భాగవత మహా పురాణము
15 - జయ విజయులు శాపగ్రస్తులగుట
మైత్రేయ ఉవాచ
ప్రాజాపత్యం తు తత్తేజః పరతేజోహనం దితిః ।
దధార వర్షాణి శతం శంకమానా సురార్ధనాత్ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కశ్యప ప్రజాపతియొక్క ఆ తేజస్సు ఇతరుల తేజస్సును నశింపజేయునది. దాని వలన దేవతలకు పీడ కలుగునేమో యను శంకచే దితి దానిని వంద సంవత్సరముల కాలము ధరించి యుండెను.
లోకే తేన హతాలోకే లోకపాలా హతౌజసః ।
న్యవేదయన్ విశ్వసృజే ధ్వాంతవ్యతికరం దిశామ్ ॥
ఆ గర్భమునందలి శిశువుయొక్క తేజస్సుచే లోకముల తేజస్సు మరియు లోకపాలకుల సామర్థ్యము నశించేను. దిక్కులలో తూర్పు పడ మర అనే తేడా తెలియకుండా పోయేను. అపుడు లోకపాలకులు ఈ అవ్య వస్థను గురించి సృష్టికర్తయగు బ్రహ్మగారికి విన్నవించిరి.
దేవా ఊచుః ।
తమ ఏతద్విభో వేత్థ సంవిగ్నా యద్వయం భృశమ్ ।
న హ్యవ్యక్తం భగవతః కాలేనాస్పృష్టవర్త్మనః ॥
ఓ ప్రభూ! ఈ చీకటిని నీవు చూచుచునే యున్నావు. ఇది మాకు. చాల భయమును గొల్పుచున్నది. నీ జ్ఞానశక్తి కాలమున మరుగున పడేది కాదు. నీకు తెలియనిది ఏదీ లేదు గదా!
దేవదేవ జగద్ధాతర్లోకనాథశిఖామణే ।
పరేషామపరేషాం త్వం భూతానామసి భావవిత్ ॥
ఓ దేవదేవా! నీవు జగత్తును సృష్టించినవాడవు. లోకపాలకులు సైతము నిన్ను పూజించేదరు. ఉత్కృష్టమైనవి, నికృష్టమైనవి అగు సకల ప్రాణుల అభిప్రాయములు నీకు తెలియుచుండును.
నమో విజ్ఞానవీర్యాయ మాయయేదము పేయుషే ।
గృహీతగుణభేదాయ నమస్తేఽవ్యక్తయోనయే ॥
చైతన్యశక్తియే నీ బలము. గుణములలో ఒకటియగు రజోగుణ మును ఉపాధిగా స్వీకరించి, నీవీ చతుర్ముఖరూపమును పొందితివి. పరబ్ర హ్మయొక్క మాయాశక్తినుండి ప్రకటమైన నీకు అనేక నమస్కారములు.
యే త్వానన్యేన భావేన భావయంత్యాత్మభావనమ్ ।
ఆత్మని ప్రోతభువనం పరం సదసదాత్మకమ్ ॥
తేషాం సుపక్వయోగానాం జితశ్వా సేంద్రియాత్మనామ్ ।
లబ్దయుష్మత్పృసాదానాం న కుతశ్చిత్పరాభవః ॥
ఈ భువనములు నీయందు ఓతప్రోత భావముచే నిలిచియున్నవి. జీవులనందరిని పాలించువాడవు నీవే. నీవు సర్వాధికుడవు. కారణము నీ రూపమే, కార్యము నీ రూపమే. అట్టి నిన్ను ఎవరైతే అభేదభావనతో కూడిన (నిష్కామ) భక్తితో ధ్యానించెదరో, వారి యోగసాధన పక్వమగును. వారు తమ శ్వాసను ప్రాణాయామము ద్వారా, ఇంద్రియములను ప్రత్యా హారము ద్వారా, మనస్సును ధారణ ద్వారా వశము చేసుకొని, నీ అనుగ్ర హమునకు పాత్రులగుదురు. అట్టి వారికి ఈ జగత్తులో దేనివలనైననూ పరా భవము లేదు.
యస్య వాచా ప్రజాస్సర్వా గావస్తంత్యేవ యంత్రితాః ।
హరంతి బలిమాయత్తాస్తస్మై ముఖ్యాయ తే నమః ॥
నీ వేదరూపమగు వాక్కు జనులను, త్రాడు ఎద్దులను వలె, ధర్మా ధర్మములకు బద్దులను చేసి నియంత్రించుచున్నది. జనులు నీకు అధీనులై సావధానమనస్కులై నీకు పూజాదికమును సమర్పించుచున్నారు. నీవు ప్రాణులలో ముఖ్య (ముఖమునందు శ్వాస రూపముగా వ్యక్తమయ్యే) ప్రాణము రూపములో నున్నావు. నీకు నమస్కారము.
స త్వం విధత్స్వ శం భూమంస్తమసా లుప్తకర్మణామ్ ।
అదభ్రదయయా దృష్ట్యా ఆపన్నానర్హసీక్షితుమ్ ॥
ఓ పరబ్రహ్మ స్వరూపుడా! అట్టి నీవు జనులకు సుఖమును కలిగిం చుము. ఈ చీకటిచే వారి కర్మానుష్టానము మూతపడినది. ఆపదలో చిక్కు కున్న మమ్ములను నీవు గొప్ప దయతో నిండిన చూపుతో చూడవలెను.
