స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

22వ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను - ఇట్లు అవమానింపబడిన (వికారము నొందిన) ఇంద్రాది దేవతలు మర్కటరూపముననే బ్రహ్మ నివాసమున చేరిరి. అంతట విస్మయమునొందిన బ్రహ్మ ‘మీ స్వరూపముతో విలవండి. ఇక్కడ తారకుడి నుండి మీకు భయములేదనెను. అంతట దేవతలు తమ రూపములతో, వాడిపోయిన ముఖములతో తండ్రిని పుత్రులు నమస్కరించినట్లు బ్రహ్మకు నమస్కరించి స్తుతించిరి. జగత్తుమ సృజించు, పోషించు, లయించు, అదికారణమగు నీకు నమస్కారము - ప్రభూ! ఇవి నీ మూడు అవస్థలు నీవు ముందు నీటిని సృజించి వానియందు వీర్యమునంచితి - అది సువర్ణమయమగు అండమాయెను - దానియందే చరాచరలోకములుండును ఇట్టి నిన్ను వేదములందు విరాడ్రూపుడందురు - నీపాదమూలము పాతాళము, మడమభాగము రసాతలము  చీలమండలు మహాతలము, పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, తొడలు వితలాతలములు , పిరుదుల భాగము మహీతలము, నాభి ఆకాశతలము, జ్యోతిః పదము వక్ష స్థలము, స్వర్గము బాహువులు. కంఠము మహర్లోకము, వదనము జనలోకమవబడును - మదురు తపోలోకము, తల సత్యలోకమవబడును. సూర్యచంద్రులు నేత్రములు, దిక్కులు చెవులు, అశ్వినులు నాసిక, అట్టి నీవు బ్రహ్మ రంధ్రమున వుందువని వేదవాదు లందురు.

ఇట్టి నీ విరాడ్రూపమును స్మరించుచూ ఉపాసించువారు జన్మబంధములనుండి ముక్తులై పరమపదమగు నిన్నే చేరెదరు. స్థూలముగా ప్రాణులయందును, సూక్ష్మముగా ప్రతిభావముననూ భావింపబడిన నిమ్న స్తుతింతురు - కనుకనే వేదములు విమ్న సర్వవ్యాపియమము - అట్టి పద్మసంభవుడైన నీకు నమస్సుల నర్పించుచుము’. అవి స్తుతింపగా దయనొందిన  బ్రహ్మ, తెలిసినమా వారిమారడించుటకై ఇట్లనెను. ‘మీరందరూ దుఃఖము నొందియున్నారు - ముఖములు వాడియున్నవి - ఆయుధములు జారిపోయినవి - ఆభరణములు, వస్త్రములు జారిపోయినవి. మీకు జరిగిన ఈ అవమానము నాకే కదా! ఎందుకనగా మీరు నో విరాట్ శరీరములో బాహువులనబడువారు. ఏదైతే పగమైశ్వర్యము గలదో, ధర్మబద్దమే, తేజస్వియో అట్టి బాహుస్థానమున నాశనము కలిగినది నాకు నిజముగా ఆ దురాత్ముడైన తారకుడు నా బాహువులను విరిచివేసెను - పరే! అతనేమి కలిగించేనో మీరు నాకు తెలియజేయండి’ అనగా దేవతలీట్లు చెప్పిరి - ప్రభూ! ఇతమ వజ్రాంగువి తనయుడు, మీమండే వరములను పొందినవాడు - మమ్ములనమితంగా అవమానించెనని మీకు యథార్థముగా తెలియును  మహాసముద్ర తీరమున శార్వీకతీర్థమను దావినతడు ఆక్రమించి మరుభూమిగా చేసెను దేవతల సంపదలనన్నింటినీ కొల్లగొట్టినాడు - మహాభూతస్వరూపియై, తానే జగత్పతి యైనాడు.

