శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
19 - హిరణ్యాక్షుని వరాహ భగవానుడు సంహరించుట
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మ నిష్కపటభావముతో పలికిన అమృతము వంటి ఆ వచనమును వరాహ భగవానుడు విని నవ్వే ను. ఆయన బ్రహ్మకేసి ప్రేమ నిండిన కటాక్షముతో చూచి ఆ వచనమును స్వీకరించెను.
నీవు యుద్దములో పరాక్రమించి వీనిని సంహరించి, లోకములకు సుఖ మును కలిగించుము.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.
సర్వమునకు ఆత్మయగు ఓ ప్రభూ! లోకములకు వినాశమును కలిగించే ఈ సంధ్యాకాలము సమీపించుచున్నది. ఆ లోపులోనే దేవతలకు విజయమును చేకూర్చుము.
రెండు ఘడియల ఈ అభిజిద్యోగము ఇంచుమించు పూర్తి కావ చ్చినది. కావున, ఇప్పుడు నీవు నీ భక్తులమగు మాకు సుఖమును కలిగిం చుటకై, ఇతరులు జయించ లేని వీనిని వెంటనే సంహరించుము.
వీడు నీ చేతిలో మరణించునని నీ చేతనే ఇదివరలో విధించబడినది. తనకు మృత్యువు అగు అట్టి నీ వద్దకు వీడు తనంత తానుగా వచ్చినా
దేనివలనైననూ భయపడని హిరణ్యాక్షుడు బ్రహ్మగారి ఘ్రాణేంద్రి యమునుండి పుట్టిన వరాహ భగవానుని యెదుటనే తిరుగుతూ యుద్ధ మును, చేయుచుండెను. అపుడాయన పైకి యెగిరి శత్రువగు ఆ రాక్షసుని గదతో దౌడపై కొట్టెను.
హిరణ్యాక్షుడు ఆ గదను తన గదతో కొట్టగా, అదీ గిరగిర తిరిగి వరాహ భగవానుని చేతినుండి క్రింద బడి ప్రకాశించెను. అట్లు క్రింద పడుట అక్కడనున్న వారందరికి ఆశ్చర్యమును కలిగించెను.
ఆ రాక్షసునకు అప్పుడు వరాహ భగవానుని దెబ్బ తీసే అవకాశము లభించినది. కాని, వాడు యుద్ధధర్మమును పాటిస్తూ, నిరాయుధుడగు ఆయనను కొట్టలేదు. ఆయనకు చాల కోపము కలిగెను.
వరాహ భగవానుని చేతినుండి గద జారిపోగానే, దేవతలు హాహా కారములను చేసిరి. ఆయన హిరణ్యాక్షుని ధర్మబుద్ధిని ప్రశంసించి, సుద ర్శన చక్రమును స్మరించెను.
హిరణ్యాక్షుని వధించుటకు చక్రము కంగారు పడుచుండెను. కాని, వరాహ భగవానుడు తన అనుయాయులలో ప్రముఖుడు, అధముడు అగు ఆ రాక్షసునితో యుద్ధక్రీడను చేయుచుండెను. అపుడు ఆకాశములోనుండి యుద్దమును చూచుచున్న దేవతలు ఆయన మహిమనెరుంగని వారై ఆయనతో, నీకు మంగళమగు గాక! వీనిని వెంటనే సంహరించుము, అని అనేకరకములుగా పలుకుచుండిరి.
పద్మపత్రములవలె ప్రసన్నమైన కన్నులు గల వరాహ భగవా నుడు చక్రమును చేతబట్టి హిరణ్యాక్షుని యెదుట నిలబడెను. ఆయనను ఆ విధముగా చూడగానే, వాని మనస్సు ఇంద్రియములు కోపముతో నిండి పోయెను. ఆతడు కోపముతో నిట్టూర్పులను విడుస్తూ తన పెదవిని గట్టిగా కొరుకు కొనెను.
