స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కౌమారికా ఖండము
16వ అధ్యాయము
తారకుడు చెప్పెను. ‘నీటిబుడగవంటి రాజ్యముతో, స్త్రీలతో, ద్యూతముతో, మద్యముతో నరుడు మోహమునొంది జన్మించిననూ పౌరుషమును విడుచును. ఆట్టివాని జన్మ కల్పామంతమగు వరకు వృధా యగును. సంశయములేదు. తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చనివాడు, బంధువుల శోకమును తీర్చని వాడు, కీర్తిని, అభిమానమును సంపాదించనివాడు పుట్టియున్ననూ లోకమున మృతుడే కనుక అమరశ్రేష్ఠులను జయించుటకు, ముల్లోకముల సంపదనపహరించుటకు త్వరగా నా ఎనిమిది చక్రాల రథమును, జయింప వీలులేని నా దైత్యబలమును సిద్ధముచేయండి. బంగారు పట్టిక కట్టబడిన ధ్వజమును, ముత్యముల వరుస కట్టబడిన ఛత్రమును సిద్దము చేయండి - ఈనాడు నేను దేవతల ప్రియురాళ్ళ శిరోజములు ముడిపడనట్లు చేసెదను. పూర్వము మర్కటకుడను వాడు తన తల్లిని తరిపంజేసినట్లు నేనునూ తల్లిని తరింపజేసి నిజముగా తారకుడినయ్యెదను.
నారదుడు చెప్పసాగెను - ‘తారకుని మాటలను విని గ్రసనుడను దానవుడు, దైత్యేంద్రుని సేనాని, ఆలస్యము చేయకుండా తారకుడు చెప్పినట్లే చేసెను. గంభీరమైన భేరిని మ్రోగించి, దైత్యులను త్వరగా పిలిచి, బుద్ధిమంతుడగు దైత్యరాజా రథమును గరుడులతో గ్రసనుడు సిద్దముచేసెను. ఈ గరుడులు గరుత్మంతుని పుత్రులు, గరుత్మంతుని కాంతి వంటి కాంతి గలవి. మేరుగుహలో నుండెను. వీనిని జయించి తారకుడు తన వాహనముగా చేసుకొనెను - ఆ రథమునకు అరవైనాలుగు చక్రములుండినవి. అట్టి రథము నాలుగు యోజనముల విస్తారమును కలిగి యుండెను. ఆ రథముననే అనేక క్రీడాగృహములుండి గీతవాద్యములతో మనోహరముగా గంధర్వ నగరముగా నుండినది. మిగుల పరాక్రమవంతులైన పదిమంది దైత్యులు, కోట్లకొలది పరివారముతో వచ్చిరి - ఇట్లే ఇతరులనేకులు వచ్చిరి వారి నాయకుడుగా జంభుడు, తరువాత కుజంభుడు, తరువాత మహిషుడు, కుంజరుడు, మేఘుడు, కాలనేమి, నిమి, మధనుడు,జంభకుడు, శుంభుడు అను పదిమంది దైత్యనాయకులు పర్వత తుల్య బలవంతులు వచ్చిరి. వారు అనేక విధములగు ఆయుధములలో నుండి అనేక శస్త్రాస్త్రములను తెలిసియుండిరి - ఇక తారకాసురుని ధ్వజము అనేక రూపములలో భయంకరముగా నుండెను.
