స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

26వ అధ్యాయము

నారదుడిట్లు చెప్పసాగెను - 'అటు తరువాత బ్రహ్మ మహాదేవునికి చేతులు జోడించి నమస్కరించి "వివాహమాడుమని' పలికెను. ఆ మాటను విని పరమేశ్వరుడు 'మేము పరాధీనులము. హిమవంతునికి, మీకు ఏదేది యుక్తమని తోచునో దానినెల్లా చేయుడు  ఇపుడు మేము మీ వశముననుంటిమి'. అనగా బ్రహ్మ మహేశ్వరుని వివాహానికై స్వయముగా తాను రత్నమయమగు దివ్యమగు పురమును వెంటనే ఏర్పరిచెను - ఆది వందయోజనముల విస్తీర్ణము గలిగి, వందలకొలది ప్రాసాదములతో శోభించుచుండెను  అట్టి పురమున మహాదేవుడు స్వయముగా నుండెను - ఆంతట మహాదేవుడు తలవగనే వచ్చిన దేవతలను, సప్తరుషులను, అరుంధతి మొదలగు వారిని స్థిరమగు వివాహపత్రమునకై పార్వతి వద్దకు పంపెను - వారు హిమవంతుని మేనతో సహా ఈశ్వరుని గుణములను చెప్పి ఆనందపరిచి స్థిరపత్రములను ఏర్పరిచిరి. హిమంతునిచే పూజింపబడిన వారు తిరిగివచ్చి ఈశ్వరునికి నివేదించగా ఈశ్వరుడు వారినభినందించెను. తరువాత మహాదేవుడు వివాహానికై విశ్వమునంతటినీ ఆహ్వానించగా, దురాత్ములైన దైత్యులు తప్ప స్థావరజంగమాత్మక విశ్వమంతా విష్ణువు వెంట వివాహమునకు 'విచ్చేసెను. బ్రహ్మతో శివుని మహిమను వర్ణింపజేయగా, గంధమాదనపర్వతముపై బ్రహ్మ పురముననున్న శివునితో నిట్లనెను.

దేవా! వివాహకాలము గడుచుచున్నది' అని పలికి దేవదేవుని జటాజూటమున చంద్రఖండమును అతను ప్రేమతో కన్నులు విప్పారగా బంధించెను. ఆట్లున్న జటాజూటమును విష్ణువు సంతోషముతో అతి సుందరముగా చేసెను. చాముండ వెడల్పైన కపాలమాలను శివుని తల పై కట్టి, 'శంకరా దైత్యరాజుల వంశమును వధించి నన్ను రక్తముతో సంతృప్తిపరచు కొడుకును కనుమనెను. సూర్యుడు శివునిశిఖను జ్వలించునట్లు, ముల్లోకముల ప్రకాశింపజేయునట్లు స్వయముగా ఆనందముతో కట్టెను. శేషుడు, వాసుకి మొదలగు తేజస్వినాగులు ఈశ్వరుని భూషణస్థానమున తాము స్వయముగా నీలిచిరి. వాయువులు స్వయముగా, హిమగిరిపై జన్మించి తీక్షమైన కొమ్ములు గల వృషభమును అనేక రత్నవిశేషములతో అలంకరించిరి. ఇంద్రుడు గజచర్మమును గ్రహించి స్వయముగా ఎదుట నిలిచిరి. ప్రేతనాథుడు మానవుల ఎముకలతో చేసిన 'మాలను సిద్ధముచేసెను. అగ్ని తేజోమయమయి దివ్యమగు అజినమునిచ్చి నిలిచెను - ఇట్లు అందరు భృత్యులచే అలంకరింపబడిన ఈశ్వరుడు మిగుల ప్రకాశించెను. అంత హిమవంతుని మనుషులు శివుని ద్వారపాలకుడగు వీరకునితో 'ఆలస్యము కారాదు - శివునికి దీనిని నివేదించుము' – అనిరి.

అంత వీరకుడు చేతులు జోడించి శివునికి నమస్కరించి ఇట్లనెను - హిమవంతుని మనుషులగు వీరు మిమ్ము త్వరపెట్టుచున్నారు'.ఆవగా విని 'త్వరగా కానివ్వండని మహేశుడమ అపుడు సప్తసముద్రములు అతనికి అద్దమువలె నిలిచినవి - వానిలో మహాదేవుడు జగన్మయమగు తన స్వరూపముమ చూచుకొఎమ. తరువాత చేతులు జోడించి వచ్చిన బుద్ధిమంతుడగు కేశవుడు హరునితో నిట్లనెమ. దేవదేవా, మహాదేవా! త్రిపురాంతకా! శంకరా! జగత్తుకానందము కలిగించు ఈ రూపముతో మిగుల శోభించుచుంటివి. మహేశ్వరా! నీకు. వివే సాటి 'అనగా విప్పుచూ జయుడను ప్రసిద్ధినొందిన మహాదేవుడు విష్ణువు చేతిని పట్టుకొని వృషభమును మెల్లగా ఎక్కెమ - అటు తరువాత వసుదేవతలు శూలమువతనికి తెచ్చిచ్చిరి. కుబేరుడు వీధులతో కలిసి వచ్చి శివుని చెంతనిలిమ - అంతట, చేత శూలమును బట్టి విశ్వాత్ముడగు హరుడు ముందుకు కదిలిమ. దేవదుందుభి ధ్వని, ఇతర వాయుద్యముల ష గంధర్వుల గీతములు, అప్పరసల పాట్యములు మొదలాయేమ. జయజయ ధ్వానములు వినబడెను. హంసపై బ్రహ్మ, గరుడునిపై విష్ణువు, ఆతవికిరుపక్కలా నడిచి గొప్పకాంతిలో శోభించిరి. అట్లే దేవతల తల్లులు, భార్యలు వెంట నడిచిరి - అందులో ముఖ్యులు అదితి, దితి, దమ, కద్రువ, సుపర్ణజ, పౌలోమి, పురస, పింహిక, సురభి, ముని యమవారుండిరి.

అట్లే సిద్ధి, మాయ, క్షమ, దుర్గ, డేవి, స్వాహ, స్వధా. సుధా, సావిత్రి, గాయత్రి, లక్ష్మి దక్షిణ ద్యుతి, ప్పుహ, మతి, ధృతి, బుద్ది, మంది, ఋద్ది, సరస్వతి, రాకా, కుహరా, సినీవాలి, దేవి, మమతి, ధరణి, ధారణి, వేలా,రాణీ రోహిణి అనువారు, మరికొందరు ఆనందముతో దేవదేవుని వివాహమునకు వెళ్ళిరి - సర్పములు, గరుడులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నరులు, పొగరములు, పర్వతములు, మేఘములు, మాసములు, సంవత్సరములు, వేదమంత్రములు, యజ్ఞములు, శ్రాతధర్మములు, హుంకారములు, ప్రణవములు, ఇతిహాసములు మున్నగువారు వేలకొలదిగా, కోట్లకొలదిగా వచ్చిరి అట్లే మహింద్రుడు మున్నగువారు తమ వాహనములతో కోట్లకొలదిగా శివుని వెంటపడిచిరి  శంఖములవలె తెల్లనైవ గణములు కోట్లకొలదిగా శివుని వెంట నడిచిన కేకరములగు గణములు పదికోట్ల మందితో, విద్యుత్తులనువారు ఎనిమిది కోట్ల మందితో, విశాఖులు అరువది నాలుగుకోట్ల మందితో, పారియాత్రికులు తొమ్మిదికోట్ల మందితో కూడి వచ్చిరి - సర్వాంతకుడనువాడు ఆరుకోట్లమందితో, వికృతానమడను శ్రీమంతుడు ఆరుకోట్లమందితో, జ్వాలాకేశుడు పన్నెండు కోట్లమందితో శివుని వెంట నడిచిరి.

సమదుడనువాడు ఏడుకోట్లమందితో, దుందుభుడు ఎనిమిది కోట్ల మందితో, కపాలీశుడు అయిదుకోట్ల మందితో, సంప్రదకుడు ఆరుకోట్లమందితో మండిరి. కుండకుడు, కుంభకుడు ఒక్కొక్కరే కోటికోటిమందివి తెచ్చిరి - విష్టంభుడను శ్రేష్టుడగు గణనాయకుడు ఎనిమిది కోట్లతో వచ్చెను. పిప్పలుడు, సన్నాదుడు వెయ్యికోట్ల మందితో, ఆవేశనుడు ఎనిమిది కోట్లమందితో, చంద్రతావనుడేడుకోట్లమందితో, మహాకేశుడు వెయ్యికోట్లమందితో, నంది పన్నెండుకోట్లతో, నగుడు, కాలుడు, కరాళుడు, మహాకాలుడు అనువారు వందకోట్లమందితో వచ్చిరి. అగ్నికుడను వాడు నూరుకోట్లమందితో, అగ్నిముఖుడు కోటిమందితో, ఆదిత్య మూర్ఖుడనువాడు కోటిమందితో, ధనావహుడు కోటిమందితో వచ్చిరి. సన్నాగుడు నూరుకోట్లమందితో, కుముదుడు మూడుకోట్ల మందితో, ఆమోఘడు, కోకిలుడనువాడు కోటికోటితో వచ్చిరి. కాకపాదుడు అరవై కోట్లతో, సంతానకుడరవైకోట్ల మందితో, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు తొమ్మిది కోట్లతో వచ్చిరి. నీలుడు తొంభైకోట్లతో, చతుర్వక్రుడు డెబ్బెకోట్లతో, వీరభద్రుడు, కరణుడు, బాలకుడు అరువదినాలుగు కోట్లతో వచ్చిరి. పంచాక్షుడు, శతమన్యు, మేఘమన్యు వనువారు ఇరవై కోట్లతో, సుకేశుడు, వృషభుడు అరువదినాలుగు కోట్లతో, విశ్వరూపుడు, తాలకేతు యాభయి కోట్లతో వచ్చిరి - ఈశానుడు, వృద్ధదేవుడు, దీప్తాత్మ, మృత్యుహా అనువారల్లే వచ్చిరి.

విషాదుడు, యమహా, భృంగిరిటి, అశనుడు, హాసకుడనువారు అరువది నాలుగు కోట్ల గణముల గలిగిరి. వీరు మరియు ఇతర గణరక్షకులు అసంఖ్యాకంగా వచ్చిరి. అందరూ వెయ్యి చేతులతో, బిటలను ముడివేసి ధరించి, చంద్రవంకను తలపై దాల్చి, నీలకంఠులు, త్రినేత్రులై యుండిరి . హారము, కేయూరము, కుండలము, ముకుటము మున్నగువాని నలంకరించుకొనిరి. అణిమాది సిద్దుల కలిగి శపించుటకు, అనుగ్రహించుటకు శక్తులుగా నుండిరి. ఆ గణనాయకులు కోటి సూర్యుల కాంతితో శివుని వెంట నడిచిరి. వారేకాక, పాతాళములో నివసించువారు, ఆకాశమున నివసించువారు, అన్ని లోకములలో నుండువారూ వచ్చిరి తుంబురుడు, నారదుడు, హాహా హూహూ అను పామగాయకులు, వాద్యముల తెచ్చి తీగలను మీటి శంకరుని ఉత్సవమున సంగీతమును వినిపింపజేసిరి. తపోధనులైన ఋషులు పూర్తిగా వచ్చి, వేదగీతములను, వివాహమున చదువు పుణ్యమంత్రములను సంతోషంగా జపించిరి. ఇట్లు శంకరుడు గంగాయమునలు వీవెనలను వీచుచుండగా, సముద్రుడు గొడుగు పట్టుచుండగా, స్త్రీలు అనేక విధములుగా ముచ్చటించుచూ లాబీలతో ఆమోదమును తెలుపుచుండగా గొప్ప ఆర్భాటముతో హిమగిరి స్థానమును చేరెను. ఆ స్థానము స్వర్ణకలశములో, వందలకొలది తోరణములతో శోభించుచుండెను. నేలపై వైడూర్యముల నుంచిరి, గృహములు రత్నములతో చేయించిరి - అది చేరి శివుడు అందరిచే స్తుతింపబడుచూ ద్వారమును చేరెను.

అక్కడ హిమవంతుడు కొంత వ్యాకులుడై కనిపించెను - మహాదేవుని రాకతో అతను తన సేవకులను పనులకై ఆదేశించెను. అంతట, బ్రహ్మను హిమవంతుడు గురువుగా నుండుమని ప్రార్థించెను - అట్లే బుద్దిమంతుడగు వాసుదేవుని అన్ని భారములను వహించుమని కోరెను. తరువాత విషాదముగా ఇట్లనెను - 'ఈ వివాహమున నా పుత్రిక సోదరుడులేనిదవుతుంది. - లాజహోమ మొదలగు పనులలో సోదరుడు లేనిదెట్లు? నా పుత్రుడైన మైనాకుడేమో సముద్రమును ప్రవేశించి అక్కడే వున్నాడు' - అని చింతతో విషాదముగా నున్న హిమవంతునితో మతిమంతుడగు విష్ణువిట్లనెను. 'గిరిరాజా! ఈ విషయమున ఏమాత్రమూ చింతించపనిలేదు  జగన్మాతకు నేనే సోదరుడిని - ఇది ఇంతే! ఇట్లేనచో క్రియలు కొనసాగును - లేనిచో కాదు'. అనగా హిమవంతుడు సంతసించి, బాగుగా అలంకరింపబడిన పార్వతిని కోట్లకొలదిగా పఖులు వెంటనడుచుచుండగా సదస్సున ప్రవేశపెట్టెను. అంతట అనుచరులతో కలిపి శివుడు కూడా నీలమయస్తంభములుగల, ప్రకాశించు బంగారు గోడలు గల, ముత్యముల వరుసను గల, ప్రకాశించు ఓషధులతో ప్రకాశించుచూ, వేలకొలది రత్నసింహాసనములు గలిగి వందయోజనముల విస్తారముగల వివాహమండపమును ప్రవేశించెను. అంతట గిరిరాజు మేనతో సహా, శివుని కాళ్ళమ కడిగి ఆ నీటిని తనపై లోకముపై చల్లెను. పాద్యము, ఆచమనము, మధుపర్కమును, గోవునిచ్చి ఇక ప్రయోగమును గూర్చి బ్రాహ్మణులు ఆలోచించుచుండిరి.

పితృదేవతల మనుమరాలగు, నా పుత్రికను నీకిచ్చుచుంటిని' - అవి హిమవంతుడు హరుని కులగోత్రముల వెడుగక మిన్నకుండెను. ఎవరికైనా తెలుసునేమోనని అందరినీ అడిగాను. అంత విష్ణువు ఇతరులనడుగుట ఎందులకు? అతని కులమేందుకు తెలియదో అతనిని అడుగుదమనెను పరగతిని తెలుసుకొనుటకు పర్పమే సమర్థము వేరొకరు కాదు కదా! తన గోత్రమును చెప్పనిచో వాపోదరిని ఇవ్వను' అని అనగా అందరూ గట్టిగా నవ్విరి. అంతలోనే హరుడేమననో యని అందరూ మిన్నకుండిరి - అంతట, బాగుగా ఆలోచించి శివుడు కొంత భయమునుపొంది, సిగ్గుతో చేష్టలుడిగిన పార్థిపద్వేను -అంతలో పెద్దలు సమయము మించిపోవుచున్నదని త్వరపెట్టిం ఆ, విష్ణువు శివునితో పితాతను, తండ్రిని నేనెజుగుదును. పర్వత రాజా! ఇక ప్రయోగమును వినుము' అనెను. ఆత్మపుత్రుడు, ఆత్మదోపాత్రుడూ అగు నీకు శంకరా పార్వతినిచ్చుచుంటిమని విష్ణువనగా అందరూ బాగు బాగు' అని పలికిరి అందరికీ ఈ దేవుడు అధికము, శ్రేష్టమూ అగు వృద్ధిని పెంచుగాక" యని పలికి నీటితో తన పుత్రికను, తనమ కూడా శివునికిచ్చి వేసెను - అపుడందరూ విస్మయముతో ఆ వివాహమును కొనియాడిరి.

పర్వతరాజు దాత, హోత సాక్షాత్తు చతుర్ముఖుడు - వరుడు సాక్షాత్తు శివుడు - కన్య విశ్వమునకు ఆరణియగు మహాదేవి' - అని ముమలు కొనియాడుచుండగా, పుష్పవర్షము కురియుచుండగా, దేవతూర్యములు గుచుండగా శివుడు పార్వతి చేతిని పట్టుకొను. శివుడు సిగ్గుతో నిలిచిన పార్వతిని చూడగా, ఆమె ఆ దేవుని చూచి తృప్తినొందకపోయెను. అచట బ్రహ్మాది మునులు అద్భుతరూపముగల పార్వతిని చూచుచూ మనసులో పరమేశ్వరుని శరణుజొచ్చిరి. వారదుడు, హిమవంతుడెట్లు స్థిరముగా నుండిరో అట్లు మనమూ మోహము చెందరాదనుకొనిరి -అది అట్లే ఆయేమ. దేవతలు, మునులు కొనియాడుచుండగా శివుడు సాక్షాత్తు అగ్నియే ఆశ్రయించిన పవిత్ర వేదికను ప్రవేశించెను. శ్రుతులు చెప్పిన మంత్రములు రూపుదాల్చి యుండగా, బ్రహ్మ దేవుని హవవేము చేసెను - శివుడా ఆగ్నికి మూడుమార్లు ప్రదక్షిణము చేసి వమస్కరించెను. త లాజహోమముననే ఉమాదేవి సోదరుడగు శ్రీహరి 'ఈశ్వరా! చాలా లోకములు కలిసివచ్చి జనసమ్మర్దమున్నది - వీ ఆభరణములు జాగ్రత్త' యనెను. అంతట వుడతనితో స్వలపమని దాచకుము - శ్రీహరీ! ఏదైనా కోరుకొనుము - నేనే నీకిచ్చెదమ' అనగా విష్ణువు 'వీయందు టమైన భక్తియుండుగాక! యని కోరగా దుర్లభమగు ఆ వరమును విష్ణువుకు శివుడిచ్చెను.

            శివుడు, విష్ణువు ఇద్దరూ బ్రహ్మకు సృష్టి సంరక్షణను, అగ్నికి యజ్ఞభాగములను ప్రీతితో నిచ్చిరి. వేదరక్షణ దక్షిణము భృగుమొదలగు మునులకిచ్చిరి - అటు తరువాత గీతముల, నృత్యములు, కోరిన భోజనములు, మహోత్సవములనేకములతో గొప్ప విస్మయమేర్పడెను. కోరిన దానములనిచ్చు శివుడు అందరికీ వీడ్కోలు పలికెన  దుమించుచున్న మేనాహిమవంతులను సరస్వతి ఊరడించెను - అపుడు హిమవంతుని, బ్రహ్మ విష్ణువులను పిలిచి వీడ్కోలు పలికి హిమవంతుని అర్చించబడిన శివుడు మందర గిరికి బయలుదేరెను పార్వతితో కలిసి శివుడట్లు వెళ్ళిపోగా హిమవంతుడు బంధువులతో కలిసి రోదించసాగెను - జగత్తులో కన్యకతండ్రియగు ఏ వ్యక్తికి మనస్సు విహ్వలమవదు?  పార్వతీ దేవి వివాహవిషయమున ఏనరుడు పవిత్రుడై వినునో, అధ్యయనము చేయునో విశేషముగా వివాహమంగళ సందర్భమున చదువునో అతను మంగళముమ, వృద్ధిని చిరకాలము పొందును .

ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండము కుమారేశమాహాత్మ్యమున శివపార్వతుల వివాహమును వర్ణించుట యను ఇరువది యారవ అధ్యాయము.