భయంకరమగు కోరలు గల హిరణ్యాక్షుడు కన్నులతో దహించు చున్నాడా యన్నట్లు చూస్తూ, ఇదిగో! ఈ దెబ్బతో నీ పని ఆఖరు, అని పలుకుతూ ఎగిరి, తన గదతో వరాహ భగవానుని కొట్టెను.
ఓ మహాత్మా! విదురా! యజ్ఞ వరాహ భగవానుడు వాయువేగము గల ఆ గదను శత్రువగు హిరణ్యాక్షుడు చూచుచుండగనే, తన యెడమ కాలితో అవలీలగా నేల గూల్చెను.
నీవు జయించ గోరుచున్నావు గనుక ఆయుధమును తీసుకొని ప్రయత్నించుము, అని వరాహ భగవానుడు వానితో పలికెను. అపుడాతడు మరల ఆయనను కొడుతూ భీకరముగా గర్జించెను.
ఆ వరాహ భగవానుడు తన మీదకు వచ్చుచున్న గదను చూచి, అటులనే నిలబడెను. అది దగ్గరకు రాగానే, ఆయన దానిని అవలీలగా, గరుత్మంతుడు పామును వలే, పట్టుకొనెను.
తన పరాక్రమము ఈ విధముగా విఫలము కాగా, ఆ మహారాక్ష సుని అభిమానము దెబ్బ తిని, వాని ముఖములో కాంతి క్షీణించెను. వరాహ భగవానుడు ఇచ్చిన గదను తీసుకొనుటకు ఆతడు ఇష్టపడలేదు.
బ్రాహ్మణుని సంహరించుటకై దుష్టుడు అభిచార కర్మకు పూనుకున్న విధముగా, ఆ హిరణ్యాక్షుడు యజ్ఞస్వరూపుడగు వరాహ భగవానుని సంహరించుటకై మూడు కోనల శూలమును పట్టుకోనెను. దాని కొనలు మండే అగ్ని వలే ముందుకు ఉరుకుచున్నవా యన్నట్లు ఉండెను.
రాక్షసులలో మహావీరుడగు హిరణ్యాక్షుడు ఆకాశమధ్యములో కాంతులను గ్రక్కుతూ ప్రకాశించే శూలమును బలముగా ప్రయోగించేను. గరుత్మంతుడు విడిచి పెట్టిన రెక్కను ఇంద్రుడు కొట్టిన విధముగా, వరాహ భగవానుడు వాడి అంచు గల తన చక్రముతో దానిని ముక్కలుగా చేసెను.
వరాహ భగవానుని చక్రము తన శూలమును ముక్కలు ముక్క లుగా ఛేదించగా, ఆ రాక్షసునకు కోపము పెరిగెను. అపుడాతడు ఆయనకు ఎదురుగా వచ్చి, లక్ష్మీదేవికి ఆశ్రయమగు ఆయనయొక్క విశాల వక్షఃస్థలమును కఠినమగు తన పిడికిలితో కొట్టి గర్జించి. మాయమయ్యెను.
ఓ విదురా! ఆదివరాహ భగవానుని ఆతడీ విధముగా కొట్టగా ఆయన, పూలమాలచే కొట్టబడిన ఏనుగు వలే, దేహములో ఏభాగమునం దైననూ కొంచెమైననూ చలించలేదు.
తరువాత ఆతడు యోగమాయకు అధీశ్వరుడగు వరాహ భగవానునిపై అనేక రకముల మాయను ప్రయోగించెను. వాని మాయను చూచి భయపడిన జనులు జగత్తునకు ప్రళయము రాబోవుచున్నదని భావించిరి.
ప్రచండమగు గాలులు వీచి దుమ్మును రేగగొట్టగా, చీకట్లు అలు ముకొనెను. క్షిపణులు ప్రయోగించుచున్నవా యన్నట్లు దిక్కులనుండి రాళ్లు పడినవి.
ఆకాశము మెరుపులు ఉరుములతో గూడిన మేఘముల గుంపు లతో నిండి నక్షత్రగణములు కానరాకుండా పోయెను. ఆ మేఘములు మాటిమాటికీ చీము, జుట్టు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు అను వాటిని వర్షించెను.
