స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
20వ అధ్యాయము
నారదుడు చెప్పసాగెను - ‘ఆ విష్ణువును చూచి దానవులందరూ కోపించి తమ తమ బలములతో కూడి తేనెతుట్టెమ తేనెటీగల వలె అన్ని వైపులనుండి చుట్టుముట్టిరి. పర్వతమువలె పెద్దదై మదమును స్రవించుచున్న ఏనుగునొకదానివి ఎక్కి నీమీ’ అమ దైత్యుడు హరిని ఎదుర్కొనేను - ఏనుగు తెల్లనైన, చిత్రవర్ణముగల పతాకములను గలిగి, పగిలిన గండభాగముతో, బంగారువర్ణముతో నుండి, దావాగ్నితో కూడిన పర్వతము వలెనుండెను. రౌద్రముగల దానవులనేకులు ఆ ఏనుగునకు చుట్టూ నిలిచి రక్షణ కల్పించిరి - వారు కిరీటములతో, కవచములలో వెలుగుచుండిరి. మదనుడు పర్వతమువంటి గుర్రముక్కి విష్ణువు నెదుర్కొవను - బంభకుడు ఐదుయోజనముల పొడవు మొడగల ఒంటె ఎక్కను. శంభుడు పన్నెండు యోజనముల విస్తృతి గల మేషమునెక్కెను. వారు సమర్థుడగు విష్ణువును సమీపించిరి - అపుడు విమి పరిఘతో, మధనుడు ముద్గరముతో, శుంభుడు శూలములో, సనుడు పదునైన ప్రాసతో, క్రథమడు చక్రముతో, కోపించిన జంభుడు ‘శక్తిలో’ ఆ మహాయుద్దమున సారాయణుని దెబ్బతీయసాగిరి. ఇతరులు నారాయణుని పదునైన బాణములతో కొట్టసాగిరి - అట్లు ప్రయోగింపబడిన ఆ అస్త్రములు అనేకవిధాలుగా చెప్పబడిన గురువుయొక్క ఉపదేశములు యోగ్యుడైన శిష్యుని చేరినట్లు నారాయణుని తాకినవి. అంతట కోపించిన శ్రీహరి అనేక బాణములను, ధనస్సులను గ్రహించెను.
ఆ బాణములు దైత్యసేనను దాంభికవాక్కు ధర్మముమ దెబ్బతీయునట్లు దెబ్బ తీసెను - తరువాత శ్రీహరి అగ్నివలె వెలుగు ఇరవై బాణములతో నిమిని దెబ్బతీసెను. పదిబాణములలో మధనని, ఐదుబాణములతో శుంభువి, వందబాణములతో మహిషుని, కోపముగా ఎదపై కొట్టెను. పన్నెండు పదునైన బాణములతో జంభువి, మిగిలిన వారినొక్కొక్కవి. ఎనిమిది బాణములతో కొట్టగా శ్రీహరి ధనుర్విద్యా నైపుణ్యమును చూచి దానవులు కోపములో ఒడలు నుంచిరి. బాణములతో శ్రీహరిని ఆవరించి వారు గొప్ప ప్రయత్నమే చేసిరి - నిమి బళ్ళెముతో శ్రీహరి వింటిత్రాడును, విల్లును ఛేదించెను. మహిషాసురుడు త్వరగా శ్రీహరి చేతిలోని బాణమును విరిచెను - ముప్పదివేల బాణములతో జంభుడు గరుడుని కొట్టెను. పదివేల బాణములతో శుంభుడు అతని భుజములను కొట్టెను - అపుడు విస్మయమును పొంది విష్ణువు గదను పట్టి వేగంగా దానిని మధనుని పైకి విడిచెను - అది రాకమునుపే నిమి ముసలములవంటి బాణములతో దానిని కొట్టి కాలమేఘమువలె నినదించుచూ పడవేసెను. అపుడు ఆకసమున ప్రాణులు ‘హా, హా’ అనుట వినబడినది గద కూడా నిష్పలమైన ఈ బలము వ్యక్తముకాదు - అపుడు హరి అనుచితమైన చోట ప్రార్థన పనికిరానట్లు పనికిరాని గదను చూచి దివ్యరత్నములతో కూడిన దివ్యమైన ముద్గరమును నిమివైపు అమితవేగముతో విడిచెను.
