19 - హిరణ్యాక్షుని వరాహ భగవానుడు సంహరించుట

మైత్రేయ ఉవాచ

అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః

ప్రహస్య ప్రేమగర్భేణ తదపాంగేన సోఽగ్రహీత్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మ నిష్కపటభావముతో పలికిన అమృతము వంటి ఆ వచనమును వరాహ భగవానుడు విని నవ్వే ను. ఆయన బ్రహ్మకేసి ప్రేమ నిండిన కటాక్షముతో చూచి ఆ వచనమును స్వీకరించెను.

తతస్సపత్నం ముఖతశ్చరంతమకుతోభయమ్

జఘానోత్పత్య గదయా హనావసురమక్షజః

నీవు యుద్దములో పరాక్రమించి వీనిని సంహరించి, లోకములకు సుఖ మును కలిగించుము.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.

సర్వమునకు ఆత్మయగు ఓ ప్రభూ! లోకములకు వినాశమును కలిగించే ఈ సంధ్యాకాలము సమీపించుచున్నది. ఆ లోపులోనే దేవతలకు విజయమును చేకూర్చుము.

అధునైషోఽభిజిన్నామ యోగో మౌహూర్తికో హ్యగాత్

శివాయ నస్త్వం సుహృదామాశు నిస్తర దుస్తరమ్

రెండు ఘడియల ఈ అభిజిద్యోగము ఇంచుమించు పూర్తి కావ చ్చినది. కావున, ఇప్పుడు నీవు నీ భక్తులమగు మాకు సుఖమును కలిగిం చుటకై, ఇతరులు జయించ లేని వీనిని వెంటనే సంహరించుము.

దిష్ట్యా త్వాం విహితం మృత్యుమయమాసాదితస్స్వయమ్

విక్రమ్యైనం మృధే హత్వా లోకానాధేహి శర్మణి

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే అష్టాదశోఽధ్యాయః

వీడు నీ చేతిలో మరణించునని నీ చేతనే ఇదివరలో విధించబడినది. తనకు మృత్యువు అగు అట్టి నీ వద్దకు వీడు తనంత తానుగా వచ్చినా

దేనివలనైననూ భయపడని హిరణ్యాక్షుడు బ్రహ్మగారి ఘ్రాణేంద్రి యమునుండి పుట్టిన వరాహ భగవానుని యెదుటనే తిరుగుతూ యుద్ధ మును, చేయుచుండెను. అపుడాయన పైకి యెగిరి శత్రువగు ఆ రాక్షసుని గదతో దౌడపై కొట్టెను.

సా హతా తేన గదయా విహతా భగవత్కరాత్

విఘూర్ణితాపతద్రేజే తదద్బుతమివోభవత్

హిరణ్యాక్షుడు ఆ గదను తన గదతో కొట్టగా, అదీ గిరగిర తిరిగి వరాహ భగవానుని చేతినుండి క్రింద బడి ప్రకాశించెను. అట్లు క్రింద పడుట అక్కడనున్న వారందరికి ఆశ్చర్యమును కలిగించెను.

స తదా లబ్దతీర్దోఽపి న బబాధే నిరాయుధమ్

మానయన్ స మృధే ధర్మం విష్వక్సేనం ప్రకోపయన్

ఆ రాక్షసునకు అప్పుడు వరాహ భగవానుని దెబ్బ తీసే అవకాశము లభించినది. కాని, వాడు యుద్ధధర్మమును పాటిస్తూ, నిరాయుధుడగు ఆయనను కొట్టలేదు. ఆయనకు చాల కోపము కలిగెను.

గదాయామపవిద్దాయాం హాహాకారే వినిర్గతే

మానయామాస తద్దర్మం సునాభం చాస్కరద్విభుః

వరాహ భగవానుని చేతినుండి గద జారిపోగానే, దేవతలు హాహా కారములను చేసిరి. ఆయన హిరణ్యాక్షుని ధర్మబుద్ధిని ప్రశంసించి, సుద ర్శన చక్రమును స్మరించెను.