సూర్యచంద్రులు, గ్రహములు నక్షత్రములు మొదలగునవేవేవి దేవతల పక్షమున నుండినో వావినన్నింటినీ తారకుడు విరాకరించి దైత్యుల పక్షమున స్థాపించెను. మమ్ములమ పట్టి ఎగతాళి చేసినాడతను - కానీ ఏదోవిధముగా అతి కష్టముచే మేము విష్ణుమూర్తి దయవలన బయటపడినాము అట్టి మేము పీడితులమై, ఆకలి, దప్పులగొవి మిమ్ము శరణువేడితిమి - ధర్మమును రక్షించువారము - అని ఆలోచించి మీరు రక్షించవలెను’. అని సురులు దైత్యుల దుష్కృత్యమున బ్రహ్మకు తెలిపిరి -అంత భగవంతుడు యథార్థముగా చింతించి ఇట్లనెను. సురాసురులందరిచే కూడా వధింపబడలేనివాడీ తారకుడను దైత్యుడు - ఎవరిచేత తారకుడు వధింపబడునో అట్టి భగవంతుడు కూడా వేటికి జన్మించలేదు. నేనే ఆ తారకుని వరములతో సంతోషింపచేసి వారించితివి. తప్పుచే వెలుగుచున్న తారకుడు ముల్లోకములమ కాల్చివేయు అగ్నివలెమన్నాడు. ఆ దైత్యుడు ఏడునాళ్ళ వయసున్న శిశువు మండి మరణమును కోరుకొనెను. శంకరుని ద్వారా కలుగు ఆ శిశువు తారకుడను ఈ వీరుని వధించగలడు  దక్షయజ్ఞమున వళించిన సత్యము దేవి హిమాలయునికి కూతురిగా జన్మించగలదు. ఆ పర్వతపుత్రికి, శివునికి కలయికన కూర్చుటకు ప్రయత్నించవలను - నేనునూ ఆ పనియొక్క మిగిలిన భాగమున పూర్తి చేసెదను - సంశయము లేదు.

అని సాక్షాత్తు బ్రహ్మదేవుడి పలుకగా దేవతలు అతనికి నమస్కరించి మర్కట రూపులై మేరుపర్వతము వద్దకు వెళ్ళిరి. వారట్లు వెళ్ళగా లోకపితామహుడగు బ్రహ్మ ముమపు జన్మించిన తన శరీరమగు ‘రాత్రి’ ని స్మరించెను. అంత భగవతియగు రాత్రి బ్రహ్మను సమీపించగా ఏకాంతమున ఆమెతో నిట్లనేను. ‘రాత్రి! దేవతలకు కాదగు గొప్ప పవి ఒకటి వచ్చిపడినది - అది నీవే చేయవలెను - దానిని విశ్చయముమ గూర్చి వినుము తారకుడు రైల్యేంద్రుడు దేవతల వినాశవసూచకుడుండిన - అతడుగు జయింప వీలులేనివాడు - అతనిని వధించుటకు శివుడు ఎవరిని పుట్టించునో ఆ పుత్రుడి తారకుని వధించుమ - ముందు నేమ పుట్టినపుడు ఎదురుగా నిలిచిన దేవుని చూచితివి. ఆ దేవుడు అర్ధనారీశ్వరుడు, వ్విముఖ వ్యాపించియుండువాడు, అతనిని చూచి భక్తితో భజించుమనియంటివి. అంతట పురుషుడు, స్త్రీలు విడివడిరి - వారి అంశలుగా అందరు స్త్రీలు ముల్లోకములలో నేర్పడిరి, ఏకాదశరుద్రులు అతని అంశనుండి జన్మించిరి. ఆ స్త్రీని చూచి నేను పుత్రుడగు దక్షునితో వంటిని. నాకు నీకూ పుత్రికయగు ఈస్త్రీని వీవు పుత్రికగా గ్రహించుము - పుందుఃఖనరకము మండి రక్షించు ఈ స్త్రీ నీకు పుత్రికయగుగాక!

