమ్

 స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం

వందే విష్ణుం కపిలం వేదగర్భమ్

పరబ్రహ్మ, పురుషోత్తముడు, శ్రీమహావిష్ణువుయొక్క అవతారము అగు కపిలభగవానుని నేను నమస్కరించుచున్నాను. బుద్ధిని విషయభోగ ములనుండి వెనుకకు మరల్చి ఆయనను ధ్యానించినచో, స్వరూపమును ప్రకాశింపజేసి ఆయన సత్త్వరజస్తమోగుణముల ప్రవాహరూపమగు సంసా రమును నశింపజేయును. ఆయన వేదములకు మూలపురుషుడు.

మైత్రేయ ఉవాచ

ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్

వాచా విక్లబయేత్యాహ మాతరం మాతృవత్సలః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పురుషోత్తముడగు కపిల భగ వానుడు తల్లియందు వాత్సల్యము గలవాడు. ఆమె ఇట్లు స్తుతించగా, ఆయన గద్గదమైన వాక్కుతో ఆమెతో నిట్లనెను.

కపిల ఉవాచ

మార్గేణానేన మాతస్తే సుసేవ్యోనోదితేన మే

ఆస్థితేన పరాం కాష్ఠమచిరాదవరోత్స్యసి

కపిల భగవానుడిట్లు పలికెను --- అమ్మా! నేను బోధించిన ఈ మార్గము తేలికగా అనుష్ఠించదగినది. దానిని నీవు అనుష్ఠించి తొందరలోనే పరమఫలమగు మోక్షమును పొందగలవు.

శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః

యేన మామభవం యాయా మృత్యుమృచ్ఛంత్యతద్విదః

నీవు నా ఈ బోధయందు శ్రద్దను చూపుము. దీనిని బ్రహ్మవేత్తలు ప్రీతితో సేవించినారు. దీనివలన నీవు సంసారనివర్తకుడనగు నన్ను పొందే దవు. ఈ జ్ఞానము లేనివారలు మృత్యుగ్రస్తమగు సంసారమునే పొందెదరు.

మైత్రేయ ఉవాచ

ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిమ్

స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోఽనుమతో యయౌ

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కపిల భగవానుడు ఈ విధ ముగా అట్టి ఆత్మజ్ఞానమును బోధించగా, ఆయన తల్లి బ్రహ్మవేత్త ఆయే ను. అపుడామె అనుమతిని పొంది ఆయన వెళ్లిపోయెను.

సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్

తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్వత్యాస్సమాహితా

ఆ దేవహూతి కూడ తన పుత్రునిచే బోధించబడిన యోగసాధ నను అభ్యసిస్తూ ఆ ఆశ్రమమునందే సమాధియందు ఉండెను. ఆ ఆశ్రమము సరస్వతీనదికి తలలో ముడిచిన దండవలె ప్రకాశించేను.

అభీక్ ష్ణావగాహకపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్

ఆత్మానం చోగ్రతపసా బిభ్రతీ చీరిణం కృశమ్

ఆమె నిత్యము మూడు పూటలా స్నానమును చేయుటచే అంద మైన గిరజాల జుట్టు బూడిద రంగును పొంది జడలు గట్టినది. ఆమె ఉగ్ర మైన తపస్సును చేయుటచే శరీరము చిక్కిపోయినది. ఆమె నారబట్టలను ధరించియున్నది.

ప్రజాపతేః కర్దమస్య తపోయోగవిజృంభితమ్

స్వగార్హస్థ్యమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి

ఆమె గార్హస్థ్యమును కర్దమ ప్రజాపతియొక్క తపస్సు యోగశక్తి చాల గొప్పదిగా తీర్చిదిద్దినవి. ఆమె దాంపత్యమునకు సాటి లేదు. అట్టి దాంపత్యమును దేవతలు కూడ కోరుకుందురు.