తం వ్యగ్రచక్రం దితిపుత్రాధమేన

స్వపార్షదముఖ్యేన విషజ్జమానమ్

చిత్రా వాచోతఽద్విదాం ఖేచరాణాం

తత్ర స్మాసన్ స్వస్తి తేఽముం జహీతి

హిరణ్యాక్షుని వధించుటకు చక్రము కంగారు పడుచుండెను. కాని, వరాహ భగవానుడు తన అనుయాయులలో ప్రముఖుడు, అధముడు అగు ఆ రాక్షసునితో యుద్ధక్రీడను చేయుచుండెను. అపుడు ఆకాశములోనుండి యుద్దమును చూచుచున్న దేవతలు ఆయన మహిమనెరుంగని వారై ఆయనతో, నీకు మంగళమగు గాక! వీనిని వెంటనే సంహరించుము, అని అనేకరకములుగా పలుకుచుండిరి.

స తం నిశామ్యాత్తరథాంగమగ్రతో

వ్యవస్థితం పద్మపలాశలోచనమ్

విలోక్య చామర్షపరిప్లుతేంద్రియో

రుషా స్వదంతచ్ఛదమాదశచ్ఛ్వసన్

పద్మపత్రములవలె ప్రసన్నమైన కన్నులు గల వరాహ భగవా నుడు చక్రమును చేతబట్టి హిరణ్యాక్షుని యెదుట నిలబడెను. ఆయనను ఆ విధముగా చూడగానే, వాని మనస్సు ఇంద్రియములు కోపముతో నిండి పోయెను. ఆతడు కోపముతో నిట్టూర్పులను విడుస్తూ తన పెదవిని గట్టిగా కొరుకు కొనెను.

కరాలదంష్ట్రశ్చక్షుర్బ్యాం సంచక్షాణో దహన్నివ

అభిప్లుత్య స్వగదయా హతోఽసీత్యాహనద్ధరిమ్

భయంకరమగు కోరలు గల హిరణ్యాక్షుడు కన్నులతో దహించు చున్నాడా యన్నట్లు చూస్తూ, ఇదిగో! ఈ దెబ్బతో నీ పని ఆఖరు, అని పలుకుతూ ఎగిరి, తన గదతో వరాహ భగవానుని కొట్టెను.

పదా సవ్యేన తొం సాధో భగవాన్ యజ్ఞసూకరః

లీలయా మిషతశ్శత్రోః ప్రాహరద్వాతరంహసమ్

ఓ మహాత్మా! విదురా! యజ్ఞ వరాహ భగవానుడు వాయువేగము గల ఆ గదను శత్రువగు హిరణ్యాక్షుడు చూచుచుండగనే, తన యెడమ కాలితో అవలీలగా నేల గూల్చెను.

ఆహ చాయుధమాధత్స్వ ఘటస్వ త్వం జిగీషసి

ఇత్యుక్తస్స తదా భూయస్తాడయన్ వ్యనదద్భృశమ్

నీవు జయించ గోరుచున్నావు గనుక ఆయుధమును తీసుకొని ప్రయత్నించుము, అని వరాహ భగవానుడు వానితో పలికెను. అపుడాతడు మరల ఆయనను కొడుతూ భీకరముగా గర్జించెను.

తాం స ఆపతతీం వీక్ష్య భగవాన్ సమవస్థితః

జగ్రాహ లీలయా ప్రాప్తం గరుత్మనివ పన్నగీమ్

ఆ వరాహ భగవానుడు తన మీదకు వచ్చుచున్న గదను చూచి,  అటులనే నిలబడెను. అది దగ్గరకు రాగానే, ఆయన దానిని అవలీలగా, గరుత్మంతుడు పామును వలే, పట్టుకొనెను.

స్వపౌరుషే ప్రతిహతే హతమానో మహాసురః

నైచ్చద్గదాం దీయమానాం హరిణా విగతప్రభః

తన పరాక్రమము ఈ విధముగా విఫలము కాగా, ఆ మహారాక్ష సుని అభిమానము దెబ్బ తిని, వాని ముఖములో కాంతి క్షీణించెను. వరాహ భగవానుడు ఇచ్చిన గదను తీసుకొనుటకు ఆతడు ఇష్టపడలేదు.

జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్జ్వలనలోలుపమ్

 యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరన్ యథా

బ్రాహ్మణుని సంహరించుటకై దుష్టుడు అభిచార కర్మకు పూనుకున్న విధముగా, ఆ హిరణ్యాక్షుడు యజ్ఞస్వరూపుడగు వరాహ భగవానుని సంహరించుటకై మూడు కోనల శూలమును పట్టుకోనెను. దాని కొనలు మండే అగ్ని వలే ముందుకు ఉరుకుచున్నవా యన్నట్లు ఉండెను.

తదోజసా దైత్యమహాభటార్పితం

చకాసదంతఃఖ ఉదీర్ణదీధితి

చక్రేణ చిచ్చేద నిశాతనేమినా

హరిర్యథా తార్క్ష్యపతత్తృముజ్ఝతమ్

రాక్షసులలో మహావీరుడగు హిరణ్యాక్షుడు ఆకాశమధ్యములో కాంతులను గ్రక్కుతూ ప్రకాశించే శూలమును బలముగా ప్రయోగించేను. గరుత్మంతుడు విడిచి పెట్టిన రెక్కను ఇంద్రుడు కొట్టిన విధముగా, వరాహ భగవానుడు వాడి అంచు గల తన చక్రముతో దానిని ముక్కలుగా చేసెను.

వృక్ణే స్వశూలే బహుధారిణి

హరేః ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిమ్

ప్రవృద్దరోషస్స కఠోరముష్టినా

నదన్ ప్రహృత్యాంతరధీయతాసురః

వరాహ భగవానుని చక్రము తన శూలమును ముక్కలు ముక్క లుగా ఛేదించగా, ఆ రాక్షసునకు కోపము పెరిగెను. అపుడాతడు ఆయనకు ఎదురుగా వచ్చి, లక్ష్మీదేవికి ఆశ్రయమగు ఆయనయొక్క విశాల వక్షఃస్థలమును కఠినమగు తన పిడికిలితో కొట్టి గర్జించి. మాయమయ్యెను.

తేనెత్థమాహతః క్షత్తర్బగవానాదిసూకరః

నాకంపత మనాక్ క్వాపి స్రజా హత ఇవ ద్విపః

ఓ విదురా! ఆదివరాహ భగవానుని ఆతడీ విధముగా కొట్టగా ఆయన, పూలమాలచే కొట్టబడిన ఏనుగు వలే, దేహములో ఏభాగమునం దైననూ కొంచెమైననూ చలించలేదు.

అథోరుధాసృజన్మాయాం యోగమాయేశ్వరే హరౌ

యాం విలోక్య ప్రజాస్త్రస్తా మేనిరేఽస్యోపసంయమమ్

తరువాత ఆతడు యోగమాయకు అధీశ్వరుడగు వరాహ భగవానునిపై అనేక రకముల మాయను ప్రయోగించెను. వాని మాయను చూచి భయపడిన జనులు జగత్తునకు ప్రళయము రాబోవుచున్నదని భావించిరి.

ప్రవవుర్వాయవశ్చండాస్తమః పాంసవమైరయన్

దిగ్భ్యో నిపేతుర్గృవాణః క్షేపణైః ప్రహితా ఇవ

ప్రచండమగు గాలులు వీచి దుమ్మును రేగగొట్టగా, చీకట్లు అలు ముకొనెను. క్షిపణులు ప్రయోగించుచున్నవా యన్నట్లు దిక్కులనుండి రాళ్లు పడినవి.

ద్యౌర్నష్టభగణాభ్రౌఘైస్సవిద్యుత్స్తనయిత్నుభిః

వర్షద్భిః పూయకేశాసృగ్విణ్మూత్రాస్థీని చాసకృత్

ఆకాశము మెరుపులు ఉరుములతో గూడిన మేఘముల గుంపు లతో నిండి నక్షత్రగణములు కానరాకుండా పోయెను. ఆ మేఘములు మాటిమాటికీ చీము, జుట్టు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు అను వాటిని వర్షించెను.

