స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
2వ అధ్యాయము
సూతుడు చెప్పసాగెను- 'అంతట ఆర్జునుడు, బ్రాహ్మణులతో కూడివున్న దేవర్షి, దేవపూజితుడగు నారదుని సమీపించి వారందరికీ నమస్కరించెను. అపుడు నారదుడిట్లనెను- 'ధర్మమునందు నీకు బుద్ధిగలదు - బ్రాహ్మణులందునూ, దేవతల యందునూ మతి గలదు. వీరుడా! ఈ పన్నెండు సంవత్సరాల మహాయాత్రలో నీవు భేదమును గానీ, కోపమును గానీ పొందలేదా? అర్జునా! తీర్థయాత్రల యందు మునులైననూ విఘ్నములవలన, భేదమునొందెదరు, కోపించెదరు. నీవీ దోషమును పొందితివా యేమి? ఈ విషయమున ఆంగీరసుడు చెప్పిన గాథను వింటిమి. ఎవని చేతులు, కాళ్ళు, మనస్సు నిగ్రహమున నుండునో, క్రియలలో వికారముండదో అతను తీర్థముల ఫలమును పొందును. ఇది నీ మనసున నుండవలెను. నాయనా! నీవేమనుకొందువు? నీకు సోదరుడు ధర్మరాజు, మిత్రుడు శ్రీకృష్ణుడు ఇది ఉచితమే. విప్రులు పాలకులకు శిక్షణ గరి పెదరుకదా! మేము విష్ణువు స్థాపించిన ధర్మగురువులము. ద్విజుల పట్ల విష్ణువు పలికిన గాథనొక దానిని ఇట్లు వినుచున్నాము.
ఎవరి నిర్మలము, విత్యమునగు కీర్తివి వినుట చండాలునితో సహా జగత్తునంతా వెంటనే పవిత్రము చేయునో అతనే విష్ణువు - అట్టి వేమ మీచే విశ్వబడిన తీర్థకీర్తిని గలవాడమ - వాకు ప్రతికూలమాచరించునటైన నా బాహువును కూడా ఛేదించెదను. అర్జునా! నీవు మా కుశలమును కోరేదవు అట్టి మీకు ప్రియమగు దానిని చెప్పెదము. యాదవులు, పాండవులు కుశలమే. ఇపుడు ధృతరాష్ట్రుని శాసనముచే కురుమలకు తాపమును కలుగజేయు వీరవర్ముడను రోజున భీమసేనుడు వధించేమ. పూర్వము బలవంతుడగు బలి ఎట్లు జియింపవీలుగానివాడుగా నుండెనో, ఆరాజు ఆట్లుండేమ. ధృతరాష్ట్రుడు ముల్లుమ ముల్లులో తీసినట్లు, ఆతనివి జయించేను. ఆని నారదుడనగా విని ఆర్జునుడు మిగుల సంతసించి వారికి కుశలమెట్లుండదు. నిత్యము బ్రాహ్మణులకిష్టులై వారిని పూజించువారు- వేనేమో, వియమముగా తీర్థములయందు పర్యటించుచూ ఇక్కడకు వచ్చితివి. వాకు అమిత ఆనందముగా మన్నది. తీర్థములమ చూచుట ధవ్యము. దానికంటే స్నానమాడుట ఇంకమాధవ్యము. మాహాత్మ్యశ్రవణము అంతకంటేమా అధికమవి ఔర్వుడమ ముని బలికేను. కమక ఈ తీర్థముయొక్క గుణముల వినగోరుచుంటిని. నీవు ముల్లోకముల యందు తిరుగుతూ అన్నింటి సారమును తెలియుదువు గాన నీవు అంగీకరించినట్లే మాహాత్మ్యమును వినిపించుము. నీవు గొనివచ్చినది అన్ని తీర్థములకంటెన అధికమనుకొందును.
