భాగవత మహా పురాణము
32 - జీవుడు పొందే ఉత్తమగతి - భక్తియోగ మహిమ
కపిల ఉవాచ ।
అథ యో గృహమేధీయాన్ ధర్మానేవావసన్ గృహే ।
కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయః పిపర్తి తాన్ ॥
స చాపి భగవద్ధర్మాత్కామమూఢః పరాఙ్ముఖః ।
యజతే క్రతుభిర్దేవాన్ పీతౄంశ్చ శ్రద్ధయాన్వితః ॥
శ్రీ కపిల, భగవానుడిట్లు పలికెను --- ఒకడు ఇంటియందు ఉంటూ గృహాశ్రమధర్మములను పాటిస్తూ వాటి ఫలరూపములగు అర్థకామ ములను అనుభవించును. మరల ఆ ధర్మములనే అనుష్ఠించుచుండును. ఈ విధముగా ఆతడు కామనలచే మోహమును పొందినవాడై భాగవత ధర్మమునుండి విముఖుడై క్రతువులచే దేవతలను, పితృదేవతలను శ్రద్ధ వంతుడై ఆరాధించును.
తచ్ఛ్రద్దయాక్రాంతమతి: పితృదేవవ్రతః పుమాన్ ।
గత్వా చాంద్రమసం లోకం సోమపాః పునరేష్యతి ॥
పితృదేవతలను, దేవతలను ఆరాధించుటయే ఆత్మ ) వ్రతము ఆతని బుద్ది వారియందలి శ్రద్దతో నిండియుండును. ఆతడు మరణించిన , తరువాత చంద్రలోకమును పొంది అమృతపానమును. చేసి, పుణ్యము క్షీణించిన తరువాత మరల భూలోకములో జన్మించగలడు.
యదా చాహీంద్రశయ్యాయాం శేతేऽనంతాసనో హరిః ।
తదా లోకా లయం యాంతి త ఏతే గృహమేధినామ్ ॥
కల్పాంతమునందు శేషశాయియగు శ్రీహరి శేషశయ్యపై నిద్రిఁ చును. అపుడు గృహస్థులు సంపాదించిన ఈ లోకములు వినష్టమగును.
యే స్వధర్మాన్న దుహ్యంతి ధీరాః కామార్థహేతవే ।
నిస్సంగా న్యస్తకర్మాణః ప్రశాంతాశ్శుద్ధచేతసః ॥
నివృత్తిధర్మనిరతా నిర్మమా నిరహంకృతాః ।
స్వధర్మాఖ్యేన సత్త్వేన పరిశుద్ధేన చేతసా ॥
సూర్యద్వారేణ తే యాంతి పురుషం విశ్వతోముఖమ్ ।
పరావరేశం ప్రకృతిమస్యోత్పత్త్యంతభావనమ్ ॥
కొందరు భక్తులు తాము చేసిన ధర్మములను అర్థకామములనే ఫలరూపములో అనుభవించుటకు ఇచ్చగించరు. వారు సంసారమునందు ఆసక్తి లేనివారై, ప్రసన్నము పవిత్రము అగు అంతఃకరణముతో సర్వకర్మస న్న్యాసపూర్వకజ్ఞాననిష్ఠయందు ఉందురు. అహంకార మమకారములు లేని అట్టివారికి సన్న్యాసధర్మమునందు ప్రీతి మెండు. వారు స్వధర్మాను స్థానము అనే సత్త్వగుణముచే పరిశుద్దము చేయబడిన అంతఃకరణము గల వారు. వారు సూర్యమార్గముగుండా 'సర్వవ్యాపకుడగు శ్రీహరిని పొందెద రు. కారణకార్యరూపమగు ఈ జగత్తునకు ప్రభువగు ఆ పూర్ణపురుషుడే ఈ జగత్తునకు ఉపాదానకారణము మాత్రమే గాక, దీని ఉత్పత్తిప్రళయములను సంకల్పించే నిమిత్తకారణము కూడ అగుచున్నాడు.
ద్విపదారార్ధావసానే యః ప్రలయో బ్రహ్మణస్తు తే ।
తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకాః ॥
బ్రహ్మగారి ఆయుర్దాయము రెండు పరార్ధములు, అనగా బ్రహ్మ మానములో రెండు ఏభైలు అనగా వంద సంవత్సరములు. ఆ తరువాత బ్రహ్మ (హితణ్యగర్భుడు) భగవానునిలో విలీనమగును. అంతవరకు ఆ పుణ్యాత్ములు హిరణ్యగర్భుని లోకము (సత్యలోకము) లో ఆయననే ఉపా సిస్తూ నివసించెదరు.
