స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
19వ అధ్యాయము
నారదుడు చెప్పసాగెను - కాలనేమి కోపముతో కూడుకుని యుండి, రూపమును గమనించక, నీమీని ఇంద్రుడనుకొని వేగముగా జట్టుపట్టుకొని లాగి నాదము చేసెను. అంత నిమ్ మహాబలుడగు కాలనేమితో నిట్లనెను. 'కాలనేమీ! నేను నిమిని, దేవతయనుకొని నన్ను చంపవద్దు - యుద్ధమున మోహమునొందిన వీచే దేవతలనుకొని మనవారు వధింపబడినారు. జయింపలేని మన దానవులు దేవతల చేత పదికోట్లమంది వధింపబడినారు. అది తెలుసుకో! త్వరగా అన్నిఅస్త్రములను నివారించు బ్రహ్మాస్త్రమును విడువుము. అని నిమి తెలియజెప్పగా కాలనేమి త్వరగా బ్రహ్మాస్త్రమును విడువగా అది ఆకాశమున అద్భుతముగా ప్రజ్వలించెను. దేవతల సైన్యము కూడా పూర్తిగా భయముతో కలవరపడినది. బ్రహ్మాస్త్రము వలన శంబరాస్త్రము శమించినది - దానితో కోపించిన సూర్యుడు మహేంద్రజాలమును పొంది తన శరీరమును భీషణముగా చేసెను - ఆ శరీరముచేత ముల్లోకములు విస్ఫులింగములచేత నిండిపోయెను.
కారిపోవుచున్న మూలుగ మొదలగు వానితో, రక్తముతో దానవసేన తపించెను - సూర్యుడు దానవవీరుల నేత్రములను చీకటి కమ్మునట్లు చేసెను. ఏనుగుల మేదస్సు కారిపోగా, రథములు నేలపై బడినవి - గుర్రములు, రథికులు ఎండచే బాధింపబడి ఆయాసపడసాగిరి. దప్పికగొని వారు ఇటు అటు నీటిని ప్రార్ధిస్తూ పర్వత చెలమలను, పర్వత పాదములను, గిరి గుహలను వెదకసాగిరి. అపుడు తీవ్రమైన దావాగ్ని చెట్లను దహింపవేసి జ్వలించెను. వీటిని కోరుచున్న వారు, ఎదుట నీరు కల్లోలమగుట చూచి ఎదుటనున్న దానిని సమీపించుటకు కూడా సమర్థులు కారైరి. భూమిపై నీటిని పొందక వెంటనే వారు మృతులై భూమిపై అక్కడక్కడ కనిపించిరి. రథములు, ఏనుగులు, గుర్రములు శ్రమతో కూడుకొని నేలకూలెను. నిలిచియున్నవి కక్కుకొనుచు, పరుగెడుచూ, వసామున్నగువానిని వెదజల్లుచూ వుండెను. దానవులు కోట్లకొలదిగా మృతులై కనబడిరి - ఇట్లు దానవుల నాశనము అధికమైయుండగా కాలనేమి క్రోధమునొందెను.
కోపమెక్కువగుటచే కళ్ళు ఎర్రబడగా కాలనేమి ఒళ్లు గగుర్పొడచగా కాలమేఘమువలె నుండెను. గంభీరమగు ధ్వనిచే జగత్తుల హృదయమును కంపింపజేయు ఆ కాలనేమి ఆకాశమును కమ్ముకొని సూర్యకాంతివి వశింపజేసెను. దానవవీరుల సైన్యము వైపు చల్లనివీటిని కురిపింపజేసెను - అపుడు దైత్యులా వర్షపు నీటిని వెంటనే పొంది ఊరడిల్లిరి. వాడినవిత్తనములు, మొలకలు నీటిని పొంది ఊరడిల్లినట్లు వారు భూమిపైల వర్షమును పొంది ఊరడిల్లగా మహాసురుడగు కాలనేమి మేఘరూపములో దేవసైన్యముపై శస్త్రముల వర్షమును కోపముగా కురిపింపజేసెను. ఆ వృష్టిచేత మరియు ఇతర దైత్యులచేత పీడింపబడుచున్న దేవతలు, చలిచే బాధనొందిన గోవులు వేరొక దిక్కును గాంచనట్లు వేరేగతిని గాంచరైరి. గుర్రముల వెనుక, ఏనుగుల వెనుక, రథముల వెనుక వారు దాచుకొనగా కాలవేమి వారిని వధింపసాగెను. అపుడు శరీరము శస్త్రములచే ఛేదింపబడగా వారు నేల పైబడి కనిపించిరి. తలలు తెగి, తొడలు, మోకాళ్ళు విరిగి బాణములు ఇతర ఆయుధములచేత వారు రథాంగములలో (చక్రములలో) పహా నేలకూలిరి. వేలకొలదిగా ఏనుగులు, గుర్రములు వధింపబడగా వాని రక్తముతో భూమినిండి, దాట శక్యముగాని దానిగా నుండెను. ఇట్లు మహాసురుడు వీరుడగు కాలనేమి క్షణములో వేలకొలదిగా గంధర్వులమ వధించెను.