పయఃఫేననిభా శయ్యా దాంతా రుక్మపరిచ్చదాః

ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ

ఆమె గృహమునందు పాల నురుగును పోలిన శయ్యలు, దంత ముతో మరియు బంగారముతో చేసిన పరికరములు, బంగరు ఆసనములు మరియు మెత్తని స్పర్శగల కంబళ్లు ఉండెను.

స్వచ్చస్పటికకుడ్యేషు మహామరకతేషు చ

రత్నప్రదీపా ఆధాంతి లలనారత్నసంయుతాః

వారి ప్రాసాదములో స్వచ్చమగు స్పటికములతో నిర్మించిన గోడలయందు గొప్ప పచ్చలు పొదగబడెను. వాటియందు రత్ననిర్మితము లైన స్త్రీమూర్తులతో బాటు రత్నదీపములు ప్రకాశించుచుండును.

గృహోద్యానం కుసుమితై రమ్యం బహ్వమరద్రుమైః

కూజద్విహంగమిథునం గాయన్మత్తమధువ్రతమ్

ఆమె గృహమునకు ఆనుకొనియున్న ఉద్యానవనము పుష్పించిన అనేకములగు దేవలోకమునకు చెందిన వృక్షములతో, పక్షుల జంటల కూతలతో, మదించిన తుమ్మెదల ఝంకారగానముతో ప్రకాశించెను.

యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరా జగుః

వాప్యాముత్పలగంధిన్యాం కర్దమేనోపలాలితమ్

ఆ ఉద్యానవనమునందు కలువల పరిమళముతో కూడిన సరస్సు గలదు, ఆమె దానిలో ప్రవేశించగా కర్దమ మహర్షి ఆమెను అచట లాలించె డివాడు. అట్టి ఆమె సౌభాగ్యమును గంధర్వులు కొనియాడెడివారు.

హిత్వా తదీప్సితతమమప్యాఖండలయోషితామ్

కించిచ్చకార వదనం పుత్రవిశ్లేషణాతురా

ఆమె గార్హస్థ్యముయొక్క సౌభాగ్యము ఇంద్రుని స్త్రీలకు కూడ మిక్కిలి అభీష్టము అగును. ఆమె అట్టి గార్హస్థ్యమునందు అభిమానమును విడిచి పెట్టెను. కాని, ఆమె హృదయము పుత్రుని వియోగముచే వ్యాకులమై యుండుటచే, ముఖము ఉదాసీనముగా నుండెను.

వనం ప్రవ్రజితే పత్యావపత్యవిరహాతురా

జ్ఞాతతత్త్వాऽప్యభూన్నష్టే వత్సే గౌరవ వత్సలా

భర్త సన్న్యసించి అడవికి వెళ్లాను. అట్టి స్థితిలో దేవహూతికి పుత్రుడు దూరమయ్యెను. ఆమె ఆత్మజ్ఞానియే అయిననూ, 'ఆ వియోగ ముచే, దూడను కోల్పోయి దాని కొరకు కలవరపడే ప్రేమమూర్తియగు ఆవువలె, దుఃఖించెను.

తమేవ ధ్యాయతీ దేవమపత్యం కపిలం హరిమ్

బభూవాచిరతో వత్స నిస్స్పృహా తాదృశే గృహే

కుమారా విదురా! శ్రీహరి తన పుత్రుడగు కపిలదేవుడై అవతరిం చెను. ఆమె ఆయననే ధ్యానిస్తూ తొందరలోనే అట్టి ఆ గృహమునందలి ఆసక్తిని విడిచి పెట్టెను.

ధ్యాయతీ భగవద్రూపం యదాహ ధ్యానగోచరమ్

సుతః ప్రసన్నవదనం సమస్తవ్యప్తచింతయా

దేవహూతికి ఆమె పుత్రుడగు కపిలుడు ప్రసన్నమగు ముఖము గల భగవానుని ధ్యానయోగ్యమగు రూపమును ఉపదేశించియుండెను. ఆమె ఆ రూపమును మనస్సులో సమగ్రముగా మరియు వేర్వేరు అవయ వములను కూడ ధ్యానించుచుండెను.

