శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
31 - మనుష్యజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట
కపిల భగవానుడిట్లు పలికెను జీవుడు పూర్వకర్మానుసార ముగా దైవముచే ప్రేరితుడై మనుష్యజన్మను పొందబోతూ, ఒకానొక పురు షుని వీర్యకణములనాశ్రయించి, తద్ద్వారా ఒక స్త్రీయొక్క ఉదరమును ప్రవేశించును.
ఆ జీవుడు తల్లి ఉదరములో ప్రవేశించి మొదటి రోజు రెండు కణ ములు కలిసిన ఒక కణము రూపములోనుండి, అయిదు రోజులలో బుడగ వలె పెరిగి, పదిరోజులకు రేగిపండువలె గట్టిపడి, తరువాత మాంసపిం డము అగును.
ఒక నెలలో తల, రెండు నెలలలో చేతులు కాళ్లు మొదలగు అవ యవముల విభాగము, మూడు నెలలలో గోళ్లు రోమములు ఎముకలు చర్మము ఇంద్రియగోళకములు ప్రకటమగును.
నాలుగు నెలలలో మాంసము మజ్జ మొదలగు ఏడు ధాతువులు నిర్మాణమగును. ఐదు మాసములనాటికి ఆకలి దప్పికలు బయలు దేరు ను. ఆరు మాసములగు సరికి శిశువు చుట్టూ జరాయువు (చర్మవిశేషము) నిర్మాణమై, శిశువు ఉదరములో ఎడమ పార్శ్వమునందు తిరుగును.
తల్లి స్వీకరించే ఆహారము నీరు మొదలగువాటిచే ఆ జీవుని ధాతు వులు వర్ధిల్లుచుండును. ఆ జీవుడు తల్లి ఉదరములో మిక్కిలి ఇబ్బందిని కలిగించే మలమూత్రముల స్థానమునందు పడియుండును. అచట క్రిములు మొదలగునవి కూడ ఉదయించుచుండును.
మిక్కిలి సుకుమారమగు దేహము గల ఆ జీవుని అక్కడ ఉండే క్రిములు ఆకలి గొన్న వై మాటిమాటికీ కుడుతూ ఉంటే, ఆ జీవుడు ప్రతి క్షణము చాల నొప్పిని అనుభవించి మూర్ఛిల్లును,
తల్లి భక్షించే పదార్థములు కొన్ని కారముగా నుండి కడుపులోని శిశువునకు హింసను కలిగించును. ఉప్పని పుల్లని పొడిపొడిగా నుండే వివి ధపదార్థములు ఆ శిశువునకు తగిలి అన్ని అవయవములలో భరించరాని నొప్పిని కలిగించుచుండును.
ఆ తల్లి గర్భములో జీవుడు జరాయువుచే చుట్టబడినవాడై, దానికి బయట ప్రేవులచే చుట్టబడినవాడై, తలను తల్లి పొట్టలో నుంచి, నడు మును మెడను వంచి యుండును.
ఆ జీవుడు పంజరములోని పక్షివలె తల్లి గర్భములో తన అవయ వములను ఇటునటు కదల్చుటకు సమర్థుడు కాడు. ఆ సమయములో దైవానుగ్రహము వలన వానికి పూర్వజన్మస్మృతి కలుగును. అపుడాతడు తాను అనేకజన్మలలో తాను చేసిన కర్మలను గుర్తు చేసుకొని, చాల సేపు శ్వాస లేకుండ నుండును. వానికి ఆ స్థితిలో ఏమి సుఖము కలుగును?
ఏడవ మాసమునుండి మొదలుకొని ఆ జీవునకు స్మృతి కలుగు ను. 'కాని, వానిని ప్రసూతి వాయువులు ఇటునటు కుదిపివేయును. ఆతడు అదే ఉదరములోనుండే క్రిమి వలె ఒక స్థానములో స్థిరముగా నుండలేడు.
ఏడు ధాతువుల స్థూలశరీరమునకు కట్టుబడియున్న ఆ జీవుడు పూర్వజన్మజ్ఞానము గలవాడై సంసారమునకు భయపడి చేతులనుజోడించి దీనమగు వాక్కుతో అర్థిస్తూ , ఏ భగవానుడు తనను తల్లి గర్భ ములోనికి పంపినాడో, ఆ భగవానుని స్తుతించును.
భగవానుడు తనను శరణు జొచ్చిన జగత్తును రక్షించుట కొరకై తన ఇచ్చచే అనేకరూపములను స్వీకరించి భూమిపై అవతరించును. భూమిపై సంచరించే సర్వాభయస్థానమగు ఆయన పాదపద్మమును నేను శరణు జొచ్చుచున్నాను. ఆయన, దుష్టుడనగు నాకు తగిన ఇట్టి గర్భ వాసఫలమును చూపించినాడు.
ప్రకృతియే పరిణామమును చెంది దేహము ఇంద్రియములు అంతఃకరణము అనే రూపముగా నున్నది.. జీవుడు దానినే తానుగా పొర పడి కర్మలను చేయుచూ వాటి ఫలమగు పాపపుణ్యములచే కప్పివేయబ డిన స్వరూపము గలవాడై బంధితుడు వలె తల్లి ఉదరములో నున్నాడు. అట్టి నేను ఉపాధిసంపర్కము లేని ఆ పరమేశ్వరునకు నమస్కరించుచు న్నాను. జన్మాది వికారములు లేని ఆ పరమేశ్వరుడు నా పీడితమైన హృద యములో భాసించుచున్నాడు. జ్ఞానస్వరూపుడగు ఆయనయందు జ్ఞాత, జేయము అనే భేదము లేదు.
సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క కార్యములగు పంచ భూతములచే రచించబడిన ఈ దేహముతో గాని, ఇంద్రియములతో గాని, శబ్దము మొదలగు విషయములతో గాని, ఈ అంతఃకరణమునందు చిదా భాసయగు అహంకారముతో గాని నాకు వాస్తవముగా సంబంధవ, లేదు. కాని, సంబంధము భాసించుటచే నేను వాటికి కట్టుబడి యునా .. అట్టి నేను మొక్కవోని మహిమగల సర్వజ్ఞుడగు ఆ పరమపురుషున' నమస్క రించుచున్నాను. ఆయన ప్రకృతికి, జీవతత్త్వములకు అసీతమై వాడు.
ఈ జననమరణప్రవాహరూపమగు సంసారమార్గములో సత్త్వరజ స్తమోగుణములు, అవి నిమిత్తముగా గల కర్మలు జీవుని గట్టిగా బంధించు ను. ఈ జీవుడు పరమేశ్వరుని మాయచే తన స్వరూపమును విస్మరించి అట్టి సంసారమార్గములో చాల శ్రమ పడుతూ సంచరించుచున్నాడు. అట్టి జీవుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహము లేకుండగా మరే ఉపాయముచే తిరిగి తన స్వరూపమును తెలియగల్గును?
నాకు ఇప్పుడు భూతభవిష్యద్వర్తమానములు తెలియుచున్నవి. ఈ జ్ఞానము నాకెక్కడిది? స్థావరజంగమములగు ప్రాణులలో అంతర్యామి రూపముగా వ్యాపించియున్న ఆ దేవుడు నాకీ జ్ఞానమునిచ్చినాడు. జీవుడు తాను చేసుకున్న కర్మలచే నిర్ణయించబడిన మార్గములో ముందుకు సాగు చుండును. అట్టి నేను మూడు విధముల తాపము శాంతించుట కొరకై ఆ దేవుని కొలుచుచున్నాను.
ఓ భగవాన్! దేహినగు నేను మరియొక దేహి (తల్లి) యొక్క కుక్షి యందు రక్తము మలమూత్రముల కూపములో పడియున్నాను. ఈ జఠ రాగ్ని నన్ను చాల తపింపజేయుచున్నది. నా మనస్సు దైన్యముతో నిండి యున్నది. దీనినుండి బయట పడాలని నేను కోరుకుంటూ, నెల' ను లెక్క పెట్టుకుంటున్నాను. నన్ను నీవు ఎప్పుడు బయట పడవే పెదవు
ఓ పరమేశ్వరా! నేను పది నెలల వయస్సు గల అయోగ్యుడను కాని నిరతిశయమగు దయగల నీవు నాకీ పూర్వజన్మజ్ఞానమును కలిగించి నావు. నీకు నీవే సాటి. నీవు దీనులను పాలించువాడవు. నీవు చేసిన ఈ ఉపకారమే. నీకు సంతోషమును కలిగించుగాక! చేతులు జోడించి నమస్క రించుట మినహా నీకు ప్రత్యుపకారమును చేయగలవాడెవ్వడు గలడు?
