స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

25వ అధ్యాయము

అర్జునుడు నారదుని ఇట్లడిగెను - దేవర్షి! అమృతముతో కలిసి పుట్టినట్లున్న ఈ కథను వర్ణించుచుంటివి - భగవంతుడగు మహేశ్వరుడు తన భార్యయగు సతిని, వధించుటకు తారకుని ఎప్పుడు తెలుసుకొనునో చెప్పుము. సతీ విరహముతో తపించుచున్న శంకరుడు మన్మథుని దహించెనా? సతీవిరహము వలన మహేశ్వరుడు ఆమెను కలియగోరి హిమాద్రిపై తపము నాచరించుచుండెనని నీవే చెప్పితివి'. అని అడుగగా నారదుడిట్లు చెప్పసాగెను - 'అర్జునా! పూర్వము శివుడట్లు చేయగోరెననుట సత్యమే - కానీ పాపరహితుడా! తపించకనే యోగము చేయరాదు. తపస్సులేనిదే దేహము ఏవిధముగా నైననూ శుద్దము కాదు. శుద్ధము కాని దేహముతో సంయోగము చేయరాదు. గొప్ప కార్యములన్నింటికీ మూలము ఎప్పటికైనా తపస్సే - తపించని వారి మహత్కార్యములెప్పటికీ సిద్దించవు. ఈ కారణము చేత పరమశివుడు దర్శించిన మన్మథుని దహించెను - తరువాత శివుడు సిగ్గును పొందిన పార్వతిని విడిచి తన గణముతో సహా కైలాసమును చేరేను. ఇక పార్వతి కలతను పొంది, అడుగడుగున తొట్రుపడుచూ తన జీవితమును బాగా నిందించుచూ ఇటు నటు పరిభ్రమించెను - ఇక హిమవంతుడు తన శిఖరముపై రోదించుచున్న రతీదేవిని చూచి ఇట్లడిగెను.

'అమ్మా! నీవెవరు? ఎవరికి చెందినదానవు? ఎందుకీ విధంగా ఏడ్చుచున్నావు?” అని హిమవంతుడడుగగా రతీదేవి జరిగిన దానినంతా నివేదించెను. ఆపుడు హిమవంతుడు సంభ్రమముతో కూతురు వద్దకు వెళ్ళి ఆమెను చేతులలో పట్టుకొని తన పురమునకు తీసుకొని పోయెను. అక్కడ తల్లిదండ్రులడుగగా పార్వతి తన సఖుల ద్వారా ఇట్లు చెప్పించెను - 'ఈ అభాగ్యమగు శరీరముతో నేమి? దేహమనెడి నివాసమునైనా వదిలెదను కోరుకున్న పతినైనా పొందెదను - కోరినది అసాధ్యమైనప్పుడు తపస్సు తప్ప వేరొక సాధనమేమున్నది? కనుక వివిధ నియమములతో ఈ కళేవరమును శుష్కింపజేసెదను - మీకు నాపై దయయున్నచో అనుజ్ఞ నివ్వండి'. అనగా ఆమె మాటను విని తల్లిదండ్రులు, ఉమా, (ఆమ్మా! వద్దు) అని పిలిచి ఇట్లనిరి - 'చాపల్యముగల పుత్రికా! తపస్సు వద్దు - క్లేశమే తనరూపముగా గల తపస్సును సహించుటకు నీ శరీరము సమర్థముకాదు. కలుగబోవునవి ఎప్పుడూ అనివార్యములే నరుడు కోరకపోయిననూ కలుగబోవునవి కలుగును - కనుక అమ్మా! పార్వతీ! నీకు తపస్సు వలన ఏమీ ప్రయోజనము లేదు.

