స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
6వ అధ్యాయము
నారదుడు చెప్పసాగెను- 'అర్జునా! అది విని నేను రోమాంచమును పొంది నా రూపమును తెలిపి బ్రాహ్మణులతో నిట్లంటివి. ఆహా! మన తండ్రి ధన్యుడు. అతను సృజించినదానిని మీ వంటి బ్రాహ్మణ శ్రేష్ఠులు పాలించుచుంటిరి. పూర్వము విష్ణువు నిజమునిట్లు చెప్పెను. అనంతుడను, పరాత్పరుడను, సమస్త ప్రాణులకధిపతినైన నా కంటే మించినది లేదు. నా మార్గమున పలుకు విప్రోత్తములకు ఇతరముతో పనియేమి? నేనన్ని విధాలుగా ధన్యుడిని. నా జన్మఫలమును పొందితిని. పాపములమ ఉపద్రవములు లేని మిమ్ము చూచితిని' అనగా వారు ఒక్కమారుగా లేచి శాతాతపుడు మున్నగు ద్విజులు ఆర్ఘ్య, పాద్య, మొదలగు సత్కారములచే నన్ను పూజించిరి. అర్జునా! వారు సాధువులకు తగిన మాటలను నన్నుద్దేశించి మాట్లాడిరి. దేవర్షి! మావద్దకు నీవు వచ్చుటచే మేము ధన్యులమైతిమి. ఎక్కడినుండి రాక! ఎక్కడికిప్పుడు వెళ్ళ వలేను? మునిసత్తమా! ఇక్కడకు వచ్చుటలో కారణమేమి? అని వారు ప్రేమగా అడుగగా నేను వారితో నిట్లంటిని.
నేను బ్రహ్మమాట పై విప్రులకు శుభమగు స్థానమునివ్వదలిచి మహీతీర్థమున మహీసాగరసంగమమున బ్రాహ్మణుల పరీక్షించుచూ ఇక్కడకు వచ్చితిని. మిమ్ముల పరీక్షించితిని. మిమ్ములనక్కడ స్థాపించెదను. ద్విజులారా అందుకనుమతించుడు. అనగా ద్విజులను చూచి శాతాతపుడిట్లనెను. 'నారదా! నిజముగా భారతము దేవతలు కూడా పొందలేనిది. అక్కడ మహీసాగర సంగమము ఇంకనూ పవిత్రము. అక్కడ స్నానము చేసిన మహాతీర్థఫలమును పొందగలరు. కానీ, మేము ఒక్క దోషమును చూచి భీతిల్లుచుంటిమి. అక్కడ చాలామంది నిర్దయులు, సాహసులైన చోరులున్నారు. స్పర్శలలో పదహారవ, ఇరవయ్యవ వానితో కూడిన మా ధనమును కొల్లగొట్టెదరు. 'కాదయో మావసానాః స్పర్మాః' అని 'క' నుండి 'మ' వరకు స్పర్శలు. అందు పదహారవ అక్షరము 'త', ఇరవయ్యవ అక్షరము 'ఏ' కనుక ధనమనగా ఇక్కడ తపోధనము.) ఆ ధనము లేనిచో మా జన్మ ఎట్లుండును? ఆకలిగొని నివసించుటయైనా చౌర్యము కంటే మేలు. (ఆ చోరుల చేతబడుట కంటే ఆకలిగొని బ్రదుకుటయైనా మేలే) అనగా అర్జునుడిట్లనెను. “విప్రా! అద్బుతమును వర్ణించుచుంటివి. ఆ చోరులెవరు? బ్రాహ్మణులు భయపడే ధనమును దేనిని వారు కొల్లగొట్టెదరు?' అనగా నారదుడు చెప్పెను. 'కామము, క్రోధము మున్నగునవి చోరులు, తపస్సే ధనము.ఆ తపోధనము అపహరింపబడునని బ్రాహ్మణులు నాతో పలుకగా నేను వారితో నిట్లంటిని.
