స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
1వ అధ్యాయము
మునులు ఉగ్రశ్రవుని ఇట్లడిగిరి. 'దక్షిణ సముద్ర తీరముననున్న ఐదు తీర్థములేవో చెప్పి వానిని వర్ణించుము. నారదాదులు ఆతీర్థములకు అన్ని తీర్థముల ఫలములనిచ్చు శక్తివున్నదందురు. కనుక వాని చరితమును, మాహాత్మ్యమును వినగోరుచున్నాము. అని అడగగా ఉగ్రశ్రవుడిట్లు చెప్పెను. పూర్వము ఆనంద బాష్పములతో పులకితశరీరముతో వ్యాసుడు నాకు చెప్పిన అత్యద్భుతమగు కుమారనాథుని ప్రభావమగు పుణ్యసత్కథను వినుడు. మునిశ్రేష్ఠులారా! దేవతలందరిచే, మునులచే, పితరులచే పూజింపబడిన కుమారగాథను వినుడు. ఏ మానవుడు మధ్వాచారస్తంభతీర్థమును సేవించునో అతను నా వలెనే బ్రహ్మలోకమున నియతముగా నివసించును. బ్రహ్మలోకముకంటె విష్ణులోకము, దానిపై శివలోకము, దానికంటే పుత్రుని పట్ల వాత్సల్యముచే కుమారలోకము గొప్పనైనది. పూర్వము ఆర్జునునికి నారదుడు తెలిపిన అత్యాశ్చర్యమగు కథను మీకు విస్తరముగా చెప్పెదను.
పూర్వము ఒక కారణముచే అర్జునుడు మణికూటమునుండి దక్షిణ సముద్రము వద్దకు అయిదు తీర్థములందు స్నానమాడుటకు వెళ్ళాను. తాపసులు భయముతో ఎల్లప్పుడూ ఏ తీర్థములను విడిచి పెట్టెదరో ఆ తీర్థములను ఆర్జునుడు చూచెను. ఆవి- కుమారేశుని తీర్థము, సౌభద్రమునికిష్టమైన స్తంభేశ తీర్థము, పౌలోమీకిష్టమైన బర్కరేశ్వరతీర్థము, కరంధమరాజూకిష్టమైన మహాకాల తీర్థము, భరద్వాజునికిష్టమైన సిద్దేశతీర్థము అనునవి. అర్జునుడు మహాపుణ్యకరములగు ఈ తీర్థములు తపస్వులు విడిచి పెట్టుట చూచెను. ప్రక్కనే వున్న నారదాది మహామునుల నిట్లడిగేను. 'తీర్థములు అందముగా మరియు అద్భుతముగా నున్నవి. బ్రహ్మవాదులు ఎల్లప్పుడూ వీనినేందుకు విడిచెదరు? అని అడుగగా వారనిరి. 'పాండవా! వీనియందు ఐదు మొసళ్ళు ఉన్నవి. అవి తపోధనుల ప్రాణములు తీయుచున్నవి గాన వారు తీర్థములను విడిచిరి.' అనగా ఆర్జునుడు తీర్థములవైపు వెళ్ళుచుండగా తాపసులు అతనిని ఆపదలిచి ఇట్లనిరి. 'అర్జునా! నీవు వెళ్ళకూడదు. ఎందరో రాజులు, మునులు ఆ మొసళ్ళ నోట బడినారు. వీవు పన్నెండు సంవత్సరాలు అనేక తీర్థములలో స్నానమాడితివి. ఈ తీర్థములతో పని ఏమి? మిడుతవలె ఆత్మార్పణము చేసుకొనకుము.
