స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

8వ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను - నాడీజంఘడను కొంగ చెప్పినది విని ఇంద్రద్యుమ్నుడను రాజు మార్కండేయునితో కూడిదుఃఖము నొందెను - కన్నీళ్ళు కార్చుచూ దుఃఖించుచున్న ఆ రాజను చూచి ముని (మార్కండేయముని) సానుభూతి నొంది, రాజు కొరకు కొంగ నిట్లడిగెను - ఆశను విడిచి నీ దగ్గరకు వచ్చితిమి - చిరాయువైన నీవు ఇంద్రద్యుమ్నునెఱుగుదువనే ఆశ - ఈ రాజు పని నెరవేరనందుచే ప్రాణములను విడువగోరుచున్నాడు. అగ్నియందు ప్రవేశించవలెనని అమిత వైరాగ్యమునొందినాడు అందుకే ఈతను నా వద్దకు రాగా నేను నీ వద్దకు వచ్చితిని కానీ ఇతని కోరిక తీరలేదు. మరణముననూ ఇతనిననుసరించెదనని ప్రతిజ్ఞ చేయుచున్నాను - ఆశతో తమ వద్దకు వచ్చిన వాడు నిరాశతో వెళ్ళిపోవడం సాధువులు చూడలేరు - ఇక జీవించుట కంటే మరణించుటే మేలు - తన హృదయములో నున్న దానివితడు ప్రార్థించగా నేనితనికి మాటనిచ్చితిని - చిరాయువు గల నీవంటి మిత్రుడు తప్పక దానినుగునని తలంచి మాటనిచ్చితిని - ఆ పని నెరవేరనిచో ప్రాణమిచ్చెదనని ప్రతిన బూనితిని - అర్థిజనుల ఆశను తీర్చని కలుషమైన నా ఆయుస్పునిచ్చెదను - శ్లాఘ్యడా! ప్రతిన బూనిన దానిని చేసితివి - దాస్యమున గ్రామమున విడిచివేయుము - హరిశ్చంద్రుని వలె సత్యసంధత నరులకు ప్రశస్తము కాదేమి? మిత్రుని స్నేహమునకు పర్యాయమే సాప్తపదమని చెప్పబడినది - మిత్రుడు దుఃఖించినపుడు చూపని స్నేహమేమి ప్నేహము?

కనుక మిత్రుడా! కీర్తిశరీరముకొరకు నేనితనితో సహ అగ్నిన తప్పక ప్రవేశించెదను - ఇది సత్యము - మహామభావా! వాడీ జంఘ వమ్న అమమతించుము. ఇదే చివరిచూపు - నారదుడు చెప్పసాగెమ 'ఆట్లు మార్కండేయుడు వజ్రము వలె కఠినమైన మాటలను పలుకగా వివి వాడీజంఘుడు క్షణకాలము ఆలోచించి, తెలిసినవాడై వారిద్దరిలో విట్లనెను - 'మిత్రమా! అలాగైతే నీవు అగ్నిలో ప్రవేశించు ఇతనిని నివారించుము వాకంటే చిరాయువు ఒకడున్నోడు -శివపర్వతముపై ప్రాకారకర్ణుడమ గుడ్లగూబ వున్నది. ఇంద్రద్యుమ్నుడమ రాజును గూర్చి అతమ తప్పక ఎజుగును - కమక మవము కలిపి శివుని నివాసమగు ఆ పర్వతముకు మిత్రుని కార్యము సిద్ధించుటకు వెళ్ళేదము' అనగా ఆ ముగ్గురు ద్విజశ్రేష్ఠులు కలిసి కైలాసమునకు వెళ్ళి తవ వివాపమున నున్న గుడ్లగూబను చూచిరి - ఆ గుడ్లగూబ మర్యాదను తెలిసి కొంగన స్వాగతపూజతో పత్కరించెను. రాకము గూర్చి ప్రశ్నించగా కొంగ, తాము కోరినదానిని గూర్చి తెలిపిన - నీవు చిరాయువు కదా! ఇంద్రద్యుమ్నుడు రాజును గూర్చి తెలిపినచో చెప్పుము. ఆ జావముచే మేము జీవించెదము - అని అడగగా ఆ గుడ్లగూబ మిత్రుని పనిని సాధించుటలో చింతనొంది 'ఇంద్రద్యుమ్నుడను రాజును వేవెలుగననెను.