ఏష దేవ దితేర్గర్భ ఓజః కాశ్యపమర్పితమ్ ।
దిశస్తిమిరయన్ సర్వా వర్ధతేఽగ్నిరివైధసి ॥
ఓ దేవా! కశ్యప ప్రజాపతి తన తేజస్సును దితియందు స్థాపించి నాడు. ఆమెయొక్క ఆ గర్భము, ఎండు కట్టెయందలి అగ్ని వలె వర్ధిల్లుతూ, దిక్కులను వెలవెల బోవునట్లు చేయుచున్నది.
మైత్రేయ ఉవాచ ।
స ప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచరః ।
ప్రత్యాచష్టాత్మభూర్దేవాన్ ప్రీణన్ రుచిరయా గిరా ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఓ విదురా! స్వయంభువుడగు బ్రహ్మ భగవానుని స్వరూపము వేదశబ్దములచే మాత్రమే తెలియబడుచు న్నది. ఆయన నవ్వి తన మధురమగు వాక్కుతో దేవతలకు సంతోషమును కలిగిస్తూ, ఇట్లు బదులు చెప్పెను.
బ్రహ్మోవాచ ।
మానసా మే సుతా యుష్మత్పూర్వజా సనకాదయః ।
చేరుర్విహాయసా లోకాన్ లోకేషు విగతస్పృహాః ॥
మీరు పుట్టుటకు ముందే నా సంకల్పమునుండి సనకుడు మొద లగు మహర్షులు. జన్మించినారు. వారికి ఈ లోకములలో పొందదగిన కోరి కలు ఏమియు లేవు. వారు ఆకాశమార్గము గుండా లోకములను సంచరిం చుచుండిరి.
త ఏకదా భగవతో వైకుంఠస్యామలాత్మనః ।
యయుర్వైకుంఠనిలయం సర్వలోకనమస్కృతమ్ ॥
శ్రీహరి ప్రాణుల సత్త్వగుణప్రధానమగు బుద్దిగుహయందు శుద్ధచై తన్యరూపముగా వెలుగొందుచుండును. ఆయనయే వైకుంఠలోకమునందు నివసించును. సకలలోకముల వారు ఆ వైకుంఠలోకమును నమస్కరించెద రు. ఒకనాడు ఆ సనకాదులు వైకుంఠలోకమునకు వెళ్లిరి.
వసంతి యత్ర పురుషాస్సర్వే వైకుంఠమూర్తయః ।
యేఽనిమిత్తనిమిత్తేన ధర్మేణారాధయన్ హరిమ్ ॥
ఆ వైకుంఠమునందలి పురుషులు అందరు శ్రీహరిని బోలిన రూపమును కలిగియుందురు. శ్రీహరిని నిష్కామభావముతో ఆరాధించుటయే వారు పాటించే ధర్మము
యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్ శబ్దగోచరః ।
సత్త్వం విష్టభ్య విరజం స్వానాం నో మృడయన్ వృషః ॥
సకలకారణుడు, పూర్ణుడు, వేదములచే ప్రతిపాదించబడువాడు, ధర్మమూర్తి అగు శ్రీహరి భగవానుడు రజోగుణ సంబంధము లేని సత్త్వగు ణమును ఉపాధిగా చేసుకొని, అచట తన భక్తులగు మనలకు సుఖమును కలిగిస్తూ ఆ వైకుంఠమునందు విరాజిల్లుచున్నాడు.
యత్ర నైఃశ్రేయసం నామ వనం కామదుఘైర్ద్రుమైః ।
సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్కైవల్యమివ మూర్తిమత్ ॥
ఆ వైకుంఠమునందు నైఃశ్రేయసమని ప్రసిద్దిని గాంచిన వనము గలదు. అది అన్ని ఋతువులకు సంబంధించిన వృక్షముల శోభతో ప్రకాశిం చుచుండును. కోరికలను వర్షించే ఆ వృక్షములతో ఆ వనము రూపు దాల్చిన మోక్షము వలె నొప్పారుచుండును.
వైమానికాస్సలలనాశ్చరితాని యత్ర
గాయంతి లోకశమలక్షపణాని భర్తుః ।
అంతలేకనువికసన్మధుమాధవీనాం
గంధేన ఖండితధియోఽప్యనిలం క్షిపంతః ॥
ఆ వనములో సరస్సునందలి నీటి లోపల మకరందమును వర్షించే మాధవీ లతలు వికసించి తేనెలను ప్రసరింప జేయుచుండును. వాటి పరి మళము బుద్దియొక్క ఏకాగ్రతకు భంగము కలిగించే అవకాశము గలదు. అయిననూ, తమ భార్యలతో గూడి విమానములలో సంచరించే గంధ ర్వులు ఆ విధమగు బుద్ధిచాంచల్యమును విడనాడి, ఆ పరిమళమును మోసుకువచ్చే వాయువును నిందించుచుందురు. వారి విధముగా చేయు చూ, ప్రభువగు శ్రీహరియొక్క లీలలను గానము చేయుచుందురు. ఆ గాథలు జనుల హృదయములోని పాపములను నశింపజేయును.
పారావతాన్యభృతసారసచక్రవాక-
దాత్యూహహంసశుకతిత్తిరిబర్హిణాం యః ।
కోలాహలో విరమతేఽచిరమాత్రముచ్చైః
భృంగాధిపే హరికథామివ గాయమానే ॥
ఆ వనములో పావురము కోకిల. బెగ్గురుపక్షి భరతపక్షి హంస చిలుక తీతువు నెమలి అనే పక్షులు కోలాహలము చేయుచుండును. కాని, శ్రేష్టమగు తుమ్మెద హరికథను గానము చేయుచున్నదా యన్నట్లు ఝంకారమును చేయుట ఆరంభించగానే, కనీసము కొద్ది సేపు ఆ పక్షుల కోలాహలము ఆగిపోవును.
