స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

14వ అధ్యాయము

 ‘మహామునీ! కథ మధ్యలో వీవు పేర్కొన్న కుమారనాథుని మాహాత్మ్యాన్ని విస్తరముగా వినగోరుచున్నాను. అని అర్జునుడు అడుగగా వారదడిట్లు చెప్పిన - అర్జునా! కుమారస్వామి వజ్రాంగుని పుత్రుడైన తారకుని వధించి ఈ లింగమున స్థాపించెను. ఈ కుమారేశుడు, దర్శనముచే, శ్రవణముచే, ధ్యాపముచే, పూజచే, ప్రతిచే, వందనములచే కూడా అన్ని పాపములను తొలగించును’. అనగా అర్జునుడిట్లడిగెను - ‘నారదా! అమిత ఆశ్చర్యమును కలిగించు ఈ రమ్యమైన కథమ ఉన్నదున్నట్లుగా నాకు విస్తరముగా తెలియజేయుము. వజ్రాంగుడనే ఈ దైత్యుడెవరు? తారకునిప్రభావమేమి? అతనెట్లు వధింపబడెను? కుమారస్వామి ఎట్లు జనించెను? కుమారేశ్వరుడనే ఈ లింగమెట్లు స్థాపింపబడెను? ఈ లింగము యొక్క ఫలమేమో విస్తరముగా నాకు చెప్పుము’. అనగా నారదుడిట్లు చెప్పసాగెమ - ‘పేవాని, ప్రభువు అగు కుమారునికి నమస్కరించి ఏకాగ్రచిత్తములో ఈ గొప్పదగు కుమార చరితమును వినుము. అర్జునా! బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడను ప్రజాపతి. ఇతను ఏరణియను సీద్వారా ఆరవైమంది బాలికలను కనెను. వారిలో పదిమందివి ధర్మమునకు, పదముగ్గురిని కశ్యపునికి, ఇరవైఏడుమందిని చంద్రునికి, నలుగురిని అరిష్టనేమికి, ఇద్దరిని భూతాంగిరసునికి, ఇద్దరిని కృశాశ్వునికి ఇచ్చి వివాహమును చేసెను - ఇక వీరి పేర్లను వినుము.

ఎవరి సంతాన ప్రభావముచే ఈ మూడు లోకములూ నిండినవో అట్టివారి పేర్లు ఇవి - భాను, లంబ, కకుత్, భూమి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనువారు ధర్ముని పత్నులు - వారికుమారుల పేర్లను వినుము. భానువుకు దేవర్షభుడను ఇంద్రసేనుడు జన్మించెను. లంబకు విద్యోతుడు, అతనికి స్తనయితృవులు జనించారు. కకుదకు శకటుడను. వాడు అతనికి కీకటుడు జన్మించిరి. భూమియను దానికి దుర్గుడు, స్వర్గుడు జన్మించగా వారికి నందుడుకలిగెను - విశ్వకు విశ్వేదేవతలు, జనించిరి కాని వీరికి సంతతి లేదందురు. సాధ్యకు పన్నెండుగురు సాధ్యులు, వారికి ఆర్థసిద్ది జన్మించిరి - మరుత్వతికి మరుత్వాన్, సుజయంతుడు కలిగిరి. జ్ఞామలగువారు వీరిని నరనారాయణులందురు - వసువుకు అష్టవసువులు, ముహూర్తకు ముహూర్తకులు జన్మించిరి. వీరే అన్ని ప్రాణులకు తమ కాలమున కలుగు ఫలమును ఇత్తురు. సంకల్పకు సంకల్పుడు. అతనికి కాముడు జన్మించిరి. సురూప పదకొండుమంది రుద్రులను కనెను - వారు కపాలీ, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు మరియు ఆజకుడు, శాసనుడు, శాస్త్ర, శంభువు, భవుడు, అన్యుడు అనువారు - రుద్రుని పార్షదులందరూ వీరూపకు పుత్రులుగా జన్మించిరి. ప్రజాపతి పుత్రుడగు ఆంగిరసునికి స్వధ పత్ని ఆమె పితరులను కనెను. సనీ (చీ?) అథర్వాంగిరస ప్రభుని కనెను.