క్ష్మాంభోऽనలానిలవియన్మనఇంద్రియార్థ
భూతాదిభిః పరివృతం ప్రతిసంజీహీర్షుః ।
అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మా
కాలం పరాఖ్యమనుభూయ పరస్స్వయంభూః ॥
దేవదేవుడు, స్వయంభువుడు అగు హిరణ్యగర్భుడు రెండు పరా ర్గముల కాలము తన అధికారముననుభవించును. తరువాత సత్త్వరజస్త మోగుణాత్మకమగు బ్రహ్మాండమునకు అభిమానియగు ఆ హిరణ్యగర్బు డు, భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు ఇంద్రియములు శబ్దాది విషయములు, సకలభూతములకు ఆదియగు అహంకారము అను వాటితో నిండియున్న బ్రహ్మాండమును ఉపసంహరించగోరువాడై, నిర్గుణని రాకార పరమేశ్వరునిలో విలీనమగును.
ఏవం పరేత్య భగవంతమనుప్రవిష్టా
యే యోగినో జితమరున్మనసో విరాగాః ।
తేనైవ సాకమమృతం పురుషం పురాణం
బ్రహ్మ ప్రధానముపయాంత్యగతాభిమానాః ॥
ఈ విధముగా, ప్రాణమును మనస్సును జయించి వైరాగ్యసంప న్ను లై యున్న యోగులు కూడ దేహమును విడిచి పెట్టి ఆ హిరణ్యగర్బుని తోటే పరమానందస్వరూపమగు పరబ్రహ్మయందు విలీనమగుదురు. అంతవరకు వారిలో 'అభిమానము శేషమై ఉండుటచే, వారు అనాది, పూర్ణ ము, సర్వాతిశాయియగు పరబ్రహ్మచైతన్యమునందు విలీనము కాలేదు.
అథ తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయమ్ ।
శ్రుతానుభావం శరణం వ్రజ భావేన భామిని ॥
అమ్మా! సకలప్రాణుల హృదయపద్మములలో నివసించే ఆ శ్రీహ రియొక్క మహిమను నీవు నానుండి వినియున్నావు. కావున, నీవు భక్తితో ఆయనను శరణు పొందుము.
ఆద్యః స్థిరచరాణాం యో వేదగర్బస్సహర్షిభిః ।
యోగేశ్వ రైః కుమారాద్యైస్సిద్దైర్యోగప్రవర్త కైః ॥
భేదదృష్ట్యభిమానేన నిస్సంగేనాపి కర్మణా ।
కర్తృత్వాత్సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభమ్ ॥
స సంసృత్య పునః కాలే కాలేనేశ్వరమూర్తినా ।
జాతే గుణవ్యతికరే యథాపూర్వం ప్రజాయతే ॥
స్థావరజంగమప్రాణులకు కారణుడు, వేదనిధియగు బ్రహ్మగారు మరీచి మొదలగు మహర్షులతో, యోగేశ్వరులతో, సనత్కుమారుడు మొద లగు జ్ఞానులతో, యోగమును లోకములో ప్రవర్తిల్లజేసిన సిద్ధపురుషులతో కూడి నిష్కామకర్మ ద్వారా ఆదిపురుషుడు, పురుషశ్రేష్ఠుడు అగు సగుణబ్ర హ్మ (నారాయణుడు) లో విలీనమైనాడు. కాని, ఆయనలో ఇంకనూ భేద దృష్టి, దేహాభిమానము, కర్తృత్వము మిగిలియుండెను. కావున, మరల సృష్టికాలము రాగానే కాలస్వరూపుడగు ఈశ్వరునిచే ప్రేరేపించబడి సత్త్వ రజస్తమోగుణాత్మకమగు ప్రకృతిలో వైషమ్యము రాగానే, ఆయన పూర్వక ల్పమునందు వలెనే, జగద్రూపముగా ప్రకటమగును.
ఐశ్వర్యం పారమేష్ఠ్యం చ తేఽపి ధర్మవినిర్మితమ్ ।
నిషేవ్య పునరాయాంతి గుణవ్యతికరే సతి ॥
ధర్మమును చేసి దాని ప్రభావముచే బ్రహ్మలోకమును పొందిన పుణ్యాత్ములు కూడ అచట పరమేష్టియొక్క ఐశ్వర్యముననుభవించి, ప్రకృ తిలో గుణవైషమ్యము కలిగి సృష్టి రాగానే మరల తిరిగి జన్మించెదరు.