మందారకుందకురవోత్పలచంపకార్థ
పున్నాగనాగబకులాంబుజపారిజాతాః ।
గంధేఽర్చితే తులసికాభరణేన తస్యా
యస్మింస్తపస్సుమనసో బహు మానయంతి ॥
శ్రీహరి తులసిని అలంకరించుకొనును. ఆయనకు దాని గంధము నందు ఆదరము మెండు. వైకుంఠమునందలి ఆ వనములో ఉండే మందా రము, మల్లె, గోరింట, కలువ, సంపెంగ, అర్జపుష్పము, సురపొన్న, నాగకేసరము, పొగడ, పద్మము, పారిజాతము అనే పుష్పజాతులు తులసి చేసు కున్న తపస్సును గొప్పగా కొనియాడుచుండును.
యత్సంకులం హరిపదానతిమాత్రదృష్టైః
వైదూర్యమారకత హేమమయైర్విమానైః ।
యేషాం బృహత్కటీతటాస్మితశోభిముఖ్యః
కృష్ణాత్మనాం న రజ ఆదధురుత్స్మయాద్యై: ॥
వైదూర్యములు, పచ్చలు మరియు బంగారము అనువాటితో నిండియున్న విమానములతో ఆ వైకుంఠము రద్దీగా నుండును. కేవలము శ్రీహరియొక్క పాదములకు ప్రణమిల్లిన వారికి మాత్రమే వాటిని చూచే భాగ్యము కలుగును. ఆ విమానములలో అధిరోహించే జనుల హృదయ ములో శ్రీహరి సర్వదా నీలిచియుండును. కావుననే, విశాలమగు కటిభాగ ములు కలిగి చిరునవ్వుతో శోభిల్లే ముఖములు గల స్త్రీలు కూడ పరిహా సము మొదలగు వాటిచే వారి మనస్సులలో రజోగుణమునుండి పుట్టే కామవికారములను కలిగించలేరు.
శ్రీ రూపిణీ క్వణయతీ చరణారవిందం
లీలాంబుజేన హరిసద్మని ముక్తదోషా ।
సంలక్ష్యతే స్ఫటికకుడ్య ఉపేత హెమ్ని
సమ్మార్జతీవ యదనుగ్రహణేఽన్యయత్నః ॥
శ్రీహరియొక్క నివాసము బంగారముతో నిర్మించబడినది. దాని లోని గోడలు స్పటికమయములు. సుందరియగు లక్ష్మీదేవి ఆ ప్రాసాదము నందు తన చాంచల్యదోషమును విడిచి పెట్టి (స్థిరముగా నున్న దై), కాలి నూపురముల మువ్వలు గణగణలాడుచుండగా ఇటునటు సంచరించుచుం డును. ఆమె చేతిలో విలాస కొరకై పద్మమును ధరించియుండును. ఆమె తిరుగుచున్నప్పుడు గోడలో ప్రతిబింబము పడి, ఆమె పద్మముతో నేలను ఊడ్చుచున్నదా యనిపించును. ఆమె అనుగ్రహము కొరకై జగత్తులోని ఇతరులు ప్రయత్నించుచుందురు.
వాపీషు విద్రుమతటాస్వమలామృతాప్సు
ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిరీశమ్ ।
అభ్యర్చతీ స్వలకమున్నసమీక్ష్య వక్తృ
ముచ్ఛేషితం భగవతేత్యమతాంగ యచ్చ్రీః ॥
ఓ ప్రియమైన దేవతలారా! ఆ వైకుంఠమునందు లక్ష్మీదేవి తన పరిచారికలతో గూడి తన ఉద్యానవనమునందు తులసీ దళములతో శ్రీహరి భగవానుని శ్రద్దతో అర్చించుచుండెను. ఆ వనములో అమృతము వంటి నీరు (అమృతమే నీరుగా) గల దిగుడు బావులు గలవు. వాటి గట్లు పగడములతో కూర్చబడి యుండెను. ఆమె అందమైన ముంగురులతో మరియు ఎత్తైన ముక్కుతో గూడియున్న తన ముఖమును ఆ నీటిలో చూచి, శ్రీహరి తనను చుంబించుటను స్మరించెను.
యన్న ప్రజంత్యఘభిదో రచనానువాదా-
చ్ఛృణ్వంతి యేఽన్యవిషయాః కుకథా మతిఘ్నీః ।
యాస్తు శ్రుతా హతభ గైర్నృభిరాత్తసారాః
తాంస్తాన్ క్షిపంత్యశరణేషు తమస్సు హంత ॥
మందభాగ్యులగు జనులు పాపములను పోనాడే శ్రీహరియొక్క జగద్రచన మొదలగు లీలలను వినరు. వారు నిస్సారములగు ఇతరవిషయ ములతో కూడి బుద్దిని వినాశము చేసే చెడు ప్రసంగములను వినుచుందురు. వారా వైకుంఠమును పొందలేరు. అయ్యో! ఆ ప్రసంగములు వారిని నరకములలోనికి త్రోసివేయును. అచట వారిని రక్షించువారు ఉండరు.