అని తల్లిదండ్రులనగా పార్వతీదేవి ఇట్లు బదులిచ్చెను - 'మీరన్నది తగినదికాదని నా అభిప్రాయము - కేవలము దైవము చేత ఏ ప్రయోజనమునైనా పొందుట శక్యముకాదు. పురుషుడు దైవము ద్వారా కొంత, పట్టుదల ద్వారా కొంత, ప్రకృతి ద్వారా కొంత ఫలమును పొందును - ఇందు నాలుగవ కారణము లేనే లేదు. తపోబలము చేత బ్రహ్మ కూడా బ్రహ్మత్వమును పొందెను కదా! ఇతరులు కూడా దేనిని పొందిరో దానిని లెక్కబెట్టి చెప్పుటకు నాకు ఉత్సాహము లేదు. అస్థిరమైన శరీరముచేత తనుకోరినదానిని పొందని మూర్ఖుడు ఆ శరీరము పడిపోయిన తరువాత శోకించును. ఎందుకనగా, ఒకప్పుడు జన్మించుట, ఒకప్పుడు మరణించుట, ఒకప్పుడు గర్భములో నుండగానే మరణించుట, ఒకప్పుడు జన్మించగానే మరణించుట అనునవి శరీర ధర్మములు. బాల్యముననో, యవ్వనముననో, వృద్దాప్యముననో దేహము నశించును. అట్టి చంచలదేహముతో స్వార్థముదప్ప వేరేమి ప్రయోజనము గలదు?' అని పలికి పార్వతి తల్లిదండ్రులు కన్నీటితో చూచుచుండగా తన సఖులతో కలిపి అనేకాశ్చర్యములుగల హిమవత్పర శిఖరమును చేరెను. అక్కడ తన దివ్యవస్త్రములను, ఆభరణములను విడిచి, నారచీరలను.ధరించి పార్వతి నియమముగా తపమును చేయసాగెను. అర్జునా! ఈశ్వరుని మనసులో నిలుపుకొని, ప్రణవమునభ్యసించుటయందు ఆదరముగలిగి తపమాచరించుచున్న పార్వతి మునులకు కూడా పూజ్యురాలాయెను.

దినమునకు మూడు పర్యాయములు స్నానము చేయుచూ, కేవల పాటలపత్రములను తినుచూ వంద సంవత్సరములు తపస్సు చేసెను - అటు తరువాత నేలరాలిన బిల్వపత్రములను దినుచూ ఒక వంద సంవత్సరములు తపస్సు చేసెను. నీటిని త్రాగుచూ వందసంవత్సరములు, గాలిని పీల్చుచూ ఒక వంద సంవత్సరములు తపమాచరించెను - అటు తరువాత నీయమముగా కాలివేలిపై నిలిచి తపమాచరించెను   ఆమె నిరాహారియై తపస్సును చేయుట వలన జనులు తపింపసాగిరి - పార్వతి తన తపస్సుచే జగత్తును జయించుట చూచి శివుడు బ్రహ్మచారి రూపమున అక్కడకు వచ్చెను  అజినమును ధరించి, చేతిలో ఆషాఢదండముతో చూచుటకు మంచి లక్షణములు గలిగి ఆ బ్రహ్మచారి పార్వతి తపోవనమును చేరెను. అపుడు పార్వతి చెలికత్తెలు బ్రహ్మచారిని పూజించిరి - పార్వతితో మాటలాడగోరిన బ్రహ్మచారితో ఆ చెలికత్తెలెట్లనిరి - బ్రాహ్మణా! ఈ కల్యాణి నియమమును గ్రహించినది. ఇంకొక ఐదు నిముషములలో నియమము ముగియును - ఆంతవరకు వేచిచూడుము - అటుపై ఆమెతో నీవు నానావిధములగు ధర్మచర్చలను చేయగలవు (చేయవచ్చు)' అని పలికి విజయ మొదలగు చెలికత్తెలు ఆ బ్రహ్మచారి ముందు పార్వతి చరిత్రను కన్నీటితో వర్ణించుచూ కాలమును గడిపిరి. నియమము ముగించుటకు, కొంత కాలము మిగిలియుండగానే బ్రహ్మచారి పరిసరములను చూచెదను మీషతో ఆశ్రమ సమీపముననున్న నీటిమడుగు వద్దకు చేరి దానిలో పడి గట్టిగా అరవసాగెను.