ఓ మహాత్మా! పర్వతములు వివిధములగు ఆయుధములను ప్రయోగించుచుండెను. రాక్షసస్త్రీలు దిగంబరలై శూలములను పట్టుకొని జుట్టు విరబోసుకొని కనబడిరి.
పదాతులు, గుర్రములు, రథములు, ఏనుగులు, వాటిమీద ఉన్న సైనికులు, హింసా స్వభావము గల అనేకులగు యక్షులు, రాక్షసులు మిక్కిలి ఉగ్రమైన క్రూరమగు పలుకులను పలుకుతున్నట్లు వినవచ్చెను.
మూడు పాదములు గల ధర్మమే శ్రీహరియొక్క స్వరూపము. మూడు సవనములు గల యజ్ఞమే వరాహ భగవానుని స్వరూపము. ఆయన హిరణ్యాక్షునిచే ఆవిర్భవింప జేయబడిన రాక్షసమాయలను సశింప జేయుటకై తనకు ఇష్టమైన సుదర్శనచక్రమును ప్రయోగించెను.
అప్పుడు భర్త చెప్పిన విషయములు గుర్తుకు వచ్చిన దితికి హృదయములో వణుకు పుట్టి, స్తనములనుండి రక్తము స్రవించెను.
హిరణ్యాక్షుని మాయలు పూర్తిగా అంతర్ధానమయ్యేను. అపుడాతడు కోపముతో వరాహ భగవానునకు ఎదురుగా వచ్చి ఆయనను కౌగి టిలో బిగించి నొక్కివేయుటకు ప్రయత్నించెను. కాని, ఆయన వాని కౌగిటికి బయటనే నిలిచియుండుటను ఆతడు కనుగొనెను.
హిరణ్యాక్షుడు వజ్రమువలె కఠినమైన పిడికిలితో వరాహ భగవా నుని గట్టిగా కొట్టుచుండగా, ఇంద్రుడు వృత్రుని వలె, ఆయన వానిని చెంపకు పైభాగమునందు చేతితో కొట్టెను.
విశ్వవిజేతయగు వరాహ భగవానుడు హిరణ్యాక్షుని కేవలము ఉపేక్షాభావముతో మాత్రమే కొట్టెను; గట్టిగా కొట్టనేలేదు. వాని శరీరము గిరగిర తిరుగజొచ్చెను; కన్నులు బయల్వెడలేను. వాని చేతులు కాళ్లు శిథిలమయ్యెను; జుట్టు చెల్లాచెదరై, తుఫాను గాలిచే పెకిలించి వేయబడిన. చెట్టువలె, వాడు క్రింద పడెను.
ఎదురు లేని తేజస్సు గల ఆ హిరణ్యాక్షుడు భూమిపై పడియుం డెను. వాని కోరలు భీతిని గొల్పుచుండెను. వాని పెదవి కోపముచే కొరికి వేయబడి యుండెను. అచటకు విచ్చేసిన బ్రహ్మాదులు వానిని చూచి, ఇట్లు కొనియాడిరి: ఆశ్చర్యము! ఇట్టి మరణము ఎట్టి వానికి దొరుకును?
యోగులు లింగశరీరమునుండి విముక్తిని కోరువారై మనస్సును నిగ్రహించి, ఏకాగ్రమగు చిత్తముతో భగవానుని ధ్యానించెదరు. అట్టి భగవా నుడు కాలితో తన్నగా, ఈ రాక్షసశ్రేష్టుడు ఆయన ముఖమును చూస్తూ ప్రాణములను విడిచి పెట్టెను.
ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరు పూర్వములో విష్ణుపార్షదు లుగా నుండిన జయవిజయులే. వారు సనకాది మహర్షుల శాపము వలన ఈ రాక్షసజన్మను పొందినారు. ఇట్టి కొన్ని జన్మల తరువాత, వారు మరల తమ స్థానమును పొందగలరు.