యేఽభ్యర్థితామపి చ నో నృగతిం ప్రపన్నా
జ్ఞానం చ తత్త్వవిషయం సహధర్మ యత్ర ।
నారాధనం భగవతో వితరంత్యముష్య
సంమోహితా వితతయా బత మాయయా తే ॥
మనుష్యజన్మలో ధర్మమునాచరించుటకు, యథార్థవస్తువు అగు బ్రహ్మయొక్క జ్ఞానమును పొందుటకు అవకాశము గలదు. కావుననే, మేము (బ్రహ్మ మొదలగు దేవతలు) కూడ దానిని కోరుచుందుము. కాని, అయ్యో! ఎవరైతే అట్టి మానవజన్మను పొందియు శ్రీహరి భగవానుని ఆరాధించరో, వారు ఆ భగవానుని విస్తృతమగు మాయచే మోహింప జేయబడుదురు.
యచ్చ ప్రజంత్యనిమిషామృషభానువృత్త్యా
దూరేయమా హ్యుపరి నస్పృహణీయశీలాః ।
భర్తుర్మిథస్సుయశసః కథనానురాగ-
వైక్లబ్యబాష్పకలయా పులకీకృతాంగాః ॥
భక్తులు దేవాధిదేవుడగు శ్రీహరిని సర్వదా స్మరిస్తూ మృత్యువును అధిగమించెదరు. వారు బ్రహ్మాది, దేవతల కంటే కూడ ఉత్కృష్టమైనవారు. దేవతలు కూడ వారి శీలము వంటి శీలము తమకు ఉండవలెనని కోరుచుం దురు. వారిలో వారు శ్రీహరి ప్రభుని పవిత్రమగు కీర్తిని గానము చేసి దాని వలన ఉదయించిన ప్రేమచే మనస్సులో విహ్వలురై కన్నుల వెంబడి నీటిని గార్చుతూ శరీరమంతయు గగుర్పాటును పొందెదరు. అట్టి భక్తులు ఆ వైకుంఠమును పొందెదరు. -
తద్విశ్వగుర్వధికృతం భువనైకవంద్యం
దివ్యం విచిత్రవిబుధాగ్ర్యవిమానశోచిః ।
ఆపు: పరాం ముదమపూర్వము పేత్య
యోగమాయాబలేన మునయస్తదథో వికుంఠమ్ ॥
సకలభువనములలోని జనులచే నమస్కరించబడే అప్రాకృతమగు వైకుంఠమునందు జగత్తునకు తండ్రియగు శ్రీహరి నివసించియుండును. అచట దేవశ్రేష్టుల రంగు రంగుల విమానములు ప్రకాశించుచుండును. సనకాది మహర్షులు ఇదివరలో వైకుంఠమును చూచియుండలేదు. వారు యోగశక్తియొక్క మహిమచే అక్కడకు చేరి మహానందమును పొందిరి.
తస్మిన్నతీత్య మునయష్షడసజ్జమానాః
కక్షాస్సమానవయసావథ సప్తమాయామ్ ।
దేవావచక్షత గృహీతగదౌ పరార్ద్య-
కేయూరకుండలకిరీటవిటంకవేషౌ ॥
ఆ సనకాది మహర్షులు ఆరు ప్రాకారద్వారములను దాటిరి. వారు శ్రీహరిని దర్శించవలెననే ఉత్కంఠచే వైకుంఠశోభను దర్శించుటలో ఆస క్తినీ చూపకుండిరి. వారిని ఆరు ద్వారముల వద్ద ద్వారపాలకులు అడ్డుకొన లేదు. తరువాత వారు ఏడవ ద్వారము వద్ద గదలను పట్టుకొని పహరా కాయుచున్న ఇద్దరు దేవతలను చూచిరి. సమానమగు వయస్సు గల వారి ద్దరు మిక్కిలి విలువైన బాహుపురులు కుండలములు కిరీటములు అనే ఆభరణములను సుందరమగు వేషములను దాల్చియుండిరి.
మత్తద్విరేఫవనమాలీకయా నివీతౌ
విన్యస్తయాసీతచతుష్టయబాహుమధ్యే ।
వక్త్రం భ్రువా కుటిలయా స్ఫుటనిర్గమాభ్యాం
రక్తేక్షణేన చ మనాగ్రభసం దధానౌ ॥
ఆ ద్వారపాలకులిద్దరు మదించిన తుమ్మెదలను తన వద్దకు ఆక ర్షించుచున్న వనమాలను నీలవర్ణము గల నాలుగు భుజముల మధ్యలో వచ్చునట్లుగా మెడలో ధరించిరి. ముడివడిన కనుబొమలతో, ఉబ్బియున్న ముక్కుపుటములతో, ఎర్రని కన్నులతో కూడియున్న వారి ముఖములలో కొంచెము చికాకు కనబడుచుండెను.
ద్వార్యేతయోర్నివివిశుర్మిషతోరపృష్ట్వా .
పూర్వా యథా పురటవజ్రకపాటికా యాః ।
సర్వత్ర తేఽవిషమయా మునయస్స్వదృష్ట్యా
యే సంచరంత్యవిహతా విగతాభిశంకాః ॥
ఆ ద్వారములన్నియు బంగారముతో చేసినవే. వాటియందు వజ్రములు పొదగబడి యుండెను. ఆ సనకాది మహర్షులు తమను చూచుచున్న ఆ ఇద్దరు ద్వారపాలకులను లెక్కచేయకుండగా, వారి అనుమతి కొరకు ఎదురు చూడకుండగా ఆ ద్వారము లోపల ప్రవేశించిరి. వారు ముందటి ఆరు ద్వారములను కూడ అదే విధముగా దాటి వచ్చిరి. ఆ మహర్షులు సర్వత్ర సమదృష్టి గలవారు. వారు ఏ కాలమునందైననూ శంకను ఎరుగరు. వారిని ఎవ్వరైననూ అడ్డుకొనరు. వారు అంతటా అదే విధముగా సంచరించుచుందురు.