ఆ ముద్గరము వచ్చుచుండగా, గదతో జంభుడు, పట్టిశముతో గ్రసనుడు, శక్తితో మహిషుడు గట్టిగా నాదమును చేయుచూ దానిని నిలువరించిరి. దుర్జనులచేత సుజనుడు నిలువరింపబడినట్లు ముదరము నిరాకరింపబడగా చూచి శ్రీహరి వందగంటలతో ధ్వనించుచున్న ఉగ్రమైన శక్తిని చేపట్టెను. భీషణరణమున దానిని జంభుని పైకి విసిరెను. అది వచ్చుచుండుటను చూచి జంభుడు రథము పై నుండి దూకి కాముకుడు కామినిని పట్టుకొనినట్లు లీలగా దానిని పట్టి దానితోనే గరుడుని తలపై గట్టిగా నవ్వుచూ కొట్టెను. తరువాత మరొక రథమునెక్కి,విల్లును బట్టి ఎదుర్కొనెను. అపుడు శక్తిచే పీడింపబడిన గరుడుడు అచేతనుడాయెను - అపుడు విష్ణువు నవ్వి తన చేతితో గరుడుని తాకి అతనిని సచేతనునిజేసెను. అతనిని తన మాటలతో ఊరడించెను - శక్తియను తన ఆయుధమును, చెడు భార్యగల పురుషుని ఆలోచనవలె నిష్పలమగుటను చూచి శక్తివంతమగు వేరొక వింటిత్రాడును సంధించెను. దానితో ధ్వని చేసి రౌద్రాస్త్రమును విడిచెను - ఆ అస్త్రముయొక్క ప్రభావముచేత ఆకాశము కనిపించకుండెను. భూమి, దిక్కులు అన్నీ బాణ పరంపరతో నిండెను - సేనానియగు గ్రసనుడనే అసురుడు ఆ అస్త్రమాహాత్మ్యమును చూచెను.
వెంటనే అతను అన్ని అస్త్రములను నివారించు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను - దానితో లోకభీకరమైన రౌద్రాస్త్రము శాంతించెను. అది చూచి దానవనాశకుడగు శ్రీహరి అన్నిలోకములకు భయమునుకలిగించు కాలదండాస్త్రమును ప్రయోగించెను. అపుడు పెద్దగాలి వీచసాగెను - భూమి కంపించెను, సముద్రములు విడిపోయెను. ఆ మహోగ్రమగు అస్త్రాన్ని చూచి యుద్ధములో మదించిన దానవులు అనేకరూపములు గల అస్త్రములను సంధించిరి. గ్రసనుడు నారాయణాస్త్రమును, నిమి త్వాషాస్త్రమును జంభుడు ఏపీకాస్త్రమును, దండాస్త్రమును నివారించుటకు ప్రయోగించిరి. కాలదండాస్త్రమును నివారించుటకు వానిని సంధానము చేయులోపలనే కాలదండము క్షణములో కోట్లకొలదిగా దానవుల వధించెను. తరువాత దైత్యుల అస్త్రములచే కాలదండము శాంతించెను. అది చూచి హరి కోపించి మృత్యు, అగ్ని సమానరూపుడై వేలసూర్యుల కాంతి గలది, రెండవ విష్ణుమూర్తి వలె నున్నదియగు చక్రమును చేపట్టి జ్వలించుచున్న దానిని సేనాపతిపై ప్రయోగించెను. బయలువెడలిన ఆ చక్రమును నిలుపుటకు దైత్యవీరులు శక్తులు కారైరి. పూర్వమే సిద్దమైన విధివలె అది బలీయమైయుండెను. ఆలోచించుటకు వీలులేనిదై, కొత్తఅగ్నికీల వలె, ఆ చక్రము ఒక్కమారుగా గ్రసనుని కంఠముపై బడెను. వెంటనే అతని రక్తముతో తన చక్రనాభి ఎరుపెక్కగా మరల విష్ణుమూర్తి చేతిని ఆ చక్రము అలంకరించెను.
ఆ చక్రము యొక్క దెబ్బకు గ్రసనుడు నేల పై బడి మరణించెను - మిగిలిన దైత్యులు దుఃఖమునధికముగా పొందిరి. మరికొందరు భుజములను కోపముగా చరిచిరి. సేనానాయకుడగు గ్రసనుడు మరణించగా దానవులు నియమము తప్పి విష్ణువుతో యుద్దము చేయసాగిరి. పట్టిశములతో, ముసలములతో, ప్రాసలతో, గదలతో, కణపములతో, బాణములతో, చక్రములతో, శక్తి మొదలగు ఆయుధములతో యుద్ధము చేయసాగిరి. జనార్దనుడపుడు అస్త్రజాలమును గురి పెట్టి తీవ్రమగు బాణములతో ఒక్కొక్కదానిని నూరుముక్కలుగా చేసెను. కోట్లకొలదిగా వానిని శ్రీహరి వధించగా, దైత్యులు ఒక్కమారుగా అతనిపై బడిరి. వందలకొలదిగా అసురులు గరుడుని కాళ్ళును పట్టుకొనిరి, కొందరు రెక్కలను, కొందరు ముఖమును పట్టుకొని వేళ్ళాడసాగిరి. గట్టిగా అరుస్తూ దైత్యులు శ్రీహరి విల్లుని, భుజములను, తలను పట్టుకొని వేళ్ళాడసాగిరి. ఆ మహాద్భుతమును చూచి సిద్దులు, చారణులు, వార్తికులు హా హా అని అరుచుచూ ఆకాశము నుండి శ్రీహరిని స్తుతింపసాగిరి. అపుడు శ్రీహరి దైత్యులను, జ్ఞాని సంసారసంభవములైన దోషములను విదిలించి పడవేసినట్లు నేలపై పడవేసెను. తరువాత ఉత్తమమగు నందకమను తనఖడ్గమును ఒరలోనుండితీసి, స్వచ్చమగు ఫలకమును తీసి పాదచారియై వారి వెంట బడెను.
తరువాత శ్రీహరి వేగముగా కదులుచూ దైత్యవిరులననేకులను వధించెను. నిమి మొదలగు అసురవీరులు నినదించి పాదచారియగు కేశవుని వెంటబడిరి. గరుత్మంతుడు త్వరగా రాగా శ్రీహరి అతనినధిరోహించెను. తరువాత ఆ ఘోరయుద్ధమువ గరుడునితో ననేను. ‘నీవు అలిసిపోనిచో మధనునివైపు త్వరగా నడువుము - అలిసినట్లయితే ఒకక్షణము యుద్దమునుండి వైదొలగుము అనగా గరుడుడిట్లనేమ - ‘లోకపాలకా! నాకు శ్రమలేదు. నా సుతులను పోహానముగా తారకుడు చేసుకొనెనన్నది స్మరించిన కొలదీ నేను అలసటనెరుగను’. అని యుద్ధమున మథనుని వైపు వెళ్ళమ. శంఖచక్రగదాధారియగు విష్ణువుని చూచి దైత్యుడు బిండిపాలయను పదునైన ఆయుధములో ఎదపై కొట్టెను. దానిని లెక్కించకనే విష్ణువు పర్వతములను కూడా భేదించు ఐదు బాణములతో కొట్టెను -తరువాత చెనివరకు లాగివిడిచిన పదిబాణములు ఎద పై తగలగా మథనుడు ఒక క్షణము అచేతనుడై మరల నిలువరించుకొని పరియను ఆయుధముతో విష్ణువును తలపై కొట్టెను. ఆ దెబ్బతో కొద్దిగా కదిలిననూ శ్రీహరి కోపముతో కళ్ళుతిప్పుచూ గదను పట్టుకొనెను.
ఆ పరిఘతో మధనుని ఎదపై గట్టిగా కొట్టగా ఆ దైత్యుడు నేలపై బడి, శరీరావయవములు నుగ్గుకాగా మరణించెను. అట్లా దైత్యులు మరణించగా యుద్ధరంగముమన్న దైత్యులందరూ నాశనము నొందిరీ. అమిత మానవంతులగు దానవులట్లు విషాదమునొందుట చూచి దానవేశ్వరుడగు మహిషుడు కళ్ళు ఎర్రబడగా కోపముతో హరినెదుర్కొనెను. తన బాహుబలమునాశ్రయించి మహిషుడు కోపముతో, పదునైన శూలముతో హరిని దెబ్బతీసెను. శక్తితో గరుడుని ఎదపై గట్టిగా కొట్టెను. తరువాత మహాపర్వతగుహవంటి నోరు తెరిచి గరుడునితో శ్రీహరిని మింగివేయదలిచెను. అతను చేయగోరినది తెలుసుకొని శ్రీహరి దివ్యాస్త్రములతో అతని నోటిని నింపివేసెను పర్వతమువంటి మహిషుడపుడు ఆ అస్త్రముల తాకిడికి శరీరములోని సగభాగము దెబ్బతినగా కిందబడి మరణించెను. ఆతనివి మరల బ్రతికించి శ్రీహరి అతనితో విట్లనెన – ‘దానవా! వీపు వా చేతిలో చావుమ పొందరాదు - సాక్షాత్తు బ్రహ్మ ‘స్త్రీచేతిలో వధింపబడవలెను ఏవ’ని ముమపు అనెను. కనుక లెమ్ము విన్న వేమ విడుచుచుంటివి. ఈ మహాయుద్ధముమండి వెంటనే వెళ్ళిపొమ్ము’ అనగా ఆ అసురుడు అక్కడినుండి వెళ్ళిపోయెను.
అట్లా దైత్యుడు వెనుదిరుగగా శుంభుడను దానవుడు కింది పెదవిని కొరుకుచూ, కోపముతో కనుబొమను ముడివేసి చేతులు నలుపుకొనుచూ భీకరమగు ధనస్సును గైకొని వందలకొలది బాణములను సిద్ధము చేసి విష్ణువుపై విడిచెను. చిత్రయుద్దము చేయు శుంభుడు గట్టిపిడికిలి దెబ్బతో తరువాత మండుచున్న అగ్ని శిఖలవంటి బాణములతో విష్ణువుమ, గరుడుని కొట్టెను. వానికి తిరుగులేకుండెను. దైత్యేంద్రుని బాణముల తాకిడికి కదిలిన శ్రీహరి మృత్యువువంటి భుశుండిని గైకొనీ శుంభుని ముఖమును, భుజమూలమును పర్వతమువంటి వానిని నుగుచేసెను. తరువాత మూడు బాణములతో భుజమును, అరవైరెంటితో సూతుని తలను, పదింటితో ధ్వజమును విష్ణువు కొట్టెను, చెవి వరకు లాగివిడిచిన అగ్నివంటివగు బాణములను విష్ణువు విడిచెను. ఆ బాణముల దెబ్బకు శుంభుడు బాధపడి రక్తముకారుచుండగా పడెను - కొద్దిగా ఆతను కదలగా శ్రీహరి ధైర్యముగా అతనితో నిట్లనెను. ‘శుంభుడా! ఆశుభములగు కొద్దిదినములలో నీవు స్త్రీ చేత వధింపబడువాడవు - మూర్ఖుడా! నిన్ను నేను చంపరాదు. తొలగిపొమ్ము! అనగా శుంభుడు వెళ్ళిపోయెను. జంభుడది విష్ణువునోటినుండి విని సింహనాదమువలె గట్టిగా గర్జించెను - అట్టహాసముతో జగత్తును వణికింపచేయుచూ జంభుడు లీలగా దైత్యుల వధించిన శ్రీహరితో విట్లనెను - ‘జలమున వసించు శ్రీహరీ! అల్పపరాక్రమము గల ఈ దైత్యులతో నీకేమి ఫలము? పౌరుషము వున్నచో నమ్న ఎదుర్కొనుము. హిరణ్యాక్షుడు మొదలగు దైత్య ముఖ్యులను నీవు వధించినపుడు జంభుడు లేడు - ఈనాడు నిలిచియున్న నన్ను చూడుము.
శ్రీహరీ! తాలవృక్షమువంటినాఈ భుజములను, వజ్రమువలె కఠినమగు ఎదమ చూడుము. ఇక సుఖముగా దెబ్బతీయుము. అని జంభుడవగా శ్రీహరి క్రోధముతో పెదవుల తడుపుకొమచూ పర్వతములను కూడా భేదించు గొప్ప పరిఘన విడిచిన దానివెంటనే వల్లని ఇమముతో కూడిన ముద్గరమును రెండవ పర్వతమువలెమన్న దానిని విడిచెను. ఆ రెండు ఆయుధములను చూచి జంభుడు వేరొక రథము పైకి దూకి పరిషమ పట్టుకొని దానితో గరుడుని దెబ్బతీసెను. వెంటనే ముద్దరముమ పట్టుకొని గట్టిగా అరుస్తూ బలముగా శ్రీహరి తలపై మోయెను ఆ దెబ్బల వలన శ్రీహరి, గరుడుడు ఇరువురూ పృహతప్పి, మరణించినవారివలె నుండిరి. ఆ మహాద్భుతమును చూచి దైత్యులు గర్జించగా, ఆనందముతో మదించిన వారి గర్జనలను జగత్తు అపుడు సహించలేక పోయెను. దైత్యులపుడు సింహనాదములలో, కరతల ధ్వనులలో, బట్టలన కదిలించుచూ, బాణములను ధ్వనింప జేయుచూ జంభుని సంతోషపెటపాగిరి. శంఖములను పూరించిరి. దేవతలను విసిరికొట్టిరి. ఇక శ్రీహరి గరుడునితో సహా యుద్ధమున స్పృహనొంది జంభుని తట్టుకొనలేక ఆ ఘోరమగు రణమునుండి వెనుదిరిగి వేగముగా పలాయనము చిత్తగించెను.
ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునకౌమారికాఖండమున దైత్యులతో విష్ణువు యుద్ధమును వర్ణించుట యను ఇరవయ్యవ అధ్యాయము.
