స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
21వ అధ్యాయము
నారదుడు చెప్పసాగెను - ధ్వజము, విల్లు విరిగి విషపు పారిపోవుచుండగా, దైత్యులు ఆనందము నొందగా చూచి ఇంద్రుడు ఏమి చేయవలెనో తెలియకుండిను. వెంటనే విష్ణువు వద్దకు చేరి అతనికి ఉత్సాహముమ కలిగించునట్లు మధురముగా నిట్లనెను. దేవా! దుష్టాత్ములగు దానవులతో క్రీడింతువెందుకు? దుర్జనులతో కూడిలోపములన పొందువావికి ప్రతిక్రియలేమి? బలవంతుడు నీచుని వదిలి వేసినచో వీచుడు ఆది తన బలమే యమకొమము కనుక నీచుని బుద్ధిమంతుడు విడువరాదు. ఇంతవరకు రధికులందరూ నాయకుని శక్తిచే జయమును పొందుదురు - ప్రభూ! హిరణ్యాక్షుని వధించినపుడు నీకే మిత్రుడుయుండెను? శక్తివంతుడు, మదోద్దతుడు అగు హిరణ్యకశిపుడు నిన్నెదుర్కొని తృణమువలె వశించినపుడు వికెవరు ముందుండిరి? పూర్వము మధుకైటభులవంటి బలవంతులగు దైత్యులు విన్నెదుర్కొని అగ్నిలో మిడుతలవలె నశించిరి. శ్రీహరీ! ప్రతియుగమున దైత్యుల నాశనము నీచేతనే కలిగినది - అట్లే ఇక్కడ భయమునొందిన సురులకు నీవే ఆశ్రయము. అని ప్రేరేపించగా మహాభుజుడైన విష్ణువు బలములో, తేజస్సులో, ఐశ్వర్యములో వర్ధిల్లెను - అన్ని ప్రాణులకాశ్రయమైన విష్ణువు నవ్వుచూ ఇంద్రునితో ఇట్లనెను - నేనమకున్న మాటనే నీవంటివి.
ముల్లోకములలో దానవులందరినీ క్షణములో వధించుటకు నేను శక్తుడినే - కాంతారకుడు ఏడురోజుల వయసున్నబాలునితో తప్ప వేరొకరిచేత పరాజయము పొందడు. ఇక మహిషుడు, శుంభుడు ప్రీ చేత వధింపబడువారు - జంభుని దుర్వాసుడు శకుని చేత వధింపబడెదవని శపించెను - కనక నీవే మదోత్కటుడైన జంభుని గొప్పశక్తిచే వధింపుము. ఆ దానవుడు వీచేతతప్ప ఇతర ప్రాణులచేత వధింపబడడు. రణమున నేను జంభుని రక్షించితిని - ఆట్టి జగత్కంటకుని వీవు వధింపుము అని విష్ణువవగా శత్రునాశకుడైన ఇంద్రుడు సైన్యముమ రచింపమని తవ సురాధ్యక్షులను ఆదేశించిన -ఆటుపై దేవతలభ్యర్థించగా, విష్ణువు సైన్యమున ఏర్పరిచెను. ఆ సైన్యము లోకమంతటి శక్తియొక్క, తపస్సయొక్క పారముగా నుండెను. శ్రీహరి ఏకాదశరుద్రులను నాయకులుగా చేసెను. వీరు బలవంతులై, వీలకంఠులై, చంద్రరేఖలను ధరించి త్రిపుండ్రముల దాల్చియుండిరి. పసుపువర్ణ జటాజూటాలను దాల్చి, పింహపు చర్మముమ నడుముకు చుట్టుకొనిరి - వారు ఒంటికి భస్మమును ఆలుముకొని, భీకర భుజమండలములతో మండిరి. కపాలి, ఈశ ఆమ రుద్రులు అసురులను పారద్రోలినవారు - కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, ఆజక, శాసన, శాస్త్ర, శుంభు, చంద్ర, భవ, అనువారు ప్రభావవంతులగు పందకొండుగురు రుద్రులు - అనంతమైన బలము గలవారు.
మేఘమువలె గర్జించుచూ వారు దేవతలను రక్షించసాగిరి - ఇక ఇంద్రుడు హిమవత్పర్వతము వలె పెద్దగా మండి, బంగారు పద్మముల మాల గలిగి, బాగుగా కదలుచున్న బంగారుగంటలచేత అలంకరింపబడి,నాలుగు దంతములు గల మదపుటేనుగైన ఐరావతమునధిరోహించిన ఐరావతము మదజలమును ప్రవించుచుండెను - కోరిన రూపముమ దాల్చువదిగా నుండిన - కాంతివంతుడైన సూర్యునివలెహిమవత్పర్వత శిఖరమున ఇంద్రుడు విలిచెను - అతని కుడివైపున పరాక్రమవంతుడగు మారుతుడు నిలిచి రక్షించసాగెను. ఎడమవైపున జ్వాలలతో దిక్కులను నింపుచూ అగ్ని రక్షించపాగెను - వెనుక, యుద్ధమున ప్రభువగు విష్ణువు నిలిచి రక్షించసాగెను. ఆదిత్యులు, వస్తువులు, విశ్వదేవతలు, మరుత్తులు, అశ్వినులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, వాగులు కోట్లకొలదిగా బృందముగా ఏర్పడిరి - దానికి ఆయా చిహ్నములుండి కనబడుచుండెమ - వారు నానా ఆయుధములను,ధ్వజములనుకలిగి దైత్యులను వధించుటకై దర్పముతో చరించిరి. ఆ ఇంద్రసేవ ఆమరులతో కూడి, ధ్వజముకలిగి, వాహనధ్వనితో కూడి తెల్లని ఎత్తన ధ్వజముయొక్క వస్త్రముయొక్క అంచుతో ప్రకాశిస్తూ దైత్యుల దుఃఖమును పెంపొందింపజేయునదై యుండెను. అట్లు వచ్చుచున్న సురసేనను చూచి గజాసురుడు పెద్ద ఏనుగురూపుమ దాల్చి పరశును దాల్చి, పెదవిని కొరుకుతూ కొందరు దేవతలమ కాళ్ళతో తొక్కివేసెను - మరికొందరిని తొండముతో విసిరివేసెను.
రౌద్రముగా ఆ గజాసురుడు కొందరిని తన పరశుతో చంపివేసెను - ఇట్లు వధించుచుండగా యక్ష గంధర్వ కిన్నరులు. కోపించి, ఆందరూ కలిసి చిత్రమగు అస్త్రముల సమూహముమ వావి వదిలిరి. పరశ్వథ, చక్ర, భిండిపాల, ముద్గర, కుంత, ప్రాపి, శర, ముద్గరాదులను ప్రయోగించిరి - గజసమూహమునకు నాయకుడైన మహాగణము గడ్డిని మింగివేసినట్లు గజాసురుడు వావివల్నింటినీ మింగివేసేను. ఆ దానవుడు కోపముతో తన కోరలు మెరయుచుండ, తొండముతో దెబ్బతియుచు, మీంకారమును చేయుచూయద్ధమునందు దేవతలమ వధించుచు తేరిపార చూచుటకు వీలు లేనివాడైయుండెను. ఏ ఏ పురసమూహమున గజాసురుడువచ్చిపడెనో ఆయా సురసమూహములో పెద్దగా హాహాకారము వినవచ్చేను. సైన్యమట్లు పారిపోవుటను చూచి రుద్రులు అహంకారముతో జ్వాలలను వెదజల్లుచూ ఒకరితోనొకరిట్లనిరి. ‘ఒయీదైత్యేంద్రుని పట్టి వధించండి! పదునైవ శూలములతో పొడవండి! సున్నిత ప్రదేశములలో దెబ్బతీయండి!’ అనగా కపాలియము రుద్రుడది వివి పదునైన శూలముయొక్క తెల్లని ఆగ్రభాగమును ఎడమచేతితో తుడిచి, సంరంభములో వికసించిన ఎర్ర పద్మమువంటి కళ్ళమ తిప్పుచూ అన్ని దిక్కులకూ వెళ్ళసాగెను - కనుబొమలను ముడిచి గజాసురుని వైపు వెళ్ళసాగెను. కపాలి పిడికిలి బిగించి గజాసురుని కుంభస్థలముపై గట్టిగా మోదెను.