కాలనేమి భయమెరుగక యక్షులను, కిన్నరులను, పిశాచముఖ్యులను లక్షలకొలదిగా వధించెను. దేవ జాతికి చెందిన వారి సంఖ్య తెలియకుండిన - మదించిన ఆ దైత్యుడు కోపించి కోట్లకొలదిగా వధించెను. ఇట్లు దేవతలకు గొప్ప నాశవము వాటిల్లగా ఆ భీకరయుద్ధమున చిత్రమగు అస్త్రములను, కవచములను ధరించిన వారు, వీరులగు -ఆల్వినీ దేవతలు క్రోధము నొందిరి. వారు విశితమగు అరవై బాణముల చేత ఒక్కొక్క దైత్యుని చంపసాగిరి. ఆ బాణములు మహాదైత్యుడగు కాలనేమిని బాణములతో కొట్టగా ఆ బాణములు వానిని తాకుచూ పుంఖములతో సహా భూమిని చేరెను. వారి బాణముల దెబ్బలచే ఆ దైత్యుడు కొంత చైతన్యమును పొంది నూనెచే కడగబడి, ఈనెలు కనబడుచున్న చక్రమును గ్రహించెను. ఆచక్రములో అతను ఆమల రథముయొక్క కాడికట్టుమ ఛేదించెను - వెంటనే దైత్యుడు ధనుస్సును చేతబట్టి పాము విషమువంటి బాణములను అశ్వినుల తలపై ఆకాశమునుకమ్ముచూ కురిపంపజేసెను. ఆశ్వినులుకూడా స్మరించిన ఆస్త్రములలో దైత్యుల బాణములను దింపసాగిరి. అది చూచి కోపించిన దైత్యుడు కోపముతో కాలదండమువలె భీకరమగు ముద్గరమను ఆయుధమును గ్రహించెను. దానిని పైకెత్తి తిప్పి అతను ఆశ్విమల రథముఫై విసిరెను -ఆకాశమున తమవైపు వచ్చుచున్న ఆ ముద్గరమున చూచి అమలు వేగముగా రథమును విడిచి పక్కకు దుమికిరి - పర్వతమువలెనున్న ముద్గరము వారి రథమును పిండిచేసెను.
తరువాత బంగారు జాలములచే అలంకరింపబడిన ఆ ముద్గరము భూమిని చీల్చెను - దైత్యుని యుద్ధకర్మను చూచి చిత్రమగు యుద్ధమున చేయు ఆల్వినులు వజ్రాస్త్రమున కల్పించి దానవేంద్రునితో తలబడిరి. ఘోరమగు వజ్రాస్త్రముచే దావవుడు గాయపడెను. సైన్యమంతా చూచుచుండగా అతని రథము, ధ్వజము, ధనువు, ఛత్రము, కవచము, క్షణములో నూరు ముక్కలాయెను. అశ్వినులు ఆట్లు ఎవరూ చేయలేని యుద్ధమును చేయుట చూచి వీరుడగు ఆ కాలనేమి వారిపైకి నారాయణాస్త్రమును విడిచెను. అంత వజ్రాసము శమించగా కాలవేమి కోపముతో ఆ అశ్వినీ దేవతలను బ్రతికియుండగా బంధించవలెనని ప్రయత్నించెను. శరీరము వణకుచుండ వారు ఇంద్రుడున్నచోటికి పరుగెత్తిరి. పెద్దగా ధ్వనిచేయుచూ కాలనేమి వారిననుసరించుచూ ఇంద్రుని బలమును పొందెను. ఇంద్రుని చేరిన కాలనేమి యుగాంతమున మృత్యువువలె నుండెను - ఆతనిని చూచి ప్రాణులన్నీ విహ్వలత నొందినవి. అపుడు దేవతలు హాహాకారమును చేయుచూ, అన్ని లోకములకు క్షయమును కలిగించునట్లు మహేంద్రుడు పరాజయమొందునని తలచిరి. ముఖ్యమగు పర్వతములు చలించినవి, ఆకాశమునుండి ఉల్కలు వేలరాలినవి , దిక్కులంతటా మేఘములు గర్జించినవి. గొప్పద్వని కలిగినది.