అని అర్జుమడనగా నారదుడిట్లు చెప్పెను. 'అర్జునా! నీవు గుణవంతుడవు గాన గుణములను గూర్చి ప్రశ్నించుట యుక్తమే. ధర్మము వలన కలుగు గుణములను గుణవంతులు వినుటయే యుక్తము కదా! సాధువులకు ప్రతి దినమూ ధర్మమును విమట, స్మరించుట చేతనే కాలము గడిచిపోవును. పాపులు చెడు మాట్లాడుటచే ఎట్లు ప్రతిదినమూ గడి పెదరో సాధువులు ధర్మముచే నట్లుగడి పెదరు. ఈ తీర్థముయొక్క పెక్కు గుణములను నేను కీర్తించెదము. విని, విశేషముగా తెలిసికొనెదవమట యుక్తమని నేనంగీకరించెదము. పూర్వము నేను కపిలుననుసరించుచూ ముల్లోకములలో పర్యటించుచూ బ్రహ్మ లోకమును చేరి అక్కడ పితామహుని చూచితివి. అతను రాజర్షి, దేవర్షి మూర్త, అమూర్త శక్తులతో కూడియుండెమ. నక్షత్రములతో చంద్రునివలె, విమలుడగు బ్రహ్మ వారితో విశేషముగా ప్రకాశించుచుండగా వేనతనికి నమస్కరించితివి. చూపుతోనే స్వాగతమున బ్రహ్మ వాకు పలుకగా సంతోషముతో కపిలునితో కలిపి కూర్చుంటివి. ఇంతలో అక్కడకు వార్తికులు వచ్చిరి. ప్రతిదినము జగత్తుమ చూచివచ్చుటకు బ్రహ్మ వారిని పంపుమ- వారు వచ్చి నమస్కరించి కూర్చొనగా బ్రహ్మ అమృతము వంటి తవ చూపుతో ముంచెత్తుతూ ఇట్లనెమ. మీరిక్కడెక్కడ చరించి, ఏమేమి చూపితిరి? ఏంటిది? దేవిని వినుటచే పుణ్యము కలుగునో అట్టి అద్భుతముమ గూర్చి తెలియజేయుడు.' అని బ్రహ్మయనగా ఆ వార్తికులలో సుడగు పుత్రుడమ వాడు బ్రహ్మను నమస్కరించి ఇట్లనెమ.
ప్రభువు ఎదుట విన్నవించుటయన్న సూర్యునికి దీపము పెట్టువంటిదే. అయిననూ, ఇతరులకి పంపబడిన వేమ విన్నవించవలసినదే. కాత్యాయమడమ ముని అనేక ధర్మములను వినియుండెమ. వావి పారమున తెలియగోరి ఏకాంగుషుడై (ఒంటి వేలిపై నిలిచి) నూరు సంవత్సరములుండగా దివ్యమగు వాక్కు అతనితో నిట్లు పలికెను. 'కాత్యాయనా! విమము. పుణ్యమగు పార్వతీనదీతీరమున సారస్వతముని యమవావినడుగుము. ధర్మము తెలిసిన అతడు ధర్మముచే సాధించు దానినంతా నీకు తప్పక తెలియజేయును’. అనగా వివి కాత్యాయమడు పార్వతమునిని చేరేమ. నమస్కరించి తన మనసులో మన్న దావిట్లు చెప్పిమ. 'ధర్మజ్ఞుడా! కొందరు సత్యమును, కొందరు తపస్సుమ, కొందరు శాచమును, మరికొందరు పాంఖ్యమున, ఇతరులు యోగమును ప్రశంసించుదురు. కొందరు ఓర్పును, కొందరు ఋజుతమ, కొందరు మౌనమున ప్రశంసించెదరు. కొందరు యథార్థజ్ఞానమును పొగడగా, మరికొందరు వైరాగ్యముత్తమమని పొగిడెదరు. కొందరు ఆగిపోమము మొదలగు కర్మలను పరమన, ఆత్మజ్ఞానమే పరమని కొందరందురు. ఇట్లు లోకము వుండగా జనులు విధి, నిషేధముల విధానమున ఏది మేలని వ్యామోహమునొందుచుండిరి. ఏవన్నింటిలో మహాత్ములు దేవిని పాటించవలెమ? అన్ని ప్రయోజనముల పాధించు దానివి తెలియజేయుము.