భక్తిప్రవాహయోగేన వైరాగ్యేణ బలీయసా

యుక్తానుష్ఠానజాతేన జ్ఞానేన బ్రహ్మ హేతునా

విశుద్ధేన తదాऽऽత్మానమాత్మనా విశ్వతోముఖమ్

స్వానుభూత్యా తిరోభూతమాయాగుణవిశేషణమ్

ఆమె దృఢమగు వైరాగ్యముతో నిరంతరమగు భక్తియోగమును నేర పెను. ఆమె యోగ్యమగు పూజ మొదలగు ఎన్నో కర్మలను చేయుచుం డెను. బ్రహ్మసాక్షాత్కారకారణమగు జ్ఞానము ఆమెకు కలిగెను. అపుడామే పరిశుద్దమగు అంతఃకరణముతో సర్వవ్యాపకమగు ఆత్మతత్త్వమును ధ్యానించేను. ఆత్మ తన స్వరూపమును ప్రకాశింపజేయుట ద్వారా మాయాశక్తి యొక్క సత్త్వరజస్తమోగుణముల కార్యమగు దేహేంద్రియాది ఉపాధియొక్క బంధమును దూరము చేయును.

బ్రహ్మణ్యవస్థితమతిర్భగవత్యాత్మసంశ్రయే

నివృత్తజీవాపత్తిత్వాత్ క్షీణ క్లేశాऽऽప్తనిర్వృతిః

జీవులకు అధిష్టానము, భగవానుడు అగు పరబ్రహ్మయందే దేవ హూతి బుద్ధి స్థిరముగా నిలిచెను. ఆమెయందు జీవభావము తొలగుటచే దుఃఖము క్షీణించి, ఆమె పరమానందమును పొందెను.

నిత్యారూఢసమాధిత్వాత్పరావృత్తగుణభ్రమా

న సస్మార తదాऽऽత్మానం స్వప్నే దృష్టమివోత్థితః

ఆమే నిరంతరమగు సమాధి స్థితియందు ఆరూఢయై ఉండెడిది. సత్త్వరజస్తమోగుణముల వలన కలిగే దేహాత్మభ్రాంతి ఆమెకు తొలగిపోయే ను. మానవుడు తాను కలలో చూచిన తన దేహమును నిద్ర లేచిన తరు వాత విస్మరించును. అదే తీరున ఆమె దేహమును కూడ విస్మరించెను.

తద్దేహః పరతఃపోషోऽప్యకృశశ్చాధ్యసంభవాత్

బభౌ మలైరవచ్చిన్నస్సధూమ ఇవ పావకః

ఆమెను విద్యాధరస్త్రీలు పోషించుచుండిరి. అయిననూ, ఆమెకు జ్ఞానమహిమచే మనోవ్యథ సంభవము కాదు. కావుననే, ఆమె చిక్కిపోలే దు. మాలిన్యములచే కప్పబడిన ఆమె దేహము పొగతో కూడిన అగ్నివలెనుండేను.

స్వాంగం తపోయోగమయం ముక్తకేశం గతాంబరమ్

దైవగుప్తం న బుబుధే వాసుదేవప్రవిష్టధీః

దేవహూతి మనస్సు వాసుదేవునియందు లగ్నమై యుండుటచే, ఆమెకు తన దేహమునందు ధ్యాస లేకుండెను. తపస్సుతో మరియు యోగాభ్యాసముతో నిండిపోయిన ఆమె దేహము చెల్లాచెదరైన జుట్టుతో అడ్డదిడ్డముగానున్న వస్త్రముతో కేవలము ప్రారబ్ధకర్మచే మాత్రమే రక్షింప బడుచుండెను.

