స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

 7వ అధ్యాయము

అర్జునడిట్లడిగెను - 'నారదా! నీవు అద్భుతమైన మహీసాగర మాహాత్మ్యమును కీర్తించితివి. వారు విస్మయము, అమితానందమూ కలుగుచున్నవి.  అగ్ని వేడికి తపించిన మహీ ఏ యజ్ఞమున గ్లానమైనదో విస్తరముగా వినగోరుచుంటిని.” అనగా నారదుడిట్లు చెప్పెను -ఈ మహీనది ఎట్లైనదో ఆ మహదాఖ్యానముగా చెప్పెదను. ఈ పుణ్యమగు కథను విని వీవు పుణ్యమును పొందెదవు. పూర్వము భూలోకమున ఇంద్రద్యుమ్నుడను రాజూ వుండెడివాడట - అతను పూజ్యుడు, అన్నీ ధర్మములు తెలిసినవాడు, గౌరవించువాడు, సమర్థుడు ఉచితములను తెలిసినవాడు, వివేకమునకు వెలవు, గుణములకు సముద్రము, ఈ భూమిపై ఆ రాజు పూర్తధర్మము యొక్క గుర్తు లేని నగరముగా, గ్రామముగానీ, పట్టణముగానీ లేదు అతను శ్రోతవిధితో అనేక కన్యాదావములను చేసెను.  వేలకొలది యాచకులకు దానములనిచ్చెను. దశమినాడు రాత్రి సమయాన ఏమగు వీపు పై నుండి దుందుభి మ్రోగించబడుమ - ఉదయముననే ఏకదశీవ్రతము చేయవలెనని ఆ నాదము సూచించును - యాజ్ఞికుడగు ఆ రాజుచే భూమి పై ఎల్లెడలా దర్భ సోమపాయిలకై పరచబడును . గంగా తీరమున ఇసుక, వర్షధారలను, నింగిన తారలను కూడా లెక్కించవచ్చు. కానీ ప్రాక్టులతని పుణ్యమును లెక్కించలేరు  ఇట్టి పుణ్యములతో ఆ రాజు ఆ శరీరముతోడనే విమానము నెక్కి ప్రజాపతి నివాసమును చేరి అక్కడ దేవతలూ పొందలేని భోగముల ననుభవించెను.

మారుకల్పములు గడవగా ప్రజాపతి తన పేవకై వచ్చిన ఆ రాజుతో విట్లనెమ రాజాశ్రేష్ఠా! భూమిపైకి వెళ్ళుము - ఒక్క క్షణము గూడా నా లోకమున నుండరాదు . ఆవగా ఇంద్రద్యుమ్నుడిట్లడిగిన - బ్రహ్మదేవా! ఇప్పుడు వన్నెందుకు భూమికి పంపించుచుంటివి నా పుణ్యమెక్కువగా వున్ననూ పంపించుటలో కారణమేమి?  అనగా బ్రహ్మ చెప్పిన 'రాజా! కేవలము గుప్తమైన పుణ్యము స్వర్గమును సాధించదు - ముల్లోకములలో విస్తరించిన నిష్కల్మషకీర్తి లేనిచో స్వర్గము ప్రాప్తించదు. ఇపుడు భూతలముపై ఏ కీర్తి ముక్కలై చాలాకాలమైనందున వెళ్ళి దానివి నూతనముగా చేయుము  లోకమున వుండవలెనని కోరికయున్నచో అట్లు చేయుమ అనగా ఇంద్రద్యుమ్నుడిట్లనెను' బ్రహ్మాదేవా! నా పుణ్యము భూమిపై నెట్లుండుమ ఏమి చేయవలెనో మనసులో నిలుచుటలేదు -  అనగా బ్రహ్మ చెప్పిన - 'రాజా! ఈ కాలము బలమైనది స్వయముగా బ్రహ్మాండములను, వన్న కూడా కబళించును. నీలాంటివారి లెక్కఏమి? అయిననూ రాదో ఇప్పుడు నీవు చేయవలసినదిదేనని తలచుచుంటిని. నీకీర్తి వ్యక్తిని తీసుకొని మరల స్వర్గమునకురమ్ము'-అనగావిని ఇంద్రద్యుమ్నుడట్లేననుకొనగానే భూతలముపైకి తాను వచ్చుట చూచెమ - కాంపిల్య నగరమున తనన తాన ప్రశ్నించుకొనెను. ఆ నగరమును గూర్చి, దేశముగూర్చి విస్మయముతో ప్రశ్నించెను.

