స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

4వ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను- అటుతరువాత నేను ఈ స్థానము నా వశముననెట్లుండునని మిగుల ఆలోచించితిని. ఎందుకంటే ఈ భూమి ఎల్లప్పుడూ రాజుల వశముననుండును. నేను ధర్మవర్మను చేరి ఈ భూమిని యాచించిన అతను తప్పక భూమిని నాకర్పించుమ. ఆయిననూ, మునులు ద్రవ్యము మువ్విధము అని చెప్పిరి. ఉత్తమ ధనము తెల్లది, మధ్యమధనము చిత్రము, ఆధమధనము వల్లనిది. వేదజ్ఞానము ద్వారా పొందినది, శిష్యుని నుండి పొందినది, కన్యచే పొందినది కూడా శుక్లమనబడును. అట్లే వ్యాపారము, వ్యవసాయము, సేవ, యాచనల ద్వారా పొందిన ధనము చిత్రమనబడును. పాహసముతో, ద్యూతములో గా దొంగిలించిగానీ, ఏదేని నెపముచే గానీ పొందిన ధనము కృష్ణమనబడును. ఉత్తమమగు శుక్లధనమును శ్రద్ధతో పరియైన దేశమున, సరియగు వ్యక్తికి దానమిచ్చి ధర్మమాచరించువాడు దేవత్వమును పొందుము. రాజసభావముతో చిత్రధనమును యాచకులకు దానమిచ్చువాడు మమష్యత్వమును పొందును. తమోగుణముతో అధమమగు ధవముమ దానమిచ్చువాడు పరలోకమున పక్షి (జంతువై)యై దానిని పొందుము. యాచనద్వారా పొందిన ధనము రాజసమని స్పుటముగా కనబడును. కనుక ఇక బ్రాహ్మణభావముతో రాజునుండి ప్రతిగ్రహమును యాచించెదను.

            ఈ ప్రతిగ్రహము ఘోరమైనది. విషమువంటి మధువును గ్రోలుటవంటిది. ప్రతిగ్రహముతో కూడిన బ్రాహ్మణుని పాపము చేరును. కనుక నేనీ ప్రతిగ్రహరూప పాపమునుండి మరలెదను. రెంటిలో ఏదో ఒక ఉపాయముచే వేవా స్థానమును స్వంతము చేసుకొనెదనని మరల మరల ఆలోచించసాగితివి. చెడు భార్యగల పురుషుడు తన చింతకు అంతమును పొందనట్లు నేనునూ ఆలోచించుచూ నా చింతకు ఆంతమును కొంచమైనా పొందలేక పోతిని. ఇంతలో ఆ పుణ్యప్రదమైన మహీసాగర సంగమమున స్నానమాడుటకు మునులనేకులక్కడకు వచ్చిరి. నేను వారిని మీరెక్కడ మండి వచ్చితిరని అడిగితిని. అపుడు వారు నాకు నమస్కరించి సౌరాష్ట్రదేశమున నుండి వచ్చితిమని దానికి ధర్మవర్మయను వాడురాజయని చెప్పిరి. దావతత్యమును గోరి అనేక సంవత్సరములు తపించెను. ఆంత, ఆకాశవాణి ఒక శ్లోకమును వినిపించెను. రెండు హేతువులు, ఆరు అధిష్టానములు, ఆరు లింగములు, ఆరు ఫలములు గలది.  నాలుగు ప్రకారములను, మువ్విధములను, మూడు సాశములను గలిగినది దానమనబడును. అని శ్లోకమును పలికి ఆకాశవాణి విరమించెను.