‘నేను భూతలమున జన్మించి ఇరవై ఎనిమిది కల్పములు గడిచినవి. కానీ భూమిపై ఇంద్రద్యుమ్నుడమ రాజును గూర్చి చూడలేదు, ఐననూ లేదు' - అవి ఆ గుడ్లగూబ పలుకగా ఇంద్రద్యుమ్నుడు ఆ ఆయుస్సును విని విస్మయము నొంది, దుఃఖము పొందిననూ, ఆ ఆయుప్పుకు కారణమేమని అడిగిమ - 'ఇంతటి ఆయువు ఏదయినచో అదెట్లో చెప్పుము .మిగుల జుగుప్పము కలిగించు గుడ్లగూబ రూపు ఎట్లు ప్రాప్తించినది?'  అని అడుగగా ప్రాకారకర్ణుడమ గుడ్లగూబమ ఇట్లనెమ - 'నాయనా! ఆదిట్లో వినుము. శివపూజవలన వాకు దీర్ఘాయువు ప్రాప్తించినది. ఒక మహాముని శాపము వలన జుగుప్పున కలిగించు ఈ గుడ్లగూబ రూపముకలిగినది. పూర్వము నేమ పారాణసి నగరమందు వసగోత్రమున జన్మించిన ద్విజడమ, ఘంటుడని పేరొందిన శివభక్తుడివి. ధర్మమును వినుటయందిచ్చగలిగి వేమ సాధువుల గోష్టులలో ధర్మమును గూర్చి విమచూఈశ్వరుని అఖండ బిల్వ పత్రములతో సేవించుచునుంటిని - మదనాంతకుడైన ఈశ్వరునికి శ్రీవృక్షమిస్టమైనంతగా మాలతి, మందార, శతపత్ర, మల్లికా కుసుమాలు ప్రియములుకాపు -  శివుని శిరస్సుపై అఖండ బిల్వ పత్రములతో లింగమును పూజించినచో స్వర్గమున లక్షసంవత్సరములు వివసించును - గొప్ప శాస్త్రములనుండి ఇట్లు విని నేవీశ్వరుని, మూడుకాలములందు శ్రీవృక్షపత్రములతో (బిల్వదళములతో పూజించుచుంటిని.

ఆట్లు నేను పూజించగా నూరుసంవత్సరముల తరువాత చంద్రశేఖరుడగు పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమై మేఘగంభీరవాక్కుతో నిట్లనెను - 'విప్రేందా! నీ అఖండబిల్వదళార్చనచేత నేను సంతోషించితిని. ఇచ్చవచ్చినది కోరుకొనుము - దుర్లభమైనదైననూ ప్రసాదింతును - వాకు ఒక్క అఖండ బిల్వ పత్రము చేతనే గొప్ప ఆనందము కలుగును - ఇతరుల వలె కోట్లకొలది పత్రములతో కాదు. అని భగవంతుడగు పరమశివుడు తన మనస్సున నున్న దానిని నాకు చెప్పెను - అపుడు నేను నన్ను జరామృత్యువులు (ముసలితనము, చావు) లేనట్లు చేయుమని దేవుని వరము కోరితిని - లీలావిలాసుడగు శివుడు ఆలోచించకనే నాకు 'అట్లే అగుగాక’ యని వరమునిచ్చి అంతర్షితుడాయెను - అంత నేమ పరమానందమును పొందితిని. భూమిపై నేను కృతకృత్యుడనని తెలుసుకొంటిని. ఆదే సమయమున భృగు వంశమునకు చెందిన బ్రాహ్మణుడు ఒకడుండువాడు -  వీర్మలమైన మూడు జన్మలు గలవాడు ఇంద్రియములను ఇంద్రియార్థములను తెలిపినవాడు. అతనికి సుదర్శనయను భార్యయుండెను - పతి ముఖము చూచి మిగుల సంతోషము నొందు ఆ సుదర్శన, దేవలుని పుత్రిక, అమితసుందరీ - ఆ బ్రాహ్మణునికి, సుదర్శనయను సుందరికి ఒక బాలిక జన్మించెను - తన ఆరణికంటే వేరు కాని ఆ స్త్రీ బాల్యమునుండి యవ్వనమును ప్రవేశించెను.