అపుడు జనులిట్లనిరి మాకు ఇంద్రద్యుమ్నరాజుగానీ, ఆతని పురము గానీ తెలియదు వెళ్ళి ఎవరైనా చిరాయువుంటే అడుగు నాయనా!' అనిరి - అపుడు ఇంద్రద్యుమ్నుడు 'జనులారా! ఇపుడు భూతలముపై చిరాయువని పేరొందిన వాడెవరు? ఎక్కడున్నాడు? త్వరగా చెప్పండి' అనగా జనులిట్లు చెప్పిరి - నైమిషారణ్యమున ఏడుకల్పముల స్మరించగల ముని వున్నాడట మార్కండేయువని పేరొందిన అతనిని చేరి సంశయమును ఆడుగుము' - అని ఉపదేశించగా రాజు ఆ ముని వున్నచోటికి వెళ్ళి నమస్కరించి తన మనసులో నున్నదానిని చెప్పెను . 'భగవాన్! భూమిపై ఇపుడు మీరే చిరాయువని ప్రసిద్ది  ఇంద్రద్యుమ్నుడు మీకు తెలియునా? లేదా అని అడుగుచుంటిని'  అనగా మార్కండేయుడిట్లు చెప్పెను - 'ఏడు కల్పములలో ఇంద్రద్యుమ్నుడమ రాజెవరూ లేరు - ఏమి చెప్పగలను? రాజా! వేరొక సంశయమును అడుగుము'  అది విని రాజు నిరాశతో అగ్నిని ప్రవేశించబోగా ముని చూచి వారించుచూ నిట్లనెను రాజా! సాహసమును చేయకు (తొందరపడకు) నా మాట వినుము - జీవించియున్న నరుని ఆనందము నూరు సంవత్సరాలకైనా వచ్చును నీ దుఃఖము తొలగుటకు ప్రతీకారమాచరించెదను - విను నాయనా! నాకు చాలా పూర్వమిత్రుడైన కొంగ ఒకటున్నది  నాడీజంఘడన్న ఆ కొంగ నీ సంశయమును తీర్చును - కనుక త్వరగా దాని వద్దకు వెళ్ళెదము. మహాత్ముల జీవితము ఇతరులకుపకారము చేయుటకు కదా! నాడీజంఘునికి తెలిసినచో తప్పక ఇంద్రద్యుమ్నుని గూర్చి చెప్పును.