తాన్వీక్ష్య వాతరశనాంశ్చతురః కుమారాన్
వృద్దాన్ దశార్దవయసో విదితాత్మతత్త్వాన్ ।
వేత్రేణ చాస్టలయతామతదర్హణాంస్తౌ
తేజో విహస్య భగవత్పృతికూలశీతా ॥
ఆ సనకాది మహర్షులు నలుగురు దిగంబరులు. వారు పెద్దవారే అయినా అయిదు సంవత్సరముల బాలకులవలె కన్పట్టుచుండిరి. వారు ఆత్మతత్త్వమునెరింగిన వారు. వారిని అడ్డుకొనుట ద్వారపాలకులకు తగదు. కాని, ఆ ద్వారపాలకులిద్దరు శ్రీహరి భగవానునకు విరుద్ధమైన స్వభావము గలవారగుటచే, ఆ మహర్షుల తేజస్సును పొగరుమోతుతన ముగా భావించి వారిని పరిహసించి, బెత్తముతో వారిని అడ్డగించిరి.
తాభ్యాం.మిషత్స్వనిమి షేషు నిషిధ్యమానాః
స్వర్హత్రమా హ్యపీ హరేః ప్రతిహారపాభ్యామ్ ।
ఊచుస్సుహృత్తమదిదృక్షితభంగ ఈషత్
కామానుజేన సహసా త ఉపప్లుతాక్షాః ॥
ఆ మహర్షులు మర్యాదకు ఎంతయూ తగినవారు. కాని వైకుంఠ మునందలి ఇతరదేవతలు చూచుచుండగా, శ్రీహరియొక్క ద్వారమునకు కాపలా కాసే వారిద్దరు వారిని అడ్డుకొనినారు. తమకు అత్యంతప్రీతిపాత్రుడగు భగవానుని దర్శించవలెననే ఆ మహర్షుల కోరికకు ఆ విధముగా భంగము కలిగెను. కామమును అంటి పెట్టుకొని ఉండే కోపము వారిలో కొద్దిగా ప్రవేశించెను. వారి కన్నులలో ఆ కోపము వ్యాపించుచుండెను. వారు అపుడు ఇట్లు పలికిరి.
మునయ ఊచుః।
కో వామిహైత్య భగవత్పరిచర్యయోచ్చైః
తద్ధర్మిణాం నివసతాం విషమస్స్వభావః ।
తస్మిన్ ప్రశాంతపురుషే గతవిగ్ర హే వాం
కో వాఽఽత్మవత్కుహకయోః పరిశంకనీయః ॥
మునులు ఇట్లు పలికిరి --- మీరు భగవానుని గొప్పగా ఆరాధించి ఇచటకు వచ్చి నివసించుచున్నారు. కావున, మీయందు ఆ భగవానుని ధర్మములుండదగును. భగవానుడు సమదర్శి. కాని మీరు దానికి విరుద్దమగు విషమస్వభావమును కలిగియున్నారు. ఇది మీకు ఎట్లు కలిగినది? పూర్ణుడగు ఆ భగవానుడు పరమశాంతస్వరూపుడు. ఆయనయందు కలహము లేనే లేదు. అట్టి స్థితిలో, శంకించదగిన వారు ఇచట ఎవరు గలరు? మీరిద్దరు కపటస్వభావము గలవారు. కావుననే, మీరు ఇతరులయందు దోషమును చూచి శంకించుచున్నారు.
న హ్యంతరం భగవతీహ సమస్తకుక్షా-
వాత్మానమాత్మని నభో నభసీవ ధీరాః ।
పశ్యంతి యత్ర యువయేస్సురలింగినోః కిం
వ్యుత్పాదితం హ్యుదరభేది భయం తోకస్య ॥
సకలవిశ్వము భగవానుని ఉదరమునందు గలదు. ఆయన సకల ప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు. జ్ఞానులు ఆ పరమేశ్వరుని ఆత్మ రూపునిగా దర్శించి, ఘటాకాశమును మహాకాశమునందు వలె, తమ జీవభావమును ఆయనయందు విలీనము చేసెదరు. వారు తమ యథార్థస్వ రూపమునకు ఈశ్వరునకు మధ్యలో భేదమును చూడరు. మీరు ఈ వైకుం ఠములో దేవతల వేషములను దాల్చియున్నారు. ఇతరులెవరో వచ్చి అట్టి ఆ భగవానుని దేహమునకు హాని కలిగించెదరేమో యనీ మీరు శంకించి భయపడుచున్నారు. అల్పమైననూ భేదమును దర్శించినచో, భయము కలుగును. మీకు ఈ శంక ఎక్కడనుండి వచ్చినది? మీకీ భయము కలుగు టకు కారణమేమి?
