స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

 13వ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను - 'ఆ మునీంద్రుడట్లు పలుకగా వివి ఇంద్రద్యుమ్నుడు ఇట్లనెను - 'నిన్ను విడిచి నేనెప్పుడూ వెళ్ళిపోను           నరులకు అన్ని లాభములనిచ్చే లింగమునే ఆరాధించెదను. నీవే నన్ను అనుగ్రహించితివి - నేడు వీరంతా వచ్చినట్లే వెళ్ళిపోనిమ్ము' అనెను. ఆ మాటలను విని కొంగ, గద్ద, తాబేలు, గుడ్లగూబ లోమశమునితో అదే చెప్పిరి అందరికీ మిత్రుడైన ఆ ముని అట్లేనని ప్రణతులై వినీతులైన వారిని శిష్యులవలె అనుగ్రహించెను. శివదీక్షా విధానముతో శివలింగ పూజను ఆదేశించెను. ప్రణతుల పట్ల వాత్సల్యమును చూపు ముని వారిననుగ్రహించెను - మంచివారికి మంచివారితో కలయిక తీర్థముకంటే మిన్న సదోస్టియను సూర్యోదయము ఫలములను పండించునది, వెంటనే పాపములన్నింటినీ తొలగించునది. అపూర్వమైనది.  సద్గోష్ఠి యొక్కటే అంతర్గతతమస్పును తొలగించునది. ఇక పాదుగోస్థినుండి కలుగు సుఖమను అమృత రసతరంగములన్నీ శ్రేష్ఠమైనవి, అమృత రూపము గలవి, శర్కర, తేనెవంటి షడ్రసాలు గలవి - అంతట ఆ స్నేహితులందరూ శివుని శాసనముచే సాధుసంగతిని పొందిరి.

మార్కండేయుడు, ఇంద్రద్యుమ్నుడు మున్నగువారు క్రియాయోగము నారంభించిరి. అట్లు వారు తపము చేయుచుండగా నొకనాడు లోమశముని తీర్థయాత్రలను చేయుచూ వారిని చూడగోరి వచ్చెను. తీర్థయాత్రలలో భాగమే పురుషయాత్ర - ఇది ముఖ్యమైనది - రాజా! సజ్జనులతో ఆశ్రయింపబడి భూమిభాగమనబడును. అర్జునా! ఆతిథిక్రియలను గైకొని విశ్రాంతిని పొందిన నన్ను చేరి నాడీజంఘడు మున్నగువారు నమస్కరించి ఇట్లడిగిరి. దేవా! మేము నలుగురమూ మాకర్మచే శాపమునొంది భ్రష్టులమైతివి. కమక ముక్తిని సాధించుటకై మాకొక స్థానమును చూపించుము. ఈ భూమి నిష్పలము - ఓ మునీ! భారత భూమియే ఫలవంతమైనది.  అక్కడకూడా ఏదేని ఒక ప్రదేశమును, అన్ని తీర్థముల ఫలములవిచ్చుదానిని తెలుపుము.' అని అడుగగా వేమ వారితో నిట్లంటిని. సంవర్తుని అడగండి. అతను మీకు యథార్థముగా అన్ని తీర్థముల ఫలమును కలిగించు భూప్రదేశముమ తెలుపగలడు. అనగా వారిట్లనిరి – ‘దేవా! ఈ సంవర్తుడను యోగి ఎక్కడమండుమ? మాకతని గూర్చి తెలియదు - సంవర్తుని దర్శనముచే ముక్తి కలుగువనుట మాయందు వీ అనుగ్రహమును చూపును. అతని గూర్చి తెలిపినచో మాకు చెప్పుము - మిత్రుల సంగమము (సహృదయులతో కలయిక) నిష్ఫలము కాదుకదా!’ అనగా నేను మరల మరల ఆలోచించి వారితో నిట్లంటిని.

ఈ సంవర్తుడను వాడు గుప్తమైన చిహ్నముల ధరించి వారాణసీ యందుండును. శరీరమునంతా మలము నలుముకొని, నగ్నముగా, భిక్షను తినుచూ దినమున ఎనిమిదవ భాగము తరువాత చేతిలోని భిక్షాపాత్రలో ఆహారమును గ్రహించును. ఏవిధముగానూ ఇతరములను గ్రహించడు. ప్రణవమను ఈశ్వరుని, పరమబ్రహ్మను భావించుచూ తాను భుజించిన వెనుక సాయంకాలమున బయటకు వనమునకు వెడలును. ఎచటికో జనులెఱుగరు - ఇతను యోగీశ్వరుడు - అట్లే అతని వంటి లింగధారులితరులు అక్కడ వున్నారు. ఆ మునిని మీరు తెలిపే చిహ్నములను చెప్పెదను - గ్రామ మధ్యమున రాజమార్గమున రాత్రి భూమిపై శవమును ఎవరికీ తెలియకుండా వుంచి, దానికి కొంత దూరములో నిలుచుండవలెను. ఎవరైతే ఆ భూమిని చేరి అకస్మాత్తుగా వెనుదిరుగునో అతడే సంవర్తుడు - ఇతడు శల్యమును దాటడు. సంశయము లేదు - అపుడు మీరు వినయముతో దరిచేరి మీకిష్టమైనది కోరండి. ఒకవేళ అతను తన గురించి మీకెట్లు తెలియునని అడిగినచో నేను తెలిపితినని చెప్పి వెంటనే అగ్నిని కూడా ప్రవేశించవని చెప్పండి. అనగా అది విని వారంతా నేను చెప్పినట్లు చేసిరి. వారాణసీని చేరి వారు సంవర్తుని చూచిరి. తరువాత శవమునుంచగా సంవర్తుడు ఆకలిగొన్న వాడైననూ వెనుదిరిగిపోయెను - అపుడు వారతనిని సంవర్తుడని తెలిసి వేగముగా వెళ్ళుచున్న అతనిని అనుసరించిరి.