గిరయః ప్రత్యదృశ్యంత నానాయుధముచోనఘ

 దిగ్వాససో యాతుధాన్యశ్శూలిన్యో ముక్తమూర్ధజాః

ఓ మహాత్మా! పర్వతములు వివిధములగు ఆయుధములను ప్రయోగించుచుండెను. రాక్షసస్త్రీలు దిగంబరలై శూలములను పట్టుకొని జుట్టు విరబోసుకొని కనబడిరి.

బహుభిర్యక్షరక్షోభిః పత్త్యశ్వరథకుంజరైః

ఆతతాయిభిరుత్సృష్టా హింస్రా వాచోఽతివైశసాః

పదాతులు, గుర్రములు, రథములు, ఏనుగులు, వాటిమీద ఉన్న సైనికులు, హింసా స్వభావము గల అనేకులగు యక్షులు, రాక్షసులు మిక్కిలి ఉగ్రమైన క్రూరమగు పలుకులను పలుకుతున్నట్లు వినవచ్చెను.

ప్రాదుష్కృతానాం మాయానామాసురీణాం వినాశయత్

సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుoక్త దయితం త్రిపాత్

మూడు పాదములు గల ధర్మమే శ్రీహరియొక్క స్వరూపము. మూడు సవనములు గల యజ్ఞమే వరాహ భగవానుని స్వరూపము. ఆయన హిరణ్యాక్షునిచే ఆవిర్భవింప జేయబడిన రాక్షసమాయలను సశింప జేయుటకై తనకు ఇష్టమైన సుదర్శనచక్రమును ప్రయోగించెను.

తదా దితేస్సమభవత్సహసా హృది వేపథుః

స్మరంత్యా భర్తురాదేశం స్తనాచ్చాసృక్ ప్రసుస్రువే

అప్పుడు భర్త చెప్పిన విషయములు గుర్తుకు వచ్చిన దితికి హృదయములో వణుకు పుట్టి, స్తనములనుండి రక్తము స్రవించెను.

వినష్టాసు స్వమాయాసు భూయశ్చాప్రజ్య కేశవమ్

రుషోపగూహమానోఽముం దదృశ్వేఽవస్థితం బహిః

హిరణ్యాక్షుని మాయలు పూర్తిగా అంతర్ధానమయ్యేను. అపుడాతడు కోపముతో వరాహ భగవానునకు ఎదురుగా వచ్చి ఆయనను కౌగి టిలో బిగించి నొక్కివేయుటకు ప్రయత్నించెను. కాని, ఆయన వాని కౌగిటికి బయటనే నిలిచియుండుటను ఆతడు కనుగొనెను.

తం ముష్టిభిర్వినిఘ్నంతం వజ్రసారైరధోక్షజః

కరేణ కర్ణమూలేఽహన్ యథా త్వాష్ట్రం మరుత్పతిః

హిరణ్యాక్షుడు వజ్రమువలె కఠినమైన పిడికిలితో వరాహ భగవా నుని గట్టిగా కొట్టుచుండగా, ఇంద్రుడు వృత్రుని వలె, ఆయన వానిని చెంపకు పైభాగమునందు చేతితో కొట్టెను.

స ఆహతో విశ్వజితా హ్యవజ్ఞయా

పరిభ్రమద్గాత్ర ఉదస్తలోచనః

విశీర్ణబాహ్వంఘ్రిశిరోరుహోఽపతత్

యథా నగేంద్రో లులితో నభస్వతా

విశ్వవిజేతయగు వరాహ భగవానుడు హిరణ్యాక్షుని కేవలము ఉపేక్షాభావముతో మాత్రమే కొట్టెను; గట్టిగా కొట్టనేలేదు. వాని శరీరము గిరగిర తిరుగజొచ్చెను; కన్నులు బయల్వెడలేను. వాని చేతులు కాళ్లు శిథిలమయ్యెను; జుట్టు చెల్లాచెదరై, తుఫాను గాలిచే పెకిలించి వేయబడిన. చెట్టువలె, వాడు క్రింద పడెను.