'నేనిందులో మునిగిపోతున్నాను - ఎవరైనా నన్ను లేవనెత్తండి' అని గట్టిగా బ్రహ్మచారి అరుచుచుండగా విని విజయ మొదలగు చెలికత్తెలు త్వరగా అక్కడికి వచ్చి అతనిని పైకి తీయుటకు తమ చేతిని చాచిరి. కాని బ్రహ్మచారి దూరముగా నుండి మరల మరల గట్టిగా అరవసాగెను. 'మరణించుటకైనా సిద్దమే గానీ అసంసిద్ధురాలిని ముట్టుకొననెమ - ఇది నిజము అని అతననుచుండగా, తన నియమము పూర్తికాగా పార్వతి స్వయముగా అక్కడికి వచ్చెను. స్వయముగా తన చేతినివ్వగా బ్రహ్మచారి అంగీకరించలేదు - 'కల్యాణీ! శుద్ధము కానిదానిని, అవమానముతో దోషముతో చేసినదానిని గ్రహించరాదు - నీ ఈ ఎడమచెయ్యి ఆశుద్దము కనుక నేను అవలంబించను  అనగా పార్వతి అతనితో నిట్లనెను - దేవదేవునికై ఏర్పరచబడిన ఈ కుడిచేతిని వేరే ఎవరికీ నేనివ్వలేను. ఈశ్వరుడే నా ఈ కుడిచేతిని పట్టుకొనువాడు నా మహోగ్రతపస్సుచేత శివుడు కదిలిపోవును. ఇది నిజము' అనెను అపుడు విప్రుడు 'నీ గర్వమట్టిదైనచో గమనమునేవరాపగలరు? వీ ప్రతిజ్ఞ ఎట్లు అచలమో నా ప్రతిజ్ఞ కూడా అచలమే రుద్రునికి కూడా మేము పూజ్యులము - మరణించుచున్న విప్రుని, విషమస్థితిలో నున్న వానిను పేక్షించుచున్న నీ తపమెట్టిదో చెప్పుము. విప్రులను అవమానించుచున్నావు కనుక కనబడకుండా వెళ్ళిపొమ్ము. విప్రులు పూజ్యులని నీవు భావించుచున్నచో నన్నీ మడుగు నుండి పైకి లేపుము.

అటు తరువాత పార్వతి పెక్కువిధముల ఆలోచించి, అన్ని ధర్మముల కంటే విప్రుని పైకి తీయుటయే అధికమని భావించెను. వెంటనే ఆమె తన కుడిచేతినిచ్చి బ్రహ్మచారిని నీటిమడుగు నుండి బయటకు లాగెను - సంసారసాగరమున మునుగుచున్న పురుషుని స్త్రీ ఉద్దరించునని చూపుటకే శివుడట్లు చేసెను. శివుని పైకి లాగి పార్వతి మరల స్నానము చేసి యోగాసనమున కూర్చొనగా బ్రహ్మచారి నవ్వుచూ ఆమెతో నిట్లనెను - 'కల్యాణీ! ధృఢముగా యోగాసనమున కూర్చుండి నీవు ఏమి చేయబోవుచున్నావు?” అనగా పార్వతి 'యోగాగ్నితో ఈ శరీరమును జ్వలింపజేసెదను - మహాదేవుని యందు మనసుగల నేను ఉచ్చిష్టురాలనైతిని అనగా బ్రహ్మచారి ఇట్లనెను - 'పార్వతీ! బ్రాహ్మణుడిని గనుక నాలో కొంత ముచ్చటించి తరువాత నీకిష్టమైనట్లు చేయుము. సాధువులగువారు విప్రులకోరికను దెబ్బతీయరాదు - ఇది ధర్మమనుకొనినచో ఒక క్షణము చెప్పుము'. అనగా అపుడు పార్వతి ఒక క్షణము నిలిచెద చెప్పుమనెను - అపుడు బ్రహ్మచారి స్వయముగా చెలికత్తెలతోనున్న పార్వతితో ఇట్లు సంభాషించసాగెను. సుందరీ! యవ్వనమున నీవీ కఠినమగు తపస్సు నారంభించితివెందులకు? ఇది సరైనదిగా నాకు తోచుటలేదు.

