10 - బ్రహ్మగారు ఆవిర్భవించుట

మైత్రేయ ఉవాచ

సత్సేవనీయో బత పూరువంశో యల్లోకపాలో భగవత్పృధానః

బభూవిథేహాజితకీర్తిమాలాం పదే పదే నూతనయస్యభీక్ష్ణమ్

మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఆశ్చర్యము! భగవద్భక్తాగ్రగణ్యు డవు, లోకపాలుడగు యముని అంశచే జన్మించినవాడవు అగు నీవు జన్మించుటచే పూరువంశము సత్పురుషులకు సేవించదగినదిగా అయిన ది. నీవు ప్రతి పదమునందు ఆ శ్రీహరియొక్క కీర్తిమాలను నిత్యనూత నముగా చేయుచున్నావు.

సోఽహం నృణాం క్షుల్లసుఖాయ

దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య

ప్రవర్తయే భాగవతం పురాణం

యదాహ సాక్షాద్భగవానృషిభ్యః

ఓ పూజ్యా! నీవు జ్ఞానాధికులలో శ్రేష్టుడవు. నేను ఇంతేగాక నిన్ను మరికొన్ని విషయములను కూడ ప్రశ్నించియుంటిని. వాటిని నీవు ఒక క్రమ ములో నాకు చెప్పి, మా సంశయములనన్నింటినీ తొలగించుము.

సూత ఉవాచ

ఏవం సంచోదిత స్తేన క్షత్తృ కౌషారవో మునిః

ప్రీతః ప్రత్యాహ తాన్ ప్రశ్నాన్ హృదిస్థానథ భార్గవ

సూతుడు ఇట్లు పలికెను --- ఓ శౌనక మహర్షీ! అపుడు విదురు నిచే ఈ విధముగా ప్రేరేపించబడిన మైత్రేయ మహర్షి సంతోషించి, తన హృదయములోనున్న ఆ ప్రశ్నలకు సమాధానమును చెప్పెను.

మైత్రేయ ఉవాచ

విరించోఽపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః

ఆత్మన్యాత్మానమావేశ్య యదాహ భగవానజః

తద్విలోక్యాబ్జసంభూతో వాయునా యదధిష్ఠితః

పద్మమంభశ్చ తత్కాలకృతవీర్యేణ కంపితమ్

ఆ ప్రళయకాలము వాయువునకు గొప్ప శక్తిని కలిగించెను. అట్టి వాయువు ఆ ప్రళయజలములను మరియు బ్రహ్మగారిచే అధిష్టించబడియున్న పద్మమును కంపింప జేయుచుండెను. పద్మమునుండి పుట్టిన బ్రహ్మగారు ఈ సంగతిని గమనించెను.

తపసా హ్యేధమానేన విద్యయా చాత్మసంస్థయా

వివృద్ధవిజ్ఞానబలో న్యపాద్వాయుం సహాంభసా

ఉత్తరోత్తరాభివృద్ధి గల తపస్సుచే మరియు హృదయమునందు నెలకొన్న ఆత్మజ్ఞానముచే బ్రహ్మగారి విజ్ఞానశక్తి విశేషముగా వర్ధిల్లియుం డెను. ఆయన ఆ వాయువును నీటిని కూడ త్రాగివేసెను.

తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితమ్

అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీత్యచింతయత్

ఆకాశమును వ్యాపించియున్న పద్మమునందు ఆసీనుడై యున్న బ్రహ్మ ఆ పద్మమును చూచి, దీనితోనే నేను గడచిన కల్పముయొక్క అంతమునందు విలీనమై పోయిన లోకములను మరల సృష్టించెదను అని తలపోసేను.

పద్మకోశం తదాఽఽవిశ్య భగవత్కర్మచోదితః

ఏకం వ్యభాంక్షీదురుధా త్రిధా భావ్యం ద్విసప్తధా

శ్రీహరి భగవానుడు బ్రహ్మను కర్తవ్యకర్మయగు సృష్టియందు నియోగించెను. అపుడా బ్రహ్మ పదునాలుగు భువనములుగా గాని, అంత కంటే అధికముగా గాని అగుటకు శక్తి గల ఆ పద్మకోశమును అధిష్ఠించి, దానిని మూడుగా విభాగము చేసెను.

ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేదస్పమాహృతః

ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠ్యనీ

జీవులు తమ కర్మఫలమును అనుభవించే స్థానములు ఈ ముల్లోక ములేనని శాస్త్రములలో చెప్పబడినది. మానవుడు నిష్కామకర్మను ఆచ రించినచో, దాని ఫలరూపముగా బ్రహ్మలోకమును పొందును.