అంతట ఆ పదిమంది రుద్రులు యుద్ధమున శైలములను వర్షింపజేయు దైత్యేంద్రుని తమ ఇనుపశూలములతో బాధించిరి. ఆపుడు దైత్యుని ఒంటినుండి రక్తముస్రవించగా గజాసురుడు శోభించెను. శరత్కాలములో వికసించిన పద్మములతో సరస్సు శోభించునట్లుగజాసురుడు శోభించేమ, భస్మమువలుముకొనిన రుద్రులు హంసలవలె నుండి గజాసురునిచుట్టుముట్టియుండిరి. కోపించిన కపాలిని, భవుని గజాసురుడు తన కర్ణాభరణము కదులుచుండగా వేగముగా తన దంతములతో వాధిదేశమువ పొడిచెను. ఆ ఇద్దరూ రక్తమును గార్చుటచూచి మిగిలిన తొమ్మిది మంది రుద్రులు వెంటనే పదునైన శూలములతో దైత్యుని బాధించిరి. అపుడు ఆ దైత్యుడు కపాలిని విడిచి, భవుని వదలి కోపముగా రుద్రులను తొమ్మిది మందిని ఎదుర్కొనెను - తన కాళ్ళతో వారిని తొక్కివేసెను, దంతములతో పొడిచెను, తుండముతో పీడించెను . శూలయుద్దమున ఇతడలిపోగా కపాలి ఇతని తుండమును పట్టుకొని అమిత వేగముతో తిప్పసాగెను - ఆ దైత్యుడు అలసటనొంది, ప్రాణములు పోయినవాడిగా నుండెను. నిరుత్సాహముగానున్న అట్టి దైత్యుని చూచి యుద్ధమున ఉత్సాహము సన్నగిల్లెను - కపాలి గజాసురుని అలా తిప్పుచూనే భీకరముగా అతని చర్మమును పెకిలించి అన్ని వైపులనుండి రక్తమును ప్రవహింపజేయు ఈ చర్మమునే తన వస్త్రముగా చేసుకొనెను. అపుడు దేవతలతనిని అనేక విధములుగా, ఆవేక స్తుతులతో కీర్తించిరి.
నిన్ను దెబ్బతీసిన వాడెల్లా మరణించును అట్లే ఈ గజాసురుడు అవి వారనిరి - గజచర్మమే వస్త్రముగా కలిగియున్న కపాలిరూపమును చూచి దాపులు భయపడిరి. కొందరు పారిపోసాగిరి. ఆతనిని బాధించబోయిరి, కొందరు వేలకూలిం. ఇట్లు మహాబలుడైన దానవేంద్రుడు వశించగా, ఏమి దానవుడు మారు దుందుభులవలె సీంకరించు మదపుటేమగువెక్కి దేవసైన్యముమ బాధించుచూ వచ్చిపడిను. అతను వెళ్ళిన దిక్కున దేవతలు భయకంపితులై అరవసాగిరి, పారిపోసాగిరి. ఆ ఏమగు శరీరమునండి వచ్చు వాపనలో దేవతల ఏమగులు పారిపోసాగినవి - ఇట్లు దేవసైన్యము పారిపోగా ఇంద్రుడు అష్టదిక్పాలకులలో, కేవునిలో కూర్చుని యుండెను - విమి దావపువి ఏమగు వచ్చులోగానే ఇంద్రుని ఏనుగు భయపడి గట్టిగా భయంకరంగాసీంకరించి, ఇంద్రుని మావటి విలువరించుచున్నమావిలువక పారిపోయెను. పారిపోవుచున్న ఆ ఏమగుపై మన్న ఇంద్రుడు దైత్యేంద్రునితో విపరీతముఖముగా యుద్ధము చేయసాగము. ముందు హలముతో నిమివి ఎదపై కొట్టిన - తరువాత గదతో విమియొక్క ఏమగువి వోటివద్ద కొట్టెను. నిర్భయముగా, పౌరుషముతో మన్న విమి ఆదెబ్బమ లెక్కించకదే, తవ ముద్గరముతో ఐరావతమును కటిప్రదేశమున కొట్టెను.
`ఆ దెబ్బతో పర్వతమువంటి ఐరావతము భూమిపై పడి పాదములపై నడువసాగెను. కానీ ఏమి చేతిలో భయమునొంది ఆ గజము వెంటనే లేచి రణభూమినండి తొలగిపోయేను. అపుడు దుమ్ముధూళితో గూడి వేగముగా గాలి వీచెను - ఆ గాలి విమి గజమునకు ఎదురుగా వీచుచుండగా ఆ స్థిరమగు పర్వతమువంటి ఏమగు రక్తము స్రవించుచుండగా ధాతువుల ప్రవాహములో మన్న పర్వతమువలె మండెను. అపుడు కుబేరుడు పెద్దగదమ విమిదానవుని ఏమగుసైకి విసరగా ఆ గద ఆ ఏమగు తలపై వేగముగా పడిన దానిలో ఏమగు మూర్ఛనొంది దంతముతో భూమిని చీల్చి పర్వతమువలె వేల సైబడెను ఆట్లు ఆ ఏమగు పడిపోగా దేవసైన్యమంలో గొప్ప పింహనాదమున చేపెమ - ఎల్లెడలా ఏమగు ఘీంకారముల ధ్వని వినిపించేను. గుర్రముల పకిలింతలతో, విలుకాండ్ర బాణముల తాటింపు ధ్వనితో రణరంగము నిండెను - దానవుని ఏనుగు ఆట్లుపడిపోవుటమ, ఏమి ఎమదిరుగుటమ చూచి సురుల సైన్యము దిగంతరముల ప్రతిధ్వనింపజేయుచూ వివరించిన అపుడు జంభాసురుడు వెలుగుచున్న అగ్నివలె కోపముతో మండిపోయెను. ఆతను కోపముతో కళ్ళు ఎర్రబడగా బాణమున విల్లునకు ఎక్కుపెట్టి విలువుమని గట్టిగా పలికి సారథిని సంతోషపెట్టెను.
అతనట్లు విల్లునెక్కుబెట్టి వచ్చుట చూచి వీరుడగు ఇంద్రుడు తన విల్లును అందుకొనెను. నూనెచే కడగబడినది, అర్థచంద్రాకారమున నున్నది, సరిగా పయనించునదియగు బాణమును సంధించి జంభాసురుని విల్లంబులను ఛేదించెను. విరిగిపోయిన విల్లును పడవేసి జంభాసురుడు బరువైన విల్లువొకదానినందుకొని నూనెచే కడుగబడిన అంచులు గల వావిని, విషవంతమైన బాణములను చక్కగా పయనించువానిని సంధించి ఇంద్రుని కొట్టెను. పది బాణములతో ఇంద్రుని మెడపై, మూడింటితో ఎదపై, రెంటిలో బాహువుల పై కొట్టెను. ఇంద్రుడు కూడా దానవేంద్రునిపై శరబీలమును గుప్పించెను - ఇంద్రుని బాణములు తనను చేరకమునుపే జంభుడు అగ్నికీలలవంటి బాణములలో ఆకాశమున వానిని ఛేదించెను. అంతట ఇంద్రుడు బాణముల పరంపరతో వర్షాకాలమున మేఘములు ఆకాశమును కమ్మినట్లు జంభుని కప్పివేసెను -దైత్యుడూ పదునైన బాణములతో దేవేంద్రుని బాధించెను. దిక్కులలో వాయువు మేఘసమూహమును చెదరగొట్టినట్లు దేవేంద్రుని పారదోలెను - అంతట దేవేంద్రుడు క్రోధపూరితుడై కూడా దానవేంద్రుని ఏమీ చేయలేకపోయినందున మహాద్భుతమగు గంధర్వాస్త్రమును సంధించెను - దాని తేజస్సుచే ఆకాశమంతా నిండిపోయెను.