ఇతరజీవులగు పశుపక్ష్యాదులు ఏడు ధాతువుల స్థూలశరీరము నకు మాత్రమే కట్టుబడి ఆ తన దేహమునందు కలిగే సుఖదుఃఖములను మాత్రమే అనుభవిస్తూ ఉండును. కాని, నాకు భగవానుడు వివేకజ్ఞానముని చ్చినాడు. నేను దానితో నా హృదయములో అహంకారమునకు ఆశ్రయ మగు ఆత్మరూపములో భాసించే ఆ పరమేశ్వరుని అపరోక్షముగా దర్శిం చుచున్నాను. ఆ పురాణపురుషుడే బయట కూడ జగద్రూపముగా భాసిల్లు చున్నాడు.
ఓ ప్రభూ! నేనీ గర్భములో అనేకములగు దుఃఖములతో బాటు కలిసి కాపురము చేయుచున్నాను. కాని, ఇక్కడనుండి నిష్క్రమించి బయటనున్న అజ్ఞానాంధకారములోనికి రావాలని నాకు ఇచ్చ కలుగుట లేదు. ఏలయనగా బయట నన్ను విష్ణుమాయ కప్పివేయును. మిథ్యారూ పమగు అభిమానము నన్ను పట్టుకొనును. దాని వెంటనే జననమరణరూప మగు సంసారచక్రము పై పరిభ్రమణము ఆరంభమగును.
కావున, నేను ఈ దుఃఖమును విడిచి పెట్టి, బుద్దితో హృదయము నందు శ్రీహరియొక్క పాదములను స్మరించెదను. అట్లు స్మరించు బుద్ది మాత్రమే నాకు హితకారి యగును. తద్ద్వారా నన్ను నేను శీఘ్రముగా ఈ అజ్ఞానము (సంసారకూపము) నుండి ఉద్దరించుకొనెదను. దానివలన నాకు మరల అనేకదోషములతో కూడిన (నవరంధ్రములతో కూడిన దేహము నందు దేహియై జన్మించుట అనే) ఈ దుఃఖము కలుగకుండును.
కపిల ఉవాచ ।
పదిమాసముల ఆ జీవుడు ఈ విధముగా వివేకజ్ఞానము గలవాడై తనను తాను ఉద్ధరించుకోవాలనే నిశ్చయముతో ఈశ్వరుని స్తుతించుచుం డును. ఇంతలో ప్రసవకాలమునకు సంబంధించిన వాయువు అధోముఖుడు గానున్న ఆ శిశువును ప్రసవము కొరకు క్రిందకు త్రోయును.
ఆ శిశువును ప్రసవవాయువు వేగముగా త్రోయుచుండగా చాల పీడను పొంది తలను క్రిందకు ఉంచి అతికష్టముతో బయటకు వచ్చును. ఆ సమయములో ఆ శిశువునకు శ్వాస ఉండదు. ఆ జీవుని పూర్వజన్మస్మృతి కూడ నశించును.
ఆ శిశువు నేలపై రక్తమూత్రములలో పడి క్రిమివలె కదలాడును. ఆ జీవుని జ్ఞానము నశించుటచే, జ్ఞానవిరుద్ధమగు దేహాభిమానము గల వాడై వెక్కి వెక్కి ఏడ్చును.
శిశువుయొక్క అభీష్టము శిశువును పోషించే తల్లికి తెలియదు. ఆ విధముగా విషయము తెలియని వ్యక్తిచే పోషించబడే ఆ శిశువునకు. తనకు అభీష్టము కానిది తనమీద రుద్దబడినప్పుడు వద్దని త్రోసిపుచ్చే సామ ర్థ్యము ఉండదు.
ఆ శిశువును పరుండబెట్టిన శయ్య అశుచియై, నల్లులు మొదలైన చెమటనుండి పుట్టే క్రిములతో దుఃఖమును కలిగించును. ఆ శిశువు తన శరీ రముయొక్క అవయవములకు దురద కలిగినచో గోకుకొనలేదు, కూర్చుం డలేదు, లేవలేదు. ఇటునటు కదలుటయైననూ ఆ శిశువునకు చేతకాదు.
గర్భమునందుండగా ఉండిన జ్ఞానము ఇప్పుడా శిశువునకు తొల గిపోయినది. మిక్కిలి కోమలమగు శరీరముగల ఆ శిశువును ఈగలు, దోమలు, నల్లులు, క్రిములు మొదలగునవి చిన్న క్రిమిని వలె కుడుతూ ఉంటే, ఆ శిశువు ఏడ్చుచుండును.
ఈ విధముగా ఆ జీవుడు శైశవమునందు, యౌవనమునకు పూర్వ మునందలి అవస్థయందు కూడ దుఃఖముననుభవించును. యౌవనములో
వాని కోరికలు తీరకపోవుటచే కోపము ప్రజ్వరిల్లి, ఆతడు అధికమగు దుఃఖ మునకు లోనగును.
కాముకుడగు ఆ జీవుని అభిమానము, కోపము దేహముతోబాటు పెరుగుచుండును. కావుననే, ఆతడు తన వినాశమును కొని తెచ్చుకొనుట కై, ఇతరులగు కాముకులతో కలహించును.
అవివేకి, చెడు పట్టుదల గలవాడు, చెడు ఆలోచనలు గలవాడు అగు ఆ జీవుడు పంచభూతముల కలయికచే పుట్టిన దేహమునందు నేను, నాది అనే అభిమానమును కలిగియుండును.
జీవుడు దేహము కొరకు కర్మను చేయును. ఆ కర్మ వానిని బంధించి, జననమరణప్రవాహరూపమగు సంసారములో బడద్రోయును. అజ్ఞానముచే చేయబడిన కర్మ వలననే ఆ దేహము నిర్మాణమైనది. అట్టి దేహము వానికి దుఃఖమునే ఇస్తూ వెంట వచ్చును.
ఆ వ్యక్తి సన్మార్గములోనున్నవాడే అయిననూ, కామపూర్తికొరకు ఉదరపోషణ కొరకు మాత్రమే కార్యనిరతులైయుండే దుష్టుల సంగమము నందు రుచి గలవాడై భోగలాలసుడైనచో, మరల పూర్వమునందు వలెనే నరకమును పొందును.
దుష్టులతోడి సంగము వలన సత్యము, ఆంతర బాహ్యములయం దలి పవిత్రత, దయ, మౌనము (మనస్సుయొక్క ప్రసన్నత), వివేకబుద్ధి, సంపద, వినయము, కీర్తి, సహనగుణము, మనోజయము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానము అనునవి నశించును.
అట్టి దుష్టులు మోహమును పొందిన బుద్ధి గలవారగుటచే వారికి మనశ్శాంతి ఉండదు. దేహాభిమానము గల వారి చిత్తము కామాదులచే విక్షిప్తమై యుండును. దుష్టస్త్రీలకు ఆటబొమ్మలవలె వశులై యుండే అట్టి దుష్టులు శోకింపదగినవారే గాని, స్నేహము చేయదగినవారు కాదు.
ఈ జీవునకు దుష్టస్త్రీల సంగము వలన, వారితోడి సంగము గల వారి సంగము వలన కలిగే మోహము గాని, బంధము గాని ఇతరసంగ ముల వలన కలుగవు.
బ్రహ్మ తన కుమార్తె రూపమును చూచి మోహమును చెందగా, ఆమె ఆడు లేడి రూపములో పరుగెత్తగా, ఆయన సిగ్గు లేకుండగా మగ లేడి రూపమును దాల్చి ఆమె వెంట పరుగెత్తాను.
బ్రహ్మగారు మరీచి మొదలగు మహర్షులను సృష్టించగా, వారు కశ్యపుడు మొదలగు ప్రజాపతులను సృష్టించగా, వారు దేవమనుష్యాదు లను సృష్టించిరి. ఇట్టి ఈ సృష్టిలో స్త్రీరూపమగు మాయచే మోహింపబ డని బుద్ధిగలవాడు, నారాయణ మహర్షిని మినహాయించి, మరి యెవడు గలడు?
స్త్రీరూపములోనున్న నా మాయయొక్క బలమును చూడుము. స్త్రీ దిక్కులను జయించిన వీరులను కూడ తన కనుబొమల విరుపుచే పాదాక్రాంతులను చేసుకొనగల్గును.
నన్ను సేవించి ఆత్మానాత్మవివేకమును పొంది యోగముయొక్క పరమపదమును అధిష్ఠించగోరు భక్తుడు ఒకప్పుడైననూ దుష్టసీసంగ మును చేయరాదు. అట్టి సంగము వానికి నరకమునకు ద్వారము కాగలదని మహాత్ములు చెప్పుచున్నారు.
భగవానునిచే నిర్మించబడిన దుష్టస్త్రీరూపములోనున్న మాయ మెల్లగా సమీపించినప్పుడు, భక్తుడు గడ్డిచే కప్పబడిన నుయ్యివలె తనకు హానికరమని గ్రహించవలెను.
జీవుడు పూర్వజన్మలో స్త్రీసంగము వలన ఈ జన్మలో స్త్రీయై పుట్టినాడు. అట్టి స్త్రీ తనకు ధనమును సంతానమును గృహమును ఇచ్చిన ఏ పురుషుని తన భర్తగా భావించుచున్నదో, ఆతడు పురుషుని రూపము లోనున్న నా మాయయే.
కిరాతుడు పాడే పాట మృగములకు మృత్యువు అగును. అదే విధ ముగా, భర్త సంతానము ఇల్లు రూపములోనున్న ఆ మాయ తనకు దైవము సమకూర్చిన మృత్యువేనని స్త్రీ గ్రహించవలెను.
జీవుడు తనకు ఉపాధియగు లింగశరీరముతో ఒక లోకమునుండి మరియొక లోకమునకు, ఒక దేహమునుండి మరియొక దేహమునకు వెళ్లు చునే యుండును. జీవుడు ఆ విధముగా ఒకవైపు కర్మఫలముననుభవి స్తూనే మరల కొత్త కర్మలను నిరంతరముగా చేయుచుండును.
లింగశరీరము జీవునితో మోక్షము వరకు కొనసాగును, పంచభూత ములు, ఇంద్రియములు, మనస్సులతో కూడిన దేహము ఆ జీవునకు భోగ సాధనము. జీవుడు, ఉపాధి రెండు కలిసి పని చేసే సామర్థ్యమును కోల్పో వుటయే మరణము, అవి రెండు కలిసి ప్రకటమగుటయే జన్మ,
పదార్థములు తెలియబడే స్థానము స్థూలదేహము. ఒక కాల ములో దానికి ఆ యోగ్యత కొరవడును. అదియే మరణము. స్థూలదేహ మును చూచి దానియందు, ఇది నేను అనే అభిమానమును కలిగి పదార్థ ములను దర్శించుట దానికి జన్మ.
కంటిలో దోషముచే రూపమును గ్రహించే శక్తి కొరవడినప్పుడు, కంటి గోళకములోని చక్షురింద్రియమునకు కూడ చూచే శక్తి లోపించును. కన్ను, దానిలోని ఇంద్రియము అనే రెండు అసమర్థములైన కాలములో వాటిని రెండింటినీ దర్శించే జీవునియందు చూచే సామర్థ్యము లుప్తమగు ను. జీవుని జన్మమరణములు కూడ ఇట్టి ఉపాధిధర్మములు మాత్రమే.
కావున, వివేకి భయపడరాదు; దైన్యమును పొందరాదు; మోహ మునకు తావీయరాదు. ఆతడు జీవుని స్వరూపమగు ఆత్మను తెలుసుకొని ఆసక్తిని విడిచిపెట్టి, ఈ సంసారములో చరించవలెను.
ఈ సంసారము మాయాకార్యము. ఈ దేహముకూడ ఆట్టిదియే. సాధకుడు నిత్యానిత్యవస్తువివేకము గలవాడై, సాధనను చేస్తూ వైరాగ్యము కలవాడై దేహాభిమానమును విడిచి ఈ లోకములో సంచరించవలెను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో
ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).