విదుర ఉవాచ

యదాత్థ బహురూపస్య హరేరద్బుతకర్మణః

కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయ నః ప్రభో

విదురుడు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! మైత్రేయ మహర్షీ! ఆశ్చ ర్యకరమగు లీలలను చేయుచూ అనేకరూపములలో ప్రకటమయ్యే శ్రీహరి యొక్క కాలము అనే శక్తిని గురించి నీవు చెప్పియుంటివి. దానిని మాకు యథాతథముగా వివరించి చెప్పము.

మైత్రేయ ఉవాచ

గుణవ్యతికరాకారో నిర్విశేషోఽప్రతిష్ఠితః

పురుషస్తదుపాదానమాత్మానం లీలయాసృజత్

సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతిలో వచ్చే మార్పే కాలము యొక్క రూపము. ఆద్యంతములు లేని ఆ కాలమునందు విశేషములు (అ వయవములు) వాస్తవముగా లేవు. భగవానుడు స్వరూపముచే రూపము లేనివాడే అయిననూ, ప్రకృతియొక్క పరిణామమును ఉపాధిగా స్వీకరించి సగుణ సాకారుడగుచున్నాడు. తన మహిమయందు ప్రతిష్ఠితుడైన ఆ భగ వానునకు మరీయొక ప్రతిష్ట (ఆశ్రయము) లేదు. ఆయన ఆ కాలమును ఉపాదానము (ముడిసరుకు) గా చేసుకొని లీలచే తనను తానే జగద్రూప ముగా ప్రకటించుచున్నాడు.

విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా

ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేనావ్యక్తమూర్తీనా

విష్ణుభగవానుని మాయచే ఈ విశ్వము విలీనమై బ్రహ్మగారి రూ పములో మాత్రమే నుండెను. ఆయన స్వయముగా నిర్విశేషమగు స్వరూ పము గల కాలము ద్వారా దానిని భిన్నముగా ప్రకటింప జేసెను.

యథేదానీం తథాగ్రే చ పశ్చాద ప్యేతదీదృశమ్

సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః

ఈ జగత్తు ఇప్పుడు ఏ విధముగా నున్నదో, పూర్వమునందు కూడ అటులనే ఉండెడిది; భవిష్యత్తులో కూడ అటులనే ఉండగలదు. దీని సృష్టి ప్రాకృతము మరియు వైకృతము అను భేదముచే తొమ్మిది విధము లుగా నున్నది' (ఉభయాత్మకమగు పదవ భేదము కూడ గలదు).

కాలద్రవ్యగుణైరస్య త్రివిధః ప్రతిసంక్రమః

ఆద్యస్తు మహతస్సర్గో గుణవైషమ్యమాత్మనః

ఈ సృష్టికి కాలము ద్రవ్యము మరియు గుణములు అనువాటి ద్వారా క్రమముగా నిత్య నైమిత్తిక ప్రాకృత ప్రళయములు అనే మూడు విధముల ప్రళయములు కలుగును. బ్రహ్మాత్మనుండి మాయాశక్తి యొక్క సత్త్వ రజస్తమోగుణముల సామ్యావస్థలో వచ్చిన వైషమ్యము కారణముగా మొట్టమొదట మహత్తత్త్వము (సమష్టి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమాహారము) పుట్టినది.

ద్వితీయస్త్వహమో యత్ర ద్రవ్యజ్ఞానక్రియోదయః

భూతసర్గస్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్యశక్తిమాన్

అహంకార సృష్టి రెండవది. పంచభూతములు జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియములు ఆ అహంకారమునుండి పుట్టినవి. మూడవది అయిదు సూక్ష్మమహాభూతముల సృష్టి. ఈ సూక్ష్మభూతములలో ఈ స్థాయిలో ఇంకనూ పరస్పర సమ్మేళనము లేదు. పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము అనే అయిదు స్థూలమహాభూతములను ప్రకటిఠాప జేసే శక్తి ఈ సూక్ష్మభూతములయందు గలదు.

చతుర్థ ఐంద్రియస్సర్గో యస్తు జ్ఞానక్రియాత్మకః

వైకారికో దేవసర్గః పంచమో యన్మయం మనః

జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల సృష్టి నాల్గవది. ప్రకృతివికారమగు అహంకారముయొక్క సాత్త్వికాంశమునుండి ఇంద్రియాధిష్టాన దేవతలు మరియు మనస్సు ప్రకటమగును. ఇది అయిదవ సృష్టి.