'విప్రులారా తెలుసుకొనుడు! జాగ్రత్త వహించిన మనుషులను దుష్టులగు ఆ చోరులేమి చేయగలరు? భయభీతుడు, ఆలసుడు, అశుచియగు వాడు సాధించునదేముందీ? భూమి ఆ నరుని మింగివేయును. అనగా శాతాతపుడిట్లనెను. 'మేమా చోరుల నుండి భయము నొందితిమి. వారు మా గొప్ప ధనమును హరించెదరు. అలాంటప్పుడు మేలుకొనియుండుట ఎట్లు? దుష్టులగు చోరులెక్కడికో వెళ్ళినందున నమస్కరించి మేమిక్కడకు వచ్చితిమి. ఆరవవంతు ఫలమునిచ్చు ప్రతిగ్రహము ఘోరమైనది.' అని పలుకుచుండగా హారీతుడనుడిట్లనెను. మోక్షము, స్వర్గము చేతిలో నుండు మహీపాగరసంగమమున మూడబుద్ధితో ఎవడు విడుచుమ? స్తంభతీర్థమున ఆరక్షణమైనా వుండగలిగినచో విబుడగు వాడెవడు కలాపాది గ్రామములలో మండుమ? రక్షకుడగు కుమారవాథుని మనస్సులో స్థిరముగా మంచుకొనిన మసన చోరులనుండి కలుగు భయమేమి చేయుమ? పాహసము లేనిది ఐశ్వర్యము ఎట్లెవన కలుగదు కనుక వారదా! నీమాటపై నేమ అక్కడకు వెళ్ళెదమ. నా వద్ద ఇరవయ్యారు వేల బ్రాహ్మణులు షట్కర్మనిరతులు శుద్దులు, లోభము దంభములేనివారు కలరు. వారితో కలిసి వచ్చేదన. ఇదే నా అభిప్రాయము.
ఆని వారు పలుకగా వారికి నమస్కరించి ఆకాశగామినై సంతోషముగా వెనుతిరిగితిని. నూరు యోజన విస్తీర్ణముగల హిమ మార్గమును దాటి కేదారమును ద్విజోత్తములతో కలిసి చేరితిని. ఆ దేశమును ఆకాశముద్వారా గానీ, బిలము ద్వారా గానీ చేరవచ్చు. స్కందుని ప్రసాదముచేత వేరొక విధముగా వచ్చుట కుదరదు. అనగా అర్జునుడిట్లడిగెను. 'నారదా! కలాప గ్రామమెక్కడ? బిలముద్వారా చేరుట యేమిటి? స్కందుని అనుగ్రహమేమిటి? ఇదంతా నాకు విస్తరముగా తెలుపుము, ఆవగా నారదుడు చెప్పసాగెను. 'అర్జునా! కేదారమునకు వందయోజనముల దూరమున హిమప్రాంతము దానికి చివర నూరుయోజనముల విస్తారముగల కలాపము గలదు. దాని చివర నూరుయోజనముల వాలుకార్లవమున్నది. ఆ ప్రదేశము భూలోక స్వర్గమనబడును. ఇక బిలముద్వారా వెళ్ళుటయెట్లో చెప్పెద విమము. అన్నమూ, వీరూ విడిచి దక్షిణ దిక్కున కుమారస్వామిని ఆరాధించవలెను. పాపముతొలగినదనుకొనినచో కుమారస్వామి స్వప్నమున కనబడి వెళ్ళుమని చెప్పును. అర్జునా! అప్పుడు ఆ గుహకు పశ్చిమమున పెద్ద బిలమున్నది. దానియందు ప్రవేశించి ఏడువందల అడుగులు వెళ్ళవలెను. అక్కడ సూర్యునివలె ప్రకాశించు మరకతలింగము, బంగారమువలె జ్వలించు స్వచ్చమైన మట్టి యున్నవి. ఆ లింగమునకు నమస్కరించి, మట్టిని తీసుకొని స్తంభతీర్థమున కుమారస్వామిని ఆరాధించి రావలెను.