ప్రసిద్ధులైన ఆ రాజు, ముని అపుడు హిమాచలముననున్న నాడీజంఘుని నివాసమునకు ప్రీతితో, బయలుదేరిరి అక్కడ కొంగ చాలా కాలము తరువాత తన వద్దకు వచ్చిన మార్కండేయువను మిత్రుడిని చూచి ఎదురేగి ప్రీతిచేత ఉత్కంఠతో ఎదుట కూర్చునెను కుశలము స్వాగతము మున్నగు వానితో సంవాదమైన తరువాత రాకకు కారణమేమిటో చెప్పుమని ఆడిగెను. అపుడు మార్కండేయుడు భూతలముపై ఇంద్రద్యుమ్నుడను రాజును గూర్చి తెలియునా అని ప్రస్తుతమునడిగెను. ఈ నా మిత్రునికి దానితో కార్యమున్నది. లేనిచో అగ్నిని ప్రవేశించి ప్రాణముల వదులును. ఇతని ప్రాణముల కాపాడుటకు నీవు తెలిసినచో చెప్పుము. అనగా ఆ నాడీజంఘడనెను - బ్రాహ్మణా పదునాలుగు కల్పములను స్మరించగలను నేను ఆ రాజును చూడడం మాట అటుంచి ఆ రాజు వార్తను కానీ వినలేదు. గుర్తుకు రావడం లేదు. భూతలము పై ఇంద్రద్యుమ్నుడనే రాజెవరూ లేడు - ఇంతమాత్రమే నేనెఱుగుదును. నారదుడు చెప్పెను - 'నాడీ జంఘుడు తన ఆయువుమ చెప్పగా విని రోజూ విస్మయమునొంది ఇంత దీర్ఘకాలజీవనమునకు కారణమేమి? దానమా? తపమా? అని అడిగెను  అపుడు నాడీజంఘడు చెప్పెను - నేతి, కంబళి మాహాత్మ్యముచే శివానుగ్రహముచే దీర్ఘజీవనము కలిగినది - విప్రుడా! బక శాపముచే ఈ బక శరీరమూ కలిగినది - చెప్పెద వినుము .

పూర్వజన్మలో నేను పరాశరగోత్రజుడగు విశ్వరూపుడను గొప్పమునికి, బ్రాహ్మణునికి బాలునిగా భూలోకమున జన్మించితివి బాలకుడు బకుడనే, తండ్రికి ఇష్టుడై తెలియసాగెను - సహజముగానే చపలుడిగా నుంటిని ఒకనాడు దేవతావసరమున తండ్రి పూజించు మరకతలింగమున బాలభావముచే, చాపల్యముచే దొంగిలించితిని దానిని నేను ఉత్తరాయణమున మకరసంక్రాంతినాడు నేతిపాత్రతో నుంచితిని. రాత్రి గడవగా ప్రొద్దుననే నాతండ్రి సైర్మాల్యమును తొలగించబోగా శివాలయము శూన్యముగా నుండెను - దిక్కులు చూచుచున్న నన్ను పిలిచి మధురముగా నిట్లడిగెను 'నాయనా! ఆ లింగము నెక్కడ వుంచావో చెప్పుము - నీవేది కోరితే ఆది నీకిచ్చెదను తినదగినపదార్థము గానీ, నీవు కోరినది గానీ ఇచ్చెదను అనగా అపుడు నేను బాలభావముచే తినుబండారముల నిచ్చునని లోభముతో నేతి పాత్ర నుండి తీసి లింగమును తండ్రికిచ్చి వేసితిని కాలము సంప్రాప్తించి నేను మరణించిన తరువాత రాజనివాసమున జన్మించితిని - జాతిస్మరణముచే బాల్యముననుండు అజ్ఞానముచేత నేతియందు శివలింగమును మకరసంక్రాంతి నాడు వుంచిన నేను ఆ జన్మనొందితిని. ఆటు పైపూర్వ జన్మమును స్మరించు నేను లింగమును స్థాపించితిని - అప్పటినుండి లింగములను నేతితో కప్పుచుంటిని శక్తిననుసరించి నేను తండ్రి తాతల రాజ్యమును పొంది ఇట్లు చేయుచుండగా శివదేవుడు ప్రసన్నుడై నాతో నిట్లనెను.