తండ్రి ఆ కన్యకను ఎవరికీ ఇవ్వజాలకపోయెను. బాల్యము నుండి యవ్వనమున ప్రవేశించుచున్న ఆ కన్యకను నేను చూచితిని. అపుడే పొటమరించు యవ్వన ఆభోగముల భావములతో ఆ కన్య మనోహరముగా నుండెను. మరికొన్ని భావముల వెడలిపోవుచుండగా రెంటితో నువ్వులు - బియ్యము మిశ్రమముల వలే అకృతియుండెను - తన సఖులతో ఆడుచూ, మూర్తీ భవించిన లావణ్యము వలె నుండెను. ఆ సుందరస్త్రీని చూచి నేను అసామాన్యమగు ఆకృతిని బ్రహ్మ నిర్మించెనని తలచి సాత్యిక భావములకు లోనయితిని - మన్మథుడు తన బాణములతో లీలగా కొట్టగా నేను తడబడు మాటలతో 'ఎవరి కన్య ఈమె' యని ఆమె సఖిని అడిగితిని - అపుడామె భృగువంశమునకు చెందిన బ్రాహ్మణుని కూతురు. ఇప్పటికీ అవివాహితయే - ఆడుకొనుటకిక్కడికి వచ్చినదని చెప్పెను - ఆంతట మన్మథుని బాణపరంపరచే కొట్టబడిన నేను ఆ కన్య తండ్రిని చేరి నమస్కరించి ఆ కన్య నిమ్మని యాచించితిని. అతను నన్ను చూచి కులము, శీలముచే యోగ్యుడను అని తలచి మిగుల ప్రార్థించుచున్న నాకు కన్యనిచ్చెదనని ముందు మాటనిచ్చెను.అంతట ఆ భార్గవ పుత్రిక అది విని కురూపియగు విప్రునికివ్వబడితినని మిక్కిలి రోదించుచూ తల్లినిచేరి 'చూడు! ఈ వరునికిచ్చి మిగుల అనుచితమును తండ్రి ఎట్లు చేసెనో చూడు' అనెను - నేను విషమును త్రాగెదను లేదా అగ్నిలో ప్రవేశించెదను. కానీ వివాహము చేసుకోదలిచిన ఈ కురూపికి భార్యను కాను.