సారస్వతుడిట్లు చెప్పెను. నాకు సరస్వతి చెప్పిన దాని సారమును చెప్పెద వినుము. ఈ జగత్తంతా నీడవలె ఉత్పత్తి, నాశనములే ధర్మముగా గలది. వేశ్యాస్త్రీల నేత్ర భంగమువలె (కనువిరుపుల) క్షణభంగురమైనది. ధనము, ఆయువు, యౌవనం, భోగములు నీటియందు చంద్రునివలె ఆస్థిరమైనవని బుద్దితో చక్కగా విచారించి స్థాణుదానమునాశ్రయించవలెను. దానము చేయువాడు పాపమునొందడనీ, స్థాణుభక్తుడు జన్మను మృత్యువునూ పొందడనీ శ్రుతి. సావర్ణి మునుపు చెప్పిన రెండు కథలను వినుము. వృషుడనగా భగవాన్ ధర్ముడు. వృషభమతని వాహనము పూజింపబడు ఆ మహాదేవుడు ధర్మము. దుఃఖమను సుడిగుండముతో, తమస్సుతో భీకరమై, ధర్మాధర్మములే జలముగా, క్రోధమే బురదగా, మదమే మొసలిగా, లోభమే బుడగలుగా, అభిమానమే పాతాళముగా, జలచరములతో నున్న సంసారమున మునిగిన వానిని తరింపజేయువాడు హరుడొకడే. దానము, వృత్తము, వ్రతము, వాక్కుచే, ఆయుస్సుచే కీర్తి, ధర్మములు పరోపకారము ఇవి సారములేని శరీరమునుండి పారము తెచ్చునవి. ధర్మమునందాసక్తి, వేదార్థచింతన, దానముచేయు వ్యసనము, ఇంద్రియముల విషయముల యందు వైరాగ్యము వీనిచే జన్మ సఫలమగును. ఈ భారతదేశమున ఆధృవమగు మనుష్యజన్మను పొంది ఆత్మశ్రేయస్సుకై పాటుపడనివానిచే ఆత్మయే వంచింపబడినట్లు అగును. దేవాసురులందరిలో మనుష్యజన్మ దుర్లభము. అది పొంది, నరకము పొందని విధమున ఆచరించవలెను, అన్నింటికీ మూలము అన్నింటినీ సాధించునది మనుష్యజన్మ.
లాభముకై నీవు యత్నించకున్నటైన మూలమునైనా యత్నముతో రక్షించుము. గొప్ప పుణ్యమూల్యముతో ఈ దేహమను నౌకను నీవు కొంటివి. అది పగిలిపోకముందే దుఃఖసముద్రముయొక్క తీరమును చేరుటకు యత్నించుము. పొందవీలుగానీ ఈ అవికారి శరీరమును పొంది సంసారమునుండి తొలగనివాడు ఆత్మద్రోహి, నరాధముడు. ఈ పరలోకముకొరకే ఆదరములో యతులు తపమాచరింతురు, యాజ్ఞికులు యజ్ఞముల చేయుదురు, దానులు దానములనిత్తురు.' అనగా కాత్యాయనుడిట్లనెను. 'సారస్వతా! భగవాన్! దానము, తపస్సు వీనిలో ఏది ఆచరించుటకు కష్టము? మరణించిన వెనుక గొప్ప ఫలమిచ్చునది ఏది? తెలియజేయుము.” అని అడుగగా సారస్వతుడిట్లు చెప్పెను- 'భూమిపై దానముకంటే దుష్కరమేదీ లేదు. ఓ మునీ! లోకమే సాక్షిగా ప్రత్యక్షముగా కనిపించుచున్నది. ఇది ప్రియమైన ప్రాణములను వదిలి, ధనముకొరకు భయంకరమైన సముద్రమును, అడవిని, వనమున లోభములో ప్రవేశించెదరు. అట్లే శునకవృత్తి యనబడు సేవను కొందరాశ్రయింతురు. మరికొందరు హింస అధికముగా ఉండి, క్లేశములనేకముగా నున్న కృషిని ఆశ్రయింతురు. అట్లు అనేక దుఃఖములను సహించి పొందిన, ప్రాణముల కంటే అధికమైన ధనమును, అనేక ఆయాసములతో పొందివదావివి వదిలివేయుట చేయలేనిది. దేనిని దానమిచ్చునో, తాననుభవించునో అదే ధనవంతుని ధవము. ఇతరులు, మరణించినవారి భార్యలతో, ధనముతో క్రీడింతురు.