 ‘పూర్వజన్మయందు నీవు చేసిన ఘృతకంబళపూజతో సంతసించితిని - నీకు రాజ్యము నిచ్చుచుంటిని ఇష్టమైనది కోరుకొనుము’ అనగా నేను గణముల ఆధిపత్యమును కోరగా శంకరుడిచ్చెను. కైలాసమున నన్ను శివుడు ప్రతిదినమూ సంతోషముతో చూచి ఇట్లనెను నేటినుండి మకరసంక్రాంతినాడు నన్ను నేతితో పూజించువాడు నాగణములో ఒకడగును? అని పలికి నన్ను కోట్లకొలది గణముల కధిపతిని చేసెమ శివశాసనము ప్రతిపమునే పాలించునదియేమ  వెంటనే నేమ కామము మున్నగు ఆరు పదములతో చరించునది, తుమ్మెదవలె స్వభావముచేత చపలమగు లక్ష్మివి పొంది, విధివశాత్తు దావివి ధరించుటకు శక్తుడమ కాకపోయితివి మదించిన ఏమగువలె నేమ చరించ సాగితిని - మంచి చెడుల వదలి, అమిత గర్వములో మంటని  వదులతో సముద్రము శోభిల్లినట్లు విద్యమ, వందును, లక్ష్మిని పొంది వీచమానవుడు ఆపదల పాత్రుడగుమ. ఇట్లు కొంత కాలము గడవగా అమకోకుండా నేను పర్యటించుచూ మంచుతో కప్పబడిన గుహలుగల పర్వతమును చేరితివి. అక్కడ ఎల్లప్పుడూ తప్పు చేయుటచే కృశించిన ధమనులు గల గాలవుడమ ముని భార్యతో తపస్సు వాచరించుచుండెను.

బ్రాహ్మణుని ఈ దేహము ఇహలోకఫలములనిష్టపడునది కాదు. - కఠినతపస్పు, మరణాంతరమనంత సుఖముకొరకు పాధవమే ఈ దేహము. ఆగాలవ మహర్షి భార్య అమిత సుందరి, లోకముల జయించగలది - సుందరముగా, లావణ్యములో చక్కని కన్నులు, ఎత్తైన లావుగల వక్షోజాలు గలది. హంసవలె మధురముగా మాటలాడునది, మదపుటేనుగువలె మెల్లగా వడుచునది, వెడల్పైవ జఘనము, సన్నని నడుము, పొడవైన తలవెంట్రుకలు గలది. లోతైన నాభితో ఈ కన్యను బ్రహ్మ చక్కగా చూడదలిచి నిర్మించేవేమో! చెల్లా చెదరైన సౌందర్యము ఒక్కచోటనే నిలిచినది. వినయములేని నేను ఈ గాలవ భార్యను చూచి మన్మథ బాణములతో కొట్టబడితివి - వివేకవంతులగు మునులు కూడా సౌందర్యవతులు కొడగంటి చూపుతో చూడనంతవరకే వివేకవంతులు  ఆమెను ఎత్తుకుపోవలెనని ప్రేమ మనఘవ ఇట్లనుకొంటిని. ముని తపస్సుతో రక్షింపబడిన ఆకన్యను వేను బలవంతముగా ఎత్తుకుపోయినచో ముని శపించును - అటైన పరాభవము కలుగును. ఆటైన ఈ ముని భార్య నా మృత్యువే కాగలదు - కనుక ఈ మునీకి నేను శుశ్రూషను చేయు శిష్యుడనయ్యెదను. సరైన అవకాశమును పొంది, ఈ మునికి తగని కన్యను నేను ఎత్తుకొని పోయెదను, అని నిశ్చయించుకొని విద్యార్థి రూపును దాల్చి గాలవమువిని చేరితివి. కలుగబోవు ప్రయోజనముచే ప్రేరితుడనై అతనికి నమస్కరించి ఇట్లంటిని.