బావి మండి రాత్రి సమయమునలోలమాత్రము నీటిని గ్రహించి దానితో కలిపి రెండుకళ్ళకూకాటుకవల పెట్టుకొవవలెను. దేహమునకు కూడా అరవై పదములు దానిని వ్రాసుకొనవలెను. ఆ కాటుక ప్రభావము చేత అందమైన బిలమును చూడగలరు. శరీరమునకు అలుముకొనిన కాటుక ప్రభావముచేత ఆ బిలమునుండి వెళ్ళగలరు. 'కారీషము'లను భీకరమైవ కీటకములచే భక్షింపబడరు. ఆ బిలమధ్యమున సూర్యుని వలె ప్రకాశించు సిద్దులను చూచుచూ కలాపగ్రామమునకు వెళ్ళగలడు. అక్కడ నాలుగువేల సంవత్సరములుఆయువని చెప్పబడినది. అక్కడ ఫలములనే భుజింపవలెను. లేనిచో పుణ్యమువార్షించలేడు. ఇది నీకు చెప్పితిని. ఇంకనూ ఏమి జరిగెనో చెప్పెద వినుము. తపస్సు సామర్ధ్యము చేత నేనా బ్రాహ్మణులను దండమునకు ఎదుట సూక్ష్మముగా నున్నట్లు నిలిపి మహీపాగర సంగమమునకు వచ్చితిని. అపుడు వారిని పుణ్యజలాశయతీరమున దింపి, వారితో కలిసి స్నానముచేసితివి. ఆన్ని దోషములకు దావాగ్ని వంటి ఆ మహీపాగరసంగమమున పితరులకు, దేవతలకు తర్పణపత్ర్కియలొనర్చితివి. ఇక సంగమముననే పరమమంత్రమున జపించుచూ సూర్యుని చూచుచూ, మనమున శ్రీహరిని ధ్యానించుచూ మంటిమి. అంతలో ఇంద్రాది దేవతలు, సూర్యుడు మొదలగు గ్రహములు, అందరు లోకపాలకులు, గంధర్వులు మొదలగువారు, అప్పరసల గణములు కలిసినవి.
ఉత్తమమగు ఆగీతవాద్యమౌషమహోత్సవమున నేను విపులపాదములు కడుగుటకు ఉద్యుక్తుడనైతిని. ఆసమయమున నేను ఆతిథి పిలుపును వింటిని. పామధ్వనితో కూడి మంద్ర (ప్లుత) స్వరమున మిక్కిలి మనోహరముగా శివభక్తివలె ఉత్తమముగా ఆ పిలుపు వుండిను. విఫులందరూ లేచి అతనినడిగిరి 'ఓ విప్రా! ఎవరు నీవు? ఎక్కడినుండి వచ్చితివి? ఏమి కోరుచుంటివి? వీమనసుకిష్టమైనదేమో చెప్పుమనగా విప్రుడిట్లు చెప్పెను. నేను కపిలుడను వాడవని వారదునికి తెలియజేయండి. ప్రార్థించుటకై వచ్చితిని అనగా విని నేవట్లంటిని. 'మహామునీ! ఇక్కడికేతెంచిన వీవు కపిలునిచే ఆయినచో వేమ రమ్యడివి. మేము ఇవ్వలేనిది లేదు. వీకన్న ఎక్కువ యోగ్యుడు లేడు. అవగా కపిలుడు ఇట్లు చెప్పెను. బ్రహ్మపుత్రా! వారదా! నీవు వాకివ్వవలసినదేమో చెప్పెద వినుము. నాకు ఎనిమిదివేల బ్రాహ్మణులనిమ్ము కలాపగ్రామవాసులగు బ్రాహ్మణులకు నేను భూమిని దానమిచ్చెదను. ఇది చేయుము.” అనగా నేనునూ మాటనిచ్చితిని. 'ఆలానే కానిమ్ము మహామునీ! నీవునూ విప్రులకు ఉత్తమమైన స్థానమున 'కాపిలమ'ను దానిని ఏర్పరుచుము. శ్రాద్ధమునగానీ, అవసరమున గానీ వచ్చిన అతిథి విముఖుడైనచో ఆ ఆశ్రమమున అంతా నిష్ఫలమగును. అతిథిని పూజించనివాడు రౌరవ నరకములను పొందును. అతిథిని పూజించువాడు దేవతలచేత కూడా పూజింపబడును.