ప్రతిదినమూ నన్ను యాచించువానిని నేను గురువుగా తలచెదను. అతను ప్రతి దినమూ అద్దమును తుడిచినట్లు మలినమును తుడిచివేయును. దానమివ్వబడినది ఎన్నడూ తరగదు పైగా మరల వృద్ధినొందును. వీరు తోడిన బావి వీరు శుద్ధముగా, అధికముగానే వుండును కదా! ఒక జన్మయందు సుఖము కొరకు అనేక జన్మలను వ్యర్థము జేయరాదు. ప్రాజ్ఞుడు వేయి జన్మలతో పొందినదానినొక జన్మయందే కూర్చుకొనును.దరిద్రుడనవుదునేమోనని మూర్ఖుడు దానమివ్వడు. అదే శంకచే విజ్ఞుడు దానమిచ్చును. చపలమగు ధనమును గల జీవులు దానితో ఏమి చేయుదురు? ఏ శరీరము కొరకు ధనాన్ని కోరెదరో ఆ శరీరమే అశాశ్వతము కదా! పూర్వము 'లేదు, లేదు' అని రెండక్షరాలనభ్యసించినందుచే (దానమివ్వనందునే) ఇప్పుడు విపరీతముగా 'ఇవ్వు, ఇవ్వు' అనుచూ బోధించెదరు. దానిచే, 'దానమివ్వక నీవునూ ఇట్లే కారాదన్న బోధను తెలియవలెను. దాతకు ఉపకారము చేయుటకు 'ఇవ్వు' అని యాచకుడనను. దానిచే దాత ఫైలోకమునకు వెళ్ళగా యాచకుడు క్రిందనే నుండును. దుఃఖమునకు నెలవైన దరిద్రులు, వ్యాధితులు, మూర్ఖులు, సేవకులు ఎల్లప్పుడూ దానమివ్వనందుచే అట్లు దుఃఖమునకు నెలవైరి. దానమివ్వని ధనికుని, తపస్సాచరించని దరిద్రుని మెడలో పెద్దబండమ కట్టి నీటిలో పడవేయవలెను.
నూటికొక శూరుడు, వేయిమందిలో నొక పండితుడు, వందవేలలోనొక వక్త జన్మించును. అసలు దాత పుట్టునా లేదా? ఈ పృథివినీ ధరించువారు ఏడుగురు. వారు- గోవులు, విప్రులు, వేదములు, పతివ్రతలు, సత్యవాదులు, లోభములేనివారు, దానశీలురు. ఔశీనరుడైన శిబి తన అవయవములను ప్రియమైన స్వంత పుత్రుని బ్రాహ్మణుని కొరకు త్యాగంచేసి ఇక్కడనుండి స్వర్గమునకము కాశీరాజగు ప్రవర్థనుడు బ్రాహ్మణునికి తన రెండు కళ్ళను దానమిచ్చి పాటిలేని కీర్తిని ఇహపరలోకముల యందనుభవించుచున్నాడు. విదేహరాజగు ఏమీ రాస్రమును, పరశురాముడు భూమిని, గయుడు పట్టణాలలో పురముమ బ్రాహ్మణులకు దానమిచ్చిరి. వర్షము కురీయునపుడు వసిష్టుడు ప్రజాపతి ప్రజలను సృజించినట్లు, అన్ని ప్రాణులకు వివాపమునేర్పరిచి ప్రాణదానము చేసెమ. బుద్ధిమంతుడు పాంచాలరాజగు బ్రహ్మదత్తుడు అమితవిధిని బ్రాహ్మణులకు దానమిచ్చి స్వర్గమును పొందేమ. రాజర్షియగు పహస్రజిత్ తనకిష్టమగు ప్రాణములనే బ్రాహ్మణులకై విడిచి ఉత్తమలోకములను సౌందేమ. ఇట్లే ఇతరులనేకులు భక్తితో స్థాణుదానము చేయుటచే ప్రశాంతచిత్తులు, జితేంద్రియులై రుద్రలోకమున నిత్యమూ వున్నారు. భూమి వున్నంతకాలమూ వారి కీర్తి స్థిరముగా మండుననీ తలచి పారముకోరినవాడు, స్థాణుదానమును చేయుము.