కృశాశ్వునికి అర్చి, ధిషణ యని ఇద్దరుభార్యలు. వారికి అస్త్రగ్రాముడను పుత్రుడుకలిగెను - అతనే సంహారుడనబడెను. అరిష్టనేమికి పతంగి, యామినీ, తామ్ర, తిమియను వారు భార్యలు. పతంగి పతగములనుకనగా, యామిని మిడుతలను (శలభములను) కనెను. తామ్ర శ్యేనములను, గృధ్రములను కనగా తిమి జలజంతువుల గనెను. ఇక కాశ్యపుని భార్యల పంతానమును వినుము. వారి నుండి జగత్తేర్పడెను. లోకముల, వావి తల్లుల శుభమైన నామముల వినుము - ఆదితి, దితి, దనువు, సింహి, దనాయువు, సురభి, అరిష్ణా, వీనత, గ్రావ, దయ, క్రోధవశ, ఇర, కద్రువు, ముని యను వారు మాతృరూపులు అదితి పుత్రులు ఆదిత్యులు, దితి పుత్రులు దైత్యులు, దనుపుత్రులు దానవులు, సింహి పుత్రుడు రాహువను గ్రహము. దనాయువునకు బలవంతుడగు దనాయువను గణము పుట్టెను. సురభికి గోవులు, అరిష్టకు యుగంధరులు జన్మించారు. వినత అరుణుని, మహాబలుడగు గరుత్మంతుని కనెను - గ్రావకు శ్వాపదములు పుట్టగా, క్రోధవశకు గణుడు పుట్టెను ఇరకు వృక్షముల జన్మించగా కద్రువకు నాగులు, మునికి అప్సరోగణాలు పుట్టెను. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడను వారు దితిపుత్రులు - వారు విష్ణువుచే వధింపబడిరి.

తన పుత్రులు చావగా దితి కశ్యపుని ఆరాధించి మహాబలుడగా వేరొక పుత్రునిమ్మని యాచించెను. కశ్యపుడు దితికి యుద్ధములో ఇంద్రుని జయింపగల పుత్రునికై వేయి సంవత్సరముల కాలము నియమముగా నుండుమనెను. అంతట పుష్కరముగనున్న దితి నియమమును బూని యుండగా ఇంద్రుడు ఏకాగ్రతో ఆమెను ఉపాసించెను. దితి ఇంద్రుని ఉపాపనను అనుమతించి వేయి సంవత్సరములు మిగిలివుండగా, ఇంద్రుని భక్తికి సంతోషించి ప్రీతితో ఇట్లనెను. ‘దేవేంద్రా! నా వ్రతమైపోవచ్చినదని తెలుసుకొనుము. నీకొక సోదరుడు కలుగును - ఆతనితో నీవు ఈ సంపదనమభవించగలవు - అట్లే న్యాయముగా నీవు నిష్కంటకముగా ముల్లోకముల ననుభవించెదవు’. అని పలికి బాగా నిద్రరాగా ముడుచుకొని పడుకొనెను - భవిష్యత్తులో ప్రయోజనముయొక్క బలముచేత ప్రేరితురాలై దితి పగలే నిద్రించసాగెను. ఆ అవకాశమును చూచి ఇంద్రుడు దితి కడుపులోనికి ప్రవేశించి గర్భమును ఏడుముక్కలుగా ఖండించెను. ఒక్కొక్కదానిని మరల ఏడుభాగాలుగా కోపముతో పైకి లేపి వజ్రముచేత ఖండించగా దితి మేల్కొని ‘చంపవద్దు, చంపవద్దు’ అని ఇంద్రునితో ననెను - వజ్రము చేత ఖండించబడుచున్న గర్భమును చూచి ఆమె రోదించెను.

అపుడు ఇంద్రుడు రోదించవద్దనుచూ గర్భమునుండి బయల్వెడలి చేతులు జోడించి భయము లేనివాడై, కోపముతో నున్న తల్లితో నిట్లనెను. ‘అమ్మా! నీవు ముడుచుకొని, నీ తలవెంట్రుకలు పాదములకంటుకొనగా పగటిపూట నిద్రించావు. ఇట్లు చాలాకాలము పడుకొనగా నేను నీగర్భమును ఛేదించితిని - వజ్రాయుధముచే నలభైతొమ్మిది భాగాలుగా చేసితిని. నీవన్నట్లు నేను వారితో సంపదలననుభవించెదను - నీ మాట నిజమగుగాక! నేనున్నంతకాలమూ వారికి స్వర్గమున స్థానములనివ్వగలను. రోదించవద్దు (మా రోదీ) అని అన్నందువలన వీరు మరుత్తులను ప్రసిద్దిగాంతురు, అనగా దితి సిగ్గుతో నిరుత్తరురాలైపోయెను. ఇంద్రుడు ఆ మరుత్తులను వాయువులతో కలిసి వెళ్ళిపోయెను. అటు తరువాత దితి దుఃఖమునొంది తన భర్తను చేరి ఇట్లనెను. ‘భగవన్! ఇంద్రుని సంహరించే బలవంతుడగు పుత్రునొకడిని నాకిమ్ము, అతను దేవతల అస్త్రశస్త్రముల చేత వధింపబడనివాడై యుండవలెను. ప్రత్యుత్తరమివ్వనిచో నేను మరణించినట్లే. తెలుసుకొమ్మ’ నగా కశ్యపుడు అతిదుఃఖితురాలగు తన భార్యతో నిట్లనెను. పదివేల సంవత్సరముల కాలము నీవు దీక్షగా తపమాచరించినచో నీకు ఇనుము వలె దృడమైన, వజ్రసారమయమగు అవయవములు గల పుత్రుడు వజ్రాంగుడనువాడు కలుగును - అతని అవయవములు ఛేదింపబడనివిగా నుండును - అతను ధర్మము పట్ల ఆభిమానము గలవాడై యుండు’ నని వరమునివ్వగా దితి తపస్సు చేయుటకై వనమునకు వెళ్ళెను.

దితి పదివేల సంవత్సరములు ఘోర తపముచేసి, తుదకు అసమానకర్మగలవాడు, వజ్రమువలె దృడమైనవాడు, అజేయుడగు పుత్రుని కనెను - పుట్టుకతోనే అతను అన్ని శాస్త్రముల పారము చేరిన వాడాయెను. అతను తల్లియగు దితిలో భక్తితో ‘అమ్మా నేనేమి చేయగలవాడననగా దితి సంతోషముతో దైత్యేంద్రుడగు పుత్రునితో నిట్లనెను. ‘నాయనా! ఇంద్రుడు నా పుత్రుల ననేకులను వధించెను - ఇంద్రుని వధచే వారికి ప్రతీకారమగుటనే నేను కోరెదను. ‘అనగా అతను సరేనని స్వర్గమునకు వెళ్ళెను - బాహుయుద్ధములో వజ్రాంగుడు ఇంద్రుని సైన్యముతో సహా జయించెను. అల్పమృగమును సింహము లాగునట్లుగా వజ్రాంగుడు ఇంద్రుని కాలును పట్టి లాగుచూ ఈడ్చుకొనుచూ తల్లివద్దకు వచ్చేను - ఇంద్రుడు భయముతో ప్రార్థించసాగేను. అంతలో బ్రహ్మ తపస్వియగు కశ్యపుడు భయపడుచూ అక్కడకు వచ్చిరి - అపుడు బ్రహ్మ అతనితో నిట్లనెను. ‘నాయనా! ప్రార్థించుచున్న ఈ ఇంద్రుని వదలివేయుము - వీనిచే నేమి ప్రయోజనము? మిగులగౌరవింపబడిన వీరునికి అవమానమే వధ కదా! మా మాటచే విడువబడినవాడు జీవుడైనమా మృతుడే - యద్దమున శత్రువును చంపువారిని వీరులని అనరు. మానసిక భేదమును కలిగించి విడుచువారే గొప్పవారు. పూజ్యమైనదని తల్లి మాటను వివినట్లే నీవు తండ్రి మాటను విని వీనిని విడువుము’ అనగా వీని వజ్రాంగుడు నమస్కరించి ఇట్లనెను.