దానములచే, యజ్ఞములచే కపిలమునివర్చించి భోజనము సమర్పించిన తరువాత హారీతుడను మహాముని స్వయముగా ఆహ్వానింపబడెను. సిద్దుల, దేవతల సమాగమమున పాదప్రక్షాళనము కొరకు హారీతుడు ఎదుట ఎడమపాదమునుంచి నిలిచెను. అంతట సిద్దాప్పరసోగణములు గట్టిగా నవ్వెను. 'అట్టి మునిని చూచి ద్విజులు గౌరవింపబడిరి. అనగా ఆంతట నాకు కూడా మనస్సులో శోకవేగము మీక్కుటముగా కలిగెను. పూర్వ పండితులు చెప్పిన కథనుగూర్చి ఆలోచించెను. అన్ని పనులలో హేతిశబ్దము గర్షించబడినది. పనులను మించి చేయువారికి నిశ్చయముగా శిలా పాతమే కలుగును. ఆంతట నేను విప్రులనుద్దేశించి ఇట్లంటిని. "మీరు మూర్ఖులయ్యెదరు. ధనధాన్యములు తక్కువగా వుండి, దారిద్ర్యగహనమునే ఆవరించబడియుందురు.' అనగా హారీతుడు నవ్వి ఇట్లనెను. 'మమ్ము శపించుచున్న మీకే ఈ స్థితి కలుగును. ఇక నీకేమి శాపమివ్వగలము. ఇదే నీకు శాపము.' అనగా నేను ఆలోచించి మరల ఇట్లంటివి. ద్విజుడా! నేనేమంటినిఎడమకాలునుంచిన మీకే కలుగును. అనగా హారీతుడిట్లనెను. 'విజ్ఞుడా! ఆ కారణమును వినుము. ఇట్లు గ్రహించుట దుఃఖము కదా యని తలంచుచున్న నా మనస్సులో శూన్యము వలె ఏర్పడినది. ప్రతిగ్రహము చేత విప్రుల బాహ్యతేజస్సు క్షీణించును. మహాదానమును తీసుకుంటున్న బ్రాహ్మణుడు దాతకు తన శుభమునివ్వగా, దాత తన అశుభమునిచ్చును.
దాత, ప్రతిగ్రహీత (దానమిచ్చువాడు, పుచ్చుకొనువాడు) ఇరువురు ఒకరినొకరు తక్కువచేయువారని తలుచు అల్పబుద్ధి గలవాడు నశించును. ఇట్లాలోచించిన నాకు మనసవ శూన్యముగా మారిను. వారదా! నిద్రగొవినవాడు, భయముగొనినవాడు, కామమువొందిన వాడు, శోకములో మన్నవాడు, తన పొత్తు కోల్పోయినవాడు, వేరొకచోట మనసు నిలిపిన వాడు వీరందరూ శూన్యమనస్కలే యగుదురు. వీరియందు బుద్ధిమంతుడు కోపమును చూపరాదు. నీవు కోపమును చూపినచో వికీ హాని. అనగా వేను పశ్చాత్తాపముతో ఆ విపులలో విట్లంటిని. చెడుబుద్ధి గలిగి ఆలోచించక పనిచేయు నాపైవాకేరోతపుట్టుచున్నది. ఛీ! ఆలోచించక పని చేయువారికి జరగనిదేమున్నది? వాపై ఆలోచించకనే ఒక్కమారుగా పనిచేయరాదు. ఇది అన్ని ఆపదాలకు నెలవు. ఆలోచించి పనిచేయు ధీరువి అన్ని పంపదలు స్వయముగా వరించును. పూర్వము బుద్ధిమంతుడగు చిరకారి నిజమే చెప్పెను. పూర్వము.ఆంగిరసుల ఇంట ప్రఖ్యాతుడగు బ్రాహ్మణుడుండెను. ఆలపించి పనిచేయుడతను, గౌతముని పుత్రుడు ఆలోచించే అన్ని పనులూ తొందరపడక చేయువాడు. తొందరపడక నెమ్మదిగా పమలు చేయుటచే అందరూ అతనిని 'చిరకారి' అనెడివారు. ఆలసించుటచే తెలివితక్కువ వాడనెడివారు. తెలివ తక్కువవారు, తరచి చూడని జనులట్లు అవెడివారు. ఒకమారు తండ్రి వ్యభిచారమును కారణముగా గ్రహించి ఇతరపుత్రులను వదలి, ఇతనినే తల్లిని వధించుమని కోపముతో పలికెను. ఇతను అలాగే యవ్ననూ చాలా కాలము ఆలోచించుచూ నుండెను. చిరకారి కనుక తన స్వభావముచేతనే తొందరపడలేదు.