యే త్విహాసక్తమనసః కర్మసు శ్రద్ధయాన్వితాః ।
కుర్వంత్యప్రతిషిద్ధాని నిత్యాన్యపి చ కృత్స్నశః ॥
ఈ సంసారమునందు తగుల్కొన్న మనస్సు గల కర్మఠులు వేద ముచే నిషిద్ధమైన కర్మలను విడిచి పెట్టి, నిత్యకర్మలను మాత్రమే గాక, కామ్యకర్మలను కూడ శ్రద్ధతో చేయుదురు.
రజసా కుంఠమనసః కామాత్మానోకజితేంద్రియాః ।
పితౄన్ యజంత్యనుదినం గృహేష్వభిరతాశయాః ॥
రజోగుణముచే విక్షిప్తమైన మనస్సు గల జనులు కామన్పరిపూర్తీ యందు మాత్రమే లగ్నమై యుందురు. వారికి, ఇంద్రియజయము ఉండదు. వారికి గృహవ్యవహారములయందు మాత్రమే ప్రీతి కలుగును. అట్టివారు ప్రతిదినము పితృదేవతలను ఆరాధించెదరు.
త్రైవర్ధితాస్తే పురుషా విముఖా హరిమేధసః ।
కధాయాం కథనీయోరువిక్రమస్య మధుద్విషః ॥
మధుసూదనుడగు శ్రీహరిని బుద్దియందు స్మరించినచో సంసా రము తొలగిపోవును. ఆయన పరాక్రమములు గొప్పవి, కీర్తించదగినవి. కాని, ధర్మార్థకామములకు మాత్రమే కట్టుబడిన వ్యక్తులకు ఆయన గాథల యందు అభిరుచి ఉండదు.
నూనం దైవేన విహతా యే చాచ్యుతకథాసుధామ్ ।
హిత్వా శృణ్వంత్యసద్గాథాః పురీషమివ విడ్భుజః ॥
శ్రీహరి గాథలనే అమృతమును విడిచి, సూకరములు మాలిన్య మును భక్షించునట్లు, చెడు కథలను వినువారు నిశ్చయముగా తమ ప్రారబ్ద ముచే తామే వినాశము చేయబడుచున్నారు.
దక్షిణేన పథార్యమ్ణః పితృలోకం వ్రజంతి తే ।
ప్రజామను ప్రజాయంతే శ్మశానాంతక్రియాకృతః ॥
గర్భాధానము మొదలుకొని వ్యక్తి మరణించిన తరువాత శ్మశాన ములో చేసే అంత్యేష్టివరకు గల కర్మలను వారు చేయుదురు. అట్టివారు దక్షిణమార్గముచే అర్యమునిచే పాలించబడే పితృలోకమును పొందెదరు పుణ్యము క్షయమైన తరువాత తమ సంతానమునకే మరల సంతానమై జన్మించెదరు.
తతస్తే క్షీణసుకృతాః పునర్లోకమిమం సతి ।
పతంతి వివశా దేవైస్సద్యో విభ్రంశితోదయాః ॥
ఓ పతివ్రతా! వారు 'ఆ పితృలోకములో భోగములననుభవించు చుండగా వారి పుణ్యము క్షీణించును. వెంటనే దేవతలు భోగములను తొల గించి, వారిని ఆ లోకమునుండి ఈ లోకమునకు త్రోసివేసెదరు. వార ప్పుడు అస్వతంత్రులై మరల ఈ లోకములో జన్మించెదరు.
తస్మాత్త్వం సర్వభావేన భజస్వ పరమేష్టినమ్ ।
తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయపదాంబుజమ్ ॥
కావున, నీవు పూర్ణప్రేమతో మనోవాక్కాయములతో, పరమేశ్వ రుని వాత్సల్యము మొదలగు గుణములనే ఆశ్రయించే భక్తితో ఆయనను ఆరాధించుము. ఆయన పాదపద్మములు తప్పక ఆరాధించదగినవి.
వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః ।
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మదర్శనమ్ ॥
సర్వాంతర్యామియగు శ్రీకృష్ణభగవానునియందు భక్తిని చేసినచో, దాని వలన వైరాగ్యము మరియు బ్రహ్మసాక్షాత్కారమును కలిగించే - జ్ఞానము శీఘ్రముగా లభించును.
యదాస్య చిత్తమర్ధేషు సమేష్వింద్రియవృత్తిభిః ।
న విగృహ్ణాతి వైషమ్యం ప్రియమప్రియమిత్యుత ॥
స తదైవాత్మనాऽऽత్మానం నిస్సంగం సమదర్శనమ్ ।
హేయోపాదేయరహితమారూఢం పదమీక్షతే ॥
ఏ కాలమునందైతే భక్తుని చిత్తము తాను ఇంద్రియవ్యాపారముల ద్వారా గ్రహించే శబ్దాది విషయములను సర్వమును ఈశ్వరరూపముగను, కావున ప్రియము అప్రియము అనే వైషమ్యము లేనిదిగను దర్శించునో, అప్పుడా భక్తుడు ఆత్మయొక్క యథార్థస్వరూపమును దర్శించును. ఆత్మ నిస్సంగము. జ్ఞానరూపమగు ఆత్మ సర్వమునందు సమానరూపముగా నున్నది. ఆత్మయందు పరిత్యజించదగిన దోషములు గాని, స్వీకరించద గిన గుణములు గాని లేవు. ఈ దర్శనముచే ఆ భక్తుడు తన స్వరూపమగు ప్రత్యగభిన్నబ్రహ్మతో ఏకీభావమును పొందును.
జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్ ।
దృశ్యాదిభిః పృథగ్ఛా వైర్భగవానేక ఈయతే ॥
జ్ఞానమాత్రమ్ - జ్ఞానఘనుడు, పరమ్ - ప్రకృతికి అతీతుడు, బ్రహ్మ - నిరతిశయ బృహత్తత్త్వము, పరమ-ఆత్మా - జీవుని అంతరతమ నుగు ఆత్మస్వరూపము, ఈశ్వరః - సర్వమును శాసించువాడు, పుమాన్ - పురుషుడు, ఏకః - అద్వితీయుడు అగు, భగవాన్ - భగవానుడు, దృశ్య ఆదిభిః - దృశ్యము మొదలగు, పృథక్-భావైః - వివిధరూపములుగా, ఈయతే - తెలియబడును.
జ్ఞానఘనము, తనయందు భాసించే సర్వమునకు అతీతము, నిర తిశయ బృహత్, భగవచ్చబ్దవాచ్యము అగు అద్వితీయ వస్తువు జీవుని యందు ప్రత్యక్ (అంతరతమమగు) ఆత్మరూపముగా, జగత్తును శాసించే ఈశ్వరునిగా, ప్రకృతిని ఆవేశించే పురుషునిగా శాస్త్రములలో ప్రతిపాదించ బడుచున్నది. ఆ వస్తువే దృశ్యజగత్తుగా, దర్శించే జీవునిగా, దర్శించుటకు సహకరించే ఇంద్రియములుగా భాసించుచున్నది.
ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః ।
యుజ్యతేऽభిమతో హ్యర్థో యదసంగస్తు కృత్స్నశః ॥
సాధనానిష్ఠుడగు వ్యక్తి సమగ్రమగు. యోగసాధనచే పొందే పూర్ణ ఫలమేమనగా, ఈ సంసారమునందు సుతరాము ఆసక్తి లేకుండుటయే.
జ్ఞానమేకం పరాచీనైరింద్రియైర్బ్రహ్మ నిర్గుణమ్ ।
అవభాత్యర్థరూ పేణ భాండ్యా శబ్దాదిధర్మిణా ॥
ఉన్న వస్తువు విజ్ఞానఘనమగు అద్వితీయ నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే. కాని, నామరూపాత్మకమగు బాహ్యవిషయములయందు ఆసక్తి గల ఇంద్రియములు భ్రాంతిచే శబ్దము మొదలగు ధర్మములతో కూడిన వేర్వేరు రూపములను దర్శించుచున్నవి.
యథా మహానహంరూపస్త్రీవృత్పంచవిధస్స్వరాట్ ।
ఏకాదశవిధస్తస్య వపురండం జగద్యతః ॥
స్వయంప్రకాశస్వరూపమగు ఆ పరబ్రహ్మయే మహత్తత్త్వము, సాత్త్విక రాజస తామస అహంకారములు, పంచభూతములు, అయిదు కర్మేంద్రియములు అయిదు జ్ఞానేంద్రియములు మనస్సు వెరసి పద కొండుగా ప్రకటమైనది. వీటితో కూడి ఆ పరబ్రహ్మయే వ్యష్టి జీవుడు అగు చున్నది. ఈ జగత్తుతో గూడి ఆ పరబ్రహ్మయే సమష్టి హిరణ్యగర్భుడగు చున్నది. ఏలయనగా, వ్యష్టి జీవుడు, సమష్టి పురుషుడు, ఈ బ్రహ్మాం డము కూడ ఆ పరబ్రహ్మనుండియే ఆవిర్భవించినవి.
ఏతద్వై శ్రద్దయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః ।
సమాహితాత్మా నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి ॥
భక్తుడు వైరాగ్యముచే సంసారమునందలి ఆసక్తిని విడిచి పెట్టి, నిత్యము యోగమునభ్యసించుటచే ఏకాగ్రమగు అంతఃకరణము గలవాడై ఈ జగత్తును నిశ్చయముగా బ్రహ్మరూపముగా దర్శించును.
ఇత్యేతత్కథితం గుర్వి జ్ఞానం తద్బ్రహ్మదర్శనమ్ ।
యేనానుబద్ధ్యతే తత్త్వం ప్రకృతేః పురుషస్య చ ॥
అమ్మా! ఈ విధముగా నేను నీకు బ్రహ్మసాక్షాత్కారసాధనమగు జ్ఞానమును బోధించితిని. దీని వలన భక్తునకు ప్రకృతిపురుషుల తత్త్వము తెలియును.
జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో నైర్గుణ్యో భక్తిలక్షణః ।
ద్వయోరప్యేక ఏవార్ధో భగవచ్ఛబ్దలక్షణః ॥
జ్ఞానయోగమునకు విషయము నిర్గుణ పరబ్రహ్మ. భక్తియోగము కూడ నాయందే నిష్ఠ గల యోగము. ఈ రెండింటికీ ఫలము ఒక్కటియే. ఆ ఫలమునే భగవానుడు అనే పదము బోధించును. అనగా, భగవత్ప్రా ప్తియే రెండింటికీ ఫలము.
యథేంద్రియైః పృథగ్ద్వారైరర్ధో బహుగుణాశ్రయః ।
ఏకో నానేయతే తద్వద్భగవాన్ శాస్త్రవర్త్మభిః ॥
పదార్థము ఒక్కటే అయినా, అది రూపము రసము మొదలగు అనేకగుణములకు ఆశ్రయమగుచున్నది. ఇంద్రియముల ప్రవృత్తి మార్గ ములు కూడ వేర్వేరుగా నున్నవి. కావుననే, ఒకే పదార్థమును కన్ను తెల్ల నిది అని, జిహ్వ తియ్యనిది అని ఈ విధముగా ఇంద్రియములు వేర్వేరుగా తెలియుచున్నవి. అదే విధముగా వివిధములగు శాస్త్రమార్గములు ఒకే భగ వానుని పలు విధములుగా దర్శించుచున్నవి.
క్రియయా క్రతుభిర్దానైస్తపస్స్వాధ్యాయమర్శనైః ।
ఆత్మేంద్రీయజయేనాపి సన్న్యాసేన చ కర్మణామ్ ॥
యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవ హి ।
ధర్మేణోభయచిహ్నేన యః ప్రవృత్తినివృత్తిమాన్ ॥
ఆత్మతత్త్వావబోధేన వైరాగ్యేణ దృఢన చ ।
ఈయతే భగవానేభిస్సగుణో నిర్గుణస్స్వదృక్ ॥
పూజ మొదలగు కర్మలు, క్రతువులు, దానములు, తపస ), వేదా ధ్యయనము, వేదతాత్పర్యవిచారము, మనస్సును ఇంద్రిం" ములను జయించుట, సర్వకర్మసన్న్యాసము, ఎనిమిది అంగముల కూడిన యోగము, భక్తియోగము, ప్రవృత్తి (వేదోక్తకర్మానుష్ఠానను)) నివృత్తి (స న్న్యాసము) అనే రెండు రూపములలోనున్న సమ నిష్కామ ధర్మము, నిత్యానిత్యవస్తువివేకము, దృఢమగు వైరాగ్యము, అనే ఈ సాధనముల న్నియు భగవానుని పొందుటయందు సహకరించును. స్వయంప్రకాశస్వ రూపుడగు ఆ భగవానుడు సకలకల్యాణగుణసంపన్నుడే అయిననూ, స్వరూపముచే నిర్గుణుడు.
