స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
15వ అధ్యాయము
అపుడు వరాంగి ఇట్లు చెప్పెను. ‘అనాథవలె నేను, కోపించిన ఇంద్రుని చేత నాశనాన్ని పొందాను - దెబ్బతీయబడినాను, భయపెట్టబడినాను, పీడింపబడినాను. దుఖాంతమున చూడని నేను ప్రాణాలను విడుచుటకు సిద్దమైనాను. దయయున్నచో ఈ ఫరదుఃఖమునుండి దాటవేయు పుత్రుని నాకు ఇచ్చిన చాలు’ అని వరాంగి అనగా దైత్యేంద్రుడు దుఖమునొంది ఇట్లనుకొనెను - ‘అసురభావాల పట్ల నాకు స్పృహ లేకున్ననూ, ప్రియమగు స్త్రీని దయతో చూడవలెనని శాస్త్రముల ద్వారా తెలుసుకొన్నాను - అన్ని ఆశ్రమములను గ్రహించి వివాహమాడి, గృహస్థాశ్రమము ద్వారా అన్ని ఆశ్రమములమ గ్రహించినవాడు నావతో సముద్రమును దాటినట్లు దుఖాబ్దిని దాటగలడు. ఇతరముల నాశ్రయించి జయించలేని ఇంద్రియములనే శత్రువులన, గృహస్థులు అతిసులువుగా భార్యనాశ్రయించి, దుర్గపతి డిస్యులను జయించినట్లు జయింతురు. గృహేశ్వరియగు భార్యను అనుకరించుటకు ఎవరూ సమర్థులు కారు. పూర్తి ఆయుష్టుతో కూడా ధర్మముచేయువాడెట్లు సమర్థుడు కాడో వీరునూ అంతే - భార్యయందు తాను సంతానరూపంతో జన్మించును గాన భార్యను ‘జయ’ అందురు. ఎట్టి పరిస్థితులలోనైనా భరించదగినది గాన ‘భార్య’ యనబడును. సంసార కల్మషములనుండి రక్షించునది గాన ‘కళత్ర’ మని అనబడును - ఇట్టి ప్రియమైన భార్యను ఎవడు దయతో చూడడు?
‘మూడు జ్యోతులను పురుషుడందుర’ని దేవలుడు చెప్పెను - అవి భార్య, కర్మ, విద్య అనునవి - ప్రయత్నముచే ఈ మూడింటినీ సాధించవలెను. కనుక, దుఖమునొందిన నా భార్యను నేను భర్తనై కూడా పాలించనిచో, శాస్త్రానుసారము నరకమునకే వెళ్ళేదను. సంశయములేదు. నేనునూ ఈ ఇంద్రుని జయించుటకు సమర్థుడనే. ఋణముతీరుటెట్లు? ఈ వరాంగి కోరికను తీర్చెదను - మహాబలుడైన పుత్రుని ఇచ్చెదను’. అనుకొని ప్రజాంగుడు కోపముతో కన్నులవరుచుండగా మహేంద్రునికి ప్రతీకారముచేయుటకు మరల తపస్సును చేయబూనుకొనెను. మిగుల క్రూరమైన ఆతని కోరికను తెలిసి బ్రహ్మ మరల దితిపుత్రుడున్న చోటికి త్వరగా వచ్చెను. వజ్రాంగునితో బ్రహ్మ మధురమగు వాక్కుతో ఇట్లనెను. దైత్యుడా! ఆహారము గ్రహించబోవుచూ నీవు మరల తీవ్రమగు నియమమును గ్రహించితివెందులకు? వేయిసంవత్సరములు ఆహారము లేకుండా గడిపి, ఇప్పుడు లభించిన ఆహారమును క్షణమాత్రముననే విడిచివేయు నీవు ఫలమునొందితివి. పొందని దానిని త్యజించుట గొప్పకాదు - పొందిన దానిని వదిలి వేయుటే గొప్ప’ - అని బ్రహ్మ పలుకగా విని దైత్యుడు చేతులు జోడించి ఇట్లనెను.
దైత్యుడిట్లనెను – ‘పితామహా! వా భార్యకొరకీ ఘోరమైన తపమునాచరించెదను. దేవతల దర్పముమ నశింపజేఁ పుత్రునికొరకు వేనిట్లు పూమకుంటిని’. అనగా వివి బ్రహ్మ ప్రసన్నుడై దైత్యరాజుతో విట్లనెను. ‘నాయనా! తపమి. చాలు. ఈ విస్తరమైన క్లేశమును చేరకుము - నీకు మహాబలుడగు తారకుడను పుత్రుడు కలుగును. అతను దేవతాస్త్రీల కిష్టమైన శిరోజశృంగారమును విడిపింపజేయువాడు - (దేవతల వాశకుడని భావము) అనగా దైత్యరాజు బ్రహ్మకు నమస్కరించి అక్కడినుండి తన భార్యవద్దకు వెళ్ళి ఆమెను సంతుష్టుడై సంతోషింపజేయసాగెను - అంతట ఆ దంపతులిరువురూ కృతార్థులై ఆశ్రమమునకు వెళ్ళిపోయిరి. కొంతకాలమునకు సుందరియగు వరాంగి గర్భమున ధరించెను - మొత్తం వేయి సంవత్సరాలు తన గర్భముననే మోపెను. వేయి సంవత్సరాల చివర వరాంగి పుత్రుని కనెను - లోకభయంకరుడైన ఆ దైత్యేంద్రుడు జన్మించగా భూమి పూర్తిగా కంపించెను, మహాసముద్రములు ఉప్పొంగెను - పర్వతములు కదిలిపోయెను. భయంకరమగు గాలులు వీచెను. వేటగాడు కొట్టగా మృగములవలె మునిశ్రేష్ఠులు జపించసాగిరి. సూర్యుడు మొదలైన తేజోరాశులు కాంతివి విడిచిరి - దిక్కులంతటా మంచుకమ్మెను. ఆ మహాసురుడు జన్మించగా మహాసురులు సంతోషముతో ఆక్కడికి వచ్చిరి.
అసురస్త్రీలు సంతోషముగా గానము చేసిరి - నాట్యము చేసిరి - అట్లు మహోత్సవ మేర్పడెను. అపుడు దేవేంద్రునితో సహా ఇతర దేవతలు విషాదమునొందిరి. భీకరపరాక్రమముగల దైత్యంద్రుడట్లు జన్మించి,కురంగమహిష మొదలగు దైత్యులచే అభిషిక్తుడాయెను. అతనంతట అందరు మహాసురులతో కలిసి అసుర రాజ్యమున నుండెను - ఆరువా! ఇట్లా తారకాసురుడు మహారాజ్యమును పొంది, దానవశ్రేష్ఠులతో పయుక్తికముగా ఇట్లనెను. ‘అసురులురా! నా ఈ వాక్యముమ వినుడు - మహాబలులారా! నా మాటమ విని స్థిరమైన బుద్ధిని పొందండి. మనకు జాతిధర్మముచేతనే వైరము నాశనములేక పెరిగినది - సురుల వైరమునకు ప్రతిక్రియను చేసి విజయము పొందునట్లు చేసెదను. కాని, దేవతల ఎదుర్కొనుట కేవలము తపస్సు చేత సాధ్యము - కనుక దానవులారా! ముందు ఘోరమైన తపమును చేసెదను. దానిచే మనము సురులమ జయింపగలము, ముల్లోకములను అనుభవించగలము యుక్తమగు ఉపాయము గల పురుషునికి స్థిరమగు లక్ష్మి కలుగును కదా! ఇక అయుక్తుడై, చపలుడగు వాడు, పొందిన దానిని కూడా రక్షించలేడు’ - అనగా ఆ అసురిని మాట వినిన అసురులు విస్మయమునొంది ‘బాగు, బాగు’ అనీ అవిరి - ఆంత తారకుడు తపస్సుకై పారియాత్ర పర్వతముయొక్క ఉత్తమమైన గుహను చేరెను.
అన్ని ఋతువులలోమా వుండే పుష్పములతో, అనేక ఔషధులతో ప్రకాశించునదిగా ఆ గుహయుండిన - అనేక ధాతు రసములు స్రవించు అనేక విచిత్రమగు వెలవులు గలది. అనేకాకారములుండెను - విడిగా పక్షుల గుంపులతో ఆ గుహ యుండెను - అక్కడ అనేక శిలలు, కొలనులుండెను. అట్టి గుహమ చేరి తారకుడు గొప్ప తపస్సు నాచరించెను - పశుపతి దీక్షను గ్రహించి ‘పంచమంత్రములను’ జపించసాగెను. ఆహారము లేకుండా ఐదగ్నులమధ్య అనేక సంవత్సరములు తపమాచరించెను. తన దేహమునుండి ప్రతిదినమూ మాంసమున కొంత అగ్ని కర్పించుచుండెము - చివరకు మాంసము లేని వాడాయెను - ఆదే స్థితిలో అతను తపోరాశిగా మారెను. అతని తేజస్సుచే ప్రాణులన్నీ అంతటా జ్వలించసాగెను - అతని తపస్పుకు- భయపడి సురాసురులంతా ఉద్వేగమును పొందిరి. ఇంతలో బ్రహ్మ పరమసంతోషమును పొండి, తారకునికి పరమునిచ్చుటకు పర్వతశిఖరమును చేరుకొనెను. హంసవాహనుడు బ్రహ్మ ఆ పర్వతరాజును చేరుకొని మధురమైన వాక్కుతో తారకునితో నిట్లనెను.
నాయనా! తపస్సునుండి లెమ్ము! ఇకనీకిపుడు ఆపాధ్యమైనది లేదు - నీ మనస్సులోనున్నదీ, నీకిష్టమైనదీ అగు వరమును కోరుకొనుము’. అనగా తారకాసురుడు చేతులు జోడించి బ్రహ్మతో నిట్లనెను. ‘ప్రభూ! జాతిధర్మముగల మేము దేవతలతో వైరము గల వారము. క్రూరులగు దేవతలచేత నృశంసులవలె దైత్యులు పూర్తిగా నశింపజేయబడినవారు. వారిమద్ధరించవలెనని తలచుచుంటినీ - అట్టి నేను అన్ని ప్రాణులచేత, శక్తివంతములగు అస్త్రములచేత, దేవతల చేత కూడా వధింపబడకుండునట్లు వరమునిమ్ము - ఇదే నా మనసులోనున్నది - వేరొక వరమున కోరను’ అనగా ఆ దైత్యునితో బ్రహ్మ ఇట్లనెను - ‘మృత్యువు లేనిదే జీవులు దేహమును ధరించుట కుదరదు - పుట్టినవానికి మృత్యువు తప్పదని శ్రుతి చెప్పినది నిజము. అవి బాగుగా ఆలోచించుకొని నీవు ఎవరినుండి మృత్యువును శంకించవో వారిని తప్ప ఇతరుల మండి అవధ్యత్వమును వరముగా కోరుకొనుము’. అనగా ఆలోచించుకొని తారకాసురుడు ఏడేళ్ళ బాలుని నుండి తప్ప ఇతరుల మండి ఆవధ్యత్వముమ కోరుకొనెను. తారకుడిట్లనెను - ‘ఏడుసంవత్సరాల వయసుగల బాలుని చేత తప్ప దేవతల చేత గూడా మరణము లేని వరము నిమ్ము’ అని తారకుడు, బ్రహ్మ కోరగా మానమోహితుడై వరముగా మృత్యువును కోరుకొనెను - బ్రహ్మ కూడా హరుని మాటపై ‘తథాస్తు’ అనెను.
బ్రహ్మ స్వర్గమునకు, దైత్యుడగు తారకుడు తన నివాసమునకు వెళ్ళిరి - తపస్సునుండి బయటకు వచ్చిన తారకుని దైత్యరాజులందరూ, ఫలములతో మన్న చెట్టును పక్షులు చుట్టు ముట్టినట్లు చుట్టు ముట్టిరి - గొప్పదగు రాజ్యమును దైత్యరాజగు తారకుడు పాలించుచుండగా బ్రహ్మచెప్పిన చోట సముద్రతీరమునకు ఉత్తరమున చెట్లు జన్మించినవి. అక్కడ అన్ని ఋతువులూ శుభముగా నుండెను. గుణవంతుడగు తారకుని, కాంతి, యోగము, ధృతి, మేధ, అఖండ సంపదలు పూర్తిగా అన్నీ వచ్చి చుట్టినవి. అందమైన బాహుభూషణములతో, గొప్పకిరీటములతో అతను అలంకరింపబడేను - కాలాగురుసుగంధమును శరీరమునకు అలుముకొనియుండెను. గొప్ప సింహాసనము నధిష్ఠించెను. గొప్ప అప్సరసలు నర్తించుచుండిరి - గంధర్వులు గానము చేయుచుండిరి - సూర్యచంద్రులు దీపముల మార్గములలో, వాయువు వీవనలలో నిలిచిరి. గ్రహములు ముందు నడుచుచూ గురుని ఆదేశములనే పలుకుచుండిరి. ఇట్లు తన బాహుబలముతో జయించిన రాజ్యమును పొంది తారకుడు సంతోషించుచూ, పెరిగిన సర్వాంగబలముతో దర్పమునొంది మంత్రులతో నిట్లు పలికెను.
ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున కుమారేశుని మాహాత్మ్యమున తారకాసురుని ఉత్పత్తిని వర్ణించుట యను పదిహేనవ అధ్యాయము.