‘నా తండ్రి ఆదేశమునెట్లు పాటించెదను? తల్లిని చంపకుండగా ఎట్లుండెదమ? దుగ్ధమని వలె వేమమాఈ పవియందు ధర్మమను నెపముతో ఎట్లు తగులుకొందుము. తండ్రి ఆజ్ఞను పాటించుట పరమధర్మము. వ్యతిరేకముగా తల్లిని రక్షించుట అధర్మము. పుత్రుడగుటయన స్వతంత్రమును కోల్పోవుటయే! కాని నన్నిట ఇది పీడించుటలేదు. స్త్రీని, అందువా తల్లిని చంపి ఈ లోకమున ఎవడు సుఖముగా నుండును? తండ్రివిలెక్కించనిచో ఎవడు ప్రతిష్ఠను పొందును? తండ్రిని గౌరవించుట, తల్లిని రక్షించుట రెండూయుక్తమే ఇద్దరూ క్షమయందు తగినవారు. త్రోసిపుచ్చుట యెట్లు? తండ్రి, భార్యయందు మరల జన్మించునని, ఆత్మ తానే పుత్రుడగును-(భార్యయందు మరల తాను. పుత్రునిగా జన్మించుటచే పుత్రుడనగా తండ్రి యని భావము) శీలము, చింతము, గోత్రము, కులము ఏవిని ధరించు (నిలుపుట) కొరకు తండ్రి సమ పుత్రునిగా పొందెను. జాతకర్మయందు, ఉపనయనమందు తండ్రి ఏవేవో ఆదిచాలు. తండ్రిగారవమును పొందగోరి దానిని దృడమొనర్చవలెను. ఇవ్వదగు శరీరము మున్నగు వానినన్నింటినీ తండ్రి ఒక్కడే ఇచ్చును. కమక ఆలోచించలేదు. తండ్రి మాటను పాటించవలెను. తండ్రిమాటననుసరించు వాని పాపములన్నీ చూర్ణమగును-తండ్రియే స్వర్గము, ధర్మము, పరమతపము. తండ్రి ప్రీతినొందినచో దేవతలందరూ ప్రీతినొందుమ. అట్టివావివి తండ్రి ఎట్లాశీర్వదించునోఆఆశిప్పులు వచ్చిచేరుమ. (ఆప్పులు పత్యమగుమ) తండ్రి అభినందించినచో అన్ని పాపములకు విష్కృతి కలుగును. అపుడు కొమ్మమండి పండు, పువ్వు విడిపడినట్లు బంధమునుండి విడిపడును.
సుతుడు బాధపెట్టినన తండ్రి పేహమును (వాత్సల్యమును) విడవడు. అవి ఆ చిరకారి పుత్రునికి తండ్రిపై వుండాల్సిన గౌరవమును గూర్చి ఆలోచించెను. కనుక తండ్రిది తక్కువ స్థానం కాదు. ఇక తల్లిని గూర్చి ఆలోచించెదను. పంచభూతములకు చెంది మరణించు స్వభావముగల ఈ నా శరీర సంఘాతమునకు అగ్నికి ఆరణివలె నా తల్లి కారణము. ఏవ్యక్తి దేహమునకైనా తల్లియే ఆరణి (హేతువు) అన్ని ప్రయోజనముల విశ్రాంతి. తల్లియున్నచో ఆధారముండును. లేనిచో అనాథవే కదా! డబ్బులేకున్ననూ ఇంట తల్లియున్నచో ఆ వ్యక్తి శోకమును పొందడు. వావినే స్థావరము కూడా ఆకర్షించదు. సుతులు, మనుషులు వున్నవాడు కూడా తల్లిని చేరి మారేళ్ళు వచ్చివమా రెండేళ్ళబాలుని వలె ప్రవర్తించవచ్చు. సమర్థునిగానీ, అసమర్థుని గానీ, బలవంతుని గానీ దుర్భలుని గానీ తల్లి కొడుకును రక్షించును. వేరొకరు పోషించరు. తల్లిని కోల్పోయిన వాటినుండే వృద్దుడగును, దుఃఖమును పొందును, అప్పుడే జగత్తు శూన్యమగును. తల్లితో సమానమగు వీడలేదు, తండ్రితో పాటవచ్చు గతి లేదు. తల్లితో సమమగు రక్షణగానీ, వీటి చెలమగానీ లేదు. పొట్టలో ధరించుటచే ధాత్రి, జన్మనిచ్చుటచే జనని. అవయవముల పెంచుటచే అంబ, వీరుని కనుటచే వీరసూః శిశువును పాకుటచే శ్వశ్రు, వానిని గూర్చి ఆలోచించుటచేత మాత అనబడును.
దేవతాసమూహములన్నీ కలసిన తండ్రియని తెలియుదురు. కానీ మానవుల, దేవతల సమూహములన్నీ తల్లిని దాటవు (తల్లికంటే ఎక్కువ కాదు కదా!) పతితులైన గురువులనైనా విడవవచ్చు కానీ తల్లిని విడవరాదు. గర్భమున ధరించుటచేత, పోషించుటచేత తల్లియే ఎక్కువ అని ఆ చిరకారి కౌశకి నదీతీరమున, స్త్రీయగుటచే తన తల్లిని వధించుటకు ఇష్టపడకుండెమ. ఎంతో సేపు ఆలోచించిననూ దానికి అంతమును పొందలేదు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణరూపమున దాల్చి గాథలను పాడుచూ అతని తండ్రి ఆశ్రమమునకు వచ్చెను. స్త్రీలందరూ అసత్యవర్తనులేనని సూత్రకారుడవినచో వారిమండి సలమును గ్రహించకూడదు. అని మేధాతిథి యను ఉత్తముడు వివేను. చిరకారి తండ్రియగు ఆ మేధాతిథి దుఃఖముతో కన్నీళ్ళు వీడుచుచూ 'ఆహా! ఈర్షతో నేను ఈ దుఃఖసాగరములో పడినచో నన్నెవడు రక్షించగలడు? నేను తొందరపడి ఉత్తముడగు చిరకారిని ఆజ్ఞాపించితిని. ఒకవేళ అతను చిరకారియే అయినచో నన్నీ పాపమునుండి రక్షించగలడు. చిరకారకా! వీపు తొందరపడకుండినచో వీకు భద్రమగుగాక! చిరకారీ! ఈనాడు కూడా నీవు ఆలస్యము చేసినచో నన్ను, నీ తల్లిని, వేమ సంపాదించిన తపస్సును అన్నింటినీ రక్షించుము. చక్కని పేరుగల చిరకారీ! పాపములో పడిన నన్ను రక్షించుము." అవి గౌతముడగు మేధాతిథి దుఃఖించుచూ చింతింప సాగెను.
అతను తల్లి చెంతనున్న చిరకారియను పుత్రుని చూచెను. కానీ చిరకారి తండ్రిని చూచి మిక్కిలి దుఃఖమునొందెను. ఆయుధమును పడవైచి తల వంచి నిలిచి తండ్రిని ప్రసన్నము చేసుకొనుటకు సన్నద్ధుడాయెను. మేధాతిథి తన పాదముల వద్ద పడిన కుమారుని జీవించియున్న భార్యను చూచి అమితానందమును పొందెను. ఆయుధమును చేతబూని కొడుకు నిలువగా, తనను చంపవచ్చని తల్లి తెలుసుకొనలేదు. తండ్రి కాళ్ళ వద్ద పడిన కుమారుని చూచి, భయముతో, అతనికి శస్త్రమును గ్రహించు చంచలత్వము వచ్చెనని భావించెను. అపుడు తండ్రి చాలాసేపు స్మరించి కుమారుని నుదురుపై ముద్దిడి, చాలాసేపు కౌగిటనుంచుకొని చిరంజీవ చిరకారీ! యనెను. అమితానందమును చాలాసేపు పొందిన తండ్రి సుతునితో నిట్లనెను. చిరకారికా! నీకు శుభమగుగాక! నీవు చాలాకాలము చిరకారివే కమ్ము! ఆలసించి నీవీ పనిచేయనందున నేను చాలాకాలము దుఃఖము పొందలేదు. మునిశ్రేష్ఠుడగు గౌతముడీ గాథలను కూడా చెప్పెను. చాలా కాలము అభ్యసించి మంత్రమును సంధానించవలెను. (చాలాసేపు ఆలోచించవలేను అని కూడా) చాలాకాలము చేసినది విడువవలెను. చాలాకాలము నిలిపిన మంత్రము (చేసిన ఆలోచన) చాలాకాలము నిలిచివుండును. రోగమున, దర్పమున, మానమున, ద్రోహమున, పాపమున, అప్రియము చేయవలసిరాడో ఎవడు చాలా కాలమాలోచించిచేయునో అతనే యోగ్యుడు, శ్రేష్ఠుడు. బంధువుల, మిత్రుల, సేవకుల, స్త్రీల విషయంలో వారి అపరాధము వ్యక్తముకానపుడు ఆలోచించి పనిచేయువాడే శ్రేష్ఠుడు. ధర్మములను చాలాకాలము సేవించవలెను. చిరకాలము అన్వేషించవలెను- చిరకాలము పండితుల సేవించి, ఇష్టమైనవారి వద్దనే యుండి ధర్మముమ సేవించవలెను.
చిరకాలము తనను తాను నిగ్రహించుకొనువాడే చిరకాలము కీర్తిని పొందును. ధర్మముతో గూడిన వాక్యమును వేరొకరు చెప్పునపుడుమాచిరకాలము ప్రశ్నించవలెను, వినవలెను - అటైన చిరకాలము అవమానమునొందడు. ధర్మమున, శస్త్రమును చేత గ్రహించి శత్రువునిలిచినపుడు, యోగ్యుడు సమీపముననున్నప్పుడు, భయమునందు, సాధువుల పూజించుటయందు మాత్రము చిరకాలము చేయనివాడే శ్రేష్టుడు. అనీ పలికి మేధాతిథి భార్యతో, పుత్రునితో ఆశ్రమమునకు వచ్చెమ. చిరకాలము ఉపాసించి ఆ ముని స్వర్గమును పొందెను. మనము ఇట్లు చెప్పుచున్నామా మోహనమునకు లోబడి మోపగింపబడితిమి. విప్రులారా! కలియుగమున నా శాపము మీపై పడును - (మిమ్ములను బాధించును). అన్ని మంచి గుణములు గల బ్రాహ్మణులు ఎప్పుడూ వుండనే వుంటారు. అటు తరువాత నేను ధర్మవర్మకాళ్ళు కడిగి సమీపమున నున్న దేవతలకు సాక్షులుగా చేసికొని సంకల్పించితిని. బంగారము, గోదానము, గృహదానము, ధనము, భార్య, భూషణములు, వస్త్రములు మున్నగువానీతో బ్రాహ్మణులు కృతార్థులైరి. ఆపుడు దేవతల సంగమమున ఇంద్రుడు చేతినెత్తి ఇట్లనెను - 'ఏంత కాలము పార్వతి శివుని శరీరములో సగము నాశ్రయించి వుండునో, ఈ గణపతి, మేము, ముల్లోకములూ ఎంతకాలము వుండెదమో అంతకాలము నారదుడు స్థాపించిన ఈ స్థానమానందించుగాక! ఈ స్థానమునకు లోపము తెచ్చువారికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ద్విజ శాపములు కలుగుగాక!' అనగా వారందరూ అట్లే అని అనుమతించిరి - ఇట్లు నేమ స్థాపించిన ఈ స్థలమున ముని కాపీలుని స్థాపించెను - ఇట్లు ఆ రెండు స్థానములు దేవకృతములు - తరువాత ప్రసన్నులైన దేవతలు స్వర్గమునకు వెళ్ళిపోయి.