వరులు పూర్వము చేసిన దానికి తగినట్లే వారికి బుద్ధి, ప్నేహితులు, ప్రయత్నము (విశ్చయము) లు కలుగుమ ఆ మునితో నేనిట్లంటిని - 'భగవాన్! వివేక వైరాగ్యములుగలిగిన వేను మిమ్ము చేరితివి. వేమ మీ శిష్యుడమ, మీరు నాకు చదువు నేర్పవలెమ చుక్కాని ధరించిన మహామునికి, ఒడులేనివారికి ఒడ్డును ప్రసాదించువారికి, విషువుకు, విప్రమూర్తి నాశ్రయించిన చైతన్యానికి నమస్కారము గాలపుడమ పేరుతో ప్రత్యక్షమైన చైత్యమువకు, బ్రహ్మకుమప్పులు - గురుదేవా! అవిద్యయమ నల్ల త్రాచుచే కాటువేయబడి దావి విషముచేత పీడింపబడిన నన్ను ఉపదేశమంత్రములతో విషవైద్యుని వలె బ్రదికింపుము. హృదయమను వెలవున పెరిగిన ఈ మహామోహమమ పెద్ద చెట్టు మీమాటలు అనుపదునైన ఖడము చేత ఛేదింపబడుగాక మోక్షమార్గమున వ్యాపించిన, ఈ మూడసంగతియను పేచనము, విద్యయన పదునైన గొడ్డలచే చేదింపబడుగాక స్వామి! వేమ మీ శిష్యుడను - సేవా పరుడవై మిమ్ము చాలాకాలము సేవించెదను  పమిధలమ, దర్భను, కందమూలములన, పళ్ళను, చెక్కన, వీటిని నేనే అచ్చెదను వినయముతో మిమ్ము చేరిన నన్నును గ్రహించండి. ఇట్లు పూర్వము, కొంగ వలె కపటవినయమును చూపు పన్ను బకుడనువాడిని ఆ సాధువగు గాలుడు అ నుగ్రహించమ  వెంటనే నేను వినయముతో బ్రాహ్మణకన్యతో నున్న ఆ గాలవమువిని, అతనికి విశ్వాసము కలిగించుటకై, దృఢముగా పేవచేసి ప్రతిదినము సంతోషము కలిగించుచుంటిని. తన పత్ని యోగ్యురాలను తెలిపి, ఆమెను విశ్వసించలేని ఆ ముని స్త్రీల నడవడికన తెలిసి ఆమెను తన ఒడిలో మంచుకొని నిద్రించువాడు.

అంతట ఒకనాడు ఆ బ్రాహ్మణ కన్య రజస్వల అయినది. నాయందు విశ్వాసమునుంచి ఆ మునికి దూరముగా నిద్రించసాగినది. ఇదే అవకాశమని నేపాలోచించి మిక్కిలి ఆనందించితిని. ఒక దొంగవేషమును ధరించి రాత్రి సమయమున ఆమెను ఎత్తుకొని పోవ ప్రయత్నించితిని. అపుడు ఆ బాలిక పెద్దగా ఆరచుచూ, 'వద్దు, వద్దు' ఆవి నేననగా గొంతును గుర్తించి మునితో నిట్లనెను. ఈ దుష్టుడు కొంగవలె కపటి, ధర్మమును తొడుగుగా దాల్చిన దుష్టుడు - దురాచారుడై నన్నపహరించుచున్నాడు - గాలవా! రక్షించుము! పూర్వము నీ శిష్యుడై ఇతడెవడో దొంగగా వన్నెత్తుకొనిపోగోరుచున్నాడు. గాలవా! శరణువేడితిని, రక్షించుము' అనగానే గోలవుడను ముని లేచి నిలువు, నిలువు' మని వవవి వాగతిని స్తంభింపజేసెను . ఆంతట నేను చిత్తరువులోని ఆకృతివలె స్తంభించి విలిచితివి - సిగ్గుతో వేమ కుంచించుకొనిపోతివి. అపుడు గోలవముని కోపించి వా వద్దకు వచ్చి నేను కొంగగా మారటకు కారణమైన వాక్యమును వజ్రమువలె సహింపలేని దానినిట్లనెమ . నరాధముడా! కొంగవలె నమ్న వంచించినందుకు వీవు చిరకాలము కొంగవయివుండెదవు'  అవి ఆ ముని అధర్మము. నాశ్రయించిన నన్ను శపించెను - ఇతరుల భార్యను పొందగోరి ఈ అనర్థమును పొందితిని పురుషునకు ఇతరుల భార్యల పొందగోరుటతో సమానమగు నీచకర్మ వేరొకటిలేదు

