స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
23వ అధ్యాయము
నారదుడిట్లు చెప్పసాగెను - అటు తరువాత కల్యాణియగు పార్వతి దేవగంధర్వకన్యలతో, పర్వతకిన్నరముని కన్యలతో కలిసి ఆడుకొనెను. ఒకప్పుడు మేరు పర్వతముపై నున్న ఇంద్రుడు నన్ను స్మరించగా నేను అతని వద్దకు వెళ్ళితివి. నన్ను చూసి ఇంద్రుడు మిగుల సంతోషించి లేచి నిలిచి పూజించగా, ఆ పూజను స్వీకరించి నేనిట్లంటివి. ఓ సురశ్రేషా! స్వర్గరాజా! ఇంద్రా! మహోన్మత్తులకు కాలాగ్నివంటివాడా! నీకు క్షేమమా? ఆనందముగా నుంటివా? అనీ అడుగగా ఇంద్రుడు నవ్వుచూ నిట్లపైన ముల్లోకములలో కుశలమంకురించినది. ఆ అంకురము యొక్క ఫలము కలుగుటను గూర్చీ నీమ్న స్మరించితిని.- మహమునీ! నీకంతా తెలియును - ఆయిననూ నీవే ప్రేరకుడివి మిత్రునికి నివేదించినచో పరమానందము కలుగును. కనక నీవు పార్వతివి, శివుని కూర్చుము శివుని తప్ప ఇతరుని వరునిగా ఇష్టపడనట్లు చేయుము' అనగా విని నేను అనేక ఓషధులకు నిలయమై ఇంద్రునిగా నున్న పర్వతరాజు హిమవంతుని వద్దకు వెళ్ళితివి.
అక్కడ హిమవంతుడు స్వయముగా నివేదించిన గొప్ప బంగారు సింహాసనముపైసుఖముగా కూర్చుంటిని. అర్ఘ్యమున గ్రహించిన నమ్న మధురముగా హిమవంతుడు ప్రేమతో కళ్ళు విప్పారగా తపస్సుయొక్క కుశలమును గూర్చి యడిగిమ వేమ బదులిచ్చి ఇట్లంటిని - నెలరాజా! నీవునూ పూర్వాపరదిక్కులను ఆక్రమించి ప్రాణిపాలనము చేయుచున్నాను - వీవు ధన్యుడవు - వీ సహాయము చేతనే విప్రశ్రేష్ఠులు తపస్సు, జపము, వ్రతము, స్నానము అనువానిచే తమ పరలోకమును సాధించుకొనుచున్నారు - కొందరిని యజ్ఞాంగ సాధనములతో, కొందరికి కందాది ఫలములనిచ్చుటచేత నీవు ఉద్దరించుచున్నాను - ఇంతకంటే వీగూర్చి చెప్పేదేమి? పర్వతరాజా! గ్రహస్తుని ప్రాణులవలె నిన్ను ఆశ్రయించి ఎన్నో జీవులు అనేక విధములుగా ఆనందించుచున్నవి - చలివి, ఎండను, వావమ, అనేకవిధములైన క్లేశములను సహించుచూ నీవు జంతువులకుపరించుచుంటివి. ఇటువంటి వారే కదా సాధువులు! ఇంతకంటే చెప్పునదేమి! వీవు ధన్యుడవు స్వయముగా మహేశ్వరుడే వీ గిరి కందరమును (గుహ) ఆశ్రయించి వున్నాడు' అని నేమ సత్యమును పలుకగా అంతలో హిమవంతుని భార్య మేన యమవది తన కూతురుతో, కొలదిమంది పరిచారికలతో కలిసి నన్ను చూడగోరివచ్చెను.