అనగా అర్జుమడిట్లనెను. 'కరుణాసముద్రులైన మీరు పలికిన దానిలో సారమేమిటో చెప్పండి- మహాత్ములు ధర్మముమ కోరు మమజుని వివారించరాదు. అల్పబుద్ధి గలవాడెవడైవా ధర్మమున కోరువానిని విచారించినచో అతని నాశ్రయించు జగత్తు విశ్వాసములలో భస్మమగుమ. మెరుపువలె క్షణములో నశించు జీవితము ధర్మము కొరకు పోవువన్న పోనిమ్ము దోషమేమున్నది? ఎవరు జీవితము, ధనము, భార్య, పుత్రులు, భూమి, గృహము అన్నీ ధర్మము కొరకు కోల్పోవుదురో వారే భువిలో మానవులు అనగా తాపసులనిరి. 'ఇట్లు పలుకుచున్న నీ ఆయువు వర్ధిల్లుగాకl,పార్థా! ఎల్లప్పుడు నీకు ధర్మమున ఆభిరుచి నిలుచుగాకు వెళ్ళు! నీవు కోరినదే చేయుము! అనగా అర్జునుడు వారికి నమస్కరించి, వారి ఆశీస్సులను గ్రహించి ఆ ఐదు తీర్థములమ చూచుటకు వెళ్ళమ. వెంటనే సౌభద్రతీర్థమున చేరిన ఆర్జునుడు నీటిలో దిగి స్నానము చేయసాగిమ. అపుడు నీటిలోనున్న ఒక పెద్ద మొసలి ఆ కుంతీపుత్రుడగు ఆర్జునుని నీటిలో పట్టుకొనెను. అపుడు అమిత బలవంతుడగు అర్జునుడు కదలుతున్న ఆ మొసలితో సహా బలముగా పైకి లేచెను.
అపుడు ఆర్జునుడు సైకి లేపగా ఆ మొసలి పర్వాభరణభూషితయగు ఒక అందమైన స్త్రీగా మారిపోయినది. విప్రులారా! ఆమె శిఖ జ్వలించిచున్నది. అట్టి మనోహర స్త్రీ ఆమె. ఆగొప్ప అద్భుతమును చూచి ధనంజయుడు పరమప్రీతితో ఆ స్త్రీనిట్లడిగెను-'కల్యాణీ! నీవెవరవు? ఎట్లే జలచరమైతివి? ఎందుకీ గొప్ప పాపము నాచరించితివి?' అనగా ఆమె ఇట్లు చెప్పిన. కౌంతేయా! వేనొక అప్సరసను. దేవారణ్యమున నివసించుదానను.కుబేరునికి ఇష్టురాలైన వర్చ అన దావను. వా ఇతర మిత్రులు నలుగురు. వారంతా స్వేచ్చగా చరించువారు. కల్యాణులు. ఒకనాడు దేవరాజగు ఇంద్రుని మందిరమునకు వారితో కలిపి వెళ్ళితిని. అక్కడ నివాసమంటూ లేని ఒక బ్రాహ్మణుని చూచితిమి. ఆతను ఆందముగా నుండి, ఒంటరిగా అధ్యయనము చేయుచుండెను. అతని తేజస్సుతో ఆ వనమంతా నిండివట్లుండెను. సూర్యుని వలె ఆ ప్రదేశమునంతా ప్రకాశింపజేసెను. ఆతని ఆ అద్భుత తపస్సును చూచి దానికి ఆటంకము కల్పించవలెనని అక్కడ దిగితిని. నేను, సౌరభేయి, సామేయి, బుద్బుద, లత ఆమవారలము ఒక్కమారుగా అతని వద్దకు వెళ్ళి గానముచేయుచూ, వయ్యారములొలికిస్తూ ద్విజుని లోభపెట్టితిమి.
కానీ ఆ వీరుడు మా యందు మనసునుంచలేదు. నిర్మలమైన తపస్సునందున్న ఆతను చలించలేదు. తరువాత కోపించిన ఆ బ్రాహ్మణుడు మమ్ము చూచి మీరు మొసళ్ళై నీటిలో వంద సంవత్సరములుండెదరు. అని శపించగా బాధనొంది మేమంతా ఆ స్వచ్చమైన తపస్విని శరణు జొచ్చితిమి. అపరాధము నాచరించితిమి. క్షమించుము. ఇదే మాకు వధ. ఇది చాలు. ఆత్మనిగ్రహముగల నిన్ను లోభపెట్టుటకు మేము వచ్చితిమి ఇదే మాకు శిక్ష ధర్మమును గూర్చి ఆలోచించువారు స్త్రీలు వధింపబడరాదని ధర్మమును గూర్చి ఆలోచించువారు అందురు - కనుక! ధర్మమును తెలిసిన బ్రాహ్మణుడా! ఇది విజ్ఞుల ధర్మవాదమని తెలియుము. శరణుజొచ్చినవారిని శిష్టులు పాలించెదరు. మేము నిన్ను శరణుగోరితిమి. నీవు సముడవు గాన క్షమించవలెను. అని కోరగా ధర్మాత్ముడగు ఆ విప్రుడు శుభమును చేయగోరి, సూర్యచంద్రులతో సమానమగు కాంతి గలవాడై ప్రసన్నుడాయెను. అతడిట్లనెను. 'మీ చరితముచే నేను మనసులో సంతాపము నొందితిని. ఏమి చెడునడత! ఏమి మోహము! పాపము కొరకు ప్రవర్తించుటే కదా! తలపై నున్న మృత్యువును చూచినట్లవుతే జనులకు ఆహారము కూడా రుచించదు. ఇక పాపమునెట్లు చేసెదరు? అన్ని జన్మలలోనూ పొంద శక్యముగాని మనుష్య జన్మను కొందరు, స్త్రీలపట్ల మోహముతో తృణములో చూచెదరు.