అడిగినప్పటికీ శ్లోకమునకు అర్థమును చెప్పలేదు. అంతట రాజు వాద్యఘోషతో ఇట్లు చాటింపజేసెను. తపస్సు ద్వారా నేను పొందిన ఈ శ్లోకమునకు సరియైన వ్యాఖ్యానమున చేయగలవానికి నేను పారితోషికమునిచ్చెదను. అతనికి ఏడువందల కోట్ల గోవులను అంతే బంగారమును, ఏడు గ్రామములనూ ఇచ్చెదను. అని రాజు గొప్పగా చాటింపు చేయించగా వివి అనేక దేశములనుండి అనేకమంది బ్రాహ్మణులు వచ్చిరి. కాని తెలియరాని ఆ శ్లోకమును వారు మూగవారు బెల్లము రుచిని విడమరచి చెప్పజాలనట్లు వ్యాఖ్యానించలేకపోయిరి. నారదా! మేము కూడా ధవము పట్ల లోభముతో అక్కడికి వెళ్ళాము. కానీ అర్థముకానందువలన ఆ శ్లోకానికో దండం పెట్టి ఇక్కడికి వచ్చేసాము. ఆ శ్లోకమెలాగూ అర్ధము కాదు. ధనము మాకు లభించదు. తీర్థయాత్రనెట్లు చేయవలెనని తలచి ఇక్కడకు వచ్చితిమి. అని వారనగా వివి మిగుల సంతోషమునొంది వారికి వీడ్కోలు పలికి ఇట్లాలోచించితిని. 'ఆహా! స్థానమును పొందుటకు నాకిపుడు ఉపాయము లభించినది. సందేహము లేదు. శ్లోకమును వ్యాఖ్యానించి స్థానమును, ధనమునూ పొందెదను. విద్య మూల్యముగా గ్రహించినది యాచింపబడినది కాదు. ప్రతిగ్రహమూ కాదు. పురాణరీ జగద్గురువగు వాసుదేవుడు నిజము పలికెను. ధర్మమునందు శ్రద్ధయున్నవానికి ఆ శ్రద్ధ ఎల్లప్పటికీ పూరింపబడదు. అట్లే పాపమునందు శ్రద్ధయున్నమా అది పూరింపబడదు.

ఇట్లాలోచించి విద్వాంసులు రుచినమసరించి ప్రవర్తింతురు. అతని వాక్యమిది సత్యము. పొందలేననుకున్న నా మనోరథము అంకురించి సఫలమైనది. తెలియజాలని ఈ శ్లోకమును నేను స్పష్టముగా తెలియుదును. పూర్వము వా పితృదేవతలు నిరాకారులై నాకు దీనిని తెలియజెప్పిరి. అని సంతోషముతో మరల మరల తలచుచూ నేను తీర్థమునకు నమస్కరించి మహీసాగర సంగమమునకు వెళ్ళితిని. వృద్ధ బ్రాహ్మణరూపమున రాజు వద్దకు వెళ్ళితిని. 'రాజా! ఈ శ్లోక వ్యాఖ్యను వినుము. నీవు చాటించిన దానమును కూడా అధికముగా చేయుమంటిని. అది విని రాజు 'కోట్లకొలదిగా ద్విజులిట్లనిరి. కానీ దీని అర్థము చెప్పలేకపోయిరి. రెండు హేతువులు, ఆరు అధిష్టానములు, ఆరు అంగములు, రెండు ఫలములూ ఏవి? నాలుగు ప్రకారములు, మూడు విధములు, మూడు నాశములు దానమునకు గలవంటిమి. అవేవి? స్పుటముగా చెప్పుము. బ్రాహ్మణా! నీవు వీనికి సమాధానమివ్వగలిగిన ఏడువందల కోట్ల గోవులను, అంతే బంగారమును,  ఏడు గ్రామాలను నీకిచ్చెదము. లేనిచో నీవు ఇంటికి వెళ్ళేదవు.' అని ఆ సౌరాష్ట్రరాజు అనగా విని ధర్మవర్మయను ఆ రాజుతో ఇట్లంటిని- 'వినుము, స్పష్టముగా శ్లోకమునకు వ్యాఖ్యానము చేసెదను. ఆ రెండు హేతువులను ముందు వినుము.

