శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
29 - పురంజనోపాఖ్యానము - ప్రాచీనబర్హిష నారద సంవాదము
ప్రాచీనబర్హిష మహారాజు ఇట్లు పలికెను --- ఓ పూజ్యా! నీ వచ నము నాకు బాగుగా తెలియలేదు. నీవు చెప్పుదానిని జ్ఞానులు తెలియగల రు. కర్మల మోహములో పడియున్న నావంటి వారలకు నీ వచనములు తెలియ రావు.
పురంజనుడే జీవుడు. ఈ జీవుడు తన కొరకై ప్రారబ్ధకర్మానుసార ముగా ఒక దేహము అనే పురమును తయారు చేసుకోనును. ఆ దేహము నకు ఒకటి, రెండు, మూడు, నాలుగు లేక అనేకములగు పాదములు ఉండ వచ్చును. లేదా, పాదములు అసలే లేకపోవచ్చును.
ఆ జీవునకు ఈశ్వరుడే మిత్రుడు. జీవులు ఆ మిత్రుని పేర్లను గాని, చేష్టలను గాని, గుణములను గాని తెలియలేకున్నారు. కావుననే, ఆ మిత్రునకు అవిజ్ఞాతుడు అని పేరు వచ్చినది.
జీవుడు ప్రకృతియొక్క సత్త్వరజస్తమోగుణకార్యములగు సుఖదుఃఖమోహములను పూర్తిగా అనుభవించగోరెను. అప్పుడు ఆతడు పైన చెప్పిన దేహములలో రెండు కాళ్లు, రెండు చేతులు, తొమ్మిది ద్వార ములు గల మనుష్యదేహమును, ఇది బాగున్నది యని తలచెను.
సుందరయువతియగు పురంజని బుద్ది అని తెలియవలెను. జీవుడు ఆ బుద్ధి వలననే నేను, నాది అనే అభిమానమును కలిగియున్నా డు. ఆ బుద్ధితోడి తాదాత్మ్యము వలననే జీవుడు ఈ దేహములో ఇంద్రియ ముల ద్వారా సత్త్వరజస్తమోగుణముల కార్యములగు సుఖదుఃఖమోహము లను (భోగములను) అనుభవించుచున్నాడు.
అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు వెరసి పది పురంజమని మిత్రులు. వాటి ద్వారానే జీవుడు క్రమముగాకర్మలను చేయుచూ, జ్ఞానమునార్జించుచున్నాడు. ఆ ఇంద్రియముల వ్యాపారములగు శబ్దాదులు పురంజని చెలికత్తెలు. ప్రాణశక్తి దేహములో ప్రాణ-అపానవ్యాన-ఉదాన-సమానములనే అయిదు వ్యాపారములను చేయుచున్నది. కావుననే, అది అయిదు పడగల పాముతో పోల్చబడినది. పురపాలకుడగు సర్పము అదియే.
జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను కూడ ఆయా వ్యాపార ములలో నడిపించే మనస్సు గొప్ప బలము గల భటుడు. శబ్దరూపరసన ర్శగంధములనే అయిదు విషయములు కలిసి పంచాలదేశము. ఆ ఇంద్రి యముల మధ్యలోని తొమ్మిది రంధ్రముల పురము శరీరమే.
ఒకే చోట రెండేసి ద్వారములు గలవని చెప్పబడినది. అవి రెండు కన్నులు, రెండు ముక్కు పుటములు, రెండు చెవులు, నోరు, జననవిసర్జ నేంద్రియములతో కలిసి వెరసి తొమ్మిది ద్వారములు. జీవుడు ఆయా ఇంద్రియముల ద్వారా జగత్తులోని విషయములలోనికి వెళ్లుచుండును.
రెండు కన్నులు, రెండు ముక్కు పుటములు, నోరు అనునవి తూర్పుదిక్కునందలి అయిదు ద్వారములు. కుడి చెవి దక్షిణదిక్కునందలి ద్వారము. ఎడమ చెవి ఉత్తరదిక్కునందలి ద్వారము.
ఈ దేహములో క్రిందనుండే జననవిసర్జనేంద్రియములే పడమర దిక్కునందలి రెండు ద్వారములు. ఈ పురములో ఒకే చోట ఖద్యోతము (సూర్యుడు, లేక మిణుగురు పురుగు), ఆవిర్ముఖము (ప్రకాశించే ముఖము) అనే రెండు ద్వారములు నిర్మించబడినవని చెప్పబడినది. అవియే రెండు కన్నులు. రూపమే విభ్రాజిత (బాగుగా ప్రకాశింపజేయబడిన) దేశ ము. ఈ పురమునకు ప్రభువగు జీవుడు నేత్రేంద్రియము (ద్యుమంతుడు అనే మిత్రుడు, ప్రకాశము గలవాడు) తో ఆ ద్వారముల గుండా రూప మును దర్శించుచున్నాడు.
నలిని నాలిని (తామర తీగలు) అనే రెండు ద్వారములు ముక్కు పుటములు. గంధము సౌరభదేశము (పరిమళము). ఘాజేంద్రియము అవ ధూతుడనే (గాలి వీచుట) మిత్రుడు. ముఖ్యమనే ద్వారము నోరు. వాగింద్రి యమే విపణుడనే (లోకవ్యవహారము, స్తుతి) మిత్రుడు. రసనేంద్రియము రసజ్ఞుడనే (రుచిని తెలియుట) మిత్రుడు.
ఈ పరోక్షకథనములో వాగింద్రియముయొక్క వ్యాపారమగు సంభాషణమే ఆపణుడనే మిత్రుడు. రకరకముల ఆహారమే బహూదన దేశము. ఎడమ చెవి పితృహు అనే ద్వారము కాగా, కుడి చెవి దేవహూ అనే ద్వారము.
మానవుడు కర్మకాండరూపమగు వేదమును విని, కర్మలనను ష్ఠించి, మరణించిన పిదప పితృయానమార్గములో వెళ్లును. ఈ కర్మకాం డయే దక్షిణపంచాలమనబడినది. జ్ఞానకాండరూపమగు వేదమును విని ఉపాసనలను చేయు సాధకుడు దేవయానమార్గమును పొందును. ఈ కాండకు ఉత్తరపంచాలమని పేరు పెట్టబడినది. వినుటకు సహకరించే చేవియే శ్రుతధరుడు అనే మిత్రుడు.
క్రిందనుండే జననావయవము ఆసురి (భోగ లంపటత్వము) అనే ద్వారము. యువతీసంగమే విషయలాలసులకు ప్రియమగు గ్రామకదే శము. జననేంద్రియమే దుర్మదుడనే మిత్రుడు. నిరృతి అనే ద్వారము విస ర్జనావయవమునకు ప్రతీక.
వైశస యాతనలు) దేశమే నరకము. విసర్జనేంద్రియమే లుబ్దకు డనే మిత్రుడు. ఇద్దరు అంధుల (క్రియయే గాని, జ్ఞానము లేకుండుట) రహ స్యమును చెప్పెదము. వినుము. వారు చేతులు, కాళ్లే. మానవుడు చేతు లతో పనులను చేయును; కాళ్లతో నడచును.
అంతఃపురము హృదయమునకు ప్రతీక. దానిలోని విషూచీనుడనే ప్రధాన సేవకుడు మనస్సే. జీవుడు మనస్సులోని సత్త్వగుణమును బట్టి ప్రసన్నతను, రజోగుణమును బట్టి హర్షమును, తమోగుణమును బట్టి వ్యామోహమును పొందుచుండును.
బుద్ధి స్వప్నములో వికారములను పొందుచుండును. జాగ్రత్తులో ఇంద్రియములయందు వికారములను కలిగించుచుండును. బుద్దియొక్క సత్త్వరజస్తమోగుణములు వివేకము లేకుండుటచే ఆత్మయందు ఆరోపించ. బడి, ఆత్మ వాటిచే లేపమును పొందినట్లు అగును. ఆ కారణముచే ఆత్మ కేవలసాక్షియే అయి ఉన్ననూ, బుద్ది ఏయే వికారములను పొందునో, ఆత్మయే ఆయా వికారములను పొందుచున్నట్లు భాసించును.
దేహమే రథము. అయిదు ఇంద్రియములే (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము) దాని గుర్రములు. పుణ్యపాపములనిచ్చే ధర్మ-అధర్మములే దాని, చక్రములు. సత్త్వరజస్తమోగుణములే దాని జెండా కర్రలు. ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానములనే ప్రాణవృత్తులే దాని కమ్మీలు. సంవత్సరము కొలబద్దగా గల కాలప్రవాహమే దాని గమనము.
ఆ దేహమనే రథమునకు మనస్సే కళ్లేము. బుద్దియే సారథి. హృదయమే రథికుడు (జీవుడు) కూర్చుండే స్థానము, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములే (పరస్పరవిరుద్ధములగు స్థితులు) కూబరము (కొ డిని గట్టే మాను) ల జంట. శబ్దరూపరసస్పర్శగంధములే దానిలోని అరలు (ఆయుధములు), చర్మము, మూలుగు, మాంసము, వీర్యము, క్రొవ్వు, రక్త ము, ఎముకలు అనే ఏడు ధాతువులే (మౌలిక ద్రవ్యములు) దానిని రక్షించే ఆవరణములు.
దేహములోని అయిదు కర్మేంద్రియములే దేహము అనే రథము యొక్క అయిదు రకముల, బయటకు కానవచ్చే నడక. అయిదు కర్మేంద్రి యములు, అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు వెరసి ఈ పదకొండు ఆ రథములో పయనించే జీవుని సైన్యము. జీవుడు అయిదు జ్ఞానేంద్రియము లతో అయిదు విషయములను అధర్మముగా సంపాదించి వినోదించుటయే హింసతో కూడిన వేట. (సూనములనగా పొయ్యి, పన్నెకల్లు, చీపురు, రోలు, నీటి పాత్ర అనే అయిదు ఇంటి సామానులు. వీటిని వాడుటలో ప్రాణి హింపకు అవకాశము గలదు). ఇట్టి జీవుడు ఇంద్రియభోగములనే ఎండమా ని వెంట పరుగులెత్తుచున్నాడు. ఈ పరుగే వేటగా వర్ణించబడినది.
కాలము ప్రచండమగు వేగము గలది. దానికి కొలమానమగు. సంవత్సరమే చండవేగుడనే గంధర్వరాజు. దానిలోని మూడు వందల అరవై పగళ్లు గంధర్వులుడను, అన్నియే రాత్రులు గంధర్వహీలుగను రూపకము చేయబడినది. ఈ రాత్రింబగళ్లు ఒకదానివెంట మరియొకటి తిరుగుతూ, జీవుని ఆయుర్దాయమును హరించి వేయుచుండును.
కాలకన్యయే సాక్షాత్తుగా ముసలిదనము. లోకులు ముసలిదన మును ఇష్టపడరు. మరణమే యవనప్రభుడు. ఆతడు ప్రాణుల నాశము కొరకై ఈ కాలకన్యను తన చెల్లెలిగా స్వీకరించేను.
మనోవ్యాధులు, శరీరవ్యాధులు ఆ యవనప్రభుని పాదచారులగు సైనికులు. ప్రాణుల వినాశమును తొందరగా తెచ్చి పెట్టే పలు రకముల జ్వరములే ప్రజ్వారుడు (చండవేగుని తమ్ముడు).
ఈ విధముగా అజ్ఞానముచే కప్పబడిన వివేకము గల జీవుడు దేహమునందు ఆత్మభావము గలవాడై, వందయేళ్లు ఆధ్యాత్మిక-ఆధిభౌతి క-ఆధిదైవికదుఃఖముల ననుభవించుచుండును.
జీవుని యథార్థస్వరూపము నిర్గుణమగు ఆత్మ. కాని, ప్రాణము, ఇంద్రియములు, మనస్సుల ధర్మములను ఆత్మయందు ఆరోపించుటచే జీవుడు నిర్మాణమైనాడు. ఈ జీవుడు. దేహమునందు అహంకారము, దేహ మునకు సంబంధించినవాటియందు మమకారము గలవాడై, తనను కర్తగా భ్రమించి, అల్పములగు కోరికలను ధ్యానిస్తూ, వాటి కొరకై కర్మలను చేస్తూ, దేహమే తాననే అజ్ఞానములో జీవించుచుండును.
వ్యక్తి స్వతహాగా స్వయంప్రకాశస్వరూపుడు. గురువులకు గురు వగు భగవంతునకు, వ్యక్తియొక్క అంతరతమస్వరూపము (ఆత్మ) నకు భేదము లేదు. కాని, ఈ సత్యమునెరుంగని వ్యక్తి మాయాశక్తియొక్క సత్త్వ రజస్తమోగుణములనుండి పుట్టిన విషయభోగములయందు అధికమగు ఆసక్తిని కలిగియుండును.
సత్త్వరజస్తమోగుణముల కార్యములగు దేహేంద్రియాదుల యందు నేను, నాది అనే అభిమానము గల జీవుడు తన స్వాతంత్య మును కోల్పోయి వాటికి లోబడి కర్మలనాచరించును. ఆ కర్మలు సాత్త్వి కము గాని, రాజపము గాని, తామసము గాని కావచ్చును. కర్మల ఫలము ననుసరించి వానికి మరల జన్మ వచ్చును.
జీవుడు ఒకప్పుడు సాత్త్వికకర్మల వలన ప్రకాశము అధికముగా నుండే దేవాది లోకములను, మరియొకప్పుడు రాజస కర్మల వలన దుఃఖ బహుళములైన కర్మల ఆయాసము అధికముగా నుండే మనుష్యాది లోక ము (జన్మ) లను, ఇంకో సందర్భములో తామసకర్మలచే అజ్ఞానము దుఃఖము నిండియుండే పశుపక్ష్యాది జన్మలను పొందును.
అజ్ఞానముతో నిండియున్న ఈ జీవుడు తాను ఆయా గుణముల ప్రభావముచే చేసిన ఆయా కర్మలను అనుసరించి, దేవయోనిలో గాని, మనుష్యయోనిలో గాని, పశుపక్ష్యాదియోనిలో గాని, పురుషుడుగా గాని, స్త్రీగా గాని, నపుంసకుడుగా గాని జన్మించును.
ఆకలితో పరితపించే దీనమగు కుక్క ఇంటింటికీ తిరుగుచుండును. దైవానుగ్రహముననుసరించి దానికి ఒకప్పుడు బడితే పూజ జరుగును. మరియొకప్పుడు అన్నము లభించును. అదే విధముగా, కోరికలతో నిండిన మనస్సు గల జీవుడు ఉత్తమ (స్వర్గాది లోకములకు వెళ్లే మార్గ ములో గాని, అధమ (నరక) మార్గములో గాని పరిభ్రమించుచుండును, వానికి స్వర్గములో గాని, మనుష్యలోకములో గాని, నరకములో గాని దైవ ముచే నిర్ణయించబడిన సుఖము గాని, దుఃఖము గాని లభించుచుండును.
జీవునకు ఆధిదైవిక-ఆధిభౌతిక-ఆధ్యాత్మికములగు దుఃఖములలో ఒక్కదానినుండియైననూ పూర్తి విముక్తి లేదు. ఆయా దుఃఖములకు నివార డోపాయములున్ననూ, అవి తాత్కాలికములు మరియు అసమగ్రములు మాత్రమే.
తలపై పెద్ద బరువును మోయుచున్న వ్యక్తి ఆ బరువును భుజముల మీదికి మార్చుకోనును. బరువును మోయుట తప్పదు. దుఃఖము నకు నివారణోపాయములు అట్టివి మాత్రమే.
పాపమునేరుంగని ఓ మహారాజా! ఒక కర్మయొక్క ఫలమును మరియొక కర్మ పూర్తిగా తప్పించలేదు. ఏలయనగా, స్వప్నమునందలి స్వప్నము వలె, రెండు కర్మలయందు (కర్మ మరియు కర్మఫలభోగము అనే రెండింటియందు), నేను కర్తను మరియు భోక్తను అనే అజ్ఞానము వ్యాపించియే యున్నది.
వ్యక్తి స్వప్నములో మానసిక వాసనయే ఉపాధిగా గలవాడై సంచ రిస్తూ, స్వప్నము వాస్తవము కాకున్ననూ, స్వప్నదుఃఖముననుభవించును. అదే విధముగా, జగత్తులో దుఃఖమును కలిగించే పదార్థము మిథ్యయే అయిననూ, దానివలన కలిగే సంసారదుఃఖము తప్పుట లేదు.
ఆత్మ ఒక్కటియే సత్యము. జగత్తు అంతా మిథ్య. అయిననూ, ఆత్మస్వరూపుడగు జీవునకు అజ్ఞానముచే దుఃఖముల వరుస అయిన సంసారము కలుగుచున్నది. కావున, శ్రీహరియందు చేయబడే సర్వోత్తమ మగు నిష్కామభక్తి మాత్రమే అజ్ఞానమును పోగొట్టి, సంసారమున నివ ర్తింప జేయగలదు.
వాసుదేవ భగవానునియందు సరియగు పద్దతిలో ఏకాగ్రమగు చిత్తముతో చేయబడిన భక్తియోగము (భక్తి అనే పాధవాభ్యాసము) జ్ఞానవై రాగ్యములను ఉదయింప జేయును.
ఓ రాజర్షీ! పిత్యము. శ్రద్దతో అచ్యుతుని గాథలను వింటూ, మోక్ష శాస్త్రమును అధ్యయనము చేయుచున్న సాధకునకు తొందరలోనే ఆ భక్తి యోగము సిద్ధించును. భక్తియోగమునకు ఆలంబనము అచ్యుతుని గాథలే.
ఓ రాజా! పరోపకారపారీణులు, స్వచ్ఛమగు అంతఃకరణము గల వారు అగు భగవద్భక్తులు భగవానుని గుణముల కీర్తనను వినుటకు తొంద రపడే మనస్సును కలిగియుందురు. వారు ఎక్కడ ఉండెదరో అక్కడ, మహాత్ములచే కీర్తించబడే మధువైరియగు శ్రీహరియొక్క చరితము అనే శుద్ధమగు అమృతము వరదలై అంతటా పారుచుండును. ఓ మహారాజా! ఆ అమృతమును ఎవరైతే కథాశ్రవణమునందు నిమగ్నమైయున్న చెవు లతో తృప్తి లేకుండగా పానము చేసెదరో, వారికి ఆకలి దప్పికలు, భయ ము, దుఃఖము మరియు వ్యామోహము అనునవి దరి జేరవు.
జీవులకు ఈ భయము, శోకము, మోహము అనునవి అజ్ఞానము వలన కలుగుచున్నవి. వీటిచే నిత్యము పీడించబడే జీవులు శ్రీహరి గాథలు. అనే అమృతస్రోతస్సునందు ప్రీతిని చేయలేకున్నారు. ఇది నిశ్చయము.
ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మగారు, సాక్షాత్తు కైలాసాధిపతి . యగు శివభగవానుడు, స్వాయంభువ మనువు, దక్షుడు మొదలగు ప్రజాప తులు, సనకుడు మొదలగు నైష్ఠిక బ్రహ్మచారులు, మరీచి, అత్రి, అంగిరసు డు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు మరియు నేను మాత్రమే గాక, వాజ్మయమునంతను ఒడిసిపట్టిన బ్రహ్మవేత్తలెందరో ఆ పరమేశ్వరుని దర్శించుట కొరకై తపస్సును, ఉపాసనను, సమాధిని అను ష్ఠించుచున్నారు. కాని, సర్వసాక్షియగు ఆ పరమేశ్వరుని దర్శనము వారికి అగుట లేదు.
వేదము చాల పెద్దది. దానిని అధిగమించుట సంభవము కాదు. అట్టి పరబ్రహ్మరూపమేయరు వేదమును అధ్యయనము చేసిన వేదవేత్తలు మంత్రములలో బోధించబడిన ఈశ్వరుని ఇంద్రాదిపరిచ్చిన్నరూపములను యజ్ఞముల ద్వారా సేవించుచున్నారు. కాని, వారు కూడ ఆ పరమేశ్వరుని తత్త్వమును తెలియకున్నారు.
హృదయములో ఎవడైతే శ్రీహరి భగవానుని ఆరాధించునో, వానికి ఆ శ్రీహరియొక్క అనుగ్రహము కలుగును. ఆ అనుగ్రహముచే వాని మనస్సులో లోకవ్యవహారములపై మరియు వైదికములగు కామ్యక ర్మలపై ఉన్న దృఢమగు ఆసక్తి దూరమగును.
ఓ ప్రాచీనబర్హిష మహారాజా! మానవునకు అజ్ఞానముచే కామ్యక ర్మలయందు, ఇవియే పురుషార్థము అనే భ్రమ కలుగును. ఈ కర్మల వలన లభించే ఫలములను బోధించే వాక్యములు వినుటకు ఇంపుగా నున్న నూ, ఇవి పరమాత్మతత్త్వముయొక్క జాడనైననూ అరయజాలవు. కావున, కామ్యకర్మలే పురుషార్థము అనే భావనను కలిగి యుండకుము.
కామనలచే కలుషితమైన బుద్ధి గలవారై వేదతాత్పర్యమునేరుం గని అజ్ఞానులు వేదముల తాత్పర్యము కర్మలేనని చెప్పెదరు. అట్టివారలకు స్వయంప్రకాశస్వరూపుడగు జనార్దనుడే తమ ఆత్మరూపముగాను న్నాడనియు, ఇట్టి ఆత్మయే శాశ్వతమగు ఆనందలోకమనియు తెలియదు.
నీవు భూమండలమునంతను తూర్పువైపు కొనలు గల దర్భలను పరిచి, అనేకములగు పశువులను సంహరించి, నేను గొప్ప గొప్ప యజ్ఞ ములను చేసితిననే అభిమానముతో గర్వించి యున్నావు. సర్వోత్తమమగు కర్మ ఏదియో నీకు తెలియదు. శ్రీహరికి ప్రీతిని కలిగించునదియే కర్మ. శ్రీహరియందు మనస్సు నిలుచునట్లు చేయునదియే విద్య.
జగన్నియంతయగు శ్రీహరియే ప్రాణుల ఆత్మ. ఆయనయే సర్వ జగత్కారణము. ఆయన పాదమూలమే ప్రాణులకు ఆశ్రయము, రక్షకము. ఆ ఆశ్రయమును స్వీకరించు మానవులకు ఈ జన్మలోనే ఇక్కడనే కల్యాణము (జీవన్ముక్తి) కలుగును.
సర్వప్రాణులకు అత్యంతప్రియమైనది ఆత్మ. అట్టి ఆత్మ ఆ శ్రీహ రియే. కావున, శ్రీహరి వలన లేశమైననూ భయము లేదు. శ్రీహరియే ఆత్మ అనే ఈ సత్యమును తెలుసుకున్నవాడే జ్ఞాని. జ్ఞాని, శ్రీహరి ఒక్కటి యే. అట్టి జ్ఞానియే యథార్థమగు గురువు.
నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ పురుషశ్రేష్ఠా! ఇంతవరకు - నేను చెప్పిన దానితో నీ ప్రశ్నకు సమాధానము లభించినది. ఈ సందర్భ ములో నేను నీకు శాస్త్రజ్ఞులచే ఖచ్చితముగా నిర్ణయించబడిన రహస్యము నొకదానిని చెప్పెదను. వినుము.
ఒక మగలేడి చిన్న చిన్న గడ్డి పరకలను గతుకుతూ పుష్పవాటిక వద్దకు వచ్చి అచట ఆడు లేడితో కలిసి విహరించుచుండెను. దానికి తుమ్మెదల గుంపుల గానముపై ప్రీతి మెండు. ఇతరప్రాణులను సంహ రించి పొట్ట పోసుకునే తోడేళ్లు యెదుటనే ఉన్ననూ, అది గమనించలేదు. ఇంతలో కిరాతుడు వెనుకనుండి వచ్చి దానిని బాణముతో నేల గూల్చెను. మానవజీవితము ఇట్టిదియే సుమా! గమనించుము.
ఓ మహారాజా! యువతులే పైన చెప్పిన కథలోని పుష్పములు. పుష్పములకు, యువతులకు సమానలక్షణములు గలవు. యువతులకు ఆశ్రయమగు గృహమే పుష్పవాటిక. వ్యక్తి లేడితో పోల్చబడినాడు. ఆతడు తాను చేసుకున్న కామ్యకర్మలు పరిపక్వమైనప్పుడు నాలుక, జననేంద్రి యము మొదలగు ఇంద్రియముల ద్వారా ఏవో కొద్దిపాటి ఇంద్రియసుఖ ములననుభవించును. ఈ అల్పములగు సుఖములు పువ్వులలోని తేనె యొక్క పరిమళముతో పోల్చబడినవి. వ్యక్తి జీవితములో ఇట్టి సుఖముల వెంట పడుచునే యుండును. వీటి కొరకై ఒక యువతితో జతగట్టి ఆమె యందు దృఢమగు ఆసక్తిని పెంచుకొనును. భార్యాపుత్రాదులు అతిమనో హరముగా చెప్పే కబుర్లు తుమ్మెదల గుంపుల మధురధ్వనుల వంటివి. ఆ కబుర్లు చెవులకు చాల ఇంపుగా నుండుటచే, ఆతడు వాటియందు అతీశ యించిన లాలసతను కలిగియుండును. రాత్రింబగళ్లు మొదలగు కాలఖండ ములే ఆతని ముందుండే తోడేళ్ల గుంపు. అవి ఆతని ఆయుర్దాయమును నిరంతరముగా హరించివేయుచున్నవి. కాని, ఆతడా సంగతిని గుర్తిం చకుండా గృహములోని భోగములయందు లగ్నమై యున్నాడు. వెనుక కనబడకుండా వచ్చే కిరాతుడే యముడు. ఆ యముడు దూరమునుం డియే ఆతనిని హృదయములో కొట్టి గాయపరచును. అనగా, ఆతడు భగ్నాశుడై హృదయవేదనను అనుభవించును. అయ్యో! ఈ కథలో రూపక రీతిలో మృగముగా చెప్పబడిన వ్యక్తివి నీవేనని తెలియుము.
ఈ కథలో చెప్పిన లేడికి నీకు ప్రవృత్తిలో తేడా లేదు అని గమనిం చుము. బాహ్యశబ్దములయందు నిరంతరముగా పయనించే నీ చెవులను మనస్సులో ప్రత్యాహారము చేసి, మనస్సును బుద్దియందు విలీనము చేయుము. మిథ్యాభోగములయందు గట్టిగా తగుల్కొన్న జనులు గుంపు లుగా చేరి భోగములకు సంబంధించిన కబుర్లను చెప్పుకొనుచుందురు. ఇది గృహస్థాశ్రమలక్షణమై యున్నది. దీనిని విడిచి పెట్టుము. క్రమముగా నివృత్తిమార్గమును చేపట్టుము. జ్ఞానులు శరణు జొచ్చే శ్రీహరిని ప్రసన్ను నిగా చేసుకొనుము.
ప్రాచీనబరిష మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహాత్మా! పూజ్యుడవగు నీవు బోధించిన ఆత్మతత్త్వమును నేను విని, దానిని గురించి ఆలోచించితిని. కర్మలను బోధించే ఆచార్యులు ఈ ఆత్మతత్త్వమును బోధించరు. ఏలయన, వారికి ఇది తెలియదు. తెలిసియున్నచో, వారు ఏల బోధించకుందురు?
ఓ మహాత్మా! మా ఉపాధ్యాయులు చెప్పిన దానిని బట్టి నాకు ఈ ఆత్మతత్త్వము విషయములో పెద్ద సందేహము ఉండెడిది. దానిని మీరు పూర్తిగా తొలగించినారు. ఈ ఆత్మతత్త్వము విషయములో మహర్షులు కూడ భ్రాంతిపడెదరు. ఏలయన, ఇది ఇంద్రియములకు గోచరము కాదు.
వ్యక్తి ఇహలోకములో ఏ దేహముతో కర్మలను చేయునో, ఆ దేహమును ఇక్కడనే విడిచి పెట్టి పరలోకమునకు వెళ్లును. అచట ఆతడు మరి యొక దేహముతో ఆ కర్మల ఫలముననుభవించునని వేదవేత్తలు చెప్పు మాటలు అక్కడక్కడ వినవచ్చుచున్నవి. ఇది యెట్లు పొసగును? మనము వేదవిహితమైన కర్మను చేసిన వెంటనే అది అదృశ్యమగుచున్నది. అది పరలోకములో ఫలరూపముగా ప్రకాశించుట యెట్లు?
నారద మహర్షి ఇట్లు పలికెను --- వ్యక్తి ఇహలోకములో కర్తృత్వ భోక్తృత్వవిశిష్టమగు మనస్సుతో సంకల్పించి కర్మలను చేయును. అదే వ్యక్తి స్వయముగా పరలోకములో అదే సూక్ష్మశరీరముతో ఆ కర్మల ఫల మును భోగించును. సూక్ష్మశరీరము ఇహపరలోకములయందు విచ్చేదముకాదు.
వ్యక్తి నిద్రించినప్పుడు ప్రాణము గల ఈ దేహము ఇక్కడనే యుండగా, ఆతడు స్వప్నములో వాసనచే నిర్మితమైన అటువంటి దేహ ముతో గాని, లేక మరియొక దేహముతో గాని తన మనస్సులో నిహితమైయున్న కర్మవాసనలకనురూపముగా సుఖదుఃఖములననుభవించును. అదే విధముగా జీవుడు పరలోకములో మరియొక దేహముతో సూక్ష్మశరీరము నందు నిహితమైయున్న కర్మఫలములను భోగించును.
మానవుడు ఒక దేహమును తానని మనస్సులో భావించి, ఆ దేహ ముతో సంబంధము గల ఇతరులను తనవారినిగా స్వీకరించి, ఆ దేహ ముతో కర్మలను చేయును. ఆ కర్మల వలన ఆతడు మరల జన్మించును.
కర్మేంద్రియములు మరియు జ్ఞానేంద్రియముల వ్యాపారములను బట్టి మనస్సు అనేది ఒకటి వాటిని ప్రేరేపిస్తూ ఉన్నదని మనము నిర్దారించ వచ్చును. అదే విధముగా, వ్యక్తియొక్క మనస్సులో ఉదయించే పలువిధ ముల ఆలోచనలను బట్టి, ఈ దేహము పుట్టుటకు ముందు వీనియందు సూక్ష్మముగా కర్మవాసనలు ఉన్నవి అని మనము నిర్ధారించేదము.
ఒకానొక విశిష్టమగు రూపము, విశిష్టలక్షణములు గల అనుభవము వ్యక్తికి ఈ దేహముతో కలిగియుండక పోవచ్చును. దానిని ఆతడు ఇదివరలో ఎక్కడనైననూ ఏ కాలమునందైననూ చూచి గాని, విని గాని యుండక పోవచ్చును. అయిననూ, అట్టిది ఒకప్పుడు మనస్సులో స్వప్నాదులయందు స్ఫురించవచ్చును.
ఓ మహారాజా! ఈ దేహముతో అనుభవమునకు రాని విషయము మనస్సులో స్పురించినది. కావున, ఈ వ్యక్తికి పూర్వదేహము ఉండెడిదని యు, ఆ దేహముతో నుండగా సూక్ష్మశరీరమునందు ఆ విషయము అను భవమునకు వచ్చినదనియు నీవు ఆలోచించి స్వీకరించవలెను. ఏలయన గా, ఇదివరలో అనుభవమునకు రాని విషయము మనస్సులో చూచాయగా నైననూ స్పురణకు వచ్చుట సంభవము కాదు.
మానవునకు తన మనస్సే వివిధవాసనలను బట్టి పూర్వజన్మలో ఇట్టి అనుభవములు ఉండియుండునని సూచించును. అదే విధముగా, శాంతి భయము మొదలగు అవస్థలను బట్టి భవిష్యత్తులో కలుగబోయే శుభాశుభములను కూడ మనస్సు సూచించును. ఇంతే గాక, అతి స్వచ్చ మగు మనస్సుగల వ్యక్తికి మరల జన్మ లేదనే సంగతిని వాని మనస్సు సూచించును. ఓ రాజా! నీకు మంగళమగు గాక!
ఈ జన్మలో గాని, పూర్వజన్మలలో గాని సుతరాము చూచుటకు గాని, వినుటకు గాని సంభవము కాని సంగతి (పర్వతముపై సముద్రము) ఒకప్పుడు మనస్సులో స్పురించవచ్చును. ఇట్లు స్పురించుటకు కారణము ఆయా దేశకాలక్రియల అయోగ్యమగు సమ్మేళనమేనని ఊహించవలెను.
ఇంద్రియగోచరములగు విషయములు మాత్రమే పుణ్యపాపముల క్రమముననుసరించి వ్యక్తియొక్క మనస్సులో గుంపులు గుంపులుగా అను భవమునకు వచ్చి, తొలగి పోవుచుండును. ప్రతి వ్యక్తి వాసనామయమగు లింగశరీరము కలవాడే.
మనస్సు స్వతహాగా సత్త్వగుణప్రధానమైనది. పైగా, అది ఆత్మ రూపుడగు భగవానునకు అత్యంత సన్నిహితముగా నున్నది. అయిననూ, ఇట్టి మనస్సునందు, ప్రకాశస్వరూపుడగు చంద్రునియందు రాహువు (ఛాయాగ్రహము) చే కల్పించబడిన గ్రహణము వలె, మిథ్యాభూతమగు జగ త్తుతోడి సంయోగము భాసించుచున్నది. లేదా, సాధకుడు సత్త్వగుణప్రధా నమగు మనస్సును కలిగియుండి నిరంతరముగా భగవంతుని ధ్యానించు చున్నచో, వాని మనస్సులో ఈ జగత్తు, చంద్రునియందు గ్రహణము వలే, వాస్తవముగా లేకున్ననూ కేవలప్రతీతిమాత్రముగా నుండును.
బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, విషయములు అనే సమూ హము (లింగదేహము) సత్త్వరజస్తమోగుణములచే రచించబడి అనాదినుం డియు ప్రవర్తిల్లుచున్నది. ఇది ఉన్నంత వరకు వ్యక్తికి, నేను నాది అనే అభి మానము దూరము కాదు.
నిద్ర, మూర్చ, తీవ్రమగు శోకము, మరణసమయము, పెద్ద జ్వరా వేశము అనే ఈ స్థితులలో వ్యక్తికి దేహాభిమానము ఉండదు. దీనికి కార ణము అజ్ఞానము లేకపోవుట కాదు. ఈ సందర్భములలో ప్రాణశక్తియే ఆశ్ర యముగా గల ఇంద్రియములు వ్యాకులములై యుండుటచే దేహాభిమా నము లుప్తమగును.
అమావాస్యనాడు చంద్రుడు ఉన్నా ప్రకటముగా కానవచ్చుట లేదు. అదే విధముగా, వ్యక్తి తల్లి గర్భములో నున్నప్పుడు, బాల్యావస్థ యందు కూడ, నేను అనే దేహాభిమానము ప్రకటమగుట లేదు. కాని, యౌవనములో దేహాభిమానము పూర్తిగా ప్రకటమగుచున్నది.. దీనికి కార ణము అజ్ఞానము లేకపోవుట కాదు. అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, అంతఃకరణము అనే పదకొండు ఇంద్రియముల సము దాయరూపమగు లింగశరీరము ఆ కాలములో ఇంకనూ పూర్తిగా వికసించ కపోవుటచేతనే దేహాభిమానము ప్రకటమగుట లేదు.
వ్యక్తికి కలలో ఆపద వచ్చినట్లు. కానబడును. అది వాస్తవము కాదు. కాని, దాని వలన దుఃఖము తప్పుట లేదు. అదే విధముగా, అజ్ఞాని భోగాసక్తుడై యుండును. ఈ భోగములు మిథ్యయే గాని, వాస్తవములు కావు. అయిననూ, వాటిని గురించి చింతిల్లుచుండుట వలన సంసారదుః ఖము తప్పుట లేదు.
ఈ తీరున అయిదు సూక్ష్మభూతములతో నిర్మితమైన సూక్ష్మశరీ రము సత్త్వరజస్తమోగుణముల కార్యములగు సుఖదుఃఖమోహములకు ఆశ్రయమగుచున్నది. అదియే అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అయిదు సూక్ష్మభూతములు, అంతఃకరణము వెరసి పదునారు కళలుగా విస్తరించియున్నది. ఈ లింగశరీరమే ఆత్మచైతన్య ముతో కూడి జీవుడు అని వ్యవహరించ బడుచున్నది.
వ్యక్తి ఈ లింగశరీరముతో స్థూలదేహములను స్వీకరించి, విడిచి పెట్టుచుండును. వ్యక్తి దీని ద్వారానే హర్ష (రాబోయే మంచిని గురించి ఉల్లాసము)-శోక (గతమును గురించిన దుఃఖము)-భయ-సుఖ-దుఃఖముల ననుభవించుచుండును.
ఓ నరపతీ! గడ్డి మీద పాకే జలగవంటి పురుగు ముందు పోచను పట్టుకొని, ఆపైన వెనుక పోచను విడిచి పెట్టును. అదే విధముగా, ఏ కర్మలు ప్రస్తుత దేహమునారంభించినవో, అవి పూర్తిగా భోగముచే విచ్చే దమై, నూతనమగు ప్రారబ్ధకర్మలచే ఈయబడే దేహమును పొందేటంతవర కు, జీవుడు మరణోన్ముఖుడై యున్ననూ, ప్రస్తుతదేహమునందలి అభిమా నమును విడిచిపెట్టడు. ఈ విధముగా, ప్రాణులకు మన స్సే సంసారము నకు హేతువు అగుచున్నది.
అజ్ఞానియగు వ్యక్తి తన స్వరూపమగు పూర్ణ-ఆత్మయందు నిష్ఠను కలిగియుండజాలడు. అట్టివాడు తనయందు కర్తృత్వమునారోపిం చుకొని కర్మలను చేయుచుండును. ఆ కర్మల ఫలమును భోగరూపముగా అనుభవించి, మరల వాటిని గురించియే చింతిల్లుచుండును. ఆ విధముగా ఆతడు మరల కర్మలను చేయుచుండును. ఈ విధముగా ఈ కర్మపరంపరకొనసాగుచుండగా, ఆతడు పలుమార్లు పుట్టి మరణిస్తూ సంసారములో బందీయై యుండును.
ఈ జగత్తు శ్రీహరినుండి పుట్టి శ్రీహరియందే ఉనికి గలదై శ్రీహరి యందే విలీనమగును. కావున, ఇది శ్రీహరికంటే భిన్నముగా లేదు. కావు న, నీవు ఈ విధముగా జగత్తును సర్వము శ్రీహరియే అని దర్శిస్తూ, అన్ని విధములుగా శ్రీహరిని సేవించి, అజ్ఞానమును పోగొట్టుకొనుము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పూజ్యుడగు నారదుడు భగ వద్బక్తులలో అగ్రేసరుడు. ఆయన ఈ విధముగా ప్రాచీనబరీష మహారాజు నకు జీవేశ్వరుల తత్త్వమును బోధించి, తరువాత సిద్ధలోకమునకు వెళ్లెను.
రాజర్షియగు ప్రాచీనబర్హిషుడు తన కొడుకులకు వంశమును నిలబె ట్టుడనియు, ప్రజలను పాలించుడనియు ఆదేశించి, తపస్సు కొరకై కపిల భగవానుని ఆశ్రమమునకు వెళ్లాను.
వీరుడగు ప్రాచీనబర్హిషుడు సంసారాసక్తిని విడిచి పెట్టి ఆ కపిలాశ్ర మములో ఏకాగ్రమగు చిత్తముతో గోవిందుని పాదపద్మములను భక్తిపూర్వ కముగా అనుక్షణము సేవించి, ఆయనలో ఐక్యమయ్యెను.
ఓ పుణ్యాత్మా! దేవరియగు నారదుడు కీర్తించిన ఈ ఆత్మతత్త్వ ముయొక్క పరోక్షకథనమును ఎవడైతే వినునో, లేక వినిపించునో, ఆతడు లింగశరీరవిముక్తిని (మోక్షమును) పొందును.
దేవర్షులలో శ్రేష్ఠుడగు నారదుని ముఖమునుండి వెలువడిన ఈ గాథ మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క కీర్తిచే లోకమును పావనము చేయుచున్నది. ఇది సాధకునకు అంతఃకరణశుద్ధి ద్వారా మోక్షపదమునో సంగును. దీనిని మహాత్ములు కీర్తించుచుండగా తెలుసుకున్న సాధకుడు సకలబంధములనుండి విముక్తిని పొందును. వానికి తిరిగి ఈ సంసార ములో పరిభ్రమణము ఉండదు.
ఆత్మతత్త్వముయొక్క ఈ పరోక్షకథనము ఆశ్చర్యకరమైనది. దీనిని నేను పొంది నీకు చెప్పితిని. దీని వలన సాధకునకు బుద్ధితోడి తాదా త్మ్యము వలన కలిగే దేహాభిమానము నష్టమై జీవన్ముక్తి కలుగును. మరియు పరలోకము విషయములో ఉండే సందేహములు తొలగిపోవును.
శ్రీమద్బాగవత మహాపురాణములో నాల్గవ స్కంధమునందలి పురంజనోపాఖ్యానములో ప్రాచీనబర్హిషునకు నారదుని ఉపదేశమును వర్ణించే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