అట్లు ప్రాణులు వికారమునొందుటను జూచి భయముతో దేవతలందరూ జగత్పతియగు వాసుదేవుని మనసులోనే శరణుజొచ్చిరి. ‘శ్రేష్ఠమైన సర్వవ్యాపియగు ఆ గోవిందునికి, గోబ్రాహ్మణహితకరువికి, జగత్తుకు పాతమొనరించువావికి నమస్కారములు ఆ గోవిందుడు మనలను రక్షించుగాక’ యని దేవతలు భయపీడితులై వెళ్ళిరి - దేవతల ఆలోచనను తెలుసుకొని శ్రీమహావిష్ణువు మేల్కొని, శయనమును, యోగనిద్రను విడిచెను. లక్ష్మీదేవి కమలములవంటి చేతులతో లాలింపబడిన పాదపద్మములు గల విష్ణువు, శరత్కాలమున ఆకొముననున్న నల్లకలువ వంటిదేహకాంతిగలవాడు,కొస్తుభమణిచే మెరియుచున్న హృదయము గలవాడు, ప్రకాశించు కేయూరములచే ప్రకాశింపజేయువాడు సురుల సంక్షోభము తెలుసుకొని గరుడుని పిలిచెను. పిలువగనే వచ్చిన గరుడుడు దుఃఖితుడై విలుచుండుట చూచి శ్రీమహావిష్ణువు అనేక ఆయుధముల కాంతిచే మెరియుచూ గరుడునిపై యుద్దమునకు వెళ్ళిను. అక్కడ భయపడి పారిపోయిన దేవేంద్రుని చూచెను. నీలిమేఘకాంతి గల క్రూరులైవదానవవీరులచే, దేవేంద్రుడు ధనము గోరుచున్న అభాగ్యులు మరియు క్రూరులగు వారిచేతరమబడిన పురుషునివలె తరమబడుటన విష్ణువు చూచెను. అపుడు దేవతలు మరల మరల కీర్తించుచుండగా విష్ణువు అతనిని రక్షించుటకు వెళ్ళమ. స్వచ్చమగు పుణ్యమున అభాగ్యములనుండి రక్షించునట్లు దేవేంద్రుని రక్షింపదలిచెను. అపుడు దైత్యేంద్రునికి ఆకాశమున వందపూర్యులు వెలుగుచున్నట్లుగా వున్న ఒక కాంతిమండలము కనిపించెను.
దానవులు అపుడాతేజస్సు ఎక్కడనుండి వచ్చుచున్నదో తెలియగోరి చూడగా యుగాంతమున అగ్నివలె భీకరముగా నున్న గరుడుడు కనిపించెను. గరుడుని చతుర్బాహువగు హరిమితకాంతీ ప్రకాశించుట చూచి అసురవీరులు సంతోషించిరి. శత్రువుల వధించు ఈ హరియే అందరికి శరణమగు దేవుడు. ఇతడు ఓడినచో దేవతలందరూ నిప్పంశయముగా ఓడుదురు. ఇతనిని ఆశ్రయించే లోకపాలురగు సురులు యజ్ఞమున భాగముననుభవించుచుండిరి ఆనుకొని కాలనేమి మున్నగు మహారథులు అందరూ కలిసివచ్చి శ్రీ విష్ణువుమ చుట్టుముట్టి బాణములతో కొట్టసాగిరి. కాలనేమి అరవై బాణములను జనార్దమనిపైకి విడవగా, నిమి వందబాణములను, మధనుడు ఎనభై బాణములను విడిచిరి. జంభకులు డెబ్బై. శుంభుడు పది బాణములను వదిలిరి - మిగిలిన దైత్యవిరులు పదిపది బాణములలో గరుడునితో సహా విష్ణువును యుద్ధమున కొట్టసాగిరి. దానవనాశకుడగు విష్ణువు వారి కర్మను సహించను తరువాత చక్కగా వెళ్ళు ఆరు ఆరు బాణములతో ఒక్కొక్క దానవుని కొట్టెను - కోపముతో ఎరుపెక్కిన కళ్ళు గల కాలనేమి విష్ణువున ఎదపై, చెవీవరకు లావిడిచిన మూడు బాణములతో కొట్టెను. అపుడా బాణములు విష్ణువు ఎదపై మేలిమి బంగారమువలె శోభిల్లెను.
కౌస్తుభమణి యొక్క వెలుగుచున్న కిరణములవలె ఆ బాణముల కాంతి వెలుగుచుండెను. ఆ బాణములవలన కొద్దిగా ఆయాసపడిన హరి ముధ్గరమును గ్రహించెను. వేగముగా ముధరమును దానవునిపైకి ప్రయోగించెను - దానవేంద్రుడు అతని వద్దకా ఆయుధము రాకముమపై పదునైన బాణములలో దానిని గొట్టెను. హస్తకౌశలములో దానిని నవ్వులవంటి ముక్కలుగా చేదించెను - అంతట విష్ణువు మిగులకోపించి భయం కరముగా మన్న ప్రాప అను ఆయుధమును చేతబట్టెను. దానిలో వేగముగా దైత్యుని హృదయమునై కొట్టగా దైత్యుడు క్షణకాలము పొమ్మసిల్లి మరల చైతన్యమును పొంది పదునైనది, బంగారు గంటలలో నివసించునదియగు ‘శక్తి’ అన ఆయుధమును గ్రహించెను. దానితో విసునూరి ఎడమర్తి ఎడమభుజమును కొట్టగా దానినుండి రక్తముకారుచూ ఆ భుజము వల్లని మేఘముతో వెరుపుతీగ ప్రకాశించునట్లు ప్రకాశించెను. అపుడు విష్ణువు మిగుల కోపించి విశాలమగు ధనస్సును తీసుకొని రహస్యప్రదేశములను దెబ్బతీయగల ములుకులుగల బాణములను పదిహేడింటిని వదిలెను. తొమ్మిది బాణములతో దైత్యుని ఎదను, నాలుగింటిలో సారథిని, ఒకదానితో ధ్వజమును కొట్టెను. రెంటిలో ధమస్సుమ, ఒకదానితో నారివి, ధనస్సును కొట్టాను. తన దోషములతో మూరుడైన నరుడు కొట్టబడినట్లు కొట్టబడిన ఆ దానవుడు ఎదపై తగిలిన దెబ్బలో రక్తము కారుచుండగా, బాధలో మనసు వణకుచుండగా పొడుగుగా విలుచుండి గాలికి వణకుచున్న మోదుగు చెట్టువలె వణకసాగెను.
అంతట విష్ణువు వణకుచున్న దైత్యుని గమనించి గదను తీసుకొని కాలనేమిని వధించుటకై వేగముగా విసిరెను. ఆ గొప్ప గద ఒక్కమారుగా కాలనేమి తలపై పడి వాడి తల ముగ్గుకాగా, కిరీటము చూర్ణము కాగా, అన్ని రంధ్రములనుండి రక్తము కారుచుండగా వాడు ధాతువులు స్రవించు పర్వతమువలె నుండెను. స్పృహకోల్పోయి ఆ దైత్యుడు జీవితమింకా మిగిలియుండుటచే రథముపై పడెను. రథముపై పడివున్న కాలనేమి వద్దకు వచ్చి చక్రాయుధుడగు శ్రీహరి నవ్వి ఇట్లనెను. ‘అసురుడా! ఇప్పటికి వదలుచున్నాను. హాయిగా బ్రతుకుము, త్వరలోనే విన్నంతమొందించగలను’. దేవదేవుడగు విష్ణువట్లు పలుకగా విని భయపడిన కాలనేమి రథసారధి ఆ రథమును దూరముగా తీసుకొని పోయెను.
ఇది శ్రీ స్కాందపురాణమున మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున దేవాసురసంగ్రామమందు కాలనేమి యుద్ధము చేయగా శ్రీవిష్ణువు అతనితో యుద్ధము చేయుట యను పందొమ్మిదవ అధ్యాయము.