దుర్లభమగు మనుష్యజన్మను పొంది, ఇపుడు పర్వతరాజు గృహమున దుర్లభమైన భోగములను విడనాడి నీవెందుకు శరీరమును కష్టపెట్టుచున్నావు? సుకుమారమగు నీ శరీరము తపస్సుచేత కష్టపడుటను చూచి మంచులే వడలిన పద్మమును చూచినట్లు బాధపడుచుంటిని. ఇక నీ నిర్ణయము నాకు శిరోవేదనను కలిగించుచున్నది. శరీరమును వదిలివేయదలిచితివి నీవు ఆలోచించలేదా బాలికా?  మనుష్యులలో కామము దుర్మార్గుడనుట సత్యమే ఎందుకనగా నీవు అందరికీ పూజ్యురాలపై కూడా శరీరమును పీడించుచుంటివి. ఇక శివుడంటే తెలియదా? అతనీ వంశమేమిటో తెలియదు, దిగంబరుడు, శూలమును చేతబట్టి భూతగణముల నాయకుడై యుండును - శ్మశానమతని నివాసము భస్మమతని ఆభరణము, వృషభము వాహనము  గజచర్మమును ధరించి, పాములనే ఆభరణములుగా చేసుకొన్న జటిలుడతను. ఎగుడుదిగుడు కన్నులవాడు - అట్టి నిర్గుణుడైన శివుడు నీకు తగిన వాడెట్లగును? పండితులు చెప్పు వరుని గుణములగు కులము, శీలము మున్నగువానిలో ఒక్కటైనా లేదు కనుక నీకు తగినవాడుకాడు. పార్వతీ! పూర్వము శివుని సంగమమును కోరి వెన్నెల శోచనీయురాలైనది ఇక ఇప్పుడు నీవు రెండవదానివి తపోధనులమగు మేము అన్నింటినీ సమముగా చూచువారమే కానీ యజ్ఞస్తంభమునకు చేయు క్రియను శూలమునకు చేయుట బాధించునట్లు నీ ఈ ప్రయత్నము మమ్ము బాధించుచున్నది ఎద్దునెక్కుట, శ్మశానములో నివసించుట ఎట్లు చేయగలవు? పట్టు చర్మమును ధరించిన ఈ చేతితో పాములను ధరించిన శివుని చేతినెట్లు పట్టుకోగలవు?

 నీవిపుడారంభించిన ఈ తపస్సు యుక్తమైనది కాదు - జనులచేత ఎగతాళి చేయబడునది - స్త్రీవైయుండి ఐశ్వర్యమును పొందుటను నీవెట్లు కోరుచుంటివి? కనుక అందరికీ విరుద్ధమగు ఈ ప్రయత్నమునుండి బుద్ధిని మరలింపుము - ఓ సుందరీ! మదనుని శత్రువగు మర్కటాక్షుని (శివుని) కోరుటనుండి మనసుని మరలింపుము'. అని ఆ బ్రహ్మచారి విరుద్దమును పలుకుట విని కోపించిన పార్వతీ దేవి గద్దదస్వరముతో నిట్లు బదులుచెప్పెను. బ్రాహ్మణా! శంకరుని పట్ల విరుద్దమును పలుకకుము - దేవదేవుని నిందించుట చేత మానవుడు గొప్ప తమస్సును పొందును. నీవాదేవుని క్రియలను సరిగా తెలియజోలవు - కనుక ఆ పాపమునుండి ముక్తుడవగునట్లు దేవదేవుని గూర్చి వినుము. అన్ని జగత్తులకు పరమశివుడు కారణమైనందుచే అతని వంశమునెవడెజుగును? జగత్తంతా అతనీ రూపము కనుక ఆతనిని దీగంబరుడని యందురు. మూడు గుణములను శూలమును పట్టుటచే అతను శూలియనబడును - బంధము లేనివారు ముక్తులగుదురుకాన అట్టి భూతములకు పతి 'భూతపతి' యనబడును. శ్మశానమనగా సంసారమే - దయతో అర్థిజమలకై. దానినాశ్రయించును - ఈ చెప్పిన విభూతులను కలిగియున్నందుచే భూతిభృత్రనబడును. వృషమనగా ధర్మము దానినధిరోహించినందుచే శివుడు 'వృషీ' యనబడును - సర్వములనగా క్రోధముమున్నగునవి వాటిని భరించు జగన్మయుడు శివుడే. వానావిధములైన కర్మయోగములను జటారూపమున ధరించును కనుక. జటీయనబడును . అతని మూడు కన్నులు మూడు వేదములు - మూడుగుణాల శరీరమే త్రిపురము.

 ఆ త్రిగుణాత్మక శరీరమును భస్మముగా చేయును గాన శివుడు త్రిపురాంతకుడనబడెను - సూక్ష్మమగు బుద్దిగలవారు మహేశ్వరుడిట్టివాడని తెలియుదురు . ఇతరులు హరుని పూజించకుండుట ఎట్లు? అయిననూ, జనులందరూ సంసారమునుండి భీతినొంది విమర్శించి పనులు చేయుదురు - నేనిపుడు విమర్శించి ఈ పనిని చేసితిని. శుభమో, అశుభమో కానీ నీవూ ఈ శివుని బాగా పూజించుము'. అని పలికి పార్వతి ఆ బ్రహ్మచారి పెదవిని కదల్చుటను చూచి తన సఖితో ఈ బ్రహ్మచారి ఏదో చెప్పదలిచాడు - ఇతనిని వారించండి. ఈ విప్రుడు గొప్పవారీని తూలవాడుతూ మాటలాడువాడు. గొప్పవారిని నిందించేవాడే గాక ఆనిందను వినేవాడూ పాపమును పొందును. అయిననూ, బ్రాహ్మణులతో వాదించి మనకేమి ప్రయోజనము? ఆ బ్రహ్మచారి ఎలాగైనా నుండనీ మనము చెవులను మూసుకొని వెళ్ళిపోవుదము'. అని పలికి లేచి చెవులను మూసుకొని వెళ్ళిపోవుచుండగా బ్రహ్మచారీ రూపుని వీడి శంకరుడు స్వరూపములో ఆమె వస్త్రమును పట్టుకొనెను. అంత శివుని చూచిన పార్వతీ సంభ్రమముతో సాగిలపడి, తలవంచి ఆతనిని స్తుతించెను. అపుడు మహాదేవుడు పార్వతితో 'కల్యాణీ! నేను తపోద్రవ్యముచే కొనబడిన దాసుడను నీవు కోరినదానిని ఆదేశించుము.

అంతట పార్వతీదేవి ఇట్లనెను - 'శివా! నీవు మనస్సుకు ప్రభువువు. దానిని నీకు ఇచ్చివేసితిని - ఇక ఈ శరీరానికి ప్రభువులు నాతల్లిదండ్రులు - వారిని నీవు ఇమ్మానింపజేయదగును'. అనగా మహాదేవుడిట్లనెను - 'పార్వతీ! నీవు అందముగా నుండుటను చూచి నీ తండ్రి స్వయంవరముననే నిన్నిచ్చేదని ప్రతిజ్ఞచేసెను. అదట్లే యగుగాక! వీపు వెళ్ళి నీ తండ్రియగు హిమవంతుని స్వయంవరానికై ప్రేరేపించుము. అటు తరువాత నేను నిన్ను వరింతును'. అని పలికి పవిత్రుడై పవిత్రులయందు నివసించు హరుడు తనకిష్టమైన దేశమునకు వెళ్ళగా పార్వతి తన పురమునకు వెళ్ళాను. పార్వతిని చూచి మేనతో సహా హిమవంతుడు సంతోషించెను. కౌగలించుకొని, మర్కొని అడుగగా పార్వతి జరిగినదంతా నివేదించెను - దేవదేవుడాజ్ఞాపించిన పార్వతీ స్వయంవరమును హిమవంతుడు అంతటా ప్రకటింపజేసెను. అశ్వినులు, ద్వాదశాదిత్యులు, గంధర్వులు, గరుడులు, సర్పములు, యక్షులు, సిద్దులు, సాధ్యులు, దైత్యులు, కింపురుషులు, పర్వతములు, సముద్రములు మొదలగువారు ముల్లోకములలో శ్రేష్ఠులైన వారచటికి చేరిరి - ముప్పది మూడువేలు, ముప్పది మూడువందలు, ముప్పది కోట్లుగా వారంతా పార్వతి స్వయంవరమునకు వచ్చిరి - ఆహూతుడైన విష్ణువు మేరువుతో నవ్వుతూ ఇట్లనెను.