వారిని నేనడుగుచున్నాను. మీ జన్మ ఎందులకు? లాభమేమిటో ఆలోచించి మనసుతో, తెలియజేయుడు. ఎవరిమండి జన్మ కలిగివో వారిని నిందించము. కానీ వారియందు అదుపులేకుండా ప్రవర్తించు మగవారివే మేము నిందించుచుంటిమి. బ్రహ్మ విశ్వవృద్ధికై జంటమ సృష్టించినందున, దానివల్లే పరిపాలించవలెమ. దోషమేదీ లేదు. అగ్గి బ్రాహ్మణుల సమక్షమున బంధువులచే నివ్వబడిన స్త్రీతో రసమును పాలించుట ధన్యము. ఆది అన్నింటినీ ప్రసాదించునది. ఎటైతే ప్రకృతి పురుష సంయోగము ప్రయత్నముచే సాధింపబడినచో గుణమును కలిగించునో పాధింపబడనిచో దోషమును కలిగించును. ఇట్లు ప్రయత్న పూర్వకముగా సాధింపబడు ఉత్తమ గృహస్థ జీవితము గొప్ప గుణమున కలిగించుమ. పాధింపబడనిచో దోషమునే కలిగించును కూడా. పూర్వము పంచముఖము, పదుకొండు మంది భటులతో కూడి ప్రీతో, అధికసంతానము గల వాడచేతనుడెట్లగును? పంచయజ్ఞము మొదలైన కర్మలతో స్త్రీతో కలియుట యన్నది విశ్వమునకుపరించుటక్సైజింపబడినది. ఆహా మూడులు దానినేట్లు ఇతరరీతిలో సాధించెదరు కదా! అహో! విమడు. లేనిచో మీకు అశుభమును వినుటకు కోరిక కలుగును. అయినమా, చేతులెత్తి ఆరిచివమా విమవాడెవడు? ఆరు ధాతువుల సారము అగు ఆ వీర్యమును తగిన మావమున వదలి, చెడుయోనియందు వుంచువాడి నుద్దేశించి యముడిట్లనెను.
వాడు మొదట ఓషధులకు ద్రోహముచేయువాడు. తరువాత ఆత్మద్రోహమును తరువాత పితృదేవతలకు, తరువాత విశ్వమునకే ద్రోహము చేయువాడు- అట్టివాడు అనేక సంవత్సరాలు ఆంధలోకముల జేరును మానవుని, పితృదేవతలు, దేవతలు, మునులు, మానవులు, ప్రాణులు ఆశ్రయించియుండినందున, నియమముతో మండవలెను. పొక్కుచే, మనస్సుచే, వాలుక, చేతులచే, చెవులచే నిగ్రహమును పాలించువాడిని సతీర్థము (మంచి తీర్థము) అందరు. అట్లు కానివాడు చెడుతీర్థమే అట్టి కాకివంటి నరుని యందు కొందరు తామసజనులు 'హంస ఇతనని ఆనందింతురు - దానిచే నేమి లాభము? ఆలోచించుడు. ఇట్టి విశ్వనిర్మాణమును మనసులో స్మరించువాడు ముల్లోకముల కొరకైనా పాపమునందెట్లానందించును? ఇది ఇతర వరులకు శాస్త్రముచే చూడదగినది. ఆహా స్త్రీలవేమందుము? యమలోకమును స్వయముగా చూచియూ మోహమునెట్లు పొందెదను? మీయందు మాత్రము కోపమేమి? ఎవరు ఎవరికై నిర్మించబడితిరో వారు వారి ప్రయోజనమునే నిర్వహించెదరు. ఇది నిజము. నిర్దోషము. మారు, వెయ్యి, విశ్వము, సర్వమనునది అక్షయమును చెప్పును. పరిమాణము - నూరే - ఇది అక్షయమను సూచించదు. మీరు మొసళ్ళే నీటిలో పురుషులను పట్టునపుడు మిమ్ము పైకి లేపువాడు వచ్చిన మీ రూపమును పొందెదరు. నేను నవ్వుటకైనమా అసత్యమునాడలేదు - అట్టి కల్యాణకారి, చక్కనిదగు వాక్కుచే మీకు శుద్ధి కలుగును.