అంతట నాస్పర్శచే అపవిత్రమైన శరీరము గల ఆ ముని భార్య, నేను ఆమెను విడిచిన తరువాత స్నానము చేసి, నన్నట్లే ‘బకము కమ్మని శపించినది  ఇట్లు వారిద్దరూ శపించగా భయముతో రావిరేకువలె వణకుచూ నేను ఆ దంపతుకు నమస్కరించి ఇట్లంటిని - ఈశ్వరుని గణము నేను, అయిననూ మీపట్ల అవినయమును ప్రదర్శించితిని - సమర్థులైన మీరు అనుగ్రహము చూపుడు ద్విజలకు వాక్కు కఠినమైననూ మనస్సు నవనీతము (వెన్న) వలె మృదువైనది - మిగుల కోపించిననూ, అనునయించినచో క్షణముననే ప్రసన్నులగుదురు - నీకపకారము చేయదలిచిన (నీపట్ల అపరాధము చేసిన) నాకు నీవే శరణము - భూమి పై అడుగులు తడబడిన వారికిక భూమే అవలంబనం ఇపుడు సో గణాధిపత్యం కూడా పరిభవాస్పదమైనది - వినయము లేనివాని సంపదలు విపత్తుతోనే అంతమగును - కలుగు మరియు కలుగబోవు అపాయమును వివేకవంతులు బుద్దిచే గ్రహింతురు  కానీ నీచులు తమకు అనుభవము కలుగనంతవరకు రెంటినీ తెలియజాలరు - మదముచే గర్వించిన నా వలెనే దుర్వినీతుడు లక్ష్మిని, విద్యను, ఐశ్వర్యము గానీ పొందిననూ ఆ స్థానమున చిరకాలముండడు - విద్యామదము, ధనమదము, కులమదము అనునవి మదాంధులకు మదములైతే సత్పురుషులకు దమములు, (నీచులకు మత్తెక్కించును, సజ్జనులకు నిగ్రహ సాధనమగును) వివేచించు బుద్ధి, నిగ్రహము లేని నావంటి వారి చేతనే సంపదలు చపలమను మాటను పొందును .

కనుక ఓ ముని శ్రేష్టా! ప్రసన్నుడవై నా శాపమునకు అంతమును కలిగించుము. సాధువులు దుర్వినీతుల పట్ల గూడా క్షమమునే ఆచరింతురు గదా! అని విన్నపవచనములు (విజ్ఞాపన వచనములు) అవినయుడనైన నేను పలికిననూ, గాలవముని ప్రసన్నుడై నాకూ శాపాంతమునిట్లు చేసెను - ‘ఇంద్రద్యుమ్నుడను రాజుకు కోల్పోయిన కీర్తివి ఉద్దరించుటలో వీవు ఎప్పుడు సహాయపడెదవో అపుడు మోక్షమును పొందెదవు" -  జట్లు కశ్యపవంశజుడగు నేను మునిశాపముచే కొంగపై అప్పటినుండి హిమాచలపర్వతమున వసించుచుంటిని - మరకతలింగమును నేతిలో ముంచుటచేత రాజ్యము, చిరాయువుకలిగిమ . దాని చేతనే జాతిని అనుభవములను స్మరింపగల శక్తి కలిగిమ - గాలవముని శాపము చేత నాకు కొంగగా మారుట సంభవించినది. నాయనా ! నీ వడిగినదంతా చెప్పితివి నీకు -

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వర ఖండమున కౌమారికాఖండమున మహీప్రాదుర్భావమున ఏడవ అధ్యాయము.