క్షితౌ శయానం తమకుంఠవర్చసం

కరాలదంష్ట్రం పరిదష్టదచ్చదమ్

అజాదయో వీక్ష్య శశంసురాగతా

అహో ఇమాం కో ను లభేత సంస్థీతిమ్

ఎదురు లేని తేజస్సు గల ఆ హిరణ్యాక్షుడు భూమిపై పడియుం డెను. వాని కోరలు భీతిని గొల్పుచుండెను. వాని పెదవి కోపముచే కొరికి వేయబడి యుండెను. అచటకు విచ్చేసిన బ్రహ్మాదులు వానిని చూచి, ఇట్లు కొనియాడిరి: ఆశ్చర్యము! ఇట్టి మరణము ఎట్టి వానికి దొరుకును?

యం యోగినో యోగసమాధినా రహో

ధ్యాయంతి లింగాదసతో ముముక్షయా

 తస్యైష దైత్యఋషభః పదా హతో

ముఖం ప్రపశ్యంస్తనుముత్ససర్జ హ

యోగులు లింగశరీరమునుండి విముక్తిని కోరువారై మనస్సును నిగ్రహించి, ఏకాగ్రమగు చిత్తముతో భగవానుని ధ్యానించెదరు. అట్టి భగవా నుడు కాలితో తన్నగా, ఈ రాక్షసశ్రేష్టుడు ఆయన ముఖమును చూస్తూ ప్రాణములను విడిచి పెట్టెను.

ఏతౌ తౌ పార్షదావస్య శాపాద్యాతావసద్గతిమ్

పునః కతిపయైః స్థానం ప్రపత్స్యేతే హ జన్మభిః

ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరు పూర్వములో విష్ణుపార్షదు లుగా నుండిన జయవిజయులే. వారు సనకాది మహర్షుల శాపము వలన ఈ రాక్షసజన్మను పొందినారు. ఇట్టి కొన్ని జన్మల తరువాత, వారు మరల తమ స్థానమును పొందగలరు.

దేవా ఊచుః

నమో నమస్తేఽఖిలయజ్ఞతంతవే

స్థితౌ గృహీతామలసత్త్వమూర్తయే

దిష్ట్యా హతోఽయం జగతామరుంతుదః

త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః

దేవతలు ఇట్లు పలికిరి --- ఓ ఈశ్వరా! యజ్ఞములనన్నింటినీ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే. నీవు జగద్రక్షణ కొరకై రజస్తమోగుణముల దోషము లేని సత్త్వమయమగు అవతారములను దాల్చెదవు. నీకు అనేక నమస్కారములు. లోకములకు పీడను కలిగించే ఈతడు దైవవశముచే సంహరించ బడినాడు. మేము నీ పాదములయందు భక్తిని చేసి సుఖమును " పొందినాము.

మైత్రేయ ఉవాచ

ఏవం హిరణ్యాక్షమసహ్యవిక్రమం

స సాదయిత్వా హరిరాదిసూకరః

జగామ లోకం స్వమఖండితోత్సవం

సమీడితః పుష్కరవిష్టరాదిభిః

మైత్రేయుడిట్లు పలికెను --- ఈ విధముగా ఆదివరాహరూపి యగు ఆ శ్రీహరి సహింప శక్యము కాని పరాక్రమము గల హిరణ్యాక్షుని సంహరించెను. కమలాసనుడగు బ్రహ్మ మొదలగు వారు ఆయనను చక్కగా స్తుతించిరి. అపుడాయన నిత్యకల్యాణముగానుండే తన వైకుంఠలో కమునకు వెళ్లాను.

మయా యథానూక్తమవాది తే హరేః

కృతావతారస్య సుమిత్ర చేష్టితమ్

యథా హిరణ్యాక్ష ఉదారవిక్రమో

మహామృధే క్రీడనవన్నిరాకృతః

ఓ విదురా! నీవు మంచి మిత్రుడవు. గొప్ప పరాక్రమము గల హిర ణ్యాక్షుని వరాహ రూపమును దాల్చిన శ్రీహరి గొప్ప యుద్దములో అటబొ మ్మను వలే ఆడించి సంహరించేను. భగవానుని ఆ లీలను నేను మా గురు వులు చెప్పిన దానిని అతిక్రమించకుండగా నీకు వర్ణించి చెప్పితిని.