అనేక ప్రాకారములతో, తోరణములతో, అద్భుతముగానున్నప్పుడూ అగ్రవర్షమును కురిపింపజేయుచుండిన గంధర్వనగరాలతో ఆకసము నిండియుండెను. ఆ అస్త్రముల వర్షముచేత దెబ్బతినుచూ దైత్యసేన ‘రక్షింపుము, రక్షింపుమని’ జంభుని శరణుజొచ్చెను. ఆపుడు గొప్ప పరాక్రమవంతుడగు జంభుడు వవ్వి నినదించి ఏది చేయవలెనో తెలిసినవాడై దైత్యులకు అభయమునిచ్చెను. ఆంతట మౌసలమను మహాయుధము గొప్ప భయమును కలిగించెను - లోకమంతా ముసలములను ఆయుధములతో నిండిపోయెను. గంధర్వనగరములన్నీ ముసలముల దెబ్బచే కూలిపోయెను - ఒక ప్రహారముచేత రథము, అశ్వము, గబము, దేవసైనికులు నుగ్గయి పోపాగిరి - వందలకొలదిగా, వేలకొలదిగా అట్లు ముసలములు ధ్వంసము చేయసాగెను - అపుడు ఇంద్రుడు త్వాష్టాస్త్రమును పలికెను. ఆ అస్త్రము సంధింపబడగా అగ్నిజ్వాలలు బయల్వెడలెను - ఆంతట యంత్రమయమగు విద్యలు వేలకొలదిగా కనబడినవి. వాని చేత అంతరిక్షము నక్షత్రములు లేనిదాయెను -ఆ యంత్రములచే మౌసలాస్త్రము భంగమై దానవులు వధింపబడసాగిరి. అపుడు జంభుడు యంత్రముల సమూహమును చూర్ణము చేయు శైలాస్త్రమును విడువగా, పర్వతమువంటి రాళ్ళతో కూడిన వర్షమేర్పడెను. త్వాష్ట యంత్రముతో ఏర్పడిన యంత్రములన్నీ ఆ రాళ్ళవర్షమువల్ల నుగ్గునుగ్గాయెను.
దేవతల తలలపై పెద్ద పెద్ద శిలలు పడుచూ చతురంగబలమును చీల్చుచూ వుండినవి. అపుడు ఇంద్రుడు వజ్రాస్త్రముతో శిలావర్షమును చెల్లాచెదరుగా చేసెను. తన శైలాస్త్రము శాంతించగా, పర్వతమువంటివాడు, ఇతరుల పరాక్రమమును చూర్ణము చేయువాడగు జంభుడు ఏపీనాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రముచేత, గిరులను కూడా ఛేదించు వజ్రాస్త్రము నశించెను - అతి దారుణమైన ఆ పరమాస్త్రమట్లు విజృంభించుచుండగా రథములతో, గుర్రములతో, ఏనుగులతో దేవసైన్యము జ్వలించెను - ఏపీనాస్త్ర ప్రభావముచేత సేన అట్లు దహింపబడుచుండగా ఇంద్రుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను - దానిచే ఏషీకాస్త్రము శాంతించెను. అంతట ఆగ్నేయాస్త్రము విజృంభించెను - జంభుని రథము, సారథి, సేన కూడా మండిపోసాగిరి. తన అస్త్రము విఫలమగుట చూచి ప్రతిభావంతుడగు జంభుడు ఆ అగ్నికీలలను శాంతింపజేయుటకు వారుణాస్త్రమును ప్రయోగించెను. అపుడు మెరుపుతీగలు మెరయుచుండగా వానీతో ఏనుగుల వలె (వడగండ్ల) నున్న ధారలను స్రవించు మేఘములతో భూమినిండెను. ఏనుగుతుండము వంటి ధారలతో జగత్తు నిండెను. దానిచే ఆగ్నేయాస్త్రము శాంతించుట జూచి ఇంద్రుడిట్లుజేసెను.
అసమానమగు వాయువ్వాస్త్రమువలన మేఘములు చెదిరిపోయెను - అట్లు వాయవ్యాస్త్రబలముచే మేఘమండలము కొట్టుకొనిపోగా నీలోత్పలదళమువలె మెరియుచూ ఆకాశముండెను - అమితవేగముగల వాయువుచే దానవులు కంపించసాగిరి. బలవంతులైననూరణమున నిలుచుటకు అశక్తులైరి - అపుడు జంభుడు పదియోజనముల వెడల్పుగల పెద్ద పర్వతమాయెను. దానవుల నాయకుడగు జంభుడపుడా వాయువునకు ప్రతిక్రియజేయుటకై అనేక ఆశ్చరములతో చెట్లు లతలు మొదలగు వానితో కూడుకొనెను. పర్వతాకారమున నున్న దైత్యుని వలన వాయువు శమించగా, ఇంద్రుడు వజ్రమయమగు తన అశని (పిడుగు) అను ఆయుధమును పర్వతముపై విడిచెను. ఆ దెబ్బతో పర్వతరూపుడైన జంభుని గుహలు, నిర్ఘరములు ధ్వంసమమాయెను. ఆంతట జంభుని దానవమాయ యగు పర్వతమాయ మాయమాయెను - అపుడు మదీంచిన జంభుడు గొప్ప పర్వతము వలెనున్న దైత్యసేనను నాశనము చేయసాగెను. దేవతలను కొందరిని వెనుకగా వచ్చి తుండములో పైకెత్తి పడవేసి చంపసాగెను. అపుడు ఇంద్రుడు ముల్లోకములలోనూ ఎదురులేని నారసింహాస్త్రమును ప్రయోగించగా ఆ మంత్రతేజస్సుచే వేలకొలదిగా సింహములు బయల్వెడలినవి.
పదునైన కోరలతో, రంపమువంటి గోళ్ళతో అవి చీల్చివేయగా గజమాయ తొలగిపోయెను. దైత్యుడపుడు నాగాస్త్రమును ప్రయోగించగా పడగలతో కూడిన, విషముగల పాములుద్భవించెను - వాని విషవాయువులచే దైవసేనలోని మహారథులు కాలిపోయిరి. అపుడు ఇంద్రుడు గరుడాస్త్రమును ప్రయోగింపగా వేలకొలదిగా గరుడులు బయల్వెడలిరి. సర్పరూపియగు జంభుని పట్టి ముక్కలుగా చేయగా వాని సర్పమాయ నశించెను. ఆట్లు తనమాయ వశింపగా జంభుడు సూర్యచంద్రుల గతిననుసరిస్తూ ఉన్నతము, అసమానమగు రూపునుదాల్చెను. కళ్ళను తిప్పుచూ సురసేవను మింగదలిచెను - మహారథులు, ఏనుగులు మున్నగువానితో సురసైన్యము పాతాళగుహవంటి జంభుని నోటిని ప్రవేశించెను - బలవంతుడగు దానవుడట్లు సేనను మింగివేయగా ఇంద్రుడు తన వాహనములు అలిసిపోగా దీనుడాయెను. ఏమిచేయవలెనో తెలియక విష్ణువుతో నిట్లనెను. ఇక ఇపుడు మేము చేయదగినదేమి? నీవాదేశించినచో మేము దానినాచరించేదము, యుద్ధము చేయగోరు దానవుని ఎదుర్కొనెదము’. అనగా మేధావియగు విష్ణువు పిరికి వారికి భయమును కలిగించు ఈ యుద్ధమును ఇపుడు మీరు విడువరాదు, అవి ఇంద్రునితోననెను.