రాజమార్గమున వెళ్ళుచున్న సంవర్తుని ‘దేవా! క్షణము నిలువుము’ అని వారు పలుకుచుండగా అతమ ఎమ దిరిగి పొండని బెదిరించుచుండెను. నాతో సహా పడుచుచున్న మీరు ఇక రాకూడదు - మీకది హితము కాదు అని ఆతమ పలాయనము చిత్తగించి దూరముగా మన్న సరప్పున చేరి, కోపముతో వారి నుద్దేశించి ‘నా గురించి మీకెవడు చెప్పను’. త్వరగా వాకు తెలుపుడు - వేవతని భస్మముగావించెదను - సత్యమును పలుకనిచో శాపాగ్నిలో మిమ్ములనైనా బూడిదగావించెదవనము. అనగా వారు భయముతో వణుకుచూ నారదుడు చెప్పినని తెలిపిరి - అపుడు సంవర్తుడు ఆ దుర్మార్గుడెక్కడికి వెళ్ళేప్పుడని అడిగిను. ఏ లోకమునకు వెళ్ళిననూ బ్రహ్మబంధువును నా శాపాగ్నిలో భస్మశేషము చేసెదను - అనగా వారంతా భయములో నిట్లనిరి. విపేంద్రా! నీ గూర్చి మాకు చెప్పి ఆతమ వెంటనే అగ్నిని ప్రవేశించెను - కారణము తెలియదు మాకు’ అనగా సంవర్తుడనెను - ‘నేను చేయదలిచినదానివే అతను తనకు తానే చేసికొనెను - ఇక మీ పనిఏమిటో చెప్పండి. మీకొరకు ఎక్కువసేపు ఇక్కడ విలవను.’ అనగా అర్జునుడు సందేహములో నారదునిట్లు అడిగెను. ‘దేవర్షీ! నీవు అగ్నిని ప్రవేశించినచో మరల ఎట్లు బ్రతికితివి? ఆశ్చర్యముగా నున్నది చెప్పుము. అనగా నారదుడిట్లు చెప్పెను. ‘అర్జునా అగ్ని కానీ, సముద్రుడు కానీ, వాయువు కానీ, చెట్లు, పర్వతములు గానీ, వేరొక ఆయుధముగానీ నా శరీరమున వశింపచేయుటకు సమర్థము గావు.

కానీ, సంవర్తుడు నమ్మునట్లుగా నేనగ్నియందు ప్రవేశించితిని ఈ వహ్నిని ప్రవేశించియూ నేను సన్మానితుడనైతిని. అర్జునా! పూలపొదయందొకడు ప్రవేశించిన రీతిలో నేను అగ్నివి ప్రవేశించితిని. ఆ తరువాత ఏమి జరిగెనో చెప్పెద వినము. సంవర్తుడు, మార్కండేయుడు మొదలైన వారితో నిట్లనెను - ‘బాటపై నుండి ఈ శల్యమును (శవమును) తీసివేయండి. ఆకలిగొనిన నేను ఈ పురములో భిక్షకై పర్యటించెదను. ఇక మీ ప్రశ్న కూడా అడగండి’. అనగా వారీట్లడిగిరి - ‘మహామునీ! శాపముచే భ్రష్టులమైన మేము నీ అనుగ్రహము చేత మోక్షము పొందెదము - ప్రణమించు మాకు శాపప్రతీకారమును తెలుపుము. ఏతీర్షమున మానవుడు అన్ని తీర్థముల ఫలమునొందునో చెప్పుము - మేమక్కడనే వుండెదము. అనగా సంవర్తుడిట్లు చెప్పెను - ‘నరోత్తములారా! కుమారస్వామికి, దుర్గ శక్తులగు నమస్కరించి మహీపాగర సంగమమమ తీర్థమును తెలిపెదను. ఈ బుద్ధిమంతుడు, రాజసింహుడగు ఇంద్రద్యుమ్నుడు యజ్ఞమును చేయుచూ ఈ భూమిని రెండంగుళముల ఎత్తు గలదిగా చేసినపుడు వేడెక్కిన భూమినండి కర్రమండి బయటకు వచ్చినట్లు వీటి ప్రవాహము అందరు దేవతలచే నమస్కరింపబడి వచ్చెను. ఆ నీటి ప్రవాహమే ఈ మహీ అనునది - భూమిపై నున్న తీర్థముల నీటినుండి పుట్టినది ఆ మహీనది యొక్క నీరు అని తెలియుచున్నది.  