నాయనా! మేరూ! పార్వతి మనకూ దేవియే. నీవు వెళ్ళుమూ - నేనామెకు నమస్కరించెదను' - అంతట పార్వతి అందమైన బంగారు విమానము నెక్కెను - ఆ విమానము అన్ని వైపుల రక్షణతో, అనేక అలంకారాలను కలిగి, అనేక రత్నములతో, ఆభరణములతో అలంకరింపబడి యుండెను - నర్తించు అప్పరసలతో, గంధర్వులతో, కిన్నరులతో, వందిజనులచే స్తుతింపబడుచూ వీరకాంస్యపాత్రతో నుండెను. తెల్లని ఛత్రముల రత్నములతో కలిసియుండెను - శాలినియను పేరుగల పార్వతి చెలికత్తె అందమైన ముఖము గలిగి చామరములను ధరించిన స్త్రీలతో గూడి చేతిలో కల్పవృక్షము యొక్క పూలతో అల్లిన మాలను ధరించి నిలిచెను. ఆమె ఆట్లు నిలిచియుండగా, లోకత్రయమంతా నిలిచియుండగా వృషభధ్వజుడగు శివుడు శిశువై ఒడిలో దాచుకొనియుండెను - 'జయ యను ప్రసిద్ధ పదమును నిజము చేయుటకు ఈశ్వరుడట్లు శిశువగుటను చూచి ఒడిలో నున్న శిశువుతో ఎవరితను ఇక్కడ' యని పలికి మిగుల ఆక్రోశించిరి. ఇంద్రుడు తన వజ్రాయుధమును బట్టి చెయ్యెత్తగా ఆ చేయి అట్లే నిలిచెను. ఆ చెయ్యి శిశురూపమున నున్న మహాదేవుని లీలచే స్తంభించెను.

 వజ్రాయుధమును ప్రయోగించుటకుగాని, చేతిని కదుపుటకు గాని శక్తుడు కాజాలకపోయెను. శక్తియను తన ఆయుధమును ప్రయోగించుటకు పైకి లేచిన వహ్ని ప్రయోగించలేకపోయెను - యముడు దండమును, నిర్ఋతి ఖడ్గమును, వరుణుడు పాశమును, వాయువు ధ్వజస్తంభమును, చంద్రుడు గుడమను ఆయుధమును, కుబేరుడు గదను ప్రయోగించలేకపోయిరి. ఆదిత్యులు సోనావిధములుగా ఆయుధములను, వసుదేవతలు ముసలమును, తారకాదీ దానవులు ఆయా ఘోరమైన అస్త్రములను ప్రయోగించలేకపోయిరి. భువనములలో నున్న వారెల్లా స్తంభించిపోయిరి - పూష (సూర్యుడు) పళ్ళుకొరుకుతూ మోహితుడై (మూడుడై) బాలకుని చూడసాగెను. శంకరుడతని చూచినంతనే పూష పళ్ళు నేలరాలెను - భగుడనువాడు కళ్ళను పెద్దవిచేసి బెదిరించెను. వారందరి బలాన్ని, తేజస్సును, యోగములను శంభుడు లాగివేసెను - అట్లు దేవతలందరూ కోపముతో నుండగా బ్రహ్మ ధ్యానము నాశ్రయించి హరుడు చేసిన దానిని తెలుసుకొనెను - వెంటనే శివుని చేరి వినయముగా స్తుతించెను. పురాణనామములతో, సామసంగీతముతో, వేదములలోని రహస్యనామములతో హరునిట్లుస్తుతించెను   మహాదేవ! మహాదేవీ! మీకు నమస్కారము. నా ప్రసాదము చేత బుద్ధి మొదలగు జగత్ ప్రవర్తించును - మూడులైన దేవతలారా! శంకరుని తెలియలేకుంటిరి - అందరు దేవతలచే నమస్కరింపబడి ఇక్కడకు వచ్చుచున్న మహదేవుని, జీవించదలిచినచో శరణువేడండి

అంతట సంభ్రమము నొందిన దేవతలందరూ ప్రణమిల్లి హరుని స్తుతించిరి - 'మహాదేవా! నీకు నమస్కారము - జగత్పతే మమ్ము రక్షించుము. మేము చెడునడత కలిగి ఆత్మ ద్రోహమును చేయువారము అట్టి మమ్ము రక్షించుము - ఆహా! మన మౌడ్యమును చూడుడు - ఈ మహాదేవి నీ భార్యయని తెలిసికూడా ఇక్కడకు వచ్చాము - అసురులు మన రాజ్యమును గ్రహించినచో అది యుక్తమే కదా? ఇట్టి బుద్ధి గల మేమే పని చేసితిమి? అయినా మా దోషమేమీ లేదు - మేము పశువులము కదా! పశుపతియైన నీచే ప్రేరితులమై ఇదంతా చేయుచున్నాము - నీవు ఈశ్వరుడవు, అన్ని ప్రాణులకు పతివి . పరమేశ్వరుడవు. యంత్రములోనుంచినట్లు నీ మాయచే విశ్వమునంతటినీ తప్పుచున్నావు - దానిచేత భ్రమించి మేమీ స్వయంవరమునకు వచ్చాము. పశుపతివైన నీకు నమస్కరములు - మా పట్ల ప్రసన్నుడవు కమ్ము' అని వేడగా త్ర్యంబకుడగు శివుడు వారి పట్ల ప్రసన్నుడై స్తుతివలన వారిని ముందున్నట్లుగా చేసెను. 'నాయనా! ఈ మహాదేవుడెవరు? మేమతనిని అంగీకరించము' అని దైత్యులనగా నవ్వి లీలగా హుంకారమును చేసెను.

హుంకారముతో దైత్యులంతా స్వయంవరముమ మరిచి తమ నగరమువకు వెళ్ళిపోయిరి. మహాదేవ ప్రభావముచే హొరకర్ములగు దైత్యులకట్లాయెను - ఇట్టి ప్రభావముగల శివుని విడిచి 'ఈశ్వరుడ' ను శబ్దము యొక్క అర్థము వేరొక చోట ఎట్లు కుదురుమ? ఈ భువనములకీశ్వరుడగు మహాదేవుని సేవించని వారు నిస్సంశయముగా గొప్పమూర్తులు. బ్రహ్మాది దేవతలు పొగడుచుండగా శివుడు పరమాద్భుతమగు శరీరమును కల్పించుకొనెను. సూర్యచంద్రులు, ఇంద్రుడు, బ్రహ్మా, సాధ్యులు, వస్తువులు, విశ్వేదేవతలు, యమ, రుద్రులు ప్రభువగు శివుని దివ్య చక్షువునిమ్మని ప్రార్థించిరి. తన ఉత్తమమైన శరీరమున వారు చూచుటకు శివుడు వారికి, పార్వతికి, హిమవంతునికి దివ్య చక్షువునిచ్చెను. రుద్రుని అమగ్రహముచే దివ్యమూ, ఉన్నతమగు చక్షువును పొందిన బ్రహ్మాది దేవతలు మహేశ్వరుని చూచిరి - అంత మునులు గావముచేయగా, ఖేచరులు పుష్పవర్షమును కురిపించిరి, దేవ దుందుభులను అధికముగా మ్రోగించిరి .

గంధర్వులు మున్నగువారు గానముచేసిరి - అప్పరసల గణములు వర్తించెను  గణరక్షకులందరూ ఆనందించిరి - పార్వతి దేవీ కూడా సంతోషించెను !  బ్రహ్మాది దేవతలుపార్వతి సంపూర్ణముగా మండెనని,శివుడూయట్లే యుండేవని తలచిరి - ఆంతట దేవతల సన్నిధిలో పార్వతి సంతోషముతో సుగంధ యుక్తమగు దివ్యమైన మాలను ఆ శివుని కాళ్ళవద్ద మంచెను. అపుడు బ్రహ్మాది దేవతలు బాగు' అని పలికి,పార్వతి పూజించిన శివుని దేవితో సహా నేలకు తాకు తలలతో నమస్కరించిరి - 'జయ శంకర' యని ఆనందముతో గానముచేసిరి.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున కుమారేశుని మాహాత్మ్యమువ శ్రీమహాదేవుని వివాహమహోత్సవ వర్ణనము అను ఇరువదియైదవ అధ్యాయము.