శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
10 - ధ్రువోపాఖ్యానము - ధ్రువునకు యక్షులతో యుద్ధము
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- శిశుమార ప్రజాపతికి భ్రమి అని ప్రసిద్ధిని గాంచిన కుమార్తె గలదు. ఆమెను ధ్రువుడు వివాహమాడెను. వారిద్దరికి కల్పుడు, వత్సరుడు అనే ఇద్దరు కుమారులు కలిగిరి.
గొప్ప బలశాలియగు ధ్రువుడు వాయుదేవుని పుత్రికయగు ఇలను వివాహమాడెను. వారికి ఉత్కలుడనే కొడుకు, రత్నమువంటి కుమార్తె కలి గిరి.
ఉత్తముడు వివాహము చేసుకోలేదు. ఆతడు వేటకు వెళ్లి, హేమ వత్పర్వతముపై బలశాలియగు యక్షుని చేతిలో మరణించెను. వాని తల్లి కూడ మరణించెను.
తన తమ్ముడు వధించబడినాడని విని ధ్రువుడు సహించలేకపో యేను. ఆతని హృదయము కోపముతో, దుఃఖముతో నిండిపోయెను. ఆతడు విజయప్రదమగు రథమునెక్కి, ఆ యక్షుల నివాసస్థానమగు అలక పురమునకు వెళ్లాను.
ధ్రువ మహారాజు ఉత్తరదిక్కు వైపు పయనించెను. అక్కడ రుద్రుని అనుచరులు సంచరించుచుందురు. ఆతడు ఆ దిక్కులో వెళ్లి, హిమవత్ప ర్వతశ్రేణులలో ఉన్న మైదాన ప్రదేశమును చేరుకొనెను. అచట ఆతనికి యక్షులతో రద్దీగానున్న అలకాపురము కానవచ్చెను.
పాపములను పోగొట్టుటలో సమర్థుడవగు ఓ విదురా! ఆజానుబా. హుడగు ధ్రువుడు శంఖమును పూరించగా, ఆకాశము దిక్కులు కూడ ప్రతి ధ్వనించెను. ఆ ధ్వనిని విని యక్షస్త్రీలు వణికిపోయిరి. వారి కన్నులలో చాల భయము కానవచ్చెను.
అప్పుడు గొప్ప బలశాలురగు యక్ష సైనికులు ఆ ధ్వనిని సహిం చనివారై, ఆయుధములను ఎత్తి పట్టుకొని, నగరము బయటకు వచ్చి, ధ్రువుని వైపునకు ఉరికిరి.
ధ్రువుడు రథము పైనుండి యుద్దమును చేయుటలో దిట్ట. ఆతని ధనస్సు శత్రువులకు భయమును గొల్పును. తన మీదకు వచ్చుచున్న ఆ యక్ష సైనికులను ఆయన ఒక్కొక్కరిని మూడు చొప్పున బాణములతో అందరినీ ఒక్కసారిగా కొట్టెను.
ఈ విధముగా తమ నుదుట బాణములు తగుల్కొనుట తోడనే వారందరు తాము పరాజితులమైనామనియే తలపోసి, ధ్రువుని ఆ వీరకృ త్యమును ప్రశంసించిరి.
వారందరు తోక తొక్కిన పాముల వలె ధ్రువుని వీరకృత్యమును సహించనివారై ఆతని దెబ్బకు దెబ్బను తీయగోరి, ఒక్కొక్కరు ఆరేసి బాణముల చొప్పున అందరు ఒకేసారిగా ఆయనను కొట్టిరి.
అప్పుడా లక్ష ముష్పై వేలమంది యక్షులు చాల కోపించి ధ్రువుడు కొట్టిన దెబ్బకు బదులుగా దెబ్బను కొట్టగోరిరి. వారు ఆయనపై రథముపై మరియు సారధిపై గుదియలను, కత్తులను, రకరకముల ఈటెలను, శూలములను, గండ్రగొడ్డళ్లను, చిల్లకోలలను, భుశుండులను, రంగు రంగుల రెక్కలు గల బాణములను కూడ వర్షమువలే గుప్పించిరి.
ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుని వారు ప్రయోగించిన ఆయుధ ముల పెద్ద వర్షము కప్పివేయుటచే, ఆతడు దగ్గరనుండి కూడ కనబడలేదు. కుండపోత వర్షముచే కప్పివేయబడి కనబడని పర్వతమువలే ఆతడు చెక్కు చెదరకుండగా నుండెను.
అదే సమయములో అంతరిక్షములోనుండి యుద్దమును తిలకిం చుచున్న సిద్దులు ఈ విధముగా హాహాకారములను చేసిరి : మనువు వంశ ములో పుట్టి సూర్యుని వలె ప్రకాశించే ఈ ధ్రువుడు యక్ష సైన్యము అనే సముద్రములో మునిగి కనబడకుండా పోయినాడు,
యక్షులు తామే నెగ్గితిమని ప్రకటిస్తూ జయనాదములను చేయుచుండిరి. ఇంతలో పొగమంచునుండి సూర్యుడు ఆవిర్భవించునట్లుగా, ఆ ధ్రువుని రథము హఠాత్తుగా ఆవిర్భవించెను.
ధ్రువుడు దివ్యమగు ధనస్సుయొక్క నారిత్రాటిని సవరించి టంకా రధ్వనిని చేయుచుండెను. ఆ విధముగా ఆతడు శత్రువులకు భేదమును కలిగిస్తూ, బాణములతో వారి ఆయుధముల సమూహమును, సుడిగా లులు మేఘముల గుంపును వలె, చెదరగొట్టెను.
ధ్రువుడు తన ధనస్సునుండి విడిచి పెట్టిన ఆ వాడి బాణములు, పర్వతములపై పడిన పిడుగులు వలే, యక్షుల కవచములను పగులగొట్టి, వారి దేహములలో ప్రవేశించినవి.
యుద్ధము జరిగిన ఆ స్థానములలో అంతటా, ధ్రువుని అర్ధచంద్రా కార బాణములచే తెగగొట్టబడిన యక్షుల అందమైన కుండలములు గల తలలు, బంగరు తాడిచెట్లను పోలియున్న తొడలు, కంకణములతో అంద ముగానున్న భుజములు, హారములు, అంగదములు, కిరీటములు, మిక్కిలి విలువైన తలపాగలు చెల్లాచెదరుగా పడి ప్రకాశించినవి. ఆ దృశ్యము శూర పురుషుల మనస్సును దోచివేయ సమర్థమై యున్నది.
క్షత్రియవీరుడగు ధ్రువుడు సంహరించగా మిగిలిన యక్షుల గణ ములలో చాలమందికి అవయవములు తెగగొట్టబడెను. వారు యుద్ధరంగ మును విడిచి పెట్టి, సింహముచే తరుమబడిన ఏనుగుల వలె, అన్ని వైపు లకు పారిపోయిరి.
అప్పుడు మనువంశపాలకుడగు ధ్రువునకు ఆ గొప్ప యుద్దభూ మిలో ఆయుధమును పట్టి నిలబడినవాడు ఒక్క డైననూ కనబడలేదు. ఆత నికి శత్రువులగు యక్షుల అలకానగరమును చూడాలనే కోరిక కలిగిననూ, నగరములోనికి ప్రవేశించలేదు. మాయావులగు యక్షులు ఏమి చేయదల చుకున్నారో ఊహించుట మనకు సంభవము కాదు సుమా! (అని ఆతడు సారథితో పలికెను).
రంగు రంగుల రథము గల ధ్రువుడు తన సారథితో ఈ విధముగా పలుకుతూనే, శత్రువులగు యక్షులు మరల తన పై దండెత్తుదురనే శంక గలవాడై, దానిని ఎదుర్కొనుటకు తగిన యత్నమును చేయుచుండెను. ఇంతలోనే ఆయన సముద్ర ఘోషవంటి శబ్దమును వినెను. దాని వెంటనే, దిక్కులలో వాయువుచే రేగగొట్టబడిన ధూళి కానవచ్చెను.
క్షణకాలములో ఆకాశము అన్ని దిక్కులయందు మేఘముల గుంపులతో నిండిపోయెను. ఆ మేఘములలో మెరుపులు విశేషముగా ప్రకాశించుచుండగా, పిడుగులు భయమును గొల్పుచుండెను.
పాపమునెరుంగని ఓ విదురా! ఆ మేఘములు రక్తముల ధారలను, శ్లేష్మము మొదలగు ద్రవద్రవ్యములను, చీమును, మలమూత్రములను, కొవ్వును వర్షించినవి. ఆ ధ్రువుని ఎదుట ఆకాశమునుండి మొండెములు వచ్చి పడినవి.
ఆ తరువాత ఆకాశమునందు పర్వతము కనబడెను. అన్ని దిక్కు లయందు రాళ్ల వర్షముతో బాటు గదలు, గుదియలు, కత్తులు మరియు రోకళ్లు పడెను.
పెద్ద ధ్వనితో కూడిన మంటలే నిశ్వాసముగా గల పాములు కళ్లతో నిప్పులను గ్రక్కుచూ కోపముతో ధ్రువుని వైపునకు ఉరికినవి. మదిం చిన ఏనుగులు, సింహములు, పెద్దపులులు కూడ ఆయన వైపునకు పరుగె త్తినవి.
తరంగములతో భయమును గొల్పుతూ, పెద్ద శబ్దమును చేస్తూ, ప్రళయకాలమునందు వలె భీషణమగు సముద్రము నేలను అన్ని వైపులా ముంచెత్తుతూ దగ్గరకు వచ్చేను.
క్రూరమగు ప్రవృత్తి గల ఆ యక్షులు రాక్షసమాయచే ఈ విధమగు అనేకములైన దృశ్యములను సృష్టించిరి. కాని, ఇవి బేల మనసు గలవారికి మాత్రమే భయమును గొల్పును,
యక్షులు ధ్రువునియందు ప్రయోగించిన ఆ మాయను దాటుట సుతరాము శక్యము కాదు. అచటకు వచ్చిన మహర్షులు దానిని చూచి, ధ్రువునకు శుభము కలుగుటకై ప్రార్థనలను చేసిరి.
ఓయీ ఉత్తానపాదుని పుత్రుడవగు ధ్రువా! శార్జ్ఞమనే ధనస్సు గల శ్రీహరి భగవానుడు నమస్కరించువారి కష్టములను బాపును. ఆ దేవుడు నీ శత్రువులను నాశనము చేయుగాక! ఆయన నామధేయమును ఉచ్చరించి వినే మానవుడు తరింప శక్యము కానీ మృత్యువును సాక్షాత్తుగా తేలికగా తరించి వేయును.
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు ధ్రువునకు యక్షులతోడి యుద్దమును వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది.