తద్వామముష్య పరమస్య వికుంఠభర్తుః
కర్తుం ప్రకృష్టమిహ ధీమహి మందధీభ్యామ్, ।
లోకానితో వ్రజతమంతరభావదృష్ట్యా
పాపీయసస్త్రయ ఇమే రిపవోఽస్య యత్ర ॥
వైకుంఠాధిపతియగు ఈ శ్రీహరి సత్త్వగుణప్రధానమగు బుద్ధికి అధ్యక్షుడై ఆత్మరూపముగా వెలుగొందే పరబ్రహ్మ. కానీ, మందబుద్దులగు మీరు ఆయనకు భయమును శంకించుచున్నారు. కావున, మీకు గొప్ప మంగళమును చేయవలెనని మేము ఈ సందర్భములో భావించుచున్నా ము. మీరు భేదదృష్టిని కలిగియున్న కారణముగా, ఈ వైకుంఠమును వదిలి పాపభూయిష్టమగు లోకములను (యోనులను) పొందుడు. అచట జీవు లకు కామక్రోధలోభములనే ముగ్గురు శత్రువులు గలరు.
తేషామితీరితముభావవధార్య ఘోరం
తం బ్రహ్మదండమనివారణమస్త్రపూగైః ।
సద్యో హరేరనుచరావురు బిభ్యతస్తత్
పాదగ్రహావపతతిమతికాతరేణ ॥
ఆ మహర్షులు ఈ విధముగా పలికిరి. వారి వాక్కుల రూపములో నున్న భయంకరమగు ఆ బ్రహ్మదండము (బ్రాహ్మణశాపము) ను ఎన్ని అస్త్రములైననూ నివారించలేవు. బ్రహ్మదండమునకు సాక్షాత్తు శ్రీహరి కూడ భయపడును. శ్రీహరియొక్క అనుచరులగు వారిద్దరు ఆ మహర్షుల శాపమును విని చాల భయపడిరి. వారు వెంటనే అతిశయించిన దైన్య ముతో నేలపై బడి వారి పాదములను పట్టుకొనిరి.
భూయాద ఘోని భగవద్బిరకారి దండో
యో నౌ హరేత సుర హేలనమప్య శేషమ్ ।
మా వోఽనుతాపకలయా భగవత్స్మృతి ఘ్నో
మోహో భవేదిహ తు నౌ ప్రజతోరధోఽధ ॥
అపరాధికి పూజ్యులగు మీరు శిక్షను విధించితిరి. అది అటులనే యగుగాక! మేము దేవతలమగు మీమ్ములను పరిహసించితిమి. మీరు విధించిన శిక్షను అనుభవించుట వలన ఆ దోషము పూర్తిగా దూరమగును. మేమిపుడు ఇక్కడనుండి అధమయోని లోనికి పోవుచున్నాము. మేము మీకు క్లేశమును కలిగించితిమి. ఆ పాపములో లేశమైననూ మాకు ఈ అధ మయోనిలో భగవంతుని స్మరణమునకు విఘాతము కలిగించే మోహ మును ఈయగలదు. కానీ, మాకు అట్లు కారాదని కోరుచున్నాము.
ఏవం తదైవ భగవానరవిందనాభః
స్వానాం విబుధ్య సదతిక్రమమార్యహృద్యః ।
తస్మిన్ యయౌ పరమహంసమహామునీనా-
మన్వేషణీయచరణౌ చలయన్ సహశ్రీః ॥
ఈ విధముగా తన సేవకులు మహాత్ములగు సనకాదుల విషయ ములో అపరాధమును చేసినారనే విషయమును పద్మనాభుడగు శ్రీహరి భగవానుడు అదే క్షణములో తెలుసుకొనెను. వెంటనే మహాత్ముల హృద యములలో నిలిచియుండే ఆయన లక్ష్మీదేవితో గూడి అచటకు నడచివచ్చెను. పరమహంస (ఆత్మజ్ఞాని) లగు మహర్షులు తమ ధ్యానములో ఆయన పాదములను అన్వేషించుచుందురు.
తం త్వాగతం ప్రతిహృతౌపయికం స్వపుంభిః
తేఽచక్షతాక్షవిషయం స్వసమాధిభాగ్యమ్ ।
హంసశ్రియోర్వ్యజనయోశ్శివవాయులోల-
చ్చుభ్రాతపత్రశశికేసరశీకరాంబుమ్ ॥
సేవకులు పూజాద్రవ్యములను వెంట గొనిరాగా శ్రీహరి అచటకు వచ్చి ఆ మహర్షులకు కనబడెను. వారు చేసిన సమాధియోగము రూపుకట్టి వారి ముందు నిలబడెను. ఆయనకు ఇరువైపులా రాజహంసలను బోలి యున్న వింజామరలు వీచబడుచుండెను. ఆయన శిరస్సు పై చంద్రుని వలె ప్రకాశించే గొడుగు పట్టబడెను. వింజామరలనుండి వచ్చే మంగళకర మగు వాయువుచే ఆ గొడుగు కొనలనుండి వ్రేలాడే ముత్యాల సరాలు కదలి చంద్రుని వెన్నెలలనే అమృతకణములు ఆయన పై పడుచున్నవా యన్నట్లు భాసించెను.
కృత్స్నప్రసాదసుముఖం స్పృహణీయధామ
స్నేహావలోకకలయా హృది సంస్పృశంతమ్ ।
శ్యామే పృథావురసి శోభితయా శ్రియా స్వ-
శ్చూడామణీం సుభగయంతమీవాత్మధిష్ఠ్యమ్ ॥
కోరదగిన సద్గుణములకు నిలయమగు ఆ శ్రీహరి అక్కడనున్న మరిహద్దులను మాత్రమే గాక ద్వారపాలకులను కూడ అనుగ్రహించుటకు సుముఖుడై యుండెను. ఆయన ప్రేమతో నిండిన తన చూపులను వారిపై ప్రసరింప జేసి వారి హృదయములను స్పృశించెను: వారాయనను తమ హృదయముతలో భావించుచుండిరి.నీలవర్ణము గల ఆయన విశాలమగు - వక్షఃస్థలముపై లక్ష్మీదేవి శోభిల్లుచుండి ఆమెతో ఆయన స్వర్లోకమునకు చూడామణివంటి తన ధామమగు వైకుంఠమును శోభిల్లజేయుచున్నాడా యన్నట్లు ఉండెను.