అనగా అపుడు ఆ అప్సరసలు ఆ విప్రునికి నమస్కరించి, ప్రదక్షిణము చేసి దుఃఖముతో ఆ ప్రదేశమునుండి వైదొలిగిరి. 'తక్కువకాలములో ఎక్కడ మనమా నరుని కలిసెదము? ఎప్పుడు మనరూపమును పొందెదము? అని ఒక క్షణము ఆలోచించితిమి అర్జునా! అపుడు మేము అక్కడ దేవర్షియగు నారదుని చూచితిమి ఆ తేజస్వియగు నారదుని చూచి సంతోషించిన మేము అతనికి నమస్కరించి, బాధపడుచున్న వారమై నిలిచితిమి. అపుడు దేవర్షి దుఃఖమునకు కారణమేమని అడుగగా మేమతనికి తెలిపితిమి. అది విని అతను యథార్థముగా నిట్లు పలికెను. 'దక్షిణ సముద్రతీరమున ఐదు తీర్థములు వన్నవి అవి పుణ్యమునిచ్చునవి. అందమైనవి. త్వరగా అక్కడకు వెళ్ళుడు. మీరక్కడుండగా పాండవుడగు అర్జునుడు మిమ్ము ఈ దుఃఖమునుండి విముక్తులను జేయును. సందేహములేదు. అనగా విని ఇక్కడకు వచ్చితిమి. వీరుడా! నీవీ పలుకును సత్యముగ చేయవలెను. నీవంటి సాధువుల జన్మ దీనులకుపకరించుటకే కదా! ఆ స్త్రీయట్లు పలుకగా విని, క్రమముగా ఇతర తీర్థములలో స్నానమాడెను. అక్కడున్న మొసళ్ళు పట్టుకొనగా, ఆర్జునుడు పూర్వమువలెనే వానిని పైకెత్తెను.
అంతట ఆ స్త్రీలు వీరుడగు అర్జునునికి నమస్కరించి, జయము కలుగవలెనని ఆశీర్వదించుచూ, వెళ్ళగోరగా అర్జునుడిట్లనెను. 'నాకు మనసులో గట్టి సందేహమొకటున్నది. నారదముని మీరిక్కడ నివసించుటకు అనుమతినెల్లిచ్చెను? అతిహీనుడైనా ప్రతి ఒక్కడూ తనకు పూజ్యమగు దాని ప్రయోజనమునే సాధించగోరును. మరి నారదుడు తనకు పూజ్యమగు ఈ తీర్థముల యందు మీ నివాసమునెట్లనుమతించెను? అట్లే, అతిబలవంతములగు (అమితబలమైన) నవదుర్గలు, సిద్ధగణపతి ఇక్కడనుండగా మొసళ్ళవలె మీరిక్కడెట్లుండిరి? మునులు, ఋషులందరూ ఒక్కొక్కడూ దేవతలనైనా నివారించుటకు తగినవాడు. తీర్థములకు ఆటంకము కలిగించు మిమ్ములనెట్లు వారించలేదు? ఇది ఆలోచించుచుండగా నా మనస్సు ఊగిసలాడుచున్నది. నాకు గొప్ప కుతూహలమున్నది. సత్యమైన బదులివ్వండి, అనగా అప్పరసలు ఇట్లనిరి. 'అర్జునా! సరిగానే అడుగుచుంటివి. కానీ ఉత్తరదిక్కున చూడుము. ఇతర విప్రులతో గూడి పూజనీయుడగు నారదుడిటే వచ్చుచున్నాడు. నీవడిగిన దానినంతా చెప్పగలవాడతను.' అని పలికి నింగికెగసిరి.
ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున ఆర్జునుడు అయిదుగురు అప్సరసలను ఉద్దరించుట యను మొదటి అధ్యాయము.