అని నేను చెప్పగా దక్షుడు ఆమెను పుత్రికగా చేసుకొని, ఆమెకు సతియని పేరిడి భక్తితో రుద్రునికిచ్చెమ. ఆ తరువాత ఒకనాడు మరణించగోరి పాపసంకల్పుడైన దురాత్ముడగు దక్షుడు ఆ స్త్రీనవమానించెను రుద్రుని అంగీకరించనివారు కులమునకు కళంకము - వారు పిశాచులు, దురాత్ములు, బ్రహ్మరాక్షసులయ్యెదరు. శివునికి జరిగిన అవమానముచేత ఆ దేవి శరీరము విడుచుట, దక్షుని యజ్ఞము ధ్వంసమగుట నీకు తెలియుమ. ఇపుడా దేవి హిమవత్పర్వతపుత్రికగా జన్మించబోవుచున్నది. మరల ఆ దేవి నిశ్చయముగా పరమేశ్వరుని భర్తగా పొందును. ఇదంతా వీవు మేన గర్భంలోకి ప్రవేశించి చేయవలెను ఆమె కృష్ణవర్ణమును పొంది కాళియగునట్లు చేయుము. రుద్రునిచేత విర్లక్ష్యం చేయబడి పార్వతి గొప్ప తపస్సు చేయును - నియమములను స్వీకరించి ఉగ్రమూర్తియగును. అపుడు తాను కాళిరూపును వీడి ఎరుపువర్ణమును పొందగలదు . ఆమె ఎడబాటువలన హరుడు ముల్లోకములు శూన్యమని తలచి ఆ హిమవత్పర్వతముయొక్క సిద్ధులచే సేవించబడిన గుహలో దేవికై వేచిచూస్తూ మహోగ్రతపస్సు నాచరించును. ఇట్లు బాగుగా తపమాచరించిన వారిద్దరికి జన్మించిన గొప్ప కుమారుడే తారకదైత్యుని వధించువాడగును.

‘కల్యాణీ! తపస్సు ద్వారా తప్ప వేరొక మార్గము ద్వారా సిద్ధి లభించదు - అన్ని పమలు సిద్ధించుటకు మూలము తప్పవని చెప్పబడుచున్నది. అపుడు పార్వతి దేహమునుండి వెలువడిన వీపు కూడా చండ, భుండ మొదలగు దానవులను హతమార్చవలెను. చండుని, ముండుని వధించునందు వలన వీపులోకమున చాముండియన ప్రసిద్దిని బడయగలవు. అంతట దేవీ! లోకము వరములిచ్చు నిన్ను చక్కగా అనేక రూపములతో అంతటా వుండు శక్తిగా, కోరికలను తీర్చుదానిగా, ఓంకారము ముఖముగా గల గాయత్రిగా అర్చింతురు. తేజస్సును, బలమును ఇచ్చుదానిగా మహాబలులైన రాజులు నిన్ను అర్చింతురు - వైశ్యులు నిమ్న ఐశ్వర్యమేయనీ, శూద్రులు శివాయని సేవింతురు - నీవు మునులయొక్క స్థిరమైన క్షమాగుణము, నియమముగలవారి దయవు నీతిమంతుల ఉపాయముల వితీవే నీవు, ఐశ్వర్యము లేదా ప్రయోజనముల వావరించి యుండుదానవు - నీవే ప్రాణము నీవు అన్ని ప్రాణుల యోగము, అన్నిటి గతివి - రతి భావనగలవారిలో రతివి నీవే, సౌందర్యమును దర్శించువారిలో ప్రీతివి నీవే. శుభమగు రూపుగల వారిలో కాంతివి, శుభమగుకర్మల వారిలో శాంతిని, మూర్తుల భ్రాంతి, యజ్ఞము చేయువారి ఫలమూ వీ సముద్రముల చెలియలి కట్టవు, విలాసవంతుల లీలపు - పదార్దముల సంభవము, స్థితి నీవే - నీవే లోకముల పాలించుదానవు.

 అషభువనములను నశింపజేయు కాలరాత్రివి నీవు - ప్రియమైన వ్యక్తిని కౌగిలించుకొన్నందువలన కలిగే ఆనందమునిచ్చు రాత్రివి నీవు అట్టి నీవు ప్రసన్నురాలవై, నమస్కరించు మమ్ము సౌమ్యదృష్టితో చూడుము. దేవీ! ఈ విధముగా స్తుతించుచూ నిమ్న పూజించువారు వియమముగా అన్ని కోరికలను పొందగలరు' అని బ్రహ్మయవగా రాత్రియట్లేనని చేతులజోడించి త్వరగా హిమవంతుని పూర్వగృహమునకు వెళ్ళాను. అచట రత్నములను పొదిగిన గోడలుగల గొప్ప మేడలో నున్న మేవము, కొద్దిగా తెల్లనైవ శరీరకాంతిలో వికసించిన పద్మమువలెనన్న దానిని చూచెను. ఆ మేవ కొద్దిగా వల్లనైన చమమొవలతోమన్న వక్షఃసంపదతో కొద్దిగా వంగియుండి, గొప్ప ఔషదులచే గట్టబడిన మంత్రరాజములతో సేవింపబడుచుండిన ఆంతట మేన కళ్ళుకొద్దిగా మూసుకుపోగా, రాత్రి బ్రహ్మమాటపై ఆమె ముఖమున ప్రవేశించెను జన్మనిచ్చు ఆ జగన్మాత జఠరమునుకూడా క్రమముగా ప్రవేశించి కుమారస్వామి జననియగు ఆ తల్లికాంతివి మార్చెను ఆంతట హిమగిరికి ప్రియురాలగు ఆ జగన్మంగళకరి మేన, బ్రాహ్మీ ముహూర్తమున అందమైన ముఖముగల దానిని కుమ. ఆమె జన్మించుచుండగా స్థావరజంగమజంతువులన్నీ అంతటా సుఖమునొందెను.

క్రూరబుద్దీగల ప్రాణుల మనస్సు శాంతించెను - నక్షత్రముల కాంతి కూడా అధికముగా నుండెను. ఔషధులు వనము నాశ్రయించెను - ఫలములు రుచి గలిగియుండెన - పూమాలలు సువాసనమ గలిగియుండెను -ఆకాశము నిర్మలమాయెను.  వాయువు సుఖమగు స్పర్శము గలిగియుండిన - దిక్కులు కూడా అందముగా మండిమ - మరిచిన శాస్త్రములన్ని మరల ప్రాదుర్భవించెను. ముఖ్యమైన తీర్థముల పుణ్యమగు, ప్రాదుర్భావము జరిగెను. గుహుని అరణి యట్లు జన్మించగా (కార్తికేయుని తల్లి పుట్టగానే అందరికీ సత్యముయందు, ధర్మముయందు, అధ్యయనము యందు, యజ్ఞ, దాన, తపస్పులో శ్రద్ధ కలిగిన. అంతరిక్షమున దేవతలుకూడా ఆనందముతో విప్పారిన కళ్ళు గలిగిన వారైరి - విష్ణువు, బ్రహ్మ, ఇంద్ర, సూర్య, వాయు, ఆ మున్నగు దేవతలు శుభమగు మేనయొక్క ఇంటిపై పుషముల గురిపించిరి. మెరుపు మొదలగు మహావగములు రూపుదాల్చి వీరకాంస్యముతో ఆ మహోత్సవమును వచ్చి చేరిరి. అన్నివైపుల నుండి సాగరములు, నదులు వచ్చి చేరినవి. అర్జునా! అపుడు చరాచరజీవులతో సేవింపబడదగువాడిగా, చేరదగువాడిగా హిమవంతుడాయెను. ఆ ఉత్సవమునాప్వాదించి వారందరూ తమ నివాసములకు వెళ్ళిపోయిరి.

ఇది శ్రీస్కాందమహపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమందు కుమారేశమాహత్మ్యమున పార్వతి జన్మ వర్ణనమను ఇరవైరెండవ అధ్యాయము.