అంతట తల్లి తన కూతురికి నచ్చజెప్పి ఆ బ్రాహ్మణునితో కోపముగా నిట్లనెను - 'ఈ విరూపునికి నీవు కన్య నివ్వరాదు' - అపుడా బ్రాహ్మణుడు భార్య మాటను విని, ధర్మశాస్త్రములను తరిచి చూచి 'మంచి వరుడు దొరికినచో పూర్వమిచ్చిన కన్యను తెచ్చుకొనవచ్చు. సప్తపదికి ముందుతేవచ్చు - సప్తపది తరువాతనే వివాహము స్థిరమగును' అని నిశ్చయించుకొని వేరొకరికి కూతురునిచ్చెను. మరునాడు వివాహమనగా నేనదంతా వింటిని  వెంటనే నా స్నేహితుల ఎదుట విలువ పోగొట్టుకొనిన వాడనై ముఖమును చూపించలేక పోతిని, కామార్హుడనై ఈ బాలికను నిద్రించుచుండగా రాత్రి సమయమున అపహరించితిని. ఒక ఏకాంతము, ఇతరుల రాలేని ప్రదేశమునకు తీసుకొని వెళ్ళి వివాహవిధి నాచరించి గాంధర్వవిధితో వా మనసుకు నచ్చినదాచరించితిని - ఇష్టపడని ఆ బాలనపుడు నేను బలవంతముగా రమించితిని. వెంటనే ప్రొద్దుననే ఆమె తండ్రి మమ్ము వెంటాడివచ్చెను - బ్రాహ్మణులతో కూడియుండి అతను నన్ను చూచి నిశ్వసించి కోపముతో తన కూతురిని నేమ పెళ్ళాడుట చూచి నన్నిట్ల శపించెను - 'నిశాచరుల ధర్మముతో నా కూతురిని పెళ్ళాడినందున నీవు వెంటనే నిశాచరుడివి కమ్ము!' అని శపించగా నేను అతని కాళ్ళు పట్టుకొని హా యనుచు కన్నీటితో గద్గద స్వరముతో ప్రార్థించితిని.  అంతట నేను 'దోషములేని నన్నెట్లు వీవు శపించెదవు? నీవే నాకు కూతురు నిచ్చెదనని మాటనిచ్చితివి.

ఆ బాలికనే నేను వివాహమాడితిని - కన్యాదానము ఒక్కమారేనని స్మృతి - రాజులు ఒక్కమారే మాట్లాడెదరు. పండితులు ఒక్కమార్ మాట్లాడెదరు. కన్యాదానము ఒక్కమారే జరుగును - ఈ మూడు ఒకే ఒక పర్యాయము జరుగును - అనేక పర్యాయములు జరుగవు  మాటనిచ్చిన దానికి కట్టుబడుట సత్పురుషుల వ్రతము - మీవంటి సాధువులో వ్రతమును విడనాడుట గర్ఘ్యము. వీవపుడు మాటనివ్వగా నాకిప్పుడు కాలము చిక్కి ఇపుడు పెళ్ళాడితిని. శపించుట తగదు. మీరు నన్ను వ్యర్ధముగా శపించుచుంటిరి. ఆలోచించుకొనుడు -  ముందు మాటపై కన్యను దానమిచ్చి తరువాత మాటతప్పు దుర్మతి నరకమునకు వెళ్ళునని ధర్మశాస్త్రములు నిశ్చయము' - అనగా విని ఆ ముని ఆది నిజమని తెలిసి పశ్చాత్తాపముతో కూడినవాడై ఇట్లనెను. నా వాక్కు వ్యర్థముకాదు  నీవు గుడ్లగూబ వయ్యెదవు  నిశాచరుడని గుడ్లగూబకూడా పిలువబడుమ కదా! ఇంద్రద్యుమ్నుని తెలియుటలో సహాయపడిన దినము పూర్వరూపును పొందెదవని పలికెను - ఆ మాట వెంటనే నేను గుడ్లగూబనైతిని. ఇన్నిదినములూ బ్రహ్మకు పద్దెనిమిది దినములైనవి - పూర్వము బిల్వదళములతో శివుని పూజించినందుకు నాకీ చిరాయువు ప్రాప్తించినది - బ్రాహ్మణశాపముచే జగుప్పితమగు గుడ్లగూబ రూపము ప్రాప్తించేను  కైలాసపర్వతముపై నిశాచరుడి రూపును దాల్చితిని.

ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున మహీనదీప్రాదుర్భావమున బిల్వదళమాహాత్మ్యవర్ణనమను ఎనిమిదవ అధ్యాయము.