స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
11వ అధ్యాయము
పూర్వము నేను శాండిల్యుడని పేరొందిన ద్విజుడిగా జన్మించితిని. బాల్యక్రీడలో భాగంగా నేను వర్షాకాలమున ఎత్తైన శివాలయమునొక దానిని నిర్మించితిని - నీటితో తడిసిన ఇసుక కలిగి ఎత్తైన ప్రాకారములతో శోభిల్లుచుండెను - రాజా! గణేశ, శివ, దుర్గ, సూర్య, విష్ణు మూర్తుల కలిగి పంచాయతన విన్యాసములో మిక్కిలి మనోహరముగా ఆ ఆలయముండెను పచ్చని,మట్టి,బంగారుకలశములతో, ద్వజమాలలతో విలసిల్లుచుండెను - కర్రల తోరణముల విన్యాసముతో, ఊయలతో విలసిల్లుచుండిన - గట్టిగా, ఎత్తుగా నున్న మెట్ల వరుసలతో వెలుగొందుచూ అనేక ఆశ్చర్యములలో నుండెను - నేను మిత్రులతో కలిపి దివ్యమగు జాగేశ్వరలింగమును చేసి వర్షపు నీటితో శుద్ధిపరచి రాతి రూపమున దానిని బాలభావములో నటనంచితిని. ఒక పుష్పములతో మరియు ధాన్యభూములలో సేకరించిన కోమలమగు ఇతరపుష్పములతో, ప్రతివల్లీ పుష్పములతో గుమ్మడికాయలతో, ఉమ్మెత్త పూలతో, మందారములతో, బిల్వపత్రములతో, దూర్వామొదలగు గరికతో, చిగురులతో ఇట్లు శివునికి నేను రమ్యమగు పూలనొనరించితిని - రాజా! తరువాత దేనినీ ఆశించకనే శివుని ఎదుట లొండవము నారంభించితిని - బాల్యముచే శివుని ఎదుట స్వరము లేకుండా గానము చేసితిని. ఇతర పిల్లలతో కలిసి ఇట్లు బాల్యమున ఒకమారు మాత్రమే శివపూజనొనర్చితిని
తరువాత (కాలక్రమమున) మరణించిన నేను జాతిస్మరణమున్న విప్రునిగా విదిశా నగరమున జన్మించి విశేషముగా శివపూజను, శివదీక్షను పొంది శివాగమములచే ననుగ్రహింపబడి చేయసాగితిని. శ్రద్దలో లింగమును నిలిపి శివప్రసాదమును బడిసితిని. శివాలయమును నిర్మించిన వాడు స్వర్గమున అనేక కల్పముల కాలము నివసించును - రాజా! శివుని ఆలయమున ఎన్ని పరమాణువులుండునో అన్ని సంవత్సరములు ఆ ఆలయమును నిర్మించినతడు శివలోకముననుండునను పురాణవాక్యములను స్మరించుచూ రాతితో విశ్వకర్మ విధానముననుసరించి రమ్యమైన శివాలయమును నిర్మింపజేసితిని. మట్టిలో గానీ, కర్రలతో గానీ, ఇటుకలతో గానీ, రాతితో గానీ శివాలయమును నిర్మింపజేసిన ఒకదానికంటే నొకటి పదిరెట్లు ఫలవంతమగును - శివునిపై భక్తితో భస్మమున నిద్రించుచూ, మూడుమార్లు స్నానము చేయుచూ, భిక్షాటన ద్వారా లభించిన అన్నమునే భుజించుచూ, జిటలను ధరించి తపస్సునాచరించుచూ శివారాధన తత్పరుడనైతిని. ఇట్లు తపము నాచరించుచున్న నేను మరల మరణించితిని - మరల జన్మయందు నేను ప్రతిష్టానపురమను గొప్పపురమున సూర్యవంశమునకు చెందిన జయదత్తుడను రాజుగా జన్మించి పూర్వజన్మస్మరణము కలిగియుంటిని. తరువాత నేననేక ప్రాసాదములను నిర్మింపజేసితిని.
ఆ జన్మయందు శివునికి ఆరాధన చేయుటలో మునిగిన నేను బకపుష్పములను, బంగారు, వెండి, రత్నముల పుష్పములను, అన్నదానములను చేయించితిని. పూలలో కేవలము శివలింగముల పూజించుచుంటిని. అంతట వా పూజచే సంతోషించిన శివుడు నాకొక వరమునిచ్చెను - వృద్ధాప్యము, మరణములేని వరమును పొంది ఆ శరీరములోనే జీవించుచూ అనన్యసాధారణమైన వరమును పొందుట చేత మదించి, మదించిన ఏనుగువలె భూమిపై చరించుచుంటిని - శివభక్తిని విడచి మదనాతురుడనైతివి. అట్టి నేను ఇతరుల భార్యలగు స్త్రీలను బాధించుటకు మొదలిడితిని. ఆయుషు, తపస్సు, కీర్తి, తేజస్సు, యశస్సు, లక్ష్మీ - ఇవన్నీ నశించుటకు ముఖ్యకారణము ఇతరుల భార్యలను బాధించుటయే. సుందరస్త్రీల కంటబడిన వాడు చెవులుండిననూ చెవులు లేనివానివలె, చూచుచున్ననూ అంధునివలె, మాటాడుచూ మూగవానివలె, చైతన్యముండీ అచేతనుని వలె, విద్వాంసుడైననూ మూరునివలె క్షణమాత్రముననే అయిపోవును. మరణించినవానికి నరకవాపము, జీవించువానికి తనకంటే శక్తివంతుడగు వానినుండి భయము అను ఈ రెండూ ఇతరుల భార్యలను బాధించుటచే కలుగును కనుక ఇతరుల భార్యలను బాధించుట యన్నది రెండులోకములను నశింపజేయునది - రాజా! వృద్దాప్యము, మరణము లేని వాడినని నిశ్చయమును పొందిన నేను ఇహలోక, పరలోక భయములను విడిచిపుచ్చి ఇతరుల స్త్రీలను బాధించసాగితీని
ఇట్లు నేను మర్యాదను విడిచిపుచ్చుట తెలిపి యముడు ఇది శివుని వరప్రదానముచేతనవి తెలిసి శివుని వద్దకు వచ్చాను - నేను ధర్మమును అతిక్రమించుటను గూర్చి శివునికి విన్నవించెను. దేవా! ఏ ప్రభావముచే రక్షింపబడిన ఈ పొడిని నియంత్రించలేకుంటిని - నా పనిలో వేరే ఎవరినైనా నియోగింపుము - స్వామీ! ప్రతివ్రతలు, గోపులు, వేదవిదులైన విప్రులు, దానశీలురు, సత్యనిష్టులు వీరు జగత్తుకు ఆధారమంటివి. వీరిలో ముఖ్యమైనది పతివ్రత ఆట్టి పతివ్రతల నితడు బాధించెను. వా ధర్మశాసనమే లోపించినది - నీ వరదానము చేత మదించి నన్ను తృణీకరించి ప్రతిష్టాతవాసియైన జయదత్తుడు ధర్మశాసనమునుల్లంఘించుచున్నాడు' అని యముడుచెప్పగా విని మహాదేవుడగు రుద్రుడు మిగుల కోపించి, నమ్న పిలిపించి, వణుకుచూ ఆంజలిని జోడించి నిలిచిన నన్నిట్లు శపించెను, 'దుష్టప్రవర్తన గలవాడా! కామాతురుడ పతివ్రతలమ బాధించినందున వెంటనే తాబేలుని గమ్ము' అనగా శాపతాపమును హరించు శివునే నేను వేడుకొనగా శివుడు ఆరవయ్యవ కల్పమున శాపము తొలిగి నా గణమయ్యేదవని పలికి మాయమయ్యెమ - అప్పుడు నేను పదియోజనముల పొడవున్న తాబేలునై సముద్రజలములో నుండగా నీవు యజ్ఞసాధనమునకై పన్ను తెచ్చితివి
పూర్వము యజ్ఞము చేయుచూ నీవు చేసినది తలచి భయము నొందితిని. నా వీపును నీవు కాల్చితివి - చూడుము ఈ వ్రణములను కల్పసూత్ర విధిననుసరించి అనేక చయనములను వా వీపుపై చేసితివి - ఇంద్రద్యుమ్నా! మరల నీవు యజ్ఞములతో పృథివిని పూర్తిగా తపింపజేసితివి. అపుడు భూమి అన్ని తీర్థముల సారమును స్రవించి మహీనది అయినది దానియందు స్నానమాడినంతనే అన్ని పాపముల నుండి ముక్తులగుదురు - అంతట ఒకప్పుడు ఏదో ఒక కారణము చేత ప్రళయమేర్పడెను. ఈ నూరు యోజనముల మానసము తేలుచునుండెను - పూర్వము నాకు యాభయిజరు కల్పములు గడిచినవి - ఇక నాలుగుకల్పములుగడిచినచో మోక్షమే - ఇది నా దీర్ఘాయువును, కూర్మత్వమును గూర్చిన వివరము సతీధర్మములకు ద్రోహము చేసిన నాకు ఈశ్వర శాపముచే కూర్మత్వము ప్రాప్తించిమ - శత్రువైననూ ఇంటికి వచ్చిన నీకు నేనేమి చేయగలను? చెప్పుము రాజా! పూర్వము యజ్ఞములతో నా వీపును కాల్చితివి - ఇప్పటికీ అది మండుచున్నట్లే వాకనిపించును. ఇక, ఇపుడు వచ్చిన విమానమును దేవదూతలతో కూడిన దానినెందుకు నిరాకరించితివి? నీవు సంపాదించిన భోగములను నీవే అనుభవింపుము
అనగా ఇంద్రద్యుమ్నుడిట్లనెను - ‘చతుర్ముఖుడగు ఆ బ్రహ్మ నన్ను స్వయముగా స్వర్గమునుండి వెడలగొట్టి సిగ్గల బేసెను గాన పతనభయము' ఆధిక్యాది దోషములున్న ఆ స్వర్గమునకు నేను వెడలను కనుక వివేకము, వైరాగ్యములే పాపమును వశింపజేయుననీ, దానిని అవలంబించి జ్ఞానమును పొంది ముక్తికి ప్రయత్నించెదను. నీ ఇంటికి వచ్చిన నాకు ఆతిథ్యమునెట్లిచ్చితివో అట్లే ఆపారమగు సంసారమునకు తీరమునొసగు గురువెవరైనా నాకు గలరా నీవే చెప్పుము'. అని ఆడుగగా కూర్మమిట్లు చెప్పెను - నాకంటెను దీర్ఘాయువగు లోమశుడను మహాముని గలడు - ఒక మారు వతనిని కలాపగ్రామమున జూచితిని'. అనగా ఇంద్రద్యుమ్నుడిట్లనెను - 'కనుక మనమంతా అక్కడికే వెళ్ళేదము రమ్ము తీర్థముకంటె సత్సంగతి పవిత్రమని ఋధులందురు' అని రాజనగా విని ఆరుగురూలోమశమహామునిని మనసులో నుంచుకొని అతని చిరాయువు వెనుక రహస్యమేమిటో తెలియగోరి సంతోషముగా బయలు దేరిరి.
ఇది శ్రీస్కాంద మహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున మహీనదీప్రాదుర్భావమున కూర్మాఖ్యానమను పదకొండవ అధ్యాయము.