ప్రావోచం భక్తియోగస్య స్వరూపం తే చతుర్విధమ్ ।
కాలస్య చావ్యక్తగతేర్యోऽoతర్ధావతి జంతుషు ॥
నీకు నాలుగు విధముల (మూడు సగుణ, ఒక నిర్గుణ) భక్తియోగ మును, కాలముయొక్క స్వరూపమును చెప్పినాను. కాలముయొక్క చేష్ట లను తెలియుట సంభవము కాదు. అది ప్రాణుల లోపలనుండి జన్మ మొద లగు వికారములను కలిగించుచున్నది.
జీవస్య సంసృతీర్బహ్వీరవిద్యాకర్మనిర్మితాః ।
యాస్వంగ ప్రవిశన్నాత్మా న వేద గతిమాత్మనః ॥
అమ్మా! అజ్ఞానము, దాని వలన కలిగే కర్మలు జీవునకు అనేకగ తులను కల్పించుచుండును. జీవుడు వాటిని పొందుచూ తన స్వరూప మును తెలియలేకున్నాడు. ఆ వివరములను కూడ నేను నీకు చెప్పితిని.
నైతత్ఖలాయోపదిశేన్నావినీతాయ కర్హిచిత్ ।
న స్తబ్దాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ ॥
ఈ జ్ఞానమును ఏ కాలములోనైననూ దుష్టునకు, వినయము లేని వానికి, తలబిరుసువానికి, దురాచారికి, , అశాస్త్రీయమగు వాదమును చేయువానికి ఉపదేశించరాదు. దాంభికునకు అసలే ఉపదేశించరాదు.
న లోలుపాయోపదిశేన్న గృహారూఢచేతసే ।
నాభక్తాయ చ మే జాతు న మద్బక్తద్విషామపి ॥
ఇంద్రియభోగములయందాసక్తి గలవానికి, ఇంటి సుఖముల యందు లగ్న మైన మనస్సు గలవానికి, నా భక్తుడు కాని వానికి ఈ జ్ఞాన మునుపదేశించరాదు. నా భక్తులను ద్వేషించువారికి దీనిని ఏ కాలమునం దైననూ ఉపదేశించరాదు.
శ్రద్దధానాయ భక్తాయ వినీతాయనసూయవే ।
భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ ॥
బహిర్జాతవిరాగాయ శాంతచిత్తాయ దియతామ్ ।
నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియ॥
శ్రద్ద, భక్తి, వినయము కలిగి ఇతరుల గుణమునందు దోషబుద్దిలేని వానికి ఈ జ్ఞానమును బోధించవలెను. ప్రాణులయందు ప్రేమభావము, గురు సేవయందు అభిరుచి, బాహ్యవిషయములయందు వైరాగ్యము, ప్రస న్నమగు చిత్తము గలవానికి దీనిని బోధించవలెను. మాత్సర్యము (ఇతరుల క్షేమమును చూచి సహించలేకపోవుట) లేనివానికి, ఆంతరబాహ్యశౌచము గలవానికి దీనిని బోధించవలెను. ఎవనికైతే నేను ప్రియమైన వస్తువులన్నిం టికంటే అధికముగా ప్రియమైనవాడనో, వానికి బోధించవలెను.
య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుషస్సకృత్ ।
యో వాభిధత్తే మచ్చిత్తస్స హ్యేతి పదవీం చ మే ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే
ద్వాత్రింశోऽవిధ్యాయః ॥
అమ్మా! ఎవడైతే నాయందు లగ్న మైన మనస్సు గలవాడై దీనిని శ్రద్ధతో ఒక్కసారైననూ వినునో, లేదా చెప్పునో, వాడు నిశ్చయముగా నా పరమపదము (మోక్షము) ను పొందును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో
ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).
Summary of chapter 32 of the Bhāgavata Mahā Purana is as follows:
Lord Kapila contrasts the destination of worshippers who seek material or heavenly rewards through Vedic rituals with that of pure devotees who seek only the Supreme Lord. He explains that those who perform rituals with material desires ascend to the moon or higher planets only to fall back down upon exhausting their pious merit, whereas unalloyed devotees who dedicate all actions to Lord Kṛshṇa transcend the cosmic universe entirely.