షష్ఠస్తు తమసస్సర్గో యస్త్వబుద్ధికృతః ప్రభో

షడిమే ప్రాకృతాస్సర్గా వైకృతానపి మే శృణు

ఓ విదురా! జీవులకు ఆవరణము (ఉన్నది కానరాకుండుట) మరియ విక్షేపము (లేనిది కానవచ్చుట) లను కలిగించే అవిద్యనుండి ఆరవ సృష్టి (తామిస్రము మొదలైనవి) వచ్చినది. ఈ ఆరు ప్రాకృత (త్రిగు భౌత్మికయగు ప్రకృతికి చెందిన) సర్గములు. నేనిప్పుడు వైకృత (సమష్టి స్వరూపుడగు బ్రహ్మగారి) సర్గములను చెప్పెదను. వినుము.

రజోభాజో భగవతో లీలేయం హరిమేధసః

సప్తమో ముఖ్యసర్గస్తు షడ్విధస్తస్థుషాం చ యః

శ్రీహరిని బుద్ధిలో చింతించువారలకు సంసారము హరించిపోవు ను. ఆయన రజోగుణమును ఉపాధిగా స్వీకరించి బ్రహ్మరూపములో ఈ సృష్టి అనే లీలను చేసినాడు. ఇక ఏడవది చెట్టుచేమల సృష్టి. మానవునకు ముఖము వలె ఇది వైకృతసర్గములలో మొట్టమొదటిది గనుక, ముఖ్యసర్గ మనబడుచున్నది. ఇది ఆరు విధములుగా నున్నది.

వనస్పత్యోషధిలతాత్వక్సారా వీరుధో ద్రుమాః

ఉతోతసస్తమఃప్రాయా అంతస్స్పర్శా విశేషిణః

ముఖ్యసర్గములో వనస్పతులు (పువ్వు లేకుండగనే ఫలముల నిచ్చే రావి మొదలగు చెట్లు), ఓషధులు (ఫలములు పక్వమగుట తోడనే నశించే వరి మొదలగు మొక్కలు), లతలు (ఏదో ఒక చెట్టు మొదలగు ఆసరాను ఆశ్రయించుకొని పెరిగే మల్లె మొదలగు తీగలు), త్వకార ములు (బలమైన బెరడు గల వెదురు మొదలగు ఆశ్రయమున పేక్షించని తీగలు), వీరుధములు (పొదలు) మరియు ద్రుమములు (పువ్వు కాయ అనే వరుసలో ఫలించే మామిడి మొదలగు చెట్లు) అనే ఆరు రకములు గలవు. వీటి అన్నిటియందు పోషకరసము క్రింద నేలనుండి పైకి ప్రవహిం చును. వీటియందు తమోగుణము ప్రధానమగుటచే, అంతఃకరణవికాసము చాల తక్కువగా నుండును. ఇవి తమ లోపల స్పర్శగుణమునను భవించు ను. వీటిలో అనేకభేదములు ఉండుటయే గాక, ప్రతి దానియందు ఎదో ఒక విశేషగుణము ఉండును.

తిరశ్చామష్టమస్సర్గస్సోఽష్టావింశద్విధో మతః

 అవిదో భూరితమసో ఘ్రాణజ్ఞా హృద్యవేదినః

పశుపక్ష్యాదుల సృష్టి ఎనిమిదవది. దీనియందు ఇరవై ఎనిమిది రకములు గలవు. ఈ ప్రాణులలో తమోగుణము అధికముగా నుండుటచే, వీటికి కాలముయొక్క అనుభవము ఉండదు. ఇవి ఘ్రాణేంద్రియముతో మాత్రమే పదార్థములను తెలుసుకొనును. వీటికి బుద్ధియందు సుఖము మొదలగునవి తెలిసిననూ, విచారశక్తి ఉండదు.

గౌరజో మహిషః కృష్ణస్సూకరో గవయో రురుః

 ద్విశఫాః పశవ శ్చేమే అవిరుష్ట్రశ్చ సత్తమ

ఓ సాధుపురుషా! విదురా! ఆవు (ఎద్దు), మేక, గేదె (దున్న), కృష్ణ మృగము (నల్ల జర్రీ), పంది, గురుపోతు, దుప్పి, గొర్రె మరియు ఒంటె అనే ఈ తొమ్మిది పశువుల కాళ్లకు రెండు డెక్కలు ఉండును.

ఖరోఽశ్వోఽశ్వతరో గౌరశ్శరభశ్చమరీ తథా

ఏతే చైకశఫాః క్షత్తః శృణు పంచనఖాన్ పశూన్

ఓ విదురా! గాడిద, గుర్రము, కంచరగాడిద, గౌరము (గేదెవంటి ఒక మృగము), శరభము (ఎనిమిది కాళ్లు గల మృగము), చమరీ అనే ఆరు మృగములు ఒక గిట్ట గలవి. ఇపుడు ఒక కాలికి అయిదు గోళ్లు గల మృగములను (పంచనఖములు) చెప్పెదను. వినుము.

శ్వా సృగాలో వృకో వ్యాఘ్రో మార్జారశ్శశశల్లకౌ

 సింహః కపిర్గజః కూర్మో గోధా చ మకరాదయః

 కంకగృధ్రవట శ్యేనభాసభల్లకబర్షిణః

 హంససారసచక్రాహ్వకాకోలూకాదయః ఖగాః

  కుక్క, నక్క, తోడేలు, పెద్దపులి, పిల్లి, చెవుల పిల్లి, ఏదుపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము అనే పన్నెండు భూచరము లగు పంచనఖములు. మొసలి మొదలగు జలచరములు, రాబులుగు, గద్ద, గవ్వపక్షి, డేగ, రాబందు, భల్లూకము, నెమలి, హంస, బెగ్గురు, జక్కవపిట్ట, కాకి, గుడ్లగూబ మొదలగు పక్షులు కలిసి భూచరములు కాని ఇరవై ఎనిమిదవ వర్గము.

అర్వాక్స్రోతస్తు నవమః క్షత్తరేకవిధో నృణామ్

రజోఽధికాః కర్మపరా దుఃఖే చ సుఖమానినః

ఓ విదురా! మానవులలో ఆహారప్రవాహము నోటినుండి క్రిందకు ఉండుటచే ఈ తొమ్మిదవ సర్గము అర్వాక్-ప్రోతస్సు అనబడును. మానవులందరు ఒకే విధముగా నున్నారు. మానవులు రజోగుణము అధికముగా గలవారగుటచే కర్మలలో మునిగి తేలుచుందురు. మానవులు దుఃఖాత్మకములగు విషయభోగములయందు సుఖమున్నదని తలపోయుచుందురు.

వైకృతాస్తృయ ఏవైతే దేవసర్గశ్చ సత్తమ

 వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తూభయాత్మకః

          ఓ సాధుపురుషా! విదురా! పైన చెప్పిన మూడు సర్గములు వైకా రిక సర్గములు. దేవసర్గము కూడ వైకారిక సర్గమే. సాత్త్వికాహంకారము నుండి వచ్చిన ఇంద్రియాధిష్టాన దేవతల సర్గము (ప్రాకృతము) పూర్వమే చెప్పబడినది. కౌమారసర్గము వైకృత మరియు ప్రాకృత అనే రెండు కోవ లకు చెందినది.

దేవసర్గశ్చాష్టవిధో విబుధాః పితరోఽసురాః

గంధర్వాప్సరసస్సిద్ధా యక్షరక్షాంసి చారణాః

 భూతప్రేతపిశాచాశ్చ విద్యాధ్రాః కిన్నరాదయః

దశైతే విదురాఖ్యాతాస్సర్గాస్తే విశ్వసృక్కృతాః

దేవతలు, పితృదేవతలు, అసురులు, గంధర్వాప్సరసలు, యక్షరాక్షసులు, సిద్దచారణవిద్యాధరులు, భూతప్రేతపీశాచములు, కిన్నరకింపురుషాదులు అని దేవసర్గము ఎనిమిది విధములుగా నున్నది. విదురా! ఈ విధముగా బ్రహ్మగారిచే చేయబడిన పది విధముల సృష్టిని నీకు చెప్పితిని.

అతః పరం ప్రవక్ష్యామి వంశాన్ మన్వంతరాణి చ

ఏవం రజఃప్లుతస్సృష్టా కల్పాదిష్వాత్మభూర్హరిః

 సృజత్యమోఘసంకల్ప ఆత్మైవాత్మానమాత్మనా

ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే తృతీయస్కంధే  దశమోऽధ్యాయః

 ఇటుపైన నేను వంశములను మరియు మన్వంతరములను వర్ణించెదను. కల్పముల ఆదియందు సత్యసంకల్పుడగు శ్రీహరి రజోగుణమును ఉపాధిగా స్వీకరించి, సృష్టికర్త మరియు స్వయంభువుడు అగు బ్రహ్మ రూపములో ఈ సృష్టిని తన ఇచ్ఛచే తనయందు ప్రకటించును.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదవ అధ్యాయము ముగిసినది (10).