సిగ్గుతో కొంతవంగిన శరీరముతో ఆమె సభను ప్రవేశించి నాకు నమస్కరించిన - మేలిముసుగులో మన్న మేవ చేతులు జోడించగా నేనామెను విజమగు ఆశీస్సులతో వర్ధిల్లుమంటివి. ప్రతివ్రతవు శుభమగు ఆచారము గలదాపు, ఐశ్వర్యము గల దావవగు నీవు వీరపుత్రికను కనుము - వీరురాలవై వంశమునకు ఉన్నతిని కలుగజేయుము. ఆవి నేను విస్మయముతో చూచుచున్న హిమవంతుని పుత్రికమ మృదుస్వరముతో దగ్గరకు రమ్మని పిలిచితిని. అంతట ఆజగన్మాత తవబాలభావమును నాయందు చూపించుచు తన తండ్రి ఒడిలో తండ్రికంఠమున పెనవేసుకొని కూర్చొనెను. అపుడు హిమవంతుడు మెల్లగా ఇట్లనెను - 'అమ్మా! మునీశ్వరులకు నమస్కరించుము. మునీశ్వరుల ప్రసాదము వలన వీవు తప్పక కోరిన వారిని భర్తగా పొందగలవు' అనెను. అపుడు కొంగుతో ముఖమును కప్పుకొని హూ యమదూ సిగ్గిలిన హైమవతి ఏమి చెప్పకుండిన. అంతట విస్మయము నొందిన వేమ ఉపచారములను బాగుగా తెలిసిన వానివగుటచే ఆమెతో నిట్లంటివి - 'అమ్మా దగ్గరకు రమ్ము నీకు అందమైనది, రత్నములతో చేసినదియగు బొమ్మనిచ్చెదను. నీ కోసమే చాలాకాలంగా వుంచాము' అనగా హైమవతి తండ్రి ఒడిలో మండి వేగముగా లేచి వాకాళ్ళకు నమస్కరించగా నేనామెను నా ఒడిలో కూర్చుండబెట్టుకొంటివి - ఆమెను జగత్పూజ్యురాలని భావించుచూ నేమ 'బాలా! నీకు తగివది నాకు కనబడుటలేదు'.
నీకు ఏ ఆశీర్వాదము తగును? అనగా మేన మాతృవాత్సల్యముచేత పార్వతినాశీర్వదించనేమోనని శంకించుచూ నన్నిట్లు ప్రేరేపించెను - 'భగవాన్! భూతభవిష్యత్తు తమకంతా తెలుసు. ఈ బాలకు ఎట్టివాడు భర్తయగునో తెలుసుకొవగోరుచున్నామ' అనగా వివి, రహస్యమువిష్టపడు వేమ నవ్వుచూ ఇట్లాంటివి - 'ఈ బాలకు భర్తపుట్టడము కాదు - ఇప్పుడు వున్నాడు తమ చెడు చిప్పములు గలవాడు నగ్నముగా నుండుమ ధనములేనివాడు కోపిష్టి ఎప్పుడూ క్రూరులతో మండుమ అవగా విని హిమవంతుడు శక్తియుడిగిపోగా సంభ్రమమును పొంది గద్గదస్వరముతో వాతో ఇట్లనెను. 'అహో! ఈ సంసారము విచిత్రమైనది - గొప్పవారు కూడా తెలుసుకోలేనిది - వరులలో గొప్పవాడు కూడా తన శక్తితో తెలుసుకోలేడు - మానవుడు గొప్ప ప్రయత్నముచేత, బహువిధపుణ్యములచేత ఆతిదుర్లభమగు మమష్య జీవితమును పొందుమ. ధృవము కావీదైనమా ఏదో ఒకవిధముగా ఇది ధృవముగా చేయబడును - ఆ మమష్యజన్మలో, సమావవ్రతము గలిగి, పార్వియై ఉన్నత కులమున జన్మించిన పతివ్రతయగు భార్యము పొందుట దుర్లభము. అందునా ఆమెతో వేదపురాణోకమై లోకములన్నింటికి హితమును కలిగించు ధర్మముమ పేవించుట మిగుల దుర్లభము. అందునా ఆ భార్య మండి అపత్యమున అపత్యముకొరకే (సంతానము కొరకే) పొందుట దుర్లభము.