ఒక చోట నోరమగు రాక్షసునిగా, పిశాచముగా, కాకిగా, గద్దగా ఆ ధ్వజము అనేక రూపములతో కనిపించెను. సేవానియగు గ్రసమడు తన మకర కేతనముతో ప్రకాశించెను - జంభుని ముఖము ఇనుముతో కూడినదై పిశాచముగా నుండెను. తోకను విదిలించుచూ గాడిద కుంభుని ధ్వజముపై నుండెను - మహిషుని ధ్వజముపై గోమాయువు స్వర్ణకాంతితో ప్రకాశించెను. కుంజరుని ద్వజముపై గద్ద, మేఘవి ధ్వజముపై రాక్షసుడు వుండగా, కాలనేమికి మహాకాలుడు, నిమికి గొప్ప జలచరము ధ్వజముగా నుండెను. మధనునికి రాక్షసి, జంభకువికి కాకి, శుంభునికి పెద్ద తోడేలు ధ్వజములుగా నుండి ప్రకాశించెను. ఇట్లు అనేక ఆకార విన్యాసములు గలిగి ఇతరుల ధ్వజముల ప్రకాశించెను - బంగారు మాలలు కలిగి వేగముగా పరుగులెత్తు పులులు నూరు, గ్రసనుని రథమునకు కట్టబడగా ఆది పెద్ద మేఘముయొక్క ధ్వనితో విలసిల్లెను. జంభుని రథము నూరు సింహములతో విలసిల్లెను. కుజంభుని రథమునకు పిశాచ ముఖములు గల నూరు గాడిదలు కట్టబడెమ. మహిషుని రథమునకు నూరుఒంటెలు, గజుని రథమునకు మారు గుర్రములు పూర్చబడినవి. మేఘని రథమునకు భయంకరమగు ఏనుగులు, కాలవేమి రథమునకు కుంజరములు (ఏనుగులు) కట్టబడినవి - మధనుడను దైత్యుడు ఏనుగులులాగు పర్వతము వంటి రథముమ నిశ్చయించుకొని అధిరోహించెను.
నాలుగు దంతములు గలిగి, గంధమును గలిగి, మేఘము వలె ప్రకాశించు ఏనుగులు పూర్చబడిన ఆరథము నూరుహస్తముల ప్రమాణము గలిగి నల్లని రంగులో విలసిల్లుచూ, బంగారు నగలతో ప్రకాశించుచూ త్వరగా వెళ్లునదిగా నుండెను. తెల్లని చామరములతో, పుష్పమాలలతో శోభించు ఆ రథముపై మధనుడను దైత్యశ్రేష్ఠుడు చేతిలో పాశము పట్టుకొని విరాజిల్లెను. జంభకుడు కింకిణీ మాలగల ఒంటెను ఎక్కేను - శుంభుడు అను దానవుడు కాటుకను వర్షించు మేఘమునారోహించెను. ఇతర దానవవీరులు అనేక వాహనములలో, సైన్యముతో, విచిత్ర కవచములను, కుండలములను, తలపాగాలకు అలంకరించి విలసిల్లిరి. అనేక విధములగు ఉత్తరీయములను, పులమాలలను ధరించిరి - అనేక విధాలైన వాద్యములు ముందు నడుచుచుండగా ఆ సైన్యమున మహారథులు అనేక శార్యవంతుల కథలమ ఆసక్తిగా వినుచుండిరి. అట్లు ఆ దైత్యసింహుని సైన్యము భయంకరముగా కనిపించెను -ఆ సైన్యమున గుర్రములు, రథములు, పదాతులు భయంకరమైన ధూళివంటి కనిపించిన ఆతారకుడు అను దైత్యుడు కోపముతో నుండి ఒక మహారథమునెక్కి పదిమంది దైత్యులలో పదిచేతులతో మన్న ఈశ్వరుని వలె శోభించేను - జగత్తునే నశింపజేయుటకా అన్నట్లు దేవతలవైపు సాగిపోయెను.
ఇంతలో దేవదూతయగు వాయువు ఆ దానవబలమును చూచి ఇంద్రునికి చెప్పుటకు స్వర్గమును వెళ్ళెను. దివ్యమగు దేవసభలో దేవతలందరి మధ్య పాయువు సమీపించి ఈ కార్యమును గూర్చి మహాత్ముడగు మహేంద్రునికి చెప్పెను. అది విని కళ్ళు మూసుకుని, అవసరమైనపుడు పండితుడగు దేవేంద్రుడు బృహస్పతి నిట్లడిగెను. ‘దేవతలకు దానవులతో యుద్ధమిట్లు ఆసన్నమైనది - ఇపుడు వీతి, ఉపాయము రెండుమా కలిగిన దేనిని మనమాచరించవలెనో చెప్పుము’. అనగా బృహస్పతి మహోన్నత బుద్ధిగలవానిగా దేవేంద్రునితో ఇట్లనెను. దేవేంద్రా! చతురంగ సైన్యమును జయింపగోరువారీకి సామెపాయము ముందు చెప్పబడినది. ఇది సనాతనముగా వుండినదే. దేశ కాలముననుసరించి పామదానభేదదండములను రాజనీతియందు క్రమముగా ప్రయోగించవలెను. ఆర్యులు, గుణవంతులు, ఆగువారిపై సామోపాయమును, లోభులపై దానోపాయమును, శంకించువారిపై భేదోపాయమును ప్రయోగించవలెనని నిశ్చయము చెడుస్వభావముగల వారిపై నిత్యమూ దండోపాయమును ప్రయోగించవలెను - చెడు స్వభావము గల దైత్యులు విరుణులు. వీరిపై సామోపాయము ప్రయోగించరాదు. ముమపే ఐశ్వర్యము గల దైత్యులకు సంపదతో పని ఏమి? ఇక వారి జాతి ధర్మమువలన వారు బ్రహ్మచేత కూడా భేదింపశక్యము గాని వారని నా అభిప్రాయము.
మీకు కూడా ఇష్టమైనచో ఇక ఇక్కడ దండమే ఉపాయము. దుర్జనుడు ఎప్పటికీ సుజనుడవలేడు. లాలించినా, పాలించినా కూడా దుర్జనుడు తన స్వభావాన్ని వదలడు - వా బుద్ధికిట్లు తోచుచున్నది - మీరేమి చేయదలిచితిరి? అనగా ఇంద్రుడు ‘అదేవిధంగా’ అనెను. తరువాత కర్తవ్యము నాలోచించి దేవసభలో ఇట్లనెను. ‘దేవతలారా! నా మాటను పూర్తి గారవములో విమడు. మీరు యజ్ఞములలో భోక్తలు, సాత్త్యికులు, సత్పురుషులకిష్టులు. మీ మీ స్థానములలో నిలిచి జగత్తును పాలించుటయందు విరములు మీకారణంగా దానవరాజులు బాధించుచున్నారు-వారికి సామాదుపాయములు తగవు - దండపమే విధింపబడునుగాక! యుద్ధమున మనసు నిలవ సైన్యమున పెద్దము చేయండి. శస్త్రములను ఆవహింపజేసుకొనండి, ప్రదేవతలను పూజించండి’ అనగా దేవతాత్రేష్టులు సన్నద్ధులైరి - యుద్దమున అసంఖ్యాకమగు గుర్రములతో, బంగారు పట్టికలతో భాపించిరి. ఇంద్రుడు దేవతలతో విట్లనెను – ‘దేవతలారా! వాహనాలమ, విమానాలను సిద్ధము చేయండి - యముని సేవాపతిగా చేసి త్వరగా వెడలండి దేవదానవులచేత జయింపబడని మీరు అనేక ఆశ్చర్యకరగుణములను కలిగి బయల్వెడలండి.
అపుడు మహేంద్రుని రథము మాతలితో నుండి కనబడినది. యముడు మహిషమునెక్కి సేనముందుండెను - అతని చుట్టూ చండ, కింకిణులుండిరి. కల్పకాలమున అన్నట్లు మిగుల ప్రకాశించు జ్వాలలతో నిండిన ఆకాశమున కనిపించు అగ్ని మేకనెక్కి, చేత శక్తిని ధరించి నిలిచెను. వాయువు చేత అంకుశమునుదాల్చి, వేగము విస్తరించగా భల్లూకమునెక్కి పేనకు ముందు నిలిచి కనబడెను. వరుణుడు స్వయముగా సర్పరాజు నెక్కి చేత మహాపాశమును దాల్చి వీరునిగా పేవయందుండెను. కుబేరుడు నరుని పూన్చిన దివ్యమగు రథమునెక్కి చేత గదను దాల్చి ఆంతటా తిరుగసాగెను. రాక్షసరాజగు విర్ఋతి రాక్షసముఖాలు గుర్రములను పూన్చిన రథమునెక్కి, చేత ధనుస్సుతో, రాక్షసగణములతో గొప్పశబ్దమును చేయుచూ కనబడెను - యుద్ధమున సూర్యచంద్రులు, అశ్వినులు, వసుదేవతలు, సాధ్యదేవతలు, విశ్వేదేవతలు, రుద్రులు సన్నద్ధులై విలిచిరి ముందు విశ్వావసుని విలిపి, గంధర్వులు బంగారుపీట వెంటనుండ, విచిత్ర కవచములను, ఆయుధములమ, పతాకములను ధరించి కనిపించిరి. అట్లే స్వచ్చమైన ఇనుప విభూషణములు గలిగి ఎర్రని ఉత్తరీయములుగలిగి, గద్దలే పతాకములు కాగా రాక్షసులు ఎర్రని వెంట్రుకలతో కనిపించిరి.