            ‘దేవా! నాకితనితో పనిలేదు - నాతల్లి ఆజ్ఞను పాలించితిని - నీవు దేవాసురుల నాథుడవు. నాకు ప్రపితామహుడవు. నీమాటను వినెదను - ఇదిగో ఈ ఇంద్రుని విడిచితిని. ఇంద్రుడనుభవించిన ఈ ముల్లోకముల ఆధిపత్యమున ఇతరులనుభవించిన స్త్రీవలే, పూలదండవలే నేను కోరను. ముల్లోకములో మన్న సారమేమిటో నాకు తెలుపుము’. అనగా బ్రహ్మ చెప్పెను – ‘నాయనా! తపస్సు కంటే మించినది లేదు - అదే గొప్పదనము. తపస్సుచేత అంతా లభించును. నీవు తపస్సుకు యోగ్యుడవు’. అనగా వజ్రాంగుడిట్లనెను – ‘దేవా! తపస్సు చేయవలెనన్నకోరిక నాకున్నది - నీ అనుగ్రహముచే నాకు అందు విఘ్నము కలుగకుండుగాక!’ అని మిన్నకుండెను. అపుడు బ్రహ్మ ఇట్లనెను – ‘నాయనా! క్రూరభావమును విడిచి నీవు తపస్సును కోరుచుంటివి - ఈ బుద్దిచేత నీ జన్మఫలమును పొందితివి. అని బ్రహ్మ విశాలనేత్రములుగల కన్యను సృజించి వజ్రాంగునికి భార్యగా ఇచ్చివేసెను. ఆ కన్యపేరు వరాంగియని నిర్ణయించి బ్రహ్మ కశ్యపునితో స్వర్గమునకు వెళ్ళెను. వజ్రాంగుడు కూడా తపస్సు చేయుటకు వరాంగితో వనమునకు వెళ్ళి చేతులు పైకెత్తి వేయి సంవత్సరాలు తపస్సు చేసెను శుద్దమైన బుద్ది, తపముగల వజ్రాంగుడు తలక్రిందులుగా వేయి సంవత్సరములు, పంచాగ్నుల మధ్య వేయిసంవత్సరములు, ఆహారములేక వేయి సంవత్సరాలు హోరతపమాచరించి తపోరాశి ఆయెను - అట్లే అతను నీటిమధ్య వేయిసంవత్సరములు తపమాచరించెను.

అతను నీట నిలిచి తపమాచరించుచుండగా, వరాంగి యను అతని భార్య వ్రతమును బూని ఆ సరస్సుయొక్క తీరమున మౌనమాశ్రయించి యుండెను. తన భర్త నిరాహారి యని తలచి వరాంగి కూడా తపస్సు చేయుచుండగా ఇంద్రుడు ఆమెను భయ పెట్టసాగెను. మొదట కోతి రూపమును దాల్చి ఆమె చెంతకు వచ్చి ఆమె చూపును చెదిర్చి అక్కడే మలమూత్రములను విసర్జించెను. ఆమె తపస్సునకు భంగముచేయదలిచి ఇంద్రుడు ఆమె బట్టలను, ముఖమును, వెండ్రుకలను చెదరగొట్టెను. తరువాత మేకరూపులో ఇబ్బంది కలిగించెను - తరువాత పాముగా మారి రెండు కాళ్ళకు చుట్టుకొను. ఇంద్రుడామెను అక్కడినుండి కొంతదూరమునకు లాక్కొని వెళ్ళాను. ఆమె తపోబలముచేత వధింపబడని వాడాయెను. ఓర్పుతో ఆ సాధ్వి అణుమాత్రముకూడా కోపించలేదు - అటుపై గోమాయురూపులో ఇంద్రుడు ఆ ఆశ్రమమును అపవిత్రము చేసెను - అగ్నీరూపులో ఆశ్రమమును కాల్చివేసెను - వాయుపుగా ఆ పవిత్రురాలినీ లాగి వేసెను. ఇట్లు పింహముగా, తోడేలుగా, అనేక భీకరరూపాలలో మరల మరల భయపెట్టుచూ ఇంద్రుడు విరమించకుండెను - అపుడు వరాంగి, శైలముదే తప్పు అని తలిచి దానికి శాపమివ్వబోగా పర్వతము పురుషరూపమున ఆ అందమైన స్త్రీ ఎదుట నిలిచి ఇట్లనెను.

‘మహావ్రతా! నేను దుష్టుడిని కాను - అన్ని ప్రాణులూ సేవింపదగినవాడిని - ఇదుగో ఈ ఇంద్రుడి ఖేదమును కలిగించుచున్నాడు’ - అని చెప్పగా ఇంద్రుడు కోపగించెను. ఇంతలో వేయి సంవత్సరాలు గడిచిన వెనుక బ్రహ్మ వజ్రాంగుని తపస్సుకు మెచ్చి ఆ సరస్సువద్దకు వచ్చి ఇట్లనెను. ‘దితిపుత్రా! నీ కోరికలన్నింటినీ తీర్చెదను’ - అనగా తపస్సుమండి లేచిన తపోనిధియగు వజ్రాంగుడు చేతులు జోడించి బ్రహ్మతో నిట్లనెను. ‘పితామహా! నాకసురభావము వుండరాదు - స్వర్గముపై ఆసక్తి వద్దు - తపస్సుయందు, ధర్మముయందు ఆసక్తివుండుగాక! ఇదే కోరుచున్నాను’. అనగా బ్రహ్మ ఆశ్చర్యపడుచూ సరేనని పలికి ‘ఇంద్రుడిని ఉపేక్షిస్తున్నాడే! అయినా కాబోయే దానిని ఎవరు తప్పించుకోగలరు?’ అనుకొనుచూ ఆంతర్షితుడాయెను - వజ్రాంగుడు కూడా తన తపస్సు ముగిసిన తరువాత సంయముడై ఆహారమును గోరుచూ తన ఆశ్రమమున భార్యను చూచెను. భార్యలేనివారికి ఫలములేదని నిత్యకర్మ చేయుటకు భార్యకై ఇటునటుచూడగా చెట్టుచాటున ముఖమును దాచుకొని దుఃఖించుచున్న భార్య కనబడినది - ఇహ పరములలో తోడువచ్చు ఆమెను ఓదార్చుచూ దైత్యుడు ఇట్లడిగెను.

‘భీరూ! తపస్సులో నున్న నీకెవరపకారమొనర్చిరి? భర్తనైన నేను జీవించియుండగా నీవేల రోదించుచుంటివి? భామినీ! ఏ ఏ ఏ కోరికను తీర్చవలెను? త్వరగా చెప్పుము. తన ఇంటి స్వామివి, గుణవంతురాలు, పవిత్రయగు భార్యను, పంగువు - అంధుల యోగము వలె భర్తతో కూడిన దానికి లాలన చేయనివాడు, ఆమె కోరిక తీర్చని వాడేమి మనిషి? మనిషికాడనే నా అభిప్రాయము’ అనేను.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున కుమారేశ్వర మాహాత్మ్యములో వజ్రాంగుని ఇతిహాసవర్ణనమను పదనాలుగవ అధ్యాయము.