అపుడు కాత్యాయనుడు కూడా మోహమును విడచిన వాడాయెను. నారదుడు చెప్పసాగెను. ఇట్లు సుశ్రవసుడు చెప్పిన కథను విని పద్మభవుడు ఆనంద బాష్పములతో మరల మరల మిగుల ప్రశంసించెను.'వత్సా! నీవు బాగుగా చెప్పితివి. ఇది నిజము తప్ప వేరే కాదు. సారస్వతుడన్నది సత్యము. అట్లే శ్రుతి సత్యమే. దానమే యజ్ఞముల కవచము. అన్ని ప్రాణులూ లోకమున దాతనే ఆశ్రయించును. దానముచే శత్రువులను తొలగించి వేయును. ద్వేషించు వారుకూడా దానముచేత మిత్రులగుదురు. అని శ్రుతి ధర్మాధర్మములు అను అలలుగల ఈ ఘోర సంసార సాగరమున నౌకవలె నిర్మించబడిన దానమును సేవించవలెను. ఇది బాగుగా ఆలోచించి నేను పుష్కరమున బ్రాహ్మణులను స్థాపించితిని. అట్లే గంగాయమునల మధ్య మధ్యదేశమున లక్ష్మీనారాయణులు బ్రాహ్మణుల స్థాపించిరి. రుద్రుడు నాగరులను, పార్వతి శక్తిపూర్బవులను, లక్ష్మి శ్రీమాలయందు బ్రాహ్మణోత్తములమ నిలిపిరి. ఇట్లు వీరు అనేక అగ్రహారములను లోకమునుద్దరించు కోరికతో పొందిరి. దేవోత్తములారా! మాకు దానఫలమునందు కాంక్షలేదు. సాధువుల సంరక్షించుట కొరకు మాకు దానమిచ్చుటయని చెప్పబడినది.
తగు స్థానములవిచ్చివ, బ్రాహ్మణులు వివిధ దర్మములునుపదేశించుట చేత మూడు వర్ణములను ఉద్దరింతురు కమక వారు పూజ్యతములు. దానము నాలుగు విధములు. అవి- దావము, ఉత్సర్గము, కల్పితము, పంతము అవి. క్రమముగా నది యిట్లు చెప్పబడినది. బావులమ, మాతులను, చెరువులను, మఠములను, నీటి చెలమలమ, ఇళ్ళమ, భూములమ బ్రాహ్మణులకు దానమిచ్చుట ఉత్సర్గమనబడును. ఏవి వాయించి పుణ్యము వాచరించువాడు, ద్విజుడు విడుచు దాని షష్టమాంశమున (ఆరవవంతున) పొందును. వీటన్నింటిలో విప్రులకు వెలవు కల్పించుట, దేవతలకు నెలవు కల్పించుట అమనవి ఉత్తమమైనవి. ధర్మమునకు మూలమిది.ఎంతకాలము దేవతా వికాసము, బ్రాహ్మణ వివాసము వుండునో అంతకాలము, దానమిచ్చిన వావి పూర్వికులమ పుణ్యముయొక్క అంశ చేరుమ. ఇది స్వలమైనదే నైనమా అమితమైన ఫలమునిచ్చువది. జీర్ణమగుదావివి ఉద్ధరించినచో దీనికి రెండింతల ఫలమని చెప్పబడినది. కమక, దేవతలారా! నేమ కూడా చెప్పుచుంటినిసారస్వతుడు పలికినది పత్యము. దావముతో పాటవచ్చునది లేదు.