ఏవం సా కపిలోక్తేన మార్గేణాచిరతః పరమ్

ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాప హ

ఈ విధముగా ఆమె కపిల భగవానుడు బోధించిన మార్గముననుస రించి, తొందరలోనే ఆత్మస్వరూపము, దుఃఖసంపర్కము లేనిది, మోక్షరూ పము అగు పరబ్రహ్మయే స్వరూపముగా గల శ్రీహరి భగవానునిలో ఐక్యమయ్యెను.

తద్వీరాసీత్పుణ్యతమం క్షేత్రం త్రైలోక్యవిశ్రుతమ్

నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధము పేయుషీ

ఓ విదురా! ఆమె సిద్ధిని పొందిన ఆ అతిపవిత్రమగు క్షేత్రము ముల్లోకములలో సిద్ధపదము అను పేరుతో ప్రఖ్యాతిని గాంచెను.

తస్యాస్తద్యోగవిధుతమార్త్యం మర్త్యమభూత్సరిత్

స్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధ సేవితా

సౌమ్యమగు స్వభావము గల ఓ విదురా! యోగశక్తిచే తొలగించబ డిన మాలిన్యములు గల ఆమె ఆ దేహము నదియై పారెను. నదులలో శ్రేష్ఠమగు ఆ నది సిద్ధిని కలిగించును. దానిని సిద్ధపురుషులు సేవించెదరు

కపిలోऽపి మహాయోగీ భగవాన్ పితురాశ్రమాత్

మాతరం సమనుజ్ఞాప్య ప్రాగుదీచీం దిశం యయౌ

మహాయోగియగు కపిల భగవానుడు కూడ తల్లిని ఒప్పించి, తన తండ్రి ఆశ్రమమునుండి ఈశాన్యదిక్కు వైపునకు వెళ్లాను.

సిద్ధచారణగంధర్వైరునిభిశ్చాప్సరోగణైః

స్తూయమానస్సముద్రేణ దత్తార్హణనికేతనః

సిద్దులు, చారణులు, గంధర్వులు, మునులు, అప్సరసల గణ ములు స్తుతించుచుండగా, సముద్రుడు కపిల భగవానునకు అర్ఘ్యమునిచ్చి మకామునకు స్థానమునిచ్చెను.

ఆస్తే యోగం సమాస్థాయ సాంఖ్యాచార్యైరభిష్టుతః

త్రయాణామపి లోకానాముపశాంత్యై సమాహితః

సాంఖ్యాచార్యులచే స్తుతించబడే కపిల భగవానుడు ముల్లోకముల శాంతి కొరకై యోగమార్గమునవలంబించి సమాధిస్థుడై యున్నాడు.

ఏతన్నిగదితం తాత యత్పృష్టోऽహం తవానఘ

కపిలస్య చ సంవాదో దేవహూత్యాశ్చ పావనః

వత్సా! విదురా! నీవు పుణ్యాత్ముడవు. నీవు అడిగిన మన్వంతరాది కమును, పవిత్రమగు కపిల దేవహూతి సంవాదమును కూడ నేను నీకు చెప్పితిని.

య ఇదమనుశృణోతి యోఽభిధత్తే

కపిలమునేర్మతమాత్మయోగగుహ్యమ్

భగవతి కృతధీస్సుపర్ణకేతా

వుపలభతే భగవత్పదారవిందమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే

త్రయస్త్రింశోऽధ్యాయః

ఇతి తృతీయః స్కంధః సమాప్తః

కపిల మహర్షియొక్క ఈ అధ్యాత్మయోగ బోధ రహస్యమైనది. దీనిని చెప్పువాడు, చెప్పుచుండగా వినువాడు కూడ గరుడధ్వజుడగు శ్రీహరి భగవానునిపై లగ్న మైన బుద్ధి గలవాడై, భగవానుని పాదపద్మము లను పొందును.

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు

ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).

మూడవ స్కంధము ముగిసినది.

హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు