శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

11 - ధ్రువోపాఖ్యానము - ధ్రువునకు మనువు - తత్త్వమునుపదేశించుట

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- మహర్షులు ఈ విధముగా మాటలాడుచుండగా ధ్రువుడు వినెను. ఆతడు వెంటనే ఆచమనమును చేసి, ధనస్సుపై నారాయణునిచే నిర్మించబడిన అస్త్రమును సంధించెను.

ఓ విదురా! ఆ నారాయణాస్త్రమును సంధించుచుండగనే, యక్షులు కల్పించిన మాయలన్నియు, ఆత్మజ్ఞానము కలుగగానే అవిద్య (అజ్ఞానము) అస్మిత (అహంకారము) రాగము ద్వేషము అభినివేశము (మ రణభయము) అనే చిత్తమలములు నశించునట్లుగా, శీఘ్రముగా కనబడ కుండా పోయినవి.

నారాయణాస్త్రమును నారాయణ-ఋషి ఆవిష్కరింపజేసినాడు. దానిని ధ్రువుడు ధనస్సునందు సంధించుచుండగనే, బంగరు కొనల బాణములు బయటకు వచ్చి భయంకరమగు శబ్దమును చేస్తూ, నెమళ్లు అడవిలో ప్రవేశించే విధముగా, శత్రుసైన్యములోనికి ప్రవేశించినవి. ఆ బాణ ముల రెక్కలు రాజహంసల రెక్కల వలె శోభిల్లెను.

యుద్ధభూమిలో ఆ వాడి అంచులు గల బాణములచే కొట్టబడిన యక్షులు చాల కోపించి ఆయుధములను పైకి ఎత్తి పట్టుకొని, పడగలనెత్తిన పాములు గరుత్మంతుని పైకి వెళ్లే విధముగా, ధ్రువుని పైకి అన్ని వైపుల నుండియు దండెత్తిరి.

ఆ ధ్రువుడు యుద్ధములో తన మీదకు ఉరుకుచున్న ఆ యక్షుల చేతులను తొడలను మెడలను ఉదరములను బాణములతో తెగగొట్టి, సూర్యమండలమును దాటి ఉండే సత్యలోకమునకు పంపించేను. నైష్ఠికబ్రహ్మచారులు సూర్యమండలమును భేదించుకొని పొందే లోకము అదియే.

రంగు రంగుల అద్భుతమైన రథము గల ధ్రువుడు తప్పు చేయని ఆ యక్షులను పెద్ద సంఖ్యలో సంహరించుచుండగా, ఆయన తాతగారగు స్వాయంభువ మనువు చూచెను. ఆయన మహర్షులతో గూడి అచటకు వచ్చి, దయచే ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువునితో ఇట్లు పలికెను.

బాబూ! తీవ్రమగు కోపము పాపమును కలిగించి వ్యక్తిని నరకము నకు గొనిపోవును. సంసారములో వ్యక్తిని త్రిప్పే అట్టి కోపమును విడిచిపె ట్టుము. నీవొ కోపముచేతనే నిరపరాధులగు ఈ యక్షులను చంపితివి.

బాబూ! నీవు చేయుచున్న ఈ పనిని సత్పురుషులు అధికముగా నిందించినారు. ఇది మన వంశములో జన్మించిన నీకు తగదు. ఏలయనగా, నీవు తప్పు చేయని యక్షులను ఊచకోత కోయుట ఆరంభము చేసినావు.

ఓయీ! నీకు సోదరునియందు ప్రేమ మెండు. కాని, సోదరుని - వధచే సంతాపమును చెందిన నీవు, - ఒక్కడు చేసిన తప్పునకు, వానిసంబంధీకులలో చాలమందిని సంహరించినావు సుమా!

కవులు దేహాభిమానము గలవియై ఒకదానిని మరియొకటి హింసించును. అదే విధముగా నీవు కూడ దేహమే ఆత్మయని స్వీకరించి ఇతరులను సంహరించుట మంచిది కాదు. సర్వాంతర్యామియగు శ్రీహరి యొక్క భక్తులైన నీవంటి సత్పురుషులు అనుసరించ దగిన పద్ధతి ఇది కాదు సుమా!

సకలప్రాణులకు అధిష్టానము మరియు సకలప్రాణులలో అంతర్యా మిగా ఉండే శ్రీహరిని ఆరాధించుట కష్టము. అయిననూ, నీవు ఆయనను సర్వప్రాణులు ఆత్మరూపములే అనే అవగాహనతో ఆరాధించి, సర్వవ్యాప కుడగు శ్రీహరియొక్క సర్వాతిశాయి, వేదములయందు ప్రసిద్దము అగు ధామమును సంపాదించినావు.

నీవు శ్రీహరి కూడ స్మరించేటంతటి గొప్ప భక్తుడవు. శ్రీహరి భక్తులు నిన్ను సాధు పురుషునిగా పరిగణించెదరు. పైగా, నీవు నారదుని వలన సత్పురుషులు పాటించదగిన నియమనిష్టలను కూడ నేర్చుకున్నా వు. నీవు నీ ఆచరణచే సత్పురుషులకు కూడ మార్గదర్శకుడవు. అట్టి నీవు దోషమునెట్లు ఆచరించితివి?

  శ్రీహరి భగవానుడు సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు. సుఖదుఃఖములయందు సహనగుణము, దయ, సకలప్రాణులయెడల ప్రేమభావము, మరియు సర్వము ఈశ్వరుడే అనే సమ (బ్రహ్మ) బుద్ధి ఉన్న వ్యక్తి విషయములో శ్రీహరి మిక్కిలి ప్రసన్నుడగును.

భగవంతుడు పూర్ణముగా ప్రసన్నుడైనచో, వ్యక్తి ప్రకృతియొక్క సత్త్వరజస్తమోగుణముల కార్యములగు సంసారమునుండియు మరియు సూక్ష్మశరీరమునుండి విముక్తిని పొంది, ఆనందఘనమగు పరబ్రహ్మ యందు ఐక్యమును పొందును.

పంచభూతములే దేహాకారముగా మారి, ఈ లోకములో స్త్రీ మరియు పురుషుడు అగుచున్నవి. మరల ఆ స్త్రీపురుషుల కలయికచే మరియొక స్త్రీ గాని, పురుషుడు గాని పుట్టును.

ఓ రాజా! ఈ విధముగా పరమేశ్వరుని మాయచే, సత్త్వరజస్తమో గుణముల రకరకముల మేళవింపుచే ప్రాణుల దేహములు పుట్టి, కొంతకా లము మనుగడను సాగించి, నశించుచున్నవి. (లేదా, జగత్తుయొక్క సృష్టి స్థితిలయములు ప్రవర్తిల్లుచున్నవి).

పరమాత్మ నిర్గుణుడు. జగత్తుయొక్క సృష్టిస్థితిలయముల విష యములో పరమాత్మ నిమిత్తము మాత్రమే. అయస్కాంతము సన్నిధిలో ఇనుప ముక్క కదిలినట్లుగా, పరమాత్మ సన్నిధిలో అవ్యక్తమగు ప్రకృతి నుండి జగత్తు ఉదయించి, మరల ఆ ప్రకృతిలో విలీనమగుచూ, ఈ విధముగా ఈ సృష్టిచక్రము తిరుగుచుండును.

పరమేశ్వరుని కాలరూపమగు శక్తిచే త్రిగుణాత్మికయగు ప్రకృతి యందు కదలిక వచ్చి, గుణముల సామ్యావస్థ చెదిరిపోవును. ఆ విధముగా పరమేశ్వరుని శక్తిలో సత్త్వరజస్తమోగుణముల కారణముగా సృష్టిస్థితిలయ ములు అనే వీభాగము ఏర్పడును. ఈ విధముగా పరమేశ్వరుడు కర్త కాకుండగనే ఈ జగత్తును సృష్టించి, సంహర్త కాకుండగనే దీనిని ఉపసంహ రించుచున్నాడు. ఆ పరబ్రహ్మయొక్క లీలలు ఊహకు అందవు గదా!

కాలస్వరూపుడగు భగవానునకు జన్మ గాని, వికారములు గాని, వినాశము గాని లేవు. ఆయన ఒక ప్రాణిచే మరియొక ప్రాణికి జన్మని ప్పించి సృష్టికర్త యగుచున్నాడు. ఇతరప్రాణులను సంహరించే ప్రాణులను కూడ మృత్యురూపములోనున్న మరియొక ప్రాణిచే సంహరింపజేసి, సంహారకర్త యగుచున్నాడు.

కాలరూపుడగు పరమేశ్వరుడు సకలప్రాణులలో సమముగా ప్రవే శించియున్నాడు. ఆయనయే కాలము రూపములో సకలప్రాణుల దేహములకు వినాశమును కలిగించుచున్నాడు. ఆయనకు ఈ విషయములో తనవారు అని గాని, పరాయివారు అని గాని వైషమ్యము లేదు. ఇది నిశ్చయము. పోయువు వీచుచుండగా ధూళీ దానిని అనుసరించి పోవు విధము గా, అస్వతంత్రులగు ప్రాణులు కొలరూపుడగు ఈశ్వరుని పరుగును అను సరించి పరుగెత్తుచున్నారు. అనగా, కర్మాధీనులగు ప్రాణులు కాలప్రవాహ ముచే సంసారములో పడి కొట్టుకొని పోవుచున్నారు.

ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, ఎదుగుదల గాని తగ్గుదల. గావి లేని నిర్వీకారుడు, తన స్వరూపమునందు ఉండువాడు. జీవుడు కర్మప్రవాహ మునకు లోబడి యుండును. అట్టి ఈశ్వరుడు జీవునకు కర్మను బట్టి దేవాది శరీరములలో ఆయుర్దాయమునకు పెరుగుదలను గాని, క్రిమి మొదలగు శరీరములలో తగ్గుదలను గాని కలిగించును.

ఓ మహారాజా! ఈ ఈశ్వరుని కర్మమీమాంసకులు కర్మ అనియు, చార్వాకులు స్వభావమనియు, వైశేషికులు కొలమనియు, జ్యోతిష్కులు - గ్రహాదిరూపములలో నుండే దైవమనియు, వాత్స్యాయనుడు మొదలగు వారు కామమనియు చెప్పుచున్నారు. అనగా, వీరందరు ఈశ్వరుని అంగీక . రించువారే. వివాదము నామమునందు మాత్రమే.

బాబూ! ఈశ్వరుడు విర్గుణుడు. కావుననే ఆయన ప్రత్యక్షాది. ప్రమాణములకు గోచరుడు కాడు. కాని, ఈ జగత్తులోని శక్తులన్నియు ఆయననుండియే పుట్టుచున్నవి. అట్టి ఈశ్వరుని సంకల్పమును తెలియగ లవాడు లేడు. అట్టిచో, జీవుడు తాను ఏ ఈశ్వరునినుండి ఆవిర్భవించినాడో, అట్టి ఈశ్వరుని తెలియగల్గునా యేమి? తెలియలేడు.

ఓ వత్సా! నీ తమ్ముని వాస్తవముగా చంపినది కుబేరుని అనుచరు లగు ఈ యక్షులు కాదు. బాబూ! వ్యక్తియొక్క జన్మమరణములకు కాల రూపుడగు ఈశ్వరుడే కారణమగుచున్నాడు.

ఆ ఈశ్వరుడు మాత్రమే ఈ జగత్తును సృష్టించి, పాలించి, సంహ రించుచున్నాడు. కాని, ఆయనయందు నేను కర్తను అనే అభిమానము లేదు. కావుననే, ఆయనకు సత్త్వరజస్తమోగుణములతో గాని, పాపపుణ్య ములతో గాని సంబంధము లేదు.

సకలప్రాణులలో అంతరాత్మరూపుడై యుండి వాటిని నియం త్రిస్తూ పాలించేది ఈ ఈశ్వరుడే. ఆయనయే తన మాయాశక్తితో కూడుకు న్నవాడై సకలప్రాణులను సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నాడు.

జగత్తునకు సర్వాతిశాయియగు ఆశ్రయము ఈశ్వరుడే. ఆయ నయే బాహ్యమునందు కాలరూపుడై మృత్యువుగను, అంతఃకరణము నందు చైతన్యరూపుడై అమృతుడుగను ఉన్నాడు. నీవు సర్వప్రాణుల యందు ఆయనను దర్శిస్తూ (మనోవృత్తులన్నింటినీ ఆయనయందే నిలిపి), ఆయననే శరణు వేడుము. జగత్తును సృష్టించే ప్రజాపతులు కూడ, చక్రవర్తికి కప్పము కట్టే సామంతుల వలే, ముక్కు త్రాడు వేసి నియంత్రించ బడే ఎద్దులు వలె, ఆయనకు పూజాద్రవ్యములను సమర్పించి, వశవర్తులై యున్నారు.

అయిదేళ్ల వయసులోనే నీవు, సవతి తల్లి పలుకులచే హృద యములో గాయము కాగా, తల్లిని విడిచి అడవికి వెళ్లి, ఇంద్రియములను ఉపసంహరించి అంతర్ముఖుడవై ఇంద్రియాధిపతియగు శ్రీహరిని ఆరాధించి, ముల్లోకములకు అగ్రమునందుండే స్థానమును సంపాదించితివి.

ఓయీ! సకలప్రాణులలో నిత్యముక్తమగు ఆత్మరూపుడైయున్న ఆ శ్రీహరి విద్వేషము లేని అంతఃకరణములో మాత్రమే ప్రకటమగును. నిర్గు ణుడు, అద్వయుడు, అవినాశి అగు ఆ శ్రీహరిని అంతర్ముఖమగు మన స్సులో అవలోకించుము. వాస్తవముగా లేకున్ననూ కానవచ్చే ఈ నానాత్వ విశిష్టమగు జగత్తునకు అధిష్టానము ఆ శ్రీహరియే.

అదే సమయములో నీవు అంతరతమమగు ఆత్మరూపుడైయున్న శ్రీహరి భగవానునియందు నిష్కామభక్తిని చేయుము. ఆయన అనంతుడు, ఆనందఘనుడు. సకలశక్తులు ఆయనను నిత్యము సేవించుచుండును, అట్టి భక్తి వలన నీవు మెల్లగా, అహంకార మమకారములనే రూపములలో గట్టిగా బిగుసుకొనియున్న అజ్ఞానము అనే ముడిని విడగొట్టి, దానినుండి బయట పడగలవు.

ఓ రాజా! కోపము వ్యక్తికి రావలసిన శ్రేయస్సులన్నింటికీ పెద్ద ఆటంకము. రోగమును మందుతో నయము చేసుకున్న విధముగా, నేను  చెప్పిన ఉపదేశమును విని భావన చేయుట ద్వారా, ఆ కోపమును నిలువ రించుము. నీకు మంగళమగు గాక!

కోపముతో నిండియున్న వ్యక్తిని చూచి సకలప్రాణులు ఆందోళ నను చెందును. కావున, తనకు అభయము (మోక్షము) కలగాలని (తన వలన ఇతరులకు భయము కలుగరాదనియు, తనకు ఇతరుల వలన భయము కలుగరాదనియు) కోరుకునే వివేకి కోపమునకు వశుడు కారాదు.

ఈ యక్షులు నా సోదరుని చంపినారు అనే భావముతో నీవు వారిని సంహరించి, కుబేరుని అవమానించినావు. కైలాసాధిపతియగు శివుడు కుబేరుని తన సోదరునిగా స్వీకరించినాడు.

ఓ వత్సా! మహాత్ములగు లోకపాలకుల తేజస్సు మన వంశమును వినాశము చేసే లోపులోనే, నీవు ఆ కుబేరునకు నమస్కరించి, ఆయనతో వినయముగా మాటలాడి, ఆయనను ప్రసన్నునిగా చేసుకొనుము.

ఈ విధముగా స్వాయంభువ మనువు తన మనుమడగు ధ్రువు నకు ఉపదేశించెను. ధ్రువుడు ఆయనకు నమస్కరించెను. అపుడాయన. మహర్షులతో గూడి ధ్రువుని రాజధానికి వెళ్లాను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో మనువు ధ్రువునకు తత్త్వమునుపదేశించుటను వర్ణించే పదునొకండవ అధ్యాయము. ముగిసినది.