ఈ మహీయను నది మాళవమ        ను దేశమున పుట్టి దక్షిణ పాగరమును చేరినది, దాని రెండుతటములూ పుణ్యమైనవి. ఆట్టి మంగళ స్వరూపమీ నది. అన్ని తీర్థములు కలిగినది. అట్టి నదీరాబమునకు, సముద్రముయొక్క సంగమమెంత పవిత్రమై యుండును? వారాణసి, కురుక్షేత్రము, గంగ, రేవ, సరస్వతి తాపి, పయోష్టి నిర్వింధ్య, చంద్రభాగ, ఇరావతి, కావేరి, పరయూ, గండకీ, నైమిషము గయ, గోదావరి, ఆరుణ, వరుణ అను పుణ్యనదులు మరియు వందలకొలదిగా భూమిపై నువు నదులు, ఇరువది వేల ఆరువందల వదుల పారమునుండి పుట్టినది ఈ మహీనదీ జలము అనబడును. భూమిపై నున్న తీర్థములన్నింటిలో స్నానము చేసిన ఏ ఫలమొచ్చునో ఆది మహీపాగరమున కలుగునని కుమారస్వామి చెప్పెను. అన్ని తీర్థముల సంయోగమును ఒక్కచోట కోరినచో మహీసాగర సంగమమను పుణ్యతీర్థమునకు వెళ్ళుడు. పూర్వము నేను కూడా అక్కడ అనేక సంవత్సరములు నివసించితిని. కాని వారదుని నుండి భయముతో ఆ చోటునుండి వచ్చేసితిని. మరుత్తుడు సమీపముననే వుండి, దుర్మార్గుడై నన్ను కలియ యత్నించును - అతనికీ భయమును గూర్చి చెప్పవలెను. ఇక్కడ ఈ దిక్కుల మధ్య మరుత్తుని నుండి భయపడిన వానివలె నేను ఎవరికీ బయల్పడక నివసించుచున్నాను.

ఇక్కడ కూడా నారదుడు నన్ను గూర్చి తెలియజేయుచున్నాడు - దుర్మార్గుని చేష్టలు ఇట్లా వుంటాయి. మీరు మాత్రము ఎవరికీ ఎక్కడా నా గూర్చి చెప్పరాదు - మరుత్తుడను రాజు వేరొక కారణముచేత దేవగురువగు వా సోదరుని చేత విడవబడి, ఇపుడు గురుపుత్రుడనగు నన్ను యజ్ఞమునకు ఋత్విక్కుగా నుంచుటకు ప్రయత్నించును. అజ్ఞానములోనివి, హింసాత్మకమైనవి, అచేతనములగు వేదోక్తయజ్ఞయాగాది కర్మలతో నాకేమి? సమిధలు, దర, పుష్పములు మున్నగు అచేతన పాధనములలో ఆ కర్మల నాచరించినచో కారణము వలె కార్యమూ అచేతనమేకావలెను. ఈ రాజుననుసరిస్తూ మీరు త్వరగా అక్కడికి వెళ్ళండి. అక్కడ స్వయముగా బ్రహ్మయగు యాజ్ఞవల్క్యుడను విప్రుడున్నాడు. పూర్వము అతను మిథిలానగరములో నుండగా, ఉత్తమమగు ఆశ్రమములోనికి వచ్చుచుండిన నకులుని చూచి గార్గిలో ఇట్లనేను. ‘గార్గీ! ఈ నకులము వచ్చుచున్నది - పాలు జాగ్రత్త. పాలుతాగడానికి వచ్చుచున్న ఈ నకులుని వెళ్ళగొట్టు అనగా పూర్వము కోపించి జమదగ్ని పూర్వికులచే శపింపబడిన ఆ నకులుడు మరల కోపించి ఆ మునితోనిట్లనెను.

‘ఆహా! ఈ పాపకర్ములగు మనుజుల సిగ్గులేనితనమెంత నీచమైనది! మరణించిన తరువాత నరకములో తీవ్రవేదన వుండగా ఈ నరాధములు పాపములనెట్లు చేయగలరు? ఎవరి జీవితములో ఒక నిముషము కూడా నిశ్చయముకాదో నిమిషమాత్రమే ఆయువు గల మానవుడు పాపము నెట్లు చేయగలడు? ఓ యీ మునీ! మంచి కులమున పుట్టినవాడను, బుద్దిమంతుడననుకుంటున్నావు. కనుకనే మూడుడవై నకులుడని నన్ను నిందించుచుంటివి. యాజ్ఞవల్క్య! నీవు చదివినదేమి? నీదేమి యోగీశ్వరత? నిరపరాధిని నిందించుచుంటివి? ఛీ, నీదేమి ఆధ్యయనము? నమ్న నకులుడని పరుషముగా అంటుంటివిగదా! ఇది ఏ వేదమున, ఏ స్మృతియందున్నది? చెప్పుము. నీకిది తెలియనిదా? ఇతరులను ఎన్ని పరుషమగు మాటలతో నిందించెదమో అన్ని ములుకులగును. ఆట్లు మాటాడినవాని కంఠముపై కాళ్ళు వుంచి యముని అనుచరులు ఆ దురాత్ముడు మిగుల రోదించుచుండగా వాని చెవుల యందు లోహపు ములకులనుంచెదరు. వదరుబోతులై, ధర్మధ్వజముగల మీవంటివారు స్వయముగా వెయ్యి చేతులతో ధర్మము విషయములో సామాన్యులను కొల్లగొట్టుచున్నారు. వజ్రము, విషలేపము గల శస్త్రము, కాలకూటముతోనూ, మృత్యువుతోనూ సమానమైనది పరుషమైన వాక్కుయని నాకుతోచినది.

