స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము

10వ అధ్యాయము

నారద ఉవాచ –

నారదుడు చెప్పసాగెను-  గద్ద ఇట్లు పలుకగా విని దుఃఖములో, విస్మయముతో కూడిన ఇంద్రద్యుమ్నుడు అతనికి ఏడ్కోలుపలికి మరణించుటకు సిద్ధపడిన -  అంతట, అతనిని మిత్రులతో కలిసి మరణించదలుచుటమ, రామ దీర్ఘాయువగుటను (వారితో మరణించ లేకపోవుటను) చూచి ఆలోచించి గద్ద ఇట్లనెను - 'నాయనా! వద్దు! అలా చేయరాదు! నా మాట విను!వాకంటే దీర్ఘాయువు గల వ్యక్తి వున్నాడు -అతమ వీపుకోరినదానిని తెలిసియుండవచ్చును - మావససరోవరమున మందరకుడను నా మిత్రుడు 'తాబేలు'గా మన్నాడు . అతనికి తెలియనిదేదీ లేదు - అక్కడికి వెళ్ళేదము' -  అవగా ఇంద్రద్యుమ్నుడు, మార్కండేయువు, కొంగ, గద్దలు కలిపి గుడ్లగూబ ఆలాబేలుని చూడగోరి బయలు దేరిరి.  దూరమునుంచే వారి రాకము గమనించిన తాబేలు సరస్సు తీరమున కూర్చున్నదల్లా తొందరగా నీటిలోకి ప్రవేశించెను -  అపుడు గుడ్లగూబ నవ్వి అతనివతో నిట్లనెను - 'కూర్మమా! ఎందుకు కనబడకుండా పోయినావు? ఆభ్యాగతులపట్ల విముఖుడవెందుకైనావు? బ్రాహ్మణులకు అగ్ని, అన్ని వర్ణములకు విప్రుడు, స్త్రీలకు ప్రియుడు, పుత్రులకు తండ్రి, అందరికీ అభ్యాగతుడే గురువు.  అట్టి అతిథి ధర్మమును వీడి ఆతిథ్యమునుండి విముఖుడవైతివెందులకు? అందరి పాపముల గ్రహించుచుంటివి. కూర్మమా! మాకిప్పుడు సమాధానమిమ్ముl

అనగా కూర్మమిట్లనెమ - చిరాయువగు నాకు అతిథిపత్రియ తెలియును. ధర్మశాస్త్రములయందు విశ్చయింపబడిన అభ్యాగతసేవ వాకు తెలియును -  అయిననూ ఇక్కడ ఒక పెద్దకారణము గలదు వినుడు  ఇన్ని దినములూ వేమ పరాట్ముఖుడను కాలేదు -  వచ్చిన వారికి విముఖుడమ గాక అన్ని పత్కారములనుచక్కగా వాచరించిన వానిని. కానీ మీ మధ్య పరళమైన ఆకృతి గలిగి ఐదవవాడుగా కన్పించుచున్న ఇంద్రద్యుమ్నుడు రాజమండి మిగుల భయమునొందితివి. పూర్వము రాచకమమపురమున యజ్ఞము వితను చేయగా యజ్ఞానికి కాలిన నా వీపున గాయములింకనూ మావలేదు - అందుకే నాకు మరల భయము కలిగినది. మరల పవితడు వేదికగా చేసి ఇపుడు భూమిని దహించునా ఏమి అని భయపడితివి - అవి ఆ కూర్మమనగానే ఆకాశమునుండి అప్సరసల గణములచే ఏడవబడిన పూలు పుష్పము వలె కురిసినవి - ఇంద్రద్యుమ్న మహారాజు కీర్తివి పునరుద్దరించుటచే దేవవాద్యములు మ్రోగినవి -  అక్కడున్నవారంలో తమ ఎదుట ఇంద్రద్యుమ్నుని కొరకు దేవదూతలధిష్ఠించి తెచ్చిన విమానమును చూచి విస్మయమును పొందిరి -  దేవతలు, బ్రాహ్మణులు ఆ రాజుకు విత్యమగు ఆశీస్సుల నొసగిరి. ఆ రాజుకు 'సాధు' వగు గాక యను ధ్వని ఆకాశమున గొప్పగా వినబడెను  అంతట విమానమున నిలిచి దేవతలందరూ వినుచుండగా ఇంద్రద్యుమ్నునితో నిట్లనెను - 

'రాజా! నిర్మలమగు నీకీర్తి ముల్లోకములలోనూ కొత్తదిగా చేయబడినది. (ఉద్దరింపబడినది) త్వరగా ఈ విమానము నెక్కుము. తపస్సు చేత పొందిన బ్రహ్మలోకమున కల్పకాలమునుండుము. నిన్ను తీసుకొని వచ్చుటకు బ్రహ్మచేతనే పంపబడితిని -  అనంతపుణ్యమున్ననూ, భూమిపై మానవుని కీర్తి వ్యాపించి యున్నంత వరకు మాత్రమే అతను స్వర్గమున నుండుము.  దీని కొరకే, దేవాలయ, సరస్సుల, బావుల, నూతుల, ఆరామముల నిర్మించుట - పూర్త అనునది ధర్మశాస్త్రములలో నిశ్చయింపబడినది' -  అనగా ఇంద్రద్యుమ్నుడిట్లనెను - 'ఈ మార్కండేయముని, కొంగ, గుడ్లగూబ, గద్ద, తాబేలు నా మిత్రులు. నా వృద్ధికి వీరి శక్తి కారణము  వీరునూ నాతో నా ముందు నడచుచూ బ్రహ్మలోకమునకు వెళ్ళినచో నేను బ్రహ్మలోకమునకు వచ్చెదను - లేనిచో రాను -  తాను చేసినదానికి బదులాశించక ఇతరుల హితమునకై పాటుపడేవాడే సుహృత్తని, మిత్రుడని పండితులందురు -  ప్రాణులపట్ల మిత్రత్వమును చూపుట ప్రాణులకు పరమలోభము - దరిద్రులు, రక్తులు, ప్రతిజ్ఞ చేసి నెరవేర్చనివారు. గురుద్రోహము చేయువారు మిత్రుని అవసానకారకులగు పాపులు నరకమునలంకరించువారు వీరంతా పరార్థము నశించినవారు, ఇప్పుడు సాధువులు

అనగా దేవదూత ఇట్లనెను -  వీరంతా శివగణములు శాపముచేత భ్రష్టులైనవారు. భూమిని చేరినారు - శాపము నశించగా తిరిగి శివుని వద్దకు వెళ్ళేదరు. రాజా! వీరిని విడిచి నీవు నాతో రమ్ము, వీరికి మహేశ్వరుడు తప్ప స్వర్గము రుచించదు” - అనగా ఇంద్రద్యుమ్నుడిట్లనెను - 'దూతా! అది నిజమైనచో నీవు మాత్రమే స్వర్గమునకు వెళ్ళుము - నేను రాను - నేను కూడా హరగణమును కావడానికి ప్రయత్నించెదను - ఈ స్వర్గము అవిశుద్ధి (ఆశుద్ధి), నాశనము, ఆధిక్యము అను దూషణములచే నిందిపంబడినది -  ఈ స్వర్గమును నేను కోరను - అక్కడున్న వానికి మరల పతితుడనగుదునన్న భయము మనస్సునుండి తొలగదు - మరల పతీతుడగుట పురుషునకు స్వర్గమున యున్నందుచేత నేను దానిని కోరను - ఇక నా పుణ్యము ఇంకా వున్ననూ నన్ను తన లోకమునుండి పతితుడిని చేసి, సిగ్గుపడునట్లు చేసిన బ్రహ్మ లోకమునకెట్లు వచ్చెదను’ అని పలికి ఇంద్రద్యుమ్నుడు ఆ దేవదూత విస్మయముతో వినుచుండగానే తాబేలును దానీ ఆయుస్సుకు కారణమేమిటని అడిగెను - 'కూర్మమా! ఇంత దీర్ఘమైన ఆయుస్సు నీకెట్లు కలిగినది? నా కీర్తి నుద్దరించిన నీవే నా మిత్రుడివి, బాంధవుడవు, గురువువు 

                  అనగా ఆ తాబేలు ఇట్లనెను - ఓ రాజా! వినినంత మాత్రాన పాపమును నశింపజేయు మధురమైన, శివమాహాత్మ్యముతో కూడిన ఈ కథను వినుము. శ్రద్ధతో ఈ కథను వినినంతనే మనుష్యుడు పాపము తొలగిన వాడగును - నేను శివుని ప్రసాదమును పొంది ఈ ఆయుస్సును ఈ కూర్మత్వమును పొందితిని' అని తాబేలు చెప్పసాగెను -

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వర ఖండమున కౌమారికాఖండమున మహీనదీప్రాదుర్భావమున పదవ అధ్యాయము.