నీవు మోహము పొందవద్దు! ప్రభు! త్వరగా నారాయణాస్త్రమును స్మరించుమనగా ఇంద్రుడు దానిని ప్రయతుడై స్మరించి ప్రయోగించెను. అంతలో నోరుతెరుచుకొని వచ్చిన దైత్యుడు క్షణములో మూడులక్షల కిన్నరులను మూడులక్షల గంధర్వులను మ్రింగివేసెను. ఆంతలో నారాయణాస్త్రమతని ఎదపై పడగా, ఆ అస్త్రము చేత ఎద చీలిపోగా దైత్యుడు రక్తమును కార్చెను. తరువాత తన తేజస్సుతో నిర్మించుకొనిన రూపము నాశనమవగా దైత్యుడు గట్టిగా నవ్వుచూ మాయమాయేను. అతీంద్రియుడై ఆ దైత్యేంద్రుడు అంతరిక్షాన నిలిచి పురసైన్యములనంతమొందించు పరమాస్త్రమగు శిప్రా విని విడిచను. అట్లే పరశ్వథములమ, చక్రములను, వజ్రబాణములను, ముధరములను, కుంతలములమ, కత్తులను, భిండిపాలములను, ఆయముఖమగు ఆయుధములను ఆ దైత్యుడు కోపముగా కురిపంపచేసిను - ఆ అస్త్రముల చేత దేవసైన్యము భయమువొందినది. ఆ అస్త్రముల దెబ్బకి తెగిన బాహువులలో, కుండలములుగల తలలతో, ఏనుగు తొండముల వంటి తొడలతో, పర్వతములవంటి ఏనుగులతో భూమి నిండిపోయెను. విరిగిన దండములు చక్రములు ఇరుసులు మున్నగువానితో, రథికులతో రథములతో ఆ భూమి, మాంసముతో రక్తముతో బురదగా మారి చరించుటకు వీలు లేనిదిగా నుండెను.
ఆభూమి రక్తముల ప్రవాహముతో కూడిన మడుగులను కలిగి, ఏనుగుల శరీరములను పర్వతములను, తలలేవి మొండెముల నృత్యమును, మహాసురుల ప్రవాహమును కలిగియుండెను. ఆ భూమి నక్క, గద్ద, గుడ్లగూబలకు పరమానందమును కలిగింపజేయువదిగా నుండెను - పిశాచజాతులు రక్తమును ద్రావి మాంసమును వెదజల్లెను. సంభ్రమము లేని భార్యలతో కలిసి పిశాచులు వర్తించుచుండగా, ఒక భార్య ఏనుగుల కుంభస్థలముననుండు ముత్యములతో కోపించియుండిన ఒక చోట పిశాచమొకటి గుర్రముల గిట్టలను ఒక దగ్గరికి చేర్చిను. మరికొందరు కోపంగా వావి చెవులమ చూచుచూఆనందించుచుండెను. వాని ప్రయోజనమునుతెలిసి ప్రసన్నము చేసుకొనుచుండెను - మరికొందరు ఇట్లనుచుండిరి. ఓ దేవతలారా! ఓదైత్యులారా! మేము ప్రార్థించుచున్నాము. కల్పాంతంవరకు మీరిట్లే మా తృప్తికై యుద్దము చేయండి’ - కొందరు ఈ దైత్యుడు మిక్కిలి మాంసముగల దేహముతో నున్నాడు - ఈ దేవుడు బలిసియున్నాడు. ఇతను యుద్ధమున మరణించినచో బ్రహ్మకు ఋణము తీర్చుకొనెదము అనుచుండిరి. వీరులు కొందరు యుద్దము చేయుచుండగా పిశాచములు కొన్ని పెదవులను తడుపుకొనుచుండెను. వీరి రక్తమునాస్వాదించి దుర్ఘమడో, సుజనుడో తెలుసుకొవెదము. అనుకొనిరి - కొన్ని పిశాచములు రక్తముతో కూడిన నదుల ఒడ్డున ఆస్తికబుద్ధిలో పితృదేవతలకు, దేవతలకు రక్తముతో కూడిన మాంసము తర్పణములివ్వసాగెను - మరికొన్ని తాము మాంసపు గుట్టలపై నున్ననూ వేరొక పిశాచముచేతిలోని మాంసమును చూచి ఇవ్వు ఇవ్వుమని పిపివారి ధనికులవలె ఆరచుచుండెను.
మరికొన్ని పిశాచములు స్వయముగా తృప్తినొందినమా, మాంసమును భుజించుచున్న ఇతరులమ చూచి కోపంగా పెదవులను కొరుకుచూ అమాయగా చూచుచుండిరి - మరికొందరు తమ కడుపుని నిందించుకొనుచూ కోపంగా కొట్టుకోసాగిరి. తృప్తి చెందినమా కొందరు ఇతరుల ధనమును కోరునట్లు కొన్ని పిశాచములు అందరి ఆహారమును పొందుగోరుచుండిరి. మరికొందరు, నేడే బ్రహ్మపతి నీయమమచుండిరి. సుప్రభాతము, మంచీనక్షత్రము పూర్వముండినది వృథాయే - అని ఆ పిశాచములు అనేకరీతులుగా పలుకుచుండగా, జంభుడు కనబడకుండా యుద్దమున తన అస్త్రములలో దేవతలను బాధించసాగెను. అంతట ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, వాయువు, యముడు, విర్ఋతి అనువారు తమ దివ్యాస్త్రములను దానవుని వైపు పంధించి ఆకాశమున విడిచిరి. కాని ఆ అస్త్రములన్నీ దానవుని విషయమున ఆతి క్రూరబుద్ధిగలవారి చేష్టలన్నీ ఆర్యుని విషయమున వృథా యగునట్లే వ్యర్ధమయినవి . అలసట నొందిన దేవదానవులు వేరొక గతివీ తెలియరైరి - దేవతలు దైత్యుల అస్త్రములచేత అవయవములన్నీ దెబ్బతినగా చలిచే గోవులు (వాక్కు) బాధపడినట్లు బాధపడిరి. హా హా! ఏమి జరుగబోవుచున్నదని అనుచూ ఒకరితోనొకరు తలపడిరి - వారిని స్థితిలో చూచి విష్ణువు ఇంద్రునితో విట్లనెను. దేవరాజా! పాశుపతము వలే శక్తిగల (పాశుపతమునుండి ఏర్పడిన) ఆహారమంత్రమమ అస్త్రమును స్మరింపుము. అది నీకు మునుపు సంతుష్టుడైన శివుడిచ్చిమ. ఆ అస్త్రము తిరుగులేనిది - వీరులను హతమార్చువది. అనగా ఇంద్రుడు శివునికి నమస్కరించి, శత్రువులవధించు ఆరాస్త్రమును, అర్ధచంద్రాకారమున నుండు దానిని గ్రహించెను.
ఆ అస్త్రమును వింటికి సంధించి మేధావియగు ఇంద్రుడు ఆఫరమంత్రముతో కలిపి ఆ బాణమును చెవివరకు లాగి దైత్యునివధకై విడిచిన - అమిత తేజస్సుతో వెలుగుచూ ఆ మహాస్త్రము వచ్చిపడుటను చూచి జంభాసురుడు తన మాయమ వదిలి నిలిచెను. ముఖము, శరీరము కంపించుచుండగా తొట్రుబాటుతో నిలిచిన ఆ జంభుని, అఘోరమంత్రముతో అభిమంత్రింపబడిన ఆ ఆర్ధచంద్రాకార బాణము ఇంద్రుని వింటినుండి వెలువడి మధ్యాహ్న సూర్యబింబమువలె వెలుగుచూ సమీపించెను. వెంటనే ఆ అస్త్రము కిరీటముల సమూహముచే వెలుగుచున్న, సువాసన గల పుష్పములతో కూడిన, ఎల్లెడలా చెదిరిన పొగవలెనన్న వెంట్రుకలుగల జంభుని శిరస్సుమ కుండలములతో సహా పడవేసెను. ఇంద్రుని చేత జంభుడట్లు మరణించగా దేవతలు మిగుల ప్రశంసించిరి - విష్ణుమూర్తి కూడా బాగు, బాగని పలికెను. జంభుడట్లు వధింపబడగా దానవులు ఎమదిరిగి, హతాశులై తారకుని వైపు పారిపోయిరి. తారకుడు తన సైన్యము భీతినొందుటను చూచి తన మహారథులు నలుగురు వధింపబడుటను విని తన సారథితో ఇంద్రునివైపు రథమును నడుపు మనెను. సారథి అట్లే అవి తారకుడు కూర్చొనియున్న రథమును నడిపెను - తారకాసురుడు నిర్లక్ష్యంగా, గర్వముగా, కోపముగా, పరాక్రమముతో, ప్రభవించునట్లుగా, ధిక్కారముతో పయనించసాగెను. వెయ్యి గరుత్మంతులతో కూడినది, అన్ని ఆయుధములను గలిగినది, అన్ని అస్త్రములచేత రక్షింపబడినది, ముల్లోకలములనున్న శస్త్రజ్ఞానముతో కూడినది, కల్పాంతకాలమృత్యుఘోషను కలిగించునది యగు రథము నతడధిరోహించి యుండెను.
