స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
17వ అధ్యాయము
నారదుడు చెప్పెసాగెను - అంతట ఆ రెండు సేవల మధ్య యుగాంతమేర్పడగా క్షోభించిన రెండు సముద్రాల మధ్యకలిగినట్లే యుద్దమేర్పడిన అట్లు పరమదారుణమగు యుద్ధము దేవాసురుల మధ్య కలిగేను దేవాసురుల గర్తనలతో, శంఖముల, భేరీ వాద్యముల ధ్వనిలో, తూర్యాదివాద్యముల ధ్వనితో, ఏనుగుల ఘీంకారములతో, గురముల సకిలింతలతో, రథముల ఇరుసులధ్వనితో యుగాంతమేర్పడినట్లుండెను. రోషముతో నిండిన అవయవాలతో, జీవితముపై ఆశను వదలి దేవదానవులు జ్వలిస్తూ ఒకరి నొకరు తలపడిరి. రథములు రథములలో, ఏనుగులు ఏనుగులతో, పదాతులు పదాతులతో, గుర్రములు గుర్రములతో తలబడినవి. అంతట ప్రాస, అశని, గద, భిడిపాల, పరశ్వథ, శక్తి, పట్టశ, శూల, ముద్గర, కణయ, గుడ, చక్ర, తామర, అంకుశ, కర్లిన నాలిక, నారాచ, పత్పదంత, ఆర్థచంద్రకములను ఆయుధములలో అద్భుతమైన వృష్ణులచేతనూ ఆకాశము కూడుకొని యుండెను.
దిక్కులనన్నింటినీ కమ్ముకొనియుండుట చేత ఆకాశము చీకటితో నిండి నట్లుండిన - అట్లు చీకటి దట్టముగా కమ్ముకునియున్నందున ఒకరినొకరు తెలుసుకొనలేకుండిరి. చీకటిలో కనబడకయుండి దేవదానవులు ఒకరినొకరు నరుకుకొనిరి - ఆంతట తగిన భుజములలో, నేలరాలిన ధ్వజములలో, ఛత్రములతో, కుండలములతోని శిరస్సులతో, ఏనుగులలో, గుర్రములతో, పదాతులతో, ఆకాశమునుండి నేలకూలిన ఏవితో భూమి పంకజములతో వ్యాపింపబడినట్లుగాయుండెను. దంతములు విరిగి, కుంభస్థలములు పగిలి, తొండములు నలిగి పర్వతముల వంటి ఏనుగులు రక్తము నోడ్చుచూ భూమిపై పడెను. ఇరుపులు విరిగి, చక్రములువిరిగి ముక్కలు ముక్కలై రథములు కూలిపోయెను - కోట్లకొలదిగా పదాతి దళములు, వేలకొలదిగా గుర్రములు నేలకూలెను. అంతట రాక్షసులకు ఆనందము కలిగించునవి, వైతాళులకు సంతోషమునిచ్చునవి యగు రక్తప్రవాహాలు వదులవలె వేలకొలదిగా ప్రవహించసాగెను. ఈ విధంగా మన్నయుద్దమందు,శత్రువులను వధించువాడు, సేనానియగు గ్రసనుడు గొప్ప బాణవర్షమును కురిపింపజేయుచూ దేవతల సైన్యమును కంపింపచేసెను.
అంతట గ్రసనుని చూచిడుముడు క్రోధముతో ఒడలు మరిచి, విశేషముగా అగ్నివలె జ్వలించు బాణములను వర్షింపజేసెను. అతి పరాక్రమవంతుడగు గ్రసమడు యముని బాణములచే గొట్టబడి, ప్రతీకారముమ తీర్చుకొనగోరి భీకరమగు ధమవుమ వంచి వేలకొలదిగా, లక్షలకొలదిగా యమునిపై బాణములను విడిచి పీడించేను - గ్రసమడు వేసిన బాణములను యముడు కూడా అడ్డగించి, ఉగ్రమగు బాణములమ వర్షింపజేయుచూ గ్రసమని బాధించేను - దానవరాజగు గ్రసమడు యముడు వేయగా తనను సమీపించుచున్న బాణముల వరుసను, బాణములమ వర్షింపజేపి చెదరగొట్టెను. తన బాణముల పరంపర విఫలమగుటమ చూచి యముడు వెలుగుచున్న ముద్గరమమ ఆయుధమున గపమని రథముసైకి విసిరెను. శత్రువులను వధించు గ్రసమడు తవసైకి వచ్చుచున్న ముద్గరమును చూచి తన గొప్ప రథమునుండి పైకిగిరీ దానిని ఎడమచేతితో పట్టుకొను వెంటనే అదే ముధరముతో గ్రసమడు కోపంగా యముని మహిషమును కొట్టెను - ఆది వెంటనే నేలకూలేను. అపుడు యముడు పడబోవుచున్న మహిషమునుండి పైకెగిరి ప్రాసయను ఆయుధముతో గ్రసనుని ముఖముపై కొట్టెను - ఆ దెబ్బతో గ్రసమడు మూర్ఛనొంది నేలపై బడెను.
గ్రసనుడు నేలకూలుటమ చూచి పరాక్రమవంతుడగు ‘జంభుడ’ ను దైత్యుడు బిండిపాలమను ఆయుధముతో యముని ఎద పైగొట్టెను. ఆ దెబ్బతో యముడు నోటినుండి రక్తము కారుచుండగా తీవ్రమైన దెబ్బ తాళలేక మూర్ఛనొందిన యముడు సొమ్మసిల్లుటమ చూచి కుబేరుడు గదమ చేత బూని, వేలకొలదిగాయకులుచుటు నిలిచియుండగా, కోపముతో జంభునీ ఎదుర్కొనైన దానవసేన మధ్య మండిన జంభుడు, కోపముతో తవ నెదుర్కొవవచ్చుచున్న కుబేరుని, స్నేహితుని పలుకుని గ్రహించినట్లు గ్రహించేను. గ్రసనడు తేరుకొని యముని పైకి గదను విడిచెను - బంగారముతో, మణులతో చేయబడిన ఆ బరువైన గదమ, పరీమను నాశనము చేయుదావిని తవాపైకి వచ్చుచుండగా చూచి యముడు దానిని దెబ్బతీయుటకై లోకములను జ్వలింపజేయువా యన్నట్లు భీకరముగా మన్న దండముమ కోపముగా గ్రహమడి సైకి వదిలిను జ్వాలలమ వెదజల్లుచూఆ దండము ఆకాశముననే గదమ తొకి పర్వతమువలేమన్న ఆ గదతో రాపిడి పొందిను. అపుడు ఆరెండింటికి రెండు పర్వతముల మధ్యకలిగినట్లు రాపిడి ఏర్పడెను - అంత అన్ని దిక్కులు ఆ రాపిడికి, మెరుపులకు స్థబ్దమాయెను. ప్రళయము వచ్చివదాయన్న శంకతో జగత్తు ఆందోళన నొందెను - కాని ఒక క్షణములోనే ఆ ద్వని, ఉల్కలవలె మన్న మెరుపులు సమసిపోయేను.
అట్లు గ్రసనునికి, యమునికి మధ్య భయంకర యుద్ధమగుచూ ఆకాశమున కనపడెను. అపుడు యముని దండము, గ్రసనుని దెబ్బతీసి, పూర్వము సంపాదించిన విధి, పౌరుషాన్ని దెబ్బతీసి మీదపడునట్లు, గ్రసనుని తలపై పడెను. ఆ దెబ్బతో గ్రసనుడు కళ్ళు బైర్లు కమ్ముకోగా, స్పృహకోల్పోయి, నేలపై బడి ధూళి కణములతో అలంకరింపబడెను. అపుడు ఇరుసేనలలో హాహారమేర్పడిను. ఇంతలో గ్రసనుడు ఒకక్షణములో సుహనొంది తన శరీరము ధ్వంసమొందుటను, ఆభరణములు, వస్త్రములు చెదిరిపోవుటను చూచెను. దీనికి ప్రతిక్రియ చేయవలేనని అతడు తలచెను - నాదేమి పౌరుషము? నేను ప్రభువు ముందు నడచువానినెట్లగుదుమ? సేనలన్నీ నన్నాశ్రయించివున్నవి. నేను ఓడినచో, సేనలన్నీ ఓడినట్లే - ఎప్పుడూ గౌరవము నొందని వాడు సుఖముగా, ఆనందిస్తూ వుండగలడు కాని, గౌరవము నొందినవాడు ఎప్పుడైనా అశక్తుడైనా వానికి ఈ లోకములేదు, పరలోకమూలేదు - అని విచారించి మహాబలుడగు గ్రసనుడు వేగముగా పైకిలేచెను. ఘోరమగు సంకల్పమగు గ్రసనుడు పెదవులను కోపముగా కొరుకుచూ, పర్వతమువంటిది, కాలదండము వంటిదీయగు ముద్గరము చేతబూనెను. రథముపై త్వరగా రణప్రదేశమును చేరి, యముని సమీపించి తనముద్గరమును తిప్పి కోపముతో యముని తలపై వేగముగా కొట్టెను.
వెలుగుచూ మీదపడుచున్న ముద్గరమును చూచి యముడు కళ్ళు తిరిగిన వాడాయెను. మహాబలుడు యముడు, ఎదుర్కొనలేని ఆ ముద్గరమును వంచించి వైదొలిగెను. అపుడు భయంకర కర్మలనాచరించి యమకింకరులు వేలకొలదిగా హతులైరి. దీనిని చూచి వేలకొలదిగా కింకరులు గ్రసనుని వెంటబడిరి. ఆ పెద్ద కింకరసేనను చూచి గ్రసనుడు వేలకొలది యములే వచ్చిరా యనుకొనెను. అట్టి బలము, రూపము గలది ఆ సేన! ఆ సేన గ్రసనుని సమీపించి బాణవర్షమును కురిపించెను. అపుడు వారి మధ్య యుద్ధము కల్పాంతమున జరుగు మహోపద్రవము వలె నుండెను- కింకరులలో కొందరు. మోసముతో గ్రసనుని కొట్టగా, కొందరు నేరుగా వచ్చు బాణములచే కొట్టిరి. మరి కొందరు గదతో దెబ్బతీయగా కొందరు ముద్గరములతో కొట్టిరి. కొందరు ప్రాసప్రహారములతో దెబ్బతీయగా మరికొందరు కోపముతో దెబ్బతీసిరి. కొందరు యమకింకరులు గ్రసనుని భుజములను పట్టుకొని వేలాడసాగిరి- కొందరు రాళ్ళతో కొడుతుండగా కొందరు పెద్ద చెట్లతో కొట్టసాగిరి. కొందరు అతనిని పదునైన పళ్ళతో కొరికిరి. కొందరు పిడికిళ్ళతో వీపుపై కొట్టసాగిరి.
ఇట్లు వారు వెంటబడగా గ్రసనుడు కోపముతో ఒడలుమరిచి శరీరమును భూమిపై తాటించి అనేక రీతుల యమకింకరులమ బాధించెను. కొందరిని పైకెత్తి చంపెను. కొందరిని చేతులతో, కొందరిని కాళ్ళతో చంపెను. పరుగెత్తి కొందరిని దెబ్బతీసెను. ఒక్క క్షణములో వారిని యమలోకమునకు పంపెను. అర్జునా! కింకరులతో యుద్ధమున గ్రుమడు హవనముతో అగ్నివలె వర్ధిల్లెను. అట్లు విశ్రాంతి లేకుండా పోరాడు గ్రసనుని, ఆలసిన మరణించిన తనవారిని చూచి యముడు దండమునెత్తి మహిషముపై వచ్చెను. అట్లు వచ్చుచున్న అతనిని గ్రసనుడు గదతో ఎదపై దెబ్బతీసెను. దానిని లెక్కించక శత్రునాశకుడగు యముడు గ్రసనునీ రథముయొక్క వాహనములను వ్యాసములను దండముతో కొట్టి చంపేను. ఆంత గ్రసనుడు రథముపై నుండి క్రిందపడి క్షణములో లేచి దర్పముతో తనను చూచుకొని వాయువేగములో ఒక్కమారుగా యముని రథమువైపుకు వెళ్ళెను. పాదచారునిగా వెళ్ళి యముని రథమెక్కి గ్రసనుడు యమునితో బాహుయుద్ధము చేయనారంభించెను. యముడు కూడా శస్త్రములను విడిచి బాహుయుద్ధమును చేయనారంభించి గ్రసనుని కటివస్త్రమును గట్టిగా పట్టుకొని, సంభ్రమముతో నున్న గ్రసనుని గిరగిర తిప్పసాగెను.
తరువాత అతనిని విడిచి యముడు కష్టంగా అతని కంఠమును పట్టుకొని చేతులతో తిప్పనారంభించెను. గ్రసనుడు చివరకు విడిపించుకొనెను. వారిద్దరు నిర్దయగా ఒకరినొకరు పిడికిళ్ళతో కొట్టుకొనిరి. దైత్యేంద్రుని శక్తి ఎక్కువగా వున్నందున యముడు మిక్కిలి అలసట నొందెను. దైత్యుని ముఖమును చంకలోనుంచుకొని క్షణకాలము విశ్రాంతి నొందగోరగా గమనించిన దైత్యుడు అలసటగొనిన యముని లాగి నేలపై బడవేసి కాలిమడమలతో చేతులతో దెబ్బతీయసాగెను. అందువలన యముని ముఖమునుండి అధికముగా రక్తము స్రవించెను. అపుడు యముడు చనిపోయెనని తలిచి దైత్యుడు జయమునొంది, గర్వముగా నాదము చేసి దేవతలను భయపెట్టెను. తరువాత తన సైన్యమును చేరి నిశ్చలమగు పర్వతము వలె నిలిచెను. యుద్ధమున గ్రసనడట్లు వినదించగా, యముడు భూమి సైబడి కాంతిహీనుడు కాగా, మహాయుధములచేత దెబ్బతినిన దేవతలు వణికిపోయి దిక్కులు పట్టిరి.
ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున తారకసైన్య-దేవసైన్యముల మధ్య యమునికి- గ్రసనునికి జరిగిన యుద్ధము యొక్క వర్ణనమను పదిహేడవ అధ్యాయము.