చెవిలో, ముక్కులో పడిన శల్యములను శరీరమునుండి తీయవచ్చు కాని వాక్కు అవే ములుకుమ తీయుట కాదు. అది హృదయముననే నిద్రించును. ఏ మనిషినైనా పరుషవాక్యములతో చంపదలుచుటకంటె పీడను కలిగించు యంత్రములతో చుట్టుముట్టి చంపుట మేలు. యాజ్ఞవల్క్య! పండితుడనని నిత్యమూ భావించే వీపు నకులుడని నమ్ను తీవ్రమైన మాటలో గాయపరిచిలివెందులకు? అని పలికెను. సంవర్తకుడిట్లు చెప్పసాగెను -ఆ మాటలు విని యాజ్ఞవల్క్యుడు మిక్కిలి ఆదర్యముమ పొంది చేతులు జోడించి ఇట్లనెను. ‘పరమాణువంతైవమా వ్యక్తముగా తెలియవి నైభవము గల గొప్ప ధర్మమునకు నమస్కారము - ఇక ఇందు సత్పురుషులకు విద్యామదము కలుగుటెట్లు? బ్రహ్మవిష్ణుమొదలగువారు చంద్రుడు, ఇంద్రుడు మొదలగు వారు పర్వజులు. వారే మోహమునొందినపుడు మావంటివారిదేమి లెఖ! నేను ధర్మమును తెలిసినవాడినని మోహముతో అమకోమవాడు మూడుడై గాలిని పిడికిట బంధించ యత్నించుచున్నాడు. కొందరు అజ్ఞానముచే వాశవమునొందితే మరికొందరు జ్ఞానమదముతో వశించుచున్నారు - కొందరు జ్ఞానమును పొందికూడా ఆలస్యము వలన (జ్ఞానమునభ్యసించుటలో) ఆధములుగా వశించుచున్నారు. వేద, స్మృతి ఇతిహాస పురాణాదులలో వాలుగు పాదములతో సంపన్నమైన ధర్మమును ఆచరించని వాడు అధముడు, పశువు అతను యమపురిని చేరి తప్పక శోకించును - కనకనే, శ్రుతియందు గృహ్యకారుడిట్లు చెప్పెను.

నకులునైవనూ సకులుడనవలెనూ - ఎవరినీ మర్మముగా బాధించరాదు. చిలుకవలె ఇదంతా చదువుచూ ఆలస్యము చేతనో, అనాచారముచేతను నేను ఏమి చేయవలెను? కేవలము పఠించుటచేత సంతోషమును పొందువాడు, తననుతాను పండితుడనుకొనువాడూ పశువే. మాయావియై మాయలనాచరించు వానిని వేదములు పాపమునుండి రక్షించవు. రెక్కలు వచ్చిన పక్షులు వెలవును వీడినట్లు వేదములు అట్టివానిని చివరిదశలో విడిచివెళ్ళును. పాఠమాత్రముచేత ఏ బ్రాహ్మణుడు స్వర్గమును పొందుటకు ఉద్యుక్తుడగునో అతను తల్లి ఒడిలో నుండి చంద్రుని గ్రహించగోరు బాలుడే కనుక నీవు వినయములేని నన్ను ఎటైనా సహించవలెమ - అందరూ అట్లే అంటూ వున్నందున నేననూ అట్లే పలికితిని. అనగా వకులము ఇట్లనెమ ‘మిగిలిన వారిలో సమముగా చేసితివని నీవనుట వృథా. మహాత్ముల పట్ల ఈ విధముగా పలుకుట నీకు తగదని తలచుట లేదా! గుఱ్ఱము, ఏనుగు, లోహము, కర్ర, రాయి, వస్త్రము, స్త్రీ, పురుష నీరు వీనియందు గొప్పతేడా కలదు కదా! ఇతర ప్రాకృతమానవులు పెక్కు పాపముల నాచరించినంత మాత్రమున ముఖ్యమగు పురుషుడు కూడా వారి వెంటనే పాపముల నాచరించతగునా?  

అందరికొఱకై శాస్త్రము నిర్మించబడినది. అట్లే మనస్సు, బుద్దిని కూడా, విధాత అందరికీ నిర్మించును - అయిననూ పాపులే యైనచో విధాత దోషమేమి? వారే భాగ్యహిమలు కదా! విశేషముగా బ్రాహ్మణుడు లోకమునమపరించే వుండవలెనా? ఎందుకనగా, గొప్పవాడేమేమి ఆచరించువో ఇతరులూ దానివే ఆచరింతురు - శ్రేష్ఠుడు దేవిని ప్రమాణముగా గ్రహించినమా లోకము దానిని వెంటనడుచుము. కనుక మహాత్ములు ఎప్పుడైవమా తవకొరకు ఇతరులకొరకు సత్పురుషుల ధర్మమును విడువరాదు, అది వీవు నేర్చుకోమట తగినది. ముని! నీవు నమ్న హోరమైన మాటలచే పీడించివందువ విన్న వెంటనే శపించెదము. వీవుళాపమునకు తగినవాడవని నా అభిప్రాయము. వీపు వస్న ‘నకులుడవి పలికినందున కులాధముడగు వకులుడుపుగా వీవు మోహముచే జన్మించెదవు’. అనగా పంవర్తుడిట్లనియె. ‘ఆమాటలను విని యాజ్ఞవల్క్యుడు జరుగబోవు ప్రయోజనమును నిశ్చయించుకొని మరుదేశమున బ్రాహ్మణునీ పుత్రునిగా జన్మించెను. దురాచరుడు, పాపి, దయాహ్మడు, అతివాది, చెడుకులములో పుట్టిన విప్రువికి ఈ మువిపుత్రునిగా జన్మించిజాతిస్మరణము కలిగియుండెను. భర్తృయజుడమ ఆ ద్విజుడు జ్ఞానముచేత అంతయు గ్రహించి మహీపాగరసంగమమమ గుప్తమగు క్షేత్రమున చేరెను. అచట పాశులుడైన (పశుపతియగు) శివుని భక్తుడై స్వయముగా నక్కడ మద్భవించిన మహాకాలుని పూజించుచూ ఇప్పుడక్కడనే వున్నాడు.