సూత ఉవాచ

ఇతి కౌషారవాఖ్యాతామాశ్రుత్య భగవత్కథామ్

క్షత్తాఽఽనందం పరం లేఖే మహాభాగవతో ద్విజ

సూతుడిట్లు పలికెను --- ఓ శౌనక మహర్షీ! ఈ విధముగా మైత్రేయ మహర్షి భగవానుని గాథను వర్ణించి చెప్పగా, గొప్ప భగవద్భక్తు డగు విదురుడు విని గొప్ప ఆనందమును పొందెను.

అన్యేషాం పుణ్యశ్లోకానాముద్దామయశసాం సతామ్

ఉపశ్రుత్య భవేన్మోదః శ్రీవత్సాంకస్య కిం పునః

అంతటా వ్యాపించిన పవిత్రమగు కీర్తి గల ఇతర మహాత్ముల గాథను విన్నప్పుడే ఆనందము కలుగుచున్నచో, శ్రీవత్సము చిహ్నముగా గల శ్రీహరి గాథ ఆనందమును కలిగించునని వేరుగా చెప్పవలెనా?

యో గజేంద్రం ఝషగ్రస్తం ధ్యాయంతం చరణాంబుజమ్

క్రోశంతీనాం కరేణూనాం కృచ్చృతోఽమోచయద్ద్రుతమ్

 గజేంద్రుని మొసలి పట్టుకున్నప్పుడు ఆడు ఏనుగులు ఆక్రోశించు చుండెను. అపుడా గజేంద్రుడు శ్రీహరి పాదపద్మములను ధ్యానించెను. వెంటనే శ్రీహరి ఆ ఏనుగును ఆపదనుండి విడిపించెను.

తం సుఖారాధ్యమృజుభిరనన్యశరణెర్నృభిః

కృతజ్ఞః కో న సేవేత దురారాధ్యమసాధుభిః

నిష్కపటులై ఏకాంతభక్తితో శరణు జొచ్చు మానవులకు శ్రీహరిని ఆరాధించుట చాల సరళమైన పని. కాని, దుష్టులకు ఆయనను ఆరాధించి ప్రసన్నుని చేసుకొనుట అసంభవము. మానవుని భాగ్యమంతయు ఆయన చలువయే అని గుర్తించిన వ్యక్తి ఎవడు ఆయనను సేవించకుండును?

యో వై హిరణ్యాక్షవధం మహాద్బుతం

విక్రీడితం కారణసూకరాత్మనః

 శృణోతి గాయత్యనుమోదతేఽoజసా

విముచ్యతే బ్రహ్మవధాదపి ద్విజాః

ఓ మహర్షులారా! శ్రీహరి జగద్రక్షణము కొరకై వరాహ రూపమును దాల్చి హిరణ్యాక్షుని వధించుట అనే గొప్ప ఆశ్చర్యకరమగు లీలను ప్రకటించెను. దీనిని ఎవడైతే వినునో, కీర్తించునో, అనుమోదించి ప్రోత్సహించునో, వాడు యథార్థముగా బ్రహ్మహత్యాపాపమునుండి కూడ విముక్తుడగును.

ఏతన్మహాపుణ్యమలం పవిత్రం

ధన్యం యశస్యం పదమాయురాశిషామ్

 ప్రాణేంద్రియాణాం యుధి శౌర్యవర్ధనం

 నారాయణోoఽ తే గతిరంగ శృణ్వతామ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే ఏకోనవింశోఽధ్యాయః

గొప్ప పుణ్యమునిచ్చే ఈ గాథ వినువారిని అతిశయించి పవిత్రు లను జేసి, ధనమును కీర్తిని ఆయుర్దాయమును మరియు మనోరథములను సంపాదించి పెట్టును. ఈ గాథను విన్నవారికి ఇది యుద్దములో ప్రాణమునకు, ఇంద్రియములకు పరాక్రమమును వర్దిల్ల జేయును. దీనిని విన్నవారు మరణించిన పిదప నారాయణుని పొందెదరు

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది .