స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

12వ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను - 'అర్జునా! అంతట వారందరూ సంయమమున క్రియాయోగముతో, మూర్తిదాల్చిన తపస్పువలెనున్న లోమశవృత్తాంతః మహామునియగు లోమశుని జూచిరి -  త్రిషవణస్నానముచే (మూడు మార్లు) పసుపు రంగున మన్న బిటలను తలదాల్చి నేతిలో తడిసిన అగ్నివలెనుండెను -  ఎడమచేతిలో నీడకొరకు గడ్డితో చేసిన దానిని (గొడుగువలె), కుడిచేతిలో రుద్రాక్షమాలను ధరించి మైత్రీమార్గమున నడచుచుండెను. భూమిపై చరించు ప్రాణులను చెడుమాటలతో బాధింపక జప్యములో సిద్ధినొందువాడు మైత్రుడనబడు ముని ఆ చిరంతన తపోనిధిని కలాపగ్రామమున చూచి కొంగ, రాజూ, ముని, గుడ్లగూబ, గద్ద, తాబేలు నమస్కరించినవి ఆ ముని స్వాగతము పలికి ఆసనమిచ్చి యథోచితముగా సత్కరింపగా సంతసించి, ఆ ఆరుగురూ మనసులో నున్న దానిని మునినిట్లడిగిరి - ముందు కూర్మమిట్లడిగెను - 'మహాత్మా! ఇతను ఇంద్రద్యుమ్నుడను రాజ, యజ్ఞములు చేయువారీలో అగ్రగణ్యుడు కీర్తిలోపించుటచే బ్రహ్మ ఇతనిని స్వర్గమునుండి గెంటివేసెను మార్కండేయాదులతో కలిసి కీర్త్యుద్దారమును పొందిన ఇతను మరల పడిపోవుదునన్న భయముతో స్వర్గమునుకూడా కోరుటలేదు - మీరితని ననుగ్రహించితిరి - ఇతనిక్కడ గొప్ప ప్రయోజనమును కోరుచునున్నాడు - భగవాన్! మీరితనిని శిష్యునిగా చేసికొని శిక్షణగరపవలెను - నేనితనినిక్కడికి తెచ్చితిని ఇతను కోరిన దానిని పలుకుము పరోపకారణమనగా సాధువులు చేబట్టిన వ్రతమే - అందునా శిష్యవృత్తిని పొందిన వినీతులకు వ్రతము కదా! వినయములేని పాపులకు చెప్పబడిన మంచిమాట వారికి నిస్సంశయముగా వినాశమున గానీ మరణమును గానీ రెంటినీ గానీ కలిగించును అప్రమత్తుడై మునీ, వినీతులగు కోరిన దానినిచ్చును మీకు ధర్మము తెలియును - మేమెంత?

అనగా లోమశుడిట్లనెను - 'కూర్మమా! నీవన్నది నిజము. ధర్మశాస్త్ర సంబద్దము. ఇప్పుడు పురాతనమగు దానిని స్మరించునట్లు చేసితివి. సరే, రాజా! నిర్భయంగా నీ మనసులో నున్న సందేహమును చెప్పుము. మిగిలిన దాన్ని దేనిని నీకు చెప్పాలి? తప్పక నీకు చెప్పెదను' అనగా ఇంద్రద్యుమ్నుడిట్లనెను - 'భగవాన్! నా మొదటి ప్రశ్న ఇది - ఇక చెప్పుము - గ్రీష్మకాలమున తలపై సూర్యుడుండగా (మధ్యాహ్నము)కూడా వీకు ఆశ్రమము లేదు - కవిసము కుటీరమాత్రమైన లేదు. చేతులలో గడ్డిని పట్టుకొనీ నెత్తిపై నుంచుకొని దానినీడను పొందుచుంటివి - ఎందులకు? అని అడుగగా లోమశుడు చెప్పసాగెను - 'మరణము తప్పదు - ఈ శరీరము తప్పక' నేలరాలును - అనిత్యమగు సంసారమధ్యనుండి ఎవరికొరకు గృహము ఏర్పరుచుకొనెదరు? ఎవనికి మృత్యువు మిత్రుడో, ఎవడు అమృతమును తాగెనో అతను 'నాకు రేపన్నది వున్నద'నుట యుక్తము.

 ఈ దినము, యుగసహస్రములలో ఒకప్పుడు భవిష్యత్తు. అట్టిదిప్పుడు వర్తమానమైనది. మరణముయొక్క ఆవధిని గూర్చి చెప్పునదేమి?  కారణమునమసరించు కార్యమేదీ శుక్రమునుండి శరీరమేర్పడినదీ  కడిగిన బొగ్గువలె అది శుద్ధిచెట్లు పొందును?  అరిషడ్వర్గముచే జయింపబడి ఈ శరీరము కోరకు పాపము నాచరించుపోయేందుకు సిగ్గుపడరు?  బ్రహ్మనుండి రెండు ఇసుకలలో నేర్పడినది. వేదోక్తమును చదువుచూ, వినుచూనుండగా ఇదేట్లు జీవించగలుగును? అయిననూ, అవివేకిని విష్ణుసంబంధిమాయ మోహపరచును - వందల ఏళ్ళు వచ్చిననూ హృదయమున నున్న మృత్యువును తెలియలేరు. దంతములు అస్థిరములు - ఐశ్వర్యము, యవ్వనము, జీవితమే అస్థిరమైనది - రాజా! ఇదంలో చలచలము. దానమే మనుజులకు గృహము ఇది తెలిసి, సంసారము చలాచలము, సారము లేనిదని ఎడిగి, ఎవరికొరకు ఆశ్రమము మొదలగు వానిని పొందవలేను? అనగా రాజిట్లనెను - 'ముల్లోకములలో నీవే చిరాయువని తెలిసి వచ్చితిని. మరీ ఇట్టి మాటలేమీ?' అనగా లోమశమునీ చేప్పెను - ప్రతికల్పమున నా శరీరమునుండి ఒక వెంట్రుక రేటును - అన్నీ రాలినపుడు సోకు మృత్యువు కలుగును నా మోకాలు ప్రాంతమున చూడుము - రెండంగుళములు వెంట్రుకలు లేవు  దానిని చూచి భయము నొందుచుంటిని - మరణించవలసియుండగా ఇంటిలో నేమి ప్రయోజనము?

లోమశుడిట్లనగా విని రాజు నవ్వి అతివిస్మయముతో అతని ఆయుష్సుకు కారణమేమిటని ఆడిగెను 'మహాత్మా! ఇట్టి దీర్ఘాయువునకు కారణమేమి? దానమా? తపస్పా? దేని ప్రభావము? అని అడుగగా లోమశుడు చెప్పెను - 'రాజా! వినుము చెప్పెదను - ఇది శివధర్మముతో కూడిన పుణ్యమగు కథ. పూర్వజన్మలో జరిగినది, అన్ని పాపములను నశింపజేయునది. పూర్వము నేను దీరిద్రుడగు శూద్రునిగా భూమీ. నుంటిని - ఆకలితో పీడింపబడి భూమిపై తిరుగుచునుంటిని. ఒకనాడు మధ్యాహ్నము జాలి మధ్యనున్న పెద్ద శివలింగమును, దేవీ జలాధారమును దూరము నుండి చూచితివి -  ప్రవేశించి, ఆ నీటినీ తాగి, స్నానమాడి శివలింగమునకు స్నానము చేయించితిని - మంచి కమలములతో పూజను చేసితిని అంతట, ఆకలి ఎండిపోయిన కంఠముతో వేమ కంతునికి నమస్కరించి మార్గమున నడుచుచూ మరణించితివి. ఆ తరువాత బ్రాహ్మణగృహమున జన్మించితివి  జాతి స్మరణయుండెను - శివలింగమునకు అభిషేకము చేయుటచే, మంచి కమలములతో పూజించుట చేత ఆ స్మరణకలిగను ఇది మిథ్యావిలాపమని స్మరించుచు. ఈ జగత్తు పత్యమువలె కనబడుచున్నమా అవిద్యామయమని తెలిపి మూగగా నుంటివి వృద్ధాప్యమున ఈశ్వరుని ఆరాధించుటచే కలిగితివని ఆ విప్రుడు వాకు ఈశానుడవి పేరు పెట్టెను.

అంతట ఆ విప్రుడు వాత్సల్యముచే వా మూగతనమును పొగిట్టదవని విశ్చయముతో ఎన్నో వైద్యములను చేయించెను. మంత్రములమ, వైద్యములన ఇతర ఉపాయములెన్నింటినో చేయించిరి - మహామాయతో కూడిన మనసులుగల వా తల్లిదండ్రుల మూర్ఖత్వమున చూచి మనసులో ఎంతో నవ్వుకుంటిని  కొంతకాలమునకు యవ్వనమున పొందితివి. రాత్రి సమయాన ఇంటికి వెళ్ళి కమలములతో శివుని పూజించి తరువాత నిద్రించువాడివి. నా తండ్రి మరణించగా మాలో సంబంధమున గల వారందరూ నమ్న మూడుడని విడిచేపిరి  అపుడు పళ్ళు తింటూ బ్రతికితివి కానీ నానారకాల పుష్పాలతో శివుని పూజింపసాగితివి  అంత వందసంవత్సరాల తరువాత వరములనిచ్చు శివుడు ప్రత్యక్షముకాగా ముసలితనము, మరణము లేకుండునట్లు వరములిమ్మనగా శివుడిట్లనెమ 'నామ, రూపములను దాల్చినందున నాకే ముసలితనము, మరణము గలవు, కమక జీవితావధిని చెప్పుము  అనగా నేను 'ఒక్కొక్క వెంట్రుక రాలుచూ, అన్నీ వెంట్రుకలు రాలిన పిదప మరణము సంభవించునట్లు, తరువాత నీ గణముగా మారునట్లు వరమునిమ్మంటివి - అట్లేనని శివుడు మాయమాయేను. అప్పటి మండి వేమ తపప్పునమన్నవాడినే అయితిని. శివపూజను వికసించిన కమలాలతో లేదా ఇతర పుష్పములతో చేసినచో అన్ని పాపముల నుండి ముక్తులయ్యేదరు .

రాజా! నీవు కూడా ఇట్లే చేయుము -తప్పక నీవు కోరినదానిని పొందెదవు  ముల్లోకములలో శివభక్తునికి లభించనిది లేదు. బాహ్య ప్రవృత్తిని, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములను నిగ్రహించి సదాశివునియందు లయింపజేయుట 'అంతర్యోగమ' నబడును. ఇది కష్టమని శివుడు బహిర్యోగమును స్వయముగా చెప్పెను పంచభూతములతో పూజించుట విశేషఫలమునిచ్చును. క్లేశ, కర్మ-విపాక, ఆశయములచే తాకబడని ఈశ్వరుని ఆరాధించుచూ ప్రణవమును జపించుచునుండిన ముక్తిని పొందెదరు. అన్ని పాపములు నశించగా శివునియందు భావన కలుగు  పాపబుద్ధులకు శివుని యందు వార్తకూడా దుర్లభమే - భారతమున జన్మ, శివపూజ, గంగాస్నానము, శివభక్తి ఇవన్నీ అతి దుర్లభములు. బ్రాహ్మణదానము, అగ్ని పూజ దుర్లభములు  తక్కువ పుణ్యము గలవారు పురుషోత్తముడగు శివుని పూజ పొందలేరు.  లక్షశరీరములతో యోగము, అరలక్ష శరీరములతో అగ్నికార్యము, అరవై శరీరములతో స్వయముగా రుద్రుడగుట పెద్దించును.  రాజా! నీకిట్లు అంతా చెప్పితిని - మహేశ్వరుని ఆరాధించి దీర్ఘాయువెట్లు కలిగెనో తెలిపితిని. శివభక్తి గల మహాత్ములకు, ముల్లోకములలో లభించనిది, పొందలేనిది, సాధించరానిది లేదన్నది నిశ్చయము.

            శివపూజవలన నందీశ్వరుడు ఆ శరీరముతోడనే పిద్దినొందుట చూచి కూడా ఎవరు శివుని పూజించరు?  నీలకంఠుని పూజించిన శ్వేతుడను రాజుకు కాలము కూడా ప్రళయమునొందుట చూచి ఎవరు శివుని పూజించకుందురు?  ఎవరి కోరిక ఈ విశ్వము జన్మించి, నిలిచి, చివర లయించునో అట్టి శివుని ఎవరు శరణు వేడకుందురు?  రాజా! రహస్యమిదే - నరులందరూ శివపూజనాచరించవలెను - లోకములన్నీ అంతరాయములను కల్పించినపుడు నరుడు శివునికి నమస్కరించినచో వెంటనే శుభమును పొందుట సత్యము.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వర ఖండమున కౌమారికాఖండమున మహీప్రాదుర్భావమున లోమశవృత్తాంతమున శివపూజయొక్క మాహాత్మ్యము అను పన్నెండవ అధ్యాయము.