నిత్యము మహాకాలుని శ్రద్ధతో పూజించు వ్యక్తి, కుబుసము మండి పాము విడివడినట్లు చెడుకులమున జన్మించినందువలన కలుగు దోషములనుండి విడివడును. మహాకాలుని ‘శివ’ లింగమును శ్రద్ధతో ఎట్లు చూచుచుండునో అట్లే అతని నూరుజన్మలనుండి కలుగుదోషములన్నీ తొలగును. భర్తృయజ్ఞడు అక్కడ శివలింగము నారాధించుటచేత క్రమముగా కులదోషమునుండి ముక్తుడాయన. ఇది శివలింగమహిమ బభ్రువును కులములేనివాడవనివందుకు దుష్టజన్మను పొందిన యాజ్ఞవల్క్యుడు దానిమండి ముక్తుడయినందుచే ఈ తీర్థము పావనమగు బభ్రుతీర్థమని పేరొందినది. కనుక మహీసాగర సంగమముమ చేరి అక్కడ ఐదు తీర్దములమ సేవించుచూ మండిన నిశ్చయముగా ముక్తిని పొందెదరు. అని పలికి సంవర్తుడు అను ద్విజుడు తనకు నచ్చిన ప్రదేశమునకు వెళ్ళిపోయేమ. మిగిలినవారంతా భర్భయజ్ఞుడను మునిని చేరి అక్కడ వుండిరి. భర్తృయజుడు వారిని చూచి గుర్తించి (శివుని గణములని తెలిపి) ఇట్లనెను – ‘మీరందరి పుణ్యము గొప్పది, నిర్మలమైనది - మీరీ గుప్తమగు మహీపాగరసంగమమను క్షేత్రమునకు వచ్చి చేరితిరి. స్నానము, దానము, జపము, హోమము, విశేషముగాపిండదానము - ఇవన్నియూ మహీసాగర సంగమమున శాశ్వతమగును - అట్లే ఇక్కడ చేసిన మీ స్నానదావక్రియలన్నీ ఇపుడు అక్షయమైనవి.

పూర్వము నారదుడిక్కడ నివసించినపుడు గ్రహములతనికి వరములనిచ్చినవి. శనైశ్చరుడీ వరమునిచ్చెను. శనైశ్చరునితో కూడుకొనిన అమావాస్యనాడు స్నానదానములుమొదలుగా శ్రాద్ధకర్మను మహీసాగర సంగమమున చేయవలయును. శ్రావణమాసములో శనివారము చంద్రుడు కనబడనపుడు రవి సంక్రమణమును చేయునపుడు వ్యతీపాతము అను యోగమేర్పడినచో ఆ పర్వము రవి పర్వముల నూటికంటెనూ మిన్నయగు ‘పుష్కరపర్వమ’నబడును. అన్ని యోగముల కలయిక అతి కష్టముపై కలుగును - ఆ శనివారమునాడు లోహముతో శనిని, బంగారముతో సూర్యుని చేయించవలెను. వానిని మహీసాగర సంగమమున యథావిధిగా శని మంత్రములతో శనిని, సూర్యమంత్రములతో సూర్యుని ధ్యానించి అన్ని పాపములు శమించుటకై భాస్కరునికి అర్ఘ్యమిడవలెను. ఇక్కడ ప్రయాగకంటె అధికపుణ్యమునిచ్చు స్నానము, కురుక్షేత్రముకంటె అధికఫలమునిచ్చు దానము, గయాక్షేత్రము కంటే అధికమైనది పిండదానము - పాండవాః గొప్ప పుణ్యరాశులచేత ఈ పర్వదినము అభించును. పితరులకు తప్పక స్వర్గమున అమితతృప్తి కలుగును - పితరులకు గయాశీరమెట్లు అమితతృప్తినిచ్చునదో అంతకంటే ఎక్కువ పుణ్యమునిచ్చునది ఈ మహీసాగరసంగమము.

‘అగ్నిశ్చ రేతో మృడయాతదేహే రేలోధా విష్ణురమృతస్య నాభిః!’ అని సత్యవాక్యమును చదువుచూ, శ్రద్దగా మహీసాగరమున (మునగవలెను) ప్రవేశించవలెను. నదులన్నింటికి ముఖమువంటిదగు పుణ్యమైన సముద్రము, అన్ని తీర్థముల ఆకృతియగు, శ్రేష్ఠమగు మహీనది - ఈ రెండింటికినీ అర్ఘ్యమునిచ్చి తలవంచి నమస్కరించుచుంటిని. తామ్ర, రస్య, పయోవాహ, పితృప్రీతిప్రదా, శుభ, సస్యమాల, మహాసింధువు, దాతుర్దాత్రి, పృథుస్తుత, ఇంద్రద్యుమ్నకవ్యా, క్షితిజన్మ, ఇరావతి మహీపర్ల, మహీశృంగ, గంగ, పశ్చిమ వాహిని, నది, రాజనది - అను పద్దెనిమిది నామముల మాలికను పృధువుచే చెప్పబడిన దానిని స్నానకాలమున, శ్రాద్ధకాలమున పఠించు నరుడు యజ్ఞమూర్తియగు విష్ణువుయొక్క పదమును చేరును. విశ్వమోహినీః నీవు నదుల రాణివి - మహానంద సందోహమునగు మహీజలమువు - అట్టి నీవు నా పాపమును హరింపుము అనునది ఆర్ఘ్యమంత్రము. ఇక్కడ వెండికంకణమును సమర్పించు వాడు భూమిపైన ధనధాన్యములు గల ఇంట జన్మించును. మహేయమ నదిని, సముద్రమును బంగారు కంకణపూజుచే పూజించెదను - నాకు ద్రవ్యనాశము, దారిద్ర్యము కలుగకుండుగాక!

కంకణక్షేపణము - అన్ని తీర్థములయందేఫలము కలుగునో, అన్ని యజ్ఞములచే ఏ ఫలము కలుగునో ఆఫలము మహీపాగరసంగమమున స్నానముచే, దానముచే కలుగును. వివాదమేర్పడినపుడు, అపరాధి యనుకొనబడిన వానిని మహీసాగర సంగమమున జలమును చేతనుంచుకొని ఇట్లు చెప్పించవలెను. బొడ్డులోతు నీటిలో అరమంత్రము చదువుచూ అపరాధిని నిలిపి కుడిచేతినెత్తి నీటినుంచుకొని త్వరగా ఇట్లు చెప్పించవలెను. ‘ఇక్కడ ధర్మము’ సత్యము వుండినచో ఈ సంగమమే సత్యమైనచో, క్రతుద్రష్టలగు ఋషులు సత్యమైన నా శుభాశుభము సత్యమగుగాక! అని పలికి కుడిచేతిని పూర్తిగా నీటియందుంచి బయటకు వచ్చిన వెనుక, పాపమాచరించిన వాడవుతే వెంటనే జ్వరపీడితుడగును. ఏడురోజుల తరువాత కూడా కనబడినచో నిర్దోషియని తెలియవలయును - ఇక్కడ స్నానము, జపము చేసి తపమాచరించి పుణ్యకర్మవలన అనేకులు శివలోకమును చేరిరి. విశేషముగా సోమవారము నాడిక్కడ భక్తితో స్నానము చేసి పంచతీర్థములను చేసిన వ్యక్తి పంచపాతకములనుండి ముక్తుడగును. ఈ విధంగా ఈ తీర్థముయొక్క గొప్పదనము అనేక రీతులుగా చెప్పబడినది శివుని ఆరాధన క్రమమును భర్తృయజ్ఞుడు వారికట్లు చెప్పెను - శివాగమమున చెప్పబడిన పూజా యోగమును యథావిధిగా తెలిపి ఆ ముని శివభక్తిసముద్రము తనలో నిండగా ఇట్లు చెప్పెను.

‘శివవ్రతులారా! శివునికంటేవేరు దైవములేదు - ఇది సత్యం. శివుని విడిచిఅసత్యమగు ఇతరమును ఉపాసించువాడు చేతిలోనున్న అమృతమును విడిచి ఎండమావి వెంట పరుగిడినట్లగును. ఈ జగత్తు శివభక్తి మయమని ప్రత్యక్షముగా కవబడుచున్నది. లింగము భగముచిహ్నముగాగలదీ జగత్తు, వేరొకదానిచేత గాదు.  పాపప్రక్షాళనను కోరినచో ఉత్తమమగు శతరుద్రీయమను రుద్రమాహాత్మ్యమును విమడు - శివుని స్వర్ణలింగమును చక్కగా ఆరాధించి బ్రహ్మ జగత్తుకు ప్రధానమను పేరును పొందీ విరాజిల్లుచున్నాడు. కృష్ణ మూలమున కృష్ణలింగమను పేరునొందినది. సనకాదులు ఆలింగముమ పూజించి జగత్తుయొక్క గతి నెజిగిరి. దర్భాంకుర మయమైన లింగమును సప్తమనులునూ పూజించి విశ్వయోమడని పేరిడిరి. ఇంద్రుడు వజ్రలింగముమ పూజించును. దాని పేరు విశ్వాత్మ - సూర్యుడు విశ్వసృజన తామలింగమున పూజించును. చంద్రుడు పూజించునది జగత్పతియమ ముత్యపులింగము అగ్ని విశ్వేశ్వరుడు ఇంద్రనీలమయ లింగమును పూజించును. శుక్రుడు విశ్వకర్మయను పద్మరాగ లింగమును పూజించును - కుబేరుడు ఈశ్వరుడు స్వర్ణలింగముమ పూజించును.

విశ్వేదేవతలు జగత్పతియను పేరున స్వర్ణలింగమును పూజింతురు, వాయువులు శంభువను రీతిలింగమును పూజింతురు. వసుదేవతలు స్వయంభువము కాశలింగమును, మాతృకలు భూతేశుడు త్రిలోవలింగమును పూజింతురు. రాక్షసులు భూతభవ్యభవోద్భవుడను పేరున లోపలింగమును పూజింతురు. గుహ్యకులు యోగుడమ సీసలింగము వర్చింతురు. జైగీషవ్యుడు బ్రహ్మరంధ్రమున యోగీశ్వరుడను లింగమును, విమి కళ్ళయందు శర్వయను లింగమును పూజింతురు. ధన్వంతరి, సర్వలోకేశ్వరేశ్వరుడను పేరుతో గోమయలింగమును, గంధర్వులు సర్వశ్రేష్ఠయన పేరుతో దారులింగమును పూజింతురు. రాఘవుడు జగజ్యేష్ఠయన పేరుతో వైడూర్యలింగమును, బాణాసురుడు వసిష్టుడను మరకత లింగముమ పూజింతురు. వరుణుడు పరమేశ్వరుడు స్పటిక లింగముమ, నాగులు విద్రుమ లింగమును లోకత్రయంకరుడనువానిని పూజింతురు. లోకత్రయాతుడమ తారలింగమును సరస్వతి, జగన్నాథుడు అను లింగమున సంగమావర్తమున శనియూ పూజింతురు. రావణుడు మహీసాగరసంగమమున జాతిబిమగు లింగమును పుదుర్జయుడను దానిని మధ్యరాత్రిని పూజించును. సిద్ధులు కామమృత్యుజరలమ దాటిన మానసలింగమున, ఉంచజమగు బలిలింగమును జ్ఞానాత్మయను దానిని పూజింతురు.

జ్ఞానగమ్యుడను పుష్పజలింగమున మరీచిపులు, జ్ఞానజ్ఞేయుడను శకృతలింగమున శకృత్తులు సుదుర్విదుడను సేవలింగమును కపిలుడు పూజింతురు. వాగీశ్వరుడను వాకలింగమునుపారస్వతుడు, రుద్రుడమ మూర్తిమయలింగమును గణములు పూజింతురు. శితికంఠుడను బొంబూనదమయలింగముమ దేవతలు, కవిష్ణుడను శంఖలింగమున బుధుడు పూజింతురు. సుమేధసుడమ మృణ్మయలింగమును ఆల్వినులు, కపర్దియను పిస్టలింగమును వివాయకుడు పూజింతురు. కరాలకుడను వవవీతలింగముమ కుజుడు, హర్యక్షుడను ఓదనలింగమున గరుత్మంతుడు పూజింతురు. రతిదుడను గుడలింగముమ, మన్మథుడు, బభ్రుకేశుడమ లవణలింగమున శని పూజింతురు. యామ్య అమపేరు ప్రాపాదలింగమును విశ్వకర్మ సుహృత్తముడగు పొంగులింగమును విభీషణుడు, సంగతమున వంశాంకుర లింగమును పగరుడు పూజింతురు. గమ్యయన రామఠలింగమున రాహువు, హరినేత్రుడను లేవ్యలింగమును లక్ష్మి పూజింతురు. ప్రాణుపమ పేరున ఈశ్వరుని యోగులు అన్ని ప్రాణులయందున్నవానిగా పూజింతురు - మనష్యులు ఈ శివునే అనేక విధములుగా మండు పురుషుడని కీర్తింతురు.

భాస్వరుడను తేజోమయహరుని నక్షత్రములు, సుదీప్తుడను ధాతులింగమును కిన్నరులు పూజింతురు. బ్రహ్మరాక్షసులు దేవదేవుడను అష్టలింగమును, వారణులు రంహసుడను దంతజలింగమును పూజింతురు. సాధ్యులు బహురూపుడను పస్తలోకమయలింగమును, ఋతువులు సర్వనామయమ దూర్వాంకుర మయలింగమును పూజింతురు. శంభుప్రియయము కుంకుమలింగమున అప్పరపలు, ప్రియవాసమడను సిందూరలింగముమ ఊర్వశి పూజింతురు. ఉషియమ గురులింగమును బ్రహ్మచారీ పూజించుమ - యోగినులు సుబభ్రుకమమ ఆలస్తకలింగమను పూజింతురు. సహస్రాక్షుడను శ్రీఖండలింగమును సిద్ధయోగిమలు, మీడషయమ మాంసలింగమును డాకినులు పూజింతురు. గిరిశయమ అన్నజలింగమును మానవుడు, సుశాంతుడమ ప్రిహి లింగమును అగస్త్యుడు పూజింతురు. పతియను యవలింగమును దేవలుడు, చీరపియను వల్మికలింగమును వాల్మీకి పూజింతురు. హిరణ్యభుజూడమ బాణలింగమున ప్రతర్ధమడు, ఉగ్రుడమ రాజలింగమును దైత్యులు పూజింతురు. దిక్పతియను నిష్పావజలింగమును దానవులు, పర్ణవ్యతియను నీరమయలింగమున మేఘములు పూజించును.

భూతపతియగు రాజమాషమయలింగమును యక్షులు, వృషపతియను తిలాన్నజలింగమును పితృదేవతలు పూజింతురు. గోపతి యను గోరజమయలింగమును గౌతముడు, వృక్షావృతయను ఫలమయలింగమును వానప్రస్థుడు పూజింతురు. పేనాన్యుడను పాషాణలింగమును స్కందుడు, మధ్యముడను ధాన్యలింగమును అశ్వతరమను నాగము పూజింతురు. స్రువహస్తయను పురోడాశమయ లింగమును యాజ్ఞికులు, ధన్వియను కాలాయసమయలింగమును యముడు పూజింతురు. భర్గదైత్యుడను యవాంకురలింగమును జామదగ్న్యుడు, బహురూపుడను అన్నమయలింగమును పురూరవుడు పూజింతురు. బాహుయుగయను శర్కలింగమును మాంధాత, నేత్రసహస్రుడను పయోమయలింగమును గోవులు పూజించును. విశ్వపతి యను భర్శమయలింగమును పాధ్యలు (సాధ్వి స్త్రీలు) సహస్రశీరుడను మౌంజలింగమును నారాయణుడు నరునిగా పూజించుదురు. సహస్రచరణుడను తాఝ్యాలింగమును పృథువు, సర్వాత్మకయమ వ్యోమలింగమును పక్షులు పూజింతురు. మహేశ్వరుడను భస్మలింగమును పశుపతి, ద్వితనువను మేరులింగమును పృథివి పూజించును. చిరస్థానుడు అను జ్ఞానలింగమును ఋషులు, జ్యేష్ఠయను బ్రహ్మలింగమును బ్రాహ్మణులు పూజింతురు.

పశుపతియమ గోరోచనమయలింగమును శేషుడు, శంకరుడను విషలింగమును వాసుకి పూజింతురు. బహురూపయమ కాలకూటలింగమును తక్షకుడు, ఏకాక్షుడను హాలహలలింగమును కర్కోటుడు పూజింతురు. ధూర్జటియమ విషమయలింగమును పద్ముడు, విశ్వరూపుడను పితృమయలింగమును పుత్రుడు పూజించెదరు. త్ర్యంబకుడమ పారదలింగమును పార్వతి పూజించును - వృషాకపియను శాస్రలింగమును మత్స్యాదులు పూజింతురు. అధికముగా చెప్పుటేల? జగత్తులో ఐశ్వర్యము కలిగి వున్నదంతా శివారాధన యోగమువలననే కలిగినది. నీరును సేవించి భస్మముకూడా వృక్షత్వమును పొందుటమ తెలిపినచో శివభక్తిలేని ఇతనికేమి ఫలమోతెలియును. ధర్మార్థకామమోక్షములను పొందగోరినచో శివుని సేవించవలెను. ముల్లోకముల విచ్చువాడితను. ప్రతిదినమూ ఉదయముననే ఈ శతరుద్రీయమున చదివినచో ప్రీతి చెందిన శివుడు అతనికి అన్నివరములనిచ్చును. దీనికంటే గొప్పదైన పుణ్యతమమగు ఫలములేదు - అన్ని వేదముల రహస్యమగు దీనిని సూర్యుడు నాకు చెప్పెను. శతరుద్రీయమును పఠించగా మనస్సుచేత, వాక్కుచేత పొందిన పాపము కూడా నశించును.

రోగార్తుడు రోగమునుండి, బద్దుడు బంధమునుండి, భృతుడు భయమునుండి శతరుద్రీయమును జపించిన ముక్తుడగును. నూరునామములచే, కుంభములచే, నూరు పుష్పములచే, ప్రణామములచే ఈశ్వరునర్చించిన అన్ని పాతకములనుండి ముక్తుడగును. శతలింగము, శతారాధక, శతనామములు అన్ని దోషములను నశింపజేయునని చెప్పబడినది. విశేషముగా ఈ పంచలింగములవద్ద పఠించినచో విషయములనుండి జనించు ఐదుదోషముల నుండి విముక్తుడగును. నారదుడిట్లు చెప్పసాగెను - ‘ఇదివిని వారు ప్రార్థించి ఆ గుప్తక్షేత్రమున సంతోషముగా పంచలింగములనర్చించుచూ శివధ్యానపరులైరి. తరువాత చాలాకాలము గడవగా వారి భక్తివిశేషము వలన ప్రీతి నొందిన శివుడు వారికి ప్రత్యక్షమై ఇట్లనెను. ‘బక, కూర్మ, ఉలూక, గృధ్ర, ఇంద్రద్యుమ్న నృపులారా! మీరు సారూప్యముక్తిని పొంది నా లోకమున నివసించెదరు. లోమశుడు, మార్కండుడు కూడా జీవన్ముక్తులయ్యెదరు’ - అని చెప్పగా ఇంద్రద్యుమ్నుడక్కడ ఇంద్రద్యుమ్నేశ్వరుడు, మహాకాలుడమ లింగమును స్థాపించెను. ఆ తీర్ధమాహాత్మ్యమును తెలిసి, చిరంతనకీర్తిని గోరుచూ గొప్పలింగమున స్థాపించి ఇట్లనెమ - సూర్యచంద్రులు, భూమి వున్నంతకాలము ఈ లింగము శాశ్వతముగా వెలుగొందుగాక!’ అనగా ‘తథాస్తు’ అని పలికి శివుడు మరల ఇట్లనెను.

‘ఇక్కడ ఇంద్రద్యుమ్నునిచే స్థాపింపబడిన లింగమును నియమముగా అర్చించువాడు శివగణముగా మారి నా లోకమున వివసించును’. ఇట్లు పలికి ఆ ఐదుగురిలో శంకరుడు రుద్రలోకమునకు వెళ్ళిన - వారు మరల శివగణములైరి. ఇట్టి ప్రభావముగల రాజు ఆ ఇంద్రద్యుమ్నుడు ఆతను యజమునాచరించుచుండగా విర్మిచబడినదీ మహీనది. ఇట్టి పుణ్యముగలది మహీపాగరసంగమము. అర్జునా! నీకు నేమ సంక్షేపముగా చెప్పితిని. ఇక్కడ స్నానమాడి ఇంద్రద్యుమ్నేశ్వరుని పూజించిన వాడు శివపార్వతులలోకమున పొందును. ఈ శివలింగము తనను పూజించినవారిని బంధములను తొలగించి గణములకధిపతిగా చేయునది - ఎందుకనగా ఆ రాజు బంధముక్తుడై దీవివి స్థాపించెను కదా! అర్జునా! ఈ విధముగా వీకు, పుణ్యమును కలిగించు ఈ సంగమమున గూర్చి, అత్యద్భుతమగు ఇంద్రద్యుమ్నేశ్వర మాహాత్మ్యమును గూర్చి చెప్పితిని. అవి వారదుడు చెప్పను.

ఇది శ్రీ స్కాందమహాపురాణములో మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున మహీసాగరసంగమమాహాత్మ్యము - శతరుద్రీయ లింగమాహాత్మ్యము - ఇంద్రద్యుమ్నేశ్వర లింగమాహాత్మ్యముల వర్ణనమమ పదమూడవ అధ్యాయము.