తక్కువగానీ, ఎక్కువగానీ చేసిన దానము అభ్యుదయమును కలిగించును. తద్ద మరియు శక్తి దావములకు వృద్దివి,శాశ్వతత్వమును కలిగించును. శ్రద్ధ విషయమున ఈ క్రింది శ్లోకములు చెప్పబడినవి- క్లేశముములతో గానీ, ధనరాశులతో గానీ పూక్ష్మమగు ధర్మము ప్రాప్తించదు. శ్రద్ధయే అద్భుతధర్మము, అద్భుతమపప్పు. ఆర్ధయే స్వర్గము, మోక్షము. జగత్తంతా శ్రద్ధయే. ఎవడైనా అశ్రద్ధతో తన సర్వస్వమును గానీ జీవితమును గానీ దానమిచ్చిన, కొంతైవా ఫలముండదు. దావిచే అశ్రద్ధ చూపువాడే యగును. గొప్పవారు శ్రద్ధతో ధర్మమును సాధింతురు గానీ ధనరాశులతో కాదు - ఏమీ లేవి మునులు కూడా శ్రద్ధతోనే కదా స్వర్గమును పొందినది. ప్రాణులకు వారి స్వభావముతో శ్రద్ద మూడువిధాలుగా ఏర్పడును. పాత్వికము, రాజసము, తామసము అని వాని పేర్లు చెప్పెద వినుము. పాత్యికులు దేవతలను పూజింతురు. రాజపులు యక్షులను, రాక్షసులను పూజింతురు. తామసులు భూతప్రేతపిశాచములను పూజింతురు. కనుక శ్రద్ధతో ఎవరైనా తాను వ్యాయముగా సంపాదించినదానిని కొద్దిగానైనా యోగ్యునికి దానమిచ్చినచో, శివుడు దానితో సంతోషించును.

శక్తివిషయమున కూడా శ్లోకములు గలవు- కుటుంబముకొరకు, భోజనముకై, వస్త్రములకై తప్ప దాచినదంతా, మధువు రుచిగల విషము వంటిది. అట్టి దానిని దానమిచ్చిన అధర్మమే. ఇతరుడు శక్తిగలవాడై, తనవాడు దుఃఖితుడై యుండగా ఇతరులకు దానమిచ్చిననూ, దానము వలె కనబడు దానిచే మధువుతో గూడిన విషమును తినువాడగును. తనమీద ఆధారపడువారిని అలక్ష్యం చేసి (వారికి విఘ్నము కల్పించి) పై లోకమునకు చెందినదానిని చేసినచో అది ఇహపరలోకములలో దుఃఖమును కలిగించును. తనకు ఇతరులకు సమానముగా చెందుదానిని, యాచించి పొందినదానిని, వేరొకరు తనవద్ద వుంచిన దానిని, తాకట్టును, భార్యను, దర్శనమును అన్వాహితమును, నిధిని, వంశము (సంతానము) వుండగా సర్వస్వమును, ఈ తొమ్మిదింటిని ఆపదలలోనూ పండితులు దానమివ్వరాదు. దానమిచ్చిన మూడుడు ప్రాయశ్చిత్తమొనరించవలెను. రాజా! ఇట్లు నేను నీకు రెండు హేతువులను అనగా శ్రద్ద, శక్తి అనువానిని చెప్పితిని. ఇక ఆరు అధిష్టానముల జెప్పెద వినుము  అను శ్రద్ధ, ఆర్థము, కామము, క్రీడ (సిగ్గు) ధర్మదానము అనగా ధర్మబుద్దితో మాత్రమే దానములకు అధిష్టానములు  ధర్మదానము అనగా ధర్మభుద్దితో మాత్రమే ఫలమునాశించక విత్యము యోగ్యులకు దానమిచ్చుట  ధనలోభముతో ధనికుడి నుండి ధనమును పొందుటను అర్థదానమందురు. అనర్హుడికైననూ అభిమానముతో ప్రయోజనమునాశించి ప్రసంగముతో దానమిచ్చుట కామదానమనబడును.

సభయందు సిగ్గుచే ప్రతిజ్ఞచేసి (ప్రకటించి) దానమిచ్చిననూ, గ్రహించి తిరిగి ఇచ్చివనూ ఫ్రీడాదానమబడును. తనకు ప్రియమైనవానిని చూచి గానీ, వివిగానీ హర్షమును పొంది దానమిచ్చిన హర్షదానమని ధర్మజలందురు. ఆక్రోశము, అనర్థము, హింప అనువావికి ప్రతీకారమునకై, ఉపకారము చేయనివానికి కూడా దానమిచ్చిన భయదావమవబడును. ఇవి ఆరు అధిష్టానములు- ఇక ఆరు అంగములను వినుము. దాత, ప్రతిగ్రహీత, శుద్ధి, దేయము, ధర్మపహితము, దేశకాలములు ఇవి దావమునకు ఆరు అంగములు. ఆరోగ్యముగలవాడు, ధర్మాత్ముడు, దానమివ్వగోరినవాడు, వ్యసనము లేనివాడు, పవిత్రుడు, పవిత్రమైన జీవనకర్మమ నడుపువాడు ప్రశస్తుడైన దాత. అట్లే కుటిలుడు, శ్రద్ధచూపనివాడు, అశాంతితో మన్నవాడు, కోపి, భయస్తుడు, ఆబద్దములను ఆడువాడు, నిద్రించు స్వభావముగలవాడు ఆధముడగు దాత, తామసుడు- ఇక దానమున గ్రహించు వావిలో మనోవాక్కాయకర్మలచే శుద్దుడు క్షీణవృత్తిగలవాడు, దయగలవాడు, పుష్టిగల ఇంద్రియములు గలవాడు (అంగవైకల్యము లేనివాడు), యోనిదోషములు లేనివాడు అగు బ్రాహ్మణుడు దానమునకు పాత్రుడు (యోగ్యుడు). యాచకులను చూచుటలోడనే సుముఖతను, ప్రీతిని చూపుట, సత్కరించుట, అసూయను పొందకపోవుట శుద్ధియవబడును. ఇతరులకు బాధకలిగించనిది, క్లేశములేనిది, తన కృషితో సంపాదించినది, ఏ కొద్దిగానైననూ దానమివ్వదగినదనబడును. ఇది దేయము.

ధర్మమునుద్దేశించి దానమిచ్చినచో ఆది కొద్దిమాత్రమే అయినహధర్మసహితమనబడుమ. ధర్మము లేనిది విష్ఫలము. దుర్లభమగు ద్రవ్యముమ దేశకాలములందు న్యాయముగా దావమిత్తురో ఆ దేశకాలములే శ్రేష్టములనబడును. వేరొకటి కాదు. ఇవి ఆరు అంగములు. ఇక రెండు ఫలములను (పాకములను) చెప్పెద విమము. దావముచే కలుగు ఫలములు రెండు ఇహ, పరలోకములకు చెందినవి. ఉత్తములకు దానమిచ్చినచో, అది పరమున దాతను చేరును. అపత్పురుషులకు దానమిచ్చినచో అది కేవలమీలోకమున అనుభవింపబడును.ఇవి రెండు విధముల ఫలములు. ఇక నాలుగు ప్రకారములను ఏమము. ఇవి క్రమముగా ధ్రువము, త్రికము, కామ్యము, నైమిత్తికము అనబడునవి. ఈ వైదికదానమార్గమును ద్విజులు రెండుగా విభజింతురు. వీటికొలనులు, ఆరామములు, తటాములు మొదలగునవి అన్నీ ఫలముల విచ్చునవి. వీనినీ ధ్రువమందురు. ప్రతిదినము ఇవ్వబడు దానముమ త్రికమందురు- సంతానము కొరకు, విజయము కొరకు, ఐశ్వర్యము కొరకు, స్త్రీలకొరకు, బాలురకొరకు ఇష్టానుసారము దానమిచ్చినది కామ్యమవబడును. హోమములేని ఈ నైమిత్తికము కాలాపేక్షము, క్రియాపేక్షము, గుణాపేక్షమనీ మూడు విధాలు. ఇక వీని మూడు విధముల చెప్పెదను. మొదటి ఎనిమిది ఉత్తమములు, వాలుగు మధ్యమములు, మిగిలినవి అధమములుగా చెప్పబడినవి.

గృహములు, ప్రాసాదములు, విద్య, భూమి, గోవులు, కూపము, ప్రాణము, బంగారమును దానమిచ్చుట ఉత్తమదానమనబడును. ఎందుకనగా ఇవి ఉత్తమద్రవ్యములు అన్నము, ఆరామము, వస్త్రములు, గుర్రములు మొదలగు వాహనములు మధ్యము ధనము. దీనిని దానమిచ్చుట మధ్యదానమనబడును. పాదరక్షలు, గొడుగు, పాత్రలు, పెరుగు, మధువు, ఆసనములు, దీపము, కర్రలు, రాళ్ళు మున్నగునవి ఎక్కువ కాలమునకు చెందినవి అధమములు. వీనిని దానమిచ్చుట ఆధమదానము. ఇక నాశముల మూడింటిని వినుము. దానమిచ్చిన తరువాత తపించిన అసురధానమబడును. ఆది వ్యర్థమగుమ. అశ్రద్దలో దానమిచ్చిన రాక్షసము, అది కూడా వృథా యగును. బాధపడి దానమిచ్చిననూ, దానమిచ్చి బాధపడినమా ఆది పైశాచదానము, విష్ఫలమైనది. ఇవి దానము నశించు మూడు విధములు. రాజా! వా శక్తి కొలది నీకీ ఉత్తమమగు దావమాహాత్మ్యమును ఏడు పదములలో కూర్చి చెప్పితిని. సరైనదా కాదా నీవే చెప్పుము. అనగా ధర్మవర్మ ఇట్లనెను. సజ్జనుడా! నేడే వా జన్మ సఫలమైనది, తపస్సు ఫలించినది, నేడు నీకు నేను కృతజ్ఞుడనైతిని. జన్మ అంతా అధ్యయనం చేసికూడా బ్రహ్మచారిగా మన్నచో వృథాగా మారినట్లే ఎన్నో క్లేశముల సహించి భాల్యమ పొందిన తరువాత ఆమె అప్రియమున పలుకునదైనచో వృథా.

అట్లే కష్టపడి బావిని తవ్విన తరువాత ఆ వీరు ఉప్పునీరు అయితే ఆ బావి వ్యర్థమైనట్లే, ఎన్నో క్లేశములతో సంపాదించిన జన్మ కూడా ధర్మములేనిచో వృథా యగును. అట్లే నా జన్మ వృథా కాబోగా, నీవు సఫలముచేపితివి. కనుక నీకు, ద్విజులకు నమస్కారము. పూర్వము వైకుంఠమున మహావిష్ణువు కుమారులకిట్లే చెప్పెమ. అగ్నియందు సమర్శింపబడి జాలువారుచున్న నేతితో మత్తిల్లిన అగ్నిదేవుని ద్వారా నేను యజమానవి హవిస్సుమ భుజించను. పొందిన కర్మఫలములతో  సంతోషించిన బ్రాహ్మణుని ముఖమున చరించుదావి వమభవించెదమ.కమక, నేమ అశుభమతినై విప్రులయందే అప్రియము వొనరించితివో దానిని అన్నింటికీ సమర్థులైన మీరు క్షమించండి.నీవుమా పామాన్యుడవు కాదు. ప్రపన్నడవుగమ్మని నమస్కరించి పలుకుచుంటివి. విమ్న తెలియపరచుము. మునీశ్వరా! అనగా నేవిట్లంటిని. వారదుడిట్లు చెప్పమ. ఓ రాబా! వేమ వారదుడను. స్థలమును కోరి వచ్చితిని. స్థలముకై వాకు ద్రవ్యముమ, భూమిమీ ఇవ్వము ఈ భూమి విజానికి దేవతల ద్రవ్యమైనమా, ఏకాలమున ఎవరు పాలకులో వారినే ప్రార్థించవలెను. ఆరాటే ఈశ్వరుని అవతారము, భరించువాడు, అభయమునిచ్చువాడు - అట్లే ద్రవ్యశుద్ధిని కోరి వేమ నిమ్న యాచించుచుంటివి- దేయముగా నాకు ముందు నివాసమున కల్పించుమని ప్రార్థించుచుంటిని.

అనగా అపుడు రాజిట్లనెను- 'విప్రుడా! నీవు నారదుడివే అయినచో ఈ రాజ్యమంతా నీదే. నేమ బ్రాహ్మణులకు, నీకు నిశ్చయముగా దాస్యము చేయగలవాడను' అవగా విని నారదుడనేను. “నీవు మా భక్తుడవైనచో మా మాటల ననుసరించవలెను. (మేము చెప్పునది చేయవలెను.) రాజా! నేను ఆడిగిన ద్రవ్యమునంతా ఇచ్చి ఏడుగవ్యూతుల (28 మైళ్ళ) భూమినిమ్ము. దానికి రక్షణను నీవే కల్పించుము, అనెను. అతవల్లే అనగా నేను మిగిలిన ప్రయోజనమును గూర్చి చింతించసాగితిని.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున నారదార్జునపంవాదమునందు దానభేదముల ప్రశస్తిని వర్ణించుట అను నాల్గవ అధ్యాయము.