నారదుడు చెప్పెను. 'ఇట్లు పారస్వతుడు, పద్మభవుడు చెప్పిన దానిని విని దేవతలు, నేమ విస్మయముతో 'బాగుబాగు'. అని ఆమోదించితిమి. అపుడు సభ ముగిసిన తరువాత అందమైన మేరు శిఖరముపై ఒక బండపై కూర్చుని నేనిట్లు ఆలోచించితిని. బ్రహ్మ సత్యమును పలికెను. వానిలో వొకటైనమా పాటించని వాడెందులకు జీవించుట? దానిచే కృతార్థత యేమి? కనుక నేను దానపుణ్యము చేయవలెనన్న ఎట్లు? కోపీనము, దండమే నాధనముగా గలవాడిని. కొద్దిగానైనా ధనము నా వద్ద లేదు. అనర్హుడికి దానమిచ్చువాడు, ఆరుడికి దానమివ్వని వాడు మూడుడు. ఈ ఆర్ఘ అనర్ఘ పరిజ్ఞానము చేత దానధర్మము కష్టమైనది. సరైన ప్రదేశమున, సమయమును, వ్యక్తిని తెలిపి స్వచ్చమైన మనస్సులో న్యాయముగా సంపాదించిన ధనమును దానమిచ్చినవాడు దానిని యావనమున పొందును. తమోగుణముతో కూడి, భయముతో గాని, కోపముతో గానీ దానమిచ్చువాడు గర్భముననే ఆ దానఫలమువనభవించును. సంశయములేదు. దంభముచే నిచ్చిన, బాల్యముననే ఫలమునొందును. అన్యాయముగా ధనమునిచ్చినచో లేదా ధనముకై ఇచ్చినచో వార్థక్యమున తప్పక దానిననుభవించును. కనుక, దేశకాల పాత్రలను తెలిసికొని సరైన వ్యక్తికి విధిగా, తాను న్యాయముగా సంపాదించిన దానిని శ్రద్ధతో, లోభించక దానమివ్వవలెను.
ఇదంతా విర్ధనునికిట్లు కుదురును? కనుకనే స్వచ్చమగు పురాణమునులు పూర్వము సత్యముగా నిట్లనిరి. ఈ లోకము, పరలోకము రెండూ ధనము లేని వానికి లేనట్లే చెంత నిలిచిన దరిద్రుని అందరూ వెలివేయబడిన వానినిగా చూచెదరు. దరిద్రము లోకమున పాతకము. దానినెవరు చెప్పగలరు? క్రిందపడిన వానిని చూచి బాధపడినట్లు దరిద్రుని చూచి బాధపడెదరు. ఎవడికి అశ్వములు, ధనము, భృత్యులు, ఆతిథులు తక్కువో అతనే కృశించినవాడనబడును గానీ శరీరము కృశించినవాడు కాదు. చెడుకులములో పుట్టిననూ, డబ్బు కలవాడు లోకములో పూజించబడును. అదే, ధనము లేని వాడు చంద్రుని వంటి స్వచ్ఛమైన వంశములో పుట్టిననూ అవమానమును పొందును. జ్ఞానముచేత, తపస్సు చేత, పాండిత్యము చేత వృద్ధులైన వారందరూ ధనమధికముగా నున్న వాని ఇంటి గుమ్మము వద్ద సేవకులై నిలుచుందురు. ముల్లోకములలో ధనము మనకు వ్యతిరేకము కాకున్ననూ ఎవరు ప్రార్థించిన, వారికి ఫలము నిచ్చును. లేదా, నేమ పూర్వమంతా మరల ఆలోచించెదను. మంచి యోగ్యమగు స్థానమును చూచెదను.
అని నారదుడనేక విధములుగా ఆలోచించుకొని పలు దేశములను, నగరములను, ఆశ్రమములను పర్యటించి హితమైన స్థానమును చేరి అక్కడ విప్రుల స్థాపించెదననుకొనెను.
ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందు కౌమారికాఖండమున నారద, అర్జున సంభాషణమున దానము యొక్క ప్రశంసను వర్ణించుట యను రెండవ అధ్యాయము.