దేవతలు ఇట్లు పలికిరి --- ఓ ఈశ్వరా! యజ్ఞములనన్నింటినీ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే. నీవు జగద్రక్షణ కొరకై రజస్తమోగుణముల దోషము లేని సత్త్వమయమగు అవతారములను దాల్చెదవు. నీకు అనేక నమస్కారములు. లోకములకు పీడను కలిగించే ఈతడు దైవవశముచే సంహరించ బడినాడు. మేము నీ పాదములయందు భక్తిని చేసి సుఖమును " పొందినాము.
మైత్రేయుడిట్లు పలికెను --- ఈ విధముగా ఆదివరాహరూపి యగు ఆ శ్రీహరి సహింప శక్యము కాని పరాక్రమము గల హిరణ్యాక్షుని సంహరించెను. కమలాసనుడగు బ్రహ్మ మొదలగు వారు ఆయనను చక్కగా స్తుతించిరి. అపుడాయన నిత్యకల్యాణముగానుండే తన వైకుంఠలో కమునకు వెళ్లాను.
ఓ విదురా! నీవు మంచి మిత్రుడవు. గొప్ప పరాక్రమము గల హిర ణ్యాక్షుని వరాహ రూపమును దాల్చిన శ్రీహరి గొప్ప యుద్దములో అటబొ మ్మను వలే ఆడించి సంహరించేను. భగవానుని ఆ లీలను నేను మా గురు వులు చెప్పిన దానిని అతిక్రమించకుండగా నీకు వర్ణించి చెప్పితిని.
సూతుడిట్లు పలికెను --- ఓ శౌనక మహర్షీ! ఈ విధముగా మైత్రేయ మహర్షి భగవానుని గాథను వర్ణించి చెప్పగా, గొప్ప భగవద్భక్తు డగు విదురుడు విని గొప్ప ఆనందమును పొందెను.
అంతటా వ్యాపించిన పవిత్రమగు కీర్తి గల ఇతర మహాత్ముల గాథను విన్నప్పుడే ఆనందము కలుగుచున్నచో, శ్రీవత్సము చిహ్నముగా గల శ్రీహరి గాథ ఆనందమును కలిగించునని వేరుగా చెప్పవలెనా?
గజేంద్రుని మొసలి పట్టుకున్నప్పుడు ఆడు ఏనుగులు ఆక్రోశించు చుండెను. అపుడా గజేంద్రుడు శ్రీహరి పాదపద్మములను ధ్యానించెను. వెంటనే శ్రీహరి ఆ ఏనుగును ఆపదనుండి విడిపించెను.
నిష్కపటులై ఏకాంతభక్తితో శరణు జొచ్చు మానవులకు శ్రీహరిని ఆరాధించుట చాల సరళమైన పని. కాని, దుష్టులకు ఆయనను ఆరాధించి ప్రసన్నుని చేసుకొనుట అసంభవము. మానవుని భాగ్యమంతయు ఆయన చలువయే అని గుర్తించిన వ్యక్తి ఎవడు ఆయనను సేవించకుండును?
ఓ మహర్షులారా! శ్రీహరి జగద్రక్షణము కొరకై వరాహ రూపమును దాల్చి హిరణ్యాక్షుని వధించుట అనే గొప్ప ఆశ్చర్యకరమగు లీలను ప్రకటించెను. దీనిని ఎవడైతే వినునో, కీర్తించునో, అనుమోదించి ప్రోత్సహించునో, వాడు యథార్థముగా బ్రహ్మహత్యాపాపమునుండి కూడ విముక్తుడగును.
గొప్ప పుణ్యమునిచ్చే ఈ గాథ వినువారిని అతిశయించి పవిత్రు లను జేసి, ధనమును కీర్తిని ఆయుర్దాయమును మరియు మనోరథములను సంపాదించి పెట్టును. ఈ గాథను విన్నవారికి ఇది యుద్దములో ప్రాణమునకు, ఇంద్రియములకు పరాక్రమమును వర్దిల్ల జేయును. దీనిని విన్నవారు మరణించిన పిదప నారాయణుని పొందెదరు
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది .
