స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

3వ అధ్యాయము

సూతుడిట్లు చెప్పెను- 'ఇట్లు భూమిపై మన్న పుణ్యమగు స్థానములన్నింటినీ బాగుగా చూచుచూ పర్యటించుచున్న వారదుడు భూమిపై తిరుగుచూ భృగుమహర్షి ఆశ్రమమునకు చేరితినని అర్జునునికి చెప్పెను. అక్కడ పప్తకల్పముల వరకు స్మరింపబడు స్థమగు రేవానదియుండెను. అది పవిత్రమైనది, అన్ని తీర్థముల కలది. కీర్తనముచేతనే పవిత్రముచేయు ఆ నదిని చూచిన విశేషముగా పవిత్రులగును. ఆర్జునా! ఆ నదిలో మునిగి స్నానమాడిన వాని పాపము వెంటనే నశించును. ఎటైతే పింగళయమ వాడి శరీరమధ్యలోనున్నదో, ఈ రేవావది బ్రహ్మాండపిండమునకు మధ్యలో మన్నదని చెప్పబడినది. అక్కడ రేవయందు పాపమును నశింపచేయు శుక్లతీర్థమనునది యున్నది. ఆక్కడ స్నానము చేసినంత మాత్రమున బ్రహ్మహత్యయైనమా నశించును. దానికి దగ్గర రేవానది ఉత్తర తటమున వనమున భృగుమహర్షి ఆశ్రమమున్నది. అక్కడ అనేకవృక్షములున్నవి, తీగలు, పొదలు మిగుల శోభను కలిగించుచున్నవి. అనేక ఫలపుష్పములతో, అరటిచెట్లతో అలరారుచున్నది. పెక్కు మృగములు తిరుగాడుచుండగా, పక్షులు కలకల ధ్వనిని చేయుచుండెను. మంచి వాసననిచ్చు పూలెన్నో యుండెను. నెమళ్ళు క్రేంకారావము చేయుచుండెమ.

 తుమ్మెదలు అన్నింటినీ వదలి అక్కడ, భక్తుడు సంసారమును వదలి శివుని పాదములలో చేరినట్లు పూలలో చేరినవి. సంసారము నుండి భయమునొందువారిని బ్రాహ్మణులు శివకథామృతమును చెప్పుటచే ఎట్లు ఆనందపరిచెదరో, అక్కడ చెట్లు తమ పళ్ళలో, పూలతో, నీడలో, కర్రతో లోకముమ హరుని వ్రతము చేయువారివలె ఆహ్లాద పరచుచుండెము పుత్రులనిస్టపడు పక్షులు కొన్ని పుత్ర, పుత్రయని ఆరచుచుండగా- శివప్రియులగు భక్తులు నిత్యమూ శివ, శివ యనునట్లుండినది. ఇట్లు భుగు మహర్షి ఆశ్రమముయొక్క పరిసరములుండెను. మూడు వేదములనధ్యయనము చేసిన విప్రులంతటా ఆ ప్రదేశమునలంకరించుచుండిరి. ఋగ్యజుఃసామవేదముల ఉచ్చారణ ధ్వనితో దిక్కులన్నీ నిండిపోయము. ధీరుడగు రుద్రుని భక్తుడు ముల్లోకముల నిండినట్లు ఆది యుండెను. ఆర్జునా! ఆ మునిశ్రేష్టుడున్న చోటికి నేను చేరితివి. భృగువు పరమధర్మాత్ముడు. తపసుచే మిగుల శోభించువాడు. దీనుడు, హృష్ణుడు ఆగు నా రాకను చూచి భృగు మొదలగు ఋషులందరూ లేచి నిలచిరి. సుస్వాగతమని పలికి భృగువుతో వారు నాకు ఆర్ఘ్యము మొదలగు వానినిచ్చి, ఆసనములపై కూర్చొనిరి. వారికి బదులిచ్చిన నన్ను విశ్రాంతిని తీసుకొనివవావిగా తెలిసి భృగు మహర్షి ఇట్లనెను.

మునిశ్రేష్ఠా! మీరిక్కడకు వెళ్ళవలెను? ఎక్కడినుండి వచ్చుచుంటిరి? ఇక్కడి రాకకు కారణమేమిటి? పృష్టముగా తెలియజేయుడు.! అవగా వేమ చింతతో గూడిన వాడనై భృగు మహర్షితో విట్లంటిని. 'దేనికై నేనిక్కడకు వచ్చితివో చెప్పెదము, వినడు. సముద్రము వరకున్న భూమినంతయూ వేను పర్యటించితివి. బ్రాహ్మణులకు భూమిని దానమివ్వవలెనని వెదుకుచూ తీర్థములతో గూడి దోషములులేవి, పవిత్రము, రమ్యమైన భూమిని గాంచలేకుంటివి అవగా భుగునిట్లనెమ. పూర్వము వేమ కూడా విధులను నిలుపుటకు భూమికై వెదుకుచూచుంటిని. సముద్రము వరకున్న భూమిని మొత్తము చూచితివి. అపుడు ‘మహి’ యన పుణ్యమగు వది, అన్ని తీర్థములు గలది కనపడేమ. దివ్యము, మనోరమమూనగు ఆ వది పాపములన్నింటినీ నశింపచేయునదై అక్కడ మండిమ. భూమిపై పున్న తీర్థములన్నీ చూచినవీ, చూడనివికూడా అక్కడే నివసించుమ. ఆ మహేయమ వది పుణ్యజలముల గలిగి సముద్రముతో కలియును- ఓ దేవర్షి! అదే మహీపాగర సంగమము అక్కడనే ముల్లోకములలో ప్రసిద్ధమైన స్తంభమను తీర్థమున్నది- అక్కడ స్నానమాడు విజ్ఞలగు వరులు పాపములన్నింటినీ పోగొట్టుకొని యముని చేరరు.

 పూర్వమొక పర్యాయము అక్కడ స్నానమాడుటకు వెళ్ళిన వేనొక అద్భుతమును చూచితివి. మునివర్యా! దానివి చెప్పెదమ. విమము. ఆ మహిసాగర సంగమము వద్ద పావము చేయుటకు వెళ్ళుచూ వేమ ఒడ్డున నిలిచిన ఒక అగ్నివంటి బ్రాహ్మణుని చూచితిని. అతడు పొడవుగా, బక్కగా ఎముకలగూడై మిగిలి. వృద్దుడైననూ తపోలక్ష్మిచే అలరారుచుండెను. అతను రెండుచేతులనెత్తి మాటిమాటికీ నేడ్చుచుండగా చూచి నేను కూడా దుఃఖంపదొడగితివి. దుఃఖము నొందినవావివి చూచి నూరురెట్లు అధికముగా దుఃఖమునొందుట సత్పురుషుల లక్షణము. వేమ విలాపము చేయుచుంటివి. మమష్యుడుగా జన్మించి అహింస, సత్యము, అస్తేయములనాచరించుట దుర్లభము. వేదా వృద్దుని సమీపించి అడిగితివి. 'మునీ! నీవెందులకిట్లు శోకించుచుంటివి? రహస్య మైననూ నాకు చెప్పుము. వేమ తెలియగోరుచుంటిని. అవగా ఆ ముని వాలో నిట్లనెమ. 'భృగుమహర్షీ! నేను అభాగ్యుడమ - కనుక ఏడ్చుచుంటిని. తవ దౌర్భాగ్యమున ఎవడు చెప్పగలుగును? అనగా విస్మయముతో నేవతవి మరల అడిగితివి- 'భారతదేశమున జన్మ దుర్లభము. అందునా మమష్యజన్మ మరింత దుర్లభము కదా! మమష్యులలో బ్రాహ్మణుడిగా, అందునా మునిగా, అందునా తపప్పు సిద్ధించుట దుర్లభము. నీవివన్నీ పొందితివి.

అయివమా నీవెందులకు ఏడ్చుచుంటివి? నాకు విస్మయము కలుగుచున్నది. అవి అడుగుచుండగా వింతలోనే సుభద్రుడమ ముని పేరులో, రూపములో సుభద్రుడుగా మండి అక్కడకు వచ్చామ. మేరు పర్వతమును వీడి ఆతమ ఈ తీర్థము యొక్క గొప్పదనమును తెలిసి ఆచమును దాల్చి స్తంభేశ్వరుని ఎల్లప్పుడూ పూజించుమ. ఆతమ కూడా నేనడిగినట్లు ఆ మునిని రోదవకారణమువడిగిమ. అపుడాచమనము చేసి ఆ ముని కారణమువిట్లు చెప్పను. వేమ వాక్కును, మనప్పును విగ్రహించుకొనిన దేవశర్మయమ మునిని. గంగాసాగర సంగమము వద్ద వివాపమునేర్పరుచుకొని దర్శమున (అమావాస్యనాడు) పితృదేవతలకెల్లప్పుడూ తర్పణమిడుచుంటిని. శ్రాద్దము చివర వారు ప్రత్యక్షమై వాకు ఆప్పుల పలికెడివారు. ఒకనాడు పితృదేవతలు తృప్తినొంది వాతో నిట్లనిరి. దేవశర్మమేము నీవద్ద కెల్లప్పుడూ వచ్చుచుంటిమి. కానీ నీవు మాష్టానమునకెప్పుడూ రావేమి? అనగా ఆ స్థానమున చూడగోరినన నివేదించలేకపోతిని. అపుడు పితృదేవతలతో వారి స్థానమునకు వెళ్ళితివి. వేమ తేబోమండలముచే వెలుగుచూ,  మిగుల పూజింపబడిన వారిని చూచి నా పితృదేవతలనడిగితివి. 'మిగుల అర్చింపబడి తృప్తితో, ఆనందముతో వచ్చుచున్న వీరెవరు? వీరివలె మీరు ఆనందముగా ఎందుకు లేరు?

అనగా పితృదేవతలిట్లు బదులిచ్చిరి- 'నాయనా! నీకు శుభమగుగాక సుభద్రమహాముని పితృదేవతలు పుణ్యాత్ములు మహీపాగర సంగమమున అతడు వారికి తర్పణములతో తృప్తిని కలిగించెను. ఇక్కడ అన్ని తీర్థములు గల మహనది సాగరమున కలియుము. అక్కడే సుభద్రుడు అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణమిడుమ,  అవి అవగా వివి మిగుల సిగ్గుపడి వేమ విస్మయములో వారికి నమస్కరించి నా స్థానమునకు వచ్చితిని. వాస్తవమువాలోచించి మహీపాగరసంగమమవి పేరు బడసిన చోటికి వెళ్ళేదవని విశ్చయించుకొని వేమ అక్కడే పితృదేవతలకు ఆయుమున తర్పణమిడెదనమకొంటివి. ప్రతి అమావాస్యనాడు స్తుతింపదగు పేరుగల సుభద్రుడెట్లు చేయునో నేనుమా అట్లే చేసెదవనుకొంటవి. ఎవడు జీవించియుండగా వాని పితృదేవతలు వేరొకని వంక ఆశతో చూచెదరో (వేరొక ఆశనొందెదరో) ఆట్టి కులమును వశింపజేయు పాపి జీవించివమా ఫలమేమి? అని తలచి సంతోషముతో నా భార్యయగు రుచితో నిట్లంటిని. రుచి! నీతో కలిసి మహీసాగరసంగమమునకు వెళ్ళి అక్కడే వుండగోరుచుంటిని. త్వరగా సమ్మురాలవు గమ్ము. నీవు పతివ్రతవు, స్వచ్చురాలవు, సద్వంశమున జన్మించినదానవు, కీర్తిగలదానవు. కనుక నా ఈ ఆలోచనను అనుసరించుము.

అనగా రుచి ఇట్లనెను- 'పాపీ! స్మశానంలోని స్తంభమా! నన్ను నీకంట గట్టిన దురాత్ముని జన్మ హతమెట్లు కాకున్నది? ఇక్కడ కందమూలఫల ఆహారముచేత కూడా నీవు చేయలేని దానిని ఏమి చేసెదవు? చాలు, దానిచే సరిపోదా! ఇపుడు ఉప్పునీరుండే ఆ చోటికి నన్ను తీసుకొని వెళ్ళదలుచుకుంటివి- నీవే అక్కడకు వెళ్ళు- నీ పూర్వికులు కూడా ఆనందపడనీ. వృద్దుడా! నీ ఇష్టం- వెళ్తే వెళ్ళు లేదా వుండు కాకిలాగా చిరకాలమూ వసించు' అనుచుండగా చెవులు మూసికొని  విపులుడను శిష్యునికి ఇంటినప్పగించి ఒక్కడినే ఇక్కడకు వచ్చితిని- అట్టి నేనిక్కడ స్నానమాడి శ్రద్ధతో పితృదేవతలకు సంతర్పణమిడి వరకమున పాపి పొందినట్లు గొప్ప చింతను పొందితిని. ఇక్కడే వున్నచో సగముదేహముగల వాడనగుదును- గృహిణిలేని వాడు పగము దేహము గలవాడని కదా స్మృతి! ఆత్మ లేక దేహమున కార్యమేమి సిద్దించును? అట్లే గృహిణి లేనివాడు కర్మలాచరించుటకు ప్రశస్తుడు కాడు. కానీ స్త్రీలయందు, దేహములయందు అనురాగము చూపువాడు పశువే. రెంటి ఫలమును గ్రహించవలెను- సారమేమాత్రమూ లేదు- సత్పురుషులు గృహిణిలేని మనుజుని తాకరాదనుకొందురుట.

 ఆస్పృత్యుడగు ఉత్తానపాదుని దేవతలు ఉత్తమునిగా చేసిన మహీసాగర సంగమమువద్దకు వెళ్ళదలిచివమా ఎట్లు వెళ్ళగలను నా పాదములతికష్టము మీద కదులును కదా! వీనియందు. నా మనసు దెబ్బతిని అజ్ఞానసంకటమున భేదము నొందుచున్నది. కనుక నేను మిగుల మోహమునొంది, శోకమునొంది అమితముగా నేడ్చుచుంటిని. అవగా ఆ రోమాంచపూరితమగు మాటను వీవిరి. సుభద్రుడనగు నేను అపుడు 'బాగు బాగు' అని పలికితివి. మహీపాగర సంగమునకు దండమువలె నేలపై బడి నమస్కరించి ఆ ముని స్థితికై ప్రతిక్రియను మనసులో నాలోచించుచుంటిని. నీటి బుడగవలె క్షణికమగు జీవనమునొంది ఇతరులకై లేదా పరముకై పాటుపడువాడు మనిషి ఇతరులు తుచ్చులే. అని ఆలోచించి సుభద్రుడు మునిశ్రేష్ఠునితో నిట్లనెను. మునివర్యా! భేదమునొందకుము, స్థిరముగా నుండుము. సూర్యుడు చీకటిని నాశనమొనర్చునట్లు నేను నీ శోకమును నశింపజేసెదను. మనము ఆశ్రమమునకు వెళ్ళెదము- ఇప్పటికింకా కోల్పోయినదేదీ లేదు కారణమును వినుము. నీకొరకై నేను పితృదేవతలకు తర్పణమిడెదను.

అనగా దేవశర్మ విని ఇట్లనెను- 'ఇట్లు పలుకుచున్న నీవు నూరేళ్ళు జీవించు నాయనా! చేయరాని గొప్ప పనిని నీవు నాకై చేయగోరుచుంటివి. కానీ ఈ సంతోష స్థానమున నన్ను విషాదము కూడా బాధించుచున్నది. చెప్పెద. వినుము- మునివర్యా! శుభమైన వాక్యమైననూ సత్పురుషులు వ్యర్థముగా గ్రహించరు. ఇక ఈ గొప్ప కార్యమును వ్యర్థముగా నేనెట్లు చేయించేదను? చెప్పుము. నాకు నిష్కృతియగునట్లు నీకు వేరే ఉపాయమును చెప్పెదను. నా ప్రాణములపై ఒట్టు పెట్టుకొనుచుంటిని. నేను చెప్పునట్లు చేయుము. నేను నీ పితృదేవతలనుద్దేశించి మహీసాగర సంగమమున తర్పణమిచ్చెదను. నీవు గంగాసాగర సంగమమున నా పితృదేవతలనుద్దేశించి తర్పణమిడుము నేనుమా నీకు నో తపస్సుచే సంపాదించిన జన్మచే నాలుగవ భాగమునిచ్చెదను ఇట్లే చేయుము. అనగా సుభద్రుడిట్లనెను- 'ఇట్లు నీకు సంతోషమగుచో అట్లే చేయుము. మునీశ్వరా! విజ్ఞుడగువాడు సాధువులానందించునట్లు చేయవలెను. అనేనని భృగువు చెప్పసాగెను. తరువాత దేవశర్మ సంతోషముతో తన పుణ్యముయొక్క నాలుగవ భాగమును మూడుమారులు పలికి దానమిచ్చి తన ఇంటికి వెళ్ళాను. సుభద్రుడక్కడే వుండెను. నారదా! ఇట్టిది ఈ మహీసాగర సంగమము. స్మరించునపుడు నాకు ఇప్పటికీ రోమములు గగుర్పొడుచును. అనగా నారదుడిట్లనెను- 'అర్జునా! అది విని నేను ఆనందముతో గద్గదమైన గొంతుతో స్పృహలో నుండీ లేనట్లు 'బాగు, బాగని' యంటిని. మనమందరమూ అందమైన మహీతీరమునకు వెళ్ళెదము. అక్కడ మనమిద్దరమూ ఆ ఉత్తమమగు స్థానమును చూచెదము.

మమ దైవం వచఃశ్రుత్వా భృగుః సహ మయా యయౌ

సమస్తం తు మహాపుణ్యం మహీకూలం నిరీక్షితుమ్

 తద్దృష్ట్యా చాతిహృష్టోహమాసం రోమాంచకంచుకః

 అబ్రవం మునిశార్దూలం హర్షగద్గదయా గిరా

 త్వత్ప్రపాదాత్కరిష్యామి భృగో స్థానమమత్తమమ్

 స్వస్థానం గమ్యతాం బ్రహ్మన్నతః కృత్యం విచింతయే

 ఏవం భృగుం చాస్మి విసర్జయిత్వా

 కల్లోలకోలాహలకౌతుకీ తటే

 అథోపవిశ్వేదమచింతయం తదా

 కిం కృత్యమాత్మానమిపైకయోగీ

ఇతి శ్రీ స్కాందమహాపురాణే ప్రథమే మాహేశ్వరఖండే కౌమారికాఖండే నారదార్జునసంవాదే మహీసాగరసంగమతీర్థమాహాత్మ్యే తృతీయోధ్యాయః

నా మాటను వివి భృగువు వాతో కలిసి ఆ మహాపుణ్యమగు మహావది తీరమును చూచుటకు బయలుదేరేను. అది చూచి నేమ మిక్కిలి ఆనందమున పొంది, గగుర్పాటుతో, గర్గదస్వరముతో మునిశ్రేషునితో విట్లంటివి. “భృగుమహర్షి! నీ అనుగ్రహముచే నేమ ఈ అత్యుత్తమ స్థానమును వా స్థానముగా చేసుకొనెదమ. బ్రహ్మన్ ఏవిక వెళ్ళుము. వేమ వీధివి గూర్చి ఆలోచించెదను” అవి భృగుమహర్షికి వీడ్కోలు పలికి ఆ కల్లోలముతో, కోలాహలముగా మన్న నదీతీరమున కూర్చొని ఏమి చేయవలవని ఆలోచించసాగితివి.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందలి కౌమారికాఖండమున నారద-అర్జున సంభాషణలో మహీసాగరసంగమమను తీర్థమాహాత్మ్యమును మూడవ అధ్యాయము.