పీతాంశుకే పృథునితంబిని విస్ఫురంత్యా
కాంచ్యాలిభిర్విరు తయూ వనమాలయా చ ।
వల్గుప్రకోష్ఠవలయం వినతాసుతాం సే
విన్యస్తహస్తమిత రేణ ధునానమబ్జమ్ ॥
శ్రీహరియొక్క విశాలమగు నితంబమునందు పీతాంబరము, దానిపై మొలనూలు ప్రకాశించుచుండెను. ఆయన కంఠమునందలి వన మాల చుట్టూ తుమ్మెదలు చేరి ఝంకారమును చేయుచుండెను. ఆయన ముంజేతులయందు కంకణములు సుందరముగా నుండెను. ఆయన ఒక చేతిని వినతాకుమారుడగు గరుడునిపై వేసి, మరియొక చేతితో పద్మ మును విలాసముగా త్రిప్పుచుండెను.
విద్యుత్ క్షిపన్మకరకుండలమండనార్హ-
గండస్థలోన్నసముఖం మణిమత్కిరీటమ్ ।
దోర్దండషండవివరే హరతా పరార్ద్య
హారేణ కంధరగతేన చ కౌస్తుభేన ॥
శ్రీహరియొక్క చెవులకు గల మకరాకారపు కుండలములు తమ కాంతిచే మెరుపులను తల దన్నుచూ చెక్కిళ్లకు శోభను చేగూర్చుచుండె ను. ముఖము ఎత్తైన ముక్కుతో ప్రకాశించుచుండెను. ఆయన మణులను పొదిగిన కిరీటమును దాల్చియుండెను. నాలుగు భుజదండముల మధ్యలో చాల గొప్ప హారము విహరించుచుండెను. మెడనుండి త్రాటితో వ్రేలాడే కౌస్తుభమాణిక్యముతో వక్షఃస్థలము ప్రకాశించుచుండెను.
అత్రోపసృష్టమితి చోత్స్మితమిందిరాయాః
స్వానాం ధియా విరచితం బహుసౌష్ఠవాడ్యమ్ ।
మహ్యం భవస్య భవతాం చ భజంతమంగం
నేముర్నిరీక్ష్య న వితృప్తదృశో ముదా కైః ॥
లక్ష్మీదేవికి తన సౌందర్యము విషయములో గల గర్వము భగవా . నుని యెదుట తొలగిపోయినదని ఆయన భక్తులు భావన చేయుచుందురు. నాకు, శివునకు, మీకు ఉపాసన కోరకై ఆయన అతిశయించిన సౌందర్య ముతో కూడిన రూపమును ప్రకటించినాడు. అట్టి శ్రీహరిని ఆ మహర్షులు చూచిరి. కాని, ఎంత చూచినా వారికి తనివి తీరలేదు. వారు తలలను వంచి ఆయనకు ఆనందముతో నమస్కరించిరి.
తస్యారవిందనయనస్య పదారవింద-
కింజల్కమిశ్రతులసీమకరందవాయుః ।
అంతర్గతస్స్వవివరేణ చకార తేషాం
సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వోః ॥
పద్మములవంటి కన్నులు గల ఆ శ్రీహరియొక్క 'దములు పద్మములను, కాలి వ్రేళ్లు ఆ పద్మముల కేసరములను పోలియా ఎండెను. ఆ పాదపద్మముల మకరందముతో కూడిన తులసీగంధను మ్రోసుకొని వచ్చిన వాయువు ఆ మహర్షుల ముక్కు పుటముల గుం లోపలికి ప్రవే శించెను. వారు బ్రహ్మనిష్ఠ గలవారే అయినను', అది వారి మనస్సులకు ఆనందాతిశయమును, దేహములకు రోమాంచమును కలిగించెను.
తే వా అముష్య వదనాసితపద్మకోశ-
ముద్వీక్ష్య సుందరతరాధరకుందహాసమ్ ।
లబ్దాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రి-
ద్వంద్వం నఖారుణమణిశ్రయణం నిదధ్యుః ॥
ఆ మహర్షులు శ్రీహరియొక్క మిక్కిలి అందమగు క్రింది పెదవిని, దానిపై విరిసే మల్లెలవంటి చిరునవ్వును, నల్లకలువ మొగ్గవంటి ముఖమును తలలను పైకెత్తి చూచిరి. వారి మనోరథము ఈడేరెను. మరల, పద్మరాగమాణిక్యములవంటి గోళ్లను, వాటికి ఆశ్రయమగు రెండు పాదము లను తలలను క్రిందికి దించి చూచిరి. తరువాత వారాయనను ధ్యానించిరి.
పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైః
ధ్యానాస్పదం బహు మతం నయనాభిరామమ్ ।
పౌంస్నం వపుర్దర్శయానమనన్యసిద్దైః
ఔత్పత్తి కైస్సమగృణన్ యుతమష్టభోగైః ॥
ఈ లోకములో మానవులు యోగమార్గముల ద్వారా మోక్షమును పొందగోరి కన్నులకు పండువయగు ఆ పురుషోత్తముని రూపమును అత్యా దరముతో ధ్యానించుచుందురు. శ్రీహరి అట్టి రూపమును ఆ మహర్షులకు దర్శనమిచ్చెను. ఇతరులలో కానరాని అణిమ మొదలగు అష్టైశ్వర్యములు ఆయనలో సహజసిద్దముగా నున్నవి. అట్టి భగవానుని ఆ మహర్షులు చక్కగా స్తుతించిరి.