ఇట్టి దుర్లభమగువావిలో నొకదానిని పొందినన పుణ్యవంతుడే. (పుణ్యము గలవాడే ఒకదానినైననూ పొందుమ) వీవినన్నింటినీ పొందువాడు వున్నాడా? లేడా? (వీవినన్నింటినీ ఎవడైనా పొందగలడా?) సంసారమే నరునికి వీనిలో ఏదో ఒకటి లేకుండా చేయును. ఇకతావాచరించిన దానివనభవించుట సంపారదోషము - వేదములన్ని గృహప్టాుమువే ప్రశంసించుమ. కాదని కొందరందురు ఆటైనచో వారెట్లు జన్మించినారు? కమక బ్రహ్మచేత, శాస్త్రములందు పుత్రుని పొందుటయే ప్రశంసింపబడినది. ఇది సృష్టిని పెంచుటకు నరకమునుండి రక్షింపబడుటకు మాత్రమే. కానీ స్త్రీల సముత్పత్తి లేక సృష్టి కలుగదు. ఆస్త్రీ జాతిస్వభావముచేత దీమరాలు, అసహాయురాలు - అట్టివారు అవమానము పాలు కారాదని బ్రహ్మ శాస్త్రములలో స్పష్టముగా, గొప్పఫలమునిచ్చు మాటమ చెప్పిన. 'కన్య పదిమంది కుమారుల పెట్టు, పది మంది కొడుకులమ పెంచుచూనరు. ఫలమును పొందునో దానిని ఒక కూతురుద్వారా పొందగలడు. కమక కవ్యతండ్రికి శోకమును, దుఃఖమున విచ్చుమ. అన్ని భోగములుండి, పతీ, పుత్ర, ధనములున్నమా కన్య తండ్రికి శోకముమపించునది నీవు నా కూతురి విషయములో చెప్పినది నొకు దుఃఖమునిచ్చును. ఏ దోషము చేత నా కూతురు ఆశీర్వాదమునకు యోగ్యురాలు కాదు? ఈమె పతి ఎందుకు జన్మించ(లే)డు? వున్నమా చెడులక్షణములు గలవాడెందుకాయను? మువీ! నిర్ధమడైనమా అందరికీ అన్ని ఇచ్చువాడెట్లగుమ? నీ క్లిష్టమగుమాట నన్ను మూడునిగా చేయుచున్నది.
అనగా విని నేను, భార్యతో సహా శోకమును పొందిన హిమవంతుని విజమైన మాటలతో ఊరడించసాగితీవి. పర్వతరాజా! ఆనందము పొందవలసివచోట నీవు శోకించరాదు - వీపు పుణ్యవంతుడవు - అర్థవంతముగా నేవన్నది వినము. ఈ నీ పుత్రికగా నున్న బాలిక జగన్మాత, అన్ని సిద్దులవిచ్చునది - పూర్వ జన్మలో శివునికి భార్యగా సతీదేవి యను పేరుతో మండినది. అట్టి ఈ జగన్మాతకు నేమ సూర్యునికి అల్పుడు దీపమిచ్చినట్లు ఏమివ్వగలమ? అని ఆలోచించి నేను ఆశీర్వదించలేదు. ఈబాలకు పతి పుట్టలేదు, వున్నాడన్నాను - శివుడు జన్మలేనివాడు జన్మించిన, జన్మించు,జప్మింపబోవు వావికతమ కారణము. అతనే శరణము వేడదగువాడు, నిత్యుడు, శాపకుడు, మంగళకరుడు, పరమేశ్వరుడు. అందరు దేవతలు ఏ పదమును గొప్పగా కీర్తించెదరో, అన్ని వేదములచే కూడా ఎవరిని పొందలేమో బ్రహ్మ మొదలగు విశ్వము చిన్నపిల్లవాని ఆట వస్తువని ఎవరిని గూర్చి అందురో అట్టి శివుడు అమంగళ శీలుడైవమా మంగళములకు వివాపము. ధనములేకున్ననూ అందరికీ అన్ని ఇచ్చువాడు - తనను తాను తెలుసుకొనవాడు (జ్ఞాన స్వరూపుడు) అట్టి మహాదేవుడు స్థిరమగువాడు (పర్వవ్యాపి) కూటస్థుడు, అక్షరుడు - అతనే ఈ బాలికకు పతియగుమ - వివెందులకు శోకించుచుంటివి?
ఇది శ్రీ స్కాంద మహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికా ఖండమున కుమారేశుని మాహాత్మ్యమున నారదుడు హిమవంతుని ఊరడించుట యను ఇరవై మూడవ అధ్యాయము.