గొప్ప సైన్యముతో గూడి, దశదిశలను తన వాదముతో ప్రతిధ్వనింపజేయుచూ తారకుడు వచ్చుచుండగా చూచి ఇంద్రుడు ఐరావతము వీడి, స్వచ్ఛమైన బంగారముతో చేయబడినది. నాలుగు యోజనముల వెడల్పుగలది, సిద్దసంఘములతో కూడినది గంధర్వ, కిన్నరుల గీతములతో, అప్పరపల నృత్యముతో కూడినది, అవేకాయుధముల గలది, అనేక రత్నములను గలదగు రథమును అధిరోహించెను. గరుడధ్వజముతో లోకపాలురందరూ అతని చుట్టూ నిలిచియుండిరి. అపుడు భూమి కంపించెను, గణములతో వాయువు తీవ్రముగా వీచెను. సాగరములు కదిలిపోయెను - సూర్యుని కాంతి సన్నగిల్లెను - అస్త్రములు జ్వలించెను - వాహనములు కంపించెను. అంతట అంతా తిరగబడుట (విపరీతముగా నుండుట) కనబడేను - ఇంతలో తారకుడు కనిపించేను - ఒకవైపు దైత్యుడగు తారకుడు వేరొకవైపు దేవసంఘములు విలిచెను. లోకనాశనమొకవైపు, లోకోద్దరణము మరొకవైపు నిలిచెను - ఆపుడుచరాచరప్రాణులు భయమును, విస్మయమును పొందెను. దేవదానవపమాయావము (యుద్ధము)మ సురులు అపుడు ప్రశంసించిరి - అస్త్రములు, తేజస్సు, ధవములు, యోధులు, కీర్తి, బలము, వీర్యపరాక్రమములు, సత్యము, ఓజస్సు అనునవి దేవాపరులకు చెందినవిగా కనబడుచుండెను - కాని ఇవి తపముకంటె ఎక్కువకాదు. అంతట తమవైపు వచ్చిపడుచున్న తారకుని జూచి దేవతలు వంగిన ములుకులు గల బాణములతో అగ్నివంటి వానితో అతనిని బాధించిరి.
తన ఎదపై నాటుకొనిన ఆ బాణముల వలన కలిగిన గాయములను లెక్కించక తారకుడు తన బాణములతో దిక్కులను,భూమిని నింపివేసెను. డెబ్బయి బాణములతో నారాయణుని, తొంభయి బాణములతో అగ్నిని, పది బాణములతో వాయువును, పదిబాణములతో యముని, డెబ్బయి బాణములతో కుబేరుని, ఎనిమిది బాణములతో వరుణుని, ఇరవై బాణములతో నిర్ఋతిని మరల ఎనిమిది బాణములతో నిర్ఋతిని, ఒక్కొక్కరిని పదునైన ఎనిమిది బాణములతో, వేగముగా వెళ్ళు మూడు బాణములతో మాతలిని తారకాసురుడు కొట్టెను. ఎనిమిది బాణములతో గరుడుని,తొమ్మిదింటిలో మహిషుని కొట్టి తారకుడు వారిని తీవ్రముగా బాధించెను. వారి కవచములను ఛేదించేను, విల్లంబులను విరుగగొట్టెను - అపుడు దేవతలు కవచములులేక, ధనువులు లేక బాధనొందిరి. వేరే విల్లునందుకొని బాణములు విడుచునంతలో తారకుడు మృత్యువహ్నిసమానమగు బాణమును సంధించి ఇంద్రుని ఎదపైకి వదిలెను - అంతలోనే ఆకాశములో వందమంది పర్యలవలె వెలుగు గరుడుని, విష్ణువును చూచి బాణములతో కొట్టగా వారు మోహమునొందిరి. ఆట్లే యముని, అగ్నిని, వరుణుని తన పదునైన బాణములతో గొట్టి వారిని భయపరచీ పడగొట్టెను - బాణములతో కొట్టి ఆ దైత్యుడు వాయువుకే ఉచ్చ్వాసలేకుండా జేసెను.
అంతట శ్రీహరి స్పృహనొంది, దిక్పాలకులను ప్రోత్సాహపరచి తారకాసురుని రథసారధి తలను కుండలములతో సహా కిందపడునట్లు బాణముతో గొట్టెను. ధూమకేతువు (అగ్ని) జ్వలించుచూ దైత్యరాజు కిరీటమును భేదించి పడవేయగా ఇంద్రుడు దానిని ఛేదించెను. కుబేరుడు అనేక బాణములతో తారకుని విల్లును విరుగగొట్టెను - వాయువు తారకుని రథమును శిఖరముతో సహానుగుచేసెను. నిర్ఋతి తన బాణములతో తారకుని కవచమును పిండిచేసెమ - అసమానమగు ఈకర్మనిట్లు చేసి వాసుదేవాదిదేవతలు పెదవులను తడుపుకొనుచూ నిలునిలుమని పలికిరి. దేవతలవిని చూచి పరాక్రమియగు తారకుడు భీకరమగు ముద్గరమును ఇంద్రుని పైకి విడిచెను - అడ్డులేని ఆ ముద్గరము వచ్చిపడుచుండగా చూచి ఇంద్రుడు రథము పైనుండి దుమికి నేలపై నిలిచెను - ఆముద్గరము కర్కశమగు ధ్వనిని చేయుచూ రథము పైపడేను రథము మగ్గాయెను - కావీ మాతలి మరణించలేదు - తారకుడు పట్టిశములోకేశవుని ఎదపై దెబ్బతిసెను. అట్లే గరుత్మంతుని బాహువులపై దెబ్బతీయగా గరుడుడు స్పృహతప్పెను - కానీ అంతకు ముందతను ఖడ్గముతో దైత్యుని కొట్టి నేలపై పడవేసెను. తారకుడాయుద్ధమున యముని, భిండిపాలములో కొట్టి అగ్నిని, ప్పుహతప్పునట్లు చేసి పడవేసెమ.
వాయువును కాలితో తొకి నేలపై పడవేసెను - కోపముతో కుబేరుని వింటి అంచుతో కొట్టి గాయపరచెను. అంతట తారకుడు ఒక్కక్షణములోనే దేవసైన్యములోని ఒక్కొక్కరిని, గురువు బాలురను కొట్టినట్లు అస్త్రములతో కొట్టసాగెను. అపుడు స్పృహలోకివచ్చిన విష్ణువు దావవవీరుల రక్తమాంసాలతో ఎరుపెక్కిన తవ చక్రమునందుకొని తారకుని ఎదపైః బలంగా విడిచెను. సూర్యుని వంటి కాంతిగల ఆ చక్రము దైత్యుని ఎద పైపడెను. పద్మము రాయిపైపడి నశించినట్లు ఆది దైత్యుని శరీరముపైపడి దెబ్బతినెను - అంత ఇంద్రుడుకూడా చిరకాలమర్చించబడిన వజ్రమును దానవేంద్రుని జయించు ఆశతో విడిచెను - శౌర్యము గల తారకుని బేరి ఆ వజ్రము నిప్పులను వెదజల్లి నూరుముక్కలాయెను - ఆంతట వీరుడగు వాయువు గట్టిగా ధ్వనిజేస్తూ మండుచున్న అగ్నివలెనున్న అంకుశమును వేగముగా విసరగా అది తారకుని దాకి వశించెను - ఆది చూచి వాయువు కోపములో పుష్పించిన వృక్షములగలిగి పదియోజనముల వెడల్పుగల పర్వతను పెకిలించి తారకునిపై విసిరెను. తన పైకి వచ్చుచున్న ఆ పర్వతమును చూచి తారకుడు నవ్వుచూ బాలుడు బంతిని పట్టుకొనినట్లు అవలీలగా ఎడమచేతితో పట్టుకొనెను.
అదే పర్వతముతో యముని దెబ్బతీసి పడవేసెను - అపుడు కోపముతో ఒడలు మరిచిన యముడు దండము నెత్తి వేగముగా తిప్పి తారకుని తలపైకి విసిరెను. ఆది తారకుని తలపై పడగా దైత్యుడు నవ్వుచూ దానిని పట్టుకొను అగ్ని కోపముతో మండిపోవుచూ కల్పాంతమున లోకములను దహించువాడై దానవేంద్రునిపై తిరుగులేని శక్తియను ఆయుధమును విపిరెను. ఆశక్తి తారకుని ఎదపై శిరీషకుసుమముల దండవలె విరాజిల్లెను - లోకపాలుడగు నిర్ఋతి అపుడు ఒరనుండి ఆకాశమువలె నిర్మలముగా మండి ముల్లోకములను ప్రకాశింపజేయు ఖడ్గమును తీసి తారకుని తల పైకి విసిరెను. ఆది పడగానే మారుముక్కలాయెను - అపుడు వరుణుడు కోపించి మహాభైరవ రూపముగల పాశమున తారకుని భుజములమ కట్టిపడవేయు కోరికతో విపరగా ఆ పాళము తారకుని భుజమున చేరి వెంటనే నశించెను. రంపము వంటి పలువరసగల పర్పరాజు, అమలు, సూర్యచంద్రులు, పార్యులు, వసుదేవతలు, యక్షరాక్షపగంధర్వులు, సర్పములు అనేక విధములగు అస్త్రములతో దైత్యరాజగు తారకుని అవేకరీతులు బాధించసాగిరి.
కానీ వజ్రపర్వత సమానమగు తారకుని శరీరమునకు ఆ అస్త్రములు తగలలేదు - ఆంతట తారకుడు కోపించి కుప్పించి దూకి దేవతలను తన లెక్కలేనన్ని పిడికిలి గుద్దులతో, పాదఘాతములతో బాధించెను. తారకుని ఆ శక్తిని చూచి శ్రీహరి దేవతలారా! పారిపొండి! అని తాను మాయమాయెను - అపుడు ఇంద్రాది దేవతలు పారిపోజూచిరి. కాని మదించిన కాలనేమి మొదలగు దైత్యులు వారినడగించి జుట్టుపట్టలాగి పిడికిళ్ళలో, కాళ్ళతో బాధించసాగిరి. అట్లు వారిచే దేవతలు అనేక రీతుల హింసింపబడిరి. ఎండిపోయిన నదులను దాటవలసివచ్చెను - దేవమార్గాలు నశింపజేయబడెను. అపుడు బలవంతులైన రైత్యులు భూమీవి కంపింపచేయుచూ, ఆకాశముమ, పాతాళమును వణికించుచూ గట్టిగా వివరించిరి. బయమునొందుటచే మిగుల సంతుష్టులైన దైత్యులు అపుడు తారకుని స్తుతించిరి - మల్లెవలె, చంద్రునివలె తెల్లనివ శంఖములను పూరించిరి. ఉగ్రముగా ధనరాణములను, కరతలములమ మ్రోగించిరి - అమితసంతోషము నొందివ దైత్యులు వినదించిరి, మరల మరల వర్తింపసాగిరి. అపుడు తారకుడు, పశుపాలుడు పశువుల వెంటనడిచినట్లు ఆ దేవతలను వెన్నంటి తన రథముపై మండి అసురులతో కలిసి కదిలెను. బలవంతుడైన తారకుని పురము మహీపాగర తీరమున నుండిన - దావిడల్పు పన్నెండు యోజనములుండెను - ఆ పురమున ప్రాకారములు తామముతో చేసినవై శోభించుచుండిమ.
ఆ అద్భుతపురమున అనేక ప్రాసాదములుండెను - దివ్యమగు ఆశ్చర్యములు వెలుగొందెను. ఎల్లప్పుడూ మూడురకాల శబ్దాలు ఆ పురమున తప్పక వినవచ్చుచుండెను - అవి గీతముల ధ్వని, వింటిధ్వని, విషయములననుభవింపుడను శబ్దములు అతని పుత్రులు, స్త్రీలు గొప్ప ఉత్సవముతో అతని అభినందించిం అక్కడ దివ్యమగు సభను చేరి రాజు తన సింహాసనమున కూర్చుండెను. దైత్యులతనినిస్తుతింపసాగిరి - అప్పరసలు వినోదపరచుచుండిరి - దివ్యాసనముల పైనున్న దైత్యవీరులతో కూడి తారకుడు సింహములతో కూడిన వానివలె మండిమ ఇంతలో ఒకదివ్యమైన స్త్రీ అక్కడ కొబ్బెము - దైత్యులు తారకునితో ఆ స్త్రీ అసమాన సౌందర్యవతీయని, అనేక భూషణముల గలదని చెప్పగా, ఆమెను చూచిన తారకుడు మిగుల విస్మయమునొందెను. ఆమె విట్లడిగెను - ‘దేవీ! నీవెవరో మాకు చెప్పుము - నాతో నీకేమి పని! మునుపెన్నడూ నీవంటి స్త్రీని మేము చూడలేదు’ . అనగా ఆ స్త్రీ ఇట్లనెను - దైత్యేంద్రా! నన్ను త్రైలోక్యలక్ష్మిగా తెలుసుకొనుము - నీ తపస్సుచే, శక్తిచే నీవు నన్ను పొందితివి. శక్తివంతుడివి, ఉత్సాహవంతుడిని, తపస్విని, నిర్భయుడిని, దాతను, భోక్తను నేను సేవింతును. పిరికివానిని, దీనుడిని, మంచిస్త్రీలను బాధపెట్టువాడిని, అన్నింటిని మిగుల శంకించువానిని వెంటనే నేను విడిచెదను.
నీ తల్లినెపుడు ఇంద్రుడు అవమానించెనో అప్పుడే నేను అతనిని విడిచితిని. ఇపుడిక నీ వశముననున్నాను. అనగా తారకుడు సంతోషమనెను. ఆ ముల్లోకములలో పూజింపబడు లక్ష్మి ఆతనిని చేరెను. ఆంతటదైత్యస్త్రీలు అలంకరించుకొని తారకుని చేరి వీరకాంస్యమును (ఒక తాళమును) తెచ్చి అతని వృద్ధికై తగు క్రియనుజేసిరి. దైత్యులు మేలుకొలుపగా దేవతలు పిరికివారై తారకుని ద్వారపాలకులుగా నిలిచిరి - వారీని దైత్యస్త్రీలు, ఇతర నాగరికులు పరిహసించుచుండిరి. ఇంతలో విష్ణువు దైత్యరూపమున అక్కడకు వచ్చి పరిహసించు వారి మధ్య విలిచి రెండు గాథలను చెప్పను. వీరు చేయునదంతా చాలా తక్కువైనది - తల్లక్రోధమున ఈ రాజు చేయనిదేముంది బలవంతుని చేరి నమస్కరించనివాడుండడు కమక దేవతలారా! మీరు మర్క (కోతి) రూపమున కొంగలవలే ఉపాయములననుష్ఠించండి అనగా ఉపహసపూర్వకమగు ఆ ఉపదేశమును విష్ణువు ముఖముమండి విని దేవతలు మర్కరూపమున నిలిచిరి. వారు వర్తించుచూ దైత్యస్త్రీలను వినోదపరచగా ఆ స్త్రీలు వీరికి తినుబండారములవిచ్చెను. అపుడు బుద్ధిమంతుడగు విష్ణువు దైత్యప్రతీహారితో నిట్లనెను – ‘మహారాజు వద్దకు వెళ్ళి వీరు మీ వినోదమునకేనని తెలియజేయుము.
అంతట ప్రతీహరి సంతోషముగా సభను ప్రవేశించి దైత్యేంద్రుని ముందు మోకాళ్ళపై కూర్చుని చేతులు జోడించి స్థిరంగా, తక్కువ మాటలలో స్పష్టముగా నిట్లు చెప్పెను. ‘దైత్యేంద్రా! ప్రభూ! మర్కబృందములు ద్వారమువద్ద నిలిచి యున్నవి - మిగుల వినోదమును కలిగించుచున్నవి. ఆసక్తియుండిన చూడవచ్చును’ అనగా రాజు విని’ ఆలస్యమెందులకు త్వరగా ప్రవేశపెట్టుమనిన విని, ప్రతీహారి కాలనేమితో మర్కబృందమును మహారాజు చూడగోరుచుండినందున త్వరగా వారితో రాజును సానుకూలపరచుము’ అనెను - అపుడు కాలనేమి మర్కబృందముతో రాజును చేరెను. మర్కబృందమున నున్న విష్ణువు మర్కరూపమును ధరించి తారకదైత్యుని ఎదుట మర్కబృందముతో కలిసి నర్తించెను. దైత్యేంద్రుడు కూడా సంతోషముగా కరతాళధ్వనులు చేయగా మర్కబృందము నర్తించెను - అంతట వారి నృత్యముచే మిగుల సంతోషించిన రాజు ఇట్లనెను. ‘మర్కదేవతలారా! మీ నృత్యముచే సంతసించిన నేను మీకు అభయము నిచ్చుచుంటిని - నిర్భయముగా నా ఇంట మీరు వుండవచ్చు అనగా విని మర్కరూపముననున్న విష్ణువు బాగా నర్తించుచూ ఇట్లనెను - ‘రాజా మీ ఇంటి ప్రకారమును తెలియగోరుచున్నాము మేము’ అనగా నవ్వి దైత్య శ్రేష్టుడగు తారకుడిట్లనెను – ‘ఈ ముల్లోకములు నాకు మూడు భూములు గల ఇల్లు.
అనగా విని విష్ణువు ఇట్లనెను - ‘అట్లెనచో నీ మాటను గుర్తుంచుకొనుము - ఈ మర్కబృందము ముల్లోకములలోన విర్భయముగా చరించుగాక! రాజా! మారు అశ్వమేధయాగములకంటే సత్యమే గొప్పది - ఈ ధర్మమును స్మరించుచూ నీవు నీ మాటను నిజముచేయుము’ అనగా విని విస్మయమునొందిన దైత్యేంద్రుడు మర్కటమా! నీవు జ్ఞానివి. నిజము చెప్పుము! నీవెవరు? అనగా విష్ణువు బదులిచ్చెను - ‘నీకు వినబడినట్లైతే, నేను నారాయణుడనువాడను - దేవతల రక్షణ కోసము మర్కట రూపమునుదాల్చితిని. ధర్మము వీకు పరమపూజ్యమగుచో నీ మాటను నిలుపుకొనుము - ఈ దేవతలు ఏ ఇంట స్వేచ్చగా చరించుదురుగాక! రాజా! మనసులో అవమానభావమును నీవుఉంచుకొనరాదు - నేమ వీరుడనని భావించుచూ కాలమున ఇట్లేర్పడిన బలమును చూచి నీవు క్రుంగరాదు. మాటిమాటికి వధింపబడువారికి హంతకుడెవరూ వుండరు - ద్వేషించువాడు తానే కర్తననుకొనుట మూర్ఖత్వము ఋషులను, దేవతలను, గొప్ప గొప్ప అసురులను. వేదవేత్తలను, వనములలోని మునులను అందరివీ కాలవశమున అపదలు వచ్చిచేరును - ఇది కాలముయొక్క బలమే గాని కర్తబలముకాదు మంత్రములచే, బలము, శక్తిచే, ప్రజ్ఞచే, పౌరుషముచే గానీ పొందరు - కాలము వచ్చినపుడు పొందలేని దానిని కూడా నిద్రించువాడైననూ, పొందును. తల్లిదండ్రులసేవ, దేవపూజ, ఇతర గుణసంపద పురుషునికి సుఖమునిచ్చునది కాదు. కాలముచేత పీడింపబడిన వానిని విద్యగానీ తపస్సుగానీ, మిత్రులు, బంధువులుగానీ రక్షించలేరు.
కాలబలము లేనిచో నరులు వందలకొలది అడ్డంకులు గలిగిన వానినెదుర్కొనుటకు శక్తులుగారు. దేహమున్నంతవరకు పుణ్యకర్మలు, జీవించియున్న కాలమందురు. రెండూ కలిసినపుడే కార్యసిద్ధి కలుగగలదు.దైత్యుడా! నీకంటే గొప్పవారగు దైత్యులు కోట్లకొలదిగా మునుపు శాల్మలీ వృక్షముయొక్క దూది పింజలవలె కాలమను గాలిచేత విసిరికొట్టబడి దుర్దశ నొందిరి. ఈ స్థితిని పొంది నీవు నిన్ను నీవు గొప్పగా తలుచుకొనుచుంటివి. కానీ ఈ స్థానము స్థిరమైనదీ, శాశ్వతమైనదీ కాదు. నీవు మూర్ఖముగా దీనిని వాదని తలుచుచుంటివి. విశ్వసించదగని దానిని విశ్వసించుచుంటివి - అస్థిరమును స్థిరమనుకొనుచుంటివి - ఇది నాదను మోహముతో నీవు ముల్లోకముల ఐశ్వర్యమును పొందగోరుచుంటివి. ఇది నీకు గానీ, మాకు గానీ, వేరెవరికి గానీ స్థిరముకాదు - ఎందరినో దాటి ఇది ఈనాడు వీయందు నిలిచియున్నది. తారకా! కొంతకాలము నీవద్ద నిలిచి ఈ ఐశ్వర్యము పుంశ్చలవలె చంచలమై వేరొకడిని చేరును. రత్నములు ఔషధులు గలిగిన వానిని, నదులు, సముద్రములు గలవానిని చేరగలదు - అయిననూ, ముల్లోకములను అనుభవించినవానిని నేమ ఇపుడు చూడలేదు. వీరుడైన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడు, వముచి, విప్రచిత్తి, విరోచనుడు కాలముచే నశించిరి.