కుమారా ఊచుః ।
యోఽoతర్షితో హృది గతోపి దురాత్మనాం త్వం
సోఽద్యైవ నో నయనమూలమనంత రాద్దః ।
యర్హ్యేవ కర్ణవివరేణ గుహాం గతో నః
పిత్రానువర్ణితరహా భవదుద్భవేన ॥
కుమారులు ఇట్లు పలికిరి --- ఓ అనంతుడా! నీవు దుష్టులకు హృదయమునందే భాసించుచున్ననూ దాగియుందువు. అట్టి నీవు ఈనాడు మా కన్నులకు కానవచ్చుచున్నావు. నీనుండి జన్మను పొందిన మా తండ్రిగారు ఏనాడు నీ స్వరూపముయొక్క రహస్యమును మాకు వర్ణించి చెప్పినారో, ఆనాడే నీవు చెవి రంధ్రముల గుండా మా హృదయ (బుద్ధి) గుహలో ప్రవేశించియున్నావు.
తం త్వాం విదామ భగవన్ పరమాత్మతత్త్వం
సత్త్వేన సంప్రతి రతిం రచయంతమేషామ్ ।
యత్తేఽనుతాపవిదితైర్దృఢభక్తియోగైః
ఉద్గృoథయో హృది విదుర్మునయో విరాగాః! ॥
ఓ భగవానుడా! నీవిప్పుడు నీ భక్తులమగు మా యెదుట నీ శుద్ధ సత్త్వప్రధానమగు సగుణరూపమును దర్శనమిచ్చి ప్రీతిని కలిగించినావు. ఈ సగుణరూపమే శాస్త్రప్రసిద్ధమైన ఉత్కృష్టమగు ఆత్మతత్త్వమని మేము గుర్తించుచున్నాము. అహంకారము, రాగము లేని మననశీలురగు భక్తులు నీ అనుగ్రహముచే దృఢమగు భక్తియోగమును పొందినవారై, ఆ ఆత్మత త్వమును తమ హృదయములో సాక్షాత్కరించుకొనుచున్నారు.
నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం
కింత్వన్యదర్పితభయం భువ ఉన్నయైస్తే ।
యేంఽగ త్వదంఘ్రిశరణా భవతః కథాయాః
కీర్తన్యతీర్థయశసః కుశలా రసజ్ఞాః ॥
ఓ శ్రీహరీ! నీ భక్తులు, ధర్మాధర్మ (నిత్యానిత్య) వివేకము గల నేర్పరులు. వారు కేవలము నీ పాదములను మాత్రమే శరణు జొచ్చియుం దురు. కీర్తించదగిన పవిత్రమగు కీర్తి గల నీ గాథల రసము వారికి యెరుక యే. వారు నీ అనుగ్రహముచే లభించే మోక్షమునైననూ లెక్కచేయరు. నీ కనుబొమల విరుపులచే గడగడలాడే (కాలమునకు లోబడియుండే) ఇంద్రా దుల పదవులను వారు లెక్క చేయరని వేరుగా చెప్పవలయునా?
కామం భవస్స్వవృజినెర్నిరయేషు నః స్తా-
చ్చేతోఽలివద్యది ను తే పదయో రమేత ।
వాచశ్చ నస్తులసివద్యది తేంఽఘిశోభాః
పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రః ॥
మా మనస్సులు తుమ్మెదల వలె నీ పాదపద్మములయందు మాత్రమే రమించే పక్షములో, మా వాక్కులు తులసి వలె నీ పాదముల సంబంధముచే (వర్ణనలచే) శోభిల్లే పక్షములో, మా చెవుల రంధ్రములు నీ గుణగణముల గానముచే పూరించబడే పక్షములో, మాకు మా పాపముల నిమిత్తముగా యథేచ్ఛగా నరకములో జన్మ కలుగుగాక! అట్టి జన్మకు మా అభ్యంతరము లేదు.
ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం
తేనేశ నిర్వృతిమవాపురలం దృశో నః ।
తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ
యోఽనాత్మనాం దురుదయో భగవాన్ ప్రతీతః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే పంచదశోఽధ్యాయః ॥
విపులమగు కీర్తి గల ఓ పరమేశ్వరా! నీవు నీ ఈ రూపమును మా యెదుట ఆవిర్బవింప జేసితివి. భగవానుడవగు నీవు ఈ విధముగా మా యెదుట ప్రత్యక్షమైతివి. మా కన్నులు అతిశయించిన ఆనందమును పొందినవి. మనోజయము లేనివారు నిన్ను తెలియజాలరు. ఇదిగో ! చేతు లెత్తి నీకు నమస్కరించుచున్నాము.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదునైదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
To explain the cosmic anxiety caused by the unmanifested pregnancy of Diti, Maitreya describes the divine realm of Vaikunṭha, the eternal abode of Supreme Lord Vishṇu where free will exists in pure loving harmony without envy or fear. He recounts how the Four Kumāras once traveled to Vaikunṭha and were stopped at the seventh gate by the two royal guardians, Jaya and Vijaya, who failed to recognize the exalted stature of the infant-like sages.