మణిభద్రుడు మొదలగు యక్షులు భయంకరమగు పిడుగులను కలిగింపజేయువారు, నల్లని వస్త్రములను దాల్చిన మహారథులు, వారు కోట్లకొలదిగా కనిపించిరి. మహావేగముతో ముందు తిరుగు పిశాచములు, తామ్ర వర్ణమువ గుడ్లగూబలే పతాకములుకాగా, ఏనుగు చర్మములను దాల్చి రౌద్రముగా రాజిల్లుచుండిరి. అట్లే తెల్లని బట్టలు ధరించి, తెల్లని పట్టిక పతాకముగా నుంచుకొని ఎక్కువగా మదపుటేనుగులనేక్కు కిన్నరులో యద్దమున నిలిచిరి. సముద్రేశుని కేతువు ముత్యముల వరుసతో చేయబడినదై, హారము వంటి కాంతి గలిగి హంసగా సౌమ్యమగు రూపములో విరాజిల్లెను. పంచరాగములను మహారత్నములచే చేయబడిన బంధనముగల కుబేరుని ధ్వజము పైకెగియుచూ ఆకాశమును చేరువట్లుండెను. నల్లని లోహమయమగు కాకి యముని ధ్వజముగా నుండెను - నిర్ఋతి ధ్వజముగా ప్రేతముఖముండేను. మిక్కిలి ప్రకాశముగల సూర్యచంద్రులు స్వర్ణసింహములనే ధ్వజములుగా గళి ప్రకాశించగా, ఆశ్విములు అన్నిరంగులు గల కుంభమునే ధ్వజముగా గల్గియుండిరి. బంగారముచే చేయబడి, అనేక వర్ణములచే పరిష్కృతమైన ఏనుగు తెల్లని చామరమున నిలిచి ఇంద్రుని ధ్వజమాయెను. ఆ యుద్ధమున ఇతరుల పతాకములు గూడా అనేక రూపములతో భాసిల్లెను.
నాగ, యక్ష, గంధర్వ, మహోరగ, నిశాచరులతో నున్న ఆ దేవేంద్రుని సేన జయించ వీలు లేనిదిగా కనిపించెను. ముప్పది మూడుకోట్ల దేవసమూహములతో ఆ సేనయుండెను. ఇక, ఇంద్రుడు, స్వర్ణపర్వతమువలె మండి, తెల్లని కర్ణములే చామరములుగా గల్గి, బంగారు పద్మముల స్వచ్చమైన అందమైన మాల గలిగి, అందమైనది, ఉజ్యలమైనదగు అంకురముతో కపోల దేశమునుండి బయల్వెడలు రావముగల ఐరావణమను ఏనుగునెక్కి యుండిను. మహాబలుడు, విచిత్రమైన, విశేషమగు వస్త్రములను ధరించినవాడు, విశాలమగు వజ్రాంగభూషణములచే భూషితుడు, విస్తరించిన కేయూరములను భుజకీర్తులుగల భుజములతో నుండు సహస్రాక్షుడగు ఇంద్రుడు వేలకొలదిగా వందిమాగధులు స్తుతించుచుండగా స్వర్గమున శోభిల్లెను.
ఇది శ్రీస్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమందు తారకాసురుని, ఇంద్రుని యుద్ధోపక్రమముయొక్క వర్ణనమమ పదహారవ అధ్యాయము.