అట్లే కీర్తి, వాతాపి, ఇల్వలుడు, అశ్వగ్రీవుడు, శంబరుడు, పులోముడు, మధుకైటభులు, విశ్వజిత్తు మొదలగువారు మహాబలులగు దానవేంద్రులే. కాని వారందరూ కాలముచే వశించిరి. కాలమే బలమైనది వీకొక్కడినే గొప్ప తపసివి కాదు - వారంతా వందల, వేలసంవత్సరములు తపము చేసిరి - వారూ సత్యనపరులు, జ్ఞానులు అర్హతవమపరించి దానములనిచ్చు వారు, దైత్యులు, వారు వెలుగు వెలిగి కాలముచే దెబ్బతీయబడివారు. కామభోగములయందు కోరికమ విడిచి వేయుము - ఐశ్వర్యము వల్ల కలిగిన మదమును వదిలి వేయుము - ఈ ఐశ్వర్యము నశించినపుడు నిమ్న శోకము పీడించగలదు. శోకమేర్పడినపుడు శోకించకు - హర్షమేర్పడినపుడు ఆనందించకు - భూతభవిష్యత్తులను నీవు వర్తమానకాలములో నడుపుము. ఎల్లప్పుడూ యోగముననుండి అలపించని ఇంద్రునే కాలమువచ్చి చేరినపుడు, నిన్ను కూడా చేరుమ. ఎక్కువకాలము సహించరాదు. యుద్ధమున నేను కోపించినపుడు ఎదుర్కొనగలవాడెవడు? బలమైన కాలము వచ్చినది గాన నేనే నిలుచుంటివి. తారకా! నేనెలాంటి వాడినో నా పరాక్రమమేమిటో నీకే తెలుసు. ప్రతికల్పమున కోట్లకొలదిగా దైత్యులు నా చేత వధింపబడినారు - నీవు వారి కోటిభాగమునకు కూడా సరిపోవు. బ్రహ్మ మొదలుగా గల ఈ మొత్తము జగత్తును నేను ప్రతికల్పమున సృజించెదము.
నేను కోరుకొనినట్లయితే జీవింపజేసెదను లేనిచో క్షణములో నాశనము చేసెదను. అందరు దైత్యులతో కూడియున్న విన్ను వధించుటకు ఉత్సహించలేననికాదు- వేలికొసతో నిన్ను వధించగలను గానీ ధర్మమునకు లోపమును కల్పించలేము - శ్రేష్టుడైన వేనే సర్వవ్యాపియె శ్రేష్ఠమైన ధర్మమును లోపింపజేసినచో ధర్మమిక ఎవరిని శరణుజొచ్చును? నేనే కర్తనమకొనకుము. ఎల్లప్పుడూ సమర్థుడైన కర్త యనిన కాలమే. కాలమే చెట్టుపై పండును పక్వము చేసినట్లు విశ్వమును పక్వము చేయును - (ఫలవంతము చేయును) ఏ కర్మలచే సుఖమును పొందునో మానవుడు ఆ కర్మలచేతనే దుఃఖమును పొందును. దైత్యా! కాలము చిత్రముగా నుండుటను చూడుము - బుద్ధిమంతులు అంతా కాలవశముచేతనని తెలియవలయును. కాలమే తమ కర్మ పరిపక్వమయినపుడు ఫలమునిచ్చువని పండితులు తెలియుదురు. కనుక, అమిత పుణ్యమును కలిగించు శుభకర్మనే మానవుడాచరించవలెను. పుణ్యకర్మచే సుఖము పాపకర్మచే దుఃఖము తప్పక కలుగును - అని తెలిసి దైత్య రాజా! నీవు నీమాటను నిలబెట్టుకొనుము. నా మాటనంతా ఆలోచించదలిచిన అట్లు చేయుము’ అనగా తారకుడిట్లనెను - ‘కాలనేమి మున్నగు రైత్యులతో కూడియున్న నన్ను చూచి, వధించదలిచిన మృత్యువుతో సహా ఎవరి మనస్సు కలతనొందదు? వాస్తవాన్ని చూచు నీ బుద్ధి దానితో వ్యధనొందినది నీవే మేమి పలుకుచుంటివో అదంతా అట్లే అగును - సందేహము లేదు - విషయముల పట్ల గానీ, శరీరమందుగానీ ఎవరికి విశ్వాసముండును?
ఎదుటనిలిచిన జగత్తును చూచి ఎవడు విశ్వసించుటకు పూనుకొనును? నేనుమా అట్లే ఈ లోకమశాశ్వతమని తెలియుదును. కాలమనెడి ఆతీరమై ఎల్లప్పుడు చలించు అగ్నిలో పడినదీ లోకము - నేడు దీనినాచరించెదను; మరునాడు దీవివాచరించెదను అనువారిని కాలమాసన్నమైనప్పుడు ఎదురుగా వచ్చువానిని వదీ వేగము హరించునట్లు కాలమే హరింపజేయును. ఇపుడేకదా నేవా కాలమున చూచినది - ఇంకా మరిచి పోలేదు కాలముచేత హరింపబడు నరుల ప్రలాపము వివబడుచుండును - ఈర్ష్య, అసూయ, లోభ, మావ, కామ, క్రోధ, భయ, పుహ, మోహ, ఆతివాదములనువానిలో చిక్కుకొనిన లోకము మేల్కొనలేకున్నది. పెద్దదో, చిన్నదో నేను కార్యము, అకార్యము అనువాని నెఱుగుదును. అన్ని ప్రాణులలో ఏవు శ్రేష్ఠుడవు, ప్రభువువని నాకు తెలియును - కాని ఏమిచేయగలము? బలమైన మా స్వభావమువలన మేము నిన్ను తలచలేము. నిన్ను కొందరు భక్తితో సేవించగా, కొందరు వైరముతో భజింతురు - కొని వారి వందరిని నీవు దయతో జూడవలెను - నీవే కదా ప్రాణుల ఆంతరాత్మను పురాతనము, శాశ్వతము అగు ధర్మము ప్రాణులన్నింటికీ సమానము - నన్నాశ్రయించి ముక్తులయిన ఈ దేవతలందరూ వెళ్ళవచ్చును. వీరు ముల్లోకములలో మర్కట రూపమున చరించవలెను - యజ్ఞభాగమున పుహయుండరాదు - ఇదే శపథము అని తారకుడనగా దేవతలందరూ సంతోషించిరి.
అపుడు విష్ణుమూర్తి ఇట్లనెను - ‘దైత్యేంద్రా! నీవు విద్యా, జ్ఞానము, తపము గలవాడవు - ఇక తత్యము తెలిసినవాడవు కమ్ము - స్పష్టంగా నీవు కాలముమ కరతలా మలకముగా (చేతిలో ఉసిరికాయవలె) చూచుచుంటివి కాలమునందు సంభవించు వానిని నిజముగా తెలియు ఓ శివభక్తా! జ్ఞావీ! వజ్రాంగసుతా! నీవు ధన్యుడవు - బుద్ధిమంతులలో స్పహణీయుడవు తపస్సుయొక్క ప్రభావమున్నంతవరకు ముల్లోకములననుభవింపుము - ఈ శపథముతోడనే దేవతలు జగత్తువ సంచరించగలరు అని పలికి ప్రభువగు వారాయణుడు మర్కటబృందముతో కలిపి ఆ ప్రదేశమునండి వైదొలిగి మేరుపర్వతము వద్దకు వెళ్ళాను. అచటికి చేరి విష్ణువు దేవతలతో నిట్లనెను -‘దేవతలారా! మీరు బ్రహ్మవద్దకు వెళ్ళుడు -అతనే మీకు హితమొనరించును. జాగరూకతతోనుండవలెను - శపథమును మరువరాదు’-అని విష్ణువు మాయమాయెను దేవతలతనిని భక్తితో స్తుతించి బ్రహ్మవద్దకు వెళ్ళిరి. దివ్యులు, ఉత్తములగు (దేవతాత్రేష్టులగు) వారి చేత బ్రహ్మ స్తుతింపబడెను - శివుని అనుగ్రహముచే గొప్ప ఐశ్వర్యమునుపొంది తారకుడు సంతసించెను. తాను ఇంద్రుని స్థావమును పొందగా, నిమి వహ్నిగా, కాలనేమి యమునిగా, స్తంభుడు నిర్ఋతిగా, మహిషుడు వరుణుడిగా, మేషుడు వాయువుగా, కుజంభుడు కుబేరునిగా నుండిరి - తారకుడు ఇతరదైత్యులకు ఆయా అధికారమునిచ్చెను.
ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున దేవాసుర సంగ్రామమున తారకాసురవిజయమును వర్ణించుటయను ఇరవై ఒకటవ